Saturday, April 2, 2011

గుండెపోటు సూచనలు,Heart attack hints



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండెపోటు సూచనలు,(Heart attack hints)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె రక్తనాళంలో కొవ్వు పేరుకుని, కొలెస్ట్రాల్‌ రక్తంలో గడ్డకట్టి గుండె కండరానికి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరం దెబ్బతింటుంది. దీన్ని గుండెపోటంటారు. గుండెపోటు వివిధ లక్షణాలతో కనిపిస్తుంది. ఛాతిలో నొప్పి, ఎడమచేయి లాగడం, కింది దవడ లాగడం, కడుపులో మంట, తల తిప్పడం, శ్వాసలో ఇబ్బంది, గుండెదడ, ఎక్కిళ్లు బాగా రావడం, భుజాలు లాగడం వంటివి.

గుండెపోటు తీవ్రతతో ప్రధాన రక్తనాళం మొదటి భాగం బ్లాక్‌ అయినప్పుడు, గుండె కండరాలు బాగా దెబ్బతిని, గుండె కండరం సరిగా పనిచేయక రక్త పీడనం పడిపోవడం (లోబిపి), గుండె ఆగిపోవడం శ్వాసలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి మరణానికి దారి తీసే ప్రమాదముంది. చిన్న రక్తనాళం బ్లాక్‌ అయినప్పుడు ఛాతినొప్పి వచ్చి తగ్గిపోతుంది. కొద్దిమందికి తెలియకపోవచ్చు. పరీక్షల ద్వారా భవిష్యత్తులో వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందా, లేదా అని నిర్ధారించవచ్చు. గుండెపోటు వచ్చే అవకాశమున్నట్లైతే యాంజియోగ్రాం చేసి బైపాస్‌, యాంజియోప్లాస్టి స్టెటింగ్‌ చేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండెపోటు వచ్చిన వారికి దగ్గరలో ఉన్న గుండె వ్యాధుల నిపుణులను సంప్రదించి, త్వరగా వైద్యసేవలు తీసుకున్నట్లైతే గుండె కండరం దెబ్బతినకుండా నివారించి, ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. గుండెపోటు ఉన్నవారికి నొప్పి వచ్చి ఆరు గంటల్లోపు త్రోంబోఐటిక్‌ థెరఫి (స్ట్రెఫోటోకెనిస్స్‌, యురోకెనిస్స్‌, టిపిఎ ఇంజక్షన్‌ ఇవ్వడం) ద్వారా చాలా మందికి కండరం దెబ్బతినకుండా ప్రాణాపాయం సంభవించకుండా ఉపయోగముంటుంది. ఎంత త్వరగా వైద్య సేవ లభిస్తే అంత మంచి ఫలితాలు కన్పిస్తాయి. వైద్యసేవలు అలస్యమైతే ఉపయోగముండదు. ముందు వచ్చిన వారికి, ఆలస్యంగా వచ్చిన వారికి వైద్యసేవ ధరల్లో తేడా లేకున్నప్పటికీ ఆలస్యంగా వచ్చిన వారి కంటే ముందు వచ్చిన వారికి వైద్యసేవ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు వచ్చిన మొదటి గంటను వైద్యభాషలో గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సత్ఫలితాలకు అవకాశం ఎక్కువ. గుండెపోటు వచ్చిన మూడుగంటల తర్వాత వారికి యాంజియోప్లాస్టి, సెట్టింగ్‌ వల్ల త్రాంబోలైటెక్‌ యాంజియోప్లాస్టి సెట్టింగ్‌ వల్ల ఉపయోగాలు, త్రాంబోథెరఫికి సమానంగా ఉంటాయి. ప్రాణాంతకంగా ఉన్న రోగికి ఎక్కువగా యాంజియోప్లాస్టి రికమండ్‌ చేస్తారు. హైరిస్కు పేషెంట్‌ అంటే గుండెపోటు వచ్చినప్పుడు లోబిపి, గుండె రేటు ఎక్కువగా ఉండి శ్వాస బాగా ఇబ్బందిగా ఉంటుంది. వీపరీతంగా నొప్పి వచ్చి, మందులతో తగ్గకపోయినా, గుండెరేటులో అవకతకవలు (ఎక్కువ, తక్కువ) వచ్చి ఉన్నప్పుడు గుండె కండరం చిట్లినప్పుడు, గుండెవాల్స్‌ లీకైనప్పుడు ట్రీట్‌మెంటుతో అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి అతి త్వరగా యాంజియోప్లాస్టి స్టెటింగ్‌ లేదా సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయడం ద్వారా చాలా మందిని ప్రాణప్రాయస్థితి నుంచి కాపాడవచ్చు. గుండెపోటు ఎక్కువగా ఉన్న వారు గుండెపోటు లక్షణాలు, అవస్థలు తగ్గేవరకు ఇన్సెంటివ్‌ కేర్‌లో ఉండాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చినా ఎక్కువగా గాలివీచే ప్రదేశంలో కూర్చోబెట్టి, అరమాత్ర సారబిట్రీట్‌ టాబ్లెట్‌ నాలుక కింద ఉంచి, ఎస్ప్రిన్‌ మాత్ర మింగించాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్‌ వద్దకు వెళ్లి ఇసిజి తీసుకుని గుండెపోటు నిర్ధారించుకోవచ్చు. గుండె పోటు 25 సంవత్సరాలు దాటిన పురుషుల్లో, 40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో వస్తోంది. అధికంగా బరువు ఉండి, రక్తపోటు, మధుమెహ వ్యాధి, రక్తంలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు రక్తపోటు లక్షణాలున్నవారు. ఆలస్యం చేయకుండా వైద్యనిపుణుల సలహాలు తీసుకున్నట్లైతే చాలా వరకు ప్రాణాపాయస్థితి నుంచి రక్షించబడతారు. ఆలస్యం జరిగితే గుండె ఆగిపోయి ఆకస్మిక మరణం సంభవించే అవకాశముంది. గుండె కండరం దెబ్బతిని, భవిష్యత్తులో గుండె ఫెయిల్యూర్‌ కావడం వల్ల నాణ్యమైన జీవితం దెబ్బతింటుంది. (కాళ్లవాపు, అలసిపోవడం, ఆయాసంతో ఇబ్బందులు పడుతారు) ఎక్కువ గుండెనొప్పి వచ్చిన వారికి గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి త్రాంబోఎంబాలిజమ్‌ అనే పరిస్థితి దాపురించి, పక్షవాతం సంభవించవచ్చు. గుండె కొట్టుకునే విధానంలో అవకతవకలు(అరిథమైయాస్‌) ఏర్పడి ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది.

గుండెపోటు వల్ల వచ్చే నష్టాలను వైద్యున్ని త్వరగా సంప్రదించి, త్వరగా చికిత్స పొందినట్లైతే నివారించవచ్చు. గుండెపోటు వచ్చిన వారు అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. నూనె వస్తువులు, పాస్ట్‌ఫుడ్స్‌ (బయటి ఫుడ్స్‌) ఎక్కువగా తీసుకోవద్దు. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతిరోజు అరగంట జాగింగ్‌ గానీ, వాకింగ్‌ గానీ, స్విమ్మింగ్‌ చేయడం శరీరానికి మంచిది. తరచుగా షుగర్‌, బిపి, కొలెస్ట్రాల్‌ చెకప్‌ చేయించుకుంటూ సిగరెట్‌, గుట్కాలు పూర్తిగా మానేేయాలి. మటన్‌, చికెన్‌ అధికంగా తీసుకోవద్దు, అధికంగా తీసుకున్న వారు వాటికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ఫిష్‌ను తీసుకోవచ్చు. గుండె పోటు వచ్చిన వారు వైద్యుల సలహాల ప్రకారం మందులు వాడాలి.


  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.