Saturday, December 19, 2009

మూడ్ దిజార్దర్ , Mood Disorder




పూర్వము విలువలు కలిగిన సమాజము లో శరీరమే కాదు బుద్ది కుడా సక్రమము గా ఆరోగ్యము గా ఉంది జీవితాన్ని ఆనందమయము చేసేది . ఆధునిక సమాజములో వ్రుత్తి , ఆర్జన , సమయం లేకపోవడము కారణముగా పద్దెనిమిది ఏళ్ళ వ్యక్తీ నుండి యాబై ఏళ్ళ వ్యక్తీ దాకా వత్తిడి వాళ్ళ విచిత్ర ప్రవృత్తుల తో సతమతమవుతున్నారు . రోజు లో ఎన్నో సార్లు వారి మూడ్ లో మార్పులు చోటిచేసుకుంటున్నాయి . ఆధునిక సమాజములో ముఖ్యం గా పట్టణాలలోను , నగరాల లోను యువతలో ఇది ఎక్కువగా ఉంటుంది . ఈ బై పోలార్ వ్యాది ఉన్నవారి ప్రవర్తనలోనే కాదు వాళ్ళ మేధస్సు (బ్రెయిన్) లోను మార్పులోసతాయి . వీళ్ళలో సాదారణము గా వాళ్ళ ప్రవర్తన మాముల గానే ఉంటుంది . . . ఒక్కొక్క సారి ప్రవర్తన మారిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ కనిపిస్తారు , కోపం వచ్చి బిగ్గరగా అరుస్తారు , వింతగా ప్రవర్తిస్తుంటారు . ఇది కొద్ది కాలము ఉండవచ్చు లేదా చిరకాలము భాదిన్చావచ్చును . మానసిఅక వత్తిడి వల్లనే ఈ విరుద్ద ప్రవర్తన .. మొదట్లో చాలా నెమ్మదిగా ఉన్న ఒక్కొక్కప్పుడు మితిమీరి కనిపించిఅన వస్తువులను పగలగోట్టడము , తనని తానూ కొట్టుకోవడము , కోసుకోవడము వంటి ఉద్రిక్త పరిస్టి లోకి మారుతారు . కొంతమంది ఆడువారు చీరకాల్చు కోవడము , భర్తను ,పిల్లల్ని కొట్టడము వంటివి ఉంటాయి . సాదారణము గా ఈ పరిస్తితి 15 ఏళ్ళ నుండి 35 ఏళ్ళ వరకు ఉంటుంది .
చికిత్స :
  • మానసిక చికిత్స అవసరము . ప్రతి రోజు మంచి ఆలోచనలు , ఆశ ,నమ్మకము కలుగజేసే ఆలోచనలు (Positive) అందించడం.
  • తలకి బ్రాహ్మి తైలము రాయాలి .
  • వారం వారం తలంటి స్నానం చేపించి ప్రశాంతం గా ఉన్న వాతావరణం కలుగజేయాలి .
  • రాత్రి పడుకునే ముందు అరిపాదాలకు నువ్వుల నూనె మర్దన చేయడం మంచిది .
  • ఉద్రేకం కలిగించే ఆహారపదార్ధాలు , మందులు తినకూడదు ,
  • బ్రాహ్మి ,అశ్వగండ , శంకపుస్ప వంటి సహజ ఔషదాలు వాడాలి .
  • మంచి మానసిక వైద్యునికి చూపించాలి . చక్కటి వైద్యం అందజేస్తారు .

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.