Thursday, August 20, 2009

దోమలవల్ల కలిగే జబ్బులు , Mosquito spread diseases




దోమ "కులిసిడే(culicidae)"ఫ్యామిలీ కి చెందిన కీటకము (insect) . ప్రపంచము లో సుమారు 3,500 జాతులు (మూలము వికీపీడియా) దోమలో కొన్నిరకాల ఆడ దోమలు మానవుల రక్తం తాగుతూ ఎన్నో అంటు వ్యాధుల వ్యాప్తికి దేహడ పడుతున్నాయి . ఆన్ని రకాల వ్యాధుల వ్యాప్తికి ఆడ దోమలే కారణము ... మగదోమలు మానవుల రక్తము తాగలేవు ... వీటి తొండము పొట్టిగాను , లావుగాను చివర మొండిగాను ఉన్నందున ఇవి చర్మము లోనికి తోన్దాన్ని గుచ్చి రక్తాన్ని పీల్చలేవు ... కుళ్ళిన ఆకులు , పండ్లు , పూల పుప్పెడి ఆహారముగా తీసుకొని బ్రతుకుతాయి .ఆడ దోమల తొండము పొడవుగాను , సన్నముగాను , దారుగాను ఉండడము తో ఇవి మనుషుల , జంతువుల రక్తాన్ని సునాయాసముగా పీల్చివేయగాలవు . మగదోమలు సంతానోత్పత్తి సమయములో ఆడదోమలతో కలిసిన తరువాత చనిపోవును ... ఆడదోమలె ఎక్కువకాలము బ్రతుకుతాయి . దోమల సగటు జీవన కాలము -- ఆడదోమలు 3 నుంచి 100 రోజులు బ్రతికితే మగదోమలు 10 నుంచి 20 రోజులు మాత్రమె బ్రతుకుతాయి .

ప్రపంచ దోమల నివారణ దినము (World Mosquito eradication day) :

20 ఆగష్టు 1897 లో అమెరికా కు చెందిన ' రోనాల్డ్ రాస్ ' అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాప్తికి దోవలె కారణమని


కనుగొన్నారు .. దినాన్నే ప్రపంచ దోమల నివారణ దినము గా జరుపుకుంటున్నారు .

కొన్ని ముఖ్యమైన వ్యాధులు .. వ్యాప్తికి దోహదపడే దోమలు :


ముఖ్యాంశాలు :
  • దోమ వల్ల ఏటా 35 - 50 కోట్ల మందికి మలేరియా సోకుతుంటే 10 లక్షల వరకు చనిపోతున్నారు .
  • దోమలు భూమి పై 3 కోట్ల ఏళ్ళ క్రితం నుంచి ఉంటున్నాయి .
  • మస్కిటో అనే పేరు దీనికి "స్పనిష " భాష నుంచి వచ్చింది .. పదనికు లిటిల్ ఫ్లయ్ అని అర్ధము .
  • ఇవి వంద అడుగుల దూరము నుంచే వాసన , వేడిమి ద్వారా మనుషుల్ని గుర్తు పట్టేస్తాయి ... మనము వదిలే carbondiaxide వల్లే ఇది సాధ్యపడుతుంది .
  • ఇవి తమ జీవితకాలములో 150 మైళ్ళు ప్రయాణిస్తాయి .... గంటకి ఇవి 1.5 మైళ్ళ దూరము ఎగరగలవు
  • ఆడ దోమ ఒకేసారి 300 గుడ్లను పెడుతుంది .జీవిత కాలములో 3000 వరకు గుడ్లు పెట్టె సామర్ధ్యముంది .
  • దోమలు సెకనుకు 500 సార్లు రెక్కల్ని టప టప లాడించగలవు .
  • దోమలు వెనక్కి , ముందుకి ,ప్రక్కలకు .. ఇలా అన్ని వైపులా ఎగరగాలవు .

దోమల నివారించే మార్గాలు :
  • పారిశుధ్యము మేరుగుపదితేనే దోమల నివారణ సాధ్య పడుతుంది . అర కోర బడ్జెట్ తో భాద్యరహితమైన ప్రభుత్వఉద్యోగుల పనితనము , సరి అయిన పర్యవెక్షనవిధనము లేకపోడము అనే అనేక అంశాలు దోమల పెరుగుదలముకారణాలు .
  • దోమల కాయిల్స్ కాల్చడము వలన దోమలను తరిమివేయవచ్చును .. పొగ వల్ల కళ్ళకు , గుండెకు మంచిది కాదు.
  • విద్యుత్ బాట్ లు వాడుకోవడం మంచిదే .
  • ఇంటి పరిసరాల వ్హుట్టు చెత్తను , నీరు నిలువుందే కొబ్బరి డొక్కులు , గోలులు , నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి.
  • ఇంటి పరిసరాలలో మురుగునీరు ఉంటే కిరోసిన్ చల్లితే దోమల వ్యాప్తి జరగదు .
  • వేప ఆకులను ఎండబెట్టి ఇంటిలో వారానికి ఒకసారి ధూపము వేస్తె దోమల సంతతి పెరగదు ,
  • మరుగుదొడ్ల గాలిపైపుల వద్ద జల్లెడలు ఏర్పాటు చేసుకోవాలి .
  • ఇంటిలో విడిచి దుస్తులు ఎక్కువగా ఉంచకూడదు .
దోమల కథ ... చరిత్ర :
దోమ మనిషిని భయంకర శత్రువుగా వేటాడుతూ ఆరోగ్యానికి చేటు తెస్తోంది. స్వల్పవ్యవధిలో విశేష సంఖ్యలో విస్తరించే దోమలు క్రిమి సంహారక మందుల్ని సైతం క్రమంగా తట్టుకుని మనగలవు. అందుకే మలేరియాను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. దోమలు ఎన్నో సమస్యలను సృష్టిస్తున్నాయి. కార్మికుల శ్రమ ఉత్పాదకతను 30 శాతం మేర తగ్గించేస్తున్నాయంటే వీటి బెడద ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. ఆడ దోమలు ఉష్ణరక్త జంతువుల రక్తం పీల్చుతాయి. ఇది ఒక మనిషిని గాని, కందిరీగను గాని 500 మీటర్ల దూరంలో ఉండగానే గుర్తిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఎలుగుబంట్లు తమ శరీరాలపై వాలిన దోమలను చంపివేయడానికి అవి నేలపై పడి దొర్లుతాయి. ఈ పద్ధతివల్ల దోమలు చావకపోతే అవి మంచుగడ్డకట్టే చలిగల నీటిలో దిగుతాయి. యుకుటియాలోని కోతిమానది ఒడ్డున ఇటువంటి దృశ్యాలు కన్పిస్తాయి.

అదనుచూసి మనిషి రక్తాన్ని నంజుకొంటూ ఒక్కో కాటుతో తమ సంతతిని వృద్ధిచేసుకుంటున్నాయి దోమలు. కరచి వెళ్లడం కాదు, మనిషి శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మజీవుల్ని ప్రవేశపెడతాయి. దోమకాటుతో ఒక్క మలేరియా మాత్రమేకాదు ఎల్లోఫీవరు, డెంగ్యూ ఫీవరు, మెదడువాపు వ్యాధి వంటివి మనుషుల మీద విరుచుకుపడి ప్రాణాలుకూడా తీస్తున్నాయి. ఎనాఫిలిస్ అనే ఆడ దోమకు ‘ప్లాస్మోడియం పాల్సిఫారమ్’అనే మైక్రోబ్‌తో మంచిస్నేహం. జన్యుపరమైన ఏర్పాట్లువల్ల ఈ మైక్రోబ్ ఎనాఫిలిస్ ఆడదోమ లాలాజల గ్రంథుల్లో తలదాచుకుంటుంది. మనిషిని ఎనాఫిలిస్ దోమకాటువేయగానే దాని లాలాజలంలోని మైక్రోబ్ మనిషి రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ మైక్రోబ్ మనిషి రక్తంలోని ఎర్ర కణాలపై వ్యూహాత్మకంగా దాడిచేస్తుంది. ఎర్ర కణాలు విరిగి పోవడంతో వాటికి ప్రాణవాయువును సరఫరాచేసే శక్తి నశిస్తుంది. ఫలితంగా మూర్చరోగం, మూత్ర పిండాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తాయి. ఇవే ప్రాణం తీస్తాయి.
ఎనాఫిలిస్ ఆడ దోమ నిశాచారి. పగలు నిద్ర, రాత్రి సంచారం. నిద్రిస్తున్న మనుషుల్ని కాటేస్తుంది. ఇది విపరీతంగా గుడ్లు పెడుతుంది. మానవ ఆవాసాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుంటూ, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుని బతకగల సమర్థత దీనిది. ప్రతికూల పరిస్థితులను కూడా సానుకూలం చేసుకోగల్గడం జన్యుపరంగా దీనికి లభించిన వరం. ఇది సంచరించని ప్రాంతం మన దేశంలో లేదు.

జగత్ విజేతగా పేరుతెచ్చుకున్న అలెగ్జాండర్ క్రీ.పూ.323లో మరణించడానికి కారణం దోమకాటుకు బలై మలేరియా వ్యాధి సోకడం అని చరిత్ర చెబుతోంది. చివరకు ఈ దోమలకు భయపడి చెంఘిజ్‌ఖాన్ పశ్చిమ ఐరోపాపై దండయాత్రను విరమించుకున్నాడని చెబుతారు.

ఎనాఫిలిస్ దోమకు తోడుగా క్యూలెక్స్ దోమకూడా బోలెడంత విధ్వంసం సృష్టిస్తోంది. క్యూలెక్స్ దోమకాటు భరించలేని బాధను కల్గిస్తుంది. అయితే ఈ దోమల్లోని అన్ని తెగలు ప్రమాదకరమైనవి కావు. కొన్ని రకాలు కుడితే మాత్రం ప్రాణాలమీద ఆశవదులుకోవలసిందే. ఫైలేరియా వ్యాధి దీనివలన అధికం గా వ్యాప్తిచెందుతుంది .

బాతుల్లోను, కొంగల్లోను, పందుల్లోను నివాసం ఏర్పరచుకునే వ్యాధికారక సూక్ష్మజీవులను మనిషి శరీరంలో ఈ క్యూలెక్స్ దోమలు ప్రవేశపెట్టగల్గుతున్నాయి. ఈ సూక్ష్మజీవులు మనిషి రక్తం ద్వారా మనిషి మెదడును చేరుకుంటాయి. మెదడు కణ జాలాన్ని తీవ్రమైన వాపుకు గురిచేసి వాంతులు, జ్వరం వంటి లక్షణాలతో అపస్మారక స్థితిలోకి నెట్టివేస్తాయి. దీనినే మెదడువాపు వ్యాధి అంటారు. వైద్య పరిభాషలో ‘జపనీస్ ఎన్‌సెఫలైటీస్’ అంటారు.

‘ఎడెస్ ఎజిప్టి’అనే మరొక రకం దోమ కాలగమనంలో ఫ్లయింగ్ టైగర్‌గా పేరుతెచ్చుకుంది. మొదట్లో ఇది అడవుల్లో ఉండేది. క్రమంగా నగర ప్రవేశంచేసి చల్లదనం ఉండే ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా చేసుకుని తన సంతానాన్ని అభివృద్ధి పరచుకుంది. దీని కాటువల్ల ‘ఎల్లోఫీవర్’ వస్తుంది. ఈ ఫ్లయింగ్ టైగర్ లాలాజలంలో ‘చిక్‌న్‌గున్యా’అనే వైరస్ ఉంటుంది. ఈ వైరస్ దాని లాలాజల గ్రంథులనుండి లాలాజలంలోకి చేరుతుంది. మనిషిని ఇది కాటువేయగానే ఈ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించి జీర్ణాశయానికి చేరుకుంటుంది. అచట రక్తస్రావం మొదలయి, జ్వరం వచ్చి పచ్చకామెర్లు మొదలవుతాయి. చివరకు మృత్యువు సమీపిస్తుంది. దోమల్లో మొత్తం 3,500 తెగలు వున్నాయి. వీటిలో 100 తెగలు మాత్రమే హానికరమైనవి. ఎక్కువగా జంతు రక్తంమీద ఆధారపడినవి. మనిషి రక్తంమీద ఆధారపడినవి తక్కువే అయినా అవి సృష్టిస్తున్న బీభత్సం మనిషికి పెనుసవాలుగా మారింది. *

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.