Monday, July 29, 2013

False belief in Knee replacement surgery,నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరిపై సాధారణ అపోహాలు

  •  

 

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -False belief in Knee replacement surgery,నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరిపై సాధారణ అపోహాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మధుమేహాం హైపిబి ఉన్న రోగులు నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయించుకోకుడదు.
ఎ). ఇది వాస్తవం కాదు. అవి గనుక నియంత్రణలో ఉంటే మధుమేహాం, హైబిపి ఉన్న రోగులకు కూడా నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయవచ్చు.

నీ రిప్లేస్‌మెంట్‌ విధానం విఫలమైంది.
ఎ). టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ ఎంతో విజయవంతమైన ఆపరేషన్‌. అమెరికాలో ఏడాదిలో 600.000కు పైగా నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీలు జరిగాయి. ఇది 2030 నాటికి 4 మిలియన్లను చేరుకుంటుందని అంచనా. భారత్‌లో నీ రిప్లేస్‌మెంట్‌లో సర్జరీ ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 3000కు పైగా ఆపరేషన్లు జరిగాయి.
బి). సగటున 10 ఏళ్ల వద్ద 95 శాతం. 20 ఏళ్ల వద్ద 80 శాతం. సక్సెస్‌రేట్‌(సరైవర్‌షిప్‌) ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

రిప్లేస్‌మెంట్‌లో తరువాత మోకాలు వంగడం లేదు.

ఎ). ఇది పూర్తిగా అసత్యం. మోకాలు వంగడం అనేది సర్జరీ నాణ్యం పోస్ట్‌ ఆపరేటివ్‌ రిహాలిటేషన్‌ ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్‌ అనంతర ఫిజియోథెరపీని పేషంట్‌ తీసుకొవడం పై ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
బి). ఆపరేషన్‌ అనంతరం మోకాలి సరళత్వం (ఫ్లెక్సియన్‌- వంగడం) అనేది ఆపరేషన్‌కు ముందు నాటి సరళత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక రోగి ఆపరేషన్‌ కు ముందు 110డిగ్రీల సరళత్వంపొందే అవకాశం ఉంది. చాలా మంది పేషేంట్లు గతంలో తాము కలిగి ఉన్న సరళత్వం కంటే ఎక్కువగా సరళత్వాన్నే పొందిన దాఖలాలు ఉన్నాయి.

నీ రిప్లేస్‌మెంట్‌ అనంతర నమాజు లేదా పూజ చేసుకోవడం సాధ్యం కాదు.
ఎ). నేలపై కుర్చోని ప్రార్ధన చేసుకునేందుకు కట్టుబడి ఉండే వారు ఆవిధంగా చేసుకోవడం సాధ్యమే.. సురక్షిత ఎత్తులో వంపు వీలయ్యే విధంగా సర్జన్‌ నిర్ధిష్ట ఎత్తు గల ఫ్లెక్స్‌ ఇంప్లాంట్స్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. అ విధంగా నేలపై కూర్చుని నమాజు లేదా పూజ చేసుకోవచ్చు.

నీ రిప్లేస్‌మెంట్‌ తరువాత నేలపై కూర్చోవడం లేదా సాధ్యం కాదు.
ఎ). ఇది సర్జరీ నాణ్యం పేషెంట్‌ పరిస్థితి పై అధారపడి ఉంటుంది.
బి). కుర్చోవడం లేదా ఫ్లోర్‌పై స్కే్వట్‌ చేయడం తప్పకుండా సాధ్యమే. ఆ పనులు చేయడం మీకు తప్పనిసరి అయితే ఆ విషయం గురించి మీరు సర్జరీకి ముందుగానే మీ సర్జన్‌తో చర్చించాలి. అప్పుడు సర్జన్‌ తాను ఉపయోగించే సర్జికల్‌ టెక్నిక్‌ను మార్చుకోవచ్చు లేదా ప్రత్యామ్నాయ ఇంప్లాంట్‌ను అమర్చవచ్చు.

వృద్ధులైన పేషెంట్లలో నీ రిప్లేస్‌మెంట్‌ అనేది సరైన సలహాకాదు.

ఎ). పలు భారతీయ కుటుంబాల్లో ఉన్న అపోహ ఇది. పేషెంట్‌ గనుక ఆరోగ్యంగా ఉంటే 55-85 ఏళ్ల వయస్సు ఆ సర్జరీకి ఎంతో అనువైంది.

యువ పేషెంట్లలో నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ సూచించతగినది కాదు.

ఎ). ఇందులో కొంత మేరకు నిజం ఉన్నప్పటికీ, అది పేషేంట్‌ ఎలాంటి పరిస్థితిలో బాధపడుతున్నాడు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో, కీలు తీవ్రమైన నొప్పి కలుగచేస్తున్నపుడు మాత్రం నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ సిఫారసు చేయడమైనది.
బి). ఆస్టియో ఆర్ధరిటిస్‌తో బాధపడే యువ పేషెంట్లకు అస్టియోఅటమి లేదా పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సూచించవచ్చు. ఈ అంశంపై గల అప్షన్‌ (ఎంపిక అవకాశాల) గురించి అనుభవజ్ఙుడైన నీ సర్జన్‌తో చర్చించండి.

నీ రిప్లేస్‌మెంట్‌ 10 ఏళ్లకు మించి ఉండవు.

ఎ). ఇది అవాస్తవం. 10 ఏళ్ల వద్ద నీ రిప్లేస్‌మెంట్‌ అరిగిపోయే అవకాశం ఉంది. అంటే దాని అర్ధం వారి తదుపరి జీవితంలో రివిజన్‌ సర్జరీ అవసరం కావచ్చు. అలాంటి సమస్యలు ఎదురైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.

హై- ప్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌ మరింత మెరుగైన కదలికలను అందిస్తుంది.
ఎ). ఇది వాస్తవం కాదు. పేషెంట్లో, అనుభవం లేని సర్జన్లో ఉండే అతి ముఖ్యమైన అపోహ ఇది.
బి). ప్రామాణిక టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే హై ఫ్లేక్స్‌ గణనీయ ప్రయోజనం కనబర్చగలదని ఏ అధ్యయనంలోనూ వెల్లడి కాలేదు.
సి).హై-ప్లేక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సురక్షిత లోతైన ఫ్లెక్స్‌న్‌కు వీలు కల్పిస్తాయి. అంటే ఒక వ్యక్తి నేలపై కూర్చోవాలన్న స్క్వాట్‌ చేయాలన్నా కూడా అలా చేయడం సురక్షితమే అవుతుంది. అయినప్పటికి ప్రామాణిక టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే అవి దీర్ఘకాలం మన్నుతాయనేదానికి లేదా మరింత మెరుగైన కదలికల శ్రేణిని అందిస్తుంది. అనేదానకి ఎలాంటి ఆధారం లేదు.

ఖరీదైన ప్యాకేజీలను అందించే వాటితో పోలిస్తే, ఆసుపత్రులు అందించే చౌక నీ రిప్లేస్‌మెంట్‌ కూడా అంతేబాగా పనిచేస్తాయి.
ఎ). కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అయినప్పటికి అన్నింటి కంటే ముఖ్యమైనది సర్జన్‌ను, ఇంప్లాంట్‌ను ఎంచుకోవడం.
బి). సరిగా చేయని నీ రిప్లేస్‌మెంట్‌ బాధాకరంగా ఉండి, తొందర్లోనే విఫలమై, చక్కటి ఆపరేషన్‌ ప్రక్రియకు చెడ్డపేరు తీసుకువస్తుంది.
సి). సాధారణంగా స్ట్రైకర్‌, జిమ్మర్‌, స్మిత్‌ నెఫ్యూ, బయెమెట్‌ లాంటి పేరోందిన విదేశి కంపెనీలు చక్కటి విశ్వసనీయమైన ఇంప్లాంట్స్‌ను అందిస్తాయి. మీకు ఎలాంటి ఇంప్లాంట్‌ అవసరమో మీ సర్జన్‌ నిర్ణయించకలుగుతారు.

ఖరీదైన ఇంప్లాంట్స్‌ మంచివి
ఎ) . ఇది వాస్తవం. ప్రామాణీకృత విదేశి ఇంప్లాంట్ల వ్యయం ఎంతో తక్కువగానే ఉంటుంది, అంతేగాకుండా దీర్ఘకాలం పని చేసిన ట్రాక్‌రికార్డు వాటికి ఉంది. ఆసుపత్రులు కంపెనీలచే విక్రయించబడే ఎంతో ఖరీదైన ఇంప్లాంట్ల అవి సుపీరియర్‌ (అత్యున్నత స్థాయి) డిజైన్‌తో కూడుకున్నవన్న హామీతో ఉంటాయి. మనిషి శరీరంలో అ ప్లాంట్స్‌ను అమర్చినప్పుడు అవి సుపీరియర్‌ (అత్యున్నతం) అనేందుకు తగిన విశ్వసనీయ ఆధారాలేవి చరిత్ర లేవు.

పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ కంటే కూడా టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ మెరుగైంది.
ఎ). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆది సహాజ కీలుతో దాంతో పాటే లిగమేట్స్‌ను చాలా వరకు అలాగే ఉంచుతుంది. టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌తో పోలిస్తే ఆది మరింత సహాజమైందన్న భావనను కలిగిస్తుంది.
బి). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ మరింత చిన్న కోతతో జరుగుతుంది. వేగంగా కోలుకుంటారు.
సి). ఈ టెక్నిక్‌లో బాగా అనుభవజ్ఙుడైన సర్జన్‌చే పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ జరిగితే అది అత్యుత్తమంగా ఉంటుంది.

కంప్యూటర్‌ నావిగేటెడ్‌ నీ మెరుగైన ఫలితాన్ని అందిస్తుంది.
ఎ). కంప్యూటర్‌ నావిగేట్‌డ్‌ నీ రిప్లేస్‌మెంట్‌ కొంతమేరకు మెరుగైన ఓవరాల్‌ అలైన్‌మెంట్‌ను అందిస్తుందని అంతా అంగీకరిస్తున్నప్పటికీ, అది మొత్తం మీద ఫలితాన్ని మెరుగుపరుస్తుందనేందుకు అధారాలేవి లేవు.

నీ రిప్లేస్‌మెంట్‌ అనంతరం డ్రైవింగ్‌ సాధ్యం కాదు.
ఎ). ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నీ రిప్లేస్‌మెంట్‌ అనంతరం డ్రైవింగ్‌ ఎంతో తేలిక అవుతుంది. చాలా మంది పేషెంట్లు సర్జరీ జరిగిన 6-8 వారాల్లో డ్రైవింగ్‌ చేయడం ప్రారంభించారు.

నీ రిప్లేస్‌మెంట్‌ తరువాత ఆటలు ఆడటం సాధ్యం కాదు.
ఎ). ఫుట్‌బాల్‌, హాకీ లాంటి ఇంపాక్ట్‌ స్పోర్ట్‌‌స ఆడటం వీలుపడదు.
బి). పార్షియల్‌ నీ రిప్లేస్‌మెంట్స్‌తో ఎంతో మంది పేషెంట్లు టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ లాంటి ఆటలాడటం ప్రారంభించారు.
సి). టోటల్‌ నీ రిప్లేస్‌మెంట్‌ సాధారణంగా పైనా పేరొన్న ఆటలకు దూరంగా ఉండడాన్ని సూచిస్తున్నప్పటికి ఎన్నో యూరోపియన్‌ దేశాల్లో చాలా మంది స్కీయింగ్‌, సైక్లింగ్‌, గోల్ఫింగ్‌, హైకింగ్‌ లాంటివి చేస్తుంటారు.

Courtesy with : డాక్టర్‌ ఉదయ్‌ ప్రకాష్‌--ఎఫ్‌ఆర్‌సీఎస్‌, ఎఫ్‌ఆర్‌సీఈడీ. ఎఫ్‌ఆర్‌సీఎస్‌ (టిఆర్‌ ఒఆర్‌టిహెచ్‌), కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, స్పెషలిస్ట్‌ ఇన్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ, ఉదయ్‌ క్లినిక్‌ ఆర్థోపెడిక్‌ సెంటర్‌, 5-9-94, చాపల్‌ రోడ్డు, హైదరాబాద్‌ 500 001

  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. Good sharing, Knee joint pain is a common problem with many causes, from acute injuries to medical conditions. Normally people will believe surgery is the only way to relief knee pain, in fact, some may ask how to cure knee pain without surgery. Yes there are ways like using Unloading bracing technology, having ergo mattress etc. Click here or visit:
    http://kidbuxblog.com/surgery-free-for-relief-knee-pain/

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.