* ఎగ్జిమాతో బాధపడే పిల్లలకు దురదలు రాకుండా ఉండేటట్లు చూడాలి. వారికి స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి. ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటుంది. లేకపోతే చర్మం పొడిబారి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లలకి ఆయిల్ బేస్డ్ సోపులను వాడటం శ్రేయస్కరం.
* ఇంట్లో దుమ్మూ, ధూళీ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. కార్పెట్లు, కర్టెన్లు, బెడ్‌షీట్లు కూడా శుభ్రంగా ఉంచాలి. ఇదే వ్యాధితో బాధపడే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు 3, 4 నెలల్లోపే ఘనపదార్థాలు ఇవ్వటం వల్ల కూడా ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి.. కనీసం ఆరు నెలలదాకా పిల్లలకు పాలు పట్టించటం ఉత్తమం.
* సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే.. చాలా తక్కువ డోసులో స్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్ లాంటివి వాడవచ్చు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటమేగాక, చలికాలంలో మరింత తీవ్రంగా బాధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
For full Details ->Eczema (in Telugu)
- =====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.