మీకు తరచూ షాపింగ్ చెయ్యాలనీ, ఎడాపెడా కొనెయ్యాలనీ అనిపిస్తోందా?ఇలాంటి సమస్య ఎక్కువగా డిప్రెషన్‌కు లోనైన స్త్రీలలో కనిపిస్తుంటుంది. దీనినే 'ఓనియోమానియా'గా వ్యవహరిస్తున్నారు.
షాపింగ్ చెయ్యాలనే తహతహ విపరీతంగా ఉండే వారిని 'ఓనియోమానియాక్స్'గా పిలుస్తున్నారు. ఇలాంటివారిలో ప్రతి పదిమందిలో ఆరుగురు మహిళలే ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. ఇదొక గుర్తించని రుగ్మతగా చెప్పవచ్చు. ఈ సమస్యకు లోనైన వారిలో తరచూ షాపింగ్‌కు వెళ్లాలనే కోరిక పుడుతుంటుంది. వీరు షాపింగ్ కోసం ధారాళంగా ఖర్చు పెట్టేస్తుంటారు. డిప్రెషన్‌తో బాధపడే మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పురుషులతో పోలిస్తే కొనుగోలు అనేది మహిళల మనస్తత్వంపై బలమైన ముద్ర వేస్తుంది. ఈ కారణంగానే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వస్తువులు, ఇంటి సరకులు, వ్యక్తిగత సామగ్రి వంటివన్నీ కొనుగోలు చేయటం మహిళత్వానికి చిహ్నాలుగా వారు భావిస్తుంటారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది మహిళల్లో ఇదొక ఒత్తిడి తొలగించుకునే మార్గమనీ స్పష్టం చేస్తున్నారు.
- ========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.