Saturday, May 31, 2014

Obesete in menopausal stage prablems awareness, స్థూలకాయము మెనోపాజ్ దశలో ఉన్నవారి ఇబ్బందుల మీద అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - స్థూలకాయము  మెనోపాజ్ దశలో ఉన్నవారి ఇబ్బందుల మీద అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 స్థూలకాయము  మెనోపాజ్  రెండూమహిళల ఎముకలు , కీళ్ళ మీద ప్రభావము చూపిస్తాయి. ఎముకల్ బళీరత అందులో ముఖ్యమైనది. దీనిని " ఆస్టియోపొరోసిస్ అంటారు. ఎముకలు బలహీనపడడముతో పాటు పెళుసుగా మారి సులభము గా విరుతాయి. ఎటువండి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలంటే పౌష్టికాహారము , వ్యాయామానికి ప్రధాన్యత నిస్తూ కాల్షియం , విటమిన్‌ డి . తీసుకోవాలి . 1.2 గ్రా. కాల్షియం ప్రతిరోజూ తీసుకోవాలి. 51-70 సం లు ల మధ్య ఉన్నవారు 400 ఐ.యు . విటిమిన్‌ డి తీసుకోవాలి. సైక్లింగ్ , ఏరోబిక్ వ్యాయామాము చేయాలి. తాజా పండ్లు తీసుకోవాలి.

ఎముకలు విరగడమే కాక , స్థూలకాయం వల్ల కీళ్ళనొప్పలు ఎక్కువగా వస్తాయి. కీళ్ళ ఆరుగౌదలకు ప్రాధమిక కారణము స్థూల కాయము . స్థూల కాయము వల్ల కండ బలము తగ్గి కీళ్ళమీద ఒత్తిడి అధికమవుతుంది .. ఫలితముగా కీళ్ళదగ్గర లలిసే ఎముకల చివర తో ఉండే  కార్టిలేజ్ దెబ్బతిని రండు ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురి అవుతాయి. దానితో కీళ్ళదగ్గర నొప్పి మొదలవుతుంది. ఇంటి పనిలో బాగము  గాకింద కూర్చుని పని చేయడము , మెట్లు ఎక్కి దిగడము వ్యాయామము అనే భావించే మహిళలు లేకపొలేదు . . కాని అటువంటి పనులు కీళ్ళను , వెన్నును కూడా బాగా దెబ్బ తీస్తాయి అని గమనించాలి .  చాలా మంది పేసెంట్లు తమ కీళ్ళలోని గుజ్జు ఎండిపోయిందని, ఎండిపోయిన ఆ గుజ్జు పట్టటానికి మందులు వేసుకుంటే కీళ్ళు బాగవుతాయనే అభిప్రాయము లో ఉంటారు. కీళ్ళ రక్షణ నిచ్చే మందులైన కాండ్రాయిటిన్‌ , గ్లుకోసామిన్‌ , డయాసెరిన్‌ మందులు కీళ్ళ అరుగుదళ తొలి రెండు దశలలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి కాని 3- 4 వ దశ కు చేరిన తరువాత అంతగా ఉపయోగ పడవు .

జాయింట్ ఆర్థరైటిస్ రోగులకు ముఖ్యముగా అవసరమైనది ... వారి బరువు తగ్గుదళ . , కాల్సియం , విటమిన్‌ డి . మాత్రమే కీళ్ళను రక్షిస్తాయి . ప్రత్యేకమైన వ్యాయామములు కొంతవరకు సహాయపడతాయి. చాలా మంది రోగులు నొప్పివేసినప్పుడు మందులు మింగితే చాలనుకుంటారు .. అది సరియైన విధానము కాదు.  స్తూల కాయము గల రోగులు లో కీళ్ళ మార్పిడి అంత సులువు కాదు . వారికి ప్రత్యేకమైన ఇంప్లాంట్స్ కావాలి. వీటి అమరికకు ప్రత్యేక సంకేతిక విధానము ఉన్నది. స్తూల కాయము గల వారికి హైప్లెక్ష్ జాయింట్స్ అంత ఉపయోగము కావు . కీళ్ళ మార్పిడి అయిన తర్వాత స్తూలకాయులు ఆహారము విషయము లో జాగ్రత్తలు తీసుకోవాలి.

పైన చెప్పిన సమస్యలే కాక మరికొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి. నిద్ర లేచిన వెంటానే పాదం కింద పెట్టాలంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. వంట ఇంటిలో రెండు గంటలు నిలబడితే పాదం నొప్పి , చీలమండ ప్రాంటాన్ని వేధంచే ఈ సమస్యని వైద్యశాస్త్రము లో్ " ప్లాంటార్ ఫాసైటిస్ " అంటాము . ఈ ఇబ్బంధికి సాఫ్ట్ ఫుట్ వేర్ ఆయింట్ మెంట్ మర్ధించడం , పాదభాగ వ్యాయామాలు చేయడము .

మరో  ఇబ్బంది మోచేతిబాధ " టెన్నిస్ ఎల్బొ "  అనే ఈ బ్బంది ఏ వయసులో నైనా రావచ్చు కాని మెనోపాజ్ తరువాత వయసులో అధికం గా సతుంది. దీని ట్రీట్ మెంట్ కి స్పెషల్ క్రీములు , ఇంజక్షన్‌ లు సహాయపడతాయి. నొప్పికి మందులు తక్కువగా మిడ కిందబాగము , స్పాండిలైటిస్ , భుజముల మీద బాధ , వీపునొప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  నొప్పికి మందులు తక్కువగా వాడాలి ,

  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, May 30, 2014

Necessasity of X-ray chest in Chest diseases,ఛాతీలో ఉండే వ్యాధులను గుర్తించడానికి ఛాతీఎక్స్‌రే అవసరమా?

  •  


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఛాతీలో ఉండే వ్యాధులను గుర్తించడానికి ఛాతీఎక్స్‌రే అవసరమా?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఊపిరితిత్తులలో నిండి ఉండే గాలి - రెండు వంతులు పారంకైమా ఒక వంతు శ్వాసనాళాలలో ఉంటుంది. ఎక్స్‌రే కిరణాలలో ఘన పదార్థాలు ద్రవపదార్థాలు కనిపించినంత స్పష్టంగా ఈ గాలి కనిపించదు. కనుక ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి. లంగ్‌ పారంకైమాలో నీరు చేరినప్పుడు, నిమ్ము వచ్చినప్పుడు, లేదా కంతులు వంటి ఘనదార్థాలున్నా అవి ఊపిరితిత్తులలో తెల్లని మచ్చలుగా కనిపిస్తాయి.

ఛాతీలో ఉండే వ్యాధులను గుర్తించడానికి పలురకాల పరీక్షలు అవసరం. వీటిలో ప్రధానమైనది ఛాతీ ఎక్స్‌రే. వ్యాధి అసలు ఉందో లేదో, ఉంటే అది ఏ రకమైన వ్యాధి? ఇతర వ్యాధులతో పోలిస్తే ఏ విధంగా భిన్నమైనది? జబ్బు తీవ్రత ఏమిటి? వాడాల్సిన మందులేమిటి? వ్యాధి పూర్తిగా తగ్గిందా? లేదా?-తదితర విషయాలన్నింటి గురించి జవాబు కనుక్కోవడానికి ఛాతీ ఎక్స్‌రే ముఖ్యమైనది.

కఫం శ్వాసనాళాల ద్వారానే బైటికి వస్తుంది. శ్వాసనాళాల వ్యాధులు బ్రాంకైటిస్‌, బ్రాంకిఎక్టేసిస్‌లలో శ్వాసనాళాల గోడలలో ఉండే మ్యూకస్‌ గ్లాండ్స్‌లో కఫం తయారవుతుంది. ఛాతి ఎక్స్‌రేలో సాధారణంగా శ్వాసనాళాలు కనిపించవు. చాలా రోజులుగా జబ్బు పడినప్పుడు మాత్రం అవి సన్నని తీగలలాగా కనించవచ్చు. గొంతును, ఊపిరితిత్తులకు కలిపే పెద్ద శ్వాసనాళం ట్రేకియా. దీనిలో ఉండే గాలినిబట్టి ఎక్స్‌రే మధ్య భాగంలో చూడవచ్చు. కాని ట్రేకియా నుండి శాఖలుగా మారే శ్వాస నాళాలు (బ్రాంకై) స్పష్టంగా కనిపించవు.

కఫం సాధారణంగా శ్వాసనాళాల జబ్బుల లక్షణమే అయినా, ఒక్కొక్కసారి ఊపిరితిత్తులలో ఉండే మెత్తని భాగం - పారంకైమా జబ్బుల వలన రావచ్చు. న్యుమోనియా, లంగ్‌ ఆబ్సెస్‌ వంటి వ్యాధులలో పారంకైమాలో జమ అయ్యే కఫం ఆ భాగానికి దగ్గరలో ఉండే శ్వాసనాళాల ద్వారా దగ్గినప్పుడు బైటికి వస్తుంది. పలు రకాల పారంకైమా జబ్బులు ఛాతీ ఎక్స్‌రేలో చూడటానికి వీలవుతుంది.

ఊపిరితిత్తులలో నిండి ఉండే గాలి, రెండు వంతులు పారంకైమా, ఒక వంతు శ్వాసనాళాలలో ఉంటుంది. ఈ గాలి ఎక్స్‌రే కిరణాలలో ఘన పదార్థాలు, ద్రవపదార్థాలు కనిపించినంత స్పష్టంగా కనిపించదు. కనుక ఊపిరితిత్తులు నలుపు రంగులో ఉంటాయి. లంగ్‌ పారంకైమాలో నీరు చేరినప్పుడు, నిమ్ము వచ్చినప్పుడు, లేదా కంతులు వంటి ఘనదార్థాలున్నా అవి ఊపిరితిత్తులలో తెల్లని మచ్చలుగా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల మొత్తం పరిమాణంలో కుడివైపు ఉండే ఊపిరితిత్తి 45 శాతం, ఎడమవైపున ఉండే ఊపిరితిత్తి 55 శాతం ఉంటాయి. ప్రక్కటెముకల ఆధారంగా ఊపిరితిత్తుల పరిమాణం మామూలుగా ఉందా? లేక ఏమైనా తేడాలున్నాయా? అనే విషయాన్ని గమనించవచ్చు. కుడి వైపు 5-6 పక్కటెముకల వరకూ కుడి ఊపిరితిత్తి, ఎడమవైపు ఊపిరితిత్తి దీనికంటే రెండు మూడు సెంటీమీటర్లు క్రిందగా ఉండటం సర్వసాధారణం. కడుపులో ఉండే అవయవాలన్నింటి నుండి ఊపిరితిత్తులను వేరుగా చేసే పొర డయాఫ్రం. కుడివైపున ఈ పొర క్రింద కాలేయం తెల్లగానూ , ఎడమవైపున జీర్ణకోశం నలుపుగానూ కనబతాయి.

జీర్ణకోశంలో గాలి ఉండటం వలన అది ఎక్స్‌రేలో నలుపుగా కనిపిస్తుంది. దీనిని ఫండల్‌ గ్యాస్‌ అని అంటారు. ఈ ఫండల్‌ గ్యాస్‌ ఆధారంగా ఊపిరితిత్తులలో ఏది కుడి, ఏది ఎడమ అని నిర్ధారించవచ్చు. అరుదుగా పుట్టకతో వచ్చే అవయవ లోపం వలన ఒక్కొక్కసారి జీర్ణకోశం కుడివైపుకు, కాలేయం ఎడమవైపున, అలాగే గుండె కుడివైపున ఉండవచ్చు. దీనిని సైటస్‌ ఇన్‌వర్సస్‌ అని అంటారు.

రెండు ఊపిరితిత్తుల మధ్య భాగంలో గుండె తెలుపుగా కనబడుతుంది. సన్నగా ఎత్తుగా ఉండే వారిలో పొడవుగా ఫ్లస్‌  ఆకారంలోనూ, పొట్టిగా, లావుగా ఉండే వారిలో గుండ్రని ఆకారంలో కొద్దిగా ఎడమవైపు ఒంపుతో కనిపిస్తుంది. మూడింట రెండువంతుల గుండె ఎడమవైపు, ఒక వంతు కుడివైపు వ్యాపించి ఉంటాయి. గుండె పరిమాణం. ఆకారాలను బట్టి సుమారుగా గుండె జబ్బు ఏమై ఉంటుందో ప్రాథమిక అంచనాకు రావచ్చు.

గుండె పరిమాణం పెరిగిందా? లేదా? అనే విషయం కొంత వ్యవధితో తీసిన ఎక్స్‌రేలను పొల్చి గుర్తించవచ్చు. 1.5 నుంచి 2 సెంటీమిటర్ల వెడల్పు పెరిగితే గుండె పరిమాణం పెరిగిందని అనుకోవచ్చు. ఒకే ఎక్స్‌రే ఉన్నప్పుడు గుండె 15 సెంటీమిట ర్లకంటే వెడల్పుగా ఉంటే గుండె పెరిగిందని నిర్థారించవచ్చు. కొన్ని సార్లు ఎక్స్‌రే తీస్తున్నప్పుడు ఊపిరి తీసుకుని సరిగ్గా నిలపని పక్షంలో కూడా ఏ జబ్బు లేకుండానే గుండె పెద్దదిగా కనిపిస్తుంది.

గుండెనుండి వెళ్లే రక్తనాళాలు, కుడి వెంట్రికల్‌ నుండి పల్మనరీ ఆర్జరీలు, ఎడమ వెంట్రికల్‌ నుండి అయోర్టా గుండె పై భాగం నుంచి శాఖలుగా మారుతాయి. ప్రధానంగా ఎక్స్‌రేలో కనిపించేది - అయోర్టా. ఇది గుండె నుండి కుడివైపుగా పైకి వెళుతూ మధ్య భాగాన్ని దాటి ఎడమవైపు కిందికి వంగి థొరాసిక్‌ అయెర్టాగా మారుతుంది. కుడి ఎడమలలో దీనికి ఆనుకుని పల్మనరీ ఆర్టరీ శాఖలు ఊపిరితిత్తులలోని కింది భాగాలకు వెళుతున్నప్పుడు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా గుండె వెనుక భాగం నుంచి వెళుతుంటాయి కనుక కనిపించవు.

ఊపిరితిత్తులలోకి పల్మనరీ ఆర్టరీతో పాటు పల్మనరీ వీన్స్‌, శ్వాసనాళాలు కలిసి ముఖద్వారంలో తెల్లని మచ్చగా కనబడుతుంది. దీనిని హైలం అంటారు. కుడి హైలం కంటే ఎడమవైపు హైలం 2 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ల వలన వచ్చే కంతులు, కేన్సర్‌ ట్యూమర్లు ఈ హైలమ్‌ దగ్గర తెల్లని గడ్డలు మాదిరిగా కనిపిస్తాయి. కేన్సర్‌ గడ్డలు ఇక్కడే కాకుండా, ఊపిరితిత్తులలోని ఇతర భాగాలలో కూడా రావచ్చు. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజులో ఉండే గడ్డలుకాని, నిమ్ము కాని ఎక్స్‌రేలో కనిపించవు.

కాల ర్‌బోన్‌ కాని, ఎముకల వెనుక కాని, గుండె వెనుకకాని ఉండే వ్యాధులు కూడా అవి అడ్డురావడం వలన ఎక్స్‌రేలో కనిపించవు. అప్పుడు వివిధ కోణాలలో ఛాతీ ఎక్స్‌రేలు తీయాల్సి ఉంటుంది. ప్రక్కటెముకలు, ఊపిరితిత్తులకు మధ్య ఉండే భాగం ఫ్లూరల్‌ కేవిటీ. ఇది సాధారణంగా ఎక్స్‌రేలో కనిపించదు. రెండు పొరల మధ్య ఉండే ఈ కేవిటీలో నీరు, చీము, గాలి చేరినప్పుడు మాత్రమే దీనిని గుర్తించడానికి వీలవుతుంది.

రెండు ఊపిరితిత్తుల మధ్య ఉండే భాగం మీడియాస్టినమ్‌, గుండె కూడా ఈ భాగానికి చెందినదే. గుండెతో పాటు శ్వాసనాళాలు, రక్తనాళాలు కూడా దీనిలో కనపడుతాయి. లింఫ్‌ గంధ్రులు కూడా వీటిలో ఉంటాయి. ఈ అవయవాలలో జబ్బులు ఉన్నప్పుడు మీడియాస్టినమ్‌ పెద్దదిగా ఉంటుంది. ఆకారాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి వ్యాధి లక్షణాలతో కలిపి అది ఏ అవయవానికి చెందినదో గుర్తించవచ్చు. పలు రకాల ట్యూమర్లు కూడా ఈ భాగంలో కనిపిస్తాయి. జబ్బు మొదలైనప్పుడు వ్యాధి లక్షణాలు పైకి కనిపించినా, అదిలో ఎక్స్‌రే లో కనిపించకపోవచ్చు. చాలా చిన్నవిగా మొదలయ్యే ఇలాంటి వ్యాధులు రానురాను పెరిగి, ఒకటి రెండు వారాలు, నెలల తరువాత ఎక్స్‌రేలో కనిపించేంతగా పెరగవచ్చు. కనుక వ్యాధిని గురించిన అనుమానం వచ్చినప్పుడు మొదటి ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటే, మరొకసారి ఎక్స్‌రే తీయించుకోవాల్సి ఉంటుంది.

జబ్బు తగ్గుతన్నప్పుడు కూడా దానిని నిర్ధారించడానికి మరలా ఎక్స్‌రేలు అవసరమవుతాయి.

సి. టి. స్కాన్‌: ఛాతీ ఎక్‌సరే లో కనిపించని వ్యాధులను నిర్దారించడానికి ఉపయోగపడే పరీక్షే ఇది. ప్రారంభదశలో ఉన్న న్యూమోనియా, క్షయ , ఐ.ఎల్‌.డి., కేన్సర్‌, లింఫ్‌ గ్రంథులు, ట్యూమర్లను ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ప్లూరల్‌ వ్యాధులు, బ్రాంకిఎక్టేసిస్‌లను కూడా ఈ పరీక్ష ద్వారా గుర్తింవచ్చు.

డాక్టర్‌ బి. శ్యామ్‌ సుందర్‌ రాజ్‌--శ్రేష్ఠ హాస్పిటల్‌,అమీర్‌పేట్‌, హైదరాబాద్‌.-9394018040 @andhraprabha - Tue, 20 May 2014,
  • ===========================================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, May 29, 2014

Chronic Rhematoid arthritis,దీర్ఘకాలిక రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌(వ్యాధి )

  •  

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -దీర్ఘకాలిక రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌(వ్యాధి )- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌. దీనివల్ల కీళ్లు వాచి, గట్టిపడి నొప్పి పెడతాయి. ఈ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో సాధారణంగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా వస్తుంది.

కారణాలు :
దీనికి సరైన కారణం తెలియదు. కాని ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే శరీరంలోని సహజ రక్షక వ్యవస్థ కీళ్లపైన దాడి చేస్తుంది.

లక్షణాలు :
చేతులు, ముఖ్యంగా చేతి వేళ్లు, మణికట్లు, మోచేతులు, కాలి మడమ, మోకాళ్లు, మెడ భాగంలోని కీళ్లలో నొప్పి, కీళ్లు గట్టిగా ఉండటం, వాచిపోవడం రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు. ఎక్కువ సమయం పడుకుని, కూర్చుని లేచిన తరువాత కీళ్లు గట్టిపడటం ఎక్కువ అవుతుంది. ఇది తగగ్డానికి గంటనుంచి కొన్ని గంటల సమయం పట్టవచ్చు. కీళ్ల సమస్యలు మాత్రమే కాకుండా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల నీరసం, బరువు తగ్గిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడంలాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు స్థిరంగా ఉండవు. కీళ్ల నొప్పులు వాటికవే తగ్గిపోవచ్చు. దీనిని రెమిషన్‌ అంటారు.

కీళ్ల నొప్పులకు ఇతర కారణాలు :
ఆస్టియో ఆర్థరైటిస్‌ : కీళ్ల రాపిడి, గాయాలు కావడం వల్ల ఎముకలపై ఉండే మృదువైన కార్టిలేజ్‌ పొర దెబ్బ తింటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లాగా అన్ని భాగాల్లో కాకుండా, ఏదో ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మాత్రం వేలి కొసలనుంచి మోకాళ్లు, తుంటి భాగాల కీళ్ల వరకూ ప్రభావం చూపిస్తుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లాగా ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులైన
  • ల్యూపస్‌ జోగ్రెన్స్‌ సిండ్రోమ్‌,
  • సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌, 
  • ఆస్టియో ఆర్థరైటిస్‌ :
  • అంకైలోసింగ్‌ స్పాండిలైటిస్‌--------లాంటి వ్యాధులు కూడా కీళ్లపై దాడి చేస్తాయి.

ఇతర భాగాలపై ప్రభావం :
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వల్ల కీళ్లు మాత్రమే కాకుండా, చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె,మెదడు, రోగ నిరోధక కణాలపై కూడా ప్రభావం పడవచ్చు.

నిర్ధారణ :
శారీరక పరీక్షలు, ఎక్స్‌రే, ఆర్‌ఎ, ఇఎస్‌ఆర్‌, యాంటి సిపిసి, సిబిపిలాంటి రక్త పరీక్షల ద్వారా గుర్తిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను తొలిదశలోనే గుర్తుపట్టడానికి కీళ్లకు హెచ్‌ఆర్‌యుయస్‌ వంటి ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

చికిత్స
:
ఈ వ్యాధికి జీవితాంతం చికిత్స తీసుకోవాలి. మందులతోపాటు వ్యాయామం, జీవనశైలి మార్పులు అవసరమవుతాయి. తొందరగా చికిత్స తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది. రుమటాలజిస్ట్‌ పర్యవేక్షణలోనే చికిత్స జరగాలి. మెథట్రెక్సేట్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, సల్ఫాసలజైన్‌, స్టిరాయిడ్స్‌ను వాడాల్సి వస్తుంది. ఈ మందులకు లొంగకపోతే బయలాజిక్స్‌లాంటి ఆధునిక చికిత్సలు ఇవ్వాలి.

జాగ్రత్తలు :
- అలసిపోగానే విశ్రాంతి తీసుకోవాలి.
- వంటగదిలో వస్తువుల ద్వారాకాని, తలపు గొళ్లేల వ్లకాని ఎటువంటి గాయాలు తగలకుండా చూసుకోవాలి.
- లక్షణాలు తీవ్రతంగా ఉంటే చేతి కర్ర సహాయంతో కాని, వాకర్స్‌ ద్వారా కాని నడవాలి.
- సమతులాహారం తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

శస్త్ర చికిత్స ఎప్పుడు అవసరం?--
మందులు, ఫిజికల్‌ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమ వుతుంది. శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ చేయాల్సి వస్తుంది.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పటికీ చాలామంది స్త్రీలు గర్భం దాల్చగలరు. ఆరోగ్యకరమైన బిడ్డలను పొందగలరు. గర్భం దాల్చిన సమయంలో ఈ వ్యాధికి వాడే కొన్ని మందులను ఆపవలసి ఉంటుంది. ప్రసవం తరువాత చాలామందిలో మొదటి మూడు నెలలలోపు వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు మందులు మళ్లి వాడాలి.

పోషకాహారం :
చేపనూనె వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా ఉండటానికి తగినంత కాల్షియం, విటమిన్‌ డి అందేలా చూసుకోవాలి. సాచురేటెడ్‌ కొవ్వు, కొలెస్టరాల్‌, ఉప్పు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

వ్యాయామం చేయవచ్చా? --
ఆర్థరైటిస్‌ వ్యాయామం మూడు రూపాల్లో చేయవచ్చు. స్ట్రెచింగ్‌, స్ట్రెంతనింగ్‌, కండిషనింగ్‌ వ్యాయామాలు చేయాలి. మోకాళ్లు, మడమలు, పాదాల్లో సమస్య ఉన్నప్పుడు ఈత మంచి వ్యాయామం. కాల్లు,పాదాల్లో సమస్య లేకపోతే సైకిలింగ్‌, వాకింగ్‌ బాగా తోడ్పడుతాయి.

వంశపారంపర్యమా?
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంశపారంపర్యంగా రాదు. కొన్ని కొన్ని రకాల జన్యువులు మాత్రం ఈ వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వందమందిలో తల్లిదండ్రులు, పిల్లల్లో వచ్చే అవకాశం నలుగురికి ఉంఉటంది. సాధారణ జనాభాలో ప్రతి వందమందిలో ఒకరు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ బారినపడే అవకాశం ఉంది. కాగా, ఈ వ్యాధిగ్రస్తుల పిల్లల్లో 25 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

- డాక్టర్‌ శశికాంత్‌-ఆర్థోపెడిక్‌ సర్జన్‌--కేర్‌ హాస్పిటల్‌,--బంజారాహిల్స్‌--హైదరాబాద్‌ @andhraprabha - Tue, 20 May 2014,
  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, May 27, 2014

What is Tatoo? is there any bad to us?,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా?

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా? గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.

టాట్టూ అంటే తెలుగులో మనం పల్లెటూర్లలో చిన్నప్పుడు వేయించుకునే పచ్చబోట్టు లాంటిదన్నమాట. కానీ టాట్టూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి మనం మన శరీరం మీద టాట్టూ వేయించుకుంటే కొన్ని రకాల టాట్టూలు చెరిగిపోతాయి, మరికొన్ని రకాల టాట్టూలు చెరిగిపోవు. పచ్చబొట్టు పాతమాట. టాట్టూ అనేది కొత్త బాట. ఈ కాలంలో ఇదో వేలం వెర్రి. చేతిమీదా ఛాతీమీదా ఒళ్లంతా టాట్టూ వేయించుకని సంబరపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరిష్టం వాళ్లది. టాటూలు ఉన్నప్పుడు ఎం.ఆర్.ఐ స్కాన్‌ తీయించుకుంటే ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయన్నది నానుడిలో ఉన్నది. టాటూ ఇంకు రేడియేషన్‌ కు రియాక్టయి ,చర్మం వాపులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు ... దీనిలో కొంత నిజము లేకపోలేదు. తగం లో టాటూ ఇంకులో మెర్కురీ వంటి మెటల్స్ ఉండేవని ఒక అభిప్రాయము . కాని ఈ రోజుల్లో " ఐరన్‌ ఆక్షైడ్ సాల్ట్'' వంటి సురక్షితమైన పిగ్మెంట్స్ వాడుతున్నారు. ఇవి రియాక్ట్ కావు .క్లోరినేటెడ్  స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళడము వల్ల టాటూ కలర్ ఫేడ్ అవుతుందని మరో అపోహ ... క్లోరిన్‌ చర్మం తొలి లేయర్ లోకి చొచ్చుకొనిపోదు ... కాబట్టి కలర్స్ ఫేడ్ అయ్యే ప్రసక్తే లేదు.

పచ్చబొట్లు పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఇది ఒక ఫ్యాషన్ . భారత దేశానికి కూడా విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. 7వ శతాబ్ది ఏ.డి. ప్రాంతాలలో పచ్చబొట్లు ఏ మతాన్నీ నమ్మనివారు చేసేపనిగా పరిగణించి కొన్ని శ్డతాబ్దాల వరకు యూరప్‌లో నిషేధించారు. కానీ ఇది ఇతర చోట్ల కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా ప్రపంచమంతటా ప్రజాదరణకు పాత్రమైంది.

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ పచ్చబొట్ల కళ పరిఢవిల్లింది. యుద్ధవీరులు, మల్లయోధులు తమ పటుత్వం కల నరాలపై, మణికట్లపై హనుమంతుడు, కత్తులు, త్రిశూలం మొదలైన రూపాలతో పచ్చబొట్లు పొడిపించుకునేవారు.

కొన్ని వైద్య పరమైన విషయాలలోనూ పచ్చబొట్లు వైద్యులు తప్పనిసరిగా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక శస్త్రచికిత్స తరువాత రొమ్ములు తొలగించడం జరిగితే, చనుమోనల ఆకారాన్ని కల్పించేందుకు పచ్చబొట్టు ను వాడటం. మరి కొన్ని దేశాల్లో వ్యక్తి శాశ్వత రుగ్మత తో బాధపడుతుంటే (ఉదాహరణకు మధుమేహం) ఆ రుగ్మత గురించి పచ్చబొట్టు వేయడం. దీంతో ప్రమాదంలో వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్లిపోతే అతని రుగ్మత గురించి వెంటనే తెలుస్తుందనే భావనతో పచ్చబొట్టు వేస్తున్నారు. ఇక పచ్చబొట్లు రెండు రకాలు – శాశ్వతమైనవి ఒక రకం అయితే, తాత్కాలికమైనవి రెండో రకం. పచ్చబొట్టు వేయించుకునే విషయం లో కొన్ని జాగ్రత్తలు:

    పచ్చబొట్టు ఎటువంటిదైనా అనుభవజ్ఞులైన వారిచేత వెయిచుకునేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచేందుకు వినియోగించే పనిముట్లు, సూదులు శుద్ధమై, ఆరోగ్యారీత్యా తగినవైనవిగా ఉండేటట్లు చూసుకోండి. లేకుంటే భయంకర అంటువ్యాధులు ప్రబలవచ్చు. లేకుంటే కొన్ని శాశ్వత చర్మ వ్యాధులు శోకగలవు.
    నిపుణులైన పచ్చబొట్లు వేసే వారు వాడే పచ్చబొట్టు యంత్రాన్ని పూర్తిగా శుభ్రం చేసెట్టు చూసుకొని, సూదులు క్రొత్తవి వాడేందుకు కోరండి. అవసరమైతే మీ ముందే సూదులు శుభ్రం చేసేందుకు, మార్చేందుకు కోరండి.
    శాశ్వత పచ్చబొట్టు వేసేందుకు మీ శరీర చర్మానికి రంధ్రాలు చేయాలని గుర్తించండి. దీని మూలంగా రక్తం కూడా ప్రవహిస్తుందని గమనించండి. అందుకోసం పచ్చబొట్టు వేసే ప్రదేశం ఆసుపత్రితో సమానంగా ఉండేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచే వారికి సరైన లైసెన్స్ లు ఉన్నాయా లేదా అని గమనించండి.
    మీరు అనారోగ్యంతో ఉంటే పచ్చబొట్టు పొడిపించుకోకండి.
    పచ్చబొట్టు వేసేటప్పుడు ఎటువంటి మధ్యపానం, మత్తు పదార్ధాలను సేవించకండి.
    మీ పచ్చబొట్టు లో వినియోగించిన రంగు, రసాయనాలు, వేసిన వారి పేరు అన్నీ వ్రాసి పెట్టుకోండి. మునుముందు ఎటువంటి ఆరోగ్యకర సమస్యలు తలెత్తినా ఈ వివరాలు తప్పక అవసరం అని గమనించండి.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే – పచ్చబొట్టు శాశ్వతమైనదైనా, లేదా తాత్కాలికమైనదైనా ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తించండి. అపరిశుభ్ర సూదులు, పరికరాలు వాడితే ఎయిడ్స్, హెపటైటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకుతాయని గమనించండి. అంతే కాకుండా నాసి రకం రంగులు వాడటం మూలంగా వీటి ప్రభావం మీ కాలేయం, రక్తం, కళ్ళకు ప్రమాదం కల్గించగలదని గుర్తించండి.

ఇక పచ్చబొట్లను తొలగించడం సులభమే కానీ అన్నీ ప్రయత్నాలలో ఇది సఫలితాలను ఇవ్వడాని గుర్తించండి. మీ శరీర చర్మాన్ని బట్టి పచ్చబొట్టు 100 శాతం తొలగించబడవచ్చు లేదా కొద్ది శాతం మేర తొలగిపోవచ్చని గుర్తుంచుకోండి. అలానే పచ్చబొట్టు తొలగించే ప్రక్రియలోనూ పైన పేర్కొన్న వ్యాధుల తాలూకు ప్రమాదాలు పొంచిఉన్నాయనే సత్యాన్ని గమనించండి.

పచ్చబొట్టు తొలగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఒక్కో సమయంలో ప్రమాదకర చర్మ సంభందిత లక్షణాలు రావచ్చు. దీని కారణంగా తీవ్రమైన బాధ, శాశ్వత రోగం బారిన పడే అవకాశం లేకపోలేదు.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/