ఆడపిల్ల యవ్వన దశకు చేరుకునేసరికి స్తనాలు పెరగడం జరుగుతుంది. బహిష్టులు ఆరంభమైన 2, 3 సంవత్సరాలు ఇది జరుగుతుంది. చనుమొనల నుంచి క్షీర వాహికలు శాఖోపశాఖలుగా విస్తరించి, కొవ్వులో నిక్షిప్తమై వుంటాయి. ప్రసవానికి 2, 3 నెలల ముందు స్తనాలలో పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోను స్థాయులు తగ్గిపోతాయి. దానితో మెదడులోని హైపోథాలమస్, తన అడుగు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథిని 'ప్రోలాక్టిన్' హార్మోను ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను స్తనాలలో పాల ఉత్పత్తికి దోహదపడుతుంది. కాన్పు అయిన తరవాత మొదటి రోజులలో లభించే తల్లిపాలలో ఆరోగ్య రక్షకమైన 'యాంటీబాడీస్' బిడ్డకు లభిస్తాయి.
కాన్పయిన తరవాత శిశువు పాలు చీకడం మొదలు పెట్టిన కొన్ని సెకండ్లలోనే పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ సంఘటనలో హైపోధెలామస్ పాత్ర అనల్పం!
పాలిచ్చే తల్లులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య స్తనాలలో క్షీరవాహికలు ఇన్ఫెక్షన్‌కు గురికావడం. దీనినే 'మాస్త్టెటిస్' అని వ్యవహరిస్తారు. పాలు తాగేసమయంలో బిడ్డ నోటిలోని సూక్ష్మ జీవుల ద్వారా తల్లికి సంక్రమించే అతి సామాన్యమైన వ్యాధి ఇది. బాధాకరమైన వ్యాధి. స్తనాలు వాచి ఎర్రబారి వుంటాయి. గట్టి బడతాయి. చలితో జ్వరం కూడా రావచ్చు.
బాధగా వున్నది గదా అని పాలివ్వడం మానడం మాత్రం మంచిది గాదు. ముందుగా ఇన్ఫెక్షన్‌లేని స్థనంలోని పాలివ్వటం ఉత్తమం. ఆకలి మూలకంగా బిడ్డ
ఆ స్తనంలోని పాలు గట్టిగా ప్రయత్నించి తాగడం జరుగుతుంది. వాపు వున్న స్తనంలోని పాలు బిడ్డ తాగాల్సి వస్తే పంపుతో పాలు తీయడం మంచిదే.
ఇన్ఫెక్షన్ తగ్గనట్లయితే గడ్డ ఏర్పడుతుంది. గడ్డలో చీము చేరి, అది మందుల ద్వారా తగ్గనట్లయితే ఆ ప్రాంతంలో గంటు పెట్టి చీము బయటకు
వచ్చెయ్యటానికి వీలు కల్పించవలసి వుంటుంది.ం
మరికొన్ని బ్రెస్ట్ సమస్యలు...
ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను
సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్ చుట్టూ అల్సర్లు
ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్ నొప్పి
నివారణకు క్రీమ్ రాసుకోవడం, పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్ పరీక్షలు సైతం చేసుకోవాలి.
బ్రెస్ట్ సమస్యల్లో అక్యూర్డ్ మాస్‌టైటిస్ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా
ఏర్పడే రిట్రాచ్ నిప్పల్, క్రాక్ నిప్పల్ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్ ఇస్తారు. కొందరు
మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది.
-ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్ ఉంటుంది. బిపి
ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్ సమస్యలు ఏర్పడతాయి. పాలు
రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య
ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం
తెలుసుకోవాలి. కొందరు డాక్టర్లు ఆక్షిటోసిన్ ఇంజక్షను ఇవ్వడము వలన పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుందంటారు. ఆయుర్వేదములో Satavari preparations i.e.. tab. GALACAL , cap,LACTARE వంటివి వాడవచ్చును.
- ===================
Sir! Maa missees ki brest gadda tharvatha cheemu vastundhi ....next elanati treetmentippichamantaru...
ReplyDeleteSir! Maa missees ki brest gadda tharvatha cheemu vastundhi ....next elanati treetmentippichamantaru...
ReplyDelete