అందాన్ని పెంచేవి దుస్తులేకాదు, మీరు తొడిగే దుస్తులకు మేచింగ్‌గా వేసుకునే పాదరక్షలు కూడా మీ అందాన్ని యినుమడింప చేస్తాయి. పూర్వం పాదరక్షలని యెందుకన్నారంటే పాదాన్ని రక్షించేది కనక పాదరక్షలు అన్నారు. ప్రస్తుతం పాదరక్షలు అన్న పదానికి పాదములకు అందమునిచ్చేవి అని అర్థం చెప్పుకోవాలి. ఆభరణాలు, దుస్తులు ఏ విధంగా వ్యక్తికి అందాన్నిస్తాయో చెప్పులు, బూట్లు కూడా వ్యక్తికి అదేవిధంగా ఒక స్టేచర్‌ని కల్పిస్తాయి.
పాదరక్షలలోకూడా అనేక రకాలున్నాయి. ఒక్కొక్క రకం పాదరక్షలను ఒక్కొక్క రకమైన ఫంక్షన్సుకు వుపయోగిస్తారు. ఫంక్షన్సుకు వేసుకునే దుస్తులకు సరి పోయే పాదరక్షలనే వాడాలి. పూర్తి సూటుగాని, సాఫారీ సూట్‌గాని వేసినప్పుడు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. చెప్పులు ఎబ్బెట్టుగా వుంటాయి. పైజమా వేసుకునేప్పుడు చెప్పులే ధరించాలి. బూట్లు వేసుకోవడం వింతగా వుంటుంది.
చీర కట్టే వారికి పాదాలు కనిపించవు, కనుక ఏ చెప్పులు వేసుకున్నా ఫరవాలేదు. ఈ రోజుల్లో పాదాలు కనబడే విధంగా సుర్వాలు, కుర్తాలు, కమీజులు, పాంట్లు వేస్తున్నారు
ఎత్తు మడమల చెప్పులు వేసుకుంటే చూడ్డానికి స్త్టెలిష్‌గా కనిపించొచ్చు. కానీ వాటి ఎత్తు పెరిగేకొద్దీ మడమలపై భారం పెరిగిపోతుంది . సాధారణంగా మనం నిలబడినప్పుడు మన శరీరభారాన్ని మోసేది పాదాలే. చెప్పుకుండే హీల్ ఒక అంగుళం ఎత్తు ఉంటే మడమలపై భారం మామూలుకన్నా 22 శాతం అధికమవుతుందట. రెండు అంగుళాల ఎత్తుంటే ఆ భారం 57 శాతం పెరుగుతుంది. మూడంగుళాల ఎత్తు చెప్పులు వేసుకుంటే 76శాతం అధికభారం మడమలపై మోపినట్టే. దీర్ఘకాలం పాటు ఇలాంటి చెప్పులే వాడితే పాదాల కండరాలు బలహీనపడి మామూలు చెప్పులు వేసుకున్నా నడవటమే కష్టమవుతుంది . ఒకవేళ ఎత్తుమడమల చెప్పులు వేసుకుని పార్టీలకు వెళ్లినా నాలుగు గంటలకు మించి వాటిని పాదాలకు ఉంచుకోవద్దు. విధిలేని పరిస్థితుల్లో ఎక్కువసేపు అలా ఉండాల్సివస్తే ఇంటికి వెళ్లగానే ఐస్ తో కాపడం పెట్టుకోవాలి .
ఎత్తు పాదరక్షలు (పాదాభరణాలు ) ధరించడం వల్ల కలిగే కష్టాలు :
- శరీర బరువంతా పాదాలపై పడటం వల్ల పాదాల నొప్పి తప్పదు.
- వీటిని ఎక్కువ సమయం ధరిస్తుంటే.. కొన్నాళ్లలో నడుం, వెన్నునొప్పులు బాధిస్తాయి.
- ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని అటూఇటూ మారుస్తుంటాయి. దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నెముక మీద చాలా అదనపు భారం పడుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.
- మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్(ఎముకుల డాక్టర్)లు అంటున్నారు.
సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే
- ఒకవేళ ప్రతిరోజు అయితే.. 1 - 1.5 అంగుళాల పొడుగున్నవి ఎంచుకోండి. ఇంకా ఎత్తు చెప్పుల్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకోండి.
- ఇలాంటివి ధరిస్తున్నప్పుడు పాదాలు పక్కకు వంగినట్లు అవుతాయి. ఎత్తు ఎక్కువగా ఉన్నకొద్దీ ఈ సమస్య తప్పదు. అందుకే.. ఒకటికి రెండుసార్లు వేసుకుని చూసి.. సౌకర్యంగా అనిపించినప్పుడే కొనుక్కోండి.
- ఎంతో ఇష్టపడి ఎంచుకున్నా కూడా కొన్నిసార్లు ఎలాంటి మడమల్లేని పాదరక్షల్నీ ధరిస్తుండాలి. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ చెప్పుల్ని వేసుకోవాలి. అప్పుడప్పుడు వట్టికాళ్లతో నడవాలి. ఇది పాదాలకు సౌకర్యాన్నిస్తుంది. ఈ తరహా పాదరక్షల్ని ఎనిమిది నుంచి పదిగంటలకు మించి ధరించకపోవడమే మంచిది.
- కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అరిపాదాలకు రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలి. దీనివల్ల పాదాల నొప్పుల్ని నివారించవచ్చు.
- ఎత్తు మడమల చెప్పులతో ఎదురయ్యే వెన్నునొప్పుల్ని నివారించేందుకు.. నడక, యోగా.. ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.
- =======================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.