సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి. అంటువ్యాధి కాదు. ఎక్కువగా వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది.
* ఇది స్వల్పమైన వ్యాధి దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది.
* ఈ సోరియాసిస్ లక్షణాలు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. (క్రానిక్ డిసార్డర్) దీర్ఘకాలపు చర్మ వ్యాధి.
* ఈ వ్యాధి లక్షణాలు జీవితాంతము వస్తుంటాయి పోతుంటాయి.
* ఈ వ్యాధి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది.
* ఇది అన్ని జాతుల వారికి సంక్రమిస్తుంది.
సోరియాసిస్ కి కారణాలేమిటి?
* ఖచ్చితమైన కారణమనేది తెలియదు. ప్రస్తుత సమాచారం మాత్రం సోరియాసిస్ కి సంబంధించి రెండు కారణాలను సూచిస్తుంది.
1. పూర్వీకుల నుండి పొందడం,
2. ఆటోఇమ్యూన్ ప్రతి స్పందన.
* వ్యక్తులలో కొన్ని జన్యు పరమైన ప్రేరేపణ వల్ల తప్పుడు సూచనలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధకు పంపబడతాయి. దీని వల్ల చర్మకణాల పెరుగుదల చక్రం ఎక్కువవుతుంది. ఈ చర్మకణాలు ఒక దానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇవి త్వరగా రాలిపోవు. సోరియాసిస్ సంక్రమించిన కొందరు వ్యక్తులు కుటుంబ చరిత్ర కలిగి ఉండరు. కొన్ని జన్యువులు దీనికి సంబంధితమైనవి.
ఎర్రటి మచ్చలు, పొలుసులు రాలడం ఎందుకు జరుగుతుంది ?
* చర్మం మీది పైన పొరలోవున్న చర్మ కణాల సంఖ్య ఎక్కువ అవడం వలన చర్మం పొలుసులుగా రాలడం ఎర్ర మచ్చలు పడటం జరుగుతుంది.* సాధారణంగా చర్మ కణాలు నాలుగు వారాలలో పరిపక్వత చెంది శరీరం మీది ఉపరితలం నుండి రాలిపోతుంటాయి
* సోరియాసిస్ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ ప్రక్రియ ప్రతి 3 -4 రోజుల లోపు త్వరగా జరుగుతుంది.* అత్యధికంగా చర్మకణాల ఉత్పత్తి జరగడం వలన సోరియాసిస్ లో చర్మం మీద కణాలు ఏర్పడుతాయి
- సోరియాసిస్ ను ఎలా గుర్తిస్తారు ?
* స్వల్పంగా ఉండచ్చు లేకపోతే ఆకృతి కోల్పోవడం, చేతకాని స్ధితికి రావడం లాంటి తీవ్రమైన స్ధాయికి చేరుకోవచ్చు.
- సోరియాసిస్ లో వివిధ రకాలు ఏమిటి ?
1. ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ చర్మంమీద తీవ్రమైన ఎర్రదనం వాపు వస్తుంది.
2. ప్లేక్ సోరియాసిస్ ఇది సోరియాసిస్ లో అతిసాధారణమైనది.
(80% సోరియాసిస్ ఉన్న ప్రజలకు ఇదే ఉంటుంది.)* ఇది చర్మం మీద ఎర్రగా పొంగిన కనాలను కలుగజేస్తుంది. * ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులను వృద్ధి చేస్తుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడినా, మోకాలు, మోచేతులు,తలమీది చర్మం పైన, మొండెము మరియు గోళ్ళమీద ఎక్కువగా ఏర్పడతాయి.
3. ఇన్వర్స్ సోరియాసిస్ ఇది చర్మం ముడతలలో నున్నగా, ఎర్రటి వ్రణాలను
లిగిస్తుంది.
4. గట్టేట్ సోరియాసిస్ ఇది నీటి బొట్లులాంటి చిన్న చర్మ వ్రణాలను కలిగిస్తుంది.
5. పుస్య్టులార్ సోరియాసిస్ ఇది తెల్లటి, చిక్కటి పదార్ధంతో నింపబడిన బొబ్బలను
కలిగిస్తుంది.
6. సోరియాటిక్ ఆర్రైటిక్ ఇది రుమటాయిడ్ ఆర్రైటిక్ లాంటి ఒక రకమైన కీళ్ళకు
సంబందించిన వ్యాధి.
- సోరియాసిస్ ప్రేరేపించే లేక దుర్భరం చేసే కారణాలు ఏమైనా ఉన్నాయా?
సోరియాసిస్ వ్యాధిని ప్రేరేపించే కారకాలు ,Predisposing factors in Psoriasis
చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి, పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ, తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటి గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.
ఒత్తిడి: ఒత్తిడితో సోరియాసిస్ మరింత తీవ్రం అవుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఒత్తిడిని దరిజేరకుండా చూసుకోవటం ఎంతో అవసరం. ఇందుకు గట్టిగా శ్వాస పీల్చుకొని 1 నుంచి 10 వరకు అంకెలు లెక్కబెట్టటం, సానుకూల దృక్పథంతో ఆలోచించటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటి పద్ధతులను పాటించాలి.
అలర్జీలు: సోరియాసిస్, అలర్జీలు రెండింటిలోనూ రోగనిరోధకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. అలర్జీని ప్రేరేపించే మాస్ట్‌కణాలు సోరియాసిస్ బాధితుల్లోనూ అధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీరు దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు వంటివి పడనివాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది.
మద్యం: అతిగా మద్యం తాగితే వ్యాధి విజృంభించొచ్చు. పైగా కొన్ని సోరియాసిస్ మందులకు మద్యం సరిపడదు. అందువల్ల మద్యం జోలికి వెళ్లకపోవటమే మంచిది. రోజుకు 20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చూసుకుంటే సోరియాసిస్ తీవ్రతను తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
చల్లని/పొడి వాతావరణం: చర్మం పొడిగా ఉంటే పొలుసుల బాధ మరింత పెరగొచ్చు. కాబట్టి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. లోషన్లు, సబ్బులను వాసన లేనివి వాడితే మంచిది. దీంతో సున్నితమైన చర్మం దురద పెట్టకుండా చూసుకోవచ్చు.
మందులు: మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్‌కు చెప్పాలి.
గాయాలు: సాధ్యమైనంతవరకు చర్మానికి గాయాలు కాకుండా చూసుకోవటం మేలు. ఎందుకంటే గాయాలు అయిన చోట చర్మం మీద ఏర్పడే కంతులు సోరియాసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవటం.. షేవింగ్, గోళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పొగ తాగటం: ఈ అలవాటును ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. ఇది సోరియాసిస్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది. పొగ మానేస్తే హఠాత్తుగా వ్యాధి విజృంభించటమూ తగ్గుతున్నట్టు తేలింది.
హార్మోన్లు: సోరియాసిస్ ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 20-30 ఏళ్ల వయసులో.. అలాగే 50-60 ఏళ్ల వయసులో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వనం ఆరంభంలో, మెనోపాజ్ దశలు సోరియాసిస్ పొడలను ప్రేరేపిస్తాయి. ఇందుకు హార్మోన్లు దోహదం చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
- సోరియాసిస్ ఎలా నిర్ధారించబడుతుంది ?
* ఇన్ఫెక్షన్, కానీ మరే ఇతర అస్వస్ధతకు గురియైన మీ వైద్యుణ్ణి సంప్రదించండి.
- సమతుల ఆహారం ముఖ్యమా?
* సోరియాసిస్ కలిగి ఉన్నవ్యక్తులు పాటించవలసిన ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేదు. అయినప్పటికీ కొన్ని ఆహార పద్ధతులు సూచించబడ్డాయి.
- సోరియాసిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?
సోరియాటిక్ కీళ్ళవాపు, ఒక రకమైన కీళ్ళరోగం, ఉన్నకొద్ది మంది వ్యక్తులో వచ్చి వారికి నొప్పిని మరియు చేతకాని స్ధితిని తీసుకువస్తుంది.
- సోరియాసిస్ అంటు వ్యాధా ?
* చర్మానికి హాని కలిగించే దెబ్బల నుండి ,గాయాల నుండి, ఎండ తీవ్రతకు కూడ దూరంగా ఉంచండి. * మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు కమిలేంతగా బయలు పర్చకండి. * మద్యాన్ని మరియు పొగ త్రాగటం మాని వేయండి. * మీ పరిస్ధితిని దుర్బరం చేసే మందులకు దూరంగా ఉండండి. * ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి
- వ్యాధి నివారణ
- చికిత్స :
1. CALDOC Oint.
2, PROPYSALIC Oint.రెండుపూటలా రాయాలి .
చర్మము దురదగా ఉంటే " cetrazine 10 mg "రోజుకి ఒకటి -- అవసరమైనంతకాలము వాడాలి .
స్కిన్ స్పెసలిస్ట్ గారి ... వ్యాసాన్ని చదవండి . క్లిక్ చేయండి - > సోరియాసిస్
- ==============================
were is the sold the medices.
ReplyDeleteDear sir,
ReplyDeleteam infected with Psoriasis. my age is 33 yrsam married. can i partisipated in sex with my wife
Yes, you can participate as it is not a infectious disease, if your partner is willing.
DeleteYes, you can participate happily, if your partner is willing, as this is not infectious disease.
DeleteI am Suffering with the same disease since 3 years, it is in starting stage like red color bubbles. can i apply the said OIL on head? please suggest what is the exact treatment for food items like vegitables..
ReplyDeleteThanks for this great article…
ReplyDeleteplz i want medicen ourjently plz i no this pain very very hot plz help me sir
ReplyDeleteReally wonderful arrival. Helped us lot. Suffering with this diese from last 9 years . Applied suggested ontime. Miracle happened all the scars gone in 30 days
ReplyDeleteThank you so much Sir.