Tuesday, May 27, 2014

What is Tatoo? is there any bad to us?,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా?

  •  
  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా? గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.

టాట్టూ అంటే తెలుగులో మనం పల్లెటూర్లలో చిన్నప్పుడు వేయించుకునే పచ్చబోట్టు లాంటిదన్నమాట. కానీ టాట్టూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి మనం మన శరీరం మీద టాట్టూ వేయించుకుంటే కొన్ని రకాల టాట్టూలు చెరిగిపోతాయి, మరికొన్ని రకాల టాట్టూలు చెరిగిపోవు. పచ్చబొట్టు పాతమాట. టాట్టూ అనేది కొత్త బాట. ఈ కాలంలో ఇదో వేలం వెర్రి. చేతిమీదా ఛాతీమీదా ఒళ్లంతా టాట్టూ వేయించుకని సంబరపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరిష్టం వాళ్లది. టాటూలు ఉన్నప్పుడు ఎం.ఆర్.ఐ స్కాన్‌ తీయించుకుంటే ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయన్నది నానుడిలో ఉన్నది. టాటూ ఇంకు రేడియేషన్‌ కు రియాక్టయి ,చర్మం వాపులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు ... దీనిలో కొంత నిజము లేకపోలేదు. తగం లో టాటూ ఇంకులో మెర్కురీ వంటి మెటల్స్ ఉండేవని ఒక అభిప్రాయము . కాని ఈ రోజుల్లో " ఐరన్‌ ఆక్షైడ్ సాల్ట్'' వంటి సురక్షితమైన పిగ్మెంట్స్ వాడుతున్నారు. ఇవి రియాక్ట్ కావు .క్లోరినేటెడ్  స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళడము వల్ల టాటూ కలర్ ఫేడ్ అవుతుందని మరో అపోహ ... క్లోరిన్‌ చర్మం తొలి లేయర్ లోకి చొచ్చుకొనిపోదు ... కాబట్టి కలర్స్ ఫేడ్ అయ్యే ప్రసక్తే లేదు.

పచ్చబొట్లు పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఇది ఒక ఫ్యాషన్ . భారత దేశానికి కూడా విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. 7వ శతాబ్ది ఏ.డి. ప్రాంతాలలో పచ్చబొట్లు ఏ మతాన్నీ నమ్మనివారు చేసేపనిగా పరిగణించి కొన్ని శ్డతాబ్దాల వరకు యూరప్‌లో నిషేధించారు. కానీ ఇది ఇతర చోట్ల కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా ప్రపంచమంతటా ప్రజాదరణకు పాత్రమైంది.

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ పచ్చబొట్ల కళ పరిఢవిల్లింది. యుద్ధవీరులు, మల్లయోధులు తమ పటుత్వం కల నరాలపై, మణికట్లపై హనుమంతుడు, కత్తులు, త్రిశూలం మొదలైన రూపాలతో పచ్చబొట్లు పొడిపించుకునేవారు.

కొన్ని వైద్య పరమైన విషయాలలోనూ పచ్చబొట్లు వైద్యులు తప్పనిసరిగా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక శస్త్రచికిత్స తరువాత రొమ్ములు తొలగించడం జరిగితే, చనుమోనల ఆకారాన్ని కల్పించేందుకు పచ్చబొట్టు ను వాడటం. మరి కొన్ని దేశాల్లో వ్యక్తి శాశ్వత రుగ్మత తో బాధపడుతుంటే (ఉదాహరణకు మధుమేహం) ఆ రుగ్మత గురించి పచ్చబొట్టు వేయడం. దీంతో ప్రమాదంలో వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్లిపోతే అతని రుగ్మత గురించి వెంటనే తెలుస్తుందనే భావనతో పచ్చబొట్టు వేస్తున్నారు. ఇక పచ్చబొట్లు రెండు రకాలు – శాశ్వతమైనవి ఒక రకం అయితే, తాత్కాలికమైనవి రెండో రకం. పచ్చబొట్టు వేయించుకునే విషయం లో కొన్ని జాగ్రత్తలు:

    పచ్చబొట్టు ఎటువంటిదైనా అనుభవజ్ఞులైన వారిచేత వెయిచుకునేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచేందుకు వినియోగించే పనిముట్లు, సూదులు శుద్ధమై, ఆరోగ్యారీత్యా తగినవైనవిగా ఉండేటట్లు చూసుకోండి. లేకుంటే భయంకర అంటువ్యాధులు ప్రబలవచ్చు. లేకుంటే కొన్ని శాశ్వత చర్మ వ్యాధులు శోకగలవు.
    నిపుణులైన పచ్చబొట్లు వేసే వారు వాడే పచ్చబొట్టు యంత్రాన్ని పూర్తిగా శుభ్రం చేసెట్టు చూసుకొని, సూదులు క్రొత్తవి వాడేందుకు కోరండి. అవసరమైతే మీ ముందే సూదులు శుభ్రం చేసేందుకు, మార్చేందుకు కోరండి.
    శాశ్వత పచ్చబొట్టు వేసేందుకు మీ శరీర చర్మానికి రంధ్రాలు చేయాలని గుర్తించండి. దీని మూలంగా రక్తం కూడా ప్రవహిస్తుందని గమనించండి. అందుకోసం పచ్చబొట్టు వేసే ప్రదేశం ఆసుపత్రితో సమానంగా ఉండేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచే వారికి సరైన లైసెన్స్ లు ఉన్నాయా లేదా అని గమనించండి.
    మీరు అనారోగ్యంతో ఉంటే పచ్చబొట్టు పొడిపించుకోకండి.
    పచ్చబొట్టు వేసేటప్పుడు ఎటువంటి మధ్యపానం, మత్తు పదార్ధాలను సేవించకండి.
    మీ పచ్చబొట్టు లో వినియోగించిన రంగు, రసాయనాలు, వేసిన వారి పేరు అన్నీ వ్రాసి పెట్టుకోండి. మునుముందు ఎటువంటి ఆరోగ్యకర సమస్యలు తలెత్తినా ఈ వివరాలు తప్పక అవసరం అని గమనించండి.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే – పచ్చబొట్టు శాశ్వతమైనదైనా, లేదా తాత్కాలికమైనదైనా ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తించండి. అపరిశుభ్ర సూదులు, పరికరాలు వాడితే ఎయిడ్స్, హెపటైటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకుతాయని గమనించండి. అంతే కాకుండా నాసి రకం రంగులు వాడటం మూలంగా వీటి ప్రభావం మీ కాలేయం, రక్తం, కళ్ళకు ప్రమాదం కల్గించగలదని గుర్తించండి.

ఇక పచ్చబొట్లను తొలగించడం సులభమే కానీ అన్నీ ప్రయత్నాలలో ఇది సఫలితాలను ఇవ్వడాని గుర్తించండి. మీ శరీర చర్మాన్ని బట్టి పచ్చబొట్టు 100 శాతం తొలగించబడవచ్చు లేదా కొద్ది శాతం మేర తొలగిపోవచ్చని గుర్తుంచుకోండి. అలానే పచ్చబొట్టు తొలగించే ప్రక్రియలోనూ పైన పేర్కొన్న వ్యాధుల తాలూకు ప్రమాదాలు పొంచిఉన్నాయనే సత్యాన్ని గమనించండి.

పచ్చబొట్టు తొలగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఒక్కో సమయంలో ప్రమాదకర చర్మ సంభందిత లక్షణాలు రావచ్చు. దీని కారణంగా తీవ్రమైన బాధ, శాశ్వత రోగం బారిన పడే అవకాశం లేకపోలేదు.

  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.