శీతాకాలంలో చల్లనిగాలులు ఆహ్లాదంగా చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమేకాక, దురద కూడా వుంటుంది. పెదాలు పగులు తాయి. ముఖం మీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే యిటువంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే శీతాకాలమంతా అందవికారంగా వుండక తప్పదా అని బాధపడవలసిన అవసరం లేదు. చలికాలంలో చర్మాన్ని సంరక్షించేం దుకు చర్మసౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. వాటి నుపయోగించి వాతావరణ ప్రభావం చర్మంమీద ప్రసరించ కుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
శీతాకాలములో చర్మ సంరక్షణ చాలా ముఖ్యము . ఒక్కొక్క కాలములో ఒక్కక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకుంటూ ఉండాలి . కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . ఎండకాలములో ఒకరకమైన జాగ్రతాలు , వర్షాకాలములో వేరేవిధమైన చిట్కాలు .. శీతాకాలములో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవలసిన అవసరము ఉంటుంది .
చలికాలమనేది చర్మ సంరక్షణ కు అధికప్రాధాన్యత ఇవ్వవలసిన కాలము . ప్రత్యేకించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి తగినంత సమయము వెచ్చించ వలసిన కాలమిది . ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి . డ్రై స్కిన్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా మెలగాలి .
చలి కాలం వచ్చేస్తోందంటే మహిళలు అన్నింటికంటే ముందుగా పొడిబారిపోయే చర్మం గురించే భయపడుతుంటారు. గాలిలో తేమ చలికాలంలో బాగా తగ్గిపోతుంది కాబట్టి చర్మం కూడా ఈ సీజన్‌లో పొడిబారిపోతూ ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం కలవారు.. సాదా చర్మం కలవారు చలికాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిందే మరి.
స్నానం చేయడం, రాత్రిపూట చలిపులి నుంచి చర్మాన్ని ముఖ్యంగా పెదవులను కాపాడుకోవడం, శిరోజాల నిగనిగలు తగ్గిపోకుండా జాగ్రత్తపడటం, సరైన ఆహారం తీసుకోవడం... ఇలా చలికాలం మహిళల చర్మసౌందర్యానికి అన్నీ సమస్యలే మరి.
చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే..
చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు. శరీరంలో తగిన శాతంలో నీరు లేకపోయిన పక్షంలోనే చర్మం, శిరోజాలు జీవం లేనట్లుగా తయారవుతాయి.
అందుకని తాగాలనిపించక పోయినా సరే చలికాలంలో రోజూ పది గ్లాసుల నీరు తాగడం విధిగా పాటించాలి. అప్పుడే చర్మంలోని మలినాలు తొలిగిపోవడమే గాక చర్మం తాజాగా తయారవుతుంది. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.
ఏ కారణం చేత అయినా వ్యాయామం కుదరకపోతే నడక మంచి ఎక్సర్‌సైజ్ అనుభూతిని ఇస్తుంది. చర్మ సౌందర్యానికి, దేహారోగ్యానికి చలికాలంలో మంచినీరు పుచ్చుకోవడం, నడక లేదా వ్యాయామం చాలా ముఖ్యమైనవి. మిగతా అన్ని సౌందర్య లేపనాలు, లేహ్యాలు కూడా దీని ముందు దిగదుడుపే మరి.
ఉపశమనానికి వాడవలసినవి :
వేజలిన్ లేదా పెట్రోలియం జెల్లీ లు వాడాలి . వేజలిన్ బాడీ లోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువు గా ఉంటుంది . టాల్కం పౌడర్లు , ప్యాన్కేక్ పౌడర్లు వాడకూడదు ... ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండి తో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .
ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్ రాసుకొవాలి .
విటమిన్ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .
శీతాకాలము పగుళ్ళకు వేసలైన్ వాడాలి .
లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్ ను ఉపయోగించాలి ,
స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .
సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి ,
రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్ రాసుకోవాలి ,
వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,
పాదాలు పగల కుండా 'సాక్స్ ' వేసుకుంటే మంచిది ,
ఆయుర్వేదిక్ పద్దతులు :
నవంబర్ నెల మొదలైనప్పటినుంచి చర్మం పాడవటం మొదలవుతుంది.'వాతావరణం మారింది, జాగ్రత్త పడాలి' అనే సూచనలు ఇవ్వటం ప్రారంభిస్తుంది మన చర్మం. రాత్రి చలి పెరగటంతో పాటు పగటి ఎండలో తీక్షణత ఏ మాత్రం తగ్గకపోవడంతో బయటకు వెళ్ళేవాళ్ళు రెండిటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకోసం అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోయే కొన్ని ట్రీట్ మెంట్ లు...
- * పాలు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది. పొడి చర్మానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ప్యాక్ వేస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది.
- * గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు సొన, పాలు వేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.
- * స్నానం చేసే నీటిలో అర కప్పు తేనె కలుపుకుంటే చెర్మం మృదువుగా మారుతుంది.
- * పుదీన అకులు, బాదం పప్పులు తీసుకుని తగినంత వేడి నీటిని కలుపుతూ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితొ స్నానం చేయాలి. శీతాకాలం లో వారానికొకసారి ఇలా చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.పిల్లలకు ఈ ట్రీట్‌మెంట్ బాగాపనిచేస్తుంది.
- * పెసర పిండి లేదా శనగ పిండి లో పాలు కలిపి ఆ మిశ్రమంతో ఒళ్ళు రుద్దుకుంటే (సబ్బుకు బదులుగా) చర్మం కాంతివంతమవుతుంది.
- * పచ్చి పసుపులో పాల మీగడ కలిపి ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. క్రమం తప్పకుండా రోజూ ఇలా చేస్తుంటే చర్మం తెల్లబడుతుంది.
- * ఒక టేబుల్ స్పూను శనగపిండిలో అర టీ స్పూను తేనె, ఒక టీ స్పూను పాలమీగడ, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత కడగాలి..
- =====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.