Sunday, July 12, 2009

గోళ్ళు మన ఆరోగ్యానికి సూచికలు ,Nails represent our health

Normal Nails -------------------------------------------------------Cynotic nails

Conparing Nails feet & hands ------------------------------------- Clubed Nails
=============================================
మీ చేతి గోళ్ళు , కాళ్ళ గొల్లల లో మార్పులు మీ ఆరోగ్యాన్ని , అనారోగ్యాన్ని చూసిస్తాయి .

గోళ్ళు :
మానవులు, జంతువుల వేళ్ళ చివర ఆవరించి ఉన్నా గోడలాంటి నిర్మాణము . .. ఈ గోళ్ళు "కేరాటిన్" అనే ప్రోటీన్ పదార్ధము తో చేయబడుతుంది , దాని కింద కనక్టివ్ టిస్యు తో వేలుకి అనుసంధానము చేయబడి ఉంటుంది . . విశేషమేమిటంటే .. శరీరములోని అవయవాలన్నీ ఎదగడం ఆగిపోయినా ... వెంట్రుకల తో పాటు గోళ్ళు పెరుగుతూ ఉంటాయి చివరిదాకా (చనిపోయే దాకా ).

గోరు మొదటి భాగం లోపల చర్మానికి అంటుకొని ఉంటుంది .. దీన్ని " ఎపోనైచిం(eponychium)" అంటాము .
ఇరువైపులా గోరు చర్మనికే అంటుకొని ఉంటుంది ... దీన్ని " పెరినైచిం (perinychium)" అంటాము ,
మధ్య భాగం పెద్దది , ఇది కుడా కింది చేర్మనికే అంటుకొని ఉంటుంది ... దీని " హైపోచిం(hyponychium) " అంటాము .గోళ్ళు ఒక నెల కాలం లో మూడు మిల్లిమీటర్లు పెరుగుతుంది .

గోళ్ళ ఉపయోగము :
శరీరం లో చవరి భాగాలైన కాళ్ళ ,చేతి వ్రేళ్ళ చివరలను కాపాడటం , దెబ్బలనుంచి , పట్టుకునే వత్తిడి నుంచి వేళ్ళను కాపాడుతాయి .

వైద్య పరం గా :
ఈ గోళ్ళ లో ఆకృతులు అనేక రకాల వ్యాదులను చుసిస్తాయి .. లేదా అవే ఫంగస్ వలన , బాక్టీరియా వలన ఇన్ఫెక్ట్ అయి సహజ ఆకారాన్ని కోల్పోతాయి.
 • చేతి వ్రేళ్ళ మొదల్లో వాపు వచ్చిందంటే .. దాని క్లబ్బింగ్( clubbing )అంటాము ..గుండె జబ్బులను చూసిస్తుంది.
 • గోళ్ళు వంపు పోయి చెంచా లా మారితే , దాన్ని కోయిలోనికియ (koilonichia )..రక్త హీనతను చూసిస్తుంది.
 • గోళ్ళ పై నీలం రేఖలు పై నుంచి క్రిందకు వ్యాపించి ఉంటే .. శరీరం లో ఎప్పటినుండో ఉన్న వ్యాధిని సుచిసిస్తుంది
 • గొల్ల పై సన్నని , ఎర్రని గీతాలు కనిపిచి గోళ్ళ కింద నల్లనవుతుంటే , దాంతో జ్వరం వస్తే గుండె పైపొర వాపుని సూచిస్తుంది .
 • గోళ్ళు పచ్చని రంగులోకి మారుతూ , ఆకృతి మారి గోళ్ళు కదులు ఉంటే .. శ్వాస అవరోధం ,ఆయాసం లను సూచిస్తుంది .
 • గోళ్ళ ముందు భాగం లో నొక్కితే సొట్ట పడిందంటే , దాన్ని "పిట్టింగ్" అంటాము ... ఇది "సోరియాసిస్ , మూత్ర సంభంద వ్యాదులలో కనబడుతుంది .
 • గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి.
 • గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.

గోళ్ళ సంరక్షణ :
 • గోళ్ళను ఎపుడు శుబ్రము గా తుడిచి పొడి గా ఉంచాలి . గోళ్ళ సందులలో మట్టిని , దుమ్ముని కడిగి ఉంచకపోతే అందులో ఉన్న సూక్ష్మ క్రిముల వలన తినే పదార్దములతో కలిసి అనేక రాగాలు కలుగుతాయి .
 • ప్రతి 15 రోజులకు పెరిగే గోళ్ళ చివరలను కత్తిరించి తీసివయాలి
 • పుచ్చు గోళ్ళను జాగ్రత్త గా త్రిం చేసి తీసివేయాలి .
 • గోళ్ళ ను దగ్గరగా కత్తిరించి గోరు చుట్టులకు తావివ్వకూడదు .

మీ గోళ్ళ ఆకారములో రంగులోను , తేడాలు కనిపిస్తే మంచి వైద్యుని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి .

అందమైన గోళ్ల కోసం...కొన్ని సూచనలు :
శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

* గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.

* గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని వదిలేయండి.


* సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి.

* గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సోప్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే హానికారక బ్యాక్టీరియా గోళ్లలో చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

* గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీళ్లలో కొంత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాసుకోవాలి.


* గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే. కానీ ఎల్పప్పుడూ గోళ్లను రంగులతో కప్పివేయకూడదు.

* వారానికి రెండు సార్లు మ్యానిక్యూర్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం.

* గోళ్లరంగును తొలగించడం కోసం అసిటోన్ కలసిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను వాడకండి. అసిటోన్ కలవని సాధారణ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడడమే మేలు.

మొత్తటి ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 చుక్కలు
వీట్‌జెర్మ్ ఆయిల్ - 2 చుక్కలు
వీటిని ఒక కప్పు నీటిలో కలిపి పది నిమిషాలపాటు వేలి గోళ్లను మునిగేలా ఉంచాలి. తర్వాత టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తక్కువ కాలంలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

* విటమిన్ E క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.

* గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* హానికారకరమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్‌గ్లోవ్స్ ధరించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.

-- సేకరణ : డా.శేషగిరిరావు వందన (శ్రీకాకుళం).

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.