అసలు ఈ ఇమ్యునైజేషన్ అవసరమా... అవసరమైతే ఎందుకు.. అనే విషయం తెలుసుకోవాలి.
ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు తప్పని సరి. ఇమ్యున్ అనేది ఒక గ్రీకు పదం. రక్షించేది అని అర్థం. జనం ప్రాణాలను రక్షించేందుకు కొన్ని ఏజెన్సీలను నియమించారు. వీరి ద్వారా జరిగే ఈ ప్రక్రియను ఇమ్యునైజేషన్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్. రెండోది పాసివ్ ఇమ్యునైజేషన్. యాక్టివ్ ఇమ్యునైజేషన్ ధీర్ఘకాలిక రక్షణ ఇవ్వగలిగితే, పాసివ్ ఇమ్యునైజేషన్ స్వల్పకాలిక రక్షణ కల్పిస్తుంది.
సంక్రమణ, ప్రేరేపిత వ్యాధులు, కారకాలను ఇమ్యునైజేషన్ గుర్తిస్తుంది. తరువాత శరీరానికి రక్షక వలయంగా పని చేస్తుంది. తిరిగి అలాంటి వ్యాధుల శరీరానికి సోకకుండా నిరోధిస్తుంది. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి పిల్లలకు వాక్సిన్‌ను ఇప్పించాల్సిందే. వివిధ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం పిల్లలకు ఇమ్యునైజేషన్‌ను నిర్ణయించారు. కొన్ని వ్యాధులు కొంత వయస్సు దాటిన తరువాతనో, కొంత వయస్సు ముందరో వచ్చే అవకాశం ఉంది.
శాస్త్రవేత్తలు అందుకు అనుగుణంగానే ఇమ్యునేజేషన్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం పుట్టినప్పటి నుంచి 16 యేళ్ళ వయస్సు వరకూ కూడా ఇమ్యునైజేషన్ ఉంటుంది. ప్రభుత్వం ఇమ్యునైజేషన్‌ను ఉచితంగా అందిస్తోంది. వాటి కోసం ప్రైవేటు ఆస్పత్రులనే సంప్రదించాల్సిన పనిలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పురపాలక ఆస్పత్రులలో వ్యాక్సినేషన్ లభిస్తాయి.
టీకా (vaccine) అనగా వ్యాధినిరోధకత(ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు
ఇమ్యునైజేషన్ షెడ్యూల్
భారతదేశంలోని టీకాల పద్ధతి
క్రమసంఖ్య వయస్సు టీకా మందు
1. పుట్టుక నుంచి 2 వారాలు బి.సి.జి. ; ఒ.పి.వి.
2. 6 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
3. 10 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
4. 14 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
5. 9 నెలలు ఒ.పి.వి. ; తట్టు(మీజిల్స్)
6. 1 సం. తరువాత ఆటలమ్మ (చికెన్ పాక్స్)
7. 15 నెలలు ఎమ్.ఎమ్.అర్.
8. 18 నెలలు ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
9. 2 సం. తరువాత టైఫాయిడ్
10. 5 సం. తరువాత ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
11. 10 సంవత్సరాలు. టి.టి.
12. 15-16 సంవత్సరాలు. టి.టి.
- ==============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.