Saturday, January 2, 2010

పరిశుబ్రత , Neatness



తనకి తానూ శుబ్రము గా ఉండి తన చుట్టూ ఉన్న పరిసరాలను శుబ్రముగా ఉంచుకోవడాన్ని పరిశుబ్రత అంటారు .
పరిశుబ్రత రెండు విధములు ... 1) వ్యక్తిగత పరిశుబ్రత , 2) పరిషరాల పరిశుబ్రత

వివరాలకోసం - > పరిశుబ్రత

==================================================================

Visit my website - > Dr.Seshagirirao.com/

ప్రధమ చికిత్స , First Aid





ప్రథమ చికిత్స - ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం (World First-Aid Day)

పథమ చికిత్స అనగా జబ్బు వచ్చినప్పుడుగాని, ప్రమాదము సంభవించినప్పుడు గాని తాత్కాలికముగా చేయు సహాయము. వైద్య సహాయము లభించే వరకు సేదదీర్చుటయే దాని ముఖ్యోద్దేశము. వ్యాది ఎంత చిన్నదయినా , పెద్దదయినా , చిన్న గాయమే అయినా , పెద్ద దెబ్బ తగిలినా ముందుగా కావాల్సింది , చేయాల్సింది ప్రాధమిక చికిత్స . ప్రాణాల్ని కాపాడేది , వ్యాధి తీవతను అదుపుచేసేదే ఈ ప్రధమ చికిత్సే .

గాయపడిన వారికి ప్రథమ చికిత్స అను శాస్త్రము ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స అను వాని ముఖ్య సిద్ధాంతముల ననుసరించియున్నది. ఈ శాస్త్ర జ్ఞానము వలన ఆకస్మికముగా దెబ్బగాని, గాయముగాని తటస్థించినపుడు డాక్టరు వచ్చే లోపల రోగి ప్రాణమును నిలుపుటకు శిక్షణ నొందిన వారికి సాధ్యపడుచున్నది.

చిన్న గాయాలకు పెద్ద ఉపశమనం ఇలా...

మారుతున్న కాలానుగుణంగా వ్యాధుల తీవ్రత తెగ పెరుగుతోంది... దీనికి తోడు ఆకస్మికంగా ఇళ్లలో జరిగే వివిధ పరిణామాల వల్ల ఏర్పడ్డ గాయాలకు జరుగుతున్న ప్రమాదాలకు ముందస్తు చికిత్సని మీరే అందించడం ద్వారా వెంటనే ఉపశమనం లభించేందుకు ఇంట్లోనే.... తక్షణ వైద్యం చేసుకోవటం ద్వారా కొంత ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తప్పనిసరి..

చేయి తెగితే...

చాలా మంది మహిళలకు ఎదురవుతుందీ సమస్య. అలాంటప్పుడు వెంటనే ధారలా పడుతున్న కుళా యి నీటి కింద చేయిని ఉంచడం మనకు తెలిసిందే. కానీ దానివల్ల రక్తస్రావం మరింత అధికమవుతుంది. అందుకే... గాయమైన చోటును మరోవేలితో గట్టిగా నొక్కి పెట్టాలి. దీన్ని ప్రెషర్‌ బ్యాండేజీ అంటారు. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉంచాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది. ఆ తరువాత పట్టీ లాంటిది చుట్టుకోవచ్చు. నేరుగా పట్టీ చుట్టకుండా దూదిని ఉంచి... ఆ తరువాత పట్టీ కట్టాలి. దూది ఉంచినా కూడా రక్తస్రావం అవుతుంటే దానిపైన మరొకటి ఉంచాలి తప్ప.. మార్చకూడదు.

నూనె చిందితే...

వంట చేస్తున్నప్పుడు వేడివేడి నూనె చిందడం... వేణ్నీళ్లు చేయిజారి మీదపడిపోవడం.. వంటి సమ స్యలు కొన్నిసార్లు తప్పవు. ఆ పరిస్థితి ఎదురైన ప్పుడు సన్నగా వచ్చే కుళాయి నీటికింద గాయమైన భాగాన్ని ఉంచాలి. ఈ జాగ్రత్త చిన్నచిన్న కాలిన గాయాలకు మాత్రమే. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, క్రీం రాయకూడదు. గాయాలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యు ల్ని సంప్రదించాలి.

కాలు బెణికితే...

గబగబా ఇంటిపనులు చేస్తున్నప్పుడు, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తూలడం, కిందపడటం, కాలు బెణకడం జరుగు తుంటుంది. అలాంటప్పుడు ప్రతీది ఫ్రాక్చర్‌ కాదు. భరించలేని నొప్పి, వాపు, కాలు కదల్చలేని పరిస్థితి ఉన్న ప్పుడు మాత్రమే ఫ్రాక్చర్‌ లేదా ఎము క పక్కకు జరిగి ఉండవచ్చని పరిగణిం చాలి. కేవలం బెణికితే భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వెంటనే నడవడానికి ప్రయత్నించ కూడదు.

బెణికిన చోట ఉన్న జాయింట్‌పై, కింది భాగాలను ఎట్టిపరిస్థితుల్లో కదలించకూడదు. వెడల్పాటి కర్ర లేదా అట్టతో బెణికిన చోటుకు ఆసరాలా చేసుకుని ఆ తరువాత వైద్యుల్ని సంప్రదించాలి. ఈ సూచన ఫ్రాక్చర్‌కూ వర్తిస్తుంది. మెడకు గాయమైతే.. దాన్ని కదల్చకుండా ఉంచాలి. లేదంటే ఆ ప్రభావం వెన్నెముకపై పడవచ్చు. అలాగే తలకు దెబ్బతగిలితే... అంత కన్నా ముందు వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా అన్నది నిర్థారించు కునేందుకు మాట్లాడించాలి.

ముక్కు నుంచి రక్తస్రావం..

పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ కొన్నిసార్లు ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని నియంత్రించాలంటే... తలను కొద్దిగా కిందకు వంచి ముక్కు మధ్య బాగాన్ని వేళ్లతో నొక్కిపెట్టాలి. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉండాలి కాబటి.. నోటి నుంచి గాలి తీసుకోవాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది.

పదార్థం అడ్డు తగిలితే..

భోంచేస్తున్నప్పుడు.. కాస్త గట్టిగా ఉన్న పదార్థం ఏదైనా శ్వాస తీసుకునే గొట్టం లోకి చేరడం.. ఊపిరి అందక ఇబ్బంది పడటం చాలా మందికి అనుభవమే. ఆ ఉక్కిరిబిక్కిరి తగ్గాలంటే వీపు మీద నెమ్మదిగా కొట్టి నట్లు చేయాలి. లేదంటే కొద్దిగా ముందు కు వంచి, పొట్టపై భాగంలో నొక్కినట్లు చేస్తేచాలుసమస్య అదుపులో వచ్చేస్తుంది.

కళ్లల్లో దుమ్ము..

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కళ్లల్లో దుమ్ము పడటం సహజం. అలాంటప్పుడు దుమ్ము పడిన కన్నును శుభ్రం చేయాలి. ఆ వెంటనే మెత్తని వస్త్రంతో కంటిని కాసేపు మూసేయాలి. అంతేకానీ రుద్దకూడదు. దానివల్ల కన్ను ఎర్రగా మారిపోతుంది.

చెవిలో చీమలు దూరితే..

నేలపై పడుకున్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. దాన్ని బయటకు లాగేందుకు చెవిలో పిన్నులు, ఇయర్‌బడ్స్‌ లాంటివి పెడితే కర్ణభేరికి హాని తప్ప దు. అందుకే చాలా కొద్దిగానీళ్లు తీసుకుని చెవిలో పోసి... ఆ తరువాత ఓ పక్కకు వంచినట్లు చేయా లి. నీళ్లతోపాటు చీమ కూడా వెలుపలికి వచ్చే స్తుంది.

తీవ్రమైన జ్వరానికి..

ఈ సమస్య పిల్లల్లో ఎక్కువ. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్నప్పుడు చాలామంది తడి వస్త్రాన్ని నుదుటిపై వేస్తుంటారు. బదులుగా ఏం చేయా లంటే.. మరీ మందంగా ఉన్న దుస్తులు ధరించేలా చూడాలి. ఆ తరవాత పడుకోబెట్టి పైన పలుచని దుప్పటి కప్పాలి. మరీ చల్లగా అలాగని వేడిగా లేని గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి... శరీర మంతా ఒకేసారి కాకుండా.. చేతులు, కాళ్లు, వీపు, నుదురు.. ఇలా ఒక్కో భాగాన్ని తుడవాలి. క్రమం గా ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుతుంది.


పిల్లలు కిందపడితే...

ఆటపాటల్లో భాగంగా పిల్లల మోకాళ్లు, కాళ్లకు తరచూ చిన్న చిన్న గాయాలవుతుంటాయి. ఆ భాగాన్ని ముందుగా యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. దుమ్ముపడే ఆస్కారం ఎక్కువగా ఉన్న ట్లయితే కట్టుకట్టాలి. సాధ్యనమైనంతవరకు ఆ భాగా నికి విశ్రాంతి ఇస్తేనే.. గాయం త్వరగా మానుతుంది.

పాము, కుక్కకాటు..

సాధారణంగా పాము ఎక్కువగా కాళ్లదగ్గరే కాటేస్తుంది. దాన్నుంచి వచ్చిన విషం మిగతా శరీరానికి చేరకుండా కాటేసిన చోటుకు అటూఇటూ బిగుతుగా కట్టేస్తాం. కానీ అది పొరబాటు. వైద్యులు వచ్చే దాకా కాలును కదిలించకుండా ఉంచాలి. కుక్క కరిస్తే.. ఆ భాగాన్ని ముందుగా నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తరువాత వైద్యుల్ని సంప్రదించాలి.

మరికొంత వివరముగా ఈ క్రింది వాటిలో చూడండి :
====================================
visit my website - > dr.seshagirirao.com

రక్త కాన్సర్ , Blood Cancer




క్యాన్సర్‌ సోకే అవయవాలు...క్యాన్సర్‌ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. క్యాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సర్‌, జీర్ణ కోశ - పేగుల క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయముఖ క్యాన్సర్‌, తల, మెడ క్యాన్సర్‌, ప్రోస్టేట్‌, రక్త సంబంధిత క్యాన్సర్లు ముఖ్యమైనవి.

బ్లడ్‌ క్యాన్సర్‌...
రక్త కణాల ఉత్పత్తి, ధర్మాలను రక్త క్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మారో (ఎముకల మజ్జ / మూలగ) లో ప్రారంభమవుతుంది. ఇక్కడే రక్తం, రక్తకణా లు ఉత్పత్తవుతాయి. మామూలుగా మజ్జలో వున్న మూల కణాలు అభివృద్ధి అయి, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. ఎక్కువ రక్తక్యాన్సర్‌ల్లో తెల్లరక్త క ణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దీనితో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా అడ్డగోలుగా పెరిగే కణాల్ని క్యాన్సర్‌ కణాలంటారు. ఇవి మిగతాకణాల్ని సరిగా పనిచేయ నియ్యవు. ఫలితంగా, రోగ నిరోధకశక్తిని కోల్పోయేలా చేస్తుం ది. రక్తాన్ని గడ్డకట్టనీయదు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా మందులతో (కీమోథెరిపీ పద్ధతిలో) చికిత్స చేస్తారు.

ప్రధానంగా మూడురకాలైన రక్త క్యాన్సర్‌లున్నాయి.
అవి... 1) లుకేమియా, 2) లింఫోమా, 3) మైలోమా.

లుకేమియా...

తీవ్రస్థాయిలో వున్నప్పుడు ప్రభావితమైన తెల్ల రక్తకణాల ఆధారంతో రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
లింఫోబ్లాస్టిక్‌ (తెల్లరక్తకణాలు) లుకేమియా: దీనివల్ల సహ జంగా వున్న వైరల్‌ అంటు రోగాల్ని ఎదిరించేశక్తిని కోల్పో తుంది. ఇది పిల్లల్లో (15 సంవత్సరా లలోపు) ఎక్కువగా వస్తుంది. ఎక్కువ మందిలో ఇది రెండు నుండి ఐదేళ్లలోపు పిల్లలకి వస్తుంది. దీనికి కారణాలు తెలియదు. మందులతో పిల్లల్లో 85 శాతం మందిలో దీన్ని తగ్గించవచ్చు. అయితే పెద్దవాళ్లల్లో 40 శాతం మందిలోనే తగ్గే అవకాశం వుంది.
మైలాయిడ్‌ సెల్స్‌ (మూలగ) లుకేమియా: ఇది సహజంగా వున్న బ్యాక్టీరియా, పరాన్న జీవుల్ని, కణజాల నష్టాన్ని పరిమితంచేసే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈ రకం క్యాన్సర్‌ వచ్చినప్పుడు పాలిపోవడం, అలసిపోవడం, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. తరచుగా అంటురోగాలు వస్తాయి. అసాధారణంగా, తరచుగా రక్తస్రావం జరుగు తుంది. ఇది ఎక్కువగా 60 ఏళ్లు పైబడినవారిలో, అదీ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. పొగాకు తాగడం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ.

లింఫోమా: ఈ క్యాన్సర్‌ శోషరస నాళ వ్యవస్థ (లింఫ్‌ సిస్టమ్‌) ను ప్రభావితం చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిలో ఒక భాగం. ఎముకల మజ్జ, తెల్లరక్తకణాలు, లింఫ్‌ గ్రంథు లు రోగ నిరోధకశక్తిలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇది వస్తే లింఫ్‌ గ్రంథులు ఉబ్బు తాయి. ఇదే క్యాన్సర్‌కి చిహ్నం. తెల్లరక్తకణాలు పనిచేయవు. తరచుగా ఇన్ఫెక్షన్స్‌, వ్యాధులు వస్తాయి.

మైలోమా: ప్లాస్మా జీవకణాలకు క్యాన్సర్‌ సోకుతుంది. ఈ జీవకణాలు మామూలుగా రోగ నిరోధకశక్తికి అవసరమైన యాంటీబాడీల్ని తయారుచేస్తాయి. క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఈ శక్తిని కోల్పోతాయి. ఎముక మజ్జలో వుండే కణాలు కూడా వేగంగా పునరుత్పత్తి అయ్యి, అక్కడే వుంటాయి. దీనివల్ల ఎముకలు ఉబ్బుతాయి. వెన్నెముకలో, పుర్రెలో, తొంటి ఎముకల్లో, ఉరః పంజరం (రిబ్స్‌) లో, ఇలా ఎక్కడైనా ఎముకల్లో ఏర్పడవచ్చు. దీన్ని ఎముకల క్యాన్సర్‌ అంటారు. దీనివల్ల నొప్పి, రక్తహీనత, ఎముకలు విరిగిపోవడం, శరీరంలో గడ్డలు గడ్డలుగా ఏర్పడటం, అలసిపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. ఇవన్నీ ఆలస్యంగా బయటపడతాయి.


మందులకు లొంగని 'ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా' అనే జబ్బు. ఒక రకమైన రక్త క్యాన్సరు..... పది లక్షల మందిలో 30 పిల్లలకు రావచ్చు. అది కూడా 2 నుంచి 5 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా వస్తుంది.


లక్షణాలు

రక్త క్యాన్సరులో అపరిపక్వమైన తెల్ల రక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి జరిగి సాధారణ, ఆరోగ్యమైన తెల్లరక్తకణాలను స్థానభ్రంశం చేసి ఎముక మజ్జుకు హాని కలిగిస్తాయి. దీని మూలంగా రక్తం గడ్డకట్టడాని (గాయాలు కలిగినప్పుడు) అవసరమయే రక్తపట్టకల సంఖ్య తగ్గిపోతుంది. దీని మూలంగా రక్త క్యాన్సరు వున్న రోగుల కలగాయం కలిగినప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్టుగా కనపడడం, చర్మంమీద ఎర్ర రక్తపు దద్దుర్లు కనపడడం వంటి లక్షణాలు వుంటాయి.

తెల్లరక్తకణాలు వ్యాధికారక సూక్ష్మజీవులకు విరుధ్ధంగా నిరంతరం పోరాడుతూవుంటాయి. ఇవి ఈ వ్యాధితో అణచి చేయబడుతాయి లేక సరిగావాటి విధి నిర్వర్తించలేకపోతాయి. పర్యావసానంగా రోగి యొక్క నిరోధక వ్యవస్థ (తెల్లరక్తకణాలు మొ,,) శరీరంలోని ఇతర కణాలపై దాడి మొదలు పెడతాయి.

ఆఖరుకు ఎట్టి రక్తకణాల కొరత రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతవల్ల రోగికి ఆయాసం రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చును. రోగ నిర్ధారణకు రక్తపరీక్షలు, ఎముక, మజ్జాల పరీక్షలు అవసరమవుతాయి.

తత్సంభందమైన ఇతర లక్షణాలు:-

* జ్వరము, వణుకుడు, రాత్రుళ్ళు చెమటపోయడం, ఇతర ఇన్ ప్లూయన్ జా లక్షణాలు
* బలహీనత, అలసట,
* ఆకలి లేమి, రక్తం కారడం
* చిన్న గాయం నుంచి అధిక రక్తస్రావం
* నరాల జబ్బులకు సంభంధించిన లక్షణాలు (తలనొప్పి)
* కాలేయము, ప్లీహము యొక్క వాపు.
* చిన్నగాయాలే తేలికగా చర్మం కంది పోవడం
* తరచుగా సూక్ష్మక్రిమి సంపర్కము
* ఎముకల నొప్పి
* కీళ్ళ నొప్పులు
* గళగ్రంధుల యొక్క వాపు లుకీమియా (రక్త క్యాన్లరు) అనాగా తెల్ల రక్తము అని అర్థం.

సార్ధకనామంగా ఈ వ్యాధిలో తెల్లరక్తకణాల సంఖ్య రోగిరక్తంలో చికిత్సకు ముందు అధికంగా ఉంటాయి. సూక్ష్మ దర్శని క్రింద రక్తం యొక్క నమూనా పరీక్షించినప్పుడు తెల్లకణాల సంఖ్య ఆధిక్యత స్పష్టంగా తెలుస్తుంది. చాలా వరకు ఈ అధిక సంఖ్యలో ఉన్న తెల్ల రక్తకణాలు ఇతర కణాల కార్యకలాపాలలో అడ్డుపడతాయి.

కొంతమంది రక్త క్యాన్సరు రోగులలో తెల్లరక్తకణాల ఆధిక్యత స్పష్టంగా కనపడేంతగా వుండదు. దీనిని ఎలుకీమియా అంటారు. ఎముక మజ్జులో క్యాన్సరు కలుగజేసే తెల్ల రక్తకణాలు వుంటాయి మరియు ఇవి సాధారణంగా ఉత్పత్తయే రక్తకణాలలో విభేధము కలిగిస్తాయి. అయినప్పటికీ ఇటువంటి క్యాన్సరును కలుగజేసే రక్తకణాల రక్తస్రావంలోకి చేరకుండా ఎముక మజ్జులోనే ఉండిపోతాయి. ఇవి రక్త పరీక్షలో కనపడవు. ఎలుకీమియా రక్త క్యాన్సరు ఉన్న రోగులలో రక్తంలోని తెల్లరక్త కణాల సంఖ్య సాధారణంగా లేక సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చును. నాలుగు ప్రముఖ రకాలైన రక్త క్యాన్సరులలో ఎలుకీమియా ఒకరకం కావచ్చును. ఎలుకీమియా కేశకణాల ఎలుకీమియాలలో అధికంగా వుంటుంది.


నాలుగు ప్రముఖ రకాలు

రక్త క్యాన్సరు అనే పదం చాలా రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులకు కలిపి వర్తిస్తుంది.
రక్త క్యాన్సరును వైద్య పరీక్షలకు అనుగుణంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా రెండు రకాలుగా విభజించవచ్చును.

1.ఆకస్మికంగా అవతరించే రకము. 2.దీర్ఘకాలికంగా ఉండే రకము

ఆకస్మికంగా అవతరించే రకముః-

ఇందులో అపరిపక్వమైన రక్తకణాలు వేగంగా వృద్ధి చెందుతూ పోతాయి. ఈ కణాలు గుంపులు, గుంపులుగా ఎముక మజ్జునులో ఏర్పడి దీనిని ఆరోగ్యవంతమైన రక్తకణాల ఉత్పత్తి చేసే వీలు లేకుండా చేస్తాయి. ఈ రకము రక్త క్యాన్సరు పిల్లలలో మరియు యౌవ్వనంలో వున్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణ చికిత్స చాలా అవసరం ఎందుకంటే ఈ రకం రక్త క్యాన్సరులో క్యాన్సరు కణాలు వేగంగా పెరిగిపోయి గుంపులుగా చేరిపోయి రక్త ప్రసరణలోకి చేరి ఇతర అవయవాలలోకి వ్యాప్తి చెందుతాయి. కానీ కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేయదు. అప్పుడప్పుడు కేంద్ర నాడుల పక్షవాతం వచ్చే అవకాశాలు వుంటాయి.

దీర్ఘకాలికంగా ఉండే రకముః-

ఈ రకం క్యాన్సరులో ఆకస్మిక రక్త క్యాన్సరులో లాగా కాక క్యాన్సరు కణాలు దరిదాపు పరిపక్వంగా వుంటాయి. కానీ అసాధారణంగా వుంటాయి. ఇవికూడా త్వరితగతిన వృద్ధి చెందుతాయి. కొన్ని నెలలనుంచి కొన్ని సం,, కాలంలో వృద్ధి చెందుతూ సాధారణ కణాలు వృద్ధి చెందే సమయము కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొంటాయి. ఫలితంగా రక్తంలో అసాధారణ తెల్లరక్తకణాలు ఎన్నో కనపడతాయి. దీర్ఘకాలిక రక్త క్యాన్సరు చాలా వరకూ వృద్ధులలో కనబడుతుంది. కానీ సిద్దాంతాలు ప్రకారం చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా రావచ్చును. ఆకస్మిక రక్త క్యాన్సరుకు తక్షణం చికిత్స అవసరం, కానీ దీర్ఘకాలిక క్యాన్సరు రోగులను కొంతకాలం వరకూ గమనించి చికిత్స యొక్క ప్రభావం పూర్తిగా లభించే వరకూ ఎదురు చూడవచ్చును.


కారణాలు మరియు రోగం అపాయకరమైన అంశాలు

అన్ని రకాల రక్త క్యాన్సరులకు ఏదో ఒకటే కారణం అంటూ లేదు. వివిధ రకాల రక్త క్యాన్సరులకు వివిధ కారణాలు వుండవచ్చును. దీని గురించి తెలిసింది చాలా తక్కువ. శాస్త్రజ్ఞుల ఈ క్రింది పేర్కొన్న నాలుగు కారణాలు కారణం కావచ్చునని నమ్ముతున్నారు.

* స్వాభావిక లేక కృత్రిమ అయనీకరణ కిరణ ప్రసారాలు (కిరణ ప్రసరణ వలన కలిగే ఉష్ణము)
* కొన్ని రకాల రసాయన పదార్థములు
* కొన్ని వైరస్ లు
* అనువంశికం, వంశపారంపర్యం

రక్త క్యాన్సరులో వేరే క్యాన్సరులు లాగానే జన్యు పదార్థ శరీర నిర్మాణంలో మార్పులు (శాశ్వత) కలుగుతాయి. ఈ మార్పులు మామూలు కణాలను, క్యాన్సరు కణాలుగా అణచి వేసే జన్యువులను నిసైజ్ పరుస్తాయి. ఇంకా నియమబద్దంగా జరుగవలసిన కణ విభజన, ఏర్పాటు, కణక్షీణత వంటి ప్రక్రియలన్నీతారుమారవుతాయి. ఈ జన్యువు ఉత్పరివర్తనాలు ఆకస్మికంగా జరుగవచ్చును. లేదా జన్యుపరమైన కారణాం వికిరణ కిరణాల ప్రభావం, క్యాన్సరుకు కారణ భూతమయ్యే పదార్థాలు వంటి కారణాలతో కూడా ప్రభావితం కావచ్చును. కోహార్ట్ వంటి శాస్త్రజ్ఞుల పరిశోధనలలో జెంజోన్ వంటి పెట్రోలుకు సంబంధించి రసాయన పదార్థాలు, వెంట్రుకలకు వేసుకొనే రంగులు కొన్ని రకాల రక్త క్యాన్సరుకు కారణం కావచ్చునని కొంతమంది రోగుల పై ప్రయోగాల ఫలితాలను పరిశీలించ పిమ్మట, ఈ విధంగా భావిస్తున్నారు.

కొన్ని రకాల రక్త క్యాన్సర్లకు కారణం కొన్ని వైరసులు కూడా కావచ్చు. అయిన రక్త క్యాన్సర్లలో హెచ్.ఐ.వి. వైరస్ కారణం (ఎయిడ్స్ కు కారణం అయిన వైరస్) లేక హ్యుమన్ టి- లింఫాట్రాఫిక్ వైరస్ -1, 2 - దీని మూలంగా టి-కణ రక్త క్యాన్సరు లేక లింఫామా అను క్యాన్సరు వస్తాయి.

ఫాంకానీ రక్తహీనత లో ఆకస్మిక మైలో జీనస్ రక్త క్యాన్సరు వచ్చే అపాయం వుంటుంది.
కారణాలు తెలిసే వరకూ రక్త క్యాన్సరు నివారణ సాధ్యపడదు. కారణాలు తెలిసిన తరువాత కాడా నివారణ అంతగా నియంత్రించడం జరుగదు. ఉదాహరణకు సహజంగా, సూర్యరశ్మి లోని అయనీకరణ వికిరణాల ప్రభావాన్ని ప్రతిదినం వాటి ప్రబావాన్నుంచి కాపాడుకోవడం సాధ్యపడదు. దీని వలన నివారణ పరంగా పెద్దగా ఉపయోగం కూడా లేదు.
  • ==================
 Visit my website at : Dr.Seshagirirao.com
 

రొమ్ము క్యాన్సర్ , Breast Cancer


రొమ్ము క్యాన్సరు- స్తనంలోని కంతులు (గడ్డలు) ,రొమ్ము గడ్డలు .

రొమ్ము క్యాన్సరు స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనవి. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు 1 నుంచి 9 వరకు వుంటాయి.

లక్షణాలు

* రొమ్ములో గడ్డ
* చనుమొనల నుంచి ద్రవాలు స్రవించడం (కారణం)
* వెనుదిరిగిన చనుమొనలు (సాధారణంగా బయటకు వచ్చినట్టు వుండాలి.)
* ఎఱ్ఱగా, కందినట్టుగా వుండే చనుమొనలు
* రొమ్ములు పెద్దవిగా అయివుండడం.
* రొమ్ములు కుంచించుకు పోయినట్టు వుండడం.
* రొమ్ములు గట్టిపడడం
* ఎముకలలో నొప్పి
* నడుము నొప్పి

హానికలిగించే, (అపాయం కలిగించే) అంశాలుః-

* కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుండడం.
* స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే అపాయం పెరుగుతూ పోతుంది.
* ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చివున్న చరిత్ర
* ముందుగా రొమ్ములకు సంబంధించిన జబ్బులు వచ్చి ఉండడం, రొమ్ములలో అసాధారణ మార్పులు వచ్చి వుండడం.
* జన్యు పరమైన లోపాలు లేదా మార్పులు (అరుదైన మార్పులు)
* 50సం,, దాటిన తరువాత బహిష్టులు ఆగిపోవడం (కొద్దిగా ఆలస్యంగా)
* పిల్లలు కలుగక పోవడం
* మధుపానం, ఆహారంలో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం, పీచు పదార్థాలు తక్కువగా వున్న ఆహారం తీసుకోవడం, ధూమపానం, అధిక బరువు, ముందుగా వున్న అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు.

చికిత్స
రొమ్ము క్యాన్సరు యొక్క చికిత్స ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి వుంటుంది.

* చికిత్స తీసుకునే స్త్రీ బహిస్టులు ఎండిపోయే వయసుకు చేరుకొని వున్నదా,
* రొమ్ము క్యాన్సరు ఎంత మేరకు వ్యాపించి ఉన్నది,
* రొమ్ము క్యాన్సరు లోని కణాల నమూనా (రకం),

రొమ్ము క్యాన్సరు యొక్క వ్యాప్తి క్రింది విధంగా నిర్వచించబడుతాయి.

* రొమ్ములో ఏ స్థానంలో ఏర్పడి వున్నది,
* క్యాన్సరు ఏ వంతున శోష గ్రంధులలోకి వ్యాపించి ఉన్నది.
* రొమ్ము లోపలి లోతుగా వున్న కండరాలలోనికి క్యాన్సరు వ్యాపించడం,
* మెదడు మరియు ఎముకలు మొ,, ఇతర అవయవాలకు క్యాన్సరు వ్యాపించడం.
* రొమ్ము క్యాన్సరు కణాలలో కూడా రకాలు వుండవచ్చును.
* త్వరితగతిని విభజన చెందే కణాలు కొద్దిగా తక్కువ వేగంతో విభజన చెందే కణాలు దీనికి తోడు కణాలపై గ్రాహకాలు వుంటాయి. దీవి ఉనికి రొమ్ము క్యాన్సరు చికిత్సకు ప్రతిస్పందన అధికం చేస్తుంది.

పైన చెప్పిన అంశాల ఆధారంగా వైద్యులు క్రింద చూపిన నిర్ణయాలు తీసుకొనడం జరుగుతుంది.

రొమ్ములోని గడ్డను దాని చుట్టూ వున్న కణజాలాన్ని తీసివేయడం దీనితోపాటు వికిరణ చికిత్స ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు.

* పూర్తిగా రొమ్మును తొలిగించడటం
* రొమ్మును (రెండు) వీటితో పాటు శోషరస గ్రంథులను కూడా తొలగించడం.

నివారణోపాయాలు

* ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం
* సం.,నికి ఒకసారి వైద్యనిపుణులతో రొమ్ముల పరీక్ష
* పౌష్ఠికాహాకారాన్ని తీసుకోవడం
* రొమ్ములో గడ్డలు (చిన్నవికానీ, పెద్దవికానీ) వున్నట్టు ఎంత మాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* రొమ్ము క్యాన్సరు త్వరగా కనుక్కొని చికిత్స తీసుకుంటే నయం చేసుకొవచ్చు, ఆలస్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చును.

రొమ్ము క్యాన్సర్‌-- స్క్రీనింగ్‌ ఒకటే మార్గం (డా.పి.రఘురామ్‌):

రొమ్ము క్యాన్సర్‌.. ఆధునిక మహిళను భయపెడుతున్న పెద్ద సమస్య. మహిళలు నిరంతరం మనసులో ఈ భయంతో ఎందుకు సతమతమవుతుండాలి? క్యాన్సర్‌ ఉంటే దాన్ని ముందే గుర్తించాలి. లేదంటే క్యాన్సర్‌ లేదన్న భరోసా, నిశ్చింత అయినా ఉండాలి! ఈ రెండూ కూడా ఒక్క 'స్క్రీనింగ్‌'తోనే సాధ్యం!
ప్రతి మహిళా.. క్రమం తప్పకుండా ప్రతి ఏటా రొమ్ములకు స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవటం ద్వారా.. క్యాన్సర్‌ మరణాలను గణనీయంగా తగ్గించగలమని అధ్యయన పూర్వకంగా నిరూపించారు -ప్రొఫెసర్‌ లాస్లో తాబార్‌. స్వీడన్‌కు చెందిన ఈ రేడియాలజీ ప్రొఫెసర్‌ ఇటీవలే హైదరాబాద్‌లో 'ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వైద్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సీఈవో, బ్రెస్ట్‌ సర్జన్‌ డా. పి.రఘురామ్‌తో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. ప్రతి మహిళా క్రమం తప్పకుండా రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరమేమిటో వివరించారు.

రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ప్రతి మహిళకూ అవసరమేనా? దానికి అంతటి ప్రాధాన్యం ఉందా?

రొమ్ము కాన్సర్‌ ఎందుకొస్తుందో ఇప్పటి వరకూ మనకు నిర్దిష్టంగా తెలియదు. మరో రకంగా చెప్పాలంటే దీనికి చాలాచాలా అంశాలు కారణమవుతున్నాయి. కాబట్టి ఏ మహిళ అయినా రొమ్ము క్యాన్సర్‌ను నివారించుకోవటం, అసలా సమస్య రాకుండా చూసుకోవటమన్నది కష్టం. కాబట్టి మన ముందున్న ఒకే ఒక మార్గం ఏమంటే- రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించి.. సాధ్యమైనంత తొలిదశలోనే దాన్ని పూర్తిగా నిర్మూలించటం! దీనికి అద్భుతంగా సహాయపడే విధానమే రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్షలు. క్రమం తప్పకుండా రొమ్ములను స్క్రీన్‌ చెయ్యటం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1. భరోసా: రొమ్ము క్యాన్సర్‌ అనేది ఒక పెద్ద అనుమానం, మానసికంగా వేధించే పెద్ద కలవరం. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష చేసి.. క్యాన్సరేదీ లేదని నిర్ధారించుకుంటే ఆ అనుమానాలు, భయాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి స్క్రీనింగ్‌ వల్ల చక్కటి భరోసా లభిస్తుంది. నిశ్చింతగా ఉండొచ్చు. 2. సత్వర చికిత్స: ఒకవేళ ఈ పరీక్షల్లో క్యాన్సర్‌ ఆనవాళ్లున్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్స చెయ్యటం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. క్యాన్సర్‌ బయటకు వ్యాపించకుండా ఇంకా రొమ్ములో ఉన్నప్పుడే గుర్తించి వెంటనే చికిత్స చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాల్లో తేలింది. కాబట్టి క్యాన్సర్‌ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించేందుకు స్క్రీనింగ్‌ ఒక్కటే మార్గం!

స్క్రీనింగ్‌ ఎవరికి అవసరం? ఎంత తరచుగా చేయించుకోవాలి? ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలేమిటి?

దీనిపై విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. అన్నీ కూడా.. ఏడాదిన్నర నుంచి రెండేళ్లకు ఒకసారి (18-24 నెలలకు ఒకసారి) స్క్రీనింగ్‌ పరీక్ష చేస్తే రొమ్ము క్యాన్సర్‌ మరణాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నామని తేల్చాయి. 40-74 మధ్య వయసున్న స్త్రీలందరికీ ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరమని నిర్ధారించాయి. మళ్లీ దీనిలో కూడా వయసును బట్టి ప్రత్యేక సిఫార్సులున్నాయి. 40-54 ఏళ్ల మధ్యవయసు స్త్రీలు 18 నెలలు మించకుండా పరీక్ష చేయించుకోవాలి. అలాగే 55 ఏళ్ల పైబడిన స్త్రీలంతా 24 నెలలు దాటకుండా పరీక్ష చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటం మరీ ఉత్తమం.

రొమ్ముల స్క్రీనింగ్‌ పరీక్షలో భాగంగా ఏమేం చేస్తారు?

స్క్రీనింగ్‌లో ప్రధానంగా వైద్యులు చేతితో నొక్కి పరీక్షించటం, రెండోది రొమ్ములకు ప్రత్యేక ఎక్స్‌రే 'మామోగ్రామ్‌' పరీక్ష చేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కూడా చేస్తారు. క్యాన్సర్‌ ఆనవాళ్లు చాలావరకూ ఈ పరీక్షల్లోనే బయటపడతాయి. ఇక రొమ్ముక్యాన్సర్‌ రిస్కు, అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికైతే రొమ్ములకు ఎమ్మారై(MRI) పరీక్ష కూడా సిఫార్సు చేస్తారు.

పేద ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాల్లో ఈ వయసు స్త్రీలంతా ప్రతి ఏటా ఈ పరీక్షలన్నీ చేయించుకోవటమంటే చాలా కష్టం. దీనికి మార్గం ఏమిటి?
రొమ్ము క్యాన్సర్‌ రిస్కు దృష్ట్యా- స్క్రీనింగ్‌ అన్నది కచ్చితంగా అవసరం. కాకపోతే దేశ కాలమాన పరిస్థితులను బట్టి అందుకు అనుసరించే విధానాలే మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం చేసినా.. ఎలా చేసినా.. రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, తొలిదశలోనే గుర్తించటమన్నది అవసరం. మన దేశంలో రొమ్ము క్యాన్సర్‌ కేసులను సగటున గడ్డ సైజు 5 సెం.మీ. కన్నా పెద్దగా పెరిగిన తర్వాతే గుర్తిస్తున్నారు. గడ్డ 5 సెం.మీ. కంటే ఎక్కువ ఉందంటే దానర్థం అది మూడు, నాలుగు స్టేజీల్లోకి వెళ్లిపోయిందని! సుశిక్షితులైన నర్సులు, లేదా వైద్యసిబ్బంది క్రమం తప్పకుండా చేతితో నొక్కి చూసే పరీక్ష చేసినా కూడా వీటిని ఇంతకంటే ముందే, ఇంత సైజు వరకూ పెరగటానికి కొంత ముందే గుర్తించొచ్చు. తద్వారా రొమ్ము క్యాన్సర్‌ మరణాలనూ తగ్గించొచ్చు. ఇక 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒక్కసారి మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోగలిగితే చాలు.. క్యాన్సర్‌ గడ్డలు చేతికి తగలటానికంటే చాలా చాలా ముందే గుర్తించే వీలుంటుంది, అలా గుర్తిస్తే దాన్ని మనం పూర్తిగా నయం చేసే వీలూ ఉంటుంది. కాబట్టి అంతా స్క్రీనింగ్‌ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వటం అవసరం.

ఇంకో ముఖ్యమైన విషయమేమంటే రొమ్ము క్యాన్సర్‌ వస్తే చికిత్స చెయ్యటం తప్పించి.. అసలు అది రాకుండా ముందు నుంచే మనం చెయ్యగలిగిందేం లేదు. కాబట్టి దీని విషయంలో మన చేతుల్లో ఉన్నది రెండే రెండు పద్ధతులు. ఒకటి- ప్రతి మహిళా తన రొమ్ములపై తాను అవగాహన పెంచుకోవాలి. అవి నెల పొడవునా సాధారణంగా ఏ సమయంలో ఎలా అనిపిస్తాయో అవగాహన పెంచుకుని.. (దీన్నే 'బ్రెస్ట్‌ అవేర్‌నెస్‌' అంటారు) దాన్లో ఎటువంటి తేడాగా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. రెండోది- 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి మామోగ్రామ్‌ చేయించుకోవాలి. ఈ రెండింటితో రొమ్ముక్యాన్సర్‌ను చాలా త్వరగా గుర్తించే వీలుంటుంది. సత్వరం గుర్తించటం, సమర్థంగా చికిత్స చేయటం.. వీటితో మహిళ ఆయుర్దాయాన్ని కాపాడొచ్చు. ఆమె రొమ్ము క్యాన్సర్‌తో మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించొచ్చు. అలాగే భారతదేశంలో ప్రత్యేకంగా రొమ్ములకు సంబంధించిన సమస్యలకే చికిత్స అందించే బ్రెస్ట్‌ సెంటర్స్‌ మరిన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటే.. ప్రత్యేక నైపుణ్యం గల స్పెషలిస్ట్‌లు సమస్యను మరింత ముందుగా గుర్తిస్తారు, సమర్థ వైద్యమూ అందించగలుగుతారు.

ఇప్పటి వరకూ ప్రతి మహిళా నెలలో కొన్నికొన్ని సమయాల్లో తన రొమ్ములను తాను స్వయంగా పరీక్షించుకోవాలని (సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌) సూచిస్తున్నారు. అది సరిపోదంటారా? స్క్రీనింగ్‌ పరీక్షలతో ఫలితం అంతకంటే మెరుగ్గా ఉంటుందా?
ప్రతి మహిళా స్వీయ పరీక్ష చేసుకోవటం అవసరం, అది ముఖ్యమైనదే.అయితే మన లక్ష్యం రొమ్ముల్లో గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగినతర్వాత గుర్తించటం కాదు. దాన్ని అంతకంటే చాలా చాలా ముందే గుర్తించాలి! ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఎవరికి వారు చేసుకునే స్వీయ పరీక్ష సరిపోదు. అందుకని స్క్రీనింగ్‌ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెండోది- వారివారి రొమ్ముల సహజ స్వభావంలో ఏ కొంచెం తేడాగా అనిపించినా వైద్యులను సంప్రదించాలి.

నియంత్రించలేని కారకాలు :
  • లింగము : మగవారిలోకన్నా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది .
  • వయస్సు : వయస్సు అనేది మరొక అతిపెద్ద క్యాన్సర్ కారకము . . మీ వయస్సు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటుంది . నిపుణుల అధ్యయనములో తేలినది ఏమంటే ... 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గలస్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి , 60 సం. పైబడిన స్త్రీలలో ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది .
  • కుటుంబ నేపధ్యము : మీ దగ్గరి బంధువులకు (అమ్మ , సోదరి , కూతురు ) క్యాన్సర్ ఉన్నట్లైతే మీకు కూడా వచ్చే అవకాశము ఎక్కువ .
  • వ్యక్తిగత నేపధ్యము : మీకు ఇదివరకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లైతే అదే బ్రెస్ట్ లోకాని ప్రక్క బ్రెస్ట్ లోకాని మరల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • జాతి : నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతి స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే శాతము మరింత ఎక్కువ .
  • ఈస్ట్రోజన్‌ : ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థనాల్లోని కణాలను ఉత్తేజ పరుస్తుంది . దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్‌ హార్మొన్‌కు గురికావడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశము ఎక్కువ . అయితె ఈస్ట్రోజన్‌ నియంత్రించడం అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండదు . ఉదాహరణకు చిన్న వయసులోనే అంటే 12 సం. కన్న తక్కువ వయస్సులోనే నెలసరి ప్రారంభము కావడము . అదేవిధంగా 55 సం .ల తరువాత బహిస్టలు పోవడము . (మెనోపాజ్ ) అంటే దీర్ఘకాలము పాటు నెలసరి కొనసాగితే క్యాన్సర్ వచ్చే అవకాశము కూడా అంత ఎక్కువ. ఆవిధంగానే బయటి వాతావరణము నుండి శరీరములోకి ప్రవేశించే ఈస్ట్రోజన్‌ ఉదా: మాంసాహారము లో ఉండే హార్మోనులు , ఇతర ఆహారములలో ఉండే పురుగు మందులల అవశేషాలు మన శరీరములో ఈస్ట్రోజన్‌ ను పోలిన అవశేషాలను విడుదలచేస్తాయి .
  • గర్భము మరియు స్థనపానము : గర్భము మరియు స్థనపానము అనృవి నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. 30 సం.లు పైబడే వరకు గర్భము ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భము ధరించని స్త్రీలకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశము ఎక్కువ . దీర్ఘకాలముపాటు అంటే 1.5 లేదా 2 సం.లు వరకు స్థన్యము ఇచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము తక్కువ . అయితే అంత సుదీర్ఘ కాలము పాలు ఇచ్చే తల్లులు కనబడడం లేదు . మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ--- మంచి ఆహారముపు అలవాట్లు , వ్యాయామము -- మనచేతిలొ లేని అనేక కారణాల వలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూఉంటుంది . ఇది వచ్చినపుడు ... అదేదో మనము చేసిన తప్పిదము వలన వచ్చినట్లుగా కృంగిపోకూడదు.

  • రొమ్ము కాన్సెర్ మామోగ్రఫీ
రొమ్ముక్యాన్సర్‌ ఉండొచ్చనే భయం ఓ వైపు వేధిస్తోన్నా.. వైద్యుల్ని సంప్రదించడానికి సంకోచం. అంతకన్నా ముందు.. పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలామందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఉన్నా లేకపోయినా.. ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్‌ విధానం ఉంది.

మూడు రకాల్లో అందుబాటులో ఉండే ఈ విధానం వల్ల ఎలా మేలు జరుగుతుందో చూద్దాం.
  • స్క్రీనింగ్‌ మామోగ్రామ్‌:
ఒక మహిళ గాని, వైద్యులు గాని... క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ పరీక్షను సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే.. సమస్య ఉన్నా లేకపోయినా కూడా.. నలభైఏళ్లు దాటినప్పటి నుంచీ ఏడాదికోసారి మామోగ్రామ్‌ చేయించుకుంటే.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స సాధ్యమవుతుంది. ఆ తరవాత త్వరగా కోలుకోగలుగుతారు కూడా.

  • సర్వైలన్స్‌ మామోగ్రామ్‌:
క్యాన్సర్‌ వచ్చి.. చికిత్స తీసుకుని రొమ్మును తొలగించని వారు ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష. దానివల్ల ఆ రొమ్ములోనే కాదు.. రెండోదానికీ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తొలిదశలోనే అంచనా వేయవచ్చు.

  • డయాగ్నొస్టిక్‌ మామోగ్రామ్‌:
రొమ్ములో కణితి లేదా కొత్తగా చోటు చేసుకున్న మార్పును గుర్తించినప్పుడు అది క్యాన్సరా కాదా అని నిర్థారించేందుకు తోడ్పడుతుందీ పరీక్ష. వైద్యులు స్వయంగా పరీక్ష చేయడం.. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ నిర్వహించడం (ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష) ఇందులో భాగం.

  • డిజిటల్‌ మామోగ్రామ్‌:
ఏ వయసువారిలోనైనా తొలిదశలోనే క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. సాధారణ మామోగ్రామ్‌తో పోలిస్తే.. ఇది అత్యాధునికమైన విధానం. ఇక, మన దేశంలో యువతుల్లోనూ క్యాన్సర్‌ ప్రమాదం కనిపిస్తోంది. అయితే యువతుల్లో రొమ్ము కణజాలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రారంభ దశలో ఆ లక్షణాలను త్వరగా గుర్తించలేం. అలాంటప్పుడు ఈ మామోగ్రఫీ చేయడం సరైన ప్రత్యామ్నాయం. దీనివల్ల పరీక్ష సమయంలో నొప్పితో పాటు రేడియేషన్‌ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ పరీక్షలో భాగంగా తీసిన చిత్రాలను రెండో అభిప్రాయం కోసం ప్రపంచంలో ఎక్కడికైనా పంపించుకోవచ్చు. అయితే ఈ విధానం మన దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఖరీదూ కొద్దిగా ఎక్కువే.

  • రొమ్ముక్యాన్సర్‌ వచ్చిన వారిలో సందేహాలు-చికిత్సా విధానాలపై అవగాహన,

చికిత్సా విధానాలపై అవగాహన లేక ఈ పరిస్థి కానీ చికిత్స ప్రారంభించే ముందే రోగితో వైద్యులు రెండు అంశాలు చర్చిస్తారు.

* .క్యాన్సర్‌ వచ్చిన భాగంతో పాటు.. బాహుమూలాల్లో ఉన్న లింఫ్‌ గ్రంథులకూ ఆ కణాలు వ్యాపిస్తే, వాటినీ తొలగించడం.

* రక్త ప్రసరణ ద్వారా రొమ్ము నుంచి క్యాన్సర్‌ కణాలు ఇతర శరీర భాగాలకు చేరిన వాటిని నశింపచేయడం.. వాటికి పరిష్కారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియో, హార్మోన్‌ లాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ కీమో, రేడియో, హార్మోన్‌ థెరపీలు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు.

శస్త్ర చికిత్స లక్ష్యం ఏమిటి?

* రొమ్ముక్యాన్సర్‌ నిర్థారణ అయిన చాలామంది మహిళలకు చేసే మొట్టమొదటి చికిత్స ఇది. అయితే కొందరిలో క్యాన్సర్‌ కణితి పరిమాణంలో పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని తగ్గించేందుకు శస్త్రచికిత్స కన్నా ముందు కీమో లేదా హార్మోన్‌ థెరపీ లాంటివి సిఫారసు చేయవచ్చు. శస్త్రచికిత్సకు ముందు కూడా రెండు అంశాలపై దృష్టి సారిస్తారు వైద్యులు. క్యాన్సర్‌ వచ్చిన రొమ్ముకు శస్త్రచికిత్స చేయడం అలాగే బాహుమూలల్లో ఉన్న లింఫ్‌ గ్రంథుల్ని తొలగించడం.

* ఒకవేళ క్యాన్సర్‌ కణితి నాలుగు సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే రొమ్మును పూర్తిగా తీసేయకుండా కోత పెట్టి కణితి ఏర్పడిన భాగంతోపాటు చుట్టూ ఉన్న కణజాలాన్ని కొంతవరకు తీసేస్తారు. అయితే ఆ తరవాత కొన్నిరోజులు రేడియోథెరపీ చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. దానివల్ల రొమ్ములో ఇంకెక్కడైనా చేరిన క్యాన్సర్‌ కణాలు పూర్తిగా నశిస్తాయి.

మాస్టెక్టమీ: క్యాన్సర్‌ కణితి నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా, లేదా చనుమొన దగ్గర ఉన్నప్పుడు, రొమ్మును ఉంచలేని పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని పూర్తిగా తొలగిస్తారు. అయితే రొమ్మును తీసేసినప్పుడు చాలామంది మానసికంగా కుంగిపోతారు. అలాంటివారికి ఇప్పుడు మళ్లీ దాన్ని అమర్చుకునే అవకాశం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని శస్త్రచికిత్స చేసినప్పుడే కాకుండా ఆ తరవాత కూడా అమర్చుకునే అవకాశం ఉంటుంది.

గ్రంథులకు చికిత్స..--రొమ్ముక్యాన్సర్‌ వచ్చాక ఆ కణాలు మొట్టమొదటగా వ్యాపించేది బాహుమూలల్లోని లింఫ్‌ గ్రంథులకే. అందుకే క్యాన్సర్‌కు చికిత్స చేసే క్రమంలో వాటి పైనా దృష్టి సారిస్తారు వైద్యులు. అది ఎప్పుడంటే రొమ్ము క్యాన్సర్‌ నిర్థారణ చేసే క్రమంలో ట్రిపుల్‌ ఎసెస్‌మెంట్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో భాగంగా మామోగ్రామ్‌తో పాటు బాహుమూలల్లోనూ అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ తప్పనిసరి. అప్పుడు ఆ భాగంలో లింఫ్‌ గ్రంథులు సహజంగా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది. ఎలాంటి సమస్యా లేనప్పుడు సెంటినల్‌ నోడ్‌ బయాప్సీ సిఫారసు చేస్తారు. ఒకవేళ క్యాన్సర్‌ సూచన కనిపిస్తే ఆక్సిలరీ నోడ్‌ క్లియరెన్స్‌ని సూచిస్తారు.

ఆక్సిలరీ నోడ్‌ క్లియరెన్స్‌: క్యాన్సర్‌ వచ్చిన లింఫ్‌గ్రంథుల్ని పూర్తిగా తొలగిస్తారు. అయితే ఈ పద్ధతి వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా భుజాల నుంచి చేతుల వరకు పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారడం, సూదిపెట్టి గుచ్చినట్లు అనిపించడం లాంటి సమస్యలు కొన్ని నెలలపాటు ఎదురవుతాయి. అరుదుగా మాత్రం చేయంతా శాశ్వతంగా వాచినట్లు ఉండిపోతుంది. ఈ సమస్యలన్నీ ప్రతి వందమందిలో ఐదు నుంచి పది శాతం వారికి మాత్రమే ఎదురవుతాయి.

సెంటినల్‌ నోడ్‌ బయాప్సీ: ఇది అత్యాధునికమైన పద్ధతి. క్యాన్సర్‌ కణాలు వ్యాపించిన మొదటి లింఫ్‌ గ్రంథుల్ని సెంటినల్‌ నోడ్స్‌ అంటారు. శస్త్రచికిత్స కన్నా ముందు వైద్యులు నిర్వహించే ట్రిపుల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో భాగంగా అల్ట్రాసౌండ్‌ చేసినప్పుడు కొన్నిసార్లు క్యాన్సర్‌ లక్షణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పద్ధతిని ఎంచుకుంటారు. రొమ్ముకు శస్త్రచికిత్స చేసే ముందు బ్లూ డై, రేడియో యాక్టివ్‌ ఫ్లూయిడ్‌ను క్యాన్సర్‌ వచ్చిన రొమ్ములో ప్రవేశపెడతారు. అవి అసహజంగా ఉన్న లింఫ్‌ గ్రంథుల దగ్గరకు చేరతాయి. మత్తు ఇచ్చాక రొమ్ముకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడే బాహుమూలల్లో చిన్న రంధ్రం చేసి పరీక్షలు చేస్తారు. దీన్ని ఫ్రోజెన్‌ సెక్షన్‌ అంటారు. ఇరవై నిమిషాల్లో క్యాన్సర్‌ కణాలు ఆ భాగానికి సోకాయా లేదా అన్నది తెలుస్తుంది. క్యాన్సర్‌ లేదనప్పుడు ఇక మిగతా గ్రంథుల్ని తీయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఒకటి లేదా రెండు గ్రంథుల్లో ఉందని తేలితే.. ఆ కోతను పెద్దగా చేసి ఆక్సిలరీ విధానాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.

రంగుల'తో రొమ్ముక్యాన్సర్‌ దూరం!
రకరకాల పండ్లు, కూరగాయలను తరచుగా తినటం మంచిదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నదే. వీటిల్లో ఉండే రంగు పదార్థాలైన కెరోటినాయిడ్లు.. విటమిన్‌ ఏ లోపం తలెత్తకుండా, త్వరగా వయసు మీదకుండా కాపాడతాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్‌ ముప్పునూ తగ్గిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా.

కెరోటినాయిడ్ల స్థాయిలు, రొమ్ముక్యాన్సర్‌ మీద గతంలో చేసిన ఎనిమిది అధ్యయనాలను బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ ఆసుపత్రి, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు. రక్తంలో కెరోటినాయిడ్ల స్థాయిలు ఎక్కువగా ఉండటానికీ, రొమ్ముక్యాన్సర్‌ ముప్పు.. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ సంబంధ ఈఆర్‌-నెగెటివ్‌ రొమ్ముక్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ గణనీయమైన సంబంధం ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి రొమ్ముక్యాన్సర్ల విషయంలో నివారించుకోదగిన ముప్పు కారకాల్లో కెరోటినాయిడ్ల స్థాయులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఈ అధ్యయనం నొక్కిచెబుతోంది. అందువల్ల కెరోటినాయిడ్లు ఎక్కువగా గల ఆహారాన్ని తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. క్యారెట్‌, పాలకూర, టమోటా, చిలగడ దుంప వంటి కూరగాయల్లో.. మామిడి, బొప్పాయి, పంపర పనస వంటి పండ్లలో కెరటినాయిడ్లు దండిగా ఉంటాయి. సాల్మన్‌ చేపలు, పాలు, గుడ్డులోని పచ్చసొనతోనూ ఇవి లభిస్తాయి.--Sukhibhava@eenadu news paper
  • ===================================
Visit my website -> Dr.Seshagirirao.com/

కాన్సర్ అనగానేమి?, Cancer in Humans





అసలు క్యాన్సర్‌ ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికొస్తుంది, ఎలా అధిగమించగలం, అసలు అధిగమించగలమా - ఎన్నో సందేహాలు. ఒకటే సమాధానం...'ఆరోగ్యవంతమైన అలవాట్లతో క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. ఆ మాయదారి రోగం దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించినా, సమర్థంగా తిప్పికొట్టవచ్చు. జీవనశైలి, ఆశావాదం...క్యాన్సర్‌పై తిరుగులేని అస్త్రాలు'.
క్యా...న్స...ర్‌
మూడక్షరాల్ని తలుచుకుంటే మృత్యువు కళ్లముందు మెదులుతుంది. ఆ పేరు పలుకుతున్నా...గుండెల్లో దడ, పెదాల్లో తడబాటు, స్వరంలో మార్పు. ఆ భయానికి ప్రధాన కారణం...అపోహలు, అనుమానాలు, అవగాహన రాహిత్యం.క్యాన్సర్‌ను ఎదిరించి నిలవడం సాధ్యమే. పోరాడి గెలవడం సాధ్యమే. అది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చుట్టూ దుర్భేద్యమైన కోట కట్టుకోవడమూ సాధ్యమే.ఎందుకంటే...నూటికి డెబ్భై అయిదు శాతం క్యాన్సర్‌ వ్యాధులు కొనితెచ్చుకుంటున్నవే. జీవనశైలి లోపాల కారణంగా పుట్టుకొస్తున్నవే. నిందించాల్సి వస్తే...క్యాన్సర్‌ను కాదు, మనల్ని మనం నిందించుకోవాలి. మన అలవాట్లను మనం తప్పుపట్టాలి.

క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

నిరపాయకరమైన కంతులు వీటిని క్యాన్సరు గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవి ప్రాణాంతకం కాదు.

అపాయకరమైన కంతులుః- ఈ కంతులలోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ వున్న కణజాలం చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సరు కణాలు కంతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి.


అపాయకరమైన కంతులు ఏర్పడడానికి కారణాలు ఏవి ?

కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాలు కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు. వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా వుండవలసిన జన్యువులు క్యాన్సరు పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు కారణాలు


* ధూమపానం

* ఆహారపుటలవాట్లు
* సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు
* క్యాన్సరుకు కారణమయ్యే కొన్ని పదార్థాలు (ఇవి వాతావరణం లోని కావచ్చు లేదా పనిచేసే ప్రాంతాల నుంచి ఉత్పన్నమయినదీ కావచ్చు)
* కొన్ని అనువంశికం (వంశ పారంపర్యంగా కూడా రావచ్చు.)

అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డల ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయమై క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కొన్ని వైరసుల సూక్ష్మక్రిమి సంపర్కం మూలంగా ఉదా: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్.పి .వి.) కాలేయ శోధము -బి(HepatitisB), కాలేయ శోధము - సి(HepatitisC) ఎయిడ్స్ వైరస్ వల్ల క్యాన్సరు వచ్చే అవకాశాలు, అపాయం ఎక్కువ కావచ్చును . క్యాన్సరు అంటువ్యాధి కాదు. క్యాన్సరు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు గాయాలు, కందిపోయిన భాగం నుంచి క్యాన్సరు పుట్టదు.

క్యాన్సరును నివారించగలమా ?

క్యాన్సరును ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు కానీ, వచ్చే అపాయాన్ని కొంతవరకూ నివారించుకోవచ్చును.

* ధూమపానం, అందుకు సంభంధించిన పదార్థాలకు దూరంగా వుండడం
* క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకొనడం, కూరకాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవడం చేయాలి.
* ప్రతి దినం వ్యాయామం, తక్కువ బరువు (ఎత్తుకు తగ్గ బరువు ) ను నియంత్రించుకొనడం.
* సూర్యరశ్మిలోని అపాయకరమైన కిరణాల నుంచి రక్షించుకొనడం ( ఎండ వేళల్లో గొడుగు ధరించడం, శరీరం అంతా కప్పే విధంగా దుస్తులు వేసుకొనడం, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొనడం, చర్మానికి సూర్య కిరణాలను అడ్డుకునే మందులు రాసుకొనడం, తెల్ల దుస్తులు ధరించడం) వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
* క్యాన్సరును నివారించే మందులు గురించి వైద్యులతో సంప్రదించి వాడుకోవడం.


క్యాన్సరు యొక్క సాధారణంగా కనబడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?

క్యాన్సరు జబ్బులో చాలా రకాల లక్షణాలు కనబడుతాయి.
సాధారణంగా కనబడే లక్షణాలు

* కణజాలంలో కొంత మేరకు మందంగా మారడం (లేదా) గడ్డలు (కంతులు) ఏర్పడడం, (లేదా) శరీరంలో ఏ భాగంలో నైనా (రొమ్ములలో) గడ్డలుగా మొదలవవచ్చును.
* కొత్త (పుట్టు) మచ్చలు (లేదా) ప్రస్తుతం వున్న ఆనలు (లేదా) మచ్చలలో మార్పులు స్పష్టంగా కనబడతాయి.
* చికిత్సకు మానని పుండ్లు
* గొంతులో గరగర, ఎప్పటికీ ఉండే పొడి దగ్గు.
* మల, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు
* విడవకుండా వుంటున్న అజీర్తి, మింగడంలో ఇబ్బంది.
* బరువులో అర్థంకానీ మార్పులు (హెచ్చు తగ్గులు)
* అసాధారణ రక్తస్రావం (లేదా) ద్రవాలు స్రవించడం.


క్యాన్సరుకు ఏవిధంగా చికిత్స చేస్తారు ?

క్యాన్సరు చికిత్స విభాగంలో

* శస్త్ర చికిత్స
* అయనీకరణ కిరణ చికిత్స
* మందులు
* హార్మోనుల చికిత్స,
* ప్రకృతి వైద్యం

వైద్యులు కొన్ని అంశాలు (క్రింద చూపినవి) పరిధి లోనికి తీసుకొని ఒకే రకమైన లేక రెండు మూడు రకాలైన చికిత్సలను కలిపి రోగికి ఇవ్వవచ్చును.
ఆ అంశాలుః -

* క్యాన్సరు రకము (అపాయకరమైనవి, నిరపాయకరమైనవి)
* క్యాన్సరు వున్న అవయవము (లేదా) శరీర భాగము
* క్యాన్సరు ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది వున్నదా ? (మోటాస్టాసిస్)
* రోగి వయసు
* శరీర ఆరోగ్య పరిస్థితి (ఇతర జబ్బులు ఏవైనా వున్నవా ?)
* ఇతర అంశాలు క్యాన్సరు చికిత్సలో ఆరోగ్యంగా వున్న కణాలు, కణజాలం కూడా దెబ్బతిని ఇతర హానికరమైన ప్రభావం చూపవచ్చు కొంత మంది రోగులు చికిత్స కన్నా, మందులు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి బెంగపడతారు.
* రోగి, వైద్యులు కలిసి సంప్రదించుకొని చికిత్స మొదలు పెట్టడం శ్రేయస్కరం. లాభ నష్టాలు తూచి నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. ఈ దుష్ప్రభావాలను నివారించే (లేదా) తగ్గించే ఉపాయాలను వైద్యులను సంప్రదించి తీసుకొవాలి.

శస్త్ర చికిత్స క్యాన్సరు గడ్డలను తీసివేసే చికిత్స దీని దుష్ప్రరిమాణాలు చాలా అంశాలపై ఆధారపడి వుంటాయి.

* రోగి యొక్క శరీరక, ఆరోగ్య పరిస్థితి,
* గడ్డ యొక్క పరిమాణం, గడ్డ పుట్టన్న అవయవం.
* శస్త్ర చికిత్స విధానం.

శస్త్ర చికిత్సానంతరం రోగికి నొప్పి అధికంగా వుండవచ్చు. దీనిని మందులతో నియంత్రించవచ్చును. కొంత మంది రోగులకు బలహీనంగా అలసటగా అనిపించవచ్చు. ఇది శస్త్ర చికిత్స తరువాత కొంత కాలం వరకూ వుండవచ్చును. కొంత మంది రోగుల యొక్క పరీక్ష (లేదా) శస్త్ర చికిత్స మూలంగా క్యాన్సరు శరీరం అంతటా వ్యాపిస్తుందని అపోహపడతారు. ఈ విధంగా శస్త్ర చికిత్స చేసేటప్పుడు వైద్యులు అన్ని విధాల జాగ్రత్తలూ తీసుకుంటారు. శస్త్ర చికిత్స సమయం లో క్యాన్సరు గడ్డలకు గాలి తగలడం వలన ఇవి గాలి ద్వారా వ్యాపించవు.

కొన్ని రకాల కాన్సుర్లు :

రక్త కాన్సర్ (BloodCancer)-లుకీమియా
రొమ్ము కాన్సర్ (BreastCancer)
పెద్దపేగు క్యాన్సర్‌ నివారణ , Large Bowel cancer prevention
================================
Common Cancers
  • * Bone Cancer
  • * Brain Cancer
  • * Breast Cancer
  • * Endocrine Cancer
  • * Gastrointestinal Cancer
  • * Gynecologic Cancer
  • * Head & Neck Cancer
  • * Leukemia
  • * Lung Cancer
  • * Lymphoma
  • * Multiple Myeloma
  • * Prostate Cancer
  • * Skin Cancer
  • * Soft Tissue సర్కోమా

కాన్సెర్ 12 టిప్స్ - కోసం ఇక్కడ క్లిక్ చేయండి ->Cancer prevention Tips
  • ===============================
క్యాన్సర్‌ ప్రమాదకారే కానీ...ప్రాణాంతకం కాదు
క్యాన్సర్‌... పేరు వినగానే తెలియని భయం, ఆందోళన వెుదలవుతుంది. క్యాన్సర్‌ ప్రమాదకారే కానీ అన్ని క్యాన్సర్లూ ప్రాణాంతకం కాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇంకా క్యాన్సర్‌ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే...
* పీచు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. దీంతో పేగుల్లో వచ్చే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తగినంత తినాలి. పండ్లూ ఆకుకూరలు ఎక్కువగా ఉన్న ఆహారమే దీనికి మార్గం.
* శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. రోజూ 20-25 నిమిషాల చొప్పున వారంలో నాలుగురోజులు నడవాలి.
* బరువుని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి.
* ప్రొటీన్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు లేదా గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
* గ్రీన్‌టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలనుంచి మనల్ని రక్షిస్తాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్‌ దూరమవుతుంది.
* తినే ఆహారంలో వేపుళ్లను దూరంగా ఉంచాలి. చికెన్‌ను వేయించడానికి బదులు కాల్చితినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* నగరాల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు పెరగడానికి ప్రధానకారణం లేటు వయసు పెళ్లిళ్లు, బిడ్డకు తల్లి పాలు ఇవ్వకపోవడం.
* ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీస్తోంది.
* కాలుష్యం, ముఖ్యంగా వాహనాల పొగలో ఉండే కార్బన్‌ వోనాక్సైడ్‌ వూపిరితిత్తుల క్యాన్సర్‌ తెచ్చి పెడుతుంది.
* మనదేశంలో పొగతాగేవారిలో కంటే పొగాకు ఉత్పత్తులు నమిలేవారే ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
* మితిమీరిన మద్యపానం కూడా క్యాన్సర్‌కు దారితీస్తుంది.
* ఒత్తిడికి దూరంగా ఉండి ఆనందంగా జీవించడమూ క్యాన్సర్‌ను దూరం చేసే మార్గాల్లో ఒకటి.
* క్యాన్సర్‌ అంటే భయపడిపోకుండా అందుబాటులో ఉండే చికిత్సల గురించి తెలుసుకొని ధైర్యంగా ఉండటం మంచిది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారు ఆశావాద దృక్పథంతో ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
-------------------------------------------------------------------

click here for more details -> Types of A - Z cancers

  • =========================================================
visiti my website : Dr.Seshagirirao.com/

Tuesday, December 29, 2009

ఊబకాయము , Obesity


  • 21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. ఈ సమస్య ఎంతమేరకు వ్యాపించిందో నిర్ధిష్టంగా తెలియకపోయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో 20-40 శాతం మంది వయోజనులు, 10-20 శాతం మంది పిల్లలు, యువత దీని బారిన పడుతున్నారని అంచనా. స్థూలకాయం పెరగడానికి కారణాలలో ప్రధానమైనది గ్రామీణ జీవనం నుంచి నగర జీవితానికి పరివర్తన చెందడం, వ్యక్తులకు భౌతిక వ్యాయామం లేకపోవడం. స్థూలకాయాన్ని మందులు లేకుండానే తగ్గించవచ్చు. అయితే దాని వ్యాప్తి గురించి, రావడానికి కారణాలు, జీవితంపై దాని ప్రభావం, సామాజిక, మానసిక ప్రభావాలు, మరణానికి చేరువ చేసే దాని సామర్ధ్యం గురించి సరైన అవగాహన ఉండాలి.




నిర్వచనము : ఆరోగ్య పరం గా చెడు ప్రభావము చూపే విధం గా శరీరము లో కొవ్వు అధికం గా పెరుకుపోవడాన్నే ఉబకాయము (obesity) అంటాము . ఇది ఎన్నో అనారోగ్యాలకు (జబ్బులకు) కారణమవుతుంది . బాడీ మాస్ ఇన్దెక్ష్ (BMI) దీనికి కొలమానము గా పరిగనిస్తారు
బి.యం.ఐ = బరువు కిలో గ్రాముల్లో /ఎత్తు స్క్వేర్ (మీటర్లలో) (BMI = weight in kg/height ^2 in meters)

BMI Classification
<> underweight
18.5–24.9 normal weight
25.0–29.9 overweight
30.0–34.9 class I obesity
35.0–39.9 class II obesity
≥ 40.0 class III obesity










ఉబాకాయాన్ని మూడు విధములు గా వర్గీకరించారు . క్లాస్ 1, క్లాస్ 2 , క్లాస్ 3 . పై టేబుల్ లో చూడవచ్చును .
కలిగే అనర్ధాలు :
  1. గుండె జబ్బులు - హార్ట్ ఎటాక్ , యాంజైన , బి.ఫై , హార్ట్ ఫైల్యూర్ , హై కొలెస్టిరాల్ , డీప్ వెయిన్ త్రోమ్బోసిస్ ,
  2. మదుమేహ వ్యాధి -టైపు 2 దయబిటీస్ ,
  3. నిద్రలో శ్వాశ తీసుకోవడానికి కష్టము గా ఉంటుంది .
  4. కొన్ని రకాల కాన్సెర్ జబ్బులు ,
  5. కీళ్ళ నొప్పులు (Osteoarthritis) -గౌట్ , నడుము నొప్పి ,
  6. శరీర ఆకృతి లో పలుమార్పులు (Disfiguration) ,
  7. పెళ్ళైన తరువాత గర్భం దాల్చడం ఇబ్బందులు (conceiving problems) పిల్లల పుట్టుక లో కొన్ని అవకతవకలు ,
  8. ఫంగల్ చర్మ వ్యాదులు ఎక్కువ ,
  9. రుతుక్రమములో తేడాలు ,
  10. డిప్రషన్ , సమాజము లో ఒంటరి తనము ,

ఊబకాయానికి కారణాలు :
  • ఎక్కువ క్యాలరీస్ ఆహారము తీసుకోవడం,
  • శరీర వ్యాయామము లేకపోవడం ,
  • వంశ పారంపర్యం ,
  • ఎండో క్రయిన్ అసమతుల్యము వలన ,
  • ఏ కారణము తెలియనివి (UnknownCause),
ట్రీట్మెంట్ :
  • ఎక్కువ పీచు పదార్ధము ఉన్న ఆహారము - ఆకుకూరలు , కాయకురాలు గింజలు గల ఆహారము ,
  • రోజు వ్యామాము చేయాలి ,
  • ఆహారము తక్కువగా తీసుకోవము ,
  • తైరాయిడ్ జబ్బులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి ,
  • మంచి డాక్టర్ ను కలిసి - యాంటి ఒబీసిటి మందులు వాడాలి ,
  • తిండి ముందు ఎంత నోరు కట్టేసుకుని కూర్చున్నా బరువు తగ్గట్లేదా?
...అయితే రోజు మార్చి రోజు ఉపవాసం ఉండి చూడండి. బరువు తగ్గడం బహు సులభం అంటున్నారు అమెరికన్‌ పరిశోధకులు. పదహారు మంది స్థూలకాయులపై పదివారాల పాటు ఒక క్రమపద్ధతిలో వారు జరిపిన అధ్యయనంలో తేలిన ఫలితమిది. వారికి తొలి రెండు వారాల పాటూ మామూలుగానే ఆహారమిచ్చారు. మిగతా ఎనిమిది వారాల్లో రోజు విడిచి రోజు తిండి బాగా తగ్గించి పెట్టారు. రోజుకు 1800-2200 క్యాలరీల ఆహారం అవసరమైతే అందులో 20 నుంచి 25 శాతం మేర మాత్రమే తిననిచ్చారు. పదివారాల తర్వాత చూస్తే ఒక్కొక్కరూ వారి శరీరతత్వాన్ని బట్టీ 3 నుంచి 13 కేజీల దాకా తగ్గారు. శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రత గల కొవ్వు(ఎల్‌డీఎల్‌), ట్రైగ్లిజరైడ్‌లూ, రక్తపోటు స్థాయులూ కూడా బాగా తగ్గినట్టు గమనించారు.

  • నిద్రలేమితో వూబకాయం
అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట హాయిగా నిద్రపోండి. లేకపోతే వూబకాయం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని కేస్‌ వెస్టర్న్‌ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. రాత్రిపూట రోజుకి ఏడు గంటల పాటు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు వూబకాయులయ్యే అవకాశం 70 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పులే దీనికి కారణమవుతున్నాయి.

నిద్రలేమి మూలంగా శరీరంలో లెప్టిన్‌, ఘ్రెలిన్‌ అనే హార్మోన్ల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. కొవ్వు తగినంతగా ఉందని చెప్పేందుకు కొవ్వు కణాలు లెప్టిన్‌ను విడుదల చేస్తాయి. ఇది తక్కువగా తినమని శరీరానికి సూచిస్తుంది. మరోవైపు ఘ్రెలిన్‌ ఆహారాన్ని తీసుకోవాలంటూ మెదడుకు సంకేతాలు పంపిస్తుంటుంది. సరిగా నిద్రపోతే లెప్టిన్‌, మెలకువగా ఉంటే ఘ్రెలిన్‌ అధిక మోతాదులో విడుదలవుతాయి. అంటే నిద్రలేమి వల్ల ఆకలి పెరగటం వల్ల తిండి కూడా ఎక్కువెక్కువగానే తింటారన్నమాట. ఇలా రాత్రిపూట మాత్రమే కాదు, తెల్లారిన తర్వాత కూడా తింటుంటారు. అది కూడా పండ్లు, కూరగాయల వంటివి కాకుండా స్వీట్లు, పిండి పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం వల్ల కేలరీల మోతాదూ పెరుగుతుంది. దీంతో జీవక్రియలు మందగించి చివరికి బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా శరీరం కేలరీలను తగినంతగా వినియోగించుకోలేదు. పైగా నిద్రించాల్సిన సమయంలో మెలకువగా ఉంటే దెబ్బతిన్న కణాలను సరిచేసుకోవటం, మెదడుకు విశ్రాంతి దొరికే అవకాశం కూడా తగ్గిపోతుంది.--- ఈనాడు సుఖీభవ 21-09-2010.

  • ప్రశ్న: శరీరంలోని జన్యువుల కారణంగానే వూబకాయం వస్తుందా?

జవాబు: ఒక వయసులో ఉండవలసిన బరువుకన్నా చాలా ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి వూబకాయానికి కారణం 60 శాతం వరకూ జన్యు సంబంధమైన సమస్యేనని అనుకోవచ్చు. శరీరంలో ఆకలిని ప్రభావితం చేసే జన్యువులు కొన్ని ఉంటాయి. అవి ఆకలిని ప్రేరేపించే, ఆకలిని తీర్చే హార్మోన్లను విడుదల చేస్తాయి. అవి కొందరి విషయంలో తిన్న ఆహారాన్ని మండించి శక్తిగా మార్చకుండా కొవ్వు రూపంలో దేహంలోని వివిధ భాగాల్లో నిలువ చేస్తాయి. ఈ లోపం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువుల వల్ల ఏర్పడిందే. కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే ఊబకాయాన్ని కొంతవరకూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తగ్గించవచ్చు. కానీ జన్యుపరంగా వచ్చిన వూబకాయం విషయంలో ఇది సాధ్యం కాదు. మెదడులో ఆకలిని ప్రేరేపించే హార్మోన్‌ ఉండే ప్రదేశం జన్యు ప్రభావం వల్ల ఎప్పుడూ చురుగ్గా పని చేస్తూ ఉంటే ఊబకాయాన్ని తగ్గించడం అసాధ్యం. ఇలాంటి వారికి వైద్య చికిత్స ఒకటే పరిష్కారం.

  • ఎండ తగలకపోతే ఊబకాయం ఖాయం

ఎండను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్ అందదు.

డి విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది.

శరీరంలో క్యాల్షియమ్‌కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్‌లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే.
  • వూబకాయం నుంచి బయట పడాలంటే డి vitamin -- సి పట్టండి
వూబకాయం నుంచి బయట పడాలంటే మితాహారం, వ్యాయామమే కాదు తగినంత సూర్యరశ్మిని గ్రహించడమూ ముఖ్యమేనని చెబుతోంది ఓ తాజా పరిశోధన. ఉదయం పదకొండులోపూ సాయంత్రం మూడు తర్వాతా ఉండే ఎండలో మనకు కావాల్సిన విటమిన్‌-డి లభిస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగించడంలో దీనిది ముఖ్యపాత్ర. విటమిన్‌-డి తక్కువైతే మనశరీరంలో, ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. కేవలం వూబకాయం మాత్రమే కాదు, క్యాన్సర్‌కూ ఇది మందు. విటమిన్‌-డి తగినంత లేకుంటే క్యాన్సర్‌ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్‌ డి లేమి కారణంగా అల్జీమర్స్‌, ఒత్తిడి, మధుమేహం వంటి వ్యాధులూ వస్తాయి. శరీరంలోని కణాలచుట్టూ ఉండే రక్షణ కవచం ఏర్పడటంలో విటమిన్‌-డి పాత్ర కీలకం. అర్థమైందిగా, చలికాలం కదా అని ఎనిమిదివరకూ ముసుగు తన్ని పడుకోకుండా, కాస్త ముందేలేచి అలా ఎండలో కాసేపు నడవాలి మరి!

  • క్రమం తప్పిన నెలసరితో స్థూలకాయం,Obesity in girls of irregular periods :

యుక్తవయసు అమ్మాయిల్లో నెలసరి క్రమం ప్రకారం రాకుండా అస్తవ్యస్తంగా తయారవ్వటం తరచుగా కనిపించే సమస్యే. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ ఇలాంటి అమ్మాయిలకు అధిక బరువు, స్థూలకాయం ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బు లక్షణాలు కూడా త్వరగానే బయటపడుతున్నట్టు వెల్లడైంది. నెలనెలా రుతుక్రమం సరిగా కాకపోవటానికి పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీవోఎస్‌) సమస్య కారణం కావొచ్చు. హార్మోన్ల వ్యత్యాసం మూలంగా కనబడే ఇది.... సంతానం కలగకపోవటం, స్థూలకాయం వంటి వాటికీ దారితీస్తుంది. బాడీమాస్‌ ఇండెక్స్‌, నడుం చుట్టుకొలత అధికంగా ఉండటం, మధుమేహం ముప్పులకు నెలసరి సమస్యలతో ఎంతమేరకు సంబంధం ఉందోననే దానిపై అమెరికాలోని నేషనల్‌ హార్ట్‌, లంగ్‌ అండ్‌ బ్లడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. పద్నాలుగు ఏళ్ల నుంచి ఆపైన వయసు గలవారిని ఇందుకు ఎంచుకున్నారు. వీరి రుతుక్రమంతో పాటు సెక్స్‌ హార్మోన్లు, గ్లూకోజ్‌, ఇన్స్‌లిన్‌, రక్తపోటు స్థాయులను కూడా పరిశీలించారు. 42 రోజుల తర్వాత నెలసరి వస్తున్నవారు 14 ఏళ్ల వయసులోనే అధిక బరువు కలిగి ఉంటున్నట్టు గుర్తించటం గమనార్హం. అధ్యయనం సాగుతున్నకొద్దీ వీరి బరువు, నడుం కొలత కూడా పెరుగుతూనే ఉంది కూడా. ఈ అమ్మాయిలు 25 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి మిగతావారితో పోలిస్తే వీరి బాడీమాస్‌ ఇండెక్స్‌ సగటున 37.8గా నమోదైంది. ఇది స్థూలకాయానికి సూచిక. అంతేకాదు వీరిలో ఇన్స్‌లిన్‌, రక్తంలో చక్కెర శాతం కూడా అధిక మోతాదుల్లోనే కనిపించాయి. అయితే వీటికి నెలసరి సరిగా కాకపోవటమే కారణమవుతున్నది అని అధ్యయనంలో నిర్ధారణ కాలేదు. కానీ నెలసరి సరిగా రాకపోవటానికి జీవక్రియల్లో మార్పులను బట్టి (ఇన్స్‌లిన్‌ మోతాదు పెరగటం లాంటివి) అండాశయాలు స్పందించటం వంటి ఇతర అంశాలేవైనా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంటే మధుమేహ సంబంధ ముప్పులు నెలసరి సమస్యలకు ముందు నుంచే ఆరంభమవుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయటం లేదనటానికి నెలసరి సరిగా కాకపోవటం ఓ హెచ్చరిక అనుకోవచ్చు.

  • బరువు.. కాస్త తగ్గినా క్యాన్సర్‌ దూరం

వూబకాయం తెచ్చిపెట్టే అనర్థాలు ఎన్నెన్నో. దీంతో పలు రకాల సమస్యలు ముంచుకు రావొచ్చు. అయితే ఊబకాయులు ఏమాత్రం బరువు తగ్గినా మంచి ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగిడిన మహిళలు ఓ మోస్తరుగా బరువు తగ్గినా క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు బయటపడింది. వీళ్లు తమ శరీరబరువులో కనీసం 5 శాతం బరువు తగ్గినా సరే. రక్తంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌, ఇంటర్‌లుకైన్‌-6 వంటి వాపు సూచికలు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. ఈ వాపు సూచికలు పెరిగితే గుండెజబ్బుతో పాటు రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఊబకాయ స్త్రీలు తక్కువ కేలరీ ఆహారం తీసుకోవటంతో పాటు వ్యాయామం ఎక్కువగా చేయటం ద్వారా బరువు తగ్గితే క్యాన్సర్‌ ముప్పూ తగ్గుతున్నట్టు ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అధ్యయనకర్త డాక్టర్‌ అన్నే మెక్‌టీర్నర్‌ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరిని ఎంచుకొని తక్కువ కేలరీలు ఆహారం తీసుకోవాలని, రోజుకి 45 నిమిషాల సేపు (వారంలో ఐదు రోజులు) ఏరోబిక్‌ వ్యాయామాలు చేయాలని సూచించారు. వీలైతే రెండూ పాటించాలనీ చెప్పారు. ఏడాది తర్వాత తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 36 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 26% తగ్గింది. కేలరీలు తగ్గించటంతో పాటు వ్యాయమమూ చేసినవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 42 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 24 శాతం తగ్గింది. కనీసం 5% బరువు తగ్గినవారిలో ఈ స్థాయులు గణనీయంగా పడిపోవటం గమనార్హం. మెనోపాజ్‌లోకి అడుగిడిన వారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 40% తగ్గితే రొమ్ము, ఎండోమెట్రియల్‌, తదితర క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బరువు తగ్గటం వల్ల కొవ్వు కణాలు కుంచించుకుపోయి వాపు కారక హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. వాపు మూలంగా గుండెజబ్బులతో పాటు పలు సమస్యలూ ముంచుకొస్తాయి కూడా.

ముంచెత్తుతున్న వూబకాయ సునామీ :

ప్రపంచంలో 30% మంది అధికబరువు గలవారే--అరికట్టటంలో అన్ని దేశాలూ విఫలం-- తాజా విశ్లేషణలో వెల్లడి--
లండన్‌: ప్రపంచాన్ని వూబకాయ సునామీ ముంచెత్తుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది వూబకాయులేనని తాజా విశ్లేషణలో తేలటమే దీనికి నిదర్శనం. ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. గత మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయులు సంఖ్య పెరగటాన్ని అరికట్టలేకపోవటం గమనార్హం. ప్రపంచంలోని 200 కోట్ల మంది (30%) అధిక బరువు లేదా వూబకాయం గలవారేనని పరిశోధకులు గుర్తించారు. వూబకాయుల సంఖ్యలో మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు అన్నింటికన్నా ముందున్నాయి. అక్కడ 60% మంది పురుషులు, 65% మంది స్త్రీలు వూబకాయులేనని తేలింది. ఇక అమెరికాలో మరే దేశంలోనూ లేనంత ఎక్కువగా.. 13% మంది వూబకాయులు ఉన్నట్టు బయటపడింది. భారత్‌, చైనా.. రెండు దేశాల్లో కలిపి 15% మంది వూబకాయులు ఉన్నట్టు వెల్లడైంది. ఇది చాలా తీవ్రమైన విషయమని అధ్యయన నేత, వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టఫర్‌ ముర్రే వ్యాఖ్యానించారు. ఆయన తన బృందంతో కలిసి 1980-2013 మధ్య 188 దేశాల్లో చేసిన 1,700 అధ్యయనాలను సమీక్షించి విశ్లేషించారు.

బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారంతో రూపొందించిన ఈ నివేదిక ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌లో గురువారం ప్రచురితమైంది. మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయాన్ని తగ్గించలేకపోయినట్టు తేలిందని, అందువల్ల ఇది ఎంత కష్టమైన సవాలో అర్థమవుతోందని ముర్రే వ్యాఖ్యానించారు. ఆదాయానికీ వూబకాయానికీ బలమైన సంబంధం కనబడుతోందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ధనవంతులుగా మారుతున్నకొద్దీ వారి నడుం చుట్టుకొలత కూడా పెరుగుతూ వస్తోందని వివరించారు. అమెరికా, బ్రిటన్‌ వంటి సంపన్నదేశాల్లో ఈ ధోరణి తగ్గుతున్నప్పటికీ.. అది చాలా స్వల్పంగానే ఉందని పెదవి విరిచారు. వూబకాయంతో పాటు మధుమేహం కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారని, అలాగే క్యాన్సర్ల సంఖ్య కూడా పెరుగుతోందని హెచ్చరించారన్నారు.

For some more details(మరికొన్ని వివరాలకోసము) -ప్రపంచ ఊబకాయ నివారణ దినము
  • =========================================================
visit my website -> dr.seshagirirao-MBBS

Monday, December 28, 2009

పౌష్టికాహారానికి పది చిట్కాలు , Balanced Diet -ten hints




  • పౌష్టికాహారానికి పది చిట్కాలు..
ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడంఅనేవి, ఆరోగ్యంగాఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మరి ఈ క్రింది సూచనలు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష కాగలవు.

1) వైవిధ్యంతో కూడిన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోండి: మంచి ఆరోగ్యానికి మీకు దరిదాపుగా 40 రకాలు అయిన చిన్న పోషకాలు కావాలి. ఏ ఒక్కతరహా ఆహారమూ మీకు వాటిని ఇవ్వలేదు. మీ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా వుండవలసినవి: పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు లేదా పదార్థాలు; శాకాహారులు కాకుంటే మాంసం ఉత్పత్తులయిన చేపలు, చికెన్‌, ఇతర మాంసకృత్తులు, అలాగే తృణధాన్యాలు వంటివి. మీరు, ఈ తరహా ఆహారాలను, ఏ మోతాదులో తీసుకోవాలి అన్నదిమీకు అవసరం అయ్యే కేలరీల స్థాయిని బట్టి వుంటుంది.

2) సాధ్యమైనంత ఎక్కువగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోండి.

3) సమతుల శరీర బరువును కొనసాగించండి. మీ శరీరం బరువు ఎంత వుండవచ్చుననేది, పలు అంశాలపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు: మీరు పురుషులా, స్త్రీలా, ఎత్తు, వయస్సు, వారసత్వం లేదా జన్యువుల వంటి అంశాలు ప్రధానమైనవి. స్థూలకాయం వలన పలు వ్యాధులు రావచ్చు. మచ్చుకు: రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం, కొన్నిరకాల క్యాన్సర్లు మొదలైనవి చెప్పుకోవచ్చును. అయితే, దీనితో పాటుగా మీ శరీరం వుండాల్సినంత బరువును కలిగి లేకపోవడం కూడా ప్రమాదమే. దీనివలన: ఎముకల సమస్యలు, బుుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చును. కాబట్టి మీ శరీరంబరువు అతిగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వైద్యుల సలహాతో మీ ఆహార అలవాట్లను మార్చుకోండి. అలాగే, క్రమం తప్పని వైద్యం కూడా శరీరం బరువును తగిన స్థాయిలో ఉంచుకోగలిగేటందుకు ప్రధానం.

4) పరిమితంగా, వైవిధ్యంతో ఆహారాన్ని తీసుకోండి. ఏ ఒక్క ఆహార పదార్థాన్ని శృతిమించి తీసుకోకుంటే, భిన్నమైన ఆహార పదార్థాలను మీరు క్రమం తప్పకుండా, తీసు కోగలుగుతారు.

5) సమయ బద్ధంగా ఆహారం తీసుకోండి: తగిన సమయంలో, తగినంతఆహారం తీసుకోకపోవడం వలన శృతిమించి ఆకలి ఏర్పడితిన్నప్పుడుఒకేసారి, అతిగా తినే అవకాశం ఉంది. శృతిమించిన ఆకలితో ఆహారపు పౌష్ఠిక విలువల గురించి విస్మరించే ప్రమాదం ఉంది. భోజనానికీభోజనానికి నడుమ అల్పాహారం మంచిదే అయినా, అల్పాహారాన్ని అతిగా తీసుకుంటే అదే పూర్తిస్థాయి భోజనంగా తయారవ్వగలదు.

6) కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మెనూలోంచి తొలగించవద్దు; తగ్గించండిచాలు. మనలో పలువురం ఆహారాన్ని దాని పౌష్ఠిక విలువలతో పాటుగా, రుచికోసం కూడా తీసుకుంటాం. మీకు ఇష్టమైన ఆహారంలో కొవ్వు పదార్థాలూ,ఉప్పు లేదా తియ్యదనం (పంచ దార వంటివి) అధికంగా ఉంటేవాటిని పూర్తిగా వదిలివేయడం కంటే (వైద్యులుదీనికి భిన్నం గా చెబితే మినహా) వాటిని పరిమితంగా, తీసుకోండి. లేదా బాగా తక్కు వగా తీసుకోండి. ఈ రకం పదార్థాలు ప్రధానంగా ఉండేమీ ఆహారాలను గమనించుకొనిఅవసరం అయితే, మార్పులు, చేర్పులు చేసుకోండి.

7) ఒక నిర్ణీత కాల వ్యవధిలోమీ ఆహార సమతుల్యతను కొనసాగించండి: ప్రతీ ఆహారం ''అత్యుత్తమం''గా వుండాల్సిన అగత్యం లేదు. అతిగా క్రొవ్వులు, ఉప్పులు లేదా తియ్యదనం ఉన్న పదార్థాలనువాటితో సమతుల్యతనుకాపాడగల ఇతరేతర ఆహారాలతో కలిపి తీసుకోండి. ఒకరోజు, ఆహారంలో గనుకఈ సమతుల్యత లోపిస్తే, మరుసటిరోజున ఈ సమతుల్యతను కొనసాగించే విధంగా ఆహారం తీసుకోండి. లేదా ఒక నిర్ణీత కాలవ్యవధినిఈ సమతుల్యతను కొనసాగించండి.

8) మీ ఆహార స్వీకరణలో లోపాలను గమనించండి: మీ ఆహారపు అలవాట్లను మెరుగు పరుచుకునేందుకు దాని తాలూకు లోపాలను గమనించండి. కనీసం,మూడు రోజు లపాటు వరుసగామీరు తీసుకునే ఆహార పదార్థాల జాబి తాను రాసుకోండి. మీరు అతిగా క్రొవ్వు పదార్థాలూ, మాంస కృత్తులూ, పిండి పదార్థాలను తీసు కుంటున్నారేమో: గమనించండి. తర్వాతమీ, ఆహారంలో వీటిని పూర్తిగా తొలగించడం బదులుగా వాటి మోతాదును పరిమితం చేయండి. అలాగే, పండ్లు, కూరగాయలను తీసుకోవడంమీ శరీరంలో సమతుల పోషకాలకు తప్పనిసరి.

9) ఈ మార్పులు మెల్లమెల్లగా చేయండి. ఒకేసారి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చును. కాబట్టి, ప్రయత్న పూర్వకంగా, మెల్లమెల్లగా వాటిని మార్చుకోండి.

10) ఏ ఆహారమూ పూర్తిగా మంచిది లేదా చెడ్డది కాదు:ప్రతీ ఆహార పదార్థంలోనూదాని గుణానికి అనుగుణం అయిన పోషకాలు వుంటాయి. కాబట్టి, దానిని పూర్తి గా పరిత్యజించనవసరం లేదు. పరిమితి మరచిపోకుంటే చాలు.

మరికొన్ని విశాలాలకోరకు - > సంపూర్ణ ఆహారము

===================================================================
visit my website : Dr.seshagirirao.com

Saturday, December 26, 2009

కంటి కింద నల్ల మచ్చలు , UnderEye skin Black colour




కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు--కళ్లు... నిశ్శబ్దంగానే అనేక అంశాలు వెల్లడిస్తాయి. మరి కళ్ల కింద ఏర్పడే వలయాలు...ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అనేక అనారోగ్యాలకు సూచనలు ఇస్తాయి. అసలు... ఈ నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా?

‘‘కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి...!’’ అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త’లు ఇవి...


డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

కంటి కింది నలుపునకు కారణాలు:
  • ఎడతెరిపిలేని కంటి దురద,
  • నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు....),
  • అటోపిక్ డెర్మటైటిస్,
  • అలెర్జీలు,
  • హె ఫీవర్,
  • దుమ్ము,
  • ఎగ్జిమా,
  • పాలిపోవడం: ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది.
  • ఐరన్ లేదా విటమిన్ లోపాలు,
  • వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు :
  • వయసు--మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి..,
  • డి-హైడ్రేషన్ ,
  • వంశపారంపర్యం-- కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి.
  • జీవనశైలి-- పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం... వంటివి.
  • ముక్కు సమస్యలు: కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి)
  • పిగ్మెంటేషన్,
  • సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం.,
  • క్యాచెక్సియా(Cachexia),
  • అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం..


ప్రధాన కారణం......
రక్తకేశనాళికల చివరలు చిట్లడం :
రక్తనాళాల చివరను రక్తకేశనాళికలు అంటారు. అంటే వెంట్రక అంత సన్నగా ఉండే రక్తనాళాలన్నమాట. వీటినే క్యాపిల్లరీస్ అంటారు. కనురెప్పల్లో చివరన ఉండే రక్తకేశనాళికల చివరలు చిట్లడం, అందులోని ఎర్ర రక్తకణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురునీలం రంగులో కనిపిస్తుంటుంది. అక్కడి చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటికింది భాగం నల్లగా, ముదురునీలంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా ఇవి కళ్ల కింద ఇలా వలయాల్లా కనిపిస్తుంటాయి. .

చికిత్స
ఇటీవల కంటికింది నలుపును తగ్గించుకోడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాధారణ మేకప్ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి.

హైపర్ పిగ్మెంటేషన్:
ఎండకు ఎక్కువగా ఎక్సపోజ్ అవడం వల్ల చర్మం నల్లగా మారి మచ్చలాగా కనిపించడం జరుగుతుంది. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి, కనురెప్పలకు కూడా పాకితే కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా కళ్లు, కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం మొదటగా చేయాల్సిన పని.

గుంటకళ్లు: కొందరిలో కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కనుగుడ్డు లోపలికి ఉంటుంది. దాంతో కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. కనుగుడ్డు కింద ఉండే కొవ్వు పదార్థం లోపించడం వల్ల చాలామందిలో ఇది అనువంశికంగా కనిపిస్తుంటుంది. కంటికింద కొవ్వునింపడం, (ఫ్యాట్ గ్రాఫ్టింగ్), బ్లఫరోప్లాస్టీ వంటి శస్తచ్రికిత్సల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. కొందరిలో శస్తచ్రికిత్స చేయకుండానే కంటి కింద డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్ల ద్వారా చాలా తక్కువ గాటుతో చేసే శస్తచ్రికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. డెర్మల్ ఫిల్లర్స్ అంటే చాలా మృదువైన కణజాలంతో అక్కడి ఖాళీని భర్తీ చేయడం అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా కూడా కంటికింది నల్లమచ్చల వలయాలకు చికిత్స చేయవచ్చు.

నివారణ ఇలా...
డార్క్ సర్కిల్స్‌కు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖకాంతి కోసం లేజర్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి.

  • తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
  • సమతులాహారం వేళ ప్రకారం తీసుకోవాలి.
  • వంశపారంపర్యంగా వచ్చే వలయాలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు.
  • మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • శారీరక వ్యాయామాలు మనసునూ ఉత్తేజంగా ఉంచుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి రిలాక్సింగ్‌గా ఉంటారు. అందుకని రోజూ 30 నుంచి 60 నిమిషాలు శారీరక
  • వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • చల్లని నీటిలో ముంచిన కాటన్‌ని అలసిన కళ్లపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
  • కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి.
క్రీములతో...
  • హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తే... వాటిని కొన్ని పూత మందుల (క్రీమ్‌ల) ద్వారా తగ్గించవచ్చు. డాక్టర్‌ల సలహా మేరకు హోడ్రోక్వినైన్, కోజిక్యాసిడ్, ఆర్‌బ్యుర్టిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్‌లు వాడటంతో నల్లటి వలయాలకు చికిత్స చేయడం సాధ్యమే. అర్జనైన్ వంటి హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండే కెమికల్ పీలింగ్‌తోనూ (అంటే... పూత మందు రాశాక కాసేపాగి అది పొరలా ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం) వాటిని తొలగించడం ఇప్పుడు సాధ్యమే. అయితే ఇది ఒకేసారిగాక కొన్ని సిట్టింగ్స్‌లో చేసే ప్రక్రియ.

చిట్కాలు


నిద్రలేమి
, దిగులు ఆందోళన ... ఇలా కారణము ఏదైనా కావొచ్చు దీర్గాకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలనుఏర్పరచడం ద్వారా ముఖ సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలుఉన్నాయి .. ఉదా :
  • *బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది . ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు . బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి . ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమము గా విరుగుతుంది .
  • * ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్‌ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
  • * నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి.
  • * బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
  • * కాసిని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కంటిచుట్టూ ప్యాక్‌లా వేయాలి. ఆరాక కడిగేస్తే చాలు.. ఎంతో మార్పు కనిపిస్తుంది.
  • * మీరు వాడే మేకప్‌ సామగ్రిలో మీ చర్మతత్వానికి నప్పే కన్సీలర్‌ను తీసుకోండి. దీన్ని నల్లనివలయాలు కనిపించకుండా చేయవచ్చు. కంటి అడుగున రాసుకుంటే చాలు.
  • * మంచి నీళ్లు సమృద్ధిగా తీసుకోవాలి. సమయానికి నిద్ర పోవడం కూడా తప్పనిసరి.
  • * కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
  • ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును . విటమిన్ల లో "కే"విటమిన్క్ష్ కి ఇదే గుణము (SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు ' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
" కే విటమిన్ పుస్కలము గా లభించే ఆహారపార్దాలు :
  • క్యాలీఫ్లవర్ ,
  • క్యాబేజీ,
  • బ్రాకోలి,
  • క్యారెట్ ,
  • బీన్స్ ,
  • సోయాబీన్స్,
  • దోసకాయ ,
  • పచ్చిబతానీలు ,
  • కాలేయము(Liver) ,
  • చేప నూనె,
  • పెరుగు ,
  • పాలు ,
  • అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ ,
  • ===============================
Visit my website -> Dr.seshagirirao.com/

Friday, December 25, 2009

ఆయుర్వేదము , Ayurvedic Medicine




ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరవాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.

ఆయుర్వేదం మందు : ప్రక్రుతి లో దొరికే , మందుగా వాడ దగ్గ ఆకులు , కాయలు , vaeLLu , పువ్వులు , గింజలు(విత్తనాలు) , బెరడు , మందు గా వాడే లోహాలు , మూలకాలు , రసాయనాలు ... ఒక్కటిగా గాని , కలిపిగాని ... లేహము రూపం లోనో , పౌడర్ రూపం లోనో , టానిక్ రూపంలోనో , పచ్సిగానో .. వండి గాని రోగానివారణకు వాడే దాన్నే ఆయుర్వేదిక్ ఔషదం అంటాము . ( definition : Crude extract of naturally available leaves , roots ,barks, flowers , nuts , medicinal metals , medicinal minerals , medicinal chemicals ... used as medicine).

ఆయుర్వేదం (Ayurveda) . దీనిలో అనేక సాంప్రదాయములు కలవు. ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు .

  • పౌరాణిక గాథలు

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకొనిరి అన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ
ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.

  • చారిత్రక ఆభివృద్ధి

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశి రాజగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.


  • ఇతర వైద్యవిధానాలతో పోలిక

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు మరియు రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.

మరికొన్ని వివరాలకు -> ఆయుర్వేదం
  • ========================

visit my web blog -> Dr.seshagirirao.com

Thursday, December 24, 2009

శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌, Dry Fruits - Energy




శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.

బాదం పప్పు...


బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.

రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

జీడిపప్పు...


శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.

ఎండు ద్రాక్ష...


ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.

ఖర్జూరపు పండ్లు...


ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.

అంజీర్‌ పండు....


ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.