ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Unwanted Hair, Hypertricosis,అవాంఛిత రోమాలు,హైపర్‌ట్రైకోసిస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
- అవాంఛిత రోమాలు ఉంటే వాటిని తొలగించడం... శ్రమ అవుతుంది. తెల్లగా, నునుపుగా, పట్టుకుంటే జారిపోయేలా చర్మం ఉండాలనుకుంటారు అమ్మాయిలు. తలపై తప్ప శరీరంపై ఎక్కడ రోమం కనిపించినా బాధే. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్... అంటూ రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకునే పనిలో పడుతున్నారు. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎందుకు వస్తాయి? వాటిని తొలగించడానికి అతివలు పడరాని పాట్లు ఎందుకు పడతారు. ఆ రోమాలను కొండంత శ్రమతో కాకుండా... తేలిగ్గా వదిలించుకోడం ఎలా...?
అవాంఛిత రోమాలు పెరగడం.. అందానికి సంబంధించిన సమస్యే... కానీ దానికి కారణాలు మాత్రం ఆరోగ్యపరంగా ఉంటాయి. హార్మోన్ల అసమతూకం మొదలు.. మరికొన్ని సమస్యలు అవాంఛిత రోమాలకు దారితీస్తాయి. అందుకే ముందు అసలైన కారణం గుర్తించి, చికిత్స తీసుకోవాలి.
అన్నివయసుల వారినీ ఇబ్బందిపెట్టే సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి. కాళ్లూ, చేతులపైనే కాదు, పైపెదవిపైనా, చెంపల దగ్గరా.. ఇలా ఉండకూడని చోట రోమాలు వస్తాయి. దాన్నే హిర్సుటిజం అంటారు. కొందరిలో ఈ సమస్య తక్కువగా ఉంటే, మరికొందరిలో మగవాళ్లకు పెరిగినట్లుగా గడ్డాలూ, మీసాలూ కూడా వస్తాయి.
కారణాలు..
* స్త్రీలల్లో సాధారణంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు ఎక్కువగా, యాండ్రోజెన్లు తక్కువగా స్రవిస్తాయి. ఈ యాండ్రోజన్లు ఎడ్రినల్ గ్రంథి, అండాశయాల నుంచీ తయారైతే, వాటిని పిట్యూటరీ గ్రంథి అదుపు చేస్తుంటుంది. ఆ యాండ్రోజన్ హార్మోను రక్తప్రసరణ ద్వారా కణజాలానికి చేరినప్పుడు శక్తిమంతమైన టెస్టోస్టెరాన్‌గా మారుతుంది. దాంతో రోమాలూ, సెబేషియస్ గ్రంథులూ ప్రభావితమవుతాయి. కొందరిలో అవాంఛిత రోమాలు పెరగడానికి యాండ్రోజెన్లు ఎక్కువగా తయారు కావడమే ముఖ్య కారణం. అలాగే మరికొన్ని కారణాలూ ఉన్నాయి..
* శరీరతత్వం కూడా ఈ సమస్యను పెంచుతుంది. ఏ జబ్బూ లేకుండానే అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి కొందరికి. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.
* మరో సర్వసాధారణమైన కారణం పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్). అండాశయాల్లో సిస్టులు ఉండటం, హార్మోన్ల అసమతూకం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో అవాంఛిత రోమాలు వస్తాయి. దాంతోపాటూ మొటిమలూ, నెలసరి సక్రమంగా రాకపోవడం, విపరీతంగా బరువు పెరగడం, సంతాన సాఫల్యసామర్థ్యం తగ్గడం లాంటివీ ఉంటాయి.
* అండాశయాల్లో కొన్నిరకాల ట్యూమర్లు ఉన్నప్పుడూ పురుష హార్మోను ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడూ అవాంఛితాల సమస్య ఉంటుంది.
* ఎడ్రినల్ గ్రంథి నుంచి సహజంగా వచ్చే యాండ్రోజెన్లు అవసరానికి మించి కొన్నిసార్లు ఎక్కువగా తయారవుతుంటాయి అలాంటప్పుడు అవాంఛిత రోమాలతోపాటూ విపరీతంగా బరువు పెరగడం, ముఖం ఉబ్బినట్లు కనిపించడం, మెడ వెనుక కొవ్వు పేరుకుని మూపురంలా కనిపించడం (బుల్‌నెక్).. లాంటి లక్షణాలూ ఉంటాయి.
* కొందరికి పుట్టుకతోనే ఎడ్రినల్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటుంది. యాండ్రోజెన్లు ఎక్కువగా తయారవుతాయి. ఆ ప్రభావం వల్ల శిశువు పుట్టే సమయానికి బాహ్య జననేంద్రియాలు సరైన విధంగా ఏర్పడకపోవచ్చు. దాంతో ఆ బిడ్డ అమ్మాయా, అబ్బాయా అని స్పష్టంగా తెలియదు.
* కొన్నిరకాల మందులతోనూ అవాంఛిత రోమాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడూ, వక్షోజాల్లో ఫైబ్రోఎడినోసిస్ అనే సమస్య ఉన్నప్పుడూ డానజాల్ అనే మందును వాడతారు. దీన్ని దీర్ఘకాలికంగా వాడినప్పుడు పురుషుల్లో ఉన్నట్లుగా రోమాలూ పెరుగుతాయి. మూర్ఛకు వాడే కొన్ని రకాల మందులూ, యాంటాసిడ్ల వల్ల కూడా అవాంఛిత రోమాలు వస్తాయని అధ్యయనకర్తలు గుర్తించారు. అలాగే థైరాయిడ్, క్రోమోజోమ్‌ల లోపాలున్నా, పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్ ఉన్నవారికి కూడా ఈ పరిస్థితి రావచ్చు.
* కొన్ని కారణాలకు ప్రొజెస్టరాన్ హార్మోను వాడటం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
* మెనోపాజ్ తరవాత గడ్డం, పైపెదవిమీద రోమాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో తలమీద జుట్టు వూడిపోతోందని బాధపడుతుంటారు చాలామంది స్త్రీలు. ఆ దశలో అండాశయాల పనితీరు తగ్గుతుంది. దాంతో ఈస్ట్రోజెన్, యాండ్రోజెన్ సమతూకం లోపించి పురుష లక్షణాలు మొదలవుతాయి.
* గర్బిణుల్లో కూడా కొన్నిసార్లు ఈ సమస్య కనిపిస్తుంది. ఆ సమయంలో అండాశయాలు పెద్దవై, వాటిలో పురుష హార్మోను కణాలు పెరగడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయితే ప్రసవం తరవాత ఆ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.
సమస్య మూడు దశల్లో..
అవాంఛిత రోమాల సమస్య రెండురకాల్లో కనిపిస్తుంది. రోమాలు మరీ సన్నగా, కనిపించీ కనిపించకుండా ఉంటాయి (వెల్లస్ హెయిర్). హార్మోన్లలో జరిగే మార్పుల ప్రభావం వీటిపై ఉండదు. రెండో రకం చాలా మందంగా, నల్లగా ఉంటాయి (టెర్మినల్ హెయిర్). హార్మోన్లలో మార్పులు జరిగేకొద్దీ ఇవీ పెరుగుతాయి.. ఏ రకమైనా.. సమస్య మూడు దశల్లో బాధిస్తుంది.
*1 చుబుకం, పైపెదవి మీదా రోమాలు కొద్దిగా కనిపిస్తాయి.
*2 చెంపలూ,వక్షోజాల మధ్యలో, చనుమొనల చుట్టూ, పొట్టమీదా, వీపూ, పిరుదుల మధ్యలో, తొడల లోపలివైపు కూడా అవాంఛిత రోమాలుంటాయి.
*3 అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడంతోపాటూ, పురుష లక్షణాలు కూడా మొదలవుతాయి. గొంతు బొంగురుగా మారడం, వక్షోజాలు క్షీణించిపోవడం, నెలసరి ఆగిపోవడం, బాహ్యజననేంద్రియాల్లోనూ మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే స్త్రీ పురుషుడిగా మారిపోతోందనడానికి సంకేతం.
గుర్తించే పరీక్షలుంటాయి..
సమస్య ఏ దశలో ఉన్నా.. అవాంఛిత రోమాలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ముందు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తద్వారా అండాశయాలోని ఎడ్రినల్ గ్రంథిని పనితీరును తెలుసుకుంటారు. అండాశయాల్లో పీసీఓఏస్ ఉన్నా, కణుతులున్నా ఈ స్కాన్‌లో తెలుస్తుంది. ఒకవేళ ఎడ్రినల్, పిట్యూటరీ గ్రంథుల్లో ట్యూమర్లు ఉన్నట్లు సందేహం కలిగితే అదనంగా సీటీస్కాన్, ఎం.ఆర్.ఐ. పరీక్షలతో నిర్థరిస్తారు. అవాంఛిత రోమాలనేది హార్మోన్లకు సంబంధించిన సమస్య కనుక పిట్యూటరీ, ఎడ్రినల్, అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లను పరీక్ష చేస్తారు. ఈ పరీక్షల్లో టెస్టోస్ట్టెరాన్, డీహెచ్‌ఈఏఎస్, 17 ఓహెచ్‌పీ, ప్రొలాక్టిన్, థైరాయిడ్ లాంటివి ఉంటాయి.
ఆలస్యంగా ఫలితం..
ఇలాంటి సమస్య ఉన్నప్పుడు స్త్రీలు ఎంతగా కుంగిపోతారంటే.. ఏ చికిత్స తీసుకున్నా వెంటనే ఫలితం కనిపించాలనుకుంటారు. అయితే అవాంఛిత రోమాల విషయంలో వెంటనే చికిత్స తీసుకున్నా ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది. పైగా ఒక వెంట్రుక పెరిగి, వూడి, కొత్తది రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఏ మందు వాడినా దాదాపు సంవత్సరం లోపు ఫలితాలు కనిపించవు. ఒకవేళ పీసీఓఎస్ ఉంటే గనుక గర్భనిరోధక మాత్రలు, ప్రొజెస్టరాన్ లాంటివి ఇస్తారు. అండాశయాల పనిని మందగించేలా చేస్తారు. అదే ఎడ్రినల్ గ్రంథిపని తీరులో లోపం ఉంటే స్టెరాయిడ్లు సూచిస్తారు. వాటిల్లో ముఖ్యంగా పురుష హార్మోను యాండ్రోజెన్‌కి వ్యతిరేకంగా పనిచేసే యాంటీయాండ్రోజెన్లు వాడమంటారు. వైద్యులు సూచించే మందులతోపాటూ అందుబాటులో ఉన్న సౌందర్య చికిత్సలు కూడా చేయించుకోవచ్చు. బ్లీచింగ్, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవింగ్ క్రీంలు వాడటం లాంటివి ఆ కోవలోకే వస్తాయి. అలా కాకుండా కొందరు సొంతంగా ప్లకింగ్, షేవింగ్ లాంటివి చేసుకుంటారు. కానీ వాటివల్ల రోమాలు ఇంకా బలంగా పెరుగుతాయి. మరింత నల్లగానూ కనిపిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే సమస్య ఇంకా పెరుగుతుంది. ఒకవేళ శాశ్వత చికిత్సను కోరుకునేవారు ఎలక్ట్రాలిసిస్, లేజర్ లాంటివి ఎంచుకోవచ్చు. వీటిని కూడా దశలవారీగా చేయాల్సి ఉంటుంది. చికిత్స పూర్తికావడానికి ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుందని మరవకూడదు.
కారణాలు :
- హార్మోన్ల అసమతుల్యం - స్ర్తీలలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ముఖం మీద నూనూగు వెంట్రుకలలా కనిపిస్తుంటాయి. మెనోపాజ్ దశలో శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ నిల్వలు తగ్గిపోవడంతో శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్లోన్ల అసమతుల్యం ఏర్పడి రోమాలు దట్టంగా రావడం మొదలవుతుంది. వీరిలో పురుష హార్మోన్లు వృద్ధి చెందడం ఈ సమస్యకు ప్రధాన కారణం.
జీవనశైలి
- క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు పాటించకపోవడం వల్ల చాలామంది ఆరోగ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. అంతర్గతంగా కనిపించకుండా వచ్చే మార్పులు కొన్నైతే, బహిరంగంగా ఇబ్బందిపెట్టే సమస్యలు మరికొన్ని. సవ్యంగా లేని జీవనశైలి, ఊబకాయం... ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. ఈ విషయాలేవీ తెలియకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. కొందరు జీవితంపై ఆశ వదులుకుంటున్నారు.
హిర్సుటిజం, హెపర్‌ట్రైకోసిస్... కారణాలు :
- మహిళల శరీరంపై సాధారణంగా ఉండాల్సిన వెంట్రుకలకు బదులు అవాంఛితమైన రోమాలు విపరీతంగా, పురుషుల్లాగా ఉండటాన్ని హిర్సుటిజం అంటారు. హైపర్‌ట్రైకోసిస్ ఉన్న సందర్భాల్లో కూడా మహిళల్లో రోమాలు ఇలాగే ఉంటాయి. అయితే హిర్సుటిజానికీ, హైపర్ ట్రైకోసిస్‌కు తేడా ఉంది. హిర్సుటిజం ఉన్న కేసుల్లో పురుషుల్లో లాగా వెంట్రుకలు ఉంటే... హైపర్ ట్రైకోసిస్ కేసుల్లో అవాంఛిత రోమాలు ఉన్నా అవి పురుషుల్లో మాదిరిగా ఉండవు. హిర్సుటిజంలో హార్మోన్ల లోపాల వల్ల వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి. హైపర్ ట్రైకోసిస్ మాత్రం జన్యుపరమైన కారణాలతో వస్తుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరికైనా ఉంటే హైపర్ ట్రైకోసిస్ రావడం చాలా సాధారణం.
- పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ :
- నివారణ పద్దతులు :
- శాశ్వత పద్ధతులు
ఎలక్ట్రాలిసిస్: ఈ చికిత్స నిపుణుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పిగ్మెంటేషన్ ఉన్నా ఈ పద్ధతి ద్వారా రోమాలను తొలగించవచ్చు. ముఖ్యంగా తెల్లని రోమాలను తొలగించడంలో ఈ పద్ధతి మేలైనది. అయితే ఈ పద్ధతిలో కూడా ముఖంపై మచ్చలు, గుంటలు పడే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సలో ఉపయోగించే నీడిల్స్ సురక్షితం కానివైతే ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది. కనుక ఈ పద్ధతులను ఉపయోగించే నిపుణులు కచ్చితమైన ప్రమాణాలను పాటించాలి.
లేజర్: అవాంఛిత రోమాలకు ఈ పద్ధతి శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తుంది. కాంతి కిరణాల ఆధారంగా మల్టిపుల్ లేజర్స్‌తో హెయిర్‌ను తొలగిస్తారు.
- తాత్కాలిక పద్ధతులు...
- హెయిర్ రిమూవల్ క్రీములు
- షేవింగ్ - అపోహ...
వస్తున్నాయని భయపడతారు. షేవింగ్ సరైన విధంగా చేయకపోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. ఈ ఫాలికల్‌లో నుంచి బయటకు వచ్చిన వెంట్రుకను తీసేయడానికి మళ్లీ షేవ్ చేయడంతో అప్పటికే దెబ్బతిన్న చర్మం వద్ద రోమం మొదలయ్యే భాగం (హెయిర్ బంప్) దురద పెట్టడం, రంగు మారడం జరుగుతుంది.
- ===================