Tuesday, July 30, 2013

Colon Hydrotherapy,కొలోన్‌ హైడ్రోథెరఫీ.


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Colon Hydrotherapy,కొలోన్‌ హైడ్రోథెరఫీ.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



బయటి శరీరాన్ని రోజూ స్నానంతో శుభ్రం చేసుకుంటాం.. మరి లోపల పేగుల పరిస్థితి ఏంటీ. వాటి శుభ్రం చేసుకోవడం ఎలా? ఈ ఆలోచన నుంచి ఉద్భవించిన ప్రక్రియే ‘కొలోన్‌ హైడ్రోథెరపీ’. పెద్దపేగులో పోగుపడి ఉండే మలమాలిన్యాలను శుభ్రం చేయడం ప్రకృతి చికత్సలో ఒక భాగం. గతంలో ఏదో ఒక పైప్‌ ద్వారానో, ఒక చిన్న డబ్బా ద్వారానో చేసే ఈ చికిత్సను ఇప్పుడు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునికమైన యంత్రపరికరాల ద్వారా చేయడానికి ఏర్పట్లున్నాయి.

ఎలాంటి కాలుష్యాలూ లేని అత్యంత పరిశుభ్రమైన ‘డిస్టిల్డ్‌ వాటర్‌’ను ఒకింత గోరువెచ్చటి ఉష్ణోగ్రతకు యంత్రమే వేడి చేసుకుంటుంది. మామూలుగా గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేయవచ్చు. కానీ... ఒకింత గోరువెచ్చని నీటి వల్ల ఆహ్లాదకరమైన అనుభూతి మరింత ఇనుమడిస్తుంది. అందుకే ఈ స్వల్ప ఉష్ణోగ్రత. ఈ నీటిని మలమార్గం(రెక్టమ్‌) ద్వారా పంపడానికి ఉపయోగించే పైప్‌ల ద్వారా లోనికి పంపుతారు. ఇవి మలమార్గంలోకి ఎంత తేలిగ్గా ప్రవేశస్తాయంటే... వీటి వల్ల ఎలాంటి నొప్పీ ఉండకపోగా... లోపల ఉన్న మాలిన్యాలు చాలా సాఫీగా బయటకు వెళ్లడమన్నది చాలా తేలిగ్గా జరిగిపోతుందన్నమాట. ఒకవైపు నుంచి లోపలికి గోరువెచ్చని నీరు ప్రవహిస్తుండగా... లోపలికి వెళ్లిన నీరంతా అక్కడ ఉన్న మలమాలిన్యాలను శుభ్రం చేసుకుంటూ మరో పైప్‌ ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది.

ఇలా మన కడుపులోని మాలిన్యాలు వెళ్లిపోవడాన్ని ఈ ఆధునిక యంత్రానికి ఉన్న పారదర్శక పైప్‌ల ద్వారా ఎవరికి వారు చూడవచ్చు కూడా. ఒక్కోసారి వాళ్లు ఊహించనంతటి మాలిన్యం బయటకు వెళ్లూ ఉంటుంది.మరి ఇలా లోపలి మాలిన్యాలను బయటకు పంపించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి అన్నదే ప్రశ్న. దీనికి చాలా సంతృప్తికరమైన సమాధానాలు ఉన్నాయి. చాలా సురక్షితమైన ఈ ప్రక్రియలో ఎలాంటి నొప్పి లేకుండానే లోపల ఉన్నదంతా కడిగేసుకుపోతున్న అనుభూతి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇది కేవలం మనకు కలిగే భౌతికమైన, బాహ్య అనుభూతి మాత్రమే. ఇక లోపల కలిగే ప్రయోజనా లెన్నో. ఉదాహరణకు... మలబద్ధకంతో బాధపడుతూ ఎంతో ముక్కుతూ, మూల్గూతూ మల విసర్జన చేసే వారు ఈ చికిత్స ప్రక్రియతో లోపల ఉన్నదంతా బయటకు వెళ్లడం వల్ల చాలా హాయిని పొందుతారు. కొలోన్‌ హైడ్రోథెరపీ ప్రక్రియ తర్వాత అంతా శుభ్రపడి, పెద్దపేగు (కొలోన్‌)లో ఒక మాలిన్యాలూ, విషపదార్థాలూ ఏవీ ఉండవు కాబట్టి చాలా పరిశుభ్రమైన రక్తం శరీరమంతటికీ సరఫరా అవుతుంది.

కొన్ని సందేహాలూ, సమాధానాలు

కొలోన్‌ హైడ్రోథెరపీ ప్రజల్లో కొన్ని సందేహాలూ, అపోహలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా...
పెద్దపేగుల్లోని మలాన్ని తొలగించడం కోసం కొలోన్‌ హైడ్రోథెరపీని మొదట అనుసరించడం వల్ల అదే అలవాటైపోయి... ఆ తర్వాత స్వాభావికంగా విరేచనం కాదన్న అపొహ చాలా మందిలో ఉంటుంది. నిజానికి ఈ ప్రక్రియ ద్వారా మొదట అక్కడ గడ్డలు గడ్డలుగా చేరే మలం గట్టిపడి, ముందుకు జారకుండా మలబద్ధకం ఏర్పడుతుంది. అయితే ఒకటి రెండుసార్లు కొలోన్‌ హైడ్రోథెరపీ ద్వారా శుభ్రపరచే ప్రక్రియ తర్వాత ఇక అక్కడ మలం పోగయ్యే పరిస్థితి తప్పిపోతుంది. దాంతో స్వాభావికంగా విరేచనం కావడం సులభమవుతుంది. అంటే చాలా మంది అనుకున్నట్లుగా ఇది అలవాటుగా మారకపోవడం అటుంచి, మంచి శానిటరీ హ్యాబిట్‌ను పెంపొందిస్తుంది.
ఒకవైపు నుంచి నీళ్లను లోపలికి ప్రవేశపెట్టడం వల్ల అవి లోనికివెళ్లాయి.
అలా బయటకు వెచ్చేస్తాయి... మరి శుభ్రపరిచే ప్రక్రియెలా జరుగుతుంది... అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. బయటి నుంచి నీటిని మలద్వారం గుండా లోపలికి ప్రవేశపెట్టగానే ఆ నీరు లోపల పెద్దపేగుల పెరిస్టాలిటిక్‌ చలనపు స్పందనలకు అనుగుణంగా కదులుతుంది. దీనివల్ల ఆ నీటి సాయంతో పేగుల లోపల మూలమూలకూ కడిగినట్లుగా అయి మాలిన్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి.లోపలికి పైప్‌ను ప్రవేశపెట్టేటప్పుడు నొప్పిగా ఉంటుందా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ చాలా మృదువైన పైప్‌ల కారణంగా ఇది ఎంతమాత్రమూ బాధాకరంగా ఉండదు. కాకపోతే కొందరిలో కాస్తంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రధానంగా ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), క్యాండిడా వంటి రుగ్మతలతో బాధపడేవారు ఈ ఇబ్బందిని కాస్తంత ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే నీరు లోపలికి ప్రవేశించే వేగాన్ని నియంత్రించుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి మీ సమస్యను అధిగమించడాఇకి అవసరమైనంత వేగంగానే నీటి విడుదలను అనుమతించుకుంటూ ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఎప్పటికప్పుడు మాలిన్యాలు కడుక్కుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గడం కూడా జరుగుతుంది.
ఎవరెవరికి సిఫార్సు చేయలేం?ఇన్ని ప్రయోజనాలిచ్చే ఈ కొలోన్‌ హైడ్రోథెరపీని కొందరికి సిఫార్సు చేయలేరు. వాళ్లు... గర్భవతులు, పెద్దపేగు, మలద్వారం క్యాన్సర్‌తో బాధపడేవారు, కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులు, అల్సరేటివ్‌ కొలైటిస్‌ బాధితులు, పైల్స్‌తో బాధపడేవారు.
ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతుంది?

courtesy with :

రేదా డిటాక్స్‌, రేవా హెల్త్‌, స్కిన్‌ అండ్‌ హెయిర్‌ థర్డ్‌ ఫ్లోర్‌, మర్చంట్‌ టవర్స్‌, రోడ్‌ నెం.4, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌@surya telugu daily news paper -July 1, 2013

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 29, 2013

Surgery for brain leisons,మెదడు సమస్యలకు సర్జరీలు





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Surgey for brain leisons,మెదడు సమస్యలకు సర్జరీలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




ఆధునిక జీవనశైలి కారణంగా మెదడు సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. మెదడులో రక్తనాళాలు బ్లాక్‌ అవటం, చిట్లిపోయి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు బ్రెయిన్‌ హెమరైజ్‌లు వచ్చిపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి బ్రెయిన్‌ ఓపెన్‌ సర్జరీతో అనేక లాభాలున్నాయంటున్నారు. సున్నితమైన ఈ రక్తనాళాల్లో రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడినా, మెదడులో ఉన్న రక్తనాళాలు చిట్లినా బ్రెయిన్‌ స్ట్రోక్‌, బ్రెయిన్‌ హెమరేజ్‌ రావచ్చు. మెదడులో ఏర్పడే ఈ సమస్యలు హృద్రోగాల కంటే ప్రమాదమైనవి.

గతంలో మెదడు సంబంధ సమస్యలతో 90శాతం మంది రోగులు మరణించే వారు. కాని అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది. ఎందుకు వస్తాయి? అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోకపోవటం, ధూమపానం, అధికంగా మద్యం సేవించటం, స్థూలకాయం, కొవ్వు ఉన్న ఆహారప దార్థాలు ఎక్కువగా తినటం, వంశపారపర్యంగా కుటుంబం లో ఎవరికైనా మెదడు సంబంధ జబ్బులు ఉండటం లాంటి కారణాలతో మెదడులో రక్తనాళాలు బ్లాక్‌ అవటం, చిట్లిపోవ టం జరుగుతుంది.కళ్లు బైర్లు కమ్మితే... మెదడులోని రక్తనా ళాల్లో ఆటంకం ఏర్పడినప్పుడు రోగికి అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. అధిక తలనొప్పి, వాంతులవటం, ఒకవైపు కాళ్లు చేతులు పనిచేయకపోవటం, ఫిట్స్‌ రావటం జరుగు తుంది.

మాట్లాడుతుండగానే, లేదా బాత్రూంకు వెళ్లి వచ్చేలో గా అకస్మాత్తుగా వచ్చే ఈ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో రోగి కోమాలోకి కూడా వెళ్లే అవకాశముంది. మెదడులోని రక్తనాళాలు చిట్లినపుడు తీవ్ర తలనొప్పితో పాటు ముఖంలో మార్పులు సంభవిస్తాయి. కళ్లు తిరగటం, ఆక స్మాత్తుగా బ్లరింగ్‌ విజన్‌ రావటం, మాట్లాడలేకపోవటం, ఏ వై పు రక్తనాళాలు చిట్లితే ఆ వైపు కాలు, చేయి పడిపోవటం జరుగుతుంది. ఒక్కోసారి కొందరికి మెదడులో మైనర్‌ స్ట్రోక్‌ వచ్చి 30 నిమిషాల తర్వాత తగ్గుతుంది. మెదడు రక్తనాళాలలో చిన్న ఆటంకం ఏర్పడినప్పుడు ఇలా మైనర్‌ స్ట్రోక్‌ వస్తుంది. సత్వర చికిత్స : మెదడు సంబంధ సమస్యలు ఏర్పడినప్పుడు రోగిని 8 గంటల్లోగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. మెదడులో ట్యూమర్‌ ఏర్పడినపుడే దాన్ని తొలగించేందు కు ఓపెన్‌ బ్రెయిన్‌ సర్జరీలు చేస్తున్నారు. మెదడు రక్తనాళాల్లో ఆటంకమేర్పడినా, బెలూన్‌లా ఉబ్బినా, రక్తనాళాలు చిట్లినా ఇండోవాస్కులర్‌ న్యూరో సర్జరీ విధానంలో చికిత్స చేస్తున్నారు. దాన్నే మినిమల్‌ ఇన్‌వెజిల్‌ సర్జరీ అంటారు. ఈ ఆధునాతన సర్జరీల వల్ల మెదడు సంబంధ వ్యాధి వచ్చినా, సత్వరం కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది.

కెరటిడ్‌ యాంజియో ప్లాస్టి : గుండెకు చేసే యాంజియో ప్లాస్టీ లాగా మెదడులోని రక్తనాళాల్లోని ఆటంకాలను తొలగిస్తారు. మెదడులోని రక్తనాళంలో 80శాతానికి పైగా బ్లాక్‌ అయినపుడు, మెదడుకు రక్తసరఫరా తగ్గుతుంది. ఇలాంటపుడు రక్తనాళం నుంచి రంధ్రం చేసి దాని ద్వారా బెలూన్‌ సాయంతో స్టంట్‌ వేస్తారు.

  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

False belief in Knee replacement surgery,నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరిపై సాధారణ అపోహాలు

  •  

 

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -False belief in Knee replacement surgery,నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరిపై సాధారణ అపోహాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మధుమేహాం హైపిబి ఉన్న రోగులు నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయించుకోకుడదు.
ఎ). ఇది వాస్తవం కాదు. అవి గనుక నియంత్రణలో ఉంటే మధుమేహాం, హైబిపి ఉన్న రోగులకు కూడా నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయవచ్చు.

నీ రిప్లేస్‌మెంట్‌ విధానం విఫలమైంది.
ఎ). టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ ఎంతో విజయవంతమైన ఆపరేషన్‌. అమెరికాలో ఏడాదిలో 600.000కు పైగా నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీలు జరిగాయి. ఇది 2030 నాటికి 4 మిలియన్లను చేరుకుంటుందని అంచనా. భారత్‌లో నీ రిప్లేస్‌మెంట్‌లో సర్జరీ ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 3000కు పైగా ఆపరేషన్లు జరిగాయి.
బి). సగటున 10 ఏళ్ల వద్ద 95 శాతం. 20 ఏళ్ల వద్ద 80 శాతం. సక్సెస్‌రేట్‌(సరైవర్‌షిప్‌) ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

రిప్లేస్‌మెంట్‌లో తరువాత మోకాలు వంగడం లేదు.

ఎ). ఇది పూర్తిగా అసత్యం. మోకాలు వంగడం అనేది సర్జరీ నాణ్యం పోస్ట్‌ ఆపరేటివ్‌ రిహాలిటేషన్‌ ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్‌ అనంతర ఫిజియోథెరపీని పేషంట్‌ తీసుకొవడం పై ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
బి). ఆపరేషన్‌ అనంతరం మోకాలి సరళత్వం (ఫ్లెక్సియన్‌- వంగడం) అనేది ఆపరేషన్‌కు ముందు నాటి సరళత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక రోగి ఆపరేషన్‌ కు ముందు 110డిగ్రీల సరళత్వంపొందే అవకాశం ఉంది. చాలా మంది పేషేంట్లు గతంలో తాము కలిగి ఉన్న సరళత్వం కంటే ఎక్కువగా సరళత్వాన్నే పొందిన దాఖలాలు ఉన్నాయి.

నీ రిప్లేస్‌మెంట్‌ అనంతర నమాజు లేదా పూజ చేసుకోవడం సాధ్యం కాదు.
ఎ). నేలపై కుర్చోని ప్రార్ధన చేసుకునేందుకు కట్టుబడి ఉండే వారు ఆవిధంగా చేసుకోవడం సాధ్యమే.. సురక్షిత ఎత్తులో వంపు వీలయ్యే విధంగా సర్జన్‌ నిర్ధిష్ట ఎత్తు గల ఫ్లెక్స్‌ ఇంప్లాంట్స్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. అ విధంగా నేలపై కూర్చుని నమాజు లేదా పూజ చేసుకోవచ్చు.

నీ రిప్లేస్‌మెంట్‌ తరువాత నేలపై కూర్చోవడం లేదా సాధ్యం కాదు.
ఎ). ఇది సర్జరీ నాణ్యం పేషెంట్‌ పరిస్థితి పై అధారపడి ఉంటుంది.
బి). కుర్చోవడం లేదా ఫ్లోర్‌పై స్కే్వట్‌ చేయడం తప్పకుండా సాధ్యమే. ఆ పనులు చేయడం మీకు తప్పనిసరి అయితే ఆ విషయం గురించి మీరు సర్జరీకి ముందుగానే మీ సర్జన్‌తో చర్చించాలి. అప్పుడు సర్జన్‌ తాను ఉపయోగించే సర్జికల్‌ టెక్నిక్‌ను మార్చుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ ఇంప్లాంట్‌ను అమర్చవచ్చు.

వృద్ధులైన పేషెంట్లలో నీ రిప్లేస్‌మెంట్‌ అనేది సరైన సలహాకాదు.

ఎ). పలు భారతీయ కుటుంబాల్లో ఉన్న అపోహ ఇది. పేషెంట్‌ గనుక ఆరోగ్యంగా ఉంటే 55-85 ఏళ్ల వయస్సు ఆ సర్జరీకి ఎంతో అనువైంది.

యువ పేషెంట్లలో నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ సూచించతగినది కాదు.

ఎ). ఇందులో కొంత మేరకు నిజం ఉన్నప్పటికీ, అది పేషేంట్‌ ఎలాంటి పరిస్థితిలో బాధపడుతున్నాడు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో, కీలు తీవ్రమైన నొప్పి కలుగచేస్తున్నపుడు మాత్రం నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ సిఫారసు చేయడమైనది.
బి). ఆస్టియో ఆర్ధరిటిస్‌తో బాధపడే యువ పేషెంట్లకు అస్టియోఅటమి లేదా పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సూచించవచ్చు. ఈ అంశంపై గల అప్షన్‌ (ఎంపిక అవకాశాల) గురించి అనుభవజ్ఙుడైన నీ సర్జన్‌తో చర్చించండి.

నీ రిప్లేస్‌మెంట్‌ 10 ఏళ్లకు మించి ఉండవు.

ఎ). ఇది అవాస్తవం. 10 ఏళ్ల వద్ద నీ రిప్లేస్‌మెంట్‌ అరిగిపోయే అవకాశం ఉంది. అంటే దాని అర్ధం వారి తదుపరి జీవితంలో రివిజన్‌ సర్జరీ అవసరం కావచ్చు. అలాంటి సమస్యలు ఎదురైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.

హై- ప్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌ మరింత మెరుగైన కదలికలను అందిస్తుంది.
ఎ). ఇది వాస్తవం కాదు. పేషెంట్లో, అనుభవం లేని సర్జన్లో ఉండే అతి ముఖ్యమైన అపోహ ఇది.
బి). ప్రామాణిక టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే హై ఫ్లేక్స్‌ గణనీయ ప్రయోజనం కనబర్చగలదని ఏ అధ్యయనంలోనూ వెల్లడి కాలేదు.
సి).హై-ప్లేక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సురక్షిత లోతైన ఫ్లెక్స్‌న్‌కు వీలు కల్పిస్తాయి. అంటే ఒక వ్యక్తి నేలపై కూర్చోవాలన్న స్క్వాట్‌ చేయాలన్నా కూడా అలా చేయడం సురక్షితమే అవుతుంది. అయినప్పటికి ప్రామాణిక టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే అవి దీర్ఘకాలం మన్నుతాయనేదానికి లేదా మరింత మెరుగైన కదలికల శ్రేణిని అందిస్తుంది. అనేదానకి ఎలాంటి ఆధారం లేదు.

ఖరీదైన ప్యాకేజీలను అందించే వాటితో పోలిస్తే, ఆసుపత్రులు అందించే చౌక నీ రిప్లేస్‌మెంట్‌ కూడా అంతేబాగా పనిచేస్తాయి.
ఎ). కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అయినప్పటికి అన్నింటి కంటే ముఖ్యమైనది సర్జన్‌ను, ఇంప్లాంట్‌ను ఎంచుకోవడం.
బి). సరిగా చేయని నీ రిప్లేస్‌మెంట్‌ బాధాకరంగా ఉండి, తొందర్లోనే విఫలమై, చక్కటి ఆపరేషన్‌ ప్రక్రియకు చెడ్డపేరు తీసుకువస్తుంది.
సి). సాధారణంగా స్ట్రైకర్‌, జిమ్మర్‌, స్మిత్‌ నెఫ్యూ, బయెమెట్‌ లాంటి పేరోందిన విదేశి కంపెనీలు చక్కటి విశ్వసనీయమైన ఇంప్లాంట్స్‌ను అందిస్తాయి. మీకు ఎలాంటి ఇంప్లాంట్‌ అవసరమో మీ సర్జన్‌ నిర్ణయించకలుగుతారు.

ఖరీదైన ఇంప్లాంట్స్‌ మంచివి
ఎ) . ఇది వాస్తవం. ప్రామాణీకృత విదేశి ఇంప్లాంట్ల వ్యయం ఎంతో తక్కువగానే ఉంటుంది, అంతేగాకుండా దీర్ఘకాలం పని చేసిన ట్రాక్‌రికార్డు వాటికి ఉంది. ఆసుపత్రులు కంపెనీలచే విక్రయించబడే ఎంతో ఖరీదైన ఇంప్లాంట్ల అవి సుపీరియర్‌ (అత్యున్నత స్థాయి) డిజైన్‌తో కూడుకున్నవన్న హామీతో ఉంటాయి. మనిషి శరీరంలో అ ప్లాంట్స్‌ను అమర్చినప్పుడు అవి సుపీరియర్‌ (అత్యున్నతం) అనేందుకు తగిన విశ్వసనీయ ఆధారాలేవి చరిత్ర లేవు.

పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ కంటే కూడా టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ మెరుగైంది.
ఎ). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆది సహాజ కీలుతో దాంతో పాటే లిగమేట్స్‌ను చాలా వరకు అలాగే ఉంచుతుంది. టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే ఆది మరింత సహాజమైందన్న భావనను కలిగిస్తుంది.
బి). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ మరింత చిన్న కోతతో జరుగుతుంది. వేగంగా కోలుకుంటారు.
సి). ఈ టెక్నిక్‌లో బాగా అనుభవజ్ఙుడైన సర్జన్‌చే పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ జరిగితే అది అత్యుత్తమంగా ఉంటుంది.

కంప్యూటర్‌ నావిగేటెడ్‌ నీ మెరుగైన ఫలితాన్ని అందిస్తుంది.
ఎ). కంప్యూటర్‌ నావిగేట్‌డ్‌ నీ రిప్లేస్‌మెంట్‌ కొంతమేరకు మెరుగైన ఓవరాల్‌ అలైన్‌మెంట్‌ను అందిస్తుందని అంతా అంగీకరిస్తున్నప్పటికీ, అది మొత్తం మీద ఫలితాన్ని మెరుగుపరుస్తుందనేందుకు అధారాలేవి లేవు.

నీ రిప్లేస్‌మెంట్‌ అనంతరం డ్రైవింగ్‌ సాధ్యం కాదు.
ఎ). ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నీ రిప్లేస్‌మెంట్‌ అనంతరం డ్రైవింగ్‌ ఎంతో తేలిక అవుతుంది. చాలా మంది పేషెంట్లు సర్జరీ జరిగిన 6-8 వారాల్లో డ్రైవింగ్‌ చేయడం ప్రారంభించారు.

నీ రిప్లేస్‌మెంట్‌ తరువాత ఆటలు ఆడటం సాధ్యం కాదు.
ఎ). ఫుట్‌బాల్‌, హాకీ లాంటి ఇంపాక్ట్‌ స్పోర్ట్‌‌స ఆడటం వీలుపడదు.
బి). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్స్‌తో ఎంతో మంది పేషెంట్లు టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటలాడటం ప్రారంభించారు.
సి). టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సాధారణంగా పైనా పేరొన్న ఆటలకు దూరంగా ఉండడాన్ని సూచిస్తున్నప్పటికి ఎన్నో యూరోపియన్‌ దేశాల్లో చాలా మంది స్కీయింగ్‌, సైక్లింగ్‌, గోల్ఫింగ్‌, హైకింగ్‌ లాంటివి చేస్తుంటారు.

Courtesy with : డాక్టర్‌ ఉదయ్‌ ప్రకాష్‌--ఎఫ్‌ఆర్‌సీఎస్‌, ఎఫ్‌ఆర్‌సీఈడీ. ఎఫ్‌ఆర్‌సీఎస్‌ (టిఆర్‌ ఒఆర్‌టిహెచ్‌), కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, స్పెషలిస్ట్‌ ఇన్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ, ఉదయ్‌ క్లినిక్‌ ఆర్థోపెడిక్‌ సెంటర్‌, 5-9-94, చాపల్‌ రోడ్డు, హైదరాబాద్‌ 500 001

  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, July 28, 2013

Back Ach-Ayurvedic treatment,నడుము నొప్పి కి ఆయుర్వేద చికిత్స








ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Back Ach-Ayurvedic treatment,నడుము నొప్పి కి ఆయుర్వేద చికిత్స - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 


1. నొప్పి హఠాత్తుగా మొదలయిందా?-- ఘాతాలు / దెబ్బలు,

2. నడుము నొప్పి చాలాకాలం నుంచి ఉందా?-- వెన్నుపూసలు అరిగిపోవటం (స్పాండిలోసిస్),

3. వెన్నుకు నిర్దేశితమైన ఆకృతీ, సహజమైన వంపులూ దూరమయ్యాయా?-- ఎముకల బోలుతనం (ఆస్టియోపోరోసిస్), వెన్నుపూసలు కలిసిపోవటం (యాంకైలోజింగ్ స్పాండిలోసిస్),

4. కదలికలతో నడుము నొప్పి ఎక్కువవుతుందా? -- నరంమీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్),

5. దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ నడుములో నొప్పి వస్తుందా?--వెన్నుపూసల మధ్యనుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్)

6. సాధారణారోగ్యం కుంటుపడిందా? నలతగా అనిపిస్తుందా?--అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్)

7. కాళ్లలో శక్తి లేనట్లుగా, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుందా?--నరంమీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్)

8. మూత్రం కంట్రోల్లో లేకుండా పడిపోతుందా? మల విసర్జన మీద నియంత్రణ ఉండటం లేదా?--నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్ నెస్)

9. మీరు స్త్రీలైతే - నడుమునొప్పి, నెలసరి సమయాలలో ఎక్కువవుతుంటుందా?--గర్భాశయం వెనక్కి తిరిగి వుండటం (రెట్రోవర్డెడ్ యుటిరస్)/ గర్భాశయపు లోపలిపొర ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిస్)

10. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారా? మూత్రంలో రక్తం కనిపిస్తుందా?--మూత్రపిండాల్లో రాళ్ళు / కిడ్నీ వ్యాధులు

11. నడుము నొప్పితో పాటు ఉదర ప్రాంతంలో నొప్పి ఉంటుందా?--ఉదరావయవాల వాపు

12. బరువు తగ్గిపోతున్నారా?--దీర్ఘకాల వ్యాధుల ప్రభావం / ప్రమాదకర రుగ్మతలు



బస్సులలోనూ, రైళ్లలోనూ గంటల తరబడి కూర్చుని ప్రయాణం చేయడం, టెలివిజన్ ముందు అదే పనిగా చేరగిలపడం, డజన్లకొద్దీ నీళ్ల బిందెలు యోయడం ఇవన్నీ చేయడానికి మన శరీరానికి కొన్ని పరిదులున్నాయి, అయినా తప్పకనో, అశ్రద్ధ వల్లనో, తెలిసో, తెలియకనో చేసేస్తుంటాము. వీటి పర్యవసానమే నడుము నొప్పి. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు కటీశూల అనే పేరుతో దీనిని వివరించాయి. సంహితా కారుడు నడుము నొప్పికి దైనందిన పరిస్థితులను కారణాలుగా పేర్కొంటూ, వాటిని 'మిథ్యాయోగం' అన్న పదంతో వ్యవహరించాడు. నడుమునొప్పి అనేది జలుబు తరువాత కనిపించే అత్యంత సాధారణమైన సమస్య. డాక్టర్లకు తరచుగా వినిపించే ఫిర్యాదు ఇది. నడుము నొప్పిని నివారించే ప్రయత్నంలో మానవ శరీర నిర్మాణాన్ని గురించి లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఆధునిక శాస్త్ర అధ్యయనాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం జరుగుతోంది. అయినప్పటికీ, చిత్రంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చి తీరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల పనిగంటలు కేవలం నడుము నొప్పి కారణంగా వ్యర్ధమవడాన్ని బట్టి .... ఈ సమస్య మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం అవసరమని గ్రహించాలి. నడుము నొప్పికి ప్రధాన కారణం మనం పరిణామక్రమంలో పొందిన పరిణతేనని జీవశాస్త్రాధ్యయనకారుల అభిప్రాయం. అంటే మనం స్వతహాగా - మన పూర్వీకులైన వానరాల్లాగా నాలుగు కాళ్ల మీద నడవాలనీ, అయితే జీవ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డామనీ, అయినప్పటికీ శరీరం మాత్రం నాలుగు కాళ్లతో కూడిన సమతుల్యానికి అలవాటు పడిందనీ, సమస్య సరిగ్గా ఇక్కడే వస్తుందనీ వీరంటారు. వీరి అభిప్రాయంలో కొంత నిజం ఉన్నా. అదే పూర్తి నిజమని అంగీకరించాల్సిన పనిలేదు. ఎందుకంటే పరిణామక్రమంలో శరీరం తన చుట్టుపక్కల పరిసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది కనుక.

నడుము నొప్పికి నివారణగా భారతీయ శస్త్రచికిత్సా పితామహుడు సుశృతుడు మనిషి భంగిమలను గురించి, వ్యాయామాలను గురించి ప్రత్యేకంగా చెప్పాడు. నడుమును ఆవరించి ఉండే కండరాల శక్తిని పెంపొందించుకోవడం, రోజువారి  పనులను ఒక నిర్దుష్టమైన శైలిలో చేయడం వంటి చిన్న చిన్న మార్పులతో నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు. ఆఫీసులో కూర్చునే కుర్చీలనూ, బల్లలనూ, ఇళ్లలో వాడే మంచాలనూ మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని తయారుచేసిన వాటిని వాడాలి. అలాగే బరువులను సరైన పద్ధతిలో మోయడం నేర్చుకోవాలి.

నడుము నొప్పి ఆనడంతోనే ముందుగా ఎవరి దృష్టయినా వెన్నుపూస మీదకి వెళుతుంది. పూసా అని దీనిని వ్యవహరించడంలోనే కొంత అర్థముంది; దీనిలో 33 ఎముకల 'పూసల దండ' మాదిరిగా ఒక దానిమీద మరొకటి అమరి ఉంటాయి. ఒకటే ఎముకలాగా కాకుండా ఇలా పూసలుగా మరి ఉండటం వలన వెన్నును వివిధ భంగిమల్లో పంచగలిగేందుకూ, తిప్ప గలిగేందుకూ వీలు కలుగుతుంది, వెన్ను అనేది శరీరం అగ్ర భాగంలో తలకూ, మధ్యభాగంలో ఛాతి ప్రాంతానికీ, కింది భాగంలో తుంటి ప్రాంతానికి అధారాన్నిస్తుంది. అలాగే వీటి నుంచి ఆధారాన్ని పొందుతుంది. వెన్నులోని ఎముకలు ఒకదాని మీద మరొకటి, వాషర్ పైన తిరిగే చక్రాల మాదిరిగా, మృదులాస్థి పైన అమరి ఉంటాయి. అంతే కాకుండా ఈ వెన్నుపూసలు వెన్నుపామును (స్పైనల్ కార్డ్) నిలువునా ఆవరించి రక్షిస్తూ ఉంటాయి.

వెన్నుపాము నరాల సముదాయాలతో నిర్మితమై, మెదడుకు, శరీర భాగాలకు మధ్య సందేశాలను చేరవేసే వాహకంగా పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. నడుము నొప్పి ఉత్పత్తి స్థానం: నడుము నొప్పి కేవలం వెన్నుపూస వల్లనే కాకుండా, దానిని అంటిపెట్టుకుని ఉండే నిర్మాణాల వలన కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఆయా కారణాలను అన్ని కొణాలనుంచి శోధించాల్సి ఉంటుంది. సమస్య స్వస్థానంలో కేంద్రీకృతమై ఉంటే నొప్పి ఉత్పత్తి స్థానాన్ని కనిపెట్టడం కష్టం కాదు. అయితే చాలా సందర్భాలలో నొప్పి స్థానికంగానే కాకుండా, నరాల ద్వారా ఇతర భాగాలకు సైతం ప్రసరిస్తుంది. దీనిని వైద్యపరిభాషలో ;రిఫర్డ్ పెయిన్' అంటారు, అంటే సమస్య ఒకచోట ఉంటే ఫలితం మరొకచోట ఉంటుందన్నమాట. ఇలాంటి నొప్పికి సరైన ఉదాహరణ, సయాటికా నొప్పి అని అంటారు.

మామూలుగా సయాటిక్ నరం అనేది నడుము ప్రాంతంలోని వెన్నుపాము నుండి కొన్ని పాయలుగా విడివడి, వెన్నుపూస ఎముకల మధ్యనుంచి మార్గాన్ని చేసుకుని, కాలులోనికి ప్రవేశించి పాదాల వరకూ పయనిస్తుంది. కాళ్ల కదలికలకు, స్పర్శాగ్రహణానికి కారణం ఈ సయాటిక్ నరమే. ఒకవేళ నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసలో అస్తవ్యస్తత చోటు చేసుకుంటే సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు నడుములో నొప్పి ఉన్నా లేకపోయినా సయాటిక్ నరం వ్యాపించినంత మేరా (తొడ వెనుక భాగం, పిక్కలు, పాదం తదితర ప్రాంతాలు) విపరీతంగా లాగుతున్నట్లుగాని, సలుపుతున్నట్లుగాని ఉంటుంది. నడుము నొప్పికి అసలైన కారణాలు: నడుము నొప్పులకు ప్రధాన కారణాలుగా శరీరానికి తగిలిన దెబ్బలను, ఇన్ ఫ్లమేషన్ నూ, వెన్నుముకకూ సంబంధించిన ఆర్త రైటిస్ నీ పరిగణించాల్సి ఉంటుంది.

నడుము నొప్పికి మరో ప్రధాన కారణం స్లిప్ డిస్క్, వెన్నుపూస ఎముకల మధ్య ఉండే కుషన్ వంటి మృదులాస్థి పక్కకు వైదొలిగి వెన్నుపాము మీద ఒత్తిడిని కలిగిస్తున్నప్పుడు దానిని స్లిప్ డిస్క్ అంటారు. ఈ స్థితి బరువులను ఎత్తినప్పుడో, లేక హఠాత్తుగాను, అసహజంగాను కదిలినప్పుడో సంభవిస్తుంది. కొన్ని కేసులలో మాత్రం నడుమునొప్పి అమవాతం (రుమటాయిడ్ ఆర్త రైటిస్), క్యాన్సర్ తదితరాల వలన వచ్చే అవకాశం లేకపోలేదు. కొన్నిసార్లు కొద్ది మందిలో వెన్నెముకతో సంబంధం కూడా నడుము నొప్పి రావచ్చు. మూత్ర పిండాల వ్యాధులూ, మహిళల్లో వచ్చే పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ వంటివీ దీనికి ఉదాహరణలు. ఇప్పుడు నడుం నొప్పిని కలిగించే సాధారణ కారణాలను సమీక్షిద్దాం.

1. అభిఘాతాలు / దెబ్బలు:

బరువును లేపుతున్నప్పుడో, పక్కకు తిరిగినప్పుడో, వంగినప్పుడో నడుము లోపల కలుక్కుమని, ఆ తరువాత ఆ నొప్పి అలాగే కొనసాగుతూ ఉంటే వెన్నుపూసలకుకాని, వాటిని అంటిపెట్టుకుని ఉండే నిర్మాణాలకుకాని దెబ్బ తగిలినట్లు అర్థం చేసుకోవాలి. కండర సముదాయాలు చిట్లినప్పుడు లేదా సాగిలపడినప్పుడు ఈ స్థితి ప్రాప్తిస్తుంది. అలాగే వెన్నుపూస ఎముకల మధ్యనుండే మృదులాస్థి (డిస్క్) స్థానభ్రంశం చెంది వెన్నుపాము మీద ఒత్తిడి కలుగచేసినప్పుడు కూడా నడుము నొప్పి మొదలవుతుంది. ఇంతే కాకుండా ఎముకలు చిద్రమై పెళుసెక్కినప్పుడూ, క్యాన్సర్ కారకాంశాలు ప్రథమ దశను దాటుకుని ద్వితీయ దశలోనికి ప్రవేశించినప్పుడూ ఏ మాత్రం అహితకరమైన కదలికలు చోటుచేసుకున్నా డిస్క్ పక్కకు తప్పుకుని నడుము నొప్పి వస్తుంది.

సూచనలు: వీటికి కారణానుగుణమైన చికిత్సలు అవసరమవుతాయి. సామాన్య చికిత్సగా నొప్పినివారణ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది.

2. వెన్నుపూసలు అరిగిపోవడం (స్పాండిలోసిస్):

నిజం చెప్పాలంటే నడుమునొప్పి చాలా రోజుల పాటు బాధించే దీర్ఘకాలిక స్థితి. దెబ్బ తగిలిన తరువాత వెన్నుపూసలను అంటి పెట్టుకుని ఉండే కండరాలు త్వరితంగా పూర్వపు స్థితిని సంతరించుకున్నప్పటికి వెన్నుపూసలను కలిపే లిగమెంట్లూ, వ్యాదిగ్రస్తమైన జాయింట్లూ అంత తేలికగా సర్దుకోవు. దీనికి కారణం ఆయా నిర్మాణాలను అంతగా రక్త సరఫరా అందక పోవడమే. సూచనలు: వెన్నువెనుకకు, ముందుకు వంచుతూ వ్యాయామాలను చేయడం, శారీరక భంగిమలను సరిదిద్దుకోవడం, కుర్చీలనూ మంచాలనూ సరైన పద్ధతిలో వాడటం, పంచకర్మలనే ఆయుర్వేద చికిత్సలను తీసుకోవడం వీటన్నిటి ద్వారా నడుము నొప్పినుంచి ఉపశమనం పొందవచ్చు.

3. ఎముకల బోలుతనం (ఆస్టియోపోరోసిస్)/ వెన్నుపూసలు కలిసిపోవడం (యాంకైలోజింగ్ స్పాండిలోసిస్):

డ్రస్సింగ్ టేబుల్ ముందు ఒక పక్కకు నిలబడి చూసుకోండి, మీకు మీ వెన్నులో నాలుగు చోట్ల వంపులు కనిపిస్తాయి: మెడ దగ్గర, నడుము దగ్గర ఈ వంపులు లోపలికి తిరిగి ఉంటే (వీపు వైపు నుంచి చూసేటప్పుడు) దానికి విరుద్ధంగా భుజాల మధ్య ప్రాంతంలోనూ, తుంటి ప్రాంతంలోనూ వంపులు వెలుపలికి తిరిగి కనిపిస్తాయి. అయితే స్లిప్ డిస్క్, ఆస్టియోపోరోసిస్, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ వంటి వ్యాధులతో బాధ పడే వారికి ఈ ఆకృతి దెబ్బతింటుంది. ఈ వ్యాధుల వల్ల వెన్నచుట్టుప్రక్కల కండరాలు బిగదీసుకుపోయి, వెన్నెముక బల్లపరుపుగా తయారవుతుంది. అలాగే కదలికలు కష్టమైపోతాయి.

ఎముకలు చిద్రయుక్తం (పోరస్)గా మారి పెళుసెక్కడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు ఎముకలలో సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా చిన్నపాటి కదలికలకూ, దేబ్బలకూ లేదా అకారణంగా కూడా ఫ్రాక్చర్లు జరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆసియా ఖండానికి చెందిన వారే ఈ తరహా వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారని వెల్లడయింది. మగవారికంటే స్త్రీలెక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందునా పొట్టిగా, బల్ల పలచగా ఉండే వారికీ, సంతానం లేని వారికి ఈ స్థితి ప్రాప్తించే అవకాశాలెక్కువ. హిస్టరెక్టమీ ద్వారా బహిష్టుళు ఆగిపోయేలా చేసుకున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. పాలు, గుడ్లు మొదలైన కాల్షియం కలిగిన పదార్థాలను దగ్గరకు రానివ్వని వారికీ, ఏ పనిచేయకుండా బద్ధకంగా గడిపే వారికి, ధూమపానం, మద్యపానం మొదలైన అలవాట్లు ఉన్నవారికి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలెక్కువ, ఆల్యూమినియం కలిగిన యాంటాసిడ్స్ వాడకం, స్తీరాయిడ్స్ వినియోగం ఈ వ్యాధికి ఒక ప్రధానమైన కారణం, ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, ఆస్టియోపోరోసిస్ నడుము నొప్పి ఒక లక్షణంగా ఉంటుందని.

సూచనలు: దీనికి సాంప్రదాయక ఆయుర్వేద చికిత్సలతో పాటు క్యాల్షియం కలిగిన ప్రవాళ పిష్టి, మోతీ భస్మం, కుక్కుటాండ త్వక్ భస్మం అనే మందుకు కూడా అవసరమవుతాయి. నడుము నొప్పి ప్రధానంగా కనిపించే వ్యాధుల్లో యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది కూడా ముఖ్యమైనదే. ఈ వ్యాధిలో వెన్నుపూసలు లేదా ఎముకలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి.

తరచు వెన్నునొప్పి రావడమూ, అది పిరుదుల ద్వారా తొడలలోనికి వ్యాపించడమూ ఈ వ్యాధిలో కనిపించే లక్షణం. విశ్రాంతి తీసుకున్న తరువాత, రాత్రి నిద్ర తరువాత ఈ లక్షణాలు మరీ ఉధృతంగా కనిపిస్తాయి. పక్కటెముకలు వెన్నుపూసలతో కలిసే చోట కదలికలు నిబద్దమైపోయి ఛాతి సైతం వచ్చే అవకాశం ఉంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతిలో నొప్పి ఎక్కువ కావటమనే లక్షణం ఈ వ్యాధిని గుర్తించడానికి తోడ్పడుతుంది. అరికాళ్ల తీపులు, మడిమల వెనుక ప్రాంతంలో నొప్పి, ఎముకల్ అగ్ర భాగాల్లో ముట్టుకోలేనంత నొప్పి అనేవి ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తాయి. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే క్రమంగా వెన్ను పొడుగునా కదలికలు తగ్గిపోతాయి.

ఛాతీలో సంకోచ వ్యాకోచాలు తగ్గిపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఎక్స్ రే లో వెన్నుపూసలు ఒక దానితో మరొకటి కలిసిపోయి వెదురుబొంగు కణువుల మాదిరిగా కనిపిస్తాయి. ఇది పురోగమించే నైజం ఉన్న మొండి వ్యాధి.

4. నరం మీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్):

నడుములో పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తూ కదలికలతో పెరిగిపోతుంటే వెన్నుపాము నుంచి బైటకు వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. విశ్రాంతితోనూ, మహానారాయణ తైలం వంటి ఔషధ నూనెతోనూ మూడు రోజుల్లోగా నొప్పి సర్దుకుంటే దానిని సాధారణమైన కండరాల నొప్పిగా భావించి వదిలివేయవచ్చు. లేని పక్షంలో వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.

5. వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం (స్లిప్ డిస్క్):

వెన్నుపూసల మధ్య ఉండే మృదులాస్థి పక్కకు తప్పుకున్నప్పుడు వెన్ను అంతర్భాగంలో ఉండే జాగా తగ్గిపోయి ఇరుకుగా మారుతుంది. దగ్గటం, తుమ్మటం మొదలైన చర్యల వలన, అంతర్గతంగా ఒత్తిడి పెరిగి, వెన్నుప్రాంతానికి ప్రసరించి పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంది, దీనికి ;కటి వస్తి' అనే ఆయుర్వేద చికిత్సను చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. (వేడిగా ఉండే ఔషధ తైలాలను నడుము మీద నిర్ణీత సమయం పాటు ప్రయోగించడాన్ని 'కటివస్తి' అంటారు.)

6. అమవాతం (రుమటాయిడ్ ఆర్త రైటిస్):

నడుము నొప్పితో పాటు జ్వరం, బరువు తగ్గటం, రక్తల్పాత, నీరసం మొదలైనవి కనిపిస్తుంటే ఇతర శారీరక వ్యాధుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్) దీనికి ఉదాహరణ. అమవాతంలో కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగ ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఏ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారడం. దీనినే ఆటో ఇమ్యూనిటి అంటారు. అంతే, శరీరంలో ఉండే ప్రతిరక్షణ కణాలు శరీరపు స్వంత కణజాలాలను బయటివాటిగా భావించి పారదోలే ప్రయత్నం చేయడంతో సమస్య మొదలవుతుందన్నమాట. దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం మొదలైనవి (రుమాటిక్ ఫీవర్) ఉత్పన్నమవుతాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా, దీర్ఘకాలం పాటు పునరావృతమౌతుంటాయి.

సూచనలు: పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో మహా విషగర్భతైలం, ధనవంతరీ తైలం, క్షీర బలాతైలం, సింహనాదగుగ్గులు, మహాయోగ రాజ గుగ్గులు వంటి ఔషధాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా, యోగా, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుంచి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి.

7. నరం మీద ఒత్తిడి పడటం (నర్వ్ కంప్రెషన్):

కాళ్లలో బలం లేనట్లుగా, సూదులతో గుచ్చుకున్నట్లుగా అనిపిస్తుంటే ఎగువ నరాల మీద ఒత్తిడి పడుతుందేమో చూడాలి. సాధారణంగా డిస్క్ స్లిప్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీనిని అశ్రద్ధ చేస్తే క్రమంగా కండరాలలో పట్టు తప్పిపోవడం, కాళ్లు అచేతనంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. దీనికి వాత చింతామణి రస వంటి రాజౌషధాలు అవసరమవుతాయి.

8. నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్ నెస్):

ఈ స్థితి కూడా డిస్క్ స్థానభ్రంశం చెందడం వలన ఉత్పన్నమైనప్పటికీ ఇతర స్థితులన్నింటిలోనికి దీనిని అత్యంత ప్రమాదకరమైన స్థితిగా భావించాల్సి ఉంటుంది. దీనికి తక్షణమే వైద్య సహాయం అవసరమవుతుంది.

9. గర్భాశయం వెనక్కి తిరిగి వుండటం (రెట్రోవర్డ్ టెడ్ యుటిరస్)/ గర్భాశయపు లోపలిపొర ఇతర భాగాల్లో పెరగటం (ఎండో మెట్రియోసిన్):

ఈ రెండు సందర్భాల్లోనూ నడుం నొప్పి వస్తుంది. కొంతమందిమహిళలలో గర్భాశయం వెనక్కి తిరిగి ఉంటుంది, దీనిని 'రెట్రోవర్డ్ టెడ్ యుటిరస్' అంటారు. అటువంటి వారికి నెలసరి సమయంలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గర్భాశయంపు లోపలి పొర వ్యాధిగ్రస్తమై ఇతర భాగాలకు ప్రసరించినప్పుడు (ఎండోమెట్రియోసిస్) కూడా ఇలా జరుగవచ్చు.

ఔషధాలు: అశోకారిష్టం, పుష్యానుగచూర్ణం, చంద్రకళారసం, త్రిఫలాగుగ్గులు, లోధ్రాసవం, ప్రదరాంతకరసం.

10. మూత్రపిండాల్లో రాళ్ళు / కిడ్నీ వ్యాధులు:

కిడ్నీ వ్యాధులుగాని, కిడ్నీలలో రాళ్లుగాని ఉన్నప్పుడు నడుము నొప్పి వచ్చేఅవకాశం ఉంది. ఈ వ్యాధులలో మూత్రాన్ని జారీచేసే ఔషధాలను, అశ్మరీభేదన (రాళ్ళను కరిగించే (ఔషధాలను వాడాలి).

ఔషధాలు: చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గోక్షురాది గుగ్గులు, పునర్నవాది మండూరం, శతావరి లేహ్యం, శోథారి మండూరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సూరాక్షార కాసీస భస్మం.

11. ఉదరావయవాల వాపు:

ఎపెండిక్స్, పెద్ద పేగులు, గాల్ బ్లాడర్ లు వ్యాధిగ్రస్తమైనప్పుడు నడుము ప్రాంతానికి కూడా నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ కారణానుగునమైన చికిత్సలు అవసరమవుతాయి.

12. దీర్ఘకాల వ్యాధుల ప్రభావం / ప్రమాదకర రుగ్మతలు:

దీర్ఘకాలం నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు దానికి బరువు తగ్గిపోడవం కూడా తోడైతే, అది ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుంది. ఎముకల మూలుగా వ్యాధిగ్రసం కావడం (ఆస్టియోమైలైటిస్), బోన్ టీబీ, లుకేమియా, ఇంకా ఇతర రకాల క్యాన్సర్ల తాలూకు వివిధ అవస్థల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సత్వరమే వైద్య సహాయం పొందాలి.

సలహాలు:

జాయింట్ల కదలికలు తగ్గిపోవడం, నరాలమీద ఒత్తిడి పడటం వంటివి నడుము నొప్పిని పదే పదే తిరగబెట్టేలా చేస్తాయి. నడుము నొప్పి రాకుండా ఉండాలంటే కింది సూచనలు పాటించాలి.

1. నడుము నొప్పికి నివారణగానూ, చికిత్సగానూ దశమూలాలను, శొంఠి వాడుకోవచ్చు. వీటిని డికాక్షన్ కాచి పూటకు అయిదు చెంచాల చొప్పున రెండు చెంచాల వంటాముదంతో కలిపి తీసుకోవాలి. దీనితోపాటు త్రయోదశాంగ గుగ్గులు అనే మందును లోపలికి, మహానారాయణ తైలం అనే ఔషధాన్ని బాహ్య ప్రయోగానికి వాడవలసి ఉంటుంది.

2. బరువులను, బ్యాగ్ లను, సూట్ కేసులను మోయాల్సి వచ్చినప్పుడు ఒక చేత్తో కాకుండా, రెండు చేతులతోనూ పట్టుకోండి. బరువులతో చాలా దూరం నడవాల్సి వస్తే మధ్య మధ్యలో సేదతీరే వరకూ ఆగండి.

3. స్టూల్స్ మీద, బ్యాక్ రెస్ట్ లేని ఆసనాల మీద కూర్చోవద్దు. కుర్చీలో కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. పాదాలను నేల మీద బల్లపరుపుగా ఆనించాలి. చేతులను హ్యాండ్ రెస్ట్స్ మీదగాని, ఓడిలోగాని పెట్టుకోవాలి.

4. పడుకునేందుకు స్థిరంగా ఉండే కాయర్ పరుపులను వాడాలి. ముఖ్యంగా పరుపు కిందనుండే బేస్ గట్టిగా ఉండాలి. ప్లేవుడ్ అయితే మంచిది.

5. బరువును లేపాల్సివస్తే, కాళ్లను ఎడంగా నడుమును నిటారుగా ఉంచి, మోకాళ్ల వద్ద ముడిచి, బరువును శరీరానికి దగ్గరగా పట్టుకొని లేపాలి. ముందుకు వంగొని బరువులను లేపకూడదు.

6. హైహీల్స్ చెప్పులు వాడకూడదు. ఎందుకంటే నడిచేటప్పుడు హైహీల్స్ శరీరాన్ని ముందుకు వంచుతాయి. దీనితో నడుము ప్రాంతంలోని వెన్ను మరింతగా వంకర తిరిగి నడుము నొప్పి ఎక్కువవుతుంది.

7. పక్కమీద పడుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు వెల్లకిలా పడుకోండి, మెడ వంపు కింద, మోకాళ్ల కింద మెత్తని దిండ్లను అమర్చుకోండి. ఇలా చేయడం వలన నడుము ప్రాంతపు కండరాలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

8. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు దుస్తులు ధరించాల్సి వస్తే నిలబడి కాకుండా పడుకునే ధరించండి.

9. పక్కమీద నుంచి లేచేటప్పుడు రెండు మూడు దశల్లో లేచి కూర్చోండి. ఒక్క ఉదుటన లేవకూడదు.

10. గర్భధారణ సమయంలో - ముఖ్యంగా చివరి మూడు మాసాలలో చాలా మందికి నడుము నొప్పి బాధిస్తుంటుంది. గర్భాశయంలో శిశువుపెరుగుతున్న కొద్దీ తల్లి భంగిమలో మార్పు చోటు చేసుకోవడమే దీనికి కారణం. గర్భస్థ శిశువు బరువును బ్యాలెన్స్ చేయడానికి తల్లి వెనుకకు వంగాల్సి వస్తుంది. దీనితో నడుముపైన అదనపు భారం పడుతుంది. ఇలాంటప్పుడు నిటారుగా నిలబడి నడుము మీద చేతులు ఉంచుకుని బలంగా శ్వాస తీసుకుని వెనుకకు వంగండి. ఇలా రోజుకు పది సార్లు చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.

11. నడుము నొప్పి కొత్తగా మొదలైనప్పుడు ఐస ప్యాక్లనూ, దీర్ఘకాలం నుంచి బాధిస్తున్నప్పుడు వేడి కాపాడాలనూ ప్రయోగిస్తే మంచి మార్పు కనిపిస్తుంది.

12. నడుము నొప్పి దీర్ఘకాలం నుంచి బాధిస్తున్నప్పుడు ముందు వెనుకలకు వెన్నును వంచుతూ చేసే వ్యాయామాల వల్ల, యోగాసనాల వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.



  • =========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

Friday, July 26, 2013

Overian Cancer, అండాశయంలో కలిగే కాన్సర్ ,ఒవెరియన్ క్యాన్సర్




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Overian Cancer, అండాశయంలో కలిగే కాన్సర్ ,ఒవెరియన్ క్యాన్సర్-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



అండాశయంలో కలిగే కాన్సర్ ను ఆంగ్లంలో “ఒవెరియన్ క్యాన్సర్” అంటారు. ఈ క్యాన్సర్ మహిళల్లో సంభవిస్తుంది. మహిళల్లో జనన అండాలను ఉత్పత్తి చేసే మరియు హార్మోన్లను ఉత్పత్తి చేసే అండాశయంలో కలుగుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాల మూలంగా ఈ క్యాన్సర్ ను ముందుగా కనిపెడితే సులభంగా నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ లక్షణాలు :

  •     కడుపులో ఒత్తిడి కలిగినట్లు అనిపించడం.
  •     పొత్తి కడుపులో నొప్పి మరియు ఉదరభాగం లో నొప్పిగా అనిపించడం.
  •     కొద్దిగా అన్నం తినగానే పొట్ట నిండుగా ఉన్నదనిపించడం.
  •     తరచుగా మూత్రానికి వెళ్ళడం.

ఈ పైన పేర్కొన్న లక్షణాలు అనేక కారణాల మూలంగా కలగవచ్చు. కానీ ఈ లక్షణాలు తరచూ ఒక వారం రోజులకు పైగా రావడం జరుగుతుంటే మీ డాక్టర్ ను సంప్రదించాలి .

ముఖ్యంగా మీ కుటుంబంలో అంటే రక్త సంబంధీకుల్లో ఎవరికైనా వక్షాల క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్), అండాశయ క్యాన్సర్ (ఒవెరియన్ క్యాన్సర్) మరియు గుదము క్యాన్సర్ (కొలోన్ క్యాన్సర్) లాంటివి ఉంటే ఈ క్యాన్సర్ మీకు వచ్చే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వయస్సు కూడా అండాశయ క్యాన్సర్ వచ్చేందుకు ప్రధాన కారణం అని నిపుణులు తెలిపారు. మహిళలు రుతువిరతి (మెనోపాస్) దశలో కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. రుతుక్రమం ఆగిపోయే సమయంలో శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులకారణంగా కూడా అండాశయ క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. రుతుక్రమం నియంత్రించేందుకు వాడే మందుల మూలంగా కూడా ఈ క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. మహిళల్లో ఊబకాయం కూడా ఈ క్యాన్సర్ బారినపడేందుకు ఒక ముఖ్య కారణం అవుతుంది.

అండాశయ క్యాన్సర్ తెలుసుకోవడానికి ప్రత్యేక క్యాన్సర్ పరీక్షలేమీ లేవు. లక్షణాలుండవు కాబట్టి బాగా పెరిగిన తర్వాతే ఈ క్యాన్సర్ తెలుస్తుంది. ఇక ఈ అండాశయ క్యాన్సర్ ను నిర్ధారించేందుకు రక్త పరీక్ష, సి‌టి స్కాన్ మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఈ క్యాన్సర్ ముదిరిన తరువాత రక్షణ అవకాశాలు తక్కువ. కనుక దీనిని ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఈ క్యాన్సర్ వస్తే ఆపరేషన్ చేసి టిస్యూస్ ను తొలగించడం ఒక్కటే మార్గం.

అండాశయం క్యాన్సర్ ముఖ్యంగా అండాశయం పై భాగంలో ఏర్పడుతుంది. ఎక్కువశాతం ఈ విధమైన క్యాన్సర్ సోకుతుంది. 1988 నుండి 2001 వరకూ గణాంకాల ప్రకారం ఈ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొంది రక్షింపబడిన వారు కేవలం 89 శాతం మాత్రమే. ఈ క్యాన్సర్ కు ఆపరేషన్ జరిగిన అనంతరం తిరిగి ఈ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కేమో థెరపీ నిర్వహించి నియంత్రించవచ్చు. ఈ క్యాన్సర్ ఆపరేషన్ నిర్వహించి రెండు అండాశయాలను తొలగిస్తే ఆ మహిళల్లో ఋతుస్రావం వెంటనే నిలిచిపోయే అవకాశం ఉంది.

అదే విధంగా పిల్లలు లేని మహిళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు తెలియజేశారు. పిల్లలు పుట్టకుండా నియంత్రించే మందులను వాడే మహిళల్లో కూడా ఈ క్యాన్సర్ రావచ్చని నిపుణులు తేల్చారు. తక్కువ కేలరీస్ ఉన్న ఆహారం తీసుకున్న మహిళలు ఈ క్యాన్సర్ బారినుండి బయటపడవచ్చు.

అండాశయ క్యాన్సర్‌ నిర్ధారణకు కొత్త పరీక్ష

ఇక మనదేశంలో అండాశయ క్యాన్సర్‌ నిర్ధారణ సులభతరం కానున్నది. తక్కువ ఖర్చుతో, సర్జరీ అవసరం లేని కొత్త పద్ధతిని ప్రయోగశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పరీక్ష పేరు 'ఓవిఎ1'. ఇది ఒక రకమైన రక్తపరీక్ష. దీనికి యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. క్వెస్ట్‌ డయాగటస్టిక్స్‌ ఈ పరీక్షను పరిచయం చేయనుంది. శస్త్ర చికిత్సకు ముందు అండాశయాలు పెద్దగా మారే (ఒవేరియన్‌ మాస్‌) క్యాన్సర్‌ను అంచనా వేసే వీలుంది. అండాశయ క్యాన్సర్‌ సైలెంట్‌ కిల్లర్‌ వంటిది. దీనికి సంబంధించిన లక్షణాలను వివరించడం వీలుకాదు. సాధారణ పరిస్థితుల్లో వైద్యుడు ఒవేరియన్‌ మాస్‌కు కారణం క్యాన్సర్‌ అని గుర్తించడం సాధ్యం కాదు. శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తీసి పరీక్షిస్తే తప్ప. ' పొత్తి కడుపులో పెద్ద ముద్ద ఉంటే మేం అల్ట్రాసౌండ్‌, సిటి స్కాన్‌ చేయించుకోవాలని సూచిస్తాం. ఇది క్యాన్సరా? కాదా? అని నిర్ణయించడానికి ఆ ముద్ద నుంచి చిన్న ముక్కను సేకరించి టిష్యు కల్చర్‌ పరీక్ష చేస్తాం' అని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి చెందిన క్యాన్సర్‌ నిపుణుడు చెప్పారు. ' ఇప్పుడు శస్త్రచికిత్సకు ముందు, రక్త నమూనా ఆధారంగా ఓవిఎ1 పరీక్ష ఒవేరియన్‌ మాస్‌లో క్యాన్సర్‌ సంభ్యావతను గుర్తిస్తుంది. రెండు సార్లు సర్జరీ చేసే అవకాశాన్ని ఈ పరీక్ష నిలువరిస్తుంది. ఫలితంగా నొప్పి, శస్త్రచికిత్స ఖర్చు తగ్గడమే కాక రోగి మానసిక భావోద్వేగాలు కూడా తగ్గుముఖం పడతాయి' అని క్వెస్ట్‌ డయాగస్టిక్స్‌ ఇండియాకు చెందిన మెడికల్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పలట్‌ మీనన్‌ అంటారు.

    అండాశయ క్యాన్సర్‌ నివారణకు కొత్త ఔషదం

ఇటీవల కాలంలో అండాశయ క్యాన్సర్ అధికమవుతోంది. దీని నివారణకు ఔషదాలు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిని 33వ యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఓనకాలజీలో వీటి ఫలితాలను ప్రకటించారు. దీనిపై కెనడా పరిశోధకుడు డాక్టర్ బ్రాడ్లీ మంక్ మాట్లాడుతూ, ఇప్పటికే మూడవ దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోందన్నారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకూ ట్రాబెక్టెడిన్ తాజా ఔషదం అవుతుంది. తాము జరుపుతున్న పరిశోధనలో ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ చికిత్సను అమెరికా ఫుడ్ సంస్థ చాలా జాగ్రత్తగా ఎవాల్యూట్ చేయనున్నట్లు వివరించారు. మూడోదశలో చాలా మంది రోగులపై పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. త్వరలో ఈ మందు మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.

    అండాశయ క్యాన్సర్‌ను నివారించే మధుమేహ మాత్ర..........

టైప్‌-2 మధుమేహ చికిత్సలో వాడే మాత్ర అండాశ క్యాన్సర్‌ను నివారిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఒక మాత్ర ఖరీదు రోజూ 8 పైసలు మాత్రమే. చాలా కాలంపాటు మెట్ఫార్మిన్‌ (Metformin)‌ మాత్రను తీసుకున్న 1600 మంది బ్రిటన్‌ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ 40 శాతం తగ్గింది. స్విట్జర్‌లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

  •  ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, July 25, 2013

Spondylosis,స్పాండిలోసిస్‌, వెన్నునొప్పి


  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Spondylosis,స్పాండిలోసిస్‌, వెన్నునొప్పి-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన క్షీణదశకు వాడే సాధారణ పదము . " స్పాండి " అంటే అర్ధము వెన్నెముక , " లోసిస్ " అంటే సమస్య అని అర్ధము . స్పాండిలోసిస్ అనేది ఒకరకము ఆర్థ్రైటిస్ (arthritis) ఇది ప్రతి వెన్నుపూస  నడుమ హైట్స్ పెంచడము లేధా తగ్గించడము నకు సంబంధించిన వెన్నుపూసల క్షీణదశకు తెచ్చే రోగము. ఇది మెడబాగానకి వస్తే " సెర్వైకల్ స్పాండిలోసిస్ అని నడుము బాగానికి వస్తె లుంబార్ స్పాండిలోసిస్ అని అంటారు .

మెడదగ్గర వెన్ను భాగాలు అరిగి నొప్పి వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటుంటారు కొందరు. అలాగే వెన్ను కిందభాగంలో అరుగుదల సంభవిస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటుంటారు.కొంతమంది  వైద్యులుకూడా స్పాండిలోసిస్‌ పదాన్ని రెండింటికీవాడడంతో మనం ఇబ్బంది పడుతుంటాం. సరైన కారణం తెలియకుండా వెన్నుపూసలు, డిస్క్‌ అరుగుదలవల్ల వెన్ను నొప్పి వస్తుంటే స్పాండిలోసిస్‌ అంటారు. స్పైన్‌ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్నికూడా స్పాండిలోసిస్‌ అంటారు. మెడ పాంతంలో గానీ నడుము ప్రాంతంలోగానీ ఆస్టియో ఆర్థరైటిస్‌ వల్ల ఎముకలు అరిగితే దాన్ని స్పాండిలోసిస్‌  అంటున్నారు.  నడుము లేక మెడ, ప్రాంతంలో డిస్క్‌లు అరిగినా స్పాండిలోసిస్‌ అనే వాడుతున్నారు. ఇలా ఇన్ని రకాల మెడ, నడుం  వెన్నులోపాలకి స్పాండి లోసిస్‌ అని వాడుతున్నారు. చాలా బ్రాడ్‌గా వయస్సును బట్టి వెన్ను అరగడం సర్వసాధారణం. నిజానికి 60 సంవత్సరాలు పైబడి న వాళ్ళలో వెన్నెముక అరిగిపోయి స్పాండిలోసిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎం.ఆర్‌.ఐ లేక సి.టి. స్కాన్‌ లతో స్పాండిలోసిస్‌ని గుర్తించ గలుగుతాం.

వెన్నునొప్పికి కారణాలు చాలా ఉన్నాయి.

 వెన్నుపూసల మధ్య నుంచి నరాలు వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్ననయితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. దీన్ని నెర్వల్ స్పైనోసిస్‌ అంటారు. రోగి నడిచే టప్పుడు కాళ్ళ నొప్పి వస్తుంటుంది. కాళ్ళల్లో, చేతుల్లో, జాయింట్స్‌ వున్నట్టుగానే వెన్నులో కూడా జాయింట్స్‌ఉంటాయి.ఈ జాయింట్స్‌ కూడా ఆస్టియా ఆర్ధరైటిస్‌ వల్ల అరగ వచ్చు. అప్పుడూ నొప్ప వస్తుంది. డిస్క్‌లు అరగడం వల్ల కూడా నొప్పి కలగవచ్చు. డిస్క్‌లో వాటర్‌ తగ్గి దాని పనిని అది పూర్తి చేయలేక పోవడాన్ని డిస్క్‌ అరుగుదలగా చెప్పుకోవచ్చు. దీని వల్ల మెడలోనూ, నడుము క్రింద భాగంలో నొప్పి రావచ్చు. ఆ నొప్పికాళ్ళల్లోకి చేతు ల్లోకి రావచ్చు.

 నొప్పికి కారణాలు చెప్పుకున్నాం కదా. ఒక్కో కారణానికి వైద్యం ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి స్పాండి లోసిస్‌ లేక వెన్ను అరుగుదల అని చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ అరుగుదల లేక నొప్పి ఎందు కొచ్చిందో తెలుసుకొని దానికి తగ్గట్టు వైద్యం చేయాలి. అందుకే ఈ వివరాల్ని తెలుసుకున్న తరువాత వైద్యులు ఒక నిర్ణయానికొస్తారు.  రోగి ఆరోగ్య చరిత్ర-నొప్పి ఎలా వస్తుంది. ఇంకా ఇతర లక్షణాలు ఏమున్నాయి. ఏ ప్రాంతంలో నొప్పి వస్తోంది. ఏ స్థాయిలో వస్తోంది. ఏ పనుల వల్ల పెరుగుతోంది లేక తగ్గుతోంది తెలుసుకుంటారు.

 నొప్పికి కారణం తెలుసుకోవడానికి కొన్ని భౌతిక పరీక్షలని చేస్తారు.  ఎం.ఆర్‌.ఐ స్కాన్‌, సిటిస్కాన్‌ లేక ఎక్స్‌రే లాంటి పరీక్షలు చేయించి పరి శీలిస్తారు. నొప్పి తగ్గడానికి అవసర మైనచోట కొన్ని ఇంజెక్షన్‌లు చేస్తారు. వీటిని బట్టి రోగ నిర్థారణ చేస్తారు. అది డీజనరేటివ్‌ డిస్కో, ఆర్థరైటిసో, స్పైనల్‌ స్టినోసిసో కారణం ఏంటనేది తెలుసుకుంటారు.

 కాబట్టి స్పాండిలోసిస్‌ అనేది రోగ నిర్ధారణకు వాడే సరైన పదం కాదు. సరైన కారణం ఏమిటో నిర్ధారిస్తేనే సరైన చికిత్స చేయడానికి వీలవు తుంది. మెడనొప్పి చేతుల్లోకి వ్యాపిం చడం, నడుంనొప్పి కాళ్ళల్లోకి వ్యాపించవచ్చు. ఇలా వెన్ను ప్రాంతం నుంచి కాళ్ళు, చేతుల్లోకి నొప్పి వ్యాపి స్తుంటే దాన్నిఖచ్చితంగా వెన్ను తాలూకు ఇబ్బందేనని గుర్తించాలి. అనుభవజ్ఞులైన వైద్యుల వద్దకి సకాలంలో వెళ్ళి సరైన రోగ నిర్థారణ జరిగేలా చూసుకోవాలి. సరైన రోగ నిర్ధారణ జరిగినప్పుడే సరైన చికిత్సా దొరుకుతుంది. తిరిగి ఆరోగ్యాన్ని పొందగలం.

చికిత్స :
ఈ సమస్యను మందుల ద్వారా సులభంగానే నయం చేయవచ్చు. కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో మందులు వాడటంతో పాటు కొన్ని స్వల్ప ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. దాంతో పాటు అవసరమైతే సులభమైన వ్యాయామం చేయడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అయితే ఇటువంటి సమస్యలకు సమస్య తీవ్రతను బట్టి నయం అవడానికి 6 నెలల నుండి ఏడాదిన్నర (18 నెలలు) వరకు సమయం పట్టవచ్చును.

-డాక్టర్‌. జి.పి.వి. సుబ్బయ్య,-స్పైన్‌ సర్జన్‌,గ్లోబల్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌ @ విశాలాంధ్ర దినపత్రిక (Tue, 7 Feb 2012).

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, July 11, 2013

Ten point formula for good health,చక్కని ఆరోగ్యానికి పది సూత్రాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Ten point formula for good health,చక్కని ఆరోగ్యానికి పది సూత్రాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అవసరానికన్నా అధికంగా  తినటం అలవాటైన వారికి..  కడుపులో జీర్ణాశయం గోడలపై  వాపు తరహా ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి... అజీర్తి, ఆకలి పెరగటం, పేగుల్లో చిరాకు, బరువు పెరగటం  వంటి సమస్యలకు దారితీస్తుంది.  ఆహార అలవాట్లు, జీవనశైలిలో  చిన్నచిన్న మార్పులు తీసుకురావటం  ద్వారా ఆరోగ్యంలో, శరీర ఆకృతిలో  పెద్దపెద్ద మార్పులే తీసుకు రావచ్చంటున్నారు  నిపుణులు.
  • 1. రోజూ గ్లాసుడు పచ్చి కూరగాయల రసం తాగటం శ్రేయస్కరం. క్యారెట్‌, ఉసిరి, కూరగాయల రసాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉత్తేజాన్నిస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి.
  • 2. సరిపడినన్ని మాంసకృత్తులు తీసుకోవాలి. ఇవి కణజాలానికి మరమ్మతులు చేస్తాయి. ఎముకల ఎదుగుదలను ప్రేరేపిస్తాయి.
  • 3. బీటాకెరటిన్‌, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, కూరగయాలు, గింజల్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.
  • 4. ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారనేది శరీరాకృతి చక్కగా ఉండటం ఒక సంకేతం. తక్కువగా తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలూ నెమ్మదిస్తాయి.
  • 5.వారంలో ఒకరోజు ఇతరత్రా ఆహారం తీసుకోకుండా పచ్చి కూరగాయ ముక్కలు (సలాడ్లు) తినొచ్చు. స్థూలకాయాన్ని అడ్డుకోవటానికి ఇది చక్కని మార్గం.
  • 6. నెలకు ఒక్కరికి 500 మి.లీ.కన్నా ఎక్కువగా నూనెల్ని వాడకూడదు. అది కూడా ఆలివ్‌, తవుడు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు మేలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఆహారం, వేపుళ్లు తగ్గించటం ద్వారా వయసు మీద పడటాన్నీ నిరోధించవచ్చు.
  • 7. ఒత్తిడిని నియంత్రించాలి. వ్యాధులకు కారణమయ్యే వాటిలో మనసూ ముఖ్యమైనదే. ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను అణచి పెడుతుంది. వయసు మీద పడేలా చేస్తుంది.
  • 8. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులతో అనుబంధాల్ని పెంచుకోవాలి. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే శక్తివంతమైన సాధనం.
  • 9. వారానికి అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోతాయి. ఏరోబిక్‌ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి.
  • 10. పొగతాగటం మానటం ద్వారా ఆరోగ్యానికి మరింత బలాన్ని అందించవచ్చు.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, July 9, 2013

Summer Diarrhoea and vomitings, వేసవి లో వాంతులు, విరేచనాలు





  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Summer Diarrhoea and vomitings, వేసవి లో వాంతులు, విరేచనాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వేసవి వస్తోందంటే చాలు.. సెలవులూ సంతోషాలూ ఆహ్లాదకరమైన సాయంత్రాలన్నీ బాగానే ఉంటాయిగానీ.. ఈ వేసవి వెంబడే కొన్ని చిన్నచిన్న బెడదలు మనల్ని వేధించుకుతినటం మొదలుపెడతాయి. వీటిలో ముఖ్యంగా, ముందుగా చెప్పుకోవాల్సింది... ఉన్నట్టుండి పొట్టలో మెలి తిప్పేస్తూ ముంచుకొచ్చే వాంతులు, విరేచనాలు! , మొదలయ్యాయంటే చాలు వెంటవెంటనే వెళ్లాల్సివస్తూ.. గంటల వ్యవధిలోనే ఒంట్లో నీరంతా ఒడిచేసి.. నీరసం ముంచుకొచ్చేలా చేస్తాయి. పిల్లల్లో ఇటువంటి సమస్య తలెత్తితే అది మరింత ప్రమాదకరం. వేసవి వెళ్లేలోపు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దీని బారినపడుతూనే ఉంటారంటే ఇదెంత విస్తృతమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కొద్దిపాటి జాగ్రత్తలతో దీని బారినపడకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మొదలైనా.. అవగాహనతో వ్యవహరిస్తే తేలికగా దీన్నుంచి బయటపడొచ్చు.

వేసవి.. చెరువులూ దొరువులూ ఎండిపోయి... నల్లాలు నిలిచిపోయి.. స్వచ్ఛమైన తాగునీటి కరవు తాండవించే కాలమిది. మరోవైపు సెలవులూ, విహారాలూ పెరుగుతాయి కాబట్టి బయట చిరుతిళ్లు, భోజనాలూ పెరుగుతాయి కూడా. దీంతో రద్దీకి తగ్గట్టుగా సరఫరా తగ్గిపోయి.. నీరు, ఆహారం  కలుషితమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో వేసవి ఆరంభమైన దగ్గరి నుంచీ  ఎంతోమంది ఆరోగ్యసమస్యల బారినపడుతుంటారు. ఇలా కలుషితాహారం, నీటి కారణంగా సంక్రమించే అతిపెద్ద సమస్యలు- వాంతులు, నీళ్ల విరేచనాలు! పెద్దల్లో కూడా ఈ సమస్య సహజమే అయినా పిల్లల్లో ఇది మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ సీజన్లో పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం.

లక్షణాలు!
ఉన్నట్టుండి కొద్దిపాటి పొట్టలో నొప్పితో పల్చగా, నీళ్లు నీళ్లుగా విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు తీవ్రంగా 10-15 సార్లు కూడా కావచ్చు. కొద్దిపాటి జ్వరం కూడా ఉండొచ్చు. విరేచనం పెద్దగా ఉండొచ్చు. ఒకటి రెండు రోజులు వాంతులు కూడా అవుతాయి. తర్వాత వాంతులు తగ్గినా నీళ్ల విరేచనాలు మరికొద్ది రోజుల పాటు వేధించొచ్చు.  సమస్య విరేచనాలే అయినా...నీళ్ల విరేచనాలతో తలెత్తే పెద్ద సమస్య- ఒంట్లో నీరు, లవణాలు, తగ్గిపోవటం! నిజానికి నీళ్ల విరేచనాల వల్ల ప్రమాదం ముంచుకొచ్చేది ఒంట్లో నీరు, లవణాలు అధికంగా తగ్గిపోతుండటం వల్లే. పిల్లలుగానీ, పెద్దలుగానీ నీళ్ల విరేచనాలు అవుతున్నాయంటే వాళ్లు నీరు, ద్రవాహారం ఎంత తాగితే అంత మంచిది. మన శరీరంలో 4% నీరు తగ్గిపోయే వరకూ పైకి ఏ
ప్రభావమూ కనబడదు. 5% కానీ, అంతకంటే ఎక్కువగానీ తగ్గిపోతే డీహైడ్రేషన్‌ లక్షణాలు స్పష్టంగా కనబడటం మొదలవుతాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. పిల్లల్లోఇది మరీ ప్రమాదకరం. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు విరేచనాల ద్వారా ఎంత నీరు బయటకు పోతోందో అంతకంటే ఎక్కువ నీరు, ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి! ఇది కీలకమైన అంశం. ద్రవపదార్ధాలను తరచుగా, ఎక్కువగా తాగుతుండాలి. పోతున్న నీటిని తిరిగి పూడ్చుకోవటానికి నోటి ద్వారా ఇవ్వాల్సిన ద్రావణాన్ని ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)' అంటారు. దీన్నిప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలతో తీసుకోవటం, పిల్లలకు కూడా జాగ్రత్తగా పట్టటం ముఖ్యం.
* పెద్దలు ద్రవాహారం సాధ్యమైనంత ఎక్కువగా తీసుకుంటూ తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
* పిల్లలకు ఒక్కో విరేచనానికి ఎంత నీరు పోతోందో తప్పనిసరిగా అంతకంటే ఎక్కువే 'ఓఆర్‌ఎస్‌' ద్రావణం తాగించాలి.
* పిల్లలకు ఓఆర్‌ఎస్‌తో పాటుగా- బియ్యంతో లేదా సగ్గుబియ్యంతో తయారు చేసిన గంజి వంటివి, కొద్దిగా ఉప్పు కలిపిన పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, క్యారెట్‌ సూప్‌ వంటివి తాగించటం చాలా అవసరం.
* చాలామంది పిల్లలకు డయేరియా రాగానే అంతకుముందు వాళ్లకు రోజూ పెడుతున్న ఆహారాన్ని ఆపేస్తారు. ఇలా చెయ్యకూడదు. పిల్లలు తింటుంటే రోజువారీ ఇచ్చే ఆహారం ఆపాల్సిన అవసరం ఉండదు.
* తల్లిపాలైతే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. పాలు తాగే పిల్లలైతే అవే పట్టాలి. పోతపాలైతే ఎప్పటిలాగే ఇవ్వాలి, ప్రత్యేకించి పల్చన చెయ్యాల్సిన పని కూడా లేదు. సీసాతో తాగే పిల్లలైతే మాత్రం ఆ సీసా తీసేసి కప్పుతోనో, చెంచాతోనో పట్టించాలి.
* తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీ, ఉప్మా, అటుకులు, మరమరాల వంటివన్నీపెట్టొచ్చు. విరేచనాలు తగ్గిపోయి పిల్లలు కోలుకుంటున్న దశలో- అంతకు ముందుకంటే కొద్దిగా ఆహారాన్ని పెంచి ఇవ్వటం అవసరం.
* విరేచనాల తీవ్రత ఎక్కువగా ఉన్నా, ఒకట్రెండు రోజులైనా తగ్గకపోతే వెంటనే డాక్టరుకి చూపించటం తప్పనిసరి.

డీహైడ్రేషన్‌ తలెత్తితే!
* మొదట్లో దాహం ఉంటుంది. తర్వాత పిల్లలైతే విపరీతంగా ఏడుస్తారు.పెద్దల్లో చికాకు స్వభావం, నిస్త్రాణ మొదలవుతాయి. కళ్లు లోపలికి పోవటం ఆరంభమవుతుంది. నోటిలోను, నాలుక మీద తేమ తగ్గిపోతుంది. కళ్లు నీరు లేక పొడిగా మారతాయి. డీహైడ్రేషన్‌ తీవ్రమైతే చర్మం వేలాడినట్లవుతుంది. మూత్రం తగ్గిపోతుంది. మరీ తీవ్రమైతే పిల్లలు షాక్‌లోకి వెళతారు. నాడి తక్కువగా కొట్టుకుని సొమ్మసిల్లినట్లు, స్పృహ తప్పుతారు. కాబట్టి పరిస్థితి అసలు ఇక్కడి వరకూ రాకుండా చూడటం, ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

మందులేమిటి?
చాలామంది ఠక్కున విరేచనాలు కట్టేసే బిళ్లలు కావాలని మందులు వేసేసుకుంటుంటారు. కానీ నీళ్ల విరేచనాలను అరికట్టటానికి 'యాంటీ డయేరియల్‌' రకం మందులేవీ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి పేగుల కదలికలను తగ్గిస్తాయి. దీంతో అక్కడ ఉన్న బ్యాక్టీరియా సంఖ్య పెరిగిపోతుంది. వాటి నుంచి వెలువడే విషపదార్ధాల స్థాయీ పెరుగుతుంది. మందు ఇవ్వగానే విరేచనాలు తగ్గిపోయినట్లు అనిపిస్తుందిగానీ ఆ తర్వాత విరేచనాలు అంతకంటే ఎక్కువ కావచ్చు. అందుకని ఈ మందులు వాడకపోవటమే ఉత్తమం.
* ఉన్నట్టుండి ముంచుకొచ్చే ఈ తరహా 'అక్యూట్‌ డయేరియా' దానంతట అదే తగ్గిపోతుంది. మనం చెయ్యాల్సిందల్లా ఒంట్లో నీరు, లవణాలు తగ్గకుండా (డీహైడ్రేషన్‌) రాకుండా చూసుకోవటం ఒక్కటే. నీరు, లవణాలతో పాటు ఈ సమయంలో పోషకాహారం తగ్గకుండా చూడాలి. పిల్లలకు అవసరమైతే కొద్దిగా పెంచాలి కూడా. ఈ విధంగా చేస్తే చాలా త్వరగా కోలుకుంటారు.

నీళ్లు కాకుండా... రక్తవిరేచనాలు, చీముబంక విరేచనాలు అవుతుంటే మాత్రం వైద్యులు వాటికి కచ్చితంగా యాంటీబయాటిక్‌, యాంటీఅమీబిక్‌ మందులు ఇస్తారు, వాటిని ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా తీసుకోవాలి.

ఓఆర్‌ఎస్‌
చాలామంది నీళ్లవిరేచనాలు ఆరంభం కాగానే ఎలక్ట్రాల్‌ వంటి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు తెచ్చుకుంటారుగానీ.. ఆ ప్యాకెట్‌ చించి ఎప్పటికప్పుడు రెండు మూడు చెంచాలు గ్లాసులో వేసి కలుపుకొని తాగుతుంటారు. ఇది సరికాదు. ఒక ప్యాకెట్‌ మొత్తాన్ని ఒక లీటరు నీటిలో కలిపెయ్యాలి. అప్పుడే ఆ నీటిలో లవణాలన్నీ సరైన మోతాదులో ఉంటాయి. ఇలా తయారు చేసిన ద్రావణం (అవసరమైతే 24 గంటలు కూడా నిల్వ ఉంచుకోవచ్చు) నుంచి కొద్దికొద్దిగా వేరే గ్లాసులోకి తీసుకుని తాగాలి.

వేసవిలో....
* వీధి పక్కని దుకాణాల్లోనే కాదు.. పెద్దపెద్ద హోటళ్లలో కూడా నీళ్ల విషయంలో, శుద్ధి చేసే విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారో చెప్పటం కష్టం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి.
* పండ్ల రసాలు, చెరుకురసం వంటివి దాహాన్ని తీర్చటంలో మంచివేగానీ వాటిని శుభ్రమైన ప్రదేశంలో తయారుచెయ్యటం ముఖ్యం. అలాగే వాటిలో కలిపే 'ఐసు' ఎక్కడి నుంచి తెచ్చారో, ఆ ఐసు తయారీదారులు శుభ్రత పాటించారో లేదో చెప్పటం కష్టం. కాబట్టి బయట వాడే ఐసుల జోలికి పోకపోవటం మేలు.
* మలం వ్యాధికారక క్రిముల నిలయం. కాబట్టి మలవిసర్జనకు వెళ్లొచ్చిన ప్రతిసారీ చేతులను తప్పనిసరిగా సబ్బుతోనే కడుక్కోవాలి. నీళ్లతో కడుక్కుంటే చాలదా? అనుకోవద్దు. సబ్బుతో రుద్ది కడిగితే మాత్రమే సూక్ష్మాతిసూక్ష్మమైన క్రిములు తొలగిపోతాయి.
* ఆహారాన్ని తయారుచేసే ముందు, వడ్డించేటప్పుడు, తినేటప్పుడు కూడా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. టాయ్‌లెట్‌లకు వెళ్లిరాగానే సబ్బుతో శుభ్రంగా చేతులు రుద్దిరుద్ది కడుక్కోవటం చాలా అవసరం. చేతులు కడుక్కునే విషయంలో తీసుకునే ఈ చిన్న జాగ్రత్త.. అసలు విరేచనాల బారినపడకుండా రక్షించటంలో చాలా కీలకమైనది.
* ఆహారాన్ని సాధ్యమైనంత వరకూ వేడివేడిగా తినాలి. ఇళ్లలో నీటిని కాచి తాగటం ముఖ్యం. అది కూడా నీరు మరిగే స్థాయికి వచ్చిన తర్వాత సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కూడా అదే గిన్నెలో ఉంచాలి. దానిపైన సరైన మూత ఉంచటం, అవసరమైనప్పుడు దాన్లోంచే గ్లాసులో వంపుకొని తాగటం మంచిది.
* నీళ్ల విరేచనాలే కాదు.. హెపటైటిస్‌-ఎ, ఇ వంటి వైరస్‌ల కారణంగాతలెత్తే కామెర్లు కూడా ఇలా కలుషిత పదార్ధాల ద్వారానే సంక్రమిస్తాయి.వేసవిలో వీటి బెడదా ఎక్కువే. అందుకే తాగునీరు, ఆహారం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, July 8, 2013

Duties of A.P medical council,ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ విధులు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Duties of A.P medical council,ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ విధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలు అందించాలనుకునే వారెవరైనా 'ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌'లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక రిజిస్టర్‌ చేసుకుంటేనే వారికి ప్రాక్టీసు చేసుకోవటానికి అర్హత లభిస్తుంది. వైద్య వృత్తికీ, ప్రభుత్వానికీ మధ్య వైద్యమండలి అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా పని చేస్తుంది. రాష్ట్ర వైద్యమండలి ప్రధాన కర్తవ్యం వైద్యుల పేర్ల నమోదుతో పాటు వైద్యులంతా నియమ నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా చూడటం. అలాగే చికిత్సలో నిర్లక్ష్యం మూలంగా తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించి కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీ, ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి ఇలా ఎవరికి ఫిర్యాదు చేసినా.. చివరికి జరిగింది 'తప్పో ఒప్పో' నిర్ణయించేది కూడా వైద్యమండలే. ఈ బాధ్యతను దేశంలో 'ఎంసీఐ', రాష్ట్రంలో 'ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌' నిర్వహిస్తాయి. ఎవరైనా వైద్యులు తప్పుచేసినట్టు రుజువైతే చర్యతీసుకునే అధికారం కూడా దీనికి ఉంది.

* ఎవరైనా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా తమకు చికిత్సలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే అది ముందుగా వైద్యమండలి ఛైర్మన్‌కు అందుతుంది. ఆయన దాన్ని 'నైతిక ప్రమాణాల కమిటీ'కి పంపిస్తారు. ఇందులోని సభ్యుల్లో ఇద్దరు మినహా అందరూ వైద్యమండలికి చెందినవారే ఉంటారు. ఆ ఇద్దరినీ పేరు పొందిన నిపుణుల నుంచి ఎంపిక చేసి నియమిస్తారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆ కమిటీ దానిపై తన అభిప్రాయాన్ని అందిస్తుంది. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా సందేహముంటే ఈ కమిటీ ఇతర నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుంది. నైతిక కమిటీ అభిప్రాయంపై వైద్య మండలి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తిరిగి చర్చిస్తుంది. అనంతరం సర్వసభ్య బృందం కూడా దాన్ని పరిశీలిస్తుంది. అవసరమైతే మరోసారి నిపుణుల సలహానూ అడుగుతుంది.

* ఫిర్యాదు అందిన తర్వాత ఫిర్యాదు చేసినవారినీ, సంబంధిత వైద్యుని కూడా పిలిచి మండలి ప్రశ్నిస్తుంది. సంజాయిషీ కోరుతుంది. ఒకవేళ పిలిచిన సమయానికి సంబంధిత వైద్యుడు హాజరు కాకపోతే దాన్ని మరో నెలకు వాయిదా వేయాల్సి రావొచ్చు. అందువల్ల మొత్తమ్మీద ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవటానికి 6 నెలల నుంచి ఏడాది వరకూ పట్టొచ్చు. అయితే వీలైనంత త్వరగానే ఫిర్యాదును పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు.

* ఏటా కౌన్సిల్‌కు 30-40 ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు కూడా. వైద్యులను సస్పెండ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

* గత ఆరున్నరేళ్లలో ఏపీ వైద్యమండలికి 180కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిల్లో 140 కేసులను పరిష్కరించారు. 18 మంది వైద్యులపై చర్యలు తీసుకున్నారు. చిన్న తప్పుకైతే హెచ్చరిస్తారు. పెద్ద తప్పు అయితే సస్పెన్షన్‌ కూడా చేస్తారు.

* వైద్యులపై ఫిర్యాదు చేయాలనుకునేవారు రూ.20 స్టాంపు పేపరుపై రాసి వైద్యమండలికి పంపించాలి. కేస్‌ వివరాలు, డిశ్చార్జి పత్రాలు జతచేయాలి. దొంగ డిగ్రీలను ప్రకటించుకున్నారని ఫిర్యాదు చేస్తే.. ఆ డాక్టర్‌ పేరుతో నడుస్తున్న ఆసుపత్రి బోర్డు ఫొటో, ప్రిస్కిప్షన్‌లను పంపించొచ్చు. విచారణకు పిలిచినపుడు ఫిర్యాదుదారులు తప్పకుండా స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిర్యాదుదారు హాజరుకాకపోతే ఆ ఫిర్యాదును కొట్టేస్తారు.

* ప్రస్తుతం చాలామంది ఎంబీబీఎస్‌ వైద్యులు కూడా తమకుతాము 'డయాబెటాలజిస్టు'లుగా రాసుకుంటున్నారు. నిజానికి మన దేశంలో 'డీఎం, ఎండోక్రైనాలజీ' చేసినవారు మాత్రమే డయాబెటాలజీలో ప్రత్యేక నిపుణులు. ఎంబీబీఎస్‌లో జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ చేసినవారూ మధుమేహానికి చికిత్స చేయొచ్చు. అయినా వారు 'డయాబెటాలజిస్టు'లమని ప్రకటించుకునే అధికారం లేదు. అలా ప్రచారం చేసుకోవటం వల్ల అందులో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వైద్య నిపుణుడిగా ప్రజలు పొరపడే అవకాశముంది. అలా ఎవరైనా ప్రకటించుకుంటే ఫిర్యాదు చెయ్యచ్చు కూడా.

* మనదేశంలో ఇచ్చే 'ఫెలోషిప్‌'లేవీ గుర్తింపు పొందిన డిగ్రీలు కావు. విదేశాల్లో ఫెలోషిప్‌ అంటే మూడు, నాలుగేళ్ల పాటు ఎండీలాగా శిక్షణపొందుతారు. కానీ మన దేశంలో ఫెలోషిప్‌లు ఆరు నెలలు, ఏడాది మాత్రమే కొనసాగుతాయి. ఇవి మూడేళ్ల కోర్సులు కావు కాబట్టి వీటికి డిగ్రీలుగా గుర్తింపు లేదు. ఈ ఫెలోషిప్‌ల పేరుతో ప్రచారం సరికాదు.

* త్వరలో ఒక ఆసుపత్రి ప్రారంభం అవుతుందనో, ఫలానా కొత్త డాక్టర్‌ తమ ఆసుపత్రికి వచ్చారనో, ఒక డాక్టర్‌ కొత్తగా డిగ్రీ పొందారనో.. ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయటానికి ప్రచారం చేసుకోవచ్చు. అంతేగానీ వైద్యులు ప్రచారం చేసుకోవటానికి అనుమతి లేదు. ప్రత్యేకంగా హెల్త్‌ ఎడ్యుకేషన్‌ పేరు మీద వైద్యులు రోజూ టీవీల్లో ప్రచారం చేసుకోవటమూ అనైతికమే.

* రష్యా, ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో ఎండీ అనే డిగ్రీ ఇచ్చినా అది మన ఎంబీబీఎస్‌తో సమానమనే గుర్తించాలి. ఆ దేశాల్లో ఎంబీబీఎస్‌ డిగ్రీనే 'ఎండీ' అని ఇస్తారు. ఇలాంటి వైద్యులు ఎండీ పేరుతో ఇక్కడ చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నివారించేందుకు రష్యా, ఉక్రెయిన్‌లో ఎండీ చదివిన వారి పేరును రిజిస్టర్‌ చేసుకునే సమయంలోనే ఆ డిగ్రీ ఎంబీబీఎస్‌తో సమానమని రాష్ట్ర వైద్యమండలి ప్రత్యేకంగా పేర్కొంటోంది కూడా. ఆ విషయాన్ని బోర్డులపైనా, ప్రిస్కిప్షన్‌ల పైనా పేర్కొనాలని సూచిస్తోంది.
వైద్యపరమైన నిరాదరణకు, వైద్యుల అనైతిక ప్రవర్తనలకు గురైనట్లు భావించేవారు తమ ఫిర్యాదును ఈ చిరునామాకు పంపించొచ్చు.

చిరునామా : ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ --పోస్ట్‌బాక్స్‌ నంబర్‌: 523, --సుల్తాన్‌బజార్‌, -హైదరాబాద్‌-500095, ఆంధ్రప్రదేశ్‌

courtesy with : Dr.E.Ravinder Reddy , chairman -AP medical council@eenadu sukhibhava.
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, July 7, 2013

Oniomaniacs,ఓనియోమానియాక్స్‌,ఏది చూసినా కొనాలనిపించే తత్వమున్న వారు.

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Oniomaniacs,ఓనియోమానియాక్స్‌,ఏది చూసినా కొనాలనిపించే తత్వమున్న వారు.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మీకు తరచూ షాపింగ్‌ చెయ్యాలనీ, ఎడాపెడా కొనెయ్యాలనీ అనిపిస్తోందా?ఇలాంటి సమస్య ఎక్కువగా డిప్రెషన్‌కు లోనైన స్త్రీలలో కనిపిస్తుంటుంది. దీనినే 'ఓనియోమానియా'గా వ్యవహరిస్తున్నారు.
షాపింగ్‌ చెయ్యాలనే తహతహ విపరీతంగా ఉండే వారిని 'ఓనియోమానియాక్స్‌'గా పిలుస్తున్నారు. ఇలాంటివారిలో ప్రతి పదిమందిలో ఆరుగురు మహిళలే ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇదొక గుర్తించని రుగ్మతగా చెప్పవచ్చు. ఈ సమస్యకు లోనైన వారిలో తరచూ షాపింగ్‌కు వెళ్లాలనే కోరిక పుడుతుంటుంది. వీరు షాపింగ్‌ కోసం ధారాళంగా ఖర్చు పెట్టేస్తుంటారు. డిప్రెషన్‌తో బాధపడే మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పురుషులతో పోలిస్తే కొనుగోలు అనేది మహిళల మనస్తత్వంపై బలమైన ముద్ర వేస్తుంది. ఈ కారణంగానే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వస్తువులు, ఇంటి సరకులు, వ్యక్తిగత సామగ్రి వంటివన్నీ కొనుగోలు చేయటం మహిళత్వానికి చిహ్నాలుగా వారు భావిస్తుంటారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది మహిళల్లో ఇదొక ఒత్తిడి తొలగించుకునే మార్గమనీ స్పష్టం చేస్తున్నారు.
  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, July 6, 2013

Cholesterol role in Muscle improovement, కండర నిర్మాణము-మరమ్మత్తులో కొలెస్టిరాల్ పాత్ర


  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Cholesterol role in Muscle improovement, కండర నిర్మాణము-మరమ్మత్తులో కొలెస్టిరాల్ పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  


 కొలెస్ట్రాల్‌తో నష్టమే కాదు, లాభాలూ ఉన్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కండర నిర్మాణాలు పెరగటానికీ, బలహీనపడిన కండరాల మరమ్మతులోనూ కొలెస్ట్రాల్‌ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. కొలెస్ట్రాల్‌ మైనంలాంటి కొవ్వు పదార్థం. ఇది శరీరమంతటా పరచుకుని ఉంటుంది. మనం తీసుకున్న కొవ్వు నుంచి కాలేయం కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. ఒంట్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు ఎక్కువైతే గుండెజబ్బు సహా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే.. మితంగా ఉన్నంత వరకూ దీనితో పలు ఉపయోగాలు ఉన్నట్లు టెక్సాస్‌ ఏఎమ్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 60-69 ఏళ్ల మధ్య వయసున్న 55 మంది స్త్రీ పురుషుల్ని 12 వారాలపాటు పలురకాల వ్యాయామాలు చేయించారు. ఆహారం ద్వారా కొలెస్ట్రాల్‌ తీసుకున్న వారిలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా.. కండర సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. కొలెస్ట్రాల్‌ నిల్వలు తక్కువగా ఉంటే.. వ్యాయామం వల్ల కండర సామర్థ్యం పెరగటాన్ని తగ్గిస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌ వాపు తరహా స్పందనలను ప్రేరేపిస్తుంది. అయితే.. గుండె వంటి ప్రాంతంలో ఈ రకం ఇన్‌ఫ్లమేషన్‌ అంతగా క్షేమకరం కాదు, కానీ కండర నిర్మాణానికి మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో కొలెస్ట్రాల్‌ చక్కగా ఉపయోగపడుతున్నట్లు తేలింది.

   
  • ==========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Doctors life and problems, జీవితములో వైద్య లు పడుతున్న ఇబ్బందులు

  •  


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పొద్దున లేపడం దగ్గర్నుంచి గోరుముద్దలు తినిపించి, జోలపాడి పడుకోబెట్టే అమ్మ... దగ్గరుండి ఆటలాడి, సరదాగా సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లే నాన్న.. ఏ పిల్లలకైనా ఇవి సాధారణ కోరికలు. ఈ పనులన్నీ చేయాలన్న ఆశ తల్లిదంవూడులది కూడా. కుటుంబానికి ప్రేమపునాది వేసే ఈ చిన్న చిన్న విషయాలే కొంతమంది జీవితాల్లో అరుదైన బహుమతులవుతాయి. అలాంటి కుటుంబాల్లో ముందు వరుసలో ఉండేది డాక్టర్స్ ఫ్యామిలీ. డాక్టర్ దగ్గరికి వెళ్లడం అంటే వెయిటింగ్.. వెయిటింగ్ అని విసుక్కుంటూ ఉంటాం కానీ వాళ్ల జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను ఎన్నో కోల్పోతున్నారని మనం గ్రహించం. వ్యక్తిగత ఆనందాలను ఎన్నో త్యాగం చేసి రోగుల సేవలకు తమ సమయాన్ని వెచ్చిస్తారన్న నిజాన్ని తెలుసుకోం. డాక్టర్ల జీవితాల్లో వాళ్లొక్కరే కాదు మొత్తం కుటుంబం కూడా తమ ఆనందాలను త్యాగంచేయాల్సి వస్తుంది. వైద్యం కార్పొరేటీకరణ అయిన తరువాత డాక్టర్ల పట్ల చాలామందికి గౌరవం సన్నగిల్లింది. కాని ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ వృత్తిలోకి రాలేరు. విధులు చేపట్టిన తర్వాత 24/7 ‘‘ఆన్ డ్యూటి ఎట్ యువర్ సర్వీస్’’ అనాల్సిందే. రోజురోజుకి పెరిగిపోతున్న శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన అధ్యయనం తప్పనిసరి విషయమే. ఇక దంపతులిద్దరూ డాక్టర్లే అయితే ఆ కుటుంబం పడే ఇబ్బందులు దేవుడికే తెలియాలి. ముఖ్యంగా లేడీ డాక్టర్లు ఒకచేత పిల్లలు, భర్త, మరో చేత పేషెంట్ల బాధ్యతలు తీసుకుని సవ్యసాచిలా ముందడుగు వేయాలి. నేడు (July 1st 2013) డాక్టర్స్ డే సందర్భంగా ఇలాంటి కొందరు వైద్య దంపతులు పడిన, పడుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు....Courtey with : Namasthetelangaana.com.

lalitha
పదిరోజులు పండగ!
వైద్యం ఉద్యోగం కాదు. ఇదొక వృత్తి. దీన్ని ఎంచుకునేటప్పుడే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడాలి. అందుకే జీవితాన్ని జీవించేందుకు వీలుండదని డాక్టర్‌ని పెళ్లి చేసుకోవద్దని అనుకున్నా. కాని తన కళ్లని చూసిన తరువాత వృత్తి అడ్డంగా కనిపించలేదు. కాని నేను భయపడినట్టుగా జీవితంలో ఏ లోటు రానివ్వకుండా అన్నీ తానే చూసుకుంది. నన్ను, పిల్లల్ని సౌకర్యవంతంగా ఉంచడం కోసం అందుకు అనుగుణంగా తన పనివేళల్ని మార్చుకుంది. నేను 8 నుంచి 10 వరకు పనిచేస్తున్నా తను 6 కల్లా పని ముగించుకుంటుంది. అవసరమైతే ఏ టైమ్ అయినా అటెండ్ కావాల్సిందే. అప్పుడిక నేను రంగంలోకి దిగుతాను అంటారు డాక్టర్ విష్ణుస్వరూప్‌డ్డి నవ్వుతూ. మన దేశంలో డాక్టర్లకు వీకెండ్స్ ఉండవు. ఏ రోజైనా, ఏ టైమైనా, ఏ పరిస్థితిలో ఉన్నా వెళ్లాల్సిందే. ఇంగ్లండులో మాదిరిగా ఇక్కడ కూడా వారానికి 5 రోజులే ఉంటే బావుండేది అనిపిస్తుంది. దీనివల్ల కొత్త టెక్నాలజీ నేర్చుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడానికి గాని, సదస్సుల నిర్వహణ కోసం గాని ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. కొంతవరకు వ్యక్తిగత జీవితమూ మిస్ కాకుండా చూసుకోవచ్చు. కాని ఇది ఆయనకు తీరని కోరికగానే మిగిలిపోయిందట. పిల్లలకు జబ్బు చేసినా, మాకు అనారోగ్యంగా ఉన్నా పేషెంట్లను వదిలేయలేని వృత్తి మాది. అందుకే రాత్రి-పగలు తేడా లేకుండా సర్జరీ ఉన్నా, పేషెంట్‌కి సీరియస్ ఉన్నా వెళ్లక తప్పదు. మేము జ్వరంతో ఉన్నా వెళ్లాల్సిందే. భర్త నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. నేను అలా ఎప్పుడు వెళ్లాల్సి వచ్చినా పాపం. తనే చూసుకునేవారు. తను ఊళ్లో లేనప్పుడు ఎమ్జన్సీ వస్తేనే చాలా కష్టం. రాత్రిపూట పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లలేను. అప్పుడు అమ్మ వాళ్లని రమ్మని పిలిచి నేను కేసు అటెండ్ అయ్యేదాన్ని. ఇంగ్లండులో ఉన్నప్పుడైతే వీకెండ్స్ 2 రోజులు డ్యూటీ ఉండేది కాదు. శని, ఆదివారాలు పిల్లలతోనే ఉండేవాళ్లం.పాపకు 9 ఏళ్లు వచ్చాక ఇండియాకు తిరిగి వచ్చేశాం. బాబు నెలల పిల్లవాడు. పదేళ్లు దాటితే మళ్లీ ఇక్కడికి అలవాటు పడలేరని ముందే వచ్చేశాం. ఇప్పుడు ఇక్కడ కుటుంబంతో గడిపే సమయం ఉండదు కాబట్టి వాళ్లు మమ్మల్ని మిస్ కాకూడదు కాబట్టి ఆరు నెలలకు ఒకసారి ఓ పదిరోజూలు లాంగ్ టూర్ వెళ్తాం. వాళ్లకి సెలవులు ఉన్నప్పుడు, పండగ రోజుల్లో కూడా మేము అందుబాటులో ఉండము కదా. నేను సాయంవూతాలు ప్రాక్టీస్ చేయకపోవడం చాలావరకు నా పిల్లలకు బెనిఫిట్ అయిందని చెబుతారు డాక్టర్ శాంతి. ఇంగ్లండులో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఈ డాక్టర్ జంట పడిన ఇబ్బంది ఇంతా అంతా కాదు. సాధ్యమైనంత వరకు ఇద్దరిలో ఒకరు పిల్లలతో ఉండే ప్రయత్నం చేసినా అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు కదా. అందుకే కొన్నాళ్లు మెయిడ్‌ని పెట్టి దెబ్బతిన్నారుట. అక్కడ వస్తువులు పోతాయేమో అన్న సమస్య ఉండదు. కాని పిల్లలను బాగా చూసుకోరేమో అన్న టెన్షన్ మాత్రం ఉంటుంది. ‘ఓ రోజు మేము వచ్చే సరికి బాబు పడుకుని ఉన్నాడు. పక్కన సోఫాలో కూర్చుని మెయిడ్ సిగట్ తాగుతూ ఉంది. పసివాడి దగ్గర అలా పొగ తాగకూడదని ఆమెతో గొడవ పడినా ప్రయోజనం లేదు. ఇక్కడైతే ఒక్కోసారి పిల్లల్ని నాతోపాటే హాస్పిటల్‌కి తీసుకెళ్తాన’న్నారు డాక్టర్ శాంతి.

aunty
పిల్లలకు ఆసుపత్రే ఇల్లు!
డాక్టర్లు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఎందుకంటే పీజీ అనేది కెరియర్‌లో కీలకమైన టైమ్. అప్పుడు పెళ్లి, సంసారం అన్న బాధ్యతలు డిస్ట్రబ్ చేస్తే ఇక కెరియర్ కొలాప్స్. ఇందుకు మా జీవితమే ఒక ఉదాహరణ. మాకు ఎంబీబీఎస్ చదివేటప్పుడే పెళ్లయింది. ఇద్దరం కలిసి చదువుకున్నాం. కలిసి కష్టపడ్డాం. డాక్టర్లంటే బాగా సంపాదిస్తారు అనుకుంటారు గాని డిగ్రీలు అయ్యాకే సంపాదన. స్టైఫండ్ చాలా తక్కువ. మేము చదువుకునేటప్పుడు బండి పంక్చర్ అయితే బాగుచేయించుకోవడానికి పదిరూపాయలు లేక కష్టపడిన రోజులున్నాయి. నేను డిఎం ఎంట్రన్సు కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు తనకు డిజిఎం పరీక్షలు. అయినా నన్ను అన్ని సమస్యలూ తనే చూసుకుంది. పిల్లలకు జ్వరం వస్తే కూడా చెప్పలేదు. ఇప్పటికీ తను ఎంత బిజీగా ఉన్నా ఇంటా, బయటా అన్నీ చూసుకుంటుంది. తననుంచి సహకారం లేకపోతే నేను సక్సెస్‌ఫుల్ కార్డియాలజిస్ట్‌ను కాలేకపోయేవాడినంటారు డాక్టర్ మొవ్వా శ్రీనివాస్. వ్యక్తిగత జీవితం బాగుం వృత్తిజీవితంలో సక్సెస్ కాగలుగుతారన్నది ఆయన నమ్మే సిద్ధాంతం.

ఇలాంటి బిజీ ప్రొఫెషన్‌లో ఉన్న ఆడవాళ్లు రాణించాలంటే భర్త సహకారం తప్పనిసరి. చదువుకునే రోజుల నుంచి తను నా వెన్నంటే ఉన్నాడు. గురువై నేర్పాడు. తండ్రిలా ఆదరించాడు. మొదటి స్టైఫండ్‌తో ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్లి భర్తగానూ ఆనందింపచేశాడు. రాత్రి రెండు, మూడు గంటలకు కాల్ వచ్చినా నేను వెళ్లాల్సిందే అప్పుడు పిల్లల్ని శ్రీనివాస్ దగ్గరే వదిలి వెళ్లేదాన్ని. చుట్టాలొచ్చినప్పుడు కూడా పిల్లల్ని, వాళ్లని ఆయనకు అప్పజెప్పి నేను హాస్పిటల్‌కి వెళ్లిన సందర్భాలున్నాయి. కాస్త సెటిలయ్యాక హమ్మయ్య అనుకున్నానో లేదో రెండోరోజే ఫెలోషిప్ కోసం ప్యారిస్ వెళ్లాల్సి వచ్చింది.

సంవత్సరం పాటు నేను, పిల్లలు ఒంటరిగా. ఒకవైపు పేషెంట్లు, మరోవైపు పిల్లలు, కుటుంబ, ఆర్థిక సమస్యలు అన్నీ ఒక్కదాన్నే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడే కాస్త బాధపడ్డాను అంటారు డాక్టర్ మొవ్వా మాధురి. కొన్ని సంవత్సరాల వరకు సెల్ఫ్‌పిటీలో ఉండేవాళ్లం. చాలామంది జంటల్లాగా జీవితాన్ని ఆనందించలేకపోయామని బాధగా ఉండేది. చాలా కోల్పోయామని అనిపించేది. కానీ డాక్టర్‌గా అందుకుంటున్న సంతృప్తి దాన్ని అధిగమించింది. ఇప్పుడు బిజీలైఫ్‌లో కూడా ఎలా ఆనందించాలో నేర్చుకున్నాం. ఆసుపత్రి నుంచి థియేటర్‌కి వెళ్లి టికెట్స్ కొని రెడీగా ఉంటాను. ఆయన డైరెక్ట్‌గా వస్తారు. సినిమా అయిపోగానే మళ్లీ హాస్పిటల్. ఒకసారి థియేటర్‌లో ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. తను వెళ్లాల్సి వచ్చింది. నేను పిల్లలతో ఉండి సినిమా చూసి వచ్చేశాం. పెద్దవాడు మా బిజీని బాగా అర్థం చేసుకున్నాడు. సినిమా మధ్యలో వెళ్లాల్సి వస్తే ‘పర్లేదులే.. అందరం వెళ్లిపోదాం. నువ్వు కూడా వెళ్లాలి కదా’ అంటూ అడ్జస్టవుతాడు. తమ్ముడికి కూడా సర్దిచెబుతాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కడుపుతో ఉన్నప్పుడు కూడా డాక్టర్ మాధురి పేషెంట్లను వదిలేయలేదు.

డెలివరీ చేసి ఇంటికి వచ్చిన రాత్రికే నొప్పులు వచ్చాయి. ఎమ్జన్సీ పరిస్థితి ఏర్పడింది. సిజేరియన్ అయింది. బాబు పుట్టిన వారానికి మళ్లీ డెలివరీలు యథాతథం. పిల్లల్ని పెంచడానికి మాత్రం ఈ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ‘పిల్లల్ని మాతో పాటే హాస్పిటల్‌కి తీసుకెళ్లేవాళ్లం. ఆపరేషన్ థియేటర్ సిబ్బంది బాబుకు సెరిలాక్ పెట్టేవాళ్లు. చిన్నవాడికి నెలల వయసప్పుడు ఓపీ పక్క రూమ్‌లో మెయిడ్‌తో బాబు ఉండేవాడు. అవసరమైనప్పుడల్లా కొన్ని కేసులు కాగానే మధ్యలో వెళ్లి బాబుకు పాలిచ్చి వచ్చేదాన్ని. అలా ఇద్దరు పిల్లలకూ విజయవంతంగా ఏడాదిన్నర పాటు తల్లిపాలే ఇచ్చాను. ఇందుకు శ్రీనివాస్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది సహకారం కూడా ఉంది. మా చిన్నవాడు దాదాపుగా ప్రైమ్ హాస్పిటల్‌లోనే పెరిగాడు. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కూడా వాళ్లని తీసుకునే హాస్పిటల్‌కి వెళ్లేవాళ్లం. మొదట్లో బాబును ఇంట్లో మెయిడ్ దగ్గర ఉంచి వెళితే ఆమె వాడిని బుగ్గల మీద గిచ్చేది. ఆ గాటు ఇంకా వాడి ముఖంపై ఉంది. ఇన్‌ఫెక్షన్ వస్తే యాంటిబయాటిక్ వేయొచ్చు. కాని వాళ్లకేమన్నా అయితే ఏమీ చేయలేం. అందుకే ఇక మెయిడ్‌పై నమ్మకాలు పెట్టుకోలేదు.

స్వయంగా చూసుకోవడం మొదపూట్టాం’ అని చెబుతుంటే తల్లిదంవూడులుగా వాళ్లు ఎన్ని పాట్లు పడ్డారో అర్థమవుతుంది. పిల్లలకు ఏ పనైనా తల్లితో చేయించుకుం సంతృప్తి. ఈ విషయం ‘ఓపీ చూసుకుని వెళ్లి పిల్లలకు అన్నం పెట్టి, పడుకోబెట్టాలి. పొద్దున చిన్నవాడినైతే స్కూల్‌కి నేనే తయారుచేయాలి. నేను వేస్తే తప్ప వాడు యూనిఫాం వేసుకోడు’ అన్న డాక్టర్ మాధురి మాటల్లో స్పష్టమవుతుంది. పిల్లల కోసమే సొంత హాస్పిటల్ పెట్టారు ఈ జంట. ‘నిజానికి మేము చదువుకునేటప్పుడే నాకు బావుండేది. ఇప్పుడు శ్రీనివాస్ అస్సలు దొరకడు. నాకైతే ఆ లవర్‌బాయ్ శ్రీనే కావాలనిపిస్తుంది’ అంటారు డాక్టర్ మాధురి. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగత క్రమశిక్షణ ఉంటే కుటుంబం, పిల్లలు ఏదీ ఎదుగుదలకు అడ్డంకు కాదు. జీవితభాగస్వామి సహకారం ఎన్ని ఇబ్బందులనైనా అధిగమించేలా చేస్తుందన్నది ఆమె అభివూపాయం. ఇన్ని రకాలుగా కష్టపడి పేషెంట్ల కోసం సమయం వెచ్చిస్తున్నా డబ్బులు కట్టాం కదా.. ఇంత సేపు వెయిట్ చేయిస్తారు.. అని ఎవరైనా దురుసుగా మాట్లాడితే బాధగా ఉంటుంది. మా షెడ్యూల్ ఒక క్రమపద్ధతిలో ఉండదు. ఎప్పుడు ఎవరికి ఎమ్జన్సీ అవుతుందో తెలీదు. నిజానికి పేషెంట్‌కి ప్రాధాన్యం ఇవ్వని డాక్టర్ ఎవరూ ఉండరు. ఒకరు వెయిట్ చేయాల్సి వస్తోంది అంటే మరో పేషెంటు కోసం ఆ సమయం వినియోగించడం వల్లే కదా. పేషెంట్లు ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకుంటే బావుంటుందంటూ పేషెంట్లను కోరుతున్నది ఈ జంట.

poradu
సమన్వయం ముఖ్యం
జీవితం కొందరికి వరమైతే, కొందరికి పండగ. అలాంటి వారే డాక్టర్ లలిత, డాక్టర్ కేవీఆర్ ప్రసాద్. డాక్టర్ వృత్తి చేపట్టినపుడే వారు రోజులో 24 గంటలకు మించి పనిచేయకూడదని అనుకున్నారట. అందుకే వారి జీవితంలో జీవాన్ని వారు వృత్తిలోనే వెతుక్కునేలా ప్రణాళికాబద్ధం చేసుకున్నారు. ఒకరికి ఒకరు సమయం కెటాయించలేదని ఫిర్యాదు రాకూడదని అనుకున్నారు. ఇంటర్న్‌షిప్‌లో ఉండగా పెళ్లైంది వాళ్లకు. ఇద్దరూ పైచదువులు చదువుకోవాలి. కేవీ ప్రసాద్ అప్పటికే చండీఘర్‌లో యూరాలజిలో పీజీ చేస్తున్నారు. లలితకి ఇక్కడ స్టేట్‌లో సెకండ్ ర్యాంక్ వచ్చింది గైనకాలజిలో. కానీ ఆమె ఈ సీటు వదులుకొని చండిఘర్‌లో వచ్చిన సీటుకే ప్రాధ్యన్యత నిచ్చి అక్కడే చేరారు. కలిసి చదువుకోవచ్చునన్న ఆలోచనతో. అలా వృత్తిలోనే వారి సంతోషాన్ని వారు వెతుక్కొవడం ప్రారంభించారు.

పీజీ పూర్తయిన తర్వాత సూపర్‌స్పెషాలిటి చదవాలనుకున్నపుడు లలిత తానుకూడా యూరాలజిస్ట్‌ను అయితే ఇక భర్తతో కలిసి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు వృత్తి జీవితంలో కూడా భాగం పంచుకోవచ్చనే ఆలోచన ఒకవైపు ఉంటే మరోవైపు యూరాలజిస్ట్‌లలో మహిళలు లేకపోవడం వల్ల మహిళా యూరాలజిస్ట్ అవసరం మరోవైపు ఉందన్న బాధ్యత కూడా మనసులో మెదులుతోంది. అందుకు తాను అహోరావూతులు శ్రమించారు. ఎందుకంటే పీజీ చండీఘర్‌లో చేసి ఉండడం వల్ల ఆమె అప్పుడు ఇక్కడ నాన్‌లోకల్ అవుతారు. అందువల్ల అనుకున్న సబ్జెక్టులో సీట్ రావాలంటే తనకు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు రావాలి. పిల్లలు, కుటుంబం కళ్లముందు మెదులుతుండగా లలిత పట్టుదలగా చదివారు అనుకున్నట్టుగానే ఫస్ట్‌ర్యాంకు సాధించారు. మొదట్లో ఐదేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ సర్వీసులో పని చేశారు లలిత, కానీ అక్కడ అంత సంతృప్తిగా అనిపించక ఆమె ప్రసాద్ పనిచేస్తున్న ఆసుపవూతిలోనే తాను కూడా పనిచేయడం వల్ల వృత్తిని, వ్యక్తిగతాన్ని సమన్వయ పరచవచ్చుననేది ఒక వైపుంటే, ప్రైవేట్ రంగంలో ఆధునిక పరిజ్ఞానం ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల వృత్తిలో మరింత ఎత్తుకు ఎదగవచ్చు అనే ఆలోచన మరోవైపు ఉండడం వల్ల ఆమె ప్రసాద్ పనిచేస్తున్న ఆసుపవూతిలోనే చేరారు. ‘‘వృత్తిజీవితం, వ్యక్తిగత జీవీతం రెండూ సమన్వయం చేసి జీవితపు బండి సవ్యంగా నడపాలంటే ముందు దంపతులనే రెండు చక్రాలు సమన్వయంతో ఉండాలి’’ అంటారు లలిత. ‘‘ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఇద్దరూ వృత్తి జీవితాల్లో ఉన్నపుడు తప్పనిసరిగా పిల్లల బెంగ కొంతైనా ఉంటుంది’’ అని ఆమె వ్యాక్యాన్ని ప్రసాద్ ముగిస్తారు. పిల్లలను పెంచడానికి అటెన్షన్ మాత్రమే కాదు, అఫెక్షన్ కూడా కావాలి. అందుకు పిల్లలు పసివారుగా ఉన్నపుడు ఆమె కొంత వరకు తన కేసులను ప్రసాద్‌కు అప్పగించడం వంటివి చేసే వారు.

కొంత సమయం పిల్లలకు ఇవ్వగలిగినప్పటికీ ఆమె డ్యూటిలో ఉన్నపుడు కొంత కాలం పాటు అత్తమామలు మరి కొంత కాలం పాటు తల్లిదంవూడుల సాహాయం తీసుకోక తప్పలేదంటారు లలిత. ‘ఎంత బాధ్యతలు పంచుకొని పనిచేసుకుంటూ వెళ్లినప్పటికీ అందరు పిల్లలకు వారి తల్లిదంవూడులు ఇచ్చినంత సమయం ఇవ్వలేకపోతునానమన్న దిగులు మాత్రం ఎప్పుడూ ఉండేది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నపుడు వాళ్లకు కూడా మాపట్ల చాలా ఫిర్యాదులు ఉండేవి, వాళ్లు పెద్దవాళ్లవుతున్న కొద్దీ మా వృత్తి స్వభావాన్ని, బాధ్యతను వాళ్లు కూడా గుర్తిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు కూడా ఇదివరకటిలా కంప్టైంట్లు ఉండడం లేదు.’ అని చెప్తారు ప్రసాద్ తమ పిల్లల గురించి మురిపెంగా. పిల్లలతో గడపడమే లక్ష్యంగా సంవత్సరంలో కనీసం ఒకసరైనా ఒక పదిరోజుల పాటైనా సెలవు తీసుకొని ఏదైనా విహార స్థలంలో గడపడం ద్వారా పిల్లలకు తల్లిదంవూడులు తమకు సమయం ఇవ్వడంలేదన్న భావన రాకుండా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు వాళ్లు. ‘‘మేము అంతా కలిసి సినిమా మొత్తం చూడడం కొంచెం అరుదనే చెప్పాలి ఎందుకంటే సినిమా మధ్యలో ఎమ్జన్సీ వచ్చి ఇద్దరిలో ఒకరం హాస్పిటల్‌కు పరుగెత్తి రావాల్సి వస్తుంది. చాలా సార్లు ప్రసాద్ సినిమా చివరన మాతో కలుస్తారు. ఏదో ఒక విధంగా పిల్లలను మా పరిధి మేర సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని చెప్తారు లలిత. ఆమె జీవితంలోసాధించిన ప్రతి మెట్టుకి పునాది ఆయనే అనేది ఆమె భావన. ‘‘లలిత చాలా ఇంటలిజెంట్. తనకి 13 గోల్డు మెడళ్లు వచ్చాయి’’ అని చెప్తారు డాక్టర్ ప్రసాద్ మెరుస్తున్న కళ్లతో. వృత్తిపట్ల వారికున్న అంకిత భావం వారి పిల్లలకూ స్పూర్తిదాయకమే, అందుకే వారి చిన్నమ్మాయి యంగ్‌డాక్టర్స్ అసోషియేషన్‌లో సభ్యురాలు. తాను కూడా డాక్టర్‌ని కావాలని కలలు కంటోంది. ఆ కల నెరవేరాలని మరో అంకితభావం కలిగిన వైద్యరత్నం సమాజానికి అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.

Dr.Jahnavi
కొంత ప్లానింగ్ అవసరం
డాక్టర్లుగా విజయవంతం కావాలంటే జీవితంలో కచ్చితంగా ఎంతో కొంత త్యాగం చెయ్యడమైతే తప్పదు. కాకపోతే అన్నింటికి ప్లానింగ్ ముఖ్యం. కాస్త ప్లాన్ చేసుకోగలిగితే జీవితాన్ని కొంత ఇబ్బందిలేకుండా గడిపేందుకు అవవాశం ఉంటుంది. ‘‘పెళ్లైన కొత్తలో కొన్నాళ్లు మేము కూడా వ్యక్తిగత జీవితాన్ని కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. మాకు పీజీ రెండో సంవత్సరంలో ఉండగా పెళ్లైంది. అయితే జాహ్నవి విశాఖలో, నేను హైదరాబాద్ నిమ్స్‌లో పీజీ చేశాం.’’ ఆ రెండు సంవత్సరాల కాలం వాళ్లిద్దరూ ఫ్యామిలికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మాములుగా పసి పిల్లలను పెంచాలం పూర్తిగా సమయం వాళ్లకు కేటాయించాల్సి వస్తుంది. ఇక ఈ వైద్యజంటకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ ఆడపిల్లలే. ‘‘ మాఅదృష్టం ఏమిటంటే మాతల్లిదంవూడులు, జాహ్నవి తల్లిదంవూడులు కూడా మాకు దగ్గరలోనే ఉంటారు. అందువల్ల వాళ్ల పెంపకం విషయంలో పెద్దగా కష్టపడలేదు.’’ ఇప్పుడు వాళ్ల వయసు 6 సంవత్సరాలు. ఇద్దరూ స్కూల్‌కు వెళ్తున్నారు. దంపతులిద్దరు ఉద్యోగస్తులైన వారికి పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో అనే బెంగ ఒక వైపు ఉంటూనే ఉంటుంది. ‘‘కానీ ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులం.’’ అంటారు నవీన్ కుమార్. పొద్దున ఏడున్నరకల్లా పిల్లలను స్కూల్‌కు పంపేసి డాక్టర్ జాహ్నవి డ్యూటీకి వెళ్లిపోతారు. సాయంత్రం మాత్రం పిల్లలను వాళ్ల నాన్నమ్మో, అమ్మమ్మో చూసుకుంటారు. ‘‘మా పిల్లలు కూడా ఈ విషయంలో అదృష్ట వంతులే.’’ అని తన పిల్లల అదృష్టానికి మురిసిపోతారు నవీన్ కుమార్. ఈరోజుల్లో చాలా మంది పిల్లలకు వారి నాన్నమ్మ అమ్మమ్మల ఒడిలో ఆడుకునే అవకాశం ఉండడం లేదు. వీళ్ల పిల్లలు మాత్రం వారి దగ్గర ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నారు. ‘‘వారి భద్రత, ఆనందాలకు లోటు లేదు కానీ మేము మాత్రం పిల్లలకు ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేకపోతున్నామని, వారి ముద్దు ముచ్చట్లను తనివితీరా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నామని అప్పుడప్పుడు జాహ్నవి వాపోతుంటుంది. వృత్తి అందించే తృప్తి ముందు కొన్నింటిని వదులుకోక తప్పదు మరి.’’ అని జీవితంలో సర్దుబాట్ల గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ నవీన్ కుమార్

Courtey with : Namasthetelangaana.com.
  • ====================
 Visit my website - > Dr.Seshagirirao.com/