Saturday, January 2, 2010

ప్రధమ చికిత్స , First Aid

ప్రథమ చికిత్స - ప్రపంచ ప్రధమ చికిత్స దినోత్సవం (World First-Aid Day)

పథమ చికిత్స అనగా జబ్బు వచ్చినప్పుడుగాని, ప్రమాదము సంభవించినప్పుడు గాని తాత్కాలికముగా చేయు సహాయము. వైద్య సహాయము లభించే వరకు సేదదీర్చుటయే దాని ముఖ్యోద్దేశము. వ్యాది ఎంత చిన్నదయినా , పెద్దదయినా , చిన్న గాయమే అయినా , పెద్ద దెబ్బ తగిలినా ముందుగా కావాల్సింది , చేయాల్సింది ప్రాధమిక చికిత్స . ప్రాణాల్ని కాపాడేది , వ్యాధి తీవతను అదుపుచేసేదే ఈ ప్రధమ చికిత్సే .

గాయపడిన వారికి ప్రథమ చికిత్స అను శాస్త్రము ఔషధ చికిత్స, శస్త్ర చికిత్స అను వాని ముఖ్య సిద్ధాంతముల ననుసరించియున్నది. ఈ శాస్త్ర జ్ఞానము వలన ఆకస్మికముగా దెబ్బగాని, గాయముగాని తటస్థించినపుడు డాక్టరు వచ్చే లోపల రోగి ప్రాణమును నిలుపుటకు శిక్షణ నొందిన వారికి సాధ్యపడుచున్నది.

చిన్న గాయాలకు పెద్ద ఉపశమనం ఇలా...

మారుతున్న కాలానుగుణంగా వ్యాధుల తీవ్రత తెగ పెరుగుతోంది... దీనికి తోడు ఆకస్మికంగా ఇళ్లలో జరిగే వివిధ పరిణామాల వల్ల ఏర్పడ్డ గాయాలకు జరుగుతున్న ప్రమాదాలకు ముందస్తు చికిత్సని మీరే అందించడం ద్వారా వెంటనే ఉపశమనం లభించేందుకు ఇంట్లోనే.... తక్షణ వైద్యం చేసుకోవటం ద్వారా కొంత ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తప్పనిసరి..

చేయి తెగితే...

చాలా మంది మహిళలకు ఎదురవుతుందీ సమస్య. అలాంటప్పుడు వెంటనే ధారలా పడుతున్న కుళా యి నీటి కింద చేయిని ఉంచడం మనకు తెలిసిందే. కానీ దానివల్ల రక్తస్రావం మరింత అధికమవుతుంది. అందుకే... గాయమైన చోటును మరోవేలితో గట్టిగా నొక్కి పెట్టాలి. దీన్ని ప్రెషర్‌ బ్యాండేజీ అంటారు. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉంచాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది. ఆ తరువాత పట్టీ లాంటిది చుట్టుకోవచ్చు. నేరుగా పట్టీ చుట్టకుండా దూదిని ఉంచి... ఆ తరువాత పట్టీ కట్టాలి. దూది ఉంచినా కూడా రక్తస్రావం అవుతుంటే దానిపైన మరొకటి ఉంచాలి తప్ప.. మార్చకూడదు.

నూనె చిందితే...

వంట చేస్తున్నప్పుడు వేడివేడి నూనె చిందడం... వేణ్నీళ్లు చేయిజారి మీదపడిపోవడం.. వంటి సమ స్యలు కొన్నిసార్లు తప్పవు. ఆ పరిస్థితి ఎదురైన ప్పుడు సన్నగా వచ్చే కుళాయి నీటికింద గాయమైన భాగాన్ని ఉంచాలి. ఈ జాగ్రత్త చిన్నచిన్న కాలిన గాయాలకు మాత్రమే. ఎలాంటి ఆయింట్‌మెంట్‌, క్రీం రాయకూడదు. గాయాలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యు ల్ని సంప్రదించాలి.

కాలు బెణికితే...

గబగబా ఇంటిపనులు చేస్తున్నప్పుడు, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తూలడం, కిందపడటం, కాలు బెణకడం జరుగు తుంటుంది. అలాంటప్పుడు ప్రతీది ఫ్రాక్చర్‌ కాదు. భరించలేని నొప్పి, వాపు, కాలు కదల్చలేని పరిస్థితి ఉన్న ప్పుడు మాత్రమే ఫ్రాక్చర్‌ లేదా ఎము క పక్కకు జరిగి ఉండవచ్చని పరిగణిం చాలి. కేవలం బెణికితే భయపడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వెంటనే నడవడానికి ప్రయత్నించ కూడదు.

బెణికిన చోట ఉన్న జాయింట్‌పై, కింది భాగాలను ఎట్టిపరిస్థితుల్లో కదలించకూడదు. వెడల్పాటి కర్ర లేదా అట్టతో బెణికిన చోటుకు ఆసరాలా చేసుకుని ఆ తరువాత వైద్యుల్ని సంప్రదించాలి. ఈ సూచన ఫ్రాక్చర్‌కూ వర్తిస్తుంది. మెడకు గాయమైతే.. దాన్ని కదల్చకుండా ఉంచాలి. లేదంటే ఆ ప్రభావం వెన్నెముకపై పడవచ్చు. అలాగే తలకు దెబ్బతగిలితే... అంత కన్నా ముందు వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా అన్నది నిర్థారించు కునేందుకు మాట్లాడించాలి.

ముక్కు నుంచి రక్తస్రావం..

పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ కొన్నిసార్లు ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని నియంత్రించాలంటే... తలను కొద్దిగా కిందకు వంచి ముక్కు మధ్య బాగాన్ని వేళ్లతో నొక్కిపెట్టాలి. అలా కనీసం నాలుగు నిమిషాలు ఉండాలి కాబటి.. నోటి నుంచి గాలి తీసుకోవాలి. క్రమంగా రక్తస్రావం తగ్గుతుంది.

పదార్థం అడ్డు తగిలితే..

భోంచేస్తున్నప్పుడు.. కాస్త గట్టిగా ఉన్న పదార్థం ఏదైనా శ్వాస తీసుకునే గొట్టం లోకి చేరడం.. ఊపిరి అందక ఇబ్బంది పడటం చాలా మందికి అనుభవమే. ఆ ఉక్కిరిబిక్కిరి తగ్గాలంటే వీపు మీద నెమ్మదిగా కొట్టి నట్లు చేయాలి. లేదంటే కొద్దిగా ముందు కు వంచి, పొట్టపై భాగంలో నొక్కినట్లు చేస్తేచాలుసమస్య అదుపులో వచ్చేస్తుంది.

కళ్లల్లో దుమ్ము..

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కళ్లల్లో దుమ్ము పడటం సహజం. అలాంటప్పుడు దుమ్ము పడిన కన్నును శుభ్రం చేయాలి. ఆ వెంటనే మెత్తని వస్త్రంతో కంటిని కాసేపు మూసేయాలి. అంతేకానీ రుద్దకూడదు. దానివల్ల కన్ను ఎర్రగా మారిపోతుంది.

చెవిలో చీమలు దూరితే..

నేలపై పడుకున్నప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. దాన్ని బయటకు లాగేందుకు చెవిలో పిన్నులు, ఇయర్‌బడ్స్‌ లాంటివి పెడితే కర్ణభేరికి హాని తప్ప దు. అందుకే చాలా కొద్దిగానీళ్లు తీసుకుని చెవిలో పోసి... ఆ తరువాత ఓ పక్కకు వంచినట్లు చేయా లి. నీళ్లతోపాటు చీమ కూడా వెలుపలికి వచ్చే స్తుంది.

తీవ్రమైన జ్వరానికి..

ఈ సమస్య పిల్లల్లో ఎక్కువ. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్నప్పుడు చాలామంది తడి వస్త్రాన్ని నుదుటిపై వేస్తుంటారు. బదులుగా ఏం చేయా లంటే.. మరీ మందంగా ఉన్న దుస్తులు ధరించేలా చూడాలి. ఆ తరవాత పడుకోబెట్టి పైన పలుచని దుప్పటి కప్పాలి. మరీ చల్లగా అలాగని వేడిగా లేని గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి... శరీర మంతా ఒకేసారి కాకుండా.. చేతులు, కాళ్లు, వీపు, నుదురు.. ఇలా ఒక్కో భాగాన్ని తుడవాలి. క్రమం గా ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుతుంది.


పిల్లలు కిందపడితే...

ఆటపాటల్లో భాగంగా పిల్లల మోకాళ్లు, కాళ్లకు తరచూ చిన్న చిన్న గాయాలవుతుంటాయి. ఆ భాగాన్ని ముందుగా యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. దుమ్ముపడే ఆస్కారం ఎక్కువగా ఉన్న ట్లయితే కట్టుకట్టాలి. సాధ్యనమైనంతవరకు ఆ భాగా నికి విశ్రాంతి ఇస్తేనే.. గాయం త్వరగా మానుతుంది.

పాము, కుక్కకాటు..

సాధారణంగా పాము ఎక్కువగా కాళ్లదగ్గరే కాటేస్తుంది. దాన్నుంచి వచ్చిన విషం మిగతా శరీరానికి చేరకుండా కాటేసిన చోటుకు అటూఇటూ బిగుతుగా కట్టేస్తాం. కానీ అది పొరబాటు. వైద్యులు వచ్చే దాకా కాలును కదిలించకుండా ఉంచాలి. కుక్క కరిస్తే.. ఆ భాగాన్ని ముందుగా నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తరువాత వైద్యుల్ని సంప్రదించాలి.

మరికొంత వివరముగా ఈ క్రింది వాటిలో చూడండి :
====================================
visit my website - > dr.seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.