Friday, December 17, 2010

దీర్ఘాయుస్సుకు దశసూత్రాలు , Ten tips for long-live



ప్రతి వారు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని ఆశిస్తారు. అయితే ఆ కోరిక కొందరికి మాత్రమే నెరవేరుతుంది. ఆధునిక కాలంలో అధికశాతం నడివయస్సుకే నడుము వొంగిపోయి, నరాలు బలహీనపడి, మనసు కృంగిపోయి, రోగాలు మూట కట్టుకుని కుమిలిపోతుంటారు. అయితే ప్రతివారు తమ జీవన విధానాన్ని చక్కదిద్దుకోవడం ద్వారా యశస్సును పొందవచ్చు. అందుకు దశ సూత్రాలు దోహదపడతాయ. వాటిని చూడండి.

వేదకాలం నుంచీ మన జీవన విధానాలు, నైతిక విలువలు, నడవడిక తదితర అంశాల గురించి తాత్వికులు బోధిస్తూనే ఉన్నారు. పతంజలి యోగి అష్టాంగ యోగాలు, బుద్ధుని అష్టాంగ మార్గాలు లాంటివి ఎన్నో మన పెద్దలు రూపొందించి అందిస్తున్నారు. అయితే వాటిని ఆచరించడంలో మనం నిర్లక్ష్యం వహిస్తుంటాం. ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలం జీవించిన వారిని పరిశీలిస్తే మనకు అనేక సానుకూల అంశాలు స్ఫురిస్తాయి. అలాంటి సానుకూల అంశాలు స్ఫురిస్తాయి. అలాంటి వాటిలో పది విషయాలను ప్రముఖంగా గుర్తించవచ్చు.


* 1.సానుకూల వ్యవహారం: సానుకూల ఆలోచనలు, వైఖరి, దృక్పథం మన వ్యవహార శైలిని ప్రభావితం చేస్తాయి. జీవన విధానం, ప్రజా సంబంధాలు, ఇతర బాంధవ్యాలు బాగున్న వ్యక్తి జీవితం సుఖ సంతోషాలకు నిలయంగా వుంటుంది. అలాగే ప్రతికూల ఆలోచనలు, వ్యవహార విధానం మనలో మానసిక వైఫల్యాలను పెంచి పోషిస్తాయి. మానసిక ఒత్తిళ్ళు, ప్రతికూల సంబంధాల వల్ల మనో శారీరక రుగ్మతులు తలెత్తి ఆరోగ్యాన్ని ఆయుష్షును క్షీణింపచేస్తాయి. ఈర్ష్య, ద్వేషం, కోపం, ఆవేశం లాంటి ప్రతికూల భావోద్వేగాలు అధికంగా ఉన్నవారు త్వరగా జబ్బులకు గురవుతుంటారు.

* 2.మంచి వ్యాపకం: నిత్యం నచ్చిన పనులతో తీరిక లేకుండా గడిపేవారు. పనిలేని సోమరులు నచ్చని పనులతో విసిగిపోయే వారికంటే ఆరోగ్యంగా ఉన్నట్టు పనులు సర్వేలు వెల్లడించాయి. అందుకే ఇష్టమైన పనులను చేపట్టాలి లేదా చేసే పనుల పట్ల ఇష్టమైనా పెంచుకోవాలంటారు అనుభవజ్ఞులు. ఏ పనీ లేకుండా ఖాళీగా తిరిగే వారు వ్యసనపరులుగా తయారయ్యే ప్రమాదముంది. లేదా సోమరిపోతులుగా తయారయ్యి, నిరాశ, నిస్పృహలకు గురవుతుంటారు. దీనివల్ల జీవితం దుర్భరంగా మారిపోతుంది.

* 3.ఆహార నియమాలు: సానుకూల ఆలోచనలకు ఆహార నియమాలు తోడైతే మందుల అవసరం తగ్గిపోతుంది. సాత్విక, సమతులాహారం తీసుకునేవారు మిగిలిన వారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. మాంసాహారుల కంటే శాఖాహారులు, అధికంగా భుజించే వారికంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకునేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

* 4.సంతోషాన్ని ఆస్వాదించడటం: పదిమందితో కలుపుగోలుగా మెలగడం, సంతోషాన్ని పంచుకోవడం, తృప్తిగా గడపడం, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. హాయిగా నవ్వగలిగేవారి జీవితం ధన్యమని అందుకే అంటారు.

* 5.సక్రమమైన నిద్ర: అవసరమైనంత నిద్ర, శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంటుంది. ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా నిద్రలేవడం అలవరచుకోవాలి.

* 6.యోగా, ధ్యాన సాధన: శరీరానికి తగినంత వ్యాయామం, మనస్సుకు ప్రశాంతత చేకూర్చే యోగ, ధ్యాన సాధన వల్ల జీవితానికి ఔన్నత్యం చేకూరుతుంది.

* 7.దైవ చింతన, ప్రకృతి ఆరాధన: దైవ భక్తి లేదా ప్రకృతి ఆరాధన మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. తద్వారా ఆయురారారోగ్యాలు సిద్ధిస్తాయి.

* 8.వ్యాకులతను అధిగమించడం: మానసిక ఆందోళన, వ్యాకులత, ఒత్తిళ్ళను అధిగమించి, వాటికి దూరంగా వుండగలిగే వారు మిగిలిన వారికంటే చాలా ఆరోగ్యంగా వుంటారు.

*9.సత్సంబంధాలు: సామాజిక జీవనంలో సత్సంబంధాలు కలిగి వున్నవారి జీవితం సుఖమయమవుతుంది. దీనివల్ల ఆరోగ్యం, ఆయుష్షు, వృద్ధి పొందుతాయి.

*10.మరణచింతన లేకపోవడం: మరణంపట్ల చింతపడటం మానేసిన వారు మరింతకాలం జీవిస్తారంటారు. సాధారణంగా నడివయస్సు వచ్చిన వారు అప్పుడప్పుడు చావు పట్ల భయపడుతుంటారు. అలాంటి వారు చావుకు భయపడటం మాని బ్రతికినంత కాలం హాయిగా జీవించడానికి సన్నద్ధం కావాలి.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

చిన్నజీవులతో చికిత్సలు , Treatment with small things

చైనీయులు అనేక జంతుజాలాలను ఆహారంగా ఉపయోగిస్తారు. తేళ్ళు, బొద్దింకలు, బల్లులు కూడా వీరికి ప్రీతికరమైన తిండి పదార్థాలు. కొన్ని జంతువుల ఉత్పన్నాలను వీరు ఔషధాలుగా వాడుకుంటారు. పులి ఎముకలను వీరు ఔషధంగా వినియోగించుకుంటారు. చైనాలోనేగాక ప్రపంచంలో ఎక్కడ చైనీయులు వున్నా వారు పులి ఎముకలనుండి తయారుచేసిన మందులను ఉపయోగిస్తారు. పులి ఎముకలనుండి తయారుచేసిన ప్లాస్టర్‌ను కీళ్లవాతానికి మందుగా వాడతారు. పులి ఎముకల సారా వారికి బలానికి టానిక్‌గా పనికి వస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో అనేక మసాలా దినుసులను ఔషధాలుగా వాడడం జరుగుతోంది. అరుచి, ఆకలి లేని సమయాల్లో ధనియాలతో, ఏలకులను, మిరియాలను కొద్దిగా చక్కెరతో కలిపి పుచ్చుకుంటే సరిపోతుందంటారు ఆ వైద్యులు.మెంతులు వగరుగా వున్నా అవి ఆకలిని వృద్ధిచేస్తాయి. గుండె జబ్బులు గల వారికి ఇది మంచి సహాయకారి. జ్వరం, అరుచి, వాంతులు, దగ్గు, కఫము వంటి రుగ్మతలను నయంచేసే శక్తి మెంతులకు ఉంటుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తూ ఉంటారు.

ఇంగువ వేడిచేసేది మాత్రమేగాక జీర్ణకారిగా కూడా ఉపయోగపడుతుందని మోకాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులకు ఇంగువ, వెల్లుల్లి, సైంధవ లవణాలను మిశ్రమం చేసి నూనెలో వేయించి కీళ్లనొప్పులు వున్నచోట రాస్తే మంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తూ ఉంటారు.

ఇదే విధంగా వాము, మిరియాలు, ఏలకులు ఆరోగ్య పరిరక్షణలో, రోగ నివారణలో, కొన్ని రుగ్మతలకు చికిత్సగా పనికి వస్తాయి. అయితే వీటిని తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుచేస్తూ ఉంటారు.

జలగలతో వైద్యం మరొక విశేషం. ప్లాస్టిక్, వాస్క్యులార్ సర్జన్‌లకు జలగలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రమాదాల్లో అంగాలు తెగిపడిపోయి తిరిగి అతికించబడిన సందర్భాలలో ఒక్కొక్కప్పుడు చిన్న రక్తనాళాలు అతికించడం వీలుకాక పోవచ్చు. దీనివల్ల ఆ అంగంలో రక్తప్రసరణం నిలిచి అది బచ్చలిపండు రంగులోకి మారుతుంది. అచటి రక్తం తొలగించకపోతే ఆ అంగం దెబ్బతినే అవకాశం హెచ్చుగా ఉంటుంది.ఈ అంగానికి సూక్ష్మరంధ్రాలు చేసి రక్తం తొలగించే ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే చర్మంమీద ఏర్పరచిన సూక్ష్మ రంధ్రాలు వెంటనే మూసుకుపోతాయి. ఇటువంటి సందర్భాలలో కొన్ని జలగలను ఆ అంగానికి అంటిస్తే అవి కడుపునిండా రక్తాన్ని పీల్చుకుని విడిపోతాయి. జలగలు రక్తాన్ని పీల్చుకునేటప్పుడు అవి శరీరానికి చేసిన గాయాలు మూసుకుపోకుండా పదార్థాలను నోటినుండి విడుదల చేస్తాయి. జలగ విడుదల చేసే ఈ లాలాజలంలో అనేక ఔషధాలు ఉంటాయని శాస్తవ్రేత్తలు ఎప్పుడో గుర్తించారు. ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ, పెరిఫెరల్ వాస్క్యులార్ వ్యాధిగల రోగులకు ఉపశమనం కల్గించడంలో జలగల పాత్ర ఎంతో ముఖ్యం. జలగలవల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఇటువంటి ఇబ్బందులు రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు.

కీళ్లనొప్పులనేవి చాలావరకు రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని భాగాలను గుర్తించలేకపోవడంవల్ల ఆ భాగాలపై శత్రుదాడి జరగడంవల్ల వస్తూ ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ తన జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండేందుకు శాస్తవ్రేత్తలు ‘కొలోరల్’ అనే కొత్త మందును తయారుచేశారు. పళ్ల రసంతో రోగులు దీనిని సేవించాలి.
‘కొలోరల్’అంటే కీళ్ల టిష్యూల మీద ఉండే టైప్-2 కొలాజెన్ ప్రోటీన్ రసం. ఆరోగ్యవంతమైన ఈ టిష్యూలను గుర్తించలేక, రోగ నిరోధక వ్యవస్థ తిరగబడి, వాటిపై దాడి చేసినప్పుడు ఈ కొలాజెన్‌కు వ్యతిరేకమైన యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. కొలోరల్ మందు ‘ఓరల్ టాలరెన్స్’ అనే పద్ధతి ద్వారా ఇటువంటి దాడులను నిరోధిస్తుంది. మనం తినే ఆహారంలోని ఉపయోగకరమైన పదార్థాలన్నీ రోగ నిరోధకశక్తి కంట్లో పడకుండా తప్పించుకుని రక్తంలోకి జీర్ణకోశం ద్వారా చేరే పద్ధతిని ‘ఓరల్ టాలరెన్స్’ అంటారు. ఈ పద్ధతి ద్వారానే రోగ నిరోధక వ్యవస్థలోని టి-సెల్స్ కీళ్లమీద దాడులు చేయకుండా నిరోధించే వీలుంటుంది. ఇప్పటికే ఈ మందును కొంతమంది కీళ్లనొప్పులు గల రోగులపై ప్రయోగించారు. కొంతమందికి కీళ్లనొప్పులు పూర్తిగా నయం అయ్యాయి. ఇంకా ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితాలనుబట్టి ఈ మందును మార్కెట్‌లో ప్రవేశపెట్టే ఆలోచనలలో వున్నారు.

సువాసనకోసం కూరల్లో కొత్తిమీర వాడతాము. 25గ్రా. కొత్తిమీర ఆకును వంద మిల్లీలీటర్ల నీటిలో కలిపి 25 మి.లీ. కషాయం మిగిలేటట్లు కాచి దించి వడబోసి పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గుతాయంటున్నారు.


  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Burns , కాలిన గాయాలు


కాలిన గాయాలు
కాలిన గాయాల వలన ఏర్పడే బాధ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి స్వభావాన్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి చికిత్స పొందాల్సి ఉంటుంది.

చర్మం మాత్రమే కాలినట్లయితే గాయం తీవ్రతను ప్రాథమిక స్థాయిగా గుర్తించి చికిత్స గాయం మానడానికి, నొప్పి తగ్గిపోడానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అదే చర్మం కాలడంతోపాటు నరాలు కూడా దెబ్బతింటే గాయం తీవ్రతను ద్వితీయ స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి గాయాలకు జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది. క్షతగాత్రుని 24 గంటల పాటు వైద్యుని పర్యవేక్షణలో ఉంచాల్సిఉంటుంది.

చర్మం, నరాలతో పాటు కండరాలు కూడా కండరాలు దెబ్బతింటే ఇటువంటి గాయం తీవ్రతను మూడో స్థాయిగా గుర్తిస్తారు. ఇటువంటి సమయంలో క్షతగాత్రున్ని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తారు. ఈవిధంగా ఉండే క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వైద్యులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

కాలినగాయాలు, బొబ్బలు మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగురూకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం. శరీరం కొన్ని వేడి వస్తువులకు లేదా బలమైన రసాయనాలకు దగ్గరగా వచ్చినప్పుడు కాలినగాయాలవుతాయి.

కాలినప్పుడు నీళ్లు పోయరాదు, బొబ్బలొస్తాయనేది అపోహ. మాత్రమే. కాలేటప్పుడు నీళ్లు పోయడం వల్ల ఆ భాగం చల్లబడి కాలే తీత్రత తగ్గుతుంది. నూనె, ఇతర ఆయింట్‌మెంట్లు వెంటనే పూయడం వల్ల చర్మం గ్రంథులు మూసుకుని వేడి శరీరంలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇంకా ఎక్కువ చర్మం కాలి దెబ్బతినే అవకాశం అధికం. కాలిన తీవ్రతను బట్టి బొబ్బలెక్కుతాయి. అంతే కానీ నీళ్లు పోయడం వల్ల కాదు. నీళ్లు పోయడం వల్ల బొబ్బల తీవ్రత తగ్గుతుంది.

తరచూ కాలిన గాయాలవడానికి కారణాలు

* వంట పాత్రలు, కేకులు తయారు చేసే ఓవెన్ అరలు, కుక్కర్ల చేతి పిడి
* ఆధునికమైన కరెంట్ పరికరాలు ఉదా : ఇస్త్రీ పెట్టెలు, టీ కాచుకునే పాత్రలు మొదలగునవి.
* ప్రమాదకరంగా గ్యాసుల మంట, కరెంట్ వైర్లు తగిలి, కాలుతున్న ఇనుప తడికెలు
* ప్రమాదకరంగా బట్టలకు అంటుకున్న మంటలు
* బ్లీచ్ / తెలుపు లేక చలవ చేయు బట్టల పొడి, పలుచ చేయని దుర్వాయువులను పొగొట్టే ద్రవాలు
* తీవ్రమైన సూర్యరశ్మి మరియు గాలి
* తాళ్ళ రాపిడి

చాలా వరకు కాలిన గాయాలు ఇంటిలోనే జరుగుతాయి. అందువల్ల వీటికి ఇంటిలోనే చికిత్స చేయాలి. అందునా ఇవి వంట ఇంటిలోనే ఎక్కువగా జరుగుతాయి. వీటిని వంట గదిలోనే అత్యవసర చికిత్స అందించవచ్చు. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ని ప్రమాదాలు జరుగవలసిన అవసరం లేదనే నొక్కి చెప్పాలి.

సాధారణంగా ఈ ప్రమాదాలు ముసలి వారికి, పసి పిల్లలు ముఖ్యంగా ప్రాకే పిల్లల, అంగవైకల్యం వున్న వారిలో ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. పసి పిల్లలో, ముసలి వారిలో కలిగే కాలిన గాయాలను తీవ్రంగా పరిగణించాలి.



కాలిన గాయాలయినపుడు కొన్ని చేయగూడని పనులు

కాలిన గాయాలు శరీరానికి ఏ విధమైన హాని కలిగిస్తాయో చెప్పే ముందు, వైద్య నిపుణుల సాయం అందేలోపు కాలిన గాయాలకు చేయగూడని పనులు కొన్ని క్రింద ఉదాహరించబడ్డాయి.

* కాలిన గాయాం మీద వెన్న, పిండి, వంటసోడా వంటవి అస్సలు పెట్టరాదు/పెట్టకూడదు
* విలేపనము (మలాము), నూనెలు, క్రిమి కీటక నాశిని వంట ద్రవాలు
* కాలిన గాయాల వల్ల వచ్చిన బొబ్బలను గ్రుచ్చకూడదు, లేదా పగుల గొట్ట కూడదు.
* గాయాలను అవసరానికి మించి ముట్టుకొనరాదు.
* కాలిన బట్టలు శరీరానికి అంటుకుపోయి వున్నట్టైతే వాటిని బలవంతంగా తాకరాదు.

ఈ రోజులలో బట్టలు కృత్రిమ నారతో నేసిన/చేసిన బట్టలవే కాబట్టి మంటలకు అవి పూర్తిగా కరిగిపోయి శరీరానికి అంటుకొనిపోతాయి. వీటిని బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తే వాటితో పాటు చర్మం కూడా వూడి వస్తుంది. దీని మూలాన అనవసరంగా క్రిములు శరీరంలోనికి చేరే అవకాశం వుంటుంది. ఎటూ అవి పూర్తిగా కాలినాయి కాబట్టి సూక్ష్మక్రిములు చనిపోయి వుంటాయి. అందుకని అలానే వదిలివేయడంమంచిది.


సాధారణ చికిత్స

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో తప్పించి కాలిన గాయాలన్నీంటికీ ఒకే విధమైన చికిత్స వుంటుంది. చాలా వరకూ ఏవో చిన్న కాలిన గాయాలు తప్పితే మిగిలినవన్నీ ప్రమాదకరమైనవే. చాలా నొప్పి, బాధ కొన్ని సందర్భాలలో ఘతము/ షాక్ ను కలిగిస్తాయి. చాలా వరకూ ఈ ప్రమాదాలు అత్యవసర పరిస్థితులు ఉదాహరణకు ఇళ్ళు కాలిపోతున్నప్పుడు, రోడ్డు ప్రమాదాలలో, పెట్రోలు కారడం మూలంగా కలుగుతాయి. కాబట్టి అత్యవసర పరిస్థితిలో వున్న రోగిని ప్రశాంతంగా వుంచాలి. ధైర్యం చెప్తూ చికిత్స ప్రారంభించాలి. ఎందుకంటే జరిగిన ప్రమాదం వల్ల రోగి ముందుగానే భయంతో, ఘాతములో వుంటాడు. రోగితో మృదువుగా ప్రవర్తిస్తూ త్వరిత గతిన చికిత్స ప్రారంభిస్తూ, పద్ధతి ప్రకారం ఏది ముందు, ఏది వెనక చేయాలో చేస్తూ పోవాలి.

ఒక్కసారి చర్మం, కణజాలం కాలిన తరువాత శరీరంలో నుంచి ద్రవాలు చాలా వరకూ నష్టపోతాయి. గాయపడిన కణజాలం వేడిని పట్టి వుంచుతుంది. దీని మూలంగా కణజాలం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చికిత్సలో ముఖ్యమైన భాగం ఈ వేడిని తగ్గించడం. ప్రాధమిక చికిత్సలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడం.


తీసుకోవలసిన జాగ్రత్తలు

* కాలిన గాయాలయిన శరీర భాగాన్ని వెంటనే చల్లటి నీళ్ళలో ముంచాలి. బకీట్ నీళ్ళలో గానీ, బట్టలుతికే టబ్బులో గానీ వంట ఇంటి సింకులో కానీ, కనీసం పంపు క్రింద నీళ్ళలో గానీ కాలిన భాగాన్ని వుంచాలి.
* ఈ విధంగా కనీసం కాలిన భాగాన్ని పదిహేను నిమిషాలు లేక నొప్పి తగ్గే వరకూ వుంచాలి.
* ఒక వేళ కాలిన భాగాన్ని నీళ్ళలో ముంచడం కష్టమయితే (ముఖము) శుభ్రమైన గుడ్డను చల్లని నీటిలో ముంచి కాలిన భాగం పై అద్దాలి. ప్రతిసారి అద్దే ముందు చల్లని నీటిలో ముంచాలి. గాయం మీద రుద్దకూడదు ఈ విధంగా చేయడం మూలంగా కణజాలం నుంచి కొంత వేడి గుంజేయడం జరిగి తద్వారా గాయం ఎర్ర బడడం, నొప్పి. బొబ్బలు రావడం నివారించవచ్చును.


* చేతికి వున్న వుంగరాలు, గాజులు, బూట్లు బిగుతుగా వున్న బట్టలు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసివేయాలి. ఎందుకంటే తరువాత కలిగే వాపు మూలాన తీయడం కష్టం కావచ్చును.
* చిన్న చిన్న ఉపరితలంలో వున్న గాయాలను పొడిగా, శుభ్రంగా వున్న బట్టతో అద్దాలి. ఆ తరువాత పట్టీలు కప్పాలి.పెద్ద గాయాలు, లోతుగా అయిన గాయాలు నీటిలో నుంచి బయటకు తీసిన తరువాత తేలికగా శుభ్రంగా ఈ మధ్యనే ఉతికిన పీచులు లేని బట్టతో కప్పాలి. (శుభ్రంగా వున్న దిండుగలేబు కాలిన గాయాలు వున్న కాళ్ళకు తొడగడానికి అనువుగా వుంటుంది.)
* వైద్యుడు లేదా ఆంబులెన్స్ కు కబురు చేయాలి.
* ఏదైనా కాలిన గాయం తపాలా బిళ్ళ కన్నా (2.21/2 సెం.మీ) పెద్దదిగా వున్నప్పుడు మీరు చల్లని నీళ్ళతో చికిత్స చేసిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* కాలిన గాయాలు పెద్దవిగా వున్నప్పుడు రోగిని ఆసుపత్రికి తరలించేటప్పుడు ఒక తువ్వాలులో ఐసు వేసి దానిని గాయంపై ఎక్కువ వొత్తిడి లేకుండా ఉంచాలి.
* కాలిన గాయాల కణజాలాన్ని క్రిమి సంపర్కం నుంచి కాపాడలేక పోతే సూక్ష్మ జీవులు గాయాల పై వృద్ధి చెందుతాయి. ఈ విధంగా గాయాలను కప్పడం మూలాన రోగి ఆదుర్దా తగ్గుతుంది. ఎందుకంటే వారికి గాయాలు కనపడవు కాబట్టి బల్ల మీద కప్పే గుడ్డలు (నైలాను కాకూడదు) శరీరాన్ని కప్పడానికి బాగా పనిచేస్తాయి. గాయాలపై కట్టే బట్ట తేలికగా ఎక్కువ వొత్తిడి లేకుండా కప్పాలి.
* వైద్యుడు లేక ఆంబులెన్స్ వచ్చే వరకూ రోగికి ధైర్యం చెప్తూ ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పసి పిల్లలైతే ఎత్తుకుని వూపాలి. అదే సమయంలో కాలిన గాయాలకు వొత్తిడి కలగకుండా చూసుకొవాలి.



ప్రత్యేకమైన చికిత్స అవసరమైన పరిస్థితులు
బట్టలకు నిప్పు అంటుకున్నప్పుడు

* బట్టలు ఇంకా మండుతున్నట్టైతే చల్లని నీరు మంటలపై వేసి మంటలు ఆర్పాలి లేదా రోగిని దుప్పటితో కప్పి ( దుప్పటి లేకపోతే కోటు లేదా పెద్ద గుడ్డ ముక్కతో నైనా సరే) గాలి తగలకుండా చూడాలి. కంబళి కూడా పని చేస్తుంది దుప్పటి మీ ముందు భాగంలో వుండే విధంగా నిలబడాలి దీని వల్ల మంటలు మీకు అంటుకోకుండా వుంటాయి.
* మంటలలో కాలుతున్న రోగి భయంతో ఒక గదిలో నుంచి మరొక గదిలోనికి పరిగెత్తుతూ వుండవచ్చు. అటువంటప్పుడు అన్ని చోట్ల మంటలు అంటుకునే ప్రమాదం వుంటుంది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు పరిగెత్తుతారు. బయట గాలికి మంటలు ఇంకా ఎక్కువయే అవకాశం వుంటుంది. అందువలన రోగిని కదలకుండా వుండమని ప్రోత్సహించాలి.
* మంటలు ఆర్పిన తరువాత పైన తెలియ చేసిన విధంగా చికిత్స ప్రారంభించాలి.

కంటిలోనికి చిమ్మిన రసాయనాలు

వీటి వలన కంటికి శాశ్వతమైన హాని కలగడమే కాకుండా చూపు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చికిత్స అతి త్వరగతిన మొదలై పోవాలి. ముందుగా రసాయనాన్ని పలుచపరచే పని చూడాలి.

* రోగిని వెల్లకిలా పడుకో బెట్టి బొటనవేలు వుంగరంతో వేళ్ళతో కంటి రెప్పలను వేరు చేసి ముక్కువైపు నుంచి కంటి ముందు భాగం వైపు చల్లని నీరు ఆపకుండా కొద్ది సేపు పోయాలి. దీని మూలంగా రసాయనకం పలచబడుతుంది. రెండో కంటిలో రసాయనం పడకుండా తల కొద్దిగా ప్రక్కకు తిప్పి నీరు పోయాలి.
* కంటి రెప్పలు పదే పదే మూసి తెరవడం వల్ల రసాయనం కంటి లోపలి భాగంలో ఉండి (మడతలలో) పోకుండా బయటకు వచ్చేస్తుంది.
* కంటిని కడిగే ప్రక్రియ కనీసం పది నిమిషాలు చేయాలి. గడియారంలో చూసుకుంటూ చేయాలి. సమయం తగ్గించకూడదు.
* కంటిని కడిగిన తరువాత రెప్పలు మూసి కంటిపై శుభ్రమైన బట్ట పెట్టాలి
* రోగికి ధైర్యం చెప్పి ఆసుపత్రికి తరలించాలి

కరెంట్ తో కాలిన గాయాలు

ఈ గాయాలు చిన్నవిగా వున్నా లోతుఎక్కువగా వుంటాయి. ఇవి ముఖ్యంగా కరెంట్ శరీరంలోనికి ప్రవేశించి మరలా బయటకు వెళ్ళి పోయిన ప్రదేశంలో కనబడతాయి.

* అత్యవసర పరిస్థితిలో వున్న రోగికి చికిత్స చేసే ముందు కరెంట్ స్విచ్ బంద్ చేసి ప్లగ్గు తీసి వేయాలి దీని మూలంగా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది.
* రోగి నీళ్ళలో పడి వున్నట్టైయితే మీరు దూరంగా వుండండి. తడి కరెంట్ ప్రసరణ చేసే గుణాన్ని శ్రేష్టంగా పెంచుతుంది. దీని మూలంగా రోగిని సంకల కింద చేతులు వేసి లేపకూడదు.
* రోగి శ్వాస ప్రక్రియను గమనించాలి విద్యుచ్ఛక్తి ఛాతీ మరియు గుండె గుండా ప్రసరించి శ్వాసను, గుండెను ఆపివేసి వుండవచ్చు. నొటి ద్వారా శ్వాస నందించడం, గుండె మర్దన వెంటనే మొదలు పెట్టాలి.
* రోగిని అనుకూలంగా పరుండబెట్టి సాధారణ చికిత్స మొదలు పెట్టాలి.


కాలిన గాయాల నుంచి బ్యాక్ టు లైఫ్

దీపాలు, బాణాసంచాతో దీపావళి ఆనందంగా వెళ్లిపోయింది. పండగ మిగిల్చిన ఆనందాలను కొందరు మదిలో పదిలంగా దాచుకుంటే, మరికొందరు విషాదాన్ని మూటగట్టుకొని ఉంటారు. బాణాసంచా పేలుడులోనో, ప్రమాదంగా మారిన పరిస్థితుల వల్లనో కాలిన గాయాలతోనో బాధపడుతూ ఉంటారు. మొన్నటి వరకు అందంగా ఉన్న శరీరం అనుకోని ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే? లేదా ఇతరత్రా అవకారాలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే? ఆవేదన వద్దు... ప్లాస్టిక్ సర్జరీతో పరిష్కారం ఉంది.

అందంగా ఉన్న శరీరం ప్రమాదం కారణంగా అందవిహీనంగా మారితే! ఆ బాధ మాటల్లో చెప్పలేం. శరీరం పూర్వపు స్థితిని పొందాలన్నా, ఉన్నదానికన్నా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలన్నా అందుబాటులో ఉన్న చికిత్స ప్లాస్టిక్ సర్జరీ. ఒకప్పుడు సెలబ్రెటీలకు మాత్రమే అందిన ఈ వైద్యం, నేడు సాధారణ ప్రజానీకానికీ చేరువైంది. మొన్నటి దీపావళికి కాలిన శరీరపు గాయాలకే కాదు... కాస్మొటిక్ సమస్యతో మనసును కాల్చే గాయాలకూ ప్లాస్టిక్ సర్జరీ పరిష్కారం చూపిస్తుంది.

ప్లాస్టిక్ సర్జరీ...

‘ప్లాస్టిక్’ అనే పదం గ్రీక్ ‘ప్లాస్టికోస్’ నుంచి వచ్చింది. అంటే మలచడం, మౌల్డింగ్ అని అర్థం. అంతే తప్ప ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేస్తారని కాదు. పాస్టిక్ సర్జరీలో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి- కాస్మొటిక్ సర్జరీ (అందం మెరుగుపరచడానికి చేసే సర్జరీ), రెండు (రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ) అవయవాన్ని కొత్తగా తయారుచేసి సెట్‌చేయడం. పాస్టిక్ సర్జరీ అనగానే టీవీ సీరియల్స్‌లోనూ, సినిమాల్లోనూ చూపించిన విధంగా ఒకరికి బదులుగా మరొకరిలా మార్చడం జరగదు. ప్లాస్టిక్ సర్జరీలో రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ, మైక్రోసర్జరీ... అని చాలా రకాలు ఉన్నాయి.

స్కిన్‌గ్రాఫ్ట్...

శరీరంలోనే అతిపెద్ద అవయవం చర్మం. శరీరభాగాలను కప్పి ఉంచే ఈ చర్మం కనుబొమల దగ్గర సున్నితంగా, అరచేయి, పాదాల్లో గట్టిగా ఉంటుంది. శరీరం మొత్తంలో అధిక ప్రాధాన్యం ఉన్న ఈ చర్మం ఏ కారణం చేతనైనా కాలినా, దెబ్బతగిలి గాయపడి పాడైపోయినా ఆ ప్రాంతంలో దానిని తొలగించి, శరీరంలో ఇతర చోట్ల ఆరోగ్యంగా ఉన్న చర్మాన్ని తీసి అతికిస్తారు. ఈ పద్ధతిని స్కిన్ గ్రాఫ్ట్ అంటారు. గాయం చిన్నదైతే ఫస్ట్ డిగ్రీ సూపర్‌ఫిషియల్, సెకండ్ డిగ్రీ సూపర్ ఫిసియల్ చికిత్స చేస్తారు. అంటే డ్రెస్సింగ్, క్రీములతో గాయం నయం అయ్యేలా చూస్తారు. గాయం పెద్దదై రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే హాస్పిటల్‌లో ఆ వ్యక్తి అడ్మిట్ కావాల్సి ఉంటుంది. రిస్క్‌ను బట్టి చికిత్స ఉంటుంది. కాలిన గాయం లోతుగా ఉంటే డీప్ సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ బర్న్స్‌గా పేర్కొంటారు. స్కిన్ గ్రాఫ్ట్‌కు సాధారణంగా తొడల నుంచి చర్మం తీసి వేస్తుంటారు. అయితే తొడల దగ్గర కూడా చర్మం కాలినప్పుడు మరో చోట నుంచి ఆరోగ్యకరమైన చర్మం తీయాల్సి ఉంటుంది. ఈ చికిత్సలన్నీ అన్ని వసతులు ఉన్న చోట, నిపుణులైన సర్జన్‌తో చేయించుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

కాస్మొటిక్ సర్జరీ..
.
అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసే రైనోప్లాస్టీ(ముక్కును సరిచేయడం), లైపోసక్షన్(ఫ్యాట్‌ను తగ్గించడం), ఫేస్‌లిఫ్ట్ (ముఖ చర్మం ముడతలు రాకుండా చేయడం), బ్ట్రెస్ సర్జరీ(పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను తగ్గించడం, తక్కువగా ఉన్న బ్రెస్ట్‌ను పెంచడం, సాగిన బ్రెస్ట్‌ను సరిచేయడం), పురుషుల్లో పెద్దగా ఉన్న బ్రెస్ట్‌ను (గైనకోమాస్టియా) తగ్గించడం... ఇలా చెప్పుకుంటే శరీరంలో ప్రతి భాగాన్ని సర్జరీ ద్వారా అందంగా మార్చుకోవడానికి చేసేది కాస్మొటిక్ సర్జరీ. లోపాలను సవరించుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేయించుకునే ఈ సర్జరీకి ఒక రోజు మాత్రమే పడుతుంది.

పేలడం వల్ల అయిన గాయాలకు..
చేతుల్లోనే బాణాసంచా కాలి గాయాల పాలైన కేసులు ఎక్కువగా హాస్సిటల్స్‌కు వస్తుంటాయి. బాణాసంచా వల్లనో, ప్రమాదాల వల్లనో చేతి ఎముకలు విరగడం, నర్వ్ ఫంక్షన్ దెబ్బతినడం, కదలికలు లేకపోవడం, కండరాలు దెబ్బతినడం, చర్మం పాడైపోవడం... ఇలా అన్నింటిపైన రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు వీరికి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా టెండార్ రిపేర్ చేయడం, తర్వాత నర్వ్ రిపేర్ ఆ తర్వాత స్కిన్ గ్రాఫ్ట్.. ఇలా దశలవారీగా చికిత్స చేస్తూ వెళతారు. శరీరం నలభై శాతం కంటే ఎక్కువ కాలినట్టయితే వీరికి ప్రాణాపాయం ఎక్కువ. వీరిని ఐ.సి.యూలో ఉంచి కొన్ని రోజుల పాటు వైటల్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత పైన చెప్పిన చికిత్స చేయాలి. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

-- Dr.k.Murali mohan Reddy (plastic surgeon) , Yasoda hospital , Secunderabad.
  • ==================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, December 16, 2010

Painless Therapy (Treatment),నొప్పిలేని చికిత్సలు


మన దేశము లో అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు అమలులో ఉన్నాయి. వైద్యశాస్త్ర నిపుణులు , హేతువాదులు అయా వైద్యవిధానాల ప్రామాణికతను ప్రశ్నించడం జరుగుతోంది . గోమూత్రము , చేపమందు , లీచ్ థెరపి వంటివి వాటిలో కొని . అయినప్పటికీ సామాన్య ప్రజలతో పాటు చదువుకున్న వారుకూడా ఆ విధానాలను అనుసరిస్తున్నారు . మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు . వాటి ప్రామాణికత , నిజానిజాలను పరిశీలించుదాం.

గోమూత్ర చికిత్స : ఆవును భారతీయులు పవిత్రమైనదిగా భావిస్తారు . ఆవుపాలు , ఆవునెయ్యి వంటి వాటిలో మంచి పోషక విలువలున్నాయి . అయితే ఆవుయొక్క మూతం లో కూడా ఔషదవిలువలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది . గోమూత్రాన్ని వడగట్టి , స్టెరిలైజ్ చేసి ప్రజలకు బాటిల్స్ తో అందించే సంస్థలు కూడా ఉన్నాయి . నాగపుర్ లో ఈ చికిత్స అధికము గా అమలులో ఉన్నది .
విశ్వాసాలు : గోమూత్రం వలన చర్మవ్యాదులు , గుండెవ్యాదులు లతో పాటు ఎయిడ్స్ , కాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయయనే విశ్వాసము ఉంది . శరీరము విసర్జించే అనేక సూక్ష్మపోషక పదార్ధాలను పూరిస్తుంది . కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . లివర్ సక్రమముగా పనిచేసేటట్లు చేస్తుంది . జ్ఞాపక శక్తిని పెంచుతుంది . వృద్ధాప్యం దరిచేరనీయదు . గుండె , మెదడు లోని కణాల్ని బలపరుస్తుంది .
ఆయుర్వేద వైద్యప్రకారము : గోమూత్రము పైత్యం చేస్తుంది . కఫాన్ని తగ్గిస్తుంది . ఆయుర్వృద్ధిని ఇస్తుంది . జ్వరము , ఫైల్సు , దగ్గు , శ్వాసకోశవ్యాధులు , కుష్టు , ఉబ్బు వంటి వ్యాధులను నయము చేస్తుంది . క్రిములను వాటివల్ల వచ్చే రోగాలను నయం చేస్తుంది . మల , మూత్ర బద్దకం రాకుండా చేస్తుంది . ఆకలిని పుట్టించి జీర్ణం అవడానికి దోహదపడుతుంది .
డోసేజ్ : రోజుకో గ్లాసును (200 m.l) తాగాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు .
నిజమని తేలినవి : శాస్త్రీయముగా నిర్ధారణ జరగక పోయినా గోమూత్ర చికిత్సవల్ల కొన్ని వ్యాధులు తగ్గ్గుతాయని అంటున్నారు . అవి : కొలెస్టిరాల్ తగ్గిస్తుంది , జ్ఞాపక శక్తిని పెంపోందిస్తుంది , తొందరగా ముసలితనము రాకుండా ఏజింగ్ ని పొడిగిస్తుంది . కాలేయము సక్రమముగా పనిచేసేలా చేస్తుంది .
పోషకాలు : పరిశో్ధకుల అభిప్రాయం ప్రకారము గోమూత్రం లొ పోషకాలు ->A, B,C,D,E విటమిన్లు , సోడియం , మెగ్నీషయం , పొటాషియం , గంధకం , ఐరన్‌ , నత్రజని , వంటి మూలకాలు , మాలిక్ , సిట్రిక్ , టైట్రిక్ , సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు , హార్మోనులు , క్రియాటినిన్‌ , లాక్టోజ్ వంటివి ఉన్నాయి .

జలగ వైద్యము : జలగల్తో వైద్యము ఒక పురాతన పద్దతి . గ్రీస్ , రోమ్‌ , వంటి విదేశాలలో 80-40 BC లోనే ఇది అమలులో ఉన్నది . మనిషి శరీరం నుండి రక్తం పీల్చడం ద్వారా జలగ పొట్ట నింపుకుంటుంది . ఒక గంటలో 10 మి.లీ. రక్తం తాగుతుంది . రక్తం గడ్డకట్ట కుండా జలగ 12 రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది . జలగ తాగే రక్తాన్ని బట్టి ఇవి మారుతుంటాయి . ఈ రసాయనాలే జలగల తో వైద్యానికి ఆధారాలు . జగల వైద్యము యునానీ పద్దతిలో చాలా కాలము నుండి అమలవుతోంది .
విశ్వాసాలు : జలగ ఉమ్మిలోని " హైరుడిన్‌ " రక్తం గడ్డకుండా చేస్తుంది . రక్తం లోని ప్లేట్ లెట్స్ గుమిగూడ నివ్వదు కరోనరి ఆర్టిరీ లోని గడ్డలను కూడ కరిగిస్తుంది . రక్తం లోని కంతులను కరిగిస్తుంది . నొప్పిని తగ్గిస్తుంది . రక్తసరఫరాను క్రమపరుస్తుంది .
వైద్య పద్ధతి .: పసుపు జలగను ఉత్తేజపరుస్తుంది . అందువల్ల పసుపు కలిపిన నీటి టబ్ లో జలగను ఉంచుతారు . ఆ రరువాత ఇన్‌పెక్ట్ అయిన రోగి శరీరం పై ఉంచుతారు . అది గంటలో సుమారు 10 మి.లీ. రక్తం ఆ ప్రదేశము నుండి పీలుస్తుంది . ఆ తరువాత అది విడిపోతుంది . తదుపరి దెబ్బతగిలిన భాగము మీద డిజిన్‌ఫెక్టెంట్ రాసి బ్యాండేజ్ వేస్తారు . జలగను పసుపు కలిపిన నీటిలో వేస్తే అది పీల్చిన రక్తము వాంతి చేస్తుంది . తర్వాత దాన్ని 15 - 25 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద సీసాలో బద్రపరుస్తారు . ఒక గుర్తింపు మార్క్ ఇచ్చి తిరిగి దానిని అదే రోగికి ఉపయోగిస్తారు . ఆరు వారాలు తర్వాత దానిని నాశనం (చంపేస్తారు)చేస్తారు . సూక్ష్మరక్తనాళాలు , చిన్న రక్తనాళాలలో రక్తము గడ్డకట్టినప్పుడు , రక్తం కంతులు ఏర్పడినప్పుడు రక్త సర్ఫరా ఆ ప్రదేశాలలో సరిగా జరుగదు . అందువల్ల అయాబాగాలు నీలంగా మారడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి .అప్పుడు జలగలతో రక్తం పీల్చడం ద్వారా ఆ వ్యాధులు నయము చెయ్యడానికి వీలుకలుగుతుంది .
నిజము అని తేలినవి : జలగల తో వైద్యం ద్వారా వాపులు , ఎన్నటికీ తగ్గని అల్సర్ లు , ఫైల్స్ , కొన్నిరకాల కంటివ్యాధులు , కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన బాధలు , మైగ్రేన్‌ తలనొప్పి , పాదాల మంటలు , పక్షవాతము , ఆస్టియో ఆర్థ్రైటిస్ , జుట్టు రాలడం , వివిధరకాల చర్మ వ్యాధులు వంటివి తగ్గించ వచ్చుననే నమ్మకాలు ఉన్నాయి .

పచ్చి ఉల్లిపాయతో వైద్యము :
ఎండలో వడదెబ్బ తగలకుండా తలపై ఉల్లిపాయ పెట్టుకొని టోపీ ధరించడం , ఉల్లివాసన చూడడం పరిపాటి ... అధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలలో పచ్చి ప్ల్లిపాయను తింటారు .
విశ్వాసాలు : పచ్చి ఉల్లిపాయలో బి 1 , బి2 , విటమిన్లు పుష్కలముగా ఉన్నాయి . మంచి శక్తిదాయకము అధికమొత్తంలో నీటిని కలిగిఉంటుంది . ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి ఉన్నది . కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది . టెస్టోస్టిరాన్‌ పోలిన హార్మోన్‌ వంటి కెమికల్స్ దీనిలో ఉంటాయి. రోజూ ఉల్లి తింటే పిల్లకు తల్లి చేసినంత మేలు చేస్తుందంటారు .
డోసేజ్ : రోజూ ఒక మోసతరు ఉల్లి గడ్డను పచ్చి గా తినాలి . పెరుగు ఉల్లి చెట్నీ , ఉల్లి సలాడ్ రూపాలలో తనవచ్చును . ఎక్కువగాతింటే కడుపులో ఎసిడిటీ పెరిగి మండుతుంది . నోరు ఉల్లి కంపు కొడుతుంది .
నిజమని తేలినవి : వడదెబ్బ రాకుండా చేస్తుంది . రక్త సరఫరాను క్రమబద్దం చేస్తుంది . బ్లడ్ ప్లసర్ ను తగ్గిస్తుంది , రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది .

చేపమందు :
ఆస్త్మా, ఇతర శ్వాసకోశవ్యాధులు తగ్గిండేందుకు చేపమందు ఇస్తున్నారు . సుమారు 150 ఏళ్ళుగా చేపమందు ఎంతోమంది ప్రజలు ఉపయోగిస్తున్నారు . చేపమందు విశ్వసనీయతను శాస్త్రజ్ఞులు హేతువాదులు ప్రశ్నిస్తున్నా .. వేలసంఖ్యలో దేశవిదేశాలలో ఈ మందుపై ఆసక్తి చూపిస్తున్నారు . ఉబ్బసానికి మంచి మందుగా పరిగణిస్తున్నారు . కృగశిర కార్తె మదటిరోజున చేపమందు ఉబ్బసవ్యాధిగ్రస్తులకు ఇస్తున్నారు .
విశ్వాసాలు : పసుపురంగు హెర్బల్ పేస్టు , చిన్న 'మ్యూరియల్ ' చేపపిల్ల ఈ విధానము లో వాడే పదార్ధములు . హెర్బల్ పేస్టు ఏ విధంగా తయారుచేస్తారనేది చాలా గోప్యము గా ఉంచుతారు . ఉచితముగా ఇచ్చే ఈ మందును ఇతరులు తయారుచేసి వ్యాపరము చెయ్యకుండా ఉంచడం ముఖ్యోద్దేశము .
డోసేజ్ : 2-3 అంగుళాలు పొడవుండే చిన్న మ్యూరియల్ చేపపిల్ల నోటిళొ పసుపురంగులో ఉండే హెర్బల్ మందు ఉంచుతారు ... దానిని ఉబ్బసరోగి చే మింగించుతారు .
నిజమని తేలినవి : చేప మందు + హెర్బల్ పేస్టు లలో ఏది పనిచేస్తుందో ఉబ్బసవయాది తగ్గుతుంది . . ఇది ఆయుర్వేదము మందు . వరుసగా 3 సంవత్సరాలు సంవత్సరానికి ఓకసారి తీసుకోవాలి .

బోన్‌ సెట్టింగ్ :
విరిగిన ఎముకలు అతుక్కోవడానికి , బెణుకులు వంటివి తగ్గడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు . ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు ఇందుకు చలా ప్రసిద్ధి చెందిన ప్రదేశము . పుత్తూరు బోన్‌ సెట్టింగ్ హాస్పిటల్ లో బోన్‌ సెట్టింగ్ చేసే నిపుణులు ఎంతో మంది ఉన్నారు . ఇందుకోసము అనేక హెర్బల్ వాడుతారు .
విశ్వాసాలు : ఎములల్ని సరియైన స్థానములో అమరుస్తారు . దానిపైన హెర్బల్ పేస్ట్ పూస్తారు . దానిలో వాడే వనమూలికలను గోప్యము గా ఉంచుతారు . హెర్బల్ మందు ఎముకల్ను స్థాన చలనము చెందకుండా చూస్తాయని వారి విశ్వాసము ఇదెలా పనిచేస్తుందో శాస్త్రీయమైన వివరణలేదు . చర్మము పై రాసిన మందు లోపలి ఎముకల్ని ఎలా అతుక్కుందుకు దోహదపడుతుందో తలుసు కోవలసి ఉంది .
డోసేజ్ : ఆయా ప్రదేశాలను బట్టి వాడే వనమూలికలు , పద్దతులలో మార్పు ఉంటుంది . పుత్తూరులో బోన్‌ సెట్టింగ్ చాలా ప్రసిద్ధి చెందినది . ఏ పనిముట్లు వాడకుండా చేతులతో ఎముకలను స్వస్థానము లో ఉంచి సరిచేస్తారు .కాటన్‌ క్లాత్ తో కట్టుకడతారు . వెదురు కర్రలతో సపోర్టు ఇస్తారు . 45 రోజుల తర్వాత కట్టువిప్పుతారు . సాధారణముగా ఎముకలు అతుక్కుంటాయి లేకపోతే మరోసారి కట్టుకడతారు .
నిజమని తేలినవి : చిన్న చిన్న ఫ్రాక్చర్స్ నయమవు తాయి . సర్జరీ లేకుండా తగ్గుతాయన్నది విశేషము . మల్టిపుల్ ఫ్రాక్చర్స్ నయమవడం కస్టమే .

కధ :
హెర్బల్ టీకి మరాఠీవారి మరో పేరు ' కథ ' ఇది దగ్గు , జలుబు , గొంతునొప్పి , జ్వరము వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగించే హోమ్‌ రెమిడి .
విశ్వాసాలు : తులసి , ఫెన్నెల్ , నిమ్మగడ్డి , యల్లకులు కధలోని ముఖ్య దినుసులు . తులసిలో ఉండే సీనియోల్ , యూజెనాల్ , కాంఫీన్‌ వంటి రసాయనాలు బ్రాంకైటిస్ , ఇతర శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తాయి . లెమన్‌గ్రాస్ నిద్రపట్టకపోవడం , స్ట్రెస్ తగ్గించి ప్రశాంతత సేకూరుస్తుంది . కాలేయము , పాంక్రియాస్ , మూత్రాశయం , ఆహారనాళాలలోని విషపదార్ధాలను పోగొట్ట్ , జీర్ణకిరయ , రక్త ప్రసరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది .
డోసేజ్ : కధ తయారీకి కావలసినవి -> తులది ఆకులు కడిగినవి 8-10 , ఫెనెల్ సీడ్స్ ఒక టీ స్పూన్‌ , నిమ్మగడ్డి ఆకు ఒకటి , లవంగాలు 3-4 , శొంఠిపొడి చిటికెడు , లికొరిస్ చిటికెడు , ... ఇవన్నీ నీటిలో వేసి సగానికి మరిగించాలి . అవసరమైతే వడగట్తి వేడిగానే తాగాలి . లికోరిస్ లేదా తేనె కలుపుకోవచ్చును . ఏ వయసువారైనా తాగవచ్చును .
నిజమని తేలినవి : దగ్గు , జలుబు , గొంతునొప్పి , శరీరానికి సంబందించి న నొప్పులు , వికారము తగ్గుతాయి .

హీట్ థెరపీ :
ఆయుర్వేద వైద్యవిధానము లో వేడిని ఉపయోచించి వైద్యము చెయ్యడాన్ని హీట్ థెరఫీ అంటారు . హిమాలయాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రక్రియ వాడుకలో ఉన్నది . ఆరు నెలల నుండి ఓక సంవత్సరం లోపు పిల్లలకు ఇది తప్పనిసరి వైద్యచికిత్స . హీట్ థెరపీని థెర్మోథెరపీ అని కూడా అంటారు .
విశ్వాసాలు : దీనిలో 45 -50 సెం.మీ. పొడవు గల " టావ్ " అనే ఇనుము చువ్వను ఉపయోగిస్తారు . ఒక వైపు బాగా వంచబడి .. ఒకటి / రెండు చిల్లులు కలిగివుంటుంది . ఇనుప చువ్వను బాగా ఎర్రగా కాలుస్తారు దానిని దెబ్బతిన్న ప్రదేశముపై కొద్దిసెకనులు ఉంచుతారు . తర్వాత ఆప్రదేశము ను పత్తి , ఆలివ్ నూనె తో పూస్తారు .
నిజమని తేలినవి : వేదికి కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి . గాయమైన ప్రదేశము వేడి వలన రక్తప్రసరణ ఎక్కువై గాయం మానుతుంది . ఆలివ్ ఆయిల్ తో మసాజ్ కూడా నొప్పులు తగ్గింస్తుంది .


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, December 10, 2010

yaws disease , యాస్ వ్యాది


యాస్ వ్యాది చర్మము , ఎముకలు , కీళ్ళు లో ఒక రకము ఇంఫెక్షన్‌ వ్యాది . ట్రిపనోమా పాల్లిడం (Triponema pallidum pertenue) అనే బాక్టీరియా వలన వస్తుంది . ఇది గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది . యాయా అంటే పుండు అని శరీరము పై పుండ్ల తో ఈ వ్యాది మొదలౌవుతుంది కావున యాస్ వ్యాధి అన్నారు .

వ్యాపించే విధానము :
వ్యాది గ్రస్తులు ఇంకొరిని తాకడము వలన (skin to skin contact) అంటుకుంటుంది . చర్మము పై పుండ్లు లోని రసి తగలడం ద్వారా వ్యాపిస్తుంది . సిఫిలిస్ వ్యాది జాతికి చెందిన బాక్టీరియా కావున సెక్షువల్ కౌగలింతలు , ముద్దులు , అలింగనములు వలన వ్యాప్తి చెందుతుంది . దక్షిణ ఆఫ్రికా , దక్షిణ అమెరికా , ఆసియా లో కొన్ని దేశాలలో ఎక్కువ .

లక్షణాలు :
వ్యాది ప్రారంభ దశలో వారము రోజులు ఒళ్ళు నొప్పులు ,జ్వరము , వణుకు, కీళ్ళ నొప్పులు , కాళ్ళు ు, చేతులు మొదలైన బాగాలలో చిన్నపుండ్లు , , దురద , నిస్సత్తువ , తదితర లక్షణాలు ఉంటాయి .
చికిత్స :
పెన్సిలిన్‌ ఇంజక్షన్‌ 2- 3 డోసులు సరిపోతాయి ,
టెట్రా సైక్లిన్‌ బిల్లలు ఒక వారము రోజులు వాడాలి ,
ఎరిత్రోమైసిన్‌ టబ్లెట్స్ ఒక వారం రోజులు వాడాలి .
పుండ్ల కు క్లిండామైసిన్‌ , టెట్రా సైక్లిన్‌ , లేదా ఎరిత్రోమైసిన్‌ ఆయింట్ మెంట్ లు వాడాలి .


  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, December 7, 2010

పాపాయిలపై పొగ దుష్పరిణామాలు , Smoke effects on babies(Infants)


ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ధూమపానం, వంటింటి పొగ, వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్యం వల్ల ఏటా పెద్ద సంఖ్యలో చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గటం.. శ్వాస, దంత సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. ఈ దుష్పరిణామాల నుంచి చిన్నారులను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.

సాధారణంగా రెస్టరంట్లలో వండేగది, కూర్చుని తినే చోటు పక్కపక్కనే ఉంటాయి. ఎంత ఏసీ ఉన్నా.. గది నుంచి వెలువడే పొగను వెలుపలికి పంపేందుకు ఏర్పాట్లు ఉన్నా కూడా.. దాదాపు సగం పొగ.. గాల్లో చేరుతుంది. అలా మనకు తెలియకుండానే పీల్చేస్తుంటాం. అందుకే మనం కూర్చునే చోటుకు వంట గదికి దూరంగా ఉండేలా చూసుకోవడం అన్నివిధాలా మంచిది.

ఇల్లు సురక్షితం అనుకుంటాం. కానీ.. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమంటారు నిపుణులు. ఓ అధ్యయనం ప్రకారం.. ఇంట్లో వెలువడే రకరకాల పొగలను యాభైరెండు శాతం మంది పీలుస్తారు. కాబట్టి వీటిపైనా దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.

అధ్యయనాల ప్రకారం.. పొగాకులో అరవై తొమ్మిది రకాల కార్సినోజెన్లు ఉంటాయి. వీటినుంచి వచ్చే పొగ.. గాల్లో చేరుతుంది. గంటల తరబడి అలాగే నిలిచి ఉంటుంది. ఇక, తలుపులు మూసి... పిల్లలు ఇంట్లో లేనప్పుడు ధూమపానం చేయాలనుకోవడం కూడా పొరబాటు. ఇంట్లో నిలిచిన పొగ తాలూకు దుమ్ము, దుప్పట్లు, సోఫాల కవర్లు.. పరదాల్లో చేరుతుంది. అవి విషపూరితాలుగా మారతాయి. నెమ్మదిగా శరీరంలోకి చేరతాయి. అందుకే ఇంటికి దూరంగా ధూమపానం చేయడం అన్ని విధాలా మంచిది.

ఇంట్లో యాష్‌ ట్రేలు పెట్టుకుంటే.. సమస్య ఉండదు అనుకోవడం సరికాదు. వాటిని ఎప్పటికప్పుడు యాంటీసెప్టిక్‌ సుగుణాలున్న ద్రావణంతో శుభ్రపరచాలి. అలాగే ఆ బూడిదను ఇంటికి కాస్త దూరంగా పారేయాలి.

పొగ కేవలం గాలినుంచి.. శరీరంలోకి చేరుతుందనుకోవడం పొరబాటు. దుస్తులు, చర్మం, జుట్టులోనూ ఉండి.. ఆ తరవాత శరీరంలోకి చేరుతుంది. అందుకే ధూమపానం చేసేవాళ్లు, ఆ తరవాత దుస్తులు మార్చుకోవాలి. చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పసి పిల్లలపై దుష్ప్రభావం పడకుండా ఉంటుంది.

ధూమపానం అలవాటున్న వారు ఆ తరవాత.. తప్పనిసరిగా నోరు శుభ్రం చేసుకోవాలి. మౌత్‌వాష్‌ వాడితే మరీ మంచిది. ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్నా.. చిన్నారులకు ఇబ్బంది కలుగుతుంది. ధూమపానం చేస్తూ, ఆ వెంటనే పిల్లల్ని దగ్గరకు తీసుకోకూడదు. నేరుగా కన్నా పరోక్షంగా చేరే పొగ వల్ల నాలుగు రెట్లు అధిక సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాల్లో తేలింది. దానివల్ల బ్రెయిన్‌ ఫీవరు లాంటి రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా చిన్నారుల శరీరంలో సులువుగా చేరుతుందంటున్నారు నిపుణులు.

కార్లలో ప్రయాణించినప్పుడూ ఈ సమస్య ఎదురవుతుంది. ఇంట్లో వెలువడే పొగ కన్నా ఇది 23 రెట్లు విషపూరితమని పరిశోధనలు తేల్చిచెప్పాయి. కిటికీ తలుపులు వేసి ఉంచడం, పొగను అధికంగా పీల్చకుండా ముక్కుకి పలుచటి వస్త్రం చుట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంట్లో పిల్లలెదురుగా ధూమపానం చేయకపోవడం వల్ల భవిష్యత్‌లో కనీసం 39 శాతం మంది చిన్నారులు ఆ అలవాటుకు దూరంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, December 4, 2010

మైక్రో నూట్రియంట్ల ప్రాధాన్యం -ఆరోగ్యము , Micro-nutrients and health



సూక్ష్మ పోషకాలు --

    మన శరీరానికి అతి సూక్ష్మమైన మోతాదులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను 'సూక్ష్మ పోషకాలు ' అంటారు. వ్యాధులతో పోరాడటానికి, అంటు వ్యాధులు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు అవసరం. అంతేగాక మనం తీసుకొనే అహారం చక్కగా జీర్ణమై, శక్తిని యివ్వడానికి ఇవి తోడ్పడతాయి. ఆరోగ్య పరిరక్షణ, దీర్ఘాయువుకు ఇవి చాల అవసరం.

కనిపించినవన్నీ తింటున్నాం.. కావాల్సినంతే తింటున్నాం. మన ఆరోగ్యానికి ఏం 'తక్కువ'! అని బిందాస్‌గా ఉంటారు అనేకమంది. కానీ 'తక్కువ' మొత్తంలో తీసుకోవాల్సినవి ఆరోగ్యంలో అతి కీలకమైనవి అయిన మైక్రోన్యూట్రియంట్లని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పసి పిల్లలకు, గర్భిణులకు ఎంతో అవసరం అయిన ఆ మైక్రో నూట్రియంట్ల ప్రాధాన్యం గురించి. విటమిన్లు, ఖనిజ లవణాలనే మైక్రోన్యూటియంట్లు అంటాం. మన వాతావరణానికి ముఖ్యంగా కావాల్సిన మైక్రోన్యూట్రియంట్లు ఇనుము, జింకు, అయోడిన్‌, కాల్షియం, విటమిన్‌ఎ, విటమిన్‌సి. మైక్రోన్యూట్రియంట్లలోని.. కీలకమైన ఖనిజ లవణాలు, విటమిన్లు అధిక మోతాదులో శరీరానికి అవసరం లేదు. కానీ ప్రధానమైనవి కొద్ది కొద్దిగా అందితే సరిపోతుంది. ఎదిగే పిల్లలకు ఈ మైక్రోన్యూట్రియంట్లు చాలా అవసరం. చిన్నారులు, కౌమార దశలోని అమ్మాయిల్లో ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. వారికి తగిన మొత్తంలో విటమిన్లు, ఖనిజ లవణాలు లభించనప్పుడు చురుకుదనం లోపిస్తుంది. నీరసానికి లోనవుతారు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత వంటి సమస్యలతో బాధపడతారు.

ఆరోగ్యానికి ఇవన్నీ...
నిత్యం తీసుకొనే ఆహారంలో ప్రధానంగా అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు, దంపుడు బియ్యం వంటి గింజ, తృణ ధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి. తాజాగా ఉండే ఏ పండ్లనయినా నిత్యం తీసుకుంటూ ఉండటం చాలా అవసరం. అలాగే మాంసకృత్తులు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందులోకి గుడ్డు చేప, చికెన్‌ వస్తాయి. అవి తినని వారు పాలు, పనీర్‌, చీజ్‌ వంటివి ఎంచుకోవచ్చు. వీటినుంచి శరీర అవసరాలకు సరిపడే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. అన్నింటిని కొంచెం కొంచెం చేర్చుకొన్నా శరీరానికి ఏ లోపాలు ఉండవు.
మైక్రోన్యూట్రియంట్లలోని.. కీలకమైన ఖనిజ లవణాలు, విటమిన్లు అధిక మోతాదులో శరీరానికి అవసరం లేదు. కానీ ప్రధానమైనవి కొద్ది కొద్దిగా అందితే సరిపోతుంది.

ఉపయోగాలు :

  • ఆరోగ్యంగా ఉండటానికి,
  • రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి,
  • రక్తహీనత రాకుండా ఉండడానికి ,
  • మధుమేహం వంటి వ్యాధులు అదుపులో ఉండడానికి ,

కొన్ని ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్స్ (ఖనిజ లవనాలు +విటమిన్లు )-- జింక్‌,ఇనుము , అయోడిన్ , అయోడిన్ , క్యాల్షియం , విటమిన్‌-ఎ, విటమిన్‌ - సి
------------
జింక్‌:
జింక్ లబించే ఆహారపదార్హాలు -> ధాన్యం, పన్నీర్‌, వేరుశనగ గింజలు ఎండుకొబ్బరి, బాదం, ఆవాలు, రాజ్‌మా బుట్టమిర్చి, పొట్టుతో ఉన్న సెనగలు, సజ్జలు, గుడ్డు పచ్చసొన, చిక్కుడు గింజలు,
పాలకూర, .......................మొదలైన వాటిలో జింక్‌ లభిస్తుంది. మొలకెత్తిన గింజలైతే మరీ శ్రేష్టం.

ఉపయోగము :
రోగనిరోధక శక్తికి జింక్‌ బాగా ఉపయోగపడుతుంది.

ఇనుము :
ఇనుము లబించే ఆహారపదార్హాలు -> గోధుమ, సజ్జ, రాగులు, వేయించిన సెనగలు, అలసందలు, తోటకూర, వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది. పప్పుదినుసులు, జీడిపప్పు (తక్కువమోతాదులో), గుడ్డులోని పచ్చసొన, తాజా ఆకుకూరలు, చిక్కుడు గింజలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్స్‌, పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుంది.

ఉపయోగము :
రక్తం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.

అయోడిన్‌:
అయోడిన్ లబించే ఆహారపదార్హాలు -> అయొడైజ్డ్‌ చేసిన ఉప్ప, కల్లుప్పు, కాడ్‌లివర్‌ నూనె, వెల్లుల్లి, పుట్టగొడుగులు, పులస చేప, సముద్ర ఆహారం.

ఉపయోగము :
ఇది ప్రధానంగా థైరాయిడ్‌ గ్రంథిని నియంత్రణలో ఉంచుతుంది.

క్యాల్షియం:
లబించే ఆహారపదార్హాలు -బాదం, బ్రకోలీ, క్యాబేజీ, చీజ్‌, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు, ఓట్లు, సోయాబీన్స్‌ నుంచి లభిస్తుంది.

ఉపయోగము :
ఎముకల పటుత్వానికి, నరాలు చురుగ్గా పనిచేయడానికి ఇది ఉపకరిస్తుంది.

విటమిన్‌ ఎ:

        కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్  ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది.
        విటమిన్ ఎ ప్రాముఖ్యత   :

            సాధారణ కంటిచూపునకు విటమిన్ - ఎ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి, ఇతర చిక్కులకు దారితీస్తుంది.
            మహిళలు గర్భవతులుగా ఉన్నప్ఫుడు, అంతకన్నాముందు కూడా విటమిన్ ఎ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కానుపు సమయంలో ఎదురయ్యే వ్యాధులను,మృత్యువు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
            విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వార ఈ లోపాన్ని నివారించవచ్చు.

        విటమిన్ ఎ ఎక్కువగా ఉండే అహార పదార్ధాలు :

            ఆకుకూరలు, పసుపురంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ మూలకం) సమృద్ధిగా ఉంటుంది.
            బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ముఖ్యంగా మంసాహారంలోనే ఇది లభిస్తుంది.
            పాలు, పాలతో చేసే పదార్ధాలు, గుడ్డులోని పచ్చని సొన, ఎర్రపామాయిల్, చేపలు, చేపనూనెల్లో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

        వివిధ ఆహార పదార్ధాలలో బీటా-కెరోటిన్ పరిమాణం


ఆహార పదార్ధం పేరు
ప్రతి 100 గ్రాముల్లో లభించే బీటా కెరోటిన్ (మై.గ్రాములు)
కొత్తిమీర
4800
కరివేపాకు
7110
మునగాకు
19690
మెంతికూర
9100
క్యారట్టు
6460
మామిడి పండు
1990
బొప్పాయి పండు
880

  గుమ్మడికాయ  1160



విటమిన్‌ సి :

    శరీర ఆరోగ్యానికి ప్రధానమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ - సి ఒకటి. ఇది యాంటీ- ఆక్సిడెంట్ గుణం కలది. విటమిన్ సి లోపించినవారు స్కర్వి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి గలవారు శరీరమంతా నీరసంతో, పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ, ఎముకల ఎదుగుదల లేక బాధ పడతారు. గాయాలను మానపటానికి కొన్ని రకాల హార్మోన్ల మేళవింపునకు విటమిన్ సి సహాయపడుతుంది. అమినో యాసిడ్, కార్బో హైడ్రేట్లు (పిండిపదార్ధాలు) జైవికక్రియకు, అహారంలోని ఇనుముధాతువు శరీరంలో ఇమిడిపోవడానికి కూడా తోడ్పడుతుంది.
    విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు :-నారింజ, ఉసిరి, నిమ్మకాయ లాంటి పులుపు పండ్లు అన్నిటిలోను విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా తీసుకొనే టమాటా, జామపండ్లు మొలకెత్తిన పప్పు ధాన్యాలు కూడా విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తాయి.

ఉపయోగము :
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా మానడానికి విటమిన్‌ సిను ఇస్తారు.
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, December 2, 2010

పొట్ట లో కొవ్వు పెరుగుదల-అనర్దాలు ,Abdominal(Belly)fat-disadvantages

  •  
[Obesity+belly.jpg]


  •  
బొజ్జ : వయసు మీద పడుతున్న కొద్దీ పొట్ట కూడా పెరగటం సహజమే. పురుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ ఇది ఎంతోమంది స్త్రీలకు పెద్ద సమస్యగానే పరిణమిస్తుంది. శరీరాకృతినే మార్చేసి మరింత వయసు ముదిరినట్టు చేస్తుంది మరి. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. అలాగని బాధ పడుతూ కూచోకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలు చేయటంతో దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.

సైనికులు , పోలీసులు ప్రతి రోజూ కవాతు చేస్తారు . సైనికుల్లో ఎవరికైనా పొట్ట ,బొజ్జ రావడము చూడము కాని కొంతమంది లేకా పోలీసులందరికీ బొజ్జ కనబడుతూ ఉంటుంది. కారణము వారి శిక్షణ , ఆహార నియమావళి , క్రమబద్ధమైన వ్యాయామము .

ఎందుకొస్తుంది?


వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదూ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్‌ అనంతరం చేతులు, కాళ్లు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా బొజ్జ పెరుగుతున్నా ప్రమాదకరమే.

కొలుచుకుంటే సరి

ఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టుకొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు. దీన్ని ఎలా చూడాలో తెలుసా?

* ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపుని చుట్టండి.
* శ్వాస మామూలుగా తీసుకోండి. కడుపుని లోపలికి పీల్చొద్దు.
* చర్మం నొక్కుకుపోయేలా టేపుని మరీ బిగుతుగా కూడా బిగించరాదు.
* నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే అదుపులోనే ఉన్నట్టు.
* 35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందనే అర్థం.

తగ్గించుకునేదెలా?

కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు.

* వ్యాయామం: బొజ్జను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది వారి శారీరక శ్రమ, పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి.

* ఆహారం: ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలు గల పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌, శుద్ధిచేసిన పాస్తాలకు బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతో పాటు కేలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.
పొట్తను (కొవ్వును) తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలు :
  • గుడ్డులోని తెల్లసొన ,
  • అన్ని రకాల పండ్లు ,
  • పచ్చిగా తినగలిగే కాయకూరలు ,
  • ఆవిరిమీద ఉడికే కాయకూరలు ,
  • యాపిల్ పండ్లు ,
  • కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు ,


* పొట్ట కండరాలను దృఢ పర్చటం: మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో బొజ్జ తగ్గకపోతుంటే.. పొట్ట కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు అనుసరించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్ఠం చేయటంపై దృష్టి సారించాలి.

* హర్మోన్‌ చికిత్స: అరుదుగా కొందరికి మెనోపాజ్‌ అనంతరం హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకోవటం కూడా ఉపయోగపడుతుంది.

అనర్థాలు--బొజ్జ మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. అవి--
  •  గుండె జబ్బులు
  •  రొమ్ము క్యాన్సర్‌
  •  మధుమేహం
  •  జీవక్రియల అస్తవ్యస్తం
  •  పిత్తాశయ సమస్యలు
  •  అధిక రక్తపోటు
  •  పెద్దపేగు క్యాన్సర్‌

పొట్ట వద్ద పేరుకునే కొన్ని కొవ్వు కణాలు ఇన్స్‌లిన్‌ నిరోధకతను ప్రేరేపించే హార్మోన్లనూ ఉత్పత్తి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది మున్ముందు మధుమేహానికి దారి తీయొచ్చు. మరికొన్ని కణాలు మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది.

బొజ్జ తగ్గించుకునే కొన్ని చిట్కాలు :

అల్పా హారము తప్పనిసరి ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తీసుకోవడము తప్పనిసరి . ఉదయము ఎమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించుకోవడమే. ఉదయము నిండి సాయంత్రమువరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది . . . ఆ అల్పాహారమే . అల్పాహారమువలన శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి .

ఉప్పు తగ్గించాలి : ఎవరైతే  తక్కువ ఉప్పు తింటారొ వారు లవెక్కరు . ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిలవా చేసే గుణము ఉన్నది . ఫలితము వా బరువు పెరుగుతారు .చలాకీతనము తగ్గుతుంది. అందుకే రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.

మూడు పూట్లా తినండి : బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరము . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి . ఆ తినే ఆహారము విషయము లో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.

నడక అవసరము : నదక సహజ వ్యాయామము . ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడాల్సిందే . 1.5 కిలోమీటర్లు పావుగంట కాలము లో వేగము గా నడిచేవిధముగా సాధనచేయాలి . రోజుకు సుమారు 3 కి.మీ నడిస్తే మంచిది.

ఎత్తుపల్లాల్లో పరుగు : కాళ్ళకు బలాన్నిస్తుంది పరుగు . కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండలమీదికి నడక , పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదము నేలమీద తాకే సమయము బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు దోహదపడుతుంది . గుండెజబ్బులున్నవారు కొండలెక్కడము మంచిది కాదు .

వేపుళ్ళు వద్దు : రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు .. కాని ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు . ఉడికించిన కూరలు తింటేనే శరీరరూపము మెరుగ్గా ఉంటుంది. కాబట్టి కూర లన్నింటినీ సగం మేర ఉడికించి తర్వాత కొంద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.

సాయంకాల సమయ ఆహారము : సాయంకాలము లో ఏదో ఒకటి తినాలి . ఆకలి తో ఉండకూడదు . ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్ , నూడిల్స్ , కురుకురేల వంటివి అస్సలు తినకూడదు .

నీరు బాగా త్రాగాలి : నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు శరీరానికి అవసము . తగినంత ఉంటే ఆలోచనలు స్పస్టముగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడము లో అటు ఇటు అవ్వదు .

శ్వాసతీరు  మార్చుకోవడము : సైనికులకు శ్వాస వ్యాయామము ప్రత్యేకము గా చేయిస్తారు. శ్వాసక్రియను చాతీకి పరిమితం చేయక  కిందనున్న పొట్టను పైకిలాగుతూ శ్వాసను పీల్చి వదలడము చెయ్యాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి . ఉదరబాగముతో కలిపిన శ్వాసక్రియవల్ల శరీర రూపములో మార్పువస్తుంది . పొట్ట లోపలికి పోతుంది.

బరువుతో పరుగు : పరుగు చ్క్కని వ్యాయామము . అయితే పొట్ట బాగ తగ్గాలంటే వీపుకు ఏధనా బరువును కట్టుకొని పరుగెట్టడము మంచిది. సైనికులు తమ అవసరాలకు సంబంధించిన సామానులతో కూడిన సంచి వీపుకు తగిలించుకొని పరిగెడు తుంటారు దీనివలన కొవ్వు కరిగిపోతుంది. కొత్తగాకొవ్వు చేరనివ్వదు .

పరుగు తీరు : మేము ప్రతిరోజూ పరిగెడుతున్నాము . . . కాని శరీరములో మార్పు కనిపించడము లేదంటారు. పరిగెత్తేటపుడు త్లల ఎత్తి ఉంచాలి . ముందుకు చూస్తూఉండాలి . వీపును వెనక్కి నెట్టినట్లుగా , మోచేతులు శరీరానికి పక్కగా ఉంచి పరుగెత్తాలి .దీనివల్న పరుగు వేగము అందుకుంటుంది ... కొవ్వు కరిగే అవకాశాలు ఎచ్చువ అవుతాయి.

తగినంత నిద్ర : నిద్ర వలన రెండురకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసటనుండి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. కొవ్వు అదనము పేరుకుపోయి ఇబ్బంది కలిగిస్తుంది.

వ్యాయామములో మార్పు : ఒకే తరహా కసరత్తు నెలల తరబటి చేయకుండా రకరకాల పద్దతులలో వ్యాయామము మార్చి చేస్తూ ఉండాలి .దీనివలన కొత్త ఉత్సాయము , కొత్త లాబాలు శరీరానికి చేర్చిన వారవుతారు.

రిలాక్ష్ అవ్వాలి : నిరంతము టెన్సన్‌ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారము అధికము గా తీసుకుంటారు. వారి హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎల్లప్పుడు పని ఒత్తిడిలో ఉండకూడదు . వీరు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ నే తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. . . ఇవి కొవ్వును అధికం చేస్తాయి.


  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Benign Prostatic Hypertrophy(BPH),ప్రోస్టేట్ గ్రంధి వాపు




ప్రోస్టేటు గ్రంథి.. మలి వయసు పురుష లోకంలో కలవరాన్ని పెంచుతోంది! వయసులో ఉన్నంత కాలం వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించే ఈ గ్రంథి.. మలివయసుకు దగ్గరవుతున్నకొద్దీ కొద్దికొద్దిగా ఉబ్బటం ఆరంభమవుతుంది. అది సహజం! దానివల్ల మూత్రం ఆపుకోలేక పోవటం, వెళ్లినా ఇంకా లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలు మొదలవ్వటమూ అంతే సహజం. దీన్నే 'బీపీహెచ్‌' అంటారు. ఈ బాధలు, ఇబ్బందులు తప్పించి ఇదేమంత ప్రమాదకరమైంది కాదు. కానీ... కొద్దిమందిలో మాత్రం దాదాపు ఇవే లక్షణాలతో.. పూర్తిగా ఇదే తీరులో.. ప్రోస్టేటు క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు! దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేదు. కాబట్టి మలివయసులో మూత్ర సమస్యలు వేధిస్తున్నప్పుడు తక్షణం వైద్యులకు చూపించుకోవటం.. అది క్యాన్సర్‌ కాదని స్పష్టంగా నిర్ధారణ చేయించుకోవటంచాలా ముఖ్యం. ఒకవేళ క్యాన్సర్‌ అయితే ఎలా ఎదుర్కోవాలన్నదీ అంతే ముఖ్యం.

పౌరుష గ్రంథి.. అస్థీల గ్రంథి.. ప్రోస్టేటు గ్రంథి.. ఇలా పేరు ఏదైనా అది పురుషులకు అత్యంత కీలకమైన గ్రంథి! మూత్రాశయం కిందే... పెద్ద ఉసిరికాయ ఆకారంలో.. మూత్ర మార్గం చుట్టూ ఆవరించి ఉండే ఈ గ్రంథి.. వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది.సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు.. ఈ ప్రోస్టేటు గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే 'వీర్యం' రూపంలో బయటకు వస్తుంటాయి. ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది.కానీ పురుషులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఇది పెద్దదిగా ఉబ్బటం.. ఫలితంగా మూత్ర విసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తటంచాలా సహజ పరిణామంగా మారింది. దీన్నే 'బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా(బీపీహెచ్‌)' అంటారు. ఇది ఇబ్బంది పెట్టేదేగానీ ప్రమాదం తెచ్చిపెట్టేది కాదు. కానీ సరిగ్గా ఇదే వయసులో... ఇదే లక్షణాలతో ప్రోస్టేటు గ్రంథిలో క్యాన్సర్‌ కూడా ఆరంభం కావచ్చు. ఈక్యాన్సర్‌ పాశ్చాత్య దేశీయులతో పోలిస్తే మన ఆసియా వాసుల్లో తక్కువేగానీ.. మన దగ్గర దీనిపై సరైన చైతన్యం, దీన్ని ముందుగా గర్తించే స్క్రీనింగ్‌ పరీక్షలపై అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది దీన్ని బాగా ముదిరిపోయిన తర్వాతగానీ గుర్తించలేకపోతున్నారు.అప్పటికే క్యాన్సర్‌ ప్రోస్టేటు గ్రంథిని దాటిపోయి.. ఎముకలకు ఇతరత్రా అవయవాలకు పాకిపోతోంది. ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకూ నయం చేసే, సమర్థంగా నియంత్రించే చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే మలివయసులో మూత్ర విసర్జనలో బాధలు ఎదురవుతున్నప్పుడు తప్పకుండా అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేయించుకోవటం అవసరం.
ఎవరికి ఎక్కువ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వృద్ధుల్లో ఎక్కువ. 40 ఏళ్ల లోపు వారిలో అరుదు. బ్యాటరీ పరిశ్రమల్లో కాడ్మియం ప్రభావానికి లోనయ్యే వారిలోనూ ఎక్కువ. ఇది ఎందుకొస్తుందో స్పష్టమైన కారణమేదీ తెలియదు. కానీ తలసరి కొవ్వు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదీ ఎక్కువ. మన దేశంలో మిగతా క్యాన్సర్లతో పోలిస్తే ఇది అరుదే అయినా సంపన్న, పట్టణ వర్గాల్లో, కొవ్వు ఎక్కువగా తినే వారిలో ఎక్కువగా కనబడుతోంది.

లక్షణాలేమిటి: ప్రోస్టేట్‌ క్యాన్సరుకంటూ ప్రత్యేకమైన లక్షణాలేమీ లేవు. వయసుతో వచ్చే 'బీపీహెచ్‌' సమస్యలో ఉన్నట్టే దీనిలోనూ- తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, బొట్లుబొట్లుగా వస్తుండటం, మూత్రాన్ని ఆపులేకపోవటం వంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను వయసుతో సహజంగా వచ్చే 'బీపీహెచ్‌'వే అని కొట్టిపారెయ్యకుండా క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకోవటం అవసరం. తొలిదశలోనే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సూచనలు మనకు 'పీఎస్‌ఏ' పరీక్షలో అందుతాయి. క్యాన్సర్‌లో మరింత ఎక్కువగా పెరుగుతుంది. సమస్య నిర్ధారణలో ఈ పరీక్ష అత్యంత కీలకమైనది.

గుర్తించేదెలా: 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పురుషుడూ ఏటా 'పీఎస్‌ఏ' పరీక్ష చేయించుకోవటం చాలా అవసరం. ఈ 'పీఎస్‌ఏ' పెరుగుదల ఎక్కువగా ఉంటే క్యాన్సరేమోనని అనుమానించటం శ్రేయస్కరం. దీనితో పాటు వైద్యులు మలద్వారం గుండా వేలు పెట్టి.. ప్రోస్టేటు గ్రంథిని నొక్కి చూస్తారు. దీన్నే 'డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌' అంటారు. ఇలా నొక్కినప్పుడు ఈ గ్రంథి పెద్దగా అవటమేకాదు, క్యాన్సర్‌ సోకితే అది చాలా గట్టిగా కూడా తగులుతుంది. దీంతో క్యాన్సర్‌ అనుమానం బలపడుతుంది. ప్రోస్టేటు క్యాన్సర్‌ను కచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు ప్రోస్టేటు గ్రంథి నుంచి ముక్కతీసి పరీక్షించే 'బయాప్సీ' ఒక్కటే మార్గం. అయితే దీన్ని ఎవరికి, ఎప్పుడు బయాప్సీ చెయ్యాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి.

'పీఎస్‌ఏ' కీలకం!
'పీఎస్‌ఏ' రక్తపరీక్ష ముఖ్యంగా ప్రోస్టేటు గ్రంథి స్వభావాన్ని చెప్పే పరీక్షేగానీ.. క్యాన్సర్‌కు ప్రత్యేకించింది కాదు. కాబట్టి ఇది మనం బలంగా అనుమానించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. 'పీఎస్‌ఏ' మోతాదు పెరిగితే క్యాన్సర్‌గా అనుమానించాలి, నిర్ధారించుకునేందుకు ఇతర పరీక్షలు చెయ్యాలి. పీఎస్‌ఏ సాధారణంగా వయసును బట్టి 0-4 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ మధ్య ఉంటుంది. వయసును బట్టి ఇది ఆ లోపు ఉంటే ఫర్వాలేదు. ఏ వయసు వారికైనా 'పీఎస్‌ఏ' 10 నానోగ్రామ్స్‌/ఎంఎల్‌ కంటే ఎక్కువుంటే తక్షణం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉందేమో తెలుసుకునేందుకు గ్రంథి నుంచి ముక్క తీసి (బయాప్సీ) పరీక్ష చేయాలి. ఒకవేళ పీఎస్‌ఏ 4-10 మధ్య ఉంటే అప్పుడు బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించటం కీలకం. అందుకు పీఎస్‌ఏ డెన్సిటీ, పీఎస్‌ఏ వెలాసిటీ, ఫ్రీ పీఎస్‌ఏ.. వంటి ఇతర పరీక్షలు మనకు కీలక సమాచారాన్నిఅందిస్తాయి. వాటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. వాటి గురించి వివరంగా..

వయసు: పీఎస్‌ఏ స్థాయి ఎంత ఉండొచ్చన్న దానికి వయసు ప్రాతిపదిక. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కూడా పెరుగుతుంటుంది. ఉదాహరణకు 40-49 ఏళ్ల వారిలో 0-2.5 ఉంటే నార్మల్‌. అంటే 45 ఏళ్ల వ్యక్తికి పీఎస్‌ఏ 4 ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థం. అదే 75 ఏళ్ల వ్యక్తికి 6.5 ఉన్నా కూడా దాన్ని మరీ తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి బయాప్సీ అవసరమన్నది నిర్ధారించటంలో ఇది ఒక కీలకాంశం.

పీఎస్‌ఏ డెన్సిటీ: వయసుతో పాటే ప్రోస్టేట్‌ గ్రంథి సైజూ పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి రక్తంలో పీఎస్‌ఏ స్థాయి... ప్రోస్టేట్‌ గ్రంథి సైజుకు అనుగుణంగానే పెరిగిందా? ఇంకా ఎక్కువగా పెరిగిందా? అన్నది తెలుసుకోవటం దీని ఉద్దేశం.

పీఎస్‌ఏ వెలాసిటీ: ఇది కొంత క్లిష్టమైన లెక్క. ఏడాదికి ఒకసారి పీఎస్‌ఏ చెయ్యాలి. కాలక్రమేణా అది ఏ రేటులో పెరుగుతోందన్నది లెక్కించాలి. ఇది కూడా ముఖ్యమే

ఫ్రీ పీఎస్‌ఏ: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే.. 'టోటల్‌ పీఎస్‌ఏ' ఎక్కువుంటుంది.. కానీ దానిలో 'ఫ్రీ పీఎస్‌ఏ' అన్నది తగ్గుతుంటుంది. దీన్ని బట్టి కూడా అనుమానించటం అవసరం. వీటన్నింటి ఆధారంగా బయాప్సీ అవసరమా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారిస్తారు.
*
ప్రోస్టేట్‌ గ్రంథి వాపులో, సిస్టోస్కోపీ తర్వాత, ప్రోస్టేట్‌ గ్రంథి బయాప్సీ తర్వాత ఆరు వారాల వరకూ కూడా పీఎస్‌ఏ స్థాయి పెరిగే ఉంటుంది, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి పీఎస్‌ఏ పెరిగిందంటే ఇవన్నీ చూడటం అవసరం.
* అలాగే క్యాన్సర్‌ బాధితుల్లో ఓ 10% శాతం మందిలో పీఎస్‌ఏ మోతాదు పెరగకుండానూ ఉండొచ్చు. కానీ వీరిలో లక్షణాలుంటాయి. కాబట్టి లక్షణాలు బలంగా, తీవ్రంగా ఉన్నప్పుడు బయాప్సీకి వెళ్లటం ఉత్తమం.

ఇతర పరీక్షలు
బయాప్సీలో క్యాన్సర్‌ ఉందని నిర్ధారణ అయితే.. వెంటనే ఆ క్యాన్సర్‌ ఏ స్టేజ్‌లో ఉన్నదీ తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌/ఎమ్మారై బాగా ఉపయోగపడతాయి. కణితి ఎక్కడుంది? అది గ్రంథిని దాటి బయటకు వెళ్లిందా? శుక్రాశయాలకు (సెమినల్‌ వెసికిల్స్‌) కూడా పాకిందా? వంటివన్నీ సీటీ స్కానింగులో తెలుస్తాయి.
* స్పష్టమైన కారణమేంటో తెలియదుగానీ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుంటుంది. కాబట్టి వీరికి 'బోన్‌ స్కాన్‌' కూడా అవసరం. బోన్‌ స్కాన్‌లో క్యాన్సర్‌ ఆనవాళ్లు కనబడుతున్నాయంటే వ్యాధి బాగా ముదిరిన దశకు వెళ్లిందనే అర్థం.

గ్లీసన్స్‌ స్కోర్‌
ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ స్వభావం ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ అంచనా స్కోరు. బయాప్సీ పరీక్షలో క్యాన్సర్‌ కణాల రూపురేఖలను బట్టి ఈ గ్లీసన్‌ స్కోరు నిర్ధారిస్తారు. దీన్ని 2-4, 5-6, 7-10గా విభజిస్తారు. ఈ స్కోరు 2-4 ఉంటే క్యాన్సర్‌ తీరు చాలా నిదానంగా ఉందని (లోగ్రేడ్‌) అర్థం. దీంతో మరణించే అవకాశం 10 శాతం కన్నా తక్కువ. ఇదేమంత త్వరగా ఇతర భాగాలు వ్యాపించదు. కాబట్టి చికిత్స తీసుకుంటే దీనితో పెద్ద ఇబ్బంది లేకుండా జీవితం గడిపెయ్యచ్చు. ఇక స్కోరు 5-6 ఉంటే ఇది మధ్యస్థ రకం. దీనితో ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. ఇక స్కోరు 7-10 ఉంటే అది ఉధ్ధృత రకం. ఇది ప్రాణాంతకమైంది. వేగంగా లింఫ్‌గ్రంథులకు, ఎముకలకు వ్యాపించే రకం ఇది.
హార్మోన్ల చికిత్స కీలకం!
మన శరీరంలో పురుష హార్మోన్లను వృషణాలు ఉత్పత్తి చేస్తాయి, మూత్రపిండాల మీద ఉండే ఎడ్రినల్‌ గ్రంథులూ ఉత్పత్తి చేస్తాయి. రెంటినీ అడ్డుకోవటం అవసరం. మనం వృషణాలను తీసివెయ్యటం లేదా 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్స్‌' ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను అడ్డుకోవచ్చు. కానీ అడ్రినల్‌ గ్రంథుల నుంచి వచ్చే వాటిని మాత్రం వీటితో అడ్డుకోలేం. దానికోసం సిప్రోటిరాన్‌ ఎసిటేట్‌, లేదా ఫ్లూటమేట్‌ వంటి యాంటీ యాండ్రోజెన్‌ రకం మందులు (యాండ్రోబ్లాక్‌ మొ||) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెంటినీ ఇవ్వటాన్నే 'టోటల్‌ యాండ్రోజెన్‌ బ్లాకేడ్‌' అంటారు. ఇది 1980ల నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి కేవలం వృషణాలు తీసెయ్యటం లేదా ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌ ఇంజెక్షన్లు చెయ్యటమే కాకుండా.. ఈ 'యాంటీ యాండ్రోజెన్‌' మందులూ ఇవ్వటం అవసరం. ముఖ్యంగా- ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత తొలి రెండు వారాల్లో అవి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఆ తర్వాత అడ్డుకుంటాయి. ముందు 14 రోజుల పాటు 'యాంటీ యాండ్రోజెన్‌' బిళ్లలు ఇచ్చి.. ఆ తర్వాత ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్‌ ఇవ్వటం ఉత్తమం. ఒకవేళ ఇంజక్షన్లు కాకుండా వృషణాలు తీసివేసే ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటే నేరుగా, ఎప్పుడైనా దానికి వెళ్లొచ్చు. ఇదీ ఇప్పుడు ప్రామాణిక చికిత్స.
నివారించుకోలేమా?
ప్రోస్టేటు క్యాన్సర్‌ను నివారించుకోవటానికి కచ్చితమైన మార్గమేం లేదు. చిన్నతనం నుంచీ కొవ్వు తక్కువ తినటం మంచి అలవాటు. శాకాహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినటం ఉత్తమం. 50 ఏళ్ల నుంచీ ఏటా తప్పనిసరిగా 'పీఎస్‌ఏ' రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
చికిత్స ఏమిటి?
మొత్తానికి మూడు రకాలు: 1. తొలిదశ క్యాన్సర్‌. (ఎర్లీ) 2. గ్రంథిలోనే బాగా ముదిరిన రకం (లోకల్లీ అడ్వాన్స్‌డ్‌) గ్రంథి చుట్టూ, పక్కనే ఉండే శుక్రాశయాలకు పాకి ఉంటుంది. 3. గ్రంథి నుంచి బయటకు పాకి.. లింఫ్‌గ్రంథులు, ఎముకల వంటి ఇతరత్రా అవయవాలకు వ్యాపించిన రకం (మెటాస్టాటిక్‌)

1. తొలి దశ క్యాన్సర్‌
* క్యాన్సర్‌ ఇంకా గ్రంథిలోనే ఉంది కాబట్టి సర్జరీ చేసి గ్రంథి మొత్తాన్ని తొలగించటం (ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ) ఒక విధానం. లేదంటే రేడియేషన్‌ థెరపీ అయినా ఇవ్వచ్చు.

* గ్రంథిని, దానికి ఆనుకుని ఉన్న కణజాలాన్ని, లింఫ్‌గ్రంథులను పూర్తిగా తొలగించేందుకు కోతబెట్టి చేసే పద్ధతి లేదంటే కేవలం రంధ్రాలతోనే చేసే ల్యాప్రోస్కోపీ విధానాలను అనుసరించవచ్చు. కోతబెట్టి చేసే సర్జరీలతో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ల్యాప్రోస్కోపిక్‌ విధానాన్నే అనుసరిస్తున్నారు. పీఎస్‌ఏ 10 కంటే తక్కువ, గ్లీసన్‌ స్కోరు 6 కంటే తక్కువ ఉన్న వారికి సర్జరీతో మంచి ప్రయోజనం ఉంటుందని గుర్తించారు.

* సర్జరీతో... మొత్తమ్మీద ర్యాడికల్‌ ప్రోస్టెటెక్టమీ సర్జరీ వల్ల వచ్చే దుష్ప్రభావాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది- 4% మందిలో మూత్రం ఆపుకోలేని సమస్య; 30% మందిలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పొట్టలో ఒత్తిడి పెరిగినప్పుడు మూత్రం లీకవ్వటం, 4% మందిలో మూత్రమార్గం సన్నబడటం (స్ట్రిక్చర్స్‌), కొందరిలో అంగ స్తంభన సమస్యల వంటివి తలెత్తుతాయని గుర్తించారు. నాడులు ప్రభావితం కాకుండా చేసే సర్జరీ కూడా ఉంది. దానితో ఈ స్తంభన వంటి ఇబ్బందులేమీ లేకుండా చేసే వీలుంది. దీన్ని రోబో సహాయంతో చేసినప్పుడు దుష్ప్రభావాలు మరింత తక్కువగా ఉంటున్నాయి.

* రేడియేషన్‌తో.. ఇటీవలి కాలంలో ఇమేజ్‌ గైడెడ్‌ రేడియో థెరపీ(ఐజీఆర్‌టీ), ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్‌ రేడియో థెరపీ(ఐఎంఆర్‌టీ) వంటి వాటితో అధిక డోసుల్లో రేడియేషన్‌ను ఇవ్వటం సాధ్యపడుతోంది కాబట్టి.. ఇప్పుడు రేడియేషన్‌ థెరపీతో కూడా సర్జరీతో సరిసమానమైన ఫలితాలే ఉంటున్నాయి. అయితే రేడియేషన్‌ వల్ల- తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావటం, విసర్జలో మంట, పొత్తికడుపులో వాపు, వృషణాల తిత్తి వాపు వంటివి 20% వరకూ ఉంటున్నాయి. స్తంభన 40% మందిలో ఉంటుంది. పెద్దపేగు ప్రోస్టేటు గ్రంథి వెనకే ఉంటుంది కాబట్టి 5% మందిలో మలాశయం, మూత్రాశయం కూడా రేడిషన్‌ ప్రభావానికి గురవుతుంటాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని- ఇప్పుడు తొలిదశ క్యాన్సర్‌కు.. సర్జరీని తట్టుకునే ఆరోగ్యం, శక్తి ఉంటే ఏ వయసులోనైనా సర్జరీ చేయించుకోవచ్చు. లేదంటే రేడియేషన్‌ ఇవ్వచ్చు.

2. గ్రంథిలోనే ముదిరిన రకానికి..
* క్యాన్సర్‌ దశ, గ్లీసన్‌ స్కోరు, రోగి ఆరోగ్య స్థితిని బట్టి- వీరికి ముందుగా శరీరంలో హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యటం, ఆ తర్వాత గ్రంథిని సమూలంగా తొలగించే ర్యాడికల్‌ సర్జరీ లేదా రేడియేషన్‌ అవసరమవుతుంది. తర్వాత కూడా పీఎస్‌ఏ తీరును గమనిస్తుండాలి.

* హార్మోన్ల చికిత్స: ప్రోస్టేటు క్యాన్సర్‌ కణాలకు శరీరంలో తయారయ్యే హార్మోన్లే ప్రేరకాల వంటివి. కాబట్టి హార్మోన్లను అడ్డుకోవటం ముఖ్యం. ఈ హార్మోన్లు వృషణాల్లో తయారవుతాయి. అలాగే మూత్రపిండాలపైన ఉండే అడ్రినల్‌ గ్రంథుల్లోనూ తయారవుతాయి. వీటిని అడ్డుకోవటం ద్వారా క్యాన్సర్‌ను నిలువరించవచ్చు. వీరికి వృషణాల నుంచి వచ్చే హార్మోన్లను నిరోధించే 'ఎల్‌హెచ్‌ఆర్‌హెచ్‌ అనలాగ్‌' ఇంజెక్షన్లు ఇవ్వచ్చు. లేదా సర్జరీ చేసి రెండు వృషణాలనూ తొలగించవచ్చు. ఈ రెంటిలో ఏదైనా ఒకటి చేస్తే చాలు. కాకపోతే ఆ ఇంజెక్షన్లు ఖరీదైనవి, వాటిని ప్రతి 3 నెలలకు ఒకసారి జీవితాంతం చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికంటే ఒక్కసారే వృషణాలు తీసివేసే సర్జరీ తేలిక.

* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చేసిన తర్వాత.. ప్రోస్టేటు గ్రంథిని తొలగించే సర్జరీ, దానికి వీల్లేకపోతే రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్‌ మరికాస్త చుట్టుపక్కలకు కూడా పాకిందనిపిస్తే సర్జరీ తర్వాత రేడియేషన్‌ కూడా ఇస్తారు.

* హార్మోన్లను అడ్డుకునే చికిత్స చెయ్యగానే పీఎస్‌ఏ తగ్గిపోతుంది. కానీ తర్వాత కూడా ఆ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. పీఎస్‌ఏ పెరుగుతుంటే సమస్య ఊపిరితిత్తుల్లో, ఎముకల్లో మరెక్కడన్నా వస్తోందేమో చూసుకోవాలి.

3.ఇతర అవయవాలకూ పాకితే..
దురదృష్టవశాత్తూ మన దేశంలో 90% మంది ఈ దశలోనే గుర్తిస్తున్నారు. ఇది బాగా ముదిరిన దశ. కేవలం హార్మోన్లను నిరోధించే ఇంజెక్షన్లు లేదా వృషణాలను తీసివేసే సర్జరీ ఒక్కటే మార్గం. ఈ దశలో ఇరత్రా మార్గాలతో ప్రయోజనం ఉండదు. అయితే ఈ హార్మోన్ల ప్రభావం ఎవరికైనా 12-24 నెలల పాటు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్‌ కణాలు ఈ హార్మోన్లకు నిరోధకత పెంచుకుంటాయి. ఆ దశలో రకరకాల కీమోథెరపీ మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.

* ప్రోస్టేటు క్యాన్సర్‌ ఎముకలకు వ్యాపించిన వారందరికీ కూడా 'బిస్ఫాస్ఫనేట్స్‌' రకం మందులు ఇవ్వాలి. దీనివల్ల ఎముకల నొప్పి తగ్గి అవి దృఢతరమవుతాయి. చాలామందికి నడుము కింది వెన్నుపూసలు, పొత్తికడుపు ఎముకలు ప్రభావితమవుతాయి. అవసరమైతే ఆ ప్రభావితమైన ఎముకలకు రేడియేషన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
చికిత్స తర్వాత..?
క్యాన్సర్‌ ఎంత ముదిరింది, ఏ స్టేజిలో ఉంది, గ్లీసన్‌ స్కోరు ఎంత ఉందన్న దాన్ని బట్టి ఫలితాలుంటాయి. పీఎస్‌ఏ రెట్టింపు కావటానికి ఎంతకాలం పడుతుందన్నది కీలకమైన అంశం. దీన్నే 'పీఎస్‌ఏ డబ్లింగ్‌ టైమ్‌' అంటారు. త్వరగా రెట్టింపు అయితే.. దానర్థం క్యాన్సర్‌ బాగా ఉగ్రంగా ఉందని.

డా|| మోహన వంశీ- చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌- ఒమేగా హాస్పిటల్స్‌- హైదరాబాద్‌( సుఖీభవ)

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 28, 2010

పొట్టలో కలత-పేగు పూత ,Inflamatory Bowel Diseases






'పొట్ట' ఓ సంశయాల పుట్ట! ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది. మరోపూట తిన్నది అరిగినట్టనిపించదు. ఒక్కోరోజు ఎందుకో బరువుగా బిగువుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏదో మెలితిప్పుతున్నట్టు బాధ. లేదంటే లోపల ఏదో గడబిడ. విరేచనాలు పట్టుకుంటాయి. ఇలా పొట్టలో వచ్చే ప్రతి మార్పూ.. ఎందుకో, ఏమిటో అర్థంకాక మనసును విపరీతంగా తొలుస్తుంది. చిన్నాచితకా నొప్పులూ, బాధలూ.. సంశయాలూ, సంకోచాలూ సహజమే! వాటి గురించి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు.. ఎంతకీ వీడకుండా వేధిస్తూనే ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించటానికి లేదు. ముఖ్యంగా దీర్ఘకాలం విరేచనాలు వేధిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.

విరేచనాలు, కడుపు నొప్పి వంటి బాధలు దీర్ఘకాలం వేధిస్తున్నాయంటే పేగుల్లో తలెత్తుతున్న ఇబ్బందికర మార్పులేవో దానికి కారణం కావచ్చు. ముఖ్యంగా పెద్దపేగుల్లో తలెత్తే వాపు, పూత వ్యాధులు ఇటువంటి బాధలనే తెచ్చిపెడతాయి. వీటినే 'ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌' అంటారు. ఒకప్పుడు కచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక వీటిని 'అమీబియాసిస్‌' వంటి సమస్యలుగా భావించి ఏవేవో వైద్యాలు చేసేవారు. మన పొట్ట లోపల ఏం జరుగుతోందో, సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో పరిశీలించే వెసులుబాటు లేని రోజుల్లో ఈ రోగులు అనుభవించిన ఆవేదనకు అంతులేదు.

కానీ.. ఇప్పుడీ పరిస్థితి సమూలంగా మారిపోయింది. మన పొట్ట ఏమాత్రం మిస్టరీల పుట్ట కాదు! సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్‌ బెలూన్‌ ఎంటరోస్కోప్‌, క్రోమో ఎండోస్కోపీ వంటి వాటితో మన పేగులను ఆమూలాగ్రం, అణువణువూ క్షుణ్ణంగా పరీక్షించే సదుపాయం ఉందిప్పుడు. ఫలితంగానే పెద్దపేగుల్లో పూత, వాపు, పుండ్లు, క్షయ వంటి సమస్యలను ఇప్పుడు కచ్చితంగా నిర్ధారించి వైద్యం చెయ్యటం సాధ్యపడుతోంది. వైద్యరంగం సాధించిన అత్యాధునికమైన పురోగతి ఇది.

ఎవరికైనా సరే... 30 రోజులకు మించి విరేచనాలు వేధిస్తున్నాయంటే సమస్య కాస్త మొండిగా, దీర్ఘకాలికంగా మారిందని అర్థం. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా లోతుగా పరిశీలించటం చాలా అవసరం. ఒకప్పుడు ఈ దీర్ఘకాలిక విరేచనాల వంటి సమస్యలకు 'అమీబియాసిస్‌' వంటివి కారణమవుతున్నాయని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో పేగులను క్షుణ్ణంగా పరీక్షించటానికి అవసరమైన ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావటంతో దీర్ఘకాలికంగా విరేచనాల సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మందిని పరిశీలించినప్పుడు వారికి పేగు పూత, వాపు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌) ఉంటోందని బయటపడుతోంది. పేగుల్లో క్షయ కూడా ఎక్కువగానే కనబడుతోంది.

పెద్దపేగు పూత, వాపు రకరకాలుగా, ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. పెద్దపేగు లోపలి గోడలు ఎర్రగా వాచి.. పూసినట్లవటం, పుండ్లు పడటం.. వాటి నుంచి రక్తస్రావం అవుతుండటం.. వీటన్నింటినీ కలిపి పూత వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌)గా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాలు. 1. అల్సరేటివ్‌ కోలైటిస్‌. దీనిలో పేగుల్లో పూత, వాపుతో పాటు పేగుల గోడలకు పుండ్లు కూడా పడుతుంటాయి. కానీ ఇది చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది. 2. క్రాన్స్‌ వ్యాధి. దీనిలో ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు. ఇక ఈ రెండూ కాకుండా పేగుల్లో క్షయ (టీబీ) కూడా రావచ్చు. వీటన్నింటిలోనూ కూడా ముఖ్యంగా కనిపించే లక్షణాలు.. కడుపు నొప్పి, దీర్ఘకాలం విడవకుండా వేధించే విరేచనాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే పేగులు దెబ్బతిని.. తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. కాబట్టి విడవకుండా విరేచనాలు వేధిస్తుంటే తప్పనిసరిగా ప్రత్యేక నిపుణులైన వైద్యులను సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించుకుని, సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయించుకుని, చికిత్స తీసుకోవటం అవసరం.
.
లక్షణాలేమిటి?
* విరేచనాలు, రక్తం పడటం
* కడుపు నొప్పి
* జ్వరం, తీవ్ర అలసట
* బరువు తగ్గిపోవటం
* ఆకలి మందగించటం
* మలద్వారం చుట్టుపక్కల పుండ్లు

చాలామందిలో ఈ లక్షణాలు ఓ మోస్తరుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం తరచూ జ్వరం, రక్తంతో కూడిన విరేచనాలు, వికారం, భరించరాని కడుపు నొప్పి ఉంటాయి. అల్సరేటివ్‌ కోలైటిస్‌లో విరేచనాల బాధ ఎక్కువ, క్రాన్స్‌ డిసీజ్‌లో కడుపునొప్పి బాధ ఎక్కువ.
పేగులకే పరిమితమా?
ఎందుకలా జరుగుతుందో ఇప్పటి వరకూ స్పష్టమైన కారణం తెలియదుగానీ.. పేగుల్లో వాపు, పూత మొదలైనప్పుడు దీనివల్ల ఒంట్లోని ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా:

* కళ్లు ఎర్రబడి వాచటం, నొప్పి, అరుదుగా చూపు మందగించటం
* చర్మం మీద నొప్పితో బుడిపెలు, లేదంటే లోతుగా పుండ్లు పడటం
* మోకాలు కీళ్లు, వెన్నుపూసలకు ఆర్త్థ్రెటిస్‌ రావచ్చు. ముఖ్యంగా 'ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌' రకం వెన్ను బాధలు, ఎముకలు బోలుగా తయారయ్యే ఆస్టియోపొరోసిస్‌ ఎక్కువ..
* పైత్యరస నాళం మూసుకుపోవటం వంటి కొన్ని రకాల లివర్‌ సమస్యలు.
* ఈ పేగుల్లో వాపు, పూత బాధితుల్లో రక్తహీనత, కిడ్నీల్లో రాళ్ల బాధ ఎక్కువగా కనబడుతున్నాయి.
ఎందుకొస్తుందీ పూత?
పేగులకు వాపు, పూత వ్యాధులు ఎందుకు వస్తాయో కచ్చితంగా చెప్పటం కష్టం. జన్యుపరంగా, వంశంలో ఇంతకు ముందు ఉన్నవారికి రావచ్చు. ముఖ్యంగా క్రాన్స్‌ వ్యాధి ఇలా జన్యుపరంగా వచ్చేరకం. తల్లిపాలు లేకుండా పోతపాల మీద పెరగటం, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పేగుల మీద దాడి చెయ్యటం, పేగుల్లో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి రసాయనాల స్థాయులు ఎక్కువగా ఉండటం.. ఇటువంటివన్నీ దోహదం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి ఈ పూత వ్యాధులు రాకుండా ముందే నివారించుకోవటం కష్టం.
పరీక్షలు ఎందుకు?
కొంత కాలంగా విడవకుండా విరేచనాలు అవుతున్నప్పుడు లోతుగా పరీక్షించాల్సిన అవసరం ఏమిటి? అన్నది కీలకమైన ప్రశ్న. ఆ విరేచనాలకు కారణం పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటివి కారణమా? అన్నది ముందే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించి అవి ముదిరిపోకుండా చూడొచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రతరం కావటమే కాకుండా.. పేగులు మూసుకుపోవటం, లేదా పేగులు సన్నబడిపోవటం, ఆపరేషన్‌ చేసి పేగుల్లో ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కొన్నిసార్లు పెద్దపేగుల్లో ఈ పూత వ్యాధులు క్యాన్సర్‌కు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. కాబట్టి వీటిని సత్వరమే గుర్తించి, ముదరకుండా నియంత్రించటం చాలాచాలా అవసరమని గుర్తించాలి.
* ఆహారం: పేగు పూత బాధితులు సాధారణ ఆహారం తీసుకోవచ్చు. కొందరికి పాల పదార్థాలు ఇబ్బంది పెడతాయి, వారు వీటిని మానేస్తే మేలు. క్రాన్స్‌ వ్యాధి బాధితులు మాత్రం పీచు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

* గర్భం: పేగు వాపు తీవ్రంగా లేని మహిళలు గర్భం ధరించవచ్చు. తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు అబార్షన్లు, ముందే కాన్పు రావటం వంటివి జరగొచ్చు. కాబట్టి గర్భిణులకు బాధలు ఎక్కువైతే చికిత్సతో దాన్ని నియంత్రణలో పెట్టటం తప్పనిసరి.

ఇవీ సమస్యలు!

అల్సరేటివ్‌ కోలైటిస్‌
* ఏమిటి: పెద్దపేగు లోపల వాపు, పూతతో పాటు పుండ్లు కూడా పడతాయి. చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది.
* ఎవరికి: 1540 ఏళ్ల మధ్య వయసు వారికి ఎక్కువ. స్త్రీపురుషులు ఇరువురిలోనూ కనబడుతుంది.
* నిర్లక్ష్యంతో: చికిత్స తీసుకోకుండా దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం కావటం, పెద్దపేగు ఉబ్బిపోవటం, రంధ్రాలు పడటం, క్యాన్సర్‌ వంటి దుష్ప్రభావాలుంటాయి.
* చికిత్స: ఇది కొంతకాలం తగ్గుతూ, కొంతకాలం ఉద్ధృతమయ్యే రకం సమస్య. కాబట్టి దీర్ఘకాలం చికిత్స తప్పదు. దీనికి ప్రధానంగా మెసలాజైన్‌ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్‌ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు సిఫార్సు చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే కొంతకాలం స్టిరాయిడ్లు కూడా ఇచ్చి క్రమేపీ తగ్గించేస్తారు. పెద్దపేగు చివరి భాగం ప్రభావితమైతే మెసలాజైన్‌ లేదా స్టిరాయిడ్‌ ఎనిమాలు ఇవ్వాల్సి ఉంటుంది. మందులతో ప్రయోజనం లేని కొందరికి సర్జరీ చేసి.. ప్రభావితమైన ఆ పేగు భాగాన్ని తొలగించాల్సిన అవసరం కూడా వస్తుంది.

క్రాన్స్‌ వ్యాధి

* ఏమిటి: ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు.

* ఎవరికి: ఏ వయసులోనైనా రావచ్చు. 2030 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువ. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ. పొగతాగేవారికి ముప్పు ఎక్కువ.

* నిర్లక్ష్యంతో: పేగుల్లో ఈ సమస్య ఎక్కడ తలెత్తింది, ఎంత తీవ్రంగా ఉందన్నది ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే చిన్నపేగు మూసుకుపోవటం, మలద్వారం చుట్టుపక్కల చీము గడ్డలు, రంధ్రాలు పడటం, పేగులకు రంధ్రాలు పడటం, రక్తహీనత, పోషకాహార లోపం వంటివి ముంచుకొస్తాయి.

* చికిత్స: పూర్తిగా నయం చెయ్యటం కష్టం. కానీ పేగుల్లో వాపు, జ్వరం, విరేచనాల వంటివి తగ్గించి వ్యాధిని నియంత్రణలో పెట్టచ్చు. దీనికి వాపు తగ్గించే మెసలాజైన్‌ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్‌ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు, స్టిరాయిడ్లు సిఫార్సు చేస్తారు. వీటితో పాటు కొంచెం ఖరీదైనవే అయినా ఇన్‌ఫ్లిక్సిమాబ్‌ వంటి 'బయలాజికల్స్‌' రకం మందులతో చాలా ప్రయోజనం ఉంటోందని గుర్తించారు. అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌, విరేచనాలు తగ్గించే మందులూ, పోషకాహార లోపం ఉంటే విటమిన్‌ సప్లిమెంట్లూ తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సలతో ప్రయోజనం లేకపోతే సర్జరీ చేసి వాపు ఉన్న పేగు భాగాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలానికి ఆ పక్క భాగంలో మళ్లీ వాపు కనబడే ప్రమాదం ఉంటుంది.

పేగుల్లో క్షయ

పేగుల్లో క్షయ ఎవరికైనా రావచ్చు. మన దేశంలో మరీ ఎక్కువ. దీని లక్షణాలు చాలావరకూ పేగుపూత, వాపు లక్షణాల్లాగే ఉంటాయి. కాబట్టి దీన్ని ఐబీడీ నుంచి పూర్తి భిన్నంగా గుర్తించాల్సి ఉంటుంది. చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట ఎక్కువగా కనబడుతుంటుంది. నిర్ధారణ కచ్చితంగా చేసి.. వీరికి క్షయ మందులు వాడితే సంపూర్ణంగా తగ్గిపోతుంది.

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)
కొందరికి చూడటానికి పేగుల్లో ఏ లోపం ఉండదుగానీ పేగుల పని తీరు మాత్రం అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, కొంతకాలం మలబద్ధకం లేదంటే విరేచనాలు.. ఇలా వేధిస్తుంటాయి. దీన్ని నిర్ధారించుకోవటానికి పరీక్షలన్నీ చేసి, ఇతరత్రా పేగుపూత వంటి సమస్యలేవీ లేవని తేల్చుకోవటం ముఖ్యం. దీనితో నొప్పి, అలసట వంటివి తప్పించి తీవ్రమైన దుష్ప్రభావాలేమీ ఉండవు, లక్షణాలను బట్టి వైద్యం చేస్తారు.

గుర్తించేదెలా?
చాలావరకూ బాధితులు చెప్పే లక్షణాల ఆధారంగానే వైద్యులు వీటిని గుర్తించగలుగుతారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కూడా కొంత కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే వీటిని కచ్చితంగా నిర్ధారించుకోవటానికి కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా ఎండోస్కోపీకొలనోస్కోపీ పరీక్షల్లో నోటి ద్వారా లేదా మల ద్వారం గుండా కెమేరా గొట్టాన్ని లోపలికి పంపించి.. పేగుల్లో వాపు, పూత, పుండ్లు వంటివి ఉన్నాయేమో టీవీ తెర మీద స్పష్టంగా చూస్తారు. సమస్య క్రాన్స్‌ వ్యాధా? లేక అల్సరేటివ్‌ కోలైటిస్‌ వ్యాధా? ఈ రెండూ కాక క్షయ ఉందా? లేక పేగుల్లో ఏ సమస్యా లేకుండానే లక్షణాలు బాధిస్తున్నాయా? ఇవన్నీ కీలకమైన ఈ పరీక్షల్లోనే కచ్చితంగా నిర్ధారణ అవుతాయి.

ముఖ్యంగా: సిగ్మాయిడోస్కోపీ పరీక్షతో మలద్వారం, పెద్దపేగు చివరిభాగాలను పరీక్షించవచ్చు. కొలనోస్కోపీతో పెద్దపేగు మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించవచ్చు. అవసరమైతే అదే కెమేరా గొట్టంతో పేగుల నుంచి చిన్నముక్క తీసి (బయాప్సీ) పరీక్షకు పంపించవచ్చు. అలాగే 'డబుల్‌ బెలూన్‌ ఎంటరోస్కోపు'తో మొత్తం చిన్నపేగును తనిఖీ చెయ్యచ్చు. వీటిలో అవసరమైన ప్రాంతాన్ని టీవీ తెర మీద పెద్దగా చేసుకుని చూడటానికి, సమస్య ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా చూడటానికి మాగ్నిఫికేషన్‌, క్రోమోఎండోస్కోపీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి. పేగు పూత, వాపు సమస్యలను గుర్తించటంలో ఇవి కీలకమైన పరీక్షలు. సమస్య ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించటంలో 'బయాప్సీ' ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు బేరియం ఎనిమా వంటి మరికొన్ని పరీక్షలూ చేయవచ్చు. ఈ తరహా పూత, పూత సమస్యలను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. కానీ చికిత్సతో వాటిని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం.. బాధల నుంచి బయటపడటానికేకాదు, భవిష్యత్తులో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటానికి కూడా చాలా అసవరం.

-డా. కె.జగన్మోహనరావు, చీఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ ,నాగార్జున హాస్పిటల్‌, విజయవాడ.


  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 16, 2010

Knee-Pains , మోకాలి నొప్పులు.




  • --courtesy Surya news paper

సాధారణంగా 40 ఏళ్ళు పైబడిన వారిలో వచ్చే మోకాలి నొప్పి తాత్కాలిక ఉపశమనం కోసం వినియోగించే పెయిన్‌ కిల్లర్లు మరిన్ని వ్యాధులకు కారణం అవుతున్నాయి. 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే మోకాలి నొప్పి నివారణకు ప్రధానంగా పెయిన్‌ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండా మందుల షాపుల్లో అడిగి కొనుక్కోవడం, వాటిని వినియోగించడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స అధికం అవుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. మోకాలి నొప్పి సాధారణంగా సంబంధిత జాయింట్‌ల కింద ఉన్న ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, అరిగిపోవటం లేదా తీవ్ర గాయాలపాలయిన అనంతరం కూడా ఇవి ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దేశ జనాభాలో 15 మిలియన్ల మంది ఈ మోకాలి నొప్పి, ఊబకాయం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు. వీటికి తోడు ప్రమాదాల్లో గాయపడటం, స్థూలకాయం జీవన శైలి వంటి వాటితో నొప్పి తీవ్రతరం అయి కనీసం కూర్చోలేని, నిలుచోలేని పరిస్థితికి రోగులు చేరుతుంటారు. తాత్కాలిక పెయిన్‌ కిల్లర్స్‌ వీడితే ఇటువంటి వారికి ‘విస్కో సప్లిమెంటేషన్‌’ పేరిట కొత్త చికిత్సా విధానం అమలులోకి తీసుకు వస్తున్నారు.

మోకాలి నొప్పులకు విస్కోసప్లిమెంటేషన్‌

దీని ప్రకారం మోకాలి చిప్పలోపలి భాగంలో చెడిపోయిన ఫ్లూయిడ్‌ను మొత్తం తొలగించి తిరిగి అదే విధమైన కొత్త లిక్విడ్‌ను ఎక్కిస్తారు. దీనితో పాటు సంకోచ, వ్యాకోచ స్థితిగతులను నిత్యం వైద్యులు పరిశీలించడం వలన కొత్తగా ప్రకృతి తయారీ ఫ్లూయిడ్‌లను జొప్పించిన కారణంగా నొప్పి తగ్గి నడిచేందుకు వీలు ఏర్పడుతుందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో దాదాపు ఆరు నెలల పాటు నొప్పిని తగ్గించుకునే అవకాశం ఉందని తేలింది. ఇంజెక్షన్‌ ద్వారా మోకాలి జాయింట్‌ వద్దకు పంపించే ఈ విధానంలో ఆరు నెలల పాటు చికిత్స పొందాల్సి ఉంటుంది. దీనికి తోడు క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణలతో మోకాలి నొప్పులను నియంత్రించుకోవచ్చని అపోలో సర్జెన్‌ డా కార్తీక్‌ సింగ్లే పేర్కొన్నారు. స్టెరాయిడ్‌లు, పెయిన్‌ కిల్లర్ల వినియోగం కేవలం తాత్కాలిక ఉపశమనమేనని, దీర్ఘ కాలిక ఉపశమనం రావాలంటే ఈ కొత్త విధానం చికిత్స తీసుకోవడం ఉత్తమం అన్నారు.

పైగా పెయిన్‌ కిల్లర్ల విచ్చలవిడి వినియోగం వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కిమ్స్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా ఐ.వి. రెడ్డి అన్నారు. స్థూలకాయానికి, మొకాలి నొప్పి సమస్యకు దగ్గర సంబంధం ఉంటుంది. అత్యధిక బరువు మోకాలిపైనే మోపడం, వయస్సు పై బడుతున్న కొద్దీ ఎదురయ్యే దుష్ఫలితాలు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణం అవుతున్నట్లు వైద్యుల పరిశోధనలు తేట తెల్లం చేస్తున్నాయి. మొత్తం మీద రోజుకు 30 నిమిషాల పాటు నడక లేదా వారానికి ఐదు సార్లు చిన్న పాటి వ్యాయామం, క్రమం తప్పని పౌష్టికాహారం వంటివి మోకాలి నొప్పులకు రోగులు తీసుకోవల్సిన ప్రాథమిక జాగ్రత్తలని చెప్పక తప్పదు. నగరంలో ఈ తరహా కొత్త వైద్య విధానంతో అత్యధిక సంఖ్యలో రోగులకు విస్కో సప్లిమెంటేషన్‌ ద్వారా నయం చేయగలుగుతున్నారు.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/