Saturday, August 14, 2010

Anthrax , ఆంత్రాక్స్




ఆంత్రాక్స్ ప్రాణాంతక వ్యాధి . పశువుల నుంచి మనుషులకు , మనుషుల నించి పశువులకు సంక్రమించే సాంక్రమిక (Infective) వ్యాధి . దొమ్మావ్యాధి , నెత్తురు రెక్క , నెరడు దొమ్మ వంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు . అన్ని రుతువుల్లోను ముఖ్యంగా కరువుకాటకాలు ఏర్పడినప్పుడు , వరదలు , వాతావరణం లో అకస్మిక మార్పులు
సంభవించినపుడు ఆంత్రాక్స్ వ్యాధి ప్రభలే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది .

దక్షిణ పూర్వ ఆసియా ఖండంలో ఆంత్రాక్స్ అతి తక్కువ మందికి సర్వ సాధారణంగా వచ్చే వ్యాధి. ఈ కొద్దిపాటి కేసులతో మనల్ని జాగృత పరచుకోవాలే కాని భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు.

వ్యాధి లక్షణాలు ?
ఆంత్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డితినే జంతువులలో వచ్చే అంటు వ్యాధి. ఇది బాసిల్లస్ ఆంత్రాక్స్ అను స్పోర్స్ ఏర్పరచే బాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ జంతువుల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.
ఆంత్రాక్స్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది ?
ఆంత్రాక్స్ బాక్టీరియాను జీవాయుధంగా ఉపయోగిస్తున్నారనే నమ్మకమే ఇందుకు కారణం.
ఆంత్రాక్స్ ఎలా వ్యాపిస్తుంది ? ఎవరికి వ్యాపిస్తుంది ?
పశు సంపద ప్రధాన పాత్ర వహించే వ్యవసాయక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువ. పశువుల ద్వారా లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ఆంత్రాక్స్ మనుషులకు సోకుతుంది. చనిపోయిన జంతువులకు సంబంధించిన ముడిసరుకుల కర్మాగారాలలో పనిచేసేవారు విదేశాల నుంచి జంతు సంబంధమైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవారు ఆంత్రాక్స్ బారినపడే అవకాశాలు ఉన్నాయి.
మనుషులలో ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని బట్టి చర్మం సంబంధిత, శ్వాసకోశ సంబంధిత మరియు జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ అను మూడు రకాలుగా ఉంటుంది. ఆంత్రాసిస్ స్పోర్స్ మట్టిలో సైతం చాలా ఏళ్ళు మనగలుగుతాయి. ఆంత్రాక్స్ స్పోర్స్ లను పీల్చడం ద్వారా, ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడిన జంతుమాంసాన్ని సరిగ్గా వండకుండా తినడం వల్ల అనగా గాలి , నీటి , మేత - ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

ఆంత్రాక్స్ లక్షణాలేమిటి ?
వ్యాధి సోకిన విధానాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి సోకిన వారం రోజుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడతాయి.
చర్మ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ సోకిన జంతువుల ఉన్ని, చర్మం, వెంట్రుకలు మొదలైన ఉత్పత్తులకు సంబంధించిన కర్మాగారాలలో పని చేసేవారిక చర్మంపై ఉన్న గాయాల ద్వారా వ్యాధి కారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ భాగంలో ఏధైనా పురుగుకుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. అది ఒకటి, రెండు రోజుల్లో ఉబికి అల్సర్ గా పరిణమిస్తుంది. మధ్యలో నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది.
ఎలాంటి చికిత్స జరగని సందర్భంలో 20% చర్మ సంబంధిత ఆంత్రాక్స్ కేసులు మరణానికి దారి తీస్తాయి. తగిన చికిత్సతో మరణాన్ని నివారించవచ్చు.
శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్ పీల్చడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తొలి దశలో జలుబులా అనిపిస్తుంది. తరువాత శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. శ్వాసకోశ సంబంధిత ఆంత్రాక్స్ ప్రాణాంతకరము.
జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్ :
ఆంత్రాక్స్ బాసిల్లస్ తో కలుషితమైన మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల ఇది వస్తుంది. నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరోచనాలు, గొంతునొప్పి మరియు కడుపులో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తరహా ఆంత్రాక్స్ బారిన పడ్డ కేసుల్లో 25%నుండి 60% వరకు మరణాలు సంభవిస్తాయి.
ఆంత్రాక్స్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ?
ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ ఆధార ప్రదేశాలలోను, ప్రజారోగ్య కార్యక్రమాలు సరిగా చేపట్టని దేశాల్లోను మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను కనిపిస్తుంది.
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందా ?
ఆంత్రాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు.
ఆంత్రాక్స్ ను నియంత్రించడం ఎలా ?
ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే దేశాలలో పశువులకు టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చును మరియు వ్యాధి బారిన పడిన జంతువుల కళేబరాలను కాల్చివేయడం ద్వారా స్పోర్స్ ను నాశనం చేయడం, వాటి మాంసాన్ని తినకుండా ఉండడం, వాటి ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చును.
ఆంత్రాక్స్ కు టీకా ఉందా ?
ఆంత్రాక్స్ కు టీకా ఉంది. కానీ ఈ టీకా వాడకము మనుషుల్లో అంతగా ప్రాచుర్యములో లేదు.
ఆంత్రాక్స్ టీకాను ఎవరు వేయించుకోవాలి ?

* పశువైద్య సిబ్బంది
* ప్రయోగశాలల్లో ఆంత్రాక్స్ బాక్టీరియాతో ప్రత్యక్షంగా పనిచేసేవారు
* జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, సిబ్బంది
* జీవాయుధాల ప్రమాదం పొంచి ఉన్నచోట విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది

ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించటం ఎలా ?
ఆంత్రాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి రక్తంలోని నిర్ధిష్ట యాంటీ బాడీస్ ను లెక్కించటం, రక్తం, చర్మం, శ్వాసద్రవాల పదార్థాల నుంచి ఆంత్రాసిస్ వేరు చేయడం ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని నిర్థారించవచ్చు.
మన రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాధిని నిర్ధారించే ప్రయోగశాలలు ఉన్నాయా ?
ఉన్నవి. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసన్, నారాయణ గూడ, హైదరాబాదు మరియు అన్ని వైద్య కళాశాలలకు అనుబంధముగా యున్న వైద్యశాలల్లో ఈ వనరులు కలవు.
ఆంత్రాక్స్ కు చికిత్స ఉందా ?
చికిత్స ఉంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమగును. వైద్యుల సలహా మేరకు పెన్సిలిన్, డాక్సిసైక్లిన్, ఎరిత్రోమైసిన్ లేదా సిప్రోప్లాక్సాసిన్ మందులు వాడితే వ్యాధినయమగును. ప్రస్తుతము సిప్రోప్లాక్సాసిన్ వాడుట మంచిది.

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 12, 2010

ఇమ్యునైజేషన్ , Immunazation


వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంపొందంచడాన్ని ఇమ్మ్యునైజేషన్‌ అంటారు . అంటు వ్యాధులు రాకుండా తట్టుకునే శక్తిని ' వ్యాధి నిరోధకత లేదా ఇమ్యూనిటీ ' అంటారు . వ్యాధి నిరోధక శక్తి సహజం గా లేదా కుత్రిమం గా కలుగుతుంది . కుత్రిమ పద్దతిలో వ్యాక్సిన్ల ద్వారా వివిధ వ్యాధులకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తారు . ఇమ్యూనిటీ గురుంచిన అధ్యయనాన్ని " ఇమ్యునాలజీ " అంటారు .

అసలు ఈ ఇమ్యునైజేషన్‌ అవసరమా... అవసరమైతే ఎందుకు.. అనే విషయం తెలుసుకోవాలి.
ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు తప్పని సరి. ఇమ్యున్ అనేది ఒక గ్రీకు పదం. రక్షించేది అని అర్థం. జనం ప్రాణాలను రక్షించేందుకు కొన్ని ఏజెన్సీలను నియమించారు. వీరి ద్వారా జరిగే ఈ ప్రక్రియను ఇమ్యునైజేషన్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్. రెండోది పాసివ్ ఇమ్యునైజేషన్. యాక్టివ్ ఇమ్యునైజేషన్ ధీర్ఘకాలిక రక్షణ ఇవ్వగలిగితే, పాసివ్ ఇమ్యునైజేషన్ స్వల్పకాలిక రక్షణ కల్పిస్తుంది.

సంక్రమణ, ప్రేరేపిత వ్యాధులు, కారకాలను ఇమ్యునైజేషన్ గుర్తిస్తుంది. తరువాత శరీరానికి రక్షక వలయంగా పని చేస్తుంది. తిరిగి అలాంటి వ్యాధుల శరీరానికి సోకకుండా నిరోధిస్తుంది. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పిల్లలకు వాక్సిన్‌ను ఇప్పించాల్సిందే. వివిధ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం పిల్లలకు ఇమ్యునైజేషన్‌ను నిర్ణయించారు. కొన్ని వ్యాధులు కొంత వయస్సు దాటిన తరువాతనో, కొంత వయస్సు ముందరో వచ్చే అవకాశం ఉంది.

శాస్త్రవేత్తలు అందుకు అనుగుణంగానే ఇమ్యునేజేషన్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం పుట్టినప్పటి నుంచి 16 యేళ్ళ వయస్సు వరకూ కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది. ప్రభుత్వం ఇమ్యునైజేషన్‌ను ఉచితంగా అందిస్తోంది. వాటి కోసం ప్రైవేటు ఆస్పత్రులనే సంప్రదించాల్సిన పనిలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పురపాలక ఆస్పత్రులలో వ్యాక్సినేషన్ లభిస్తాయి.

టీకా (vaccine) అనగా వ్యాధినిరోధకత(ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు

ఇమ్యునైజేషన్ షెడ్యూల్
భారతదేశంలోని టీకాల పద్ధతి
క్రమసంఖ్య వయస్సు టీకా మందు
1. పుట్టుక నుంచి 2 వారాలు బి.సి.జి. ; ఒ.పి.వి.
2. 6 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
3. 10 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
4. 14 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
5. 9 నెలలు ఒ.పి.వి. ; తట్టు(మీజిల్స్)
6. 1 సం. తరువాత ఆటలమ్మ (చికెన్ పాక్స్)
7. 15 నెలలు ఎమ్.ఎమ్.అర్.
8. 18 నెలలు ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
9. 2 సం. తరువాత టైఫాయిడ్
10. 5 సం. తరువాత ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
11. 10 సంవత్సరాలు. టి.టి.
12. 15-16 సంవత్సరాలు. టి.టి.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, August 10, 2010

Heart attack and high cholesterol,గుండెపోటు-అధిక కొలెస్టిరాల్



  • Courtesy with -డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.- దీనిని ఆదునిక వైద్యము లో " Ischemic Heart disease ' (Heart Attack) ఆంటారు .

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టి చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి.


గుండెపోటు ఎలా వస్తుంది :
* గుండె అనేది నిరంతరం కొట్టుకుంటూ ఉండే ఒక దృఢమైన కండరం. ఇది పనిచెయ్యాలన్నా.. దీనికీ రక్తం కావాల్సిందే. అందుకే ఈ గుండె కండరంలోనే మూడు కీలకమైన రక్తనాళాలుంటాయి.

* ఎప్పుడైనా ఈ రక్తనాళాల్లో పూడికలు వచ్చి... గుండె కండరానికి రక్తసరఫరాలో అవరోధం ఏర్పడితే.. గుండె పోటు వస్తుంది.

* ముఖ్యంగా గుండెలోని ఎడమవైపు ధమని(ఎల్‌ఏడీ)లో పూడికలు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ. గుండెలో దాదాపు 40-45% కండరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఇది! కాబట్టి మిగతా రక్తనాళాలతో పోల్చుకుంటే.. దీనిలో పూడిక వచ్చి.. అది మూసుకుపోయి, గుండెపోటు వస్తే గుండెకండరం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

* గుండె పోటు రావటానికి మన చేతుల్లో ఉన్న కారణాలు కొన్ని. లేనివి కొన్ని. ఉదాహరణకు వంశపారంపర్యంగా గుండెపోటు రిస్కు ఉంటే దాని విషయంలో మనం చెయ్యగలిగింది తక్కువ. అలాగే స్త్రీలతో పోలిస్తే పురుషులకు రిస్కు ఎక్కువ. ఇలాంటి వాటిని మనం మార్చలేం. అదృష్టవశాత్తూ ఇలాంటివి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా.. మనం ముందస్తుగా జాగ్రత్త పడటానికి వీలైన అంశాలే చాలా ఉన్నాయి... హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ధూమపానం, మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవటం.. ఇవన్నీ మనం నియంత్రించుకోవటానికి వీలైనవే కదా! మన నియంత్రణలో ఉండే రిస్కుల పట్ల కూడా మనం నిర్లక్ష్యం వహించటం మంచి విషయం కాదు.

* మధుమేహం, హైబీపీ రెండూ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

* కొన్నిసార్లు రక్తంలో వచ్చే మార్పుల వల్ల కూడా రక్తనాళాల్లో రక్తం దానంతట అదే గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అంతకు ముందు 30-40% పూడికలు ఉన్నా.. వాటి మీద ఈ రక్తం గడ్డ చేరి వెంటనే గుండెపోటు తెచ్చిపెట్టొచ్చు. ఒకసారి రక్తనాళంలో ఇలాంటిది అడ్డుగా తయారైతే.. ఇక కిందికి ఏ మాత్రం రక్తం వెళ్లక.. 5-10 నిమిషాల్లోనే ఆ కింది భాగం గుండె కండరమంతా చనిపోవటం ఆరంభమవుతుంది. ఇలా చనిపోయిన కండరాన్ని తిరిగి కోలుకునేలా చెయ్యటం చాలా కష్టం.

* గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఒక 'ఎకోస్ప్రిన్‌', లేదా 'సార్బిట్రేట్‌' బిళ్ల నోట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది, ముఖ్యంగా దానివల్ల నష్టమేం లేదు. ఛాతీలో నొప్పి అన్నది వచ్చిన తర్వాత.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి చేరాలి. ఎందుకంటే అది గుండెపోటు అయితే.. నిమిషాలు గడిచిన కొద్దీ గుండె కండరం చచ్చుబడిపోతుంటుందని మర్చిపోకూడదు. అది పొట్టలో అసిడిటీ వల్ల వచ్చిన నొప్పేమో, ఛాతీలో కండరం పట్టేసిందేమో.. ఇలా అనుకుంటూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం మంచిది కాదు. చాలామంది నొప్పి మరీ తీవ్రంగా మారితేనేగానీ ఆసుపత్రికి రారు.. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. అలాకాకుండా వెంటనే ఆసుపత్రికి వస్తే.. 'ఈసీజీ' పరీక్షలో అది గుండెపోటు అని గుర్తిస్తే తక్షణం 'ప్రైమరీ యాంజియోప్లాస్టీ' చేసి, గుండె కండరం దెబ్బతినకుండా, వెంటనే నష్టాన్ని నివారించవచ్చు. గుండె కండరం ఒకసారి దెబ్బతిన్న తర్వాత.. యాంజియోప్లాస్టీ చేసినా, బైపాస్‌ సర్జరీ చేసినా.. ఏం చేసినా.. ఆ నష్టాన్ని పూర్తిగా సరిచెయ్యలేం. అప్పటికి దెబ్బ తిన్నది తిన్నట్టే. దెబ్బతినకుండా ఇంకా మిగిలి ఉన్న భాగాన్ని మాత్రమే రక్షించుకోగలం.

* ఇలా గుండె కండరంలో కొంతభాగం దెబ్బతిన్నప్పుడు మన ఆయుర్దాయం సహజంగానే కొంత తగ్గుతుంది. ఇలా జరగకుండా.. ఒకసారి గుండె కండరం దెబ్బతిన్నా కూడా దీర్ఘకాలం జీవించేందుకు, ఇతరత్రా దుష్ప్రభావాలు లేకుండా ఉండేందుకు ఎక్కువ మందులు వాడుతుండాలి, 'రీహాబిలిటేషన్‌' పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రీహాబిలిటేషన్‌లో ఏం చేస్తారు?

ఆరోగ్యం అంచనా: ముందు రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఏయే సమస్యలున్నాయన్నది అంచనా వేస్తారు. గుండె సామర్థ్యంతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తుల వంటి ఇతరత్రా అవయవాల పనితీరునూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. దీని ఆధారంగా రోగికి ఎటువంటి శిక్షణ అవసరం, ఎంత వరకూ ఇవ్వవచ్చన్నది నిర్ధారిస్తారు.

ఆహారం సలహాలు: రోజూ ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు? దానిలో కొవ్వు ఎంత? పండ్లూ కూరగాయలు తగినంతగా తింటున్నారా? లేదా? ముడిధాన్యం, చేపల వంటివి తీసుకుంటున్నారా? మద్యం అలవాటుందా? మధుమేహం, హైబీపీ వంటి సమస్యలున్నాయా? ఇవన్నీ పరిశీలించి అందుకు తగినట్లుగా రోజూ ఎటువంటి ఆహారం, ఎలా తీసుకోవాలో, కొలెస్ట్రాల్‌ వంటివి ఎలా తగ్గించుకోవాలో సిఫార్సు చేస్తారు. రీహాబిలిటేషన్‌లో ఈ 'డైట్‌ కౌన్సెలింగ్‌' చాలా కీలక అంశం.

బరువు: బీఎంఐ ఎక్కువుంటే క్రమేపీ బరువు తగ్గేందుకు సూచనలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు లేని ఆహారం ఎలా తీసుకోవాలి, వ్యాయామం, శారీరక శ్రమ ఏ తీరులో పెంచాలన్నది సూచిస్తూ.. ఆశించిన మేర బరువు తగ్గేలా సలహాలిస్తారు.

మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్‌: గుండె జబ్బులకు సంబంధించి ఈ మూడింటినీ నియంత్రిణలో ఉంచుకోవటం అత్యంత కీలకమైన అంశం. ఈ మూడూ అదుపులో లేకపోతే- కొత్తగా అతికిన రక్తనాళాలు కూడా త్వరగానే పూడుకుపోతాయి, లేదా పాడైపోతాయి. అందుకే బీపీ ఎంత ఉంటోంది? చెడ్డ కొలెస్ట్రాల్‌, మంచి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయి? మధుమేహం అదుపులో ఉంటోందా? పరీక్షిస్తుంటారు. వీటిని అదుపులోకి తేవటానికి మందులు, ఆహారం, వ్యాయామాల వంటివన్నీ సూచిస్తూ, అవి ఏ తీరులో తగ్గుతున్నాయో ఎప్పటికప్పుడు సరిచూస్తుంటారు.

పొగ: మరోసారి గుండెపోటు రాకుండా ఉండాలన్నా, దెబ్బతిన్న గుండె రక్తనాళాలు తిరిగి బాగవ్వాలన్నా పొగ మానెయ్యటం చాలా ముఖ్యం. దానితో వచ్చే ముప్పులేమిటో, మానేస్తే లాభాలేమిటో వివరిస్తూ దాన్ని వదిలించుకునే క్రమంలో తలెత్తే డిప్రెషన్‌, కోపం వంటి భావోద్వేగాలనూ నెగ్గుకురావటమెలాగో నేర్పిస్తూ.. క్రమేపీ ఆ వ్యసనాన్ని వదిలించుకునేలా సహకరిస్తారు.

మానసిక సాంత్వన: గుండె జబ్బు నుంచి కోలుకుంటున్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌, కోపం, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతుంటాయి. వీటిని నెగ్గుకురావటానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి రీహాబిలిటేషన్‌లో భాగంగా ఇచ్చే కౌన్సెలింగ్‌ ఉపయోగపడుతుంది. యోగా, ధ్యానం, రోజూ కొంత సమయం కుటుంబంతో గడపటం, అప్పుడప్పుడు విహారానికి వెళ్లటం, ప్రశాంత వాతావరణంలో గడపటం వంటి వాటివల్ల ప్రయోజనం ఉంటుంది.

వ్యాయామం: గుండెకు అతిపెద్ద శత్రువు ఏ వ్యాయామమూ లేని జీవనశైలి! గుండెపోటుకు ఇది ముఖ్యమైన ముప్పు కారకం. అందుకే గుండె తిరిగి ఆరోగ్యంగా, సమర్థంగా తయారవ్వటానికి ఫిజియోథెరపిస్టులు, రీహాబిలిటేషన్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఇచ్చే వ్యాయామ శిక్షణ కీలకమని గుర్తించాలి. రెండోది- చాలామందికి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుంది. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చెయ్యటం సురక్షితం. రోగి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, వ్యాధులను బట్టి ఎవరు ఏ స్థాయి వ్యాయామాలతో ఆరంభించాలి, ఎంతసేపు చెయ్యాలి, పరిమితులేమిటన్న సూచనలన్నీ స్పష్టంగా రూపొందిస్తారు. వ్యాయామం చేస్తున్నంత సేపూ ప్రత్యేక పరికరాల ద్వారా బీపీ, గుండె వేగం, ఊపిరితిత్తుల పనితీరు వంటివన్నీ ఎలా ఉంటున్నాయో పరిశీలిస్తూ ఉంటారు. క్రమేపీ ట్రెడ్‌మిల్‌, స్టేషనరీ సైకిల్‌ వంటి వాటితో ఏరోబిక్‌ వ్యాయామాలకు ప్రాధాన్యం ఇస్తూ.. దశల వారీగా తీవ్రత పెంచుతారు. తర్వాత దశలో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయిస్తారు. ఇలా ఐదారు వారాల పాటు నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చెయ్యటం వల్ల తాము ఎంత వరకూ చెయ్యచ్చు? ఏ పరిమితి దాటకూడదన్నది రోగులకే అర్థమవుతుంది. ఆ తర్వాత రోజువారీ ఇంటి వద్ద తిరగటం, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎలా చెయ్యాలో నేర్పిస్తారు. వ్యాయామంతో శారీరక సామర్థ్యం మెరుగై గుండె కొట్టుకునే వేగం, బీపీ, గుండె కండరానికి ఆక్సిజన్‌ అవసరాల వంటివన్నీ మెరుగవుతాయి. వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్‌ పెరగటం, సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ తగ్గటం, మధుమేహం అదుపులోకి రావటం వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

మందులు: ఒకసారి గుండె జబ్బు పడినవారు జీవనశైలిలో మార్పులతో పాటు వైద్యుల సిఫార్సు మేరకు కొన్ని రకాల మందులు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి: రక్తనాళాలు సంకోచించకుండా కాస్త విప్పారినట్టు ఉంచే 'వేసో డైలేటర్స్‌', రక్తం గడ్డకట్టకుండా పల్చగా ఉండేలా చూసేందుకు తక్కువ డోసులో 'ఆస్పిరిన్‌', రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు, తద్వారా రక్తనాళాల్లో మళ్లీ కొవ్వు పూడికలు రాకుండా చూసేందుకు 'స్టాటిన్స్‌', గుండె కండరం విశ్రాంతిగా ఉంటూ.. సమర్థంగా రక్తాన్ని పంపింగ్‌ చేసేందుకు దోహదపడే 'బీటా బ్లాకర్స్‌' రకం మందులు అవసరం.

మరికొన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి - > గుండెపోటు

భారతీయుల్లో గుండెపోటు :
ప్రపంచ జనాభాతో పోలిస్తే... మన భారతీయులను చిన్నవయసులోనే గుండెపోటు కబళిస్తోందని తాజాగా ఎన్నో అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. నవతరం 20, 30 ఏళ్లు కూడా దాటక ముందే గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళనకర పరిణామం. ఇంటికీ, దేశానికీ వెన్నెముకగా నిలబడాల్సిన యువత ఇలా అర్ధాయుష్షుతో కుప్పకూలిపోతుండటం పెను విపత్తుకు చిహ్నం. అందుకే పరిశోధనా రంగం ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది.
దీన్ని అడ్డుకునేదెలా? దీనికి మనమేం చెయ్యాలి? ఈ రెండే ఇప్పుడు మన ముందున్న కీలక ప్రశ్నలు.

పది, పదిహేనేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో గుండెపోటు, గుండె జబ్బుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇది యువతీ యువకుల్లోనూ.. అంటే 20, 30, 40 ఏళ్ల వారిలోనూ ఎక్కువగా కనిపించటం ఆందోళనకర పరిణామం. ఒకప్పుడీ పరిస్థితి లేదు. అందుకే భారతీయ సంతతినీ - పాశ్చాత్యులనూ పోలుస్తూ అమెరికా, బ్రిటన్‌, కెనడాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వీటిలో ఎన్నో ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైనఅంశాలు వెలుగు చూశాయి. పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులు 4 రెట్లు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నట్టు తేలింది. చిన్నవయసులోనే రావటం, హఠాత్తుగా రావటం మాత్రమే కాదు.. భారతీయుల్లో గుండెపోటు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. వీరిలో చాలామందిలో గుండెలోని రక్తనాళాలు- ఆపరేషన్‌తో కూడా సరిచేయలేనంత విస్తృతంగా చాలా ప్రాంతాల్లో మూసుకుపోవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. దీనిపై మన దేశంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడి కావటం విశేషం.
కారణాలు అనేకం
భారతీయులకు గుండె పోటు ఎందుకింత త్వరగా, తీవ్రంగా వస్తోంది? మిగతా జాతీయులతో పోలిస్తే వీరికి గుండెలోని రక్తనాళాలు పూడుకుపోవటమన్న సమస్య (సీఏడీ) ఎందుకు ఎక్కువగా ఉందన్న దానిపై లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి.

* జన్యు స్వభావం: జన్యుపరంగానే భారతీయులకు గుండెపోటుకు కారణమయ్యే ముప్పులు(రిస్కులు) ఎక్కువగా ఉంటున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మధుమేహం, చెడ్డకొలెస్ట్రాల్‌.

* మధుమేహం: ఐరోపా, అమెరికా జాతీయులతో పోలిస్తే భారత ఉపఖండంలో మధుమేహం 3-6 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఊబకాయంతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ఎంతోమంది మధుమేహం బారిన పడుతున్నారు. 50 ఏళ్ల వయసు వచ్చేసరికే జనాభాలో 50% మంది మధుమేహంతోనో, మధుమేహానికి దగ్గర్లోనో (ప్రీడయాబిటీస్‌) ఉంటున్నారు.

* చెడ్డ కొలెస్ట్రాల్‌: చిన్నవయసులో గుండెపోటుకు కారణమవుతున్న మరో ముఖ్యమైన అంశం, కొత్తగా గుర్తించిన అంశం- భారతీయుల్లో లైపోప్రోటీన్‌ 'ఎ' అనే రకం చెడ్డ కొలెస్ట్రాల్‌ చాలా ఎక్కువగా ఉంటుండటం. ఇది అత్యంత ప్రమాదకారి. (దీని గురించి బాక్సులో వివరంగా) మన దేశంలో సరైన తిండి లేని పేదల్లో కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి ఇది కొవ్వుపదార్థాల వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చేది కాదని, దీనికి జన్యు స్వభావం కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.

* జీవన శైలి: నానాటికీ పాశ్చాత్య పోకడలను ఒంట బట్టించుకుంటూ శారీరక శ్రమకు దూరమవుతుండటం వల్ల ఊబకాయం, మధుమేహం, హైబీపీ వంటి రిస్కులు పెరిగి... అవి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. పొగతాగటం, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తినటం వంటివి వీటికి అదనం.

మన చేతుల్లో కీలకాంశాలు
* బొజ్జ: పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం గుండెకు చేటు. మన దేశంలో సుమారు 30 శాతం మందిలో ఈ బొజ్జ సమస్య ఉంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి ఎన్నో రుగ్మతలను తెచ్చిపెడుతుంది, ఇవన్నీ కలిసి గుండెపోటు ముప్పు పెంచుతాయి. కాబట్టి నడుం కొలత పురుషుల్లో 90 సెం.మీ., స్త్రీలల్లో 80 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. అందుకే 'వెయిస్ట్‌ లైన్‌ ఈజ్‌ యువర్‌ లైఫ్‌ లైన్‌' అనే నినాదం ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగని సన్నగా ఉండేవారిలో అధిక కొలెస్ట్రాల్‌ ఉండదనుకుంటే కూడా పొరబడ్డట్టే. వాళ్లూ కొలెస్ట్రాల్‌తో సహా గుండె రిస్కుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటమే ఉత్తమం.

ఆహారం
* హాని చేసేవి: గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలు సాధ్యమైనంత తక్కువ తీసుకోవటం అవసరం. వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు తక్కువ తీసుకోవాలి. ఆలివ్‌ నూనె, సోయాబీన్‌ నూనె, పొద్దు తిరుగుడు నూనె వంటివి గుండెజబ్బు ముప్పును నివారించటంలో బాగా ఉపయోగపడతాయి. అయితే వీటినీ చాలా మితంగానే తీసుకోవాలి. ఒకసారి బాగా కాచిన నూనెను తిరిగి వాడటం కూడా ప్రమాదకరం. కొవ్వు పదార్థాల్లో 'ట్రాన్స్‌ఫ్యాట్స్‌' చాలా ప్రమాదకరం. వనస్పతితో తయారయ్యే వాటిల్లో ఇవి ఎక్కువుంటాయి. పామాయిల్‌ కూడా హాని చేస్తుంది.
* కేలరీలు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
* శాకాహారులు కూడా.. మాంసం తినటం లేదన్న మిషతో... వెన్న నెయ్యి, చీజ్‌, పెరుగు, ఐస్‌క్రీమ్‌ వంటివి ఎక్కువెక్కువగా తినేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదకరమైనవే. కాబట్టి శాకాహారులు కొవ్వుల విషయంలో జాగ్రత్త వహించకపోతే గుండెజబ్బు కొని తెచ్చుకున్నట్టే.
* మేలు చేసేవి: ఎండు పప్పుల్లో (నట్స్‌) ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్లు, పొటాషియం.. మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో 45-80 శాతం కొవ్వు ఉన్నా ఇది అసంతృప్త కొవ్వు కావటం వల్ల రక్తనాళాలకు మేలు చేస్తుంది. కాబట్టి బాదం, వాల్‌నట్‌, వేరుశెనగ, పిస్తా వంటి వాటిని రోజుకి 40-70 గ్రాముల వరకు తినాలి.
* వారానికి కనీసం రెండు సార్త్లెనా చేపలు తీసుకోవటం మంచిది.
* పండ్లు, కూరగాయల్లో పీచు, బి విటమిన్లు, సి విటమిన్‌, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, హోమోసిస్టీన్‌ పెరగకుండా చూస్తాయి, మొత్తమ్మీద గుండె జబ్బు ముప్పునూ తగ్గిస్తాయి. పండ్లు, కూరగాయలు కలిపి రోజుకు 10 కప్పులైనా తీసుకోవటం మంచిది.
* దంపుడు బియ్యం తినాలి. తెల్లగా పాలిష్‌ పట్టించిన బియ్యం తినే వారిలో కంటే దంపుడు బియ్యం తినేవారిలో మధుమేహం 15-20 శాతం తక్కువ. గుండె జబ్బుల ముప్పు తక్కువని గుర్తించారు.
* పొగ మానేయటం తక్షణావసరం. రోజూ వ్యాయామం చేయటం, చేపల వంటి వాటిల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అప్పటికీ మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటుంటే వైద్యుల పర్యవేక్షణలో 'నియాసిన్‌' విటమిన్‌ తీసుకోవటం మేలు చేస్తుంది. పైగా ఇది ప్రమాదకరమైన లైపోప్రోటీన్‌-ఎ స్థాయినీ తగ్గిస్తుంది.
మనకు మధుమేహంలో టైప్‌-1, టైప్‌-2 అని రెండు రకాలుంటాయని తెలుసు. అలాగే గుండెపోటుకు దారి తీసే గుండె జబ్బులో కూడా మూడు రకాలున్నాయి.
* టైప్‌- 1: చాలా చిన్నవయసులోనే గుండెలోని రక్తనాళాలు కొవ్వుతో మూసుకుపోతుండే అత్యంత ప్రమాదకర రకం ఇది. సాధారణంగా గుండె జబ్బు 55-60 ఏళ్ల వారిలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ రకం 45 ఏళ్ల లోపే.. చిన్నవయసులోనే ఆరంభమైపోతుంది. కొందరికి 30 ఏళ్లలోపే గుండెలోని రక్తనాళాల్లో 70% వరకూ మూసుకుపోయి తీవ్రమైన గుండె జబ్బు ఆరంభమైపోతుంది కూడా. మధుమేహం, హైబీపీ వంటి ముప్పులేమీ లేకుండా కూడా వీరిని గుండెజబ్బు కబళిస్తుండటం గుర్తించాల్సిన అంశం. పైగా ఒకసారి ఈ రకం గుండెజబ్బు బారినపడ్డారంటే ఎంత చికిత్స చేసినా ఆ దుష్పరిణామాలను తప్పించుకోవటం కష్టంగా కూడా ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన 'మాలిగ్నంట్‌' రకం గుండె జబ్బు అంటున్నారు. దీనికి చెడ్డ కొలెస్ట్రాల్‌లో భాగమైన 'లైపోప్రోటీన్‌ ఎ' అనేదే ప్రధాన కారణమవుతోంది.
* టైప్‌-2: వయసు పైబడిన వారిలో అంటే 50, 60 ఏళ్ల తర్వాత సాధారణంగా తరచూ చూస్తుండే రకం ఇది. వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులన్నీ ఉంటాయి.
* టైప్‌ 3: ఇందులో పైన పేర్కొన్న రెండు రకాల లక్షణాలూ కనిపిస్తాయి. ఇది 45-65 ఏళ్ల లోపు ముంచుకొస్తుంది, వీరిలో హైబీపీ, మధుమేహం వంటి రిస్కులే కాదు.. లైపోప్రోటీన్‌-ఎ వంటి ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ముప్పులూ కనబడతాయి.

కొత్త ముప్పుపై కన్నేసి ఉంచండి!
లైపోప్రోటీన్‌ 'ఎ'
జన్యుపరంగా సహజంగానే భారతీయుల్లో చెడ్డకొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌) అధికంగా ఉంటోంది. దీనికి తోడు ట్రైగ్లిజరైడ్లు, ఏపీఓబీ, ఏపీఓఎ1 వంటివీ ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా ఉండాల్సిన మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉంటోంది. ఇవన్నీ గుండెజబ్బుకు దారి తీసేవే. వీటికి తోడు గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవటంలో కీలక పాత్ర పోషించే 'లిపోప్రోటీన్‌-ఎ' కూడా భారతీయుల్లో చాలా ఎక్కువగా ఉంటోంది. ఇది నేరుగా రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. సాధారణంగా ఇది 20 ఎంజీ కన్నా తక్కువ ఉండాలి. ఇది 100 ఎంజీకి చేరుకుంటే చాలా త్వరగా రక్తనాళాల్లో పూడిక తెప్పిస్తుంది. ఇలాంటి వారికి స్టెంట్స్‌ అమర్చినా అవి కూడా త్వరగా పూడుకుపోతుంటాయి. అందుకే ఇది చాలా ప్రమాదకరమైందని అనుకోవచ్చు. స్వతహాగా ఇది నష్టం కలిగించటమే కాదు.. 'అగ్నికి ఆజ్యం'లా ఇతరత్రా ముప్పులకు తోడై.. పరిస్థితి త్వరగా ముదిరేలా కూడా చేస్తోంది.
ఈ లైపోప్రోటీన్‌-ఎ ఎక్కువ ఉండటంతో పాటు...
* మంచి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉంటే- రిస్కు 8 రెట్లు ఎక్కువ.
* చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే- ముప్పు 12 రెట్లు ఎక్కువ.
* మధుమేహం ఉంటే- ముప్పు ఏకంగా 16 రెట్లు ఎక్కువ.


ముఖ్యంగా...
* పైవేమీ లేకపోయినా.. కేవలం లైపోప్రోటీన్‌-ఎ ఒక్కటే అధికంగా ఉన్నా సరే.. గుండెపోటు వ్యాధి ముప్పు 3 రెట్లు ఎక్కువ.
అందుకనే ఇటీవలి కాలంలో చెడ్డకొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివాటితో పాటు ఈ 'లైపోప్రోటీన్‌-ఎ' మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు ఎంత మేరకు ఉందని చెప్పేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పరీక్షలన్నింటినీ కలిపి 'కరోనరీ రిస్క్‌ ప్రొఫైల్‌' అని ఒకే పేరు కింద చేస్తున్నారు. దీన్ని 20-30 ఏళ్ల వయసు వారు ఒకసారైనా చేయించుకోవటం మంచిది. వీటిలో ఏవైనా ఎక్కువగా ఉన్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్సతో చక్కదిద్దవచ్చు. పరిస్థితి గుండెపోటు వరకూ రాకుండా చూసుకోవటానికి ఇది ఉత్తమ పద్ధతి!
* వృద్ధుల్లో గుండెపోటు రావటానికి, యువకుల్లో రావటానికీ తేడా ఉంది. వృద్ధుల్లో గుండె నొప్పి, నడుస్తుంటే ఆయాసం రావటం, క్రమేపీ పనులు చేయలేకపోవటం వంటి ముందస్తు లక్షణాలు కనబడతాయి. కానీ యువకుల్లో ఇలాంటివేవీ కనిపించకుండానే హఠాత్తుగా గుండెపోటు ముంచుకొస్తోంది. పైగా ఈ వయసులో గుండె పోటు రాదన్న ధీమాతో దాన్ని ఎసిడిటీ సమస్యగా పొరబడే ప్రమాదం ఎక్కువ. అందుకే యువతలో గుండెపోటు మరణాల రేటూ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి రెండేళ్లకొక సారైనా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది.

--డా|| ఎ.వి.ఆంజనేయులు,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌,ఫోకస్‌ డయాగ్నస్టిక్స్‌,పంజగుట్ట, హైదరాబాద్‌ .

దీర్ఘకాలము మధుమేహంతో గుండెపోటు!
ఒకసారి గుండెపోటు వచ్చినవారికి రెండోసారి వచ్చే అవకాశం ఎక్కువేనన్నది తెలిసిన విషయమే. కానీ చాలాకాలంగా టైప్‌2 మధుమేహం గల మగవారికీ ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంటుందని బ్రిటన్‌లో చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది. మధుమేహం వచ్చి ఎంత కాలం అయింది? అన్న దాన్నిబట్టి గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. సగటున పదిహేడు ఏళ్లు, అంతకన్నా ఎక్కువకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే ఈ ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇది ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో ఉండే ముప్పుతో సమానం. ఇక ఐదేళ్లుగా మధుమేహం గలవారిలో 54 శాతం రిస్క్‌ ఎక్కువ. ఎనిమిదేళ్ల క్రితం నుంచి మధుమేహంతో బాధపడే పురుషుల్లో గుండె సమస్యలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. అంటే 60 ఏళ్ల కన్నా ముందు ఎంత త్వరగా మధుమేహం మొదలైతే గుండెపోటు వచ్చే అవకాశమూ అంతే అధికంగా ఉంటోందని దీని ద్వారా తెలుస్తోంది. అయితే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రక్షణ ప్రభావం కారణంగా స్త్రీలల్లో ఈ ముప్పు కాస్త ఆలస్యంగా మొదలవుతుండటం విశేషం.

ట్రాఫిక్‌ కాలుష్యంతో గుండెపోటు
నగరాల్లో ట్రాఫిక్‌రద్దీ కారణంగా తలెత్తే వాయుకాలుష్యంతో గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాయుకాలుష్యం ప్రభావం ఆరుగంటలపాటు ఉంటోందని పేర్కొన్నారు. లండన్‌ ఆరోగ్య, ఉష్ణమండల వైద్య పాఠశాలకు చెందిన కృష్ణన్‌ భాస్కరన్‌ తన సహచరులతో కలిసి.. గుండెపోటుకు కాలుష్యానికి మధ్య ఉన్న సంబంధంపై విస్తారంగా అధ్యయనం జరిపారు. దీంట్లో భాగంగా బ్రిటన్‌లో 2003-06 మధ్య కాలంలో సంభవించిన 80 వేల గుండెపోటు కేసులను పరిశీలించారు. గుండెపోటు వచ్చిన సమయాల్లో బ్రిటన్‌లోని వివిధ నగరాల్లో గంటగంటకూ నమోదైన వాయుకాలుష్యం మోతాదులను కూడా లెక్కలోకి తీసుకున్నారు.

గుండెను కాపాడే వెల్లుల్లినూనె

వెల్లుల్లి నూనెలోని ఒక భాగం గుండెపోటు తర్వాత గుండె చికిత్సకు ఉపయోగించొచ్చని ఎమోరి యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. గుండెపోటు తర్వాత గుండె సంరక్షణకు వెల్లుల్లి నూనెలోని 'డియలిల్‌ ట్రిసుల్‌ఫైడ్‌' గుండెపోటు తర్వాత గుండెను సంరక్షించే సంయోగపదార్థాలను విడుదల చేయడంలో సహకరిస్తుందని పేర్కొన్నారు.

ఆవేదనతోనూ గుండెపోటు-Heart attack with Depression

కుటుంబంలో అత్యంత సన్నిహితులు మరణించినప్పుడు ఎవరైనా విలవిల్లాడిపోవటం సహజమే. తీవ్ర ఆవేదనతో చాలారోజుల పాటు కుమిలిపోవటమూ తెలిసిందే. ఇలా ఆత్మీయులను కోల్పోయిన బాధను రచయితలు గుండెకోత, గుండె బరువెక్కటం వంటి పదాలతో వర్ణిస్తుంటారు కానీ.. ఇలాంటి సమయాల్లో నిజంగానే గుండెపోటు ముప్పూ పొంచి ఉంటుందంటే నమ్ముతారా? తాజా అధ్యయనంలో ఈ విషయమే బయటపడింది. గుండెపోటు మూలంగా ఆసుపత్రిలో చేరిన కొందరిపై ఇటీవల శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. పిల్లలు, భర్త, భార్య, తల్లిదండ్రులు, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ములు.. ఇలా కుటుంబంలో సన్నిహితులు ఎవరైనా ఇటీవలే మరణించారా? అనే విషయాన్ని పరిశీలించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆత్మీయులు మరణించిన నాడే ఆ బాధతో కుమిలిపోయేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం 21 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ముప్పు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ఈ ప్రమాదం నెల వరకు కొనసాగుతుండటం గమనార్హం. తీవ్ర ఆవేదనకు లోనయ్యేవారిలో కుంగుబాటు, కోపం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే వీరిలో నిద్రలేమి, ఆకలి తగ్గటం, ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ అధిక స్థాయిలో ఉండటమూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని తెచ్చిపెట్టటానికి దోహదం చేస్తున్నాయి. అందువల్ల ఆవేదన, బాధలకు గురైన సమయాల్లో ఛాతీలో అసౌకర్యం, నొప్పి.. మెడ, దవడ, వెన్ను, చేతుల్లో అసౌకర్యం.. శ్వాసలో ఇబ్బంది.. వికారం.. కళ్లు తిరగటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించటం మేలని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ గుండెపోటు లక్షణాలను సూచించేవే అని మరవరాదు
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

చిన్నపిల్లల కంటి జబ్బుల జాగ్రత్తలు , Eye diseases in Children -precautions


-

పిల్లలకి తల్లిదండ్రులు జన్మనివ్వడమే కాకుండా, జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రేమని పంచుతారు. కంటికి రెప్పలా కాపాడుతారు. శిశువుగా ఉన్నప్పటి నుండీ పెద్దయ్యే వరకు, అన్నపానాలు సమకూరుస్తారు, విద్యా బుద్దులు నేర్పుతారు. జబ్బు చేస్తే పక్కనే ఉండి సేవలు చేసి, వైద్యం చేయించి, కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడతారు. పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ‘ఆ జబ్బు పిల్లలకి కాక తమకే వచ్చిందా?’ అన్నట్టు విలవిల్లాడతారు. పిల్లలకు దెబ్బ తగిలితే తాము ’అబ్బా’ అంటారు. కష్టంలో వెన్నంటి ఉంటారు, అభివృద్దిని చూసి ఆనందిస్తారు.
పెద్దవాళ్లకు వచ్చే ప్రతి జబ్బూ పిల్లలకు వస్తుంది. కళ్లజబ్బులు ఇందుకు మినహాయింపు కాదు. పుట్టగానే మనకు వందశాతం చూపు ఉండదు. యాభైశాతం చూపుతోనే పుడతాం. ఆ తరువాత చుట్టూ ఉన్న రంగులు, కాంతి వల్ల కంటిలోని కణాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా మెల్లమెల్లగా మిగిలిన యాభైశాతం చూపు వస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా మిగతా సగం చూపు అభివృద్ధి చెందదు. పుట్టుకతోనే కంటిలో లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. పెద్దవాళ్లకు వచ్చే శుక్లాలు, రెటినోపతి, గ్లకోమా లాంటివైతే ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంధత్వానికి దారితీస్తాయి. కాబట్టి బుజ్జిపాపాయిల నేత్రాలు పదిలంగా ఉండాలంటే కంటిపరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. లేకుంటే రకరకాల జబ్బుల వల్ల సమస్యలు వచ్చిపడతాయి. కంటిలో ఏ సమస్య ఉన్నా ఎనిమిదేళ్లలోపే దానికి చికిత్స చేయించాలి. లేకుంటే ప్రమాదాన్ని నివారించడం కష్టమే. ఆ తరువాత చికిత్స చేయించినా పూర్తి ఫలితం అందుకోలేరు. భవిష్యత్తులో ఏదో ఒక వయసులో చూపు పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.

  • బద్దకించే కన్ను.. లేజీ ఐ
బిడ్డ పుట్టిన తరువాత తగిన కాంతికి తప్పనిసరిగా ప్రభావితం కావాలి. చాలామంది పెద్దవాళ్లు బయటకు తీసుకురావద్దంటూ తల్లినీ, బిడ్డనూ బెడ్రూమ్‌కే పరిమితం చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని రకాల ముదురు రంగులకు శిశువుల్ని దూరంగా ఉంచుతుంటారు. కాంతితో పాటు అన్ని రకాల రంగులను బిడ్డ కళ్లు చూడాలి. తగినంత వెలుతురు లేకపోయినా, రంగులను చూడకపోయినా శిశువు కళ్లు సక్రమంగా ఎదగలేవు. పుట్టినప్పుడు ఉన్న దృష్టి సామర్థ్యం దగ్గరే ఆగిపోతుంది. మిగిలిన సగం వృద్ధి కాదు. దీన్నే ''స్టిమ్యులేషన్ డిప్రివేషన్ యాంబయోపియా'' అంటారు. కొన్ని సార్లు ఒక కన్ను దృష్టి బాగా ఉండి, రెండో కన్ను కాంతి, రంగుల ద్వారా పూర్తిగా ప్రేరేపితం కాదు. ఇలాంటప్పుడు ఇది లేజీగా మారిపోతుంది. అంటే దీని దృష్టి సరిగా పెరగదు. దీన్ని సకాలంలో గుర్తించలేకపోతే ప్రమాదమే. దృష్టి బాగున్న కన్నుకు రోజుకి రెండు గంటలు ప్యాచ్‌లాగా వేస్తే లోపం ఉన్న కన్ను ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. మెల్లమెల్లగా దాని దృష్టిసామర్థ్యమూ పెరుగుతుంది. దీన్ని ''ప్యాచ్ ట్రీట్‌మెంట్'' అంటారు.

  • రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ
సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే రెటీనా ఎదుగుదల పూర్తవుతుంది. పుట్టేసరికి రెటీనా సరిపడా రక్తనాళాలతో పూర్తిగా ఏర్పడిపోతుంది. కానీ నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో రెటీనాలో అన్ని రక్తనాళాలూ ఏర్పడవు. ఈ పరిస్థితి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ(ఆర్‌ఓపీ)కి దారితీస్తుంది. ఇది బిడ్డ పూర్తి ఆరోగ్యం, పుట్టినప్పుడు ఉన్న బరువు, ఆర్‌ఓపీ తీవ్రత ల మీద ఆధారపడి ఉంటుంది. సకాలంలో గుర్తించి చికిత్స ఇప్పించకపోతే ఆర్‌ఓపీ అంధత్వానికి కూడా దారితీయవచ్చు. ఆర్‌ఓపీ ఉన్నవాళ్లు గ్లకోమా, శుక్లాలు, దృష్టిలోపాల వంటి సమస్యల బారినపడే అవకాశం ఎక్కువ. చుక్కల మందు వేసి రెటీనాను పరీక్ష చేయడం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. సర్జరీ ద్వారా దీన్ని సరిచేయవచ్చు.

  • కంటిలో శుక్లాలు
శుక్లాలు ఉన్నాయంటే ఏ అరవయ్యేళ్ల వృద్ధులో అనుకుంటాం. అంటే శుక్లాలు అంటే వృద్ధుల కంటిజబ్బు అన్న అభివూపాయం ఉంది. కానీ చిన్నారుల్లో, అప్పుడే పుట్టిన వారిలో కూడా కంటిలో శుక్లాలు ఉండవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు తల్లికి మధుమేహం ఉన్నా, రుబెల్లా, తట్టు, చికెన్‌పాక్స్, ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు వచ్చినా, ఏవైనా గాయాలు అయినా, గర్భసంచి ఏ కారణం చేతనైనా ఒత్తిడికి గురయినా, ఉమ్మనీరు తగినంత లేకపోయినా బిడ్డ కంటిలో శుక్లాలతో పుట్టవచ్చు. కొన్నిసార్లు మందుల దుష్ప్రభావం వల్ల కూడా రావచ్చు. ఉదాహరణకి గర్భిణులకు టెట్రాసైక్లిన్ లాంటి యాంటిబయాటిక్స్ వాడినప్పుడు బిడ్డకు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది.

  • కంజెనిటల్ గ్లకోమా
కంటిలోని డ్రైనేజ్ చానళ్లు సక్రమంగా ఏర్పడకపోవడం వల్ల పుట్టుకతోనే నీటికాసుల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ ద్రవం తయారవుతుంది కానీ బయటకు వెళ్లే దారి లేక కన్నులోనే ఉండిపోతుంది. ఈ ద్రవాన్ని కంటి నుంచి బయటకు తీసుకెళ్లే దారే డ్రైనేజ్ చానల్. ఇది ద్రవాన్ని తీసుకెళ్లలేదు కాబట్టి కంటిలో ద్రవం ఎక్కువై పీడనం కూడా పెరుగుతుంది. తద్వారా రెటీనా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దృష్టినాడి కూడా దెబ్బతిని శాశ్వతంగానే చూపు పోవచ్చు. దీన్ని ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా అంటారు. కొన్నిసార్లు గర్భంలో ఉన్నప్పుడు పుట్టేటప్పుడే చిన్న చిన్న దెబ్బలు తగిలితే అవి తరువాత గ్లకోమా సమస్యను తెచ్చిపెట్టవచ్చు. నీటికాసులున్నట్టు లక్షణాల ద్వారా తెలుసుకోవడం కష్టం. కాబట్టి కంటిపరీక్షలు చేయించడమే ఉత్తమం. ఇవి సాధారణంగా బిడ్డ పుట్టగానే లేదా పుట్టిన ఏడాదిలోపే తెలుసుకోవచ్చు.


  • మెల్లకన్ను
కనుగుడ్డు చుట్టూ ఉండే కండరాలు మెదడు ఆదేశానుసారం కళ్లను అటూ ఇటూ కదిలించడానికి తోడ్పడతాయి. వీటి పనితీరు దెబ్బతింటే అవి సరైన విధంగా కదలవు. అది మెల్లకన్నుకు దారితీస్తుంది. సాధారణంగా చాలామంది శిశువుల్లో మెల్ల ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పెరిగిన కొద్దీ పోతుంది. దీన్ని సూడోస్కింట్ అంటారు. ముక్కు సైజు పెరిగిన కొద్దీ కంటి కండరాలు బాగైపోయి మెల్ల పోతుంది. కొన్నిసార్లు మాత్రం కంటిలో ఇతర సమస్యలుంటే మెల్ల ఏర్పడుతుంది. ఈ మెల్లకన్నును అయిదేళ్లలోపు గుర్తించి సరిచేయించకపోతే మాత్రం కంటిజబ్బులకు గురవుతారు.


Article : courtesy with Kaasu prasadareddy , Director , Maxivison Eye hospital - Hyd @Namasthe Telangana.com

  • పిల్లలలో దృస్టిలోపము , అంధత్వనివారణకు తల్లిదండ్రులు పాటించాల్చిన జాగ్రత్తలు :

పిల్లలకు పుట్తుకతోనే కొన్ని జబ్బులు వస్తుంటాయి . తరువాతి క్రమము లో పోషకాహార లోపముతో , బయటి ఇన్‌ఫెక్షన్‌ వలన అనేక జబ్బులు వస్తాయి . వీటిలో
  1. మయోపియా , 
  2. గ్లకోమా , 
  3. కంజక్టవైటిస్ ,
  4. స్ట్రెబిస్మస్ , 
  5. ఎంబ్లయోపియా , 
  6. టియర్ (కన్నీరు)డక్ట్ (నాళము) మూసికపోవడం , 
  7. టొసిస్(కనురెప్పలు వాలిపోవడం), 
  8. రెటినోపతి , 
  9. చిన్నపిల్లలలో కంటి కుసుమాలు ,
  10. మెల్లకన్ను , 
  11. కంటి క్యాన్‌సర్(ఆర్బి్టల్ ట్యూమర్స్ ) ముఖ్యమైనవి .

మయోపియా (హ్రస్వ దృష్టి) : దగ్గర వస్తువులు కనిపిస్తాయి , దూరము వస్తువులు స్పస్తం గా కనిపించవు లేక పూర్తిగా కనిపించవు . డాక్టర్ చే తనికీ చేయించి తగిన అద్దాలు వాడాలి .

మెల్లకన్ను : మెల్లకన్ను పై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి . ఇది ఉంటే అదృస్టము అంటారు . కాని దీనిని ఇర్లక్షము చేస్తే దృస్టి క్రమముగా తగ్గిపోతుంది .. పూర్తిగా దృస్టి పోయే ప్రమాదమూ ఉంది . శస్త్ర చికిత్స ద్వారా నయము చేయవచ్చును .

కండ్ల కలకలు : ఇన్‌ఫెక్షన్‌ వలన కళ్ళు పుసికట్టి , ఎరుపుగా ఉంది నుసివేస్తాయి . తగిన డాక్టర్ చే కంటి చుక్కలమందు , యాంటిబయోటిక్స్ వాడితే సరిపోతుంది .

ఏది ఏమైనా చిన్నపిల్లల విషయము లో అస్రద్ద చేయకుండా తగిన చికిత్స చేయించాలి .

  • జాగ్రత్తలు :
క్రమము తప్పకుండా పౌస్టికాహారము ఇవ్వాలి ,
విటమిం 'ఎ' ఎక్కువ ఉన్న ఆహారము ఇవాలి ,
అంటువ్యాధులు ఉన్నవారికి దూరము గా ఉంచాలి ,

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 9, 2010

భ్రూణ లింగనిర్థారణ నిషేధ చట్టం , Pre-natal sex diagnostic Act.


---

భ్రూణ లింగనిర్థారణ నిషేధ చట్టం అందుబాటులో ఉన్నా.. సక్రమంగా అమలుకు నోచుకోకపోవడమే అసలైన కారణం. ఇంతకీ ఆ చట్టం ఏం చెబుతోందంటే?

పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా అని తెలుసుకోవడం.. అమ్మాయైతే భారమనుకొని నిర్ధాక్షిణ్యంగా గర్భస్రావం చేయించుకోవడం ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో కొనసాగుతోన్న మూర్ఖత్వం. కాబోయే తల్లికి అమ్మాయిని కనాలని మనసులో ఉన్నా... మిగతా కుటుంబ సభ్యుల ప్రోద్భలం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, వరకట్నం వంటివన్నీ అమ్మాయి వద్దనుకునేలా చేస్తున్నాయి. ఇదే నిజం.. అమ్మాయని తెలియగానే అంతం చేసే పరిస్థితిలో మార్పు రాలేదని గణాంకాలూ నిరూపిస్తున్నాయి.

మన జనాభా లెక్కలు 1991 ప్రకారం.. (0-6 ఏళ్లలోపు పిల్లల్లో) అమ్మాయిల సంఖ్య 945. అది 2001 నాటికి ఇంకా తగ్గింది. వెయ్యిమంది అబ్బాయిలుంటే.. అమ్మాయిల సంఖ్య 927 కు దిగజారింది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.

చట్టం నుంచి రక్షణ...
అమ్మాయిలను వద్దనుకుని వదిలించుకునే వారిని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1994లో లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (ప్రీనాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అబ్యూస్‌) యాక్ట్‌ 1994) రూపొందించింది. గర్భిణులకు చేసే స్కానింగ్‌ కేవలం.. పుట్టబోయే పిల్లల్లో ఉన్న జన్యుపరమైన అవకరాలను గుర్తించడానికేనని తేల్చిచెప్పింది. దీన్ని ఉల్లంఘిస్తే యాభై వేల రూపాయల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష తప్పనిసరని పేర్కొంది.


వైద్యులూ భాగమే
వైద్యులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. దాని ప్రకారం ప్రతి నర్సింగ్‌ హోమ్‌ని కచ్చితంగా రిజిస్టర్‌ చేయాలి. అలాగే భ్రూణ పరీక్షలో అమ్మాయా, అబ్బాయా అన్నది తెలిసినప్పుడు వైద్యులు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు, ఇతరులకు చెప్పడం నేరం అవుతుంది. చట్టం వచ్చి ఇన్నేళ్లయినా అమలులో ఆటంకాలు. ఫిర్యాదులు స్వల్పం. కేసులు నత్తనడక.

ఈ చట్టానికి సంబంధించి 2001లో ఓ వాజ్యం దాఖలైంది. ఆ సందర్భంలో సుప్రీంకోర్టు వరసగా కొన్ని నెలలు అమలు తీరుని పర్యవేక్షించింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా.. తమ నియమాలను సవరించి, లింగ నిర్థారణ పరీక్ష జరిపించే వైద్యులను వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డ వారిగా పరిగణించాలని నిర్ణయించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆస్పత్రులను డీరిజిస్టర్‌ చేసి, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని 2002లో సవరించిన నియమాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ చట్టాలకు తోడు సెక్షన్‌ 312 ఐపీసీ ప్రకారం అక్రమ గర్భస్రావం చేయించడమూ నేరం. దాన్ని గోప్యంగా ఉంచడమూ సెక్షన్‌ 120 ప్రకారం నేరం. పుట్టకముందే లింగనిర్ధారణ చేయించే అధికారం ఎవరికీ లేదని 2002లో చేసిన సవరణలో స్పష్టం చేశారు. అప్పటినుంచి ఈ చట్టం 'ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీనాటల్‌ డయాగ్నొస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌ 2002'గా మారింది.

వెసులుబాటు లేదు...
ఈ చట్టం నుంచి వెసులుబాటు కోరుతూ కోర్టులను ఆశ్రయించిన వారున్నారు. ఈ చట్టం నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ 2002లో ముంబై హైకోర్టులో కొందరు రిట్‌ పిటిషన్‌ వేశారు. ఒకరిద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా అనుమతించాలని.. కుటుంబాన్ని ప్లాన్‌ చేసుకునే స్వతంత్రం కల్పించాలనీ ఓ జంట వాదించింది. అంటే అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండి... మూడో సంతానం మగపిల్లవాడు కావాలని కోరుకోవడంలో తప్పులేదు గనుక తెలుసుకునే వీలు కల్పించాలనేది వారి వాదన. ఈ భావనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కేసును కొట్టి వేసింది. 'ఆడపిల్లల పట్ల వివక్ష ఉన్న మనదేశంలో లింగనిర్ధారణ పరీక్షలు చట్టబద్ధం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. నిజానికి అలా జరిగేవన్నీ హత్యలే' అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.


  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 5, 2010

పిల్లల చురుకుదనము లో తగ్గుదల , Activity disorder of Children




పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.)( Attention Deficit Hyper Activity Disorder) అంటారు.

ఎ.డి. హెచ్ . డి. అంటే…
పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే…

పసికట్టడమెలా..
క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు.

జాగ్రత్తలు :
ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి.
క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి.
సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

సెల్ ఫోన్ వికరణాల ప్రభావం , Cell phone radiation effects



  • మనిషి ఆరోగ్యం మీద సెల్ ఫోన్ వికరణాల ప్రభావం

మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది . ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు ముఖ్యమైన ఉపకరణము గా ఈరోజు మారాయి. సెల్ ఫోన్లు మానవ శరీరానికి రోగాలని కలగచేసే లేదా మన ఆరోగ్యానికి హాని కలగచేసే సూక్ష్మ తరంగాలని ప్రసరిస్తాయి .

పిల్లలో సెల్-ఫోన్‌ ప్రభావము :

మన దేశంలో సెల్ ఫోన్ ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు, ఎస్ ఎం ఎస్ లు అంటూ ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ల వాడకం పెరిగిపోతుంది. ఇది బాగానే ఉందిగాని, ఈ సెల్ ఫోన్ల వల్ల వచ్చే అనార్థల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరమని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలు అవుతున్నారని వారు పేర్కొంటున్నారు. గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడంలో పిల్లలు సెల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారు. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా మంచిదని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. సెల్ ఫోన్ లు రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ కారణంగా రేడియో ధార్మికత వల్ల చిన్న పిల్లల్లో మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఆలోచనా శక్తి క్రమేపీ మోద్దుబారే ప్రమాదం ఏర్పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ బ్రిటీష్ శాస్త్రవేత్త ఈ సెల్ ఫోన్ల్ వల్ల వస్తున్న అనర్థాల గురించి కొన్ని హెచ్చరికలు చేసారు. ముఖ్యంగా వైర లెస్, సెల్ ఫోన్ లు, విల్ ఫోన్ లు నుంచి విడుదలయ్యే రేడియో ధార్మిక కిరణాలు సున్నితమైన మెదడు కణజాలాన్ని నాశనం చేస్తున్నాయని, చిన్న పిల్లల్లో ఇది బాగా ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. బ్రిటన్ హెల్త్ ప్రొడక్షన్ ఏజన్సీకి చెందినా సర్ విలియం స్టీవార్డ్ ఫిన్క్ష్లన్ద్లొ జరిపిన పరిశోధనలో పాలు విభ్రాంతికరమైన సంగతులు వెలుగు చూశాయి.
సెల్ ఫోన్ లు బాగా వాడే యువకుల రోజువారీ ప్రవర్తనను పరిశీలించిన బృందం వారు తీవ్రమైన మానసిక వత్తిడికి, చిరాకుకీ గురవుతున్నారని తెల్సింది. సెల్ ఫోన్ ల ప్రభావం వల్ల చిన్న పిల్లలు వత్తిడికి గురవ్వడంతో పాటు సరిగా చదవలేక పోతున్నారని, తలనొప్పికి గురవుతున్నట్లుగా కూడా వెల్లడైంది. సెల్ ఫోన్ లతో పాటు మ్యూజిక్ సిస్టమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ముభావంగా ఉండడం, ఆకలి మందగించడం, ఎక్కువసేపు మెలకువగా ఉండడం, సరిగా చదవలేకపోవడం, చదివింది గుర్తుంచుకోకపోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపించినట్లు స్టీవార్డ్ తన పరిశోధన ఫలితాలు వివరించారు. అందుకే ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్, పాఠశాలల్లో మ్యూజిక్ సిస్టమ్స్, సెల్ ఫోన్ వాడకాన్ని నిషేదించాలని సూచించింది. ఆస్ట్రేలియా, చైనా అమెరికాలోనూ చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారత్ లో ఈ అనారోగ్య లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వివిధ సెల్ ఫోన్ కంపెనీలు అందిస్తున్న ఆఫర్ల వలలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారు. క్రమేపీ మనదేశంలో కూడా చిన్నారుల ఆరోగ్యాన్ని ఈ సెల్ ఫోన్ రేడియో ధార్మికత కబళించే ప్రమాదం ఉందని స్వచ్చంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సెల్ ఫోన్ లు మీ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.


పెద్దవారిలో-- మొబైల్ ఫోన్ వికరణాలు వల్ల కలిగే అనారోగ్యాలు : ->
  • హై బ్లడ్ ప్రెజర్,
  • తలనొప్పులు,
  • మెదడు వాపు వ్యాధి,
  • ఆల్జీమెర్,
  • క్యాన్సర్
మరియు అంతకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని కలగచేస్తాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయినా, సెల్ ఫోన్ ఉపయోగం , కలిగే హాని గురించి పూర్తిగా ఏ ఒక్కరికీ తెలియదు

ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాల్ని చూడండి:

  • 1. వీలైనంత వరకు చాలా తక్కువగా వికరణాలకి మాత్రమే గురికావాలి. దీని అర్థం ఏమిటంటే తెలివిగా వీలైనంత తక్కువ ఫోన్ లో మాట్లాడడము, అతి దీర్ఘమైన సంభాషణల్ని జరగకుండా మీరు ప్రయత్నించడం. రెండు నిమిషాల కాల్ తరువాత, మెదడు యొక్క ఎలక్ట్రికల్ ఏక్టివిటీస్/పనితీరు ఒక గంటవరకు మార్పుచేస్తుందని కనుగొన్నారు.
  • 2. సెల్ ఫోన్ ని అత్యవసర పరిస్థితులలో మాత్రమే పిల్లలు ఉపయోగించడాన్ని అనుమతించాలి.
  • 3. మీ మొబైల్ ఫోన్ని ఉపయోగించనప్పుడు, వీలైనంతవరకు మీ శరీరానికి దూరంగా ఉంచాలి. కొంతమంది సెల్ ఫోన్ ఉన్నవారు సెల్ ఫోన్ పనిచేస్తూ ఉండగా తమ పేంటు జేబులో పెడతారు. మానవ శరీరము యొక్క క్రింది భాగము, పై భాగము కన్నా చాలా త్వరగా వికరణాలని లీనం చేసుకుంటుంది.
  • 4. హెడ్ ఫోన్లని ఉపయోగించాలని అనుకున్నట్లైతే, వైర్డు హెడ్ సెట్ల కన్నా వైర్ లెస్ హెడ్ సెట్లని వాడండి. వైరు వికరణాన్ని ప్రసరించడమే కాకుండా ఏంటీనాలా కూడా పనిచేసి చుట్టుప్రక్కల ఉన్న ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డులను (EMFs) ఆకర్షిస్తుంది. హెడ్ సెట్ లేకుండా మీరు సెల్ ఫోన్ ఉపయోగించినప్పుడు, మీ చెవి దగ్గరికి తీసుకునే ముందు కాల్ వచ్చే వరకు వేచి చూడాలి.
  • 5. మీరు సెల్ ఫోన్, హోల్ సేల్ లేదా ఒకొక్కరిగా అమ్మే వారి దగ్గర కొనేటప్పుడు తక్కువ ఎస్ ఎ ఆర్ (నిర్దుష్టమైన విలీన రేటు) ఉన్నది చూసుకుని ఎంచుకోవాలి.ఇన్సట్రక్షన్ మేన్యువల్ లో ఇచ్చిన ఎస్ ఎ ఆర్ నంబరుని చూడండి ఎంత తక్కువ ఎస్ ఎ ఆర్ విలువ ఉంటే అంత మంచిది.
  • 6. ఎలివేటర్లు/ లిఫ్టులు లేదా వాహనాలు వంటి, మూసివేసిన మెటల్ స్పేసులలో వికరణం ఉధృతంగా ఉంటుంది కాబట్టి కాల్స్ ని తీయకుండా ఉండండి.

మీ సెల్‌ఫోన్‌ హాని చేయనిదేనా..తెలుసుకోండిలా ..!

బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడినా ఇబ్బందేమీ ఉండదు. అదే అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో 5 నిమిషాలు మాట్లాడినా.. చెవి దగ్గర వేడెక్కుతుంది. ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే ఇందుకు కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు కెమేరా, వీడియో ప్లేయర్‌, ఎంపీ 3, ఇంటర్నెట్‌ వంటి ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవడమూ అవసరమే.

మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.

* 'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.

* ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.

ఎస్‌ఏఆర్‌ ప్రమాణాలు ఆయా దేశాల్లో
అమెరికాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌
కెనడాలో 1.6 వాట్స్‌/కిలోగ్రామ్‌
ఐరోపాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌
ఆస్ట్రేలియాలో 2 వాట్స్‌ / కిలోగ్రామ్‌

కంపెనీల ప్రత్యేక వెబ్‌సైట్లు
కంపెనీలు తాము తయారుచేసిన సెల్‌ఫోన్లు విక్రయించే ముందు రేడియేషన్‌ పరీక్షను అమలు చేస్తాయి. అందులో అర్హత పొందిన వాటినే మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఈ సమాచారం ఫోన్‌తో పాటు ఇచ్చే యూజర్‌ గైడ్‌లో ఉంటుంది. దీంతోపాటు బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా నిర్వహిస్తున్నాయి. కంపెనీ, ఫోన్‌ మోడల్‌, దేశాన్ని ఆయా సైట్లలో నమోదు చేస్తే, ఎంత రేడియేషన్‌ వెలువరిస్తుందో తెలుస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు ఇవీ..
www.sar.nokia.com
www.samsungmobile.com/sar/sar_main.jsp
http://rhealth-sar.motorola.com
www.sonyericsson.com/cws/corporate/company/health/
సెల్‌ఫోన్లకు రేడియేషన్‌ షీల్డులు విక్రయించే ఎస్‌ఎఆర్‌ షీల్డ్‌ వెబ్‌సైట్‌ www.sarshield.comలో కూడా పూర్తి సమాచారం లభిస్తుంది

ఈ జాగ్రత్తలు పాటిస్తే
* ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి.
* సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి
* హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు
* అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి
* సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి
* నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి
* నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.

updates :

సెల్‌తో ఎముకలకు ముప్పు

ఈమధ్య కాలంలో సెల్‌ఫోన్‌ వాడనివారు పాపాత్ములు. టెక్నాలజీని మేం మాత్రం వాడుకోకూడదా అనే పంథాలో. కానీ దేన్నైనా అవసరాన్ని మితిమీరి వాడితే ముప్పులు తప్పవ్ఞ. కొంతమంది హోదాకోసమో, హుందా కోసమో ఎప్పుడూ సెల్‌ఫోన్‌ను బెల్టుకో, జేబులోనో ధరిస్తుంటే వాటి నుంచి వెలువడే విద్యుదయస్కాంత కిరణాలు కటి ప్రాంతంలోని ఎముక సాంద్రతను దెబ్బతీస్తున్నాయని టర్కీ పరిశోధకులు చెబుతున్నారు.

ఆరేళ్లుగా రోజుకి 15 గంటల పాటు ఇలా బెల్టుకి సెల్‌ఫోన్‌ ధరిస్తున్న వారి ఎముకల సాంద్రతను పరీక్షించినపుడు తుంటి ఎముక పైభాగంలోని వంపు (ఇలియాక్‌ వింగ్స్‌) దగ్గర అవతలి వైపు ఎముక కన్నా బలహీనంగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి సెల్‌ఫోన్‌ ప్రియులూ తస్మాత్‌ జాగ్రత్త!

సెల్‌ఫోన్లతో బ్రెయిన్‌ క్యాన్సర్‌

సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో వచ్చినవే మొబైల్‌ ఫోన్స్‌. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సెల్‌ఫోన్లను వాడుతున్నారు. ఇక యువతీ యువకుల్లోనైతే చైన్‌ స్మోకర్స్‌ మాదిరిగా కొందరు చైన్‌ సెల్‌ టాకర్స్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్స్‌ వాడకంతో బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతూ టాక్సికాలజిస్ట్‌ దేవ్‌రా డేవిస్‌ బాంబు పేల్చడం అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఈ శాస్తవ్రేత్త 2007 సంవత్సరానికి నోబెల్‌ పీస్‌ ప్రైజ్‌ లభించిన బృందంలోని సభ్యురాలు కావడం సెల్‌ ప్రియులను ఈ విషయంపై దృష్టి సారించేటట్టు చేసింది.

అమెరికన్‌ సైంటిస్ట్‌ దేవ్‌రా డేవిస్‌ ఆ దేశంలోని ప్రముఖ ఎపిడెమియాల జిస్ట్‌లలో ఒకరిగా పేరు గాంచారు. ఆమె మొబైల్‌ ఫోన్ల వాడకంపై గత కొంతకాలంగా ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. యూత్‌లో సెల్‌ ఫోన్ల వాడ కం పెరగడంపై ఆమె హెచ్చరికలు చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వాడకంతో రాబోయే మూడు సంవత్సరాల్లో యువతలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటి ఉపయోగంతో మగ వారిలో వ్యంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమె యుఎస్‌, చైనా, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. యువ కులు స్విచాన్‌ చేసిన మొబైల్‌ ఫోన్స్‌ను ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకొనే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొత్తగా తండ్రులు కావాలనుకునే యువకులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటల పాటు సెల్‌ ఫోన్‌ వాడితే అంతే సంగతులు. ఈవిధంగా మొబైల్‌ను వాడితే ఇతరులతో పోల్చుకుంటే వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో దేవ్‌రా డేవిస్‌ చెప్పడం గమనార్హం.

మొబైల్‌ రేడియేషన్‌ మధ్య స్పెర్మ్‌లను ఉంచితే అవి బలహీనపడడమే కాకుండా సన్నబడి వేగంగా ఈదలేకపోతున్న విషయం తమ పరిశోధనలో తేలిందని ఆమె పేర్కొన్నారు. తక్కువ శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిట్టర్‌లైన మొబైల్‌ ఫోన్లు మైక్రోవేవ్‌ రేడియే షన్‌ను సృష్టిస్తాయి. సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఈ విషయంలో సెల్‌ఫోన్‌ కంపెనీలు ఏం చేస్తా యో చూడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లను ఎక్కువగా వాడ డం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయనీ ఇవి ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగే అవకాశాలను నీరుకారుస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇవి మనకు దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తూ మనుషుల మెదడు, శరీరాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని దేవ్‌రా డేవిస్‌ పేర్కొన్నారు.

యుఎస్‌, స్వీడన్‌, గ్రీస్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలన్నీ తేటతెల్లమయ్యాయని చెప్పారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్తవ్రేత్తలు ఇటీవల మొబైల్‌ ఫోన్ల వాడకంపై పరిశోధనలు నిర్వహించారు. వారు రెండు గంటల మొబైల్‌ ఫోన్‌ లెవెల్‌ రేడియేషన్‌ను ఎలుకల మెదడులోని డిఎన్‌ఎలో ప్రవేశపెట్టారు. కొంతకాలానికి వాటిలో ట్యూమర్లు ఏర్పడిన విషయం బయటపడి అందరూ నిర్ఘాంతపోయారు. కనుక సెల్‌ ఫోన్లతో జాగ్రత్త పడక తప్పదు.

15నిమిషాలు సెల్‌ఫోన్‌ మాట్లాడితే బ్రెయిన్‌ కేన్సర్‌

15 Jun 2011 andhraprabha News paper

లండన్‌ : మొబైల్‌ ఫోన్‌లలో ఎక్కువ సమయం సంభాసించే వారికి బ్రెయిన్‌ కాన్సర్‌ వచ్చే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వినియోగదారులకు ఓ హెచ్చరిక చేసింది. 15 నిమిషాల పాటు ఏకధాటిగా మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడితే తప్పనిసరిగా బ్రెయిన్‌ కాన్సర్‌ వస్తుందని, తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. దాదాపు 13 దేశాలలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులపై పరిశోధనలు నిర్వహించగా, ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసిందని తెలిపింది. ఓ రోజులో 15 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో సంభాషణలు జరిపినా బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశా లున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.


  • మొబైల్ తో మతిమరుపు :

ఏ వయస్సులో ఉన్నా , ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోన్‌ కనిపించాల్సిందే . క్షణాల్లో విషయాలు తెల్సుకోగల ఈ సంకేతికవిప్లవం మంచిదే అయినా .. అతి అనర్ధదాయకం అన్న సూత్రం ఇక్కడా పనిచేస్తుంది . ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది . అంతేకాదు -రియక్షన్‌ సమయమూ నెమ్మదించి తప్పుల్ని ఎక్కువగా చేస్తుంటారు . 12 , 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మద్య గల విద్యార్ధులపై " మొనష్ యూనివర్సిటీ " పరిశోధనలు నిర్వహించగా ... ఎన్నో విషయాలు వెళ్ళడైనాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు వాడేవారిలో శీఘ్రగతి తగ్గిపోయినట్లు , జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నట్లు , శీఘ్రగతి తగ్గిపోతున్నట్లు , తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు గుర్తించారు .

  • సెల్ ఫోన్‌ తో తంటా ? :
సెల్ పోన్‌ అవసరమే కాని అతిగా ఉప్యోగించడము అనర్ధము అంటున్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ . భారతదేశము లోని కొన్ని పరిశోధన సంస్థలు సెల్ పోన్‌ తో వచ్చే అనారోగ్యము మీద అధ్యయనము చేసాయి. 20 నిముషాలు పాటు విడవకుండా సెల్ ఫ్ఫ్న్‌ మాట్లాడితే చెవి లోపలి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ మేరకు పెరుగుతుంది . సె ఫ్ఫ్న్‌ వాడకం పెరిగిన కొద్దీ మెదడు మీద దాని ప్రభావము పడుతుంది . మెదడులో కణితలు (Tumours) ఏర్పడడానికి కారణము సల్ ఫోన్‌ వాడకము అని నిర్ధారించారు . 9 నిముషాలు సెల్ ఫోన్‌ లో మాట్లాడడము అంటే మక్రోవేవ్ ఒవెన్‌ లో ఒక సెకను పాటు తలపెట్టినటే అని నిర్ధారించారు మన శాస్త్రజ్ఞులు . మానసిక సమస్యలు పెరుగుదలకు, పురుషులలో పెరుగుతున్న వంధ్యత్వానికి కూడా సెల్ ఫోన్‌ కారణము అంటున్నారు .
  • సిగ్నల్స్ సరిగా లేనిచోట సెల్ ఫోన్‌ వాడవద్దు . సెల్ ఫోన్‌ జేబులో పెట్టకంది ... జేబులో పోన్‌ పెట్టుకునే పురుషులు దానిని స్విచ్ ఆఫ్ చేయండి . గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్‌ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంతమంచిది. సెల్ కాల్స్ 6 నిముషాలకు మించి వాడడము ఆరోగ్యానికి హానికరము .
సెల్ ఫోన్‌ తో చెవులకు చిక్కు :
  • ఎక్కువసేపు సెల్ ఫోన్‌ లో మాట్లాడే వారికి మిగిలిన శబ్దాలు వినబడడము మానేస్తాయి. సెల్ ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగడం అందరికీ తెలినదే ... దీనికి కారణము మెదడు రెండుపనులు మీద ఒకేసారి దృష్టి పెట్టలేక పోవడమే . రెండవ కారణము సెల్ ఫోన్‌ లో వచ్చే ధ్వనుల స్థాయి..ధ్వని తప్పించి మిగిలిన స్థాయి ధ్వనులను వినడం , విన్నా గ్రహించడం చెవులు చెయ్యలేకపోవడం . ఎక్కువగా చెవిలో గుసగుసలు చెప్పుకునే అలవాటు ఉన్నవారికి ఇటువంటి వినికిడి సమస్యే వస్తుంది్స్
సెల్‌ఫోన్లతో మరో ప్రమాదం జన్యుమార్పులు కలిగే ప్రమాదము(07-ఆగస్ట్ -2013)


  • సెల్‌ఫోన్లు వచ్చినప్పటి నుండీ వాటిని వాడటం వల్ల వచ్చే అనేక ప్రమాదాల గురించి తెగవార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఊహాత్మకమైనవి. కొన్ని నిజమైనవే. ఆ క్రమంలో ఇప్పుడు పరిశోధకులు సెల్‌ఫోన్ల వల్ల వచ్చే మరో ప్రమాదాన్ని కనుగొన్నారు. అధికంగా సెల్‌ఫోన్లు వాడటం వల్ల శరీర కణాలలో ఆక్సిడేషన్‌ ఒత్తిడి పెరిగి, జన్యుమార్పులు కలిగే ప్రమాదముందని తేలింది. ఆక్సిడేషన్‌ ఒత్తిడివల్ల విషపూరిత పైరోక్సైడ్‌లు, ఫ్రీరాడికల్స్‌ కలిసి కణాల కేంద్రకంలో ఉండే డి.ఎన్‌.ఎ.తో సహా ఉన్న అన్ని భాగాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఈ కారణంగా క్యాన్సర్‌ కణితి వంటివి ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.  
  • గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు updated on 03-11-2014

  • -గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి
    గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.

    గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.

- మూలము : medical updates ... a medical journal.
------------------------------------------------------------
main article Source : Wikipedia.org
-----------------------------------------------------------
  • ==================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, July 17, 2010

పర్యావరణ కాలుష్యము , Environmental Pollution India



పర్యావరణము లో హానికర పదార్ధాలు ఎక్కువ పరిమాణములో ఉండి , జీవులకు హాని కలిగిస్తుంటే దాన్ని కాలుష్యము అని పేర్కొనవచ్చును . అడవుల్లో రగిలే కార్చిచ్చు , అగ్ని పర్వతాలు బద్దలు కావడం వంటివి సహజ కాలుష్యకారణాలు . శిలాజ ఇంధనాలను , కట్టెలను మండించడము , పారిశ్రామిక వ్యర్ధపదర్ధాలు వంటివి మానవ చర్యలవల్ల కలిగే కాలుష్య కారణాలు . కాలుష్యాన్ని కలిగించే వాటిని కాలుష్య కారకాలు అంటారు .
ఇవి 2 రకాలు :
1. విచ్చిన్నము చెందే కారకాలు -> పేపరు , కూరగాయలు , వృక్ష , జంతు ఉత్పత్తులు .
2. విచ్చిన్నము చెందని కారకాలు -> ప్లాస్టిక్ , అల్యూమినియం , సీసము , లోహాలు , డి.డి.టి(వంటి పురుగుల మందులు).
కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి ->
1. వాయుకాలుష్యము,
2. నీటి కాలుష్యము ,
3. భూమికాలుష్యము ,
4. ధ్వని కాలుష్యము ,
5. రేడియోధార్మిక కాలుష్యము ,

1. వాయుకాలుష్యము (Air pollution):
వాహనాలనుంచి , పరిశ్రమలనుంచి వెలువడే వాయులు దీనికి ముఖ్యకారణము . ఉదా: కార్బన్ డైఆక్షైడ్ , కార్బన మోనాక్షైడ్ , సల్ఫర్ డైఆక్షైడ్ , నైట్రోజన్ ఆక్షైడ్ , ధూళిరేణువులు వంటివి వాయుకాలుష్యానికి కారకాలు . ఇంధనాలు మండటం వల్ల కార్బండైఆక్షైడ్ వెలువడుతుంది ... కార్బండైఆక్షైడ్ వల్ల గ్రీం హౌస్ ఎఫెక్ట్ లేదా గ్లోబల్ వార్మింగ్ కలుగుతుంది . భూమిచుట్టూ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వారిమింగ్ అంటాము . దీనివల్ల సముద్రమట్టాలు పెరగడము , తీరప్రాంతాలు మునిగిపోవడము , అతివృష్టి , అనావృష్టి , ఎల్ నినో , లానినో ... సంభవించడం , వ్యాధులు ప్రబలడము , వంటి అనేక ప్రభావాలు కలుగుతాయి . కార్బన్ డైఆక్షైడ్ తో పాటు మీధేన్ , నైట్రోజన్ ఆక్షైడ్ , క్లోరో ఫ్లోరో కార్బన్ లు , ఓజోన్ , వంటివి కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు కారణమవుతాయి . వీటిలో మీధేన్ .. చిత్తడి నేలల నుంచి , వరిపొలాల నుంచి జీవులు కుళ్ళుతున్నప్పుడు వెలువడుతుంది .
అత్యధిక గాఢత ఉన్న కార్బన్ మోనాక్షైడ్ మరణాన్ని కలుగ జేస్తుంది .
సల్ఫర్ డై ఆక్షైడ్ వల్ల శ్వాసనాళం లో మంట , కళ్ళు మంట కలుగజేస్తుంది .
మహానగరాల్లో కాంతి రసాయనిక పొగమంచులో నైట్రోజన్ ఆక్షైడ్ లు , ఓజోన్, పెరాక్సి ఎసిటైల్ నైట్రేట్ , ఘనరూప పదార్ధాలు , ఆల్డి హైడ్స్ వంటివి ఉంటాయి . పొగమంచు దట్టం గా ఏర్పడ్డం వల్ల నగరాల్లో రవాణా వ్యవస్థకు ఆటంకము కలుగుతుంది . 1952 డిసెంబర్ 05 న లండన్ నగరము పై దట్టమైన పొగమంచు అయిదు రోజులపాటు ఆవరించడము వల్ల అనేక వ్యాదుల వలన సుమారు 4000 వేలమంది మరణించారు . క్లోరోఫ్లొరో కార్బన్ లు ఓజోన్ పొరను నష్టపరుస్తాయి . దీనివల్ల అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరి మానవులకు చర్మ క్యా్న్సర్ కలిగిస్తాయి .

for more details : Air pollution(Wikipedia.org)
---------------------------------------------------------------------
2. నీటి కాలుష్యం (Water pollution) : అనేది నీటి మరియు నీటి వనరులు కలుషితమైన ప్రక్రియ లేదా పరిస్థితి. ఈ వనరులు అనగా సరస్సులు, నదులు, సముద్రాలు, ఇంకా భూగర్భజలాలు మనుషుల చర్యలవల్ల కలుషితమవుతాయి. ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది. నీటిని శుద్ధి చేయకుండా కలుషితాలను నేరుగా నీటివనరులలోకి వదిలివేయడం వలన ఇది ఏర్పడుతుంది.


పూర్తి వివరాలకోసం _ వికిపెడియా లో చచవండి
-------------------------------------------------------------------------------------------

3. భూమికాలుష్యము :


పారిశ్రామిక ప్రాంతాలలోని పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయి . వ్యవసాయ ఎరువులు వాడకం ద్వరా , పురుగు మందులు చల్లడం వల్లను మట్టితో సహా పండ్లు , కూరగాయలు కలుషితమవుతున్నాయి . ఇవి తిని ఆరోగ్యము బారిన పడుతున్నారు . రోడ్ల పైన చెత్తా చెదారము కుళ్ళి సూక్ష్మ క్రిముల ఉత్పత్తికి దోహదపడతాయి . జంతుకళేబరాలను జాగ్రత్తగా డిస్పోజ్ చేయనిఎడల దుర్గంధము తో పారు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువకావచ్చును . తగు జాగ్రత్తలు తీవుకోవడము మానవాలి మనుగడకు మంచిది .


--------------------------------------------------------------------------
4 . ధ్వని కాలుష్యము :

శబ్ద ఆరోగ్య ప్రభావాల స్వభావం ఆరోగ్య మరియు ప్రవర్తనపై ఉంటుంది. అక్కరలేని ధ్వనులను శబ్దం అంటారు.ఈ అక్కరలేని ధ్వనుల వల్ల మానసికంగా మరియు దేహపరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.శబ్ద కాలుష్యం కోపము ఇంకా కలహాలకు కారణమవుతుంది,అధిక రక్తపోటు,అధిక ఒత్తిళ్ళకు,టిన్నిటస్(చెవిలో శబ్దాలు), వినికిడి కోల్పోవటం, నిద్రకు ఆటంకాలు, ఇంకా మిగిలిన హానికరమైన ప్రభావాలు ఉంటాయి. ఇంతేకాకుండా, ఒత్తిడి ఇంకా అధిక రక్తపోటు ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది, ఇంకా టిన్నిటస్(చెవిలో శబ్దాలు) మతిమరుపుకు దారితీస్తుంది, తీవ్రమైన వ్యాకులము,ఇంకా కొన్నిసార్లు భయంకరమైన పోటులకు గురిచేస్తుంది.
దీర్ఘకాలంగా శబ్దం వినటంవల్ల శబ్డంచే ప్రేరేపించబడిన చెవుడు వస్తుంది.కాలముతోపాటు వినికిడి శక్తి తేడాలు తగ్గినప్పటికీ ఇంకా రెండు వర్గాలమధ్య 79 సంవత్సరాల తర్వాత భేదం గుర్తించు సాధ్యం కాదు. వయసుపైబడినవారు చెప్పుకోదగినంత వృత్తిరీత్యాశబ్దాలను వినిఉంటే, వారి వినికిడి శక్తిని శబ్దంవినని వారిసమకాలీకులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఏవిధమైన ప్రయాణసాధనాలు ఇంకా పరిశ్రమల శబ్దాలు వినని మాబన్ కోయ మనుషులకుఇంకా అన్ని శబ్దాలు వినే U.S.లో నివసించే మనుషులకు జరిగిన తరతమ పరిశీలనలో దీర్ఘకాలంగా పరిసరాలలోని శబ్దాలు వింటున్నవారికి చెవుడు వస్తుందని తేలింది.


అధిక శబ్దాలు హృదయనాళాల మీద ప్రభావం చూపుతాయి ఇంకా ఎక్కువగా ఉన్న శబ్దాలు ఎనిమిది గంటలువింటే రక్తపోటు స్థిరముగా ఐదు నుంచీ పది పాయింట్లు పెరుగుతుంది, ఇంకా ఒత్తిడి పెరుగుతుంది మరియు పైన చెప్పినవిధముగా వాసోకన్స్ట్రిక్షన్ వల్ల రక్తపోటు పెరగటమే కాకుండా కరోనరీ అర్టేరి డిసీజ్వచ్చే అవకాశం ఉంది.

శబ్ద కాలుష్యం కోపానికి ఒక కారణం. 2005 లో స్పానిష్ పరిశోధకులు చేసిన పరిశీలనలో నగరంలో నివసించేవారు శబ్ద కాలుష్యం తగ్గించటానికి ప్రతిసంవత్సరము ఒక డేసిబెల్ కు నాలుగుయురోలు చెల్లించటానికి తయారుగాఉన్నారని తెలిపారు.

మరికొన్ని విషయాలకోసం : శబ్దకాలుష్యం

-----------------------------------------------------------------------------------------------
5. రేడియోధార్మిక కాలుష్యము :
కొన్ని మూలకాల్లోని కేంద్రకణాలు అస్థిరంగా వుంటాయి. ఇవి అప్రమత్తంగా వాటికవే విచ్ఛిన్నం చెంది రేడియోధార్మిక కిరణాలను వెలువరిస్తాయి. ఈ లక్షణాన్నే రేడియోధార్మికత అంటారు. ఈ మూలక కేంద్రకం వెలువరించే కిరణాల పేరు ఆల్ఫా, బీటా, గామా కిరణాలు.

వీటిలో ఆల్ఫా కిరణాలకు తక్కువశక్తి, గామా కిరణాలకు ఎక్కువ శక్తి వుంటుంది. ఈ మూడు కిర ణాలు కూడా జీవజాలానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. ఈ రేడియేషన్‌ శాతం చాలా తక్కువగా వుంటే మాన వాళి ఆరోగ్యానికి పెద్దగా హాని కలుగదు. ఈ కిరణా లను కొన్ని పరిమితుల మేరకు వైద్యంలోను, పారిశ్రా మిక రంగంలోను కూడా ఉపయోగించుకుంటున్నారు.
తక్కువ శాతంలో వున్న ఈ కిరణాలను ఆహార పదార్థాలు నిల్వ చేసేందుకు, సిరంజీల్నీ, ఇంజక్షన్‌ సూదులను స్టెరిలైజ్‌ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. దీనినే 'ఇర్రేడియేషన్‌' అంటారు.

పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, ఇంకా ఇతర ఆహార పదార్థాలను ఇర్రేడియేషన్‌కు గురిచేసి అవి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ చేయగల్గుతున్నారు. ఈ రేడియేషన్‌ వల్ల వాటిని పాడు చేసే సూక్ష్మ జీవులు నశించిపోతాయి.

సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు 15 నుండి 20 రోజులకు మించి నిల్వ వుండవు. అయితే వీటిని ఇర్రేడియేషన్‌కు గురి చేస్తే అవి ఆరు నెలల వరకు నిల్వ వుంటాయి. ఈ ఇర్రేడియేషన్‌కు గురైన ఆహార పదార్థాలను భుజించడం వల్ల మనిషికి ఎటువంటి హానీ జరగదు.

రేడియోధార్మిక కాలుష్యం : రేడియోధార్మికత వల్ల మనిషికి ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతాయి. అత్యధిక మోతాదులో మనిషి ఈ రేడియేషన్‌ ప్రభావానికి గురైతే ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. చాలా తక్కువ మోతాదులో రేడియేషన్‌ మన శరీరంలోకి వెళుతుంటే పలు వ్యాధులు మొదలై మరణానికి చేరువవుతాము.

ఇంత ప్రమాదకరమైన రేడియేషన్‌కు మనిషి దూరంగా వుండలేకపోతున్నాడు. మన చుట్టూ వున్న వాతావరణంలో కంటికి కనిపించని రేడియేషన్‌ నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూనే వుంటోంది. దీనికి తోడు మనిషి నాగరికత కారణంగా ఏర్పడిన కృత్రిమ రేడియోధార్మిక శక్తి కూడా మనిషికి హాని కల్గిస్తోంది. మనం తినే ఆహారం ద్వారా, పీల్చే గాలి ద్వారా మనం రేడియేషన్‌కు గురవుతూనే వున్నాం.

న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్లకు సమీపంలో వున్న ప్రజలు రేడియేషన్‌ కారణంగానే ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురవుతున్నారు.

కాలుష్యంతో కూడిన పొగ నల్లగా వుంటుంది. రసాయనాలను కూడా వాసన, రంగు ద్వారా గ్రహించవచ్చు. కాని స్లోపాయిజన్‌గా మనలో ప్రవేశించే అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్‌ను మాత్రం మనం చూడలేము.

ప్రతీ చోట ఇదే పరిస్థితి !

ప్రతిసెకెను మన శరీరంలోకి వందకు పైగా కాస్మిక కిరణాలు దూసు కుపోతున్నాయి. వాతావ రణంలోని రేడి యోధార్మిక శక్తిగల అణువులు మనం పీల్చే గాలి ద్వారా ఊపిరి తిత్తులలోకి వెళుతూ వుం టాయి. కొన్ని వేల సంఖ్య లో పొటాషియం అణు వులు, రెండు లేదా మూ డు యురేనియం అణు వులు మనం తాగే నీరు, ఆహారం ద్వారా లోనికి పోతూనే వుంటాయి.

వీటితో పాటు భూమి నుండి విడుదలయ్యే గామా కిరణాలు నిత్యం మన శరీరంలోకి ప్రవేశిస్తూనే వున్నాయి. ఇదంతా సహజంగా జరిగేది. ఇదిగాక వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక పరిశోధనారంగాల ద్వారా మనం అనునిత్యం కృత్రిమ రేడియేషన్‌కు గురవుతూనే వున్నాం.

ముఖ్యంగా ఆధునిక వైద్య పరీక్షల కోసం ఉపయోగించే ఎక్స్‌ కిరణాలు, సీటీస్కాన్‌ల ద్వారా మనం ఎక్కువగా రేడియేషన్‌కు గురవుతున్నాము. గతంలో యురేనియం, రేడియం వంటి రేడియోధార్మిక పదార్థాలను ఆభరణాల్లో వుపయోగించేవారు. గాజుతో తయారయ్యే వాటి మీద రంగు కోసం యురేనియంను, వాచీ డయల్స్‌లో రేడియంను వాడేవారు. ప్రస్తుతం వాటి వాడకాన్ని చాలా దేశాలు నియంత్రించాయి.

కాలుష్యాన్ని గుర్తించే పరికరం : ఈ రేడియేషన్‌ బారి నుండి కాపాడాలంటే మన శరీరంలోకి ప్రవేశించే రేడియోధార్మిక కణాలను గుర్తించడం ఎంతైనా అవసరం - అలా గుర్తించగల ప్రత్యేకమైన 'గాగుల్స్‌'ను బ్రిటీష్‌ పరిశోధక బృందం రూపొందించింది.

జింక్‌ సల్ఫైడ్‌ పై ఆల్ఫా కిరణాలు పడితే అది ప్రకాశిస్తుంది. దీనినే 'స్కింటిలేషన్‌' అంటారు. తక్కువ పరిమాణంలో రేడియోధార్మిక గుణాన్ని కలిగిన పదార్థాల నుంచి వచ్చే బలహీనమైన కిరణాలను మరింత ప్రకాశవంతంగా మెరిసేలా చేసి - అంటే మనిషి కన్ను చూడగలిగేలా చేసేందుకు శాస్త్ర బృందం ఒక విధానం రూపొందించింది.

ఇందుకోసం ఆ బృందం చీకట్లో సైతం చూడగలిగే గాగుల్స్‌నూ, జింక్‌ సల్ఫైడ్‌ను ఉపయోగించింది. వీటి ద్వారా రేడియోధార్మిక పదార్థాలను గుర్తించవచ్చు. ఒక చదరపు సెంటీమీటరు పరిధిలోని రేడియోధార్మిక కాలుష్యంలో 30 ఆల్ఫా కిరణాల కన్నా తక్కువ వున్నట్లయితే అద్దాలతో అమర్చిన మోనోక్రోమ్‌ తెర ప్రకాశవంతంగా కన్పిస్తుంది. అంతేగాకుండా దీనిని ఉపయోగించి ఒక ఆకారం లేకుండా వివిధ ప్రాంతాల్లో రకరకాల వాహాకాల ద్వారా వ్యాపించే రేడియోధార్మికతను లెక్కించవచ్చు.

ఈ అద్దాలను ఉపయోగించి రేడియోధార్మిక ప్రభావం ఎక్కువగా వున్న పరిసరాల నుండి ప్రజలను దూరంగా వుండమని హెచ్చరించవచ్చు. అయితే ఇందులో ఒక ఇబ్బంది వుంది. మనం పరిశోధన చేసే స్థలంలో ముందుగా జింక్‌ సల్ఫైడ్‌ను స్ప్రే చెయ్యాలి. అంతేకాదు ఈ గాగుల్స్‌ను బయట వాతావరణంలో కేవలం రాత్రిపూట మాత్రమే వినియోగించగలం. పగటి సమయంలో సూర్యకాంతి రేడియోధార్మిక కిరణాలను చూసేందుకు సహకరించదు. ఇబ్బందులు వున్నా రేడియోధార్మిక కాలుష్యం గుర్తించి నియంత్రించేందుకు ఇది ఉపకరిస్తుంది.
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, June 24, 2010

కంప్యూటర్ల వలన వఛ్ఛే వ్యాధులు నివారణ , Computer Related Diseases & prevention

  • నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .
అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.

  • కంప్యూటర్ పై పని చేసే వారికి సాదారణముగా కలిగే ఆరోగ్య సమస్యలు .:
  1. కంప్యూటర్ విజన సిండ్రోం - సి.వి.య స్ ,
  2. రిపిటేటివ్ స్టిములస్ ఇంజురీ - ఆర్.యస్.ఐ .,
  3. కండరాల నొప్పులు ,
  4. నిద్రపట్టక పోవడం ,
  5. సరిఅయిన వ్యాయామము లేక బి.పి , సుగర్ జబ్బులు వచ్చే ప్రమాదము ,
ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్‌ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్‌ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్‌ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ (ఫుట్‌ రెస్ట్‌) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం

సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నోస్ట్రెస్‌ (Technostress) : దీనివల్ల కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్‌, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.

టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -
  • పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -
  • కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -
  • ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -
  • కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -
  • కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -
  • కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -
  • కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, -
  • ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -
  • ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.

పిల్లలకు మానసిక సమస్యలు
:

మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా
ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

Computer Game and ill-health

  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/