Sunday, August 31, 2014

Detection of Cancer at an early stage,క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం


  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Detection of Cancer at an early stage,క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కావచ్చు.. రొమ్ము క్యాన్సర్‌ కావచ్చు.. చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతుంది. కానీ అంతకన్నా ముందే క్యాన్సర్‌ రావడానికి ముఖ్య కారణాలూ.. ఆ ప్రమాదాన్ని సూచించే పరీక్షల గురించి వివరంగా తెలుసుకోగలిగితే... ముప్పును చాలామటుకు నిరోధించవచ్చు.

స్నేహితులూ లేదా బంధువులూ క్యాన్సర్‌ బారిన పడ్డారనో, దానివల్ల చనిపోయారనో విన్నప్పుడు ఒక క్షణం ఆందోళన చెందుతాం. కొన్నిసార్లు ఆ ప్రమాదం మనకీ ముంచుకొస్తుందా అన్న భయం కలుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఆ సమస్యను నిరోధించవచ్చు. త్వరగా గుర్తించగలిగితే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకునే వీలుంది. గణాంకాల ప్రకారం చూస్తే రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, వూపిరితిత్తులూ, పేగుల క్యాన్సర్‌ బారిన పడిన వారూ, వాటితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రొమ్ము క్యాన్సర్‌ బారిన పది లక్షల మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో నాలుగులక్షల డెబ్భైవేల మంది, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌తో లక్షా తొంభై వేల మంది, అండాశయ క్యాన్సర్‌తో లక్షా తొంభై రెండువేల మంది బాధపడుతున్నారు. మహిళలు ప్రధానంగా గర్భాశయ ముఖద్వారం, రొమ్ము, ఎండోమెట్రియల్‌, అండాశయాలు, యోనిలో, బాహ్య జననేంద్రియాల్లోని క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటిని గుర్తించడంలో ఆలస్యమైతే, శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. రేడియేషన్‌, కీమోథెరపీ అవసరమవుతాయి. మానసికంగా కుంగిపోవడం, ఇతర దుష్ప్రభావాలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాద స్థాయిని వీలైనంత వరకూ తగ్గించుకునేలా ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవే ప్రమాద సూచికలు..
ఒక్కో క్యాన్సర్‌కి కొన్ని ప్రమాద సంకేతాలు ఉంటాయి. వాటిని ముందే గుర్తించగలిగితే మంచిది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: చిన్నతనంలో పెళ్లి చేసుకుని, లైంగికచర్య ప్రారంభించడం, లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లూ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువ రోజులు గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి. కలయిక సమయంలో పురుషులు కండోమ్‌లు, స్త్రీలు డయాఫ్రమ్‌లు వాడాలి. విటమిన్‌ 'సి' లోపించకుండా చూసుకోవాలి. ఈ పోషకం ఉన్న జామ, ఉసిరి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

రొమ్ము క్యాన్సర్‌: అధికబరువూ, పుట్టిన వారికి తల్లిపాలు ఇవ్వలేకపోవడం, పిల్లలు కలగకపోవడం, దీర్ఘకాలికంగా హార్మోన్లు వాడటం. కుటుంబంలో ఈ సమస్య ఉండటం దీనికి ప్రధాన కారణాలు. అందుకే తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలి. హార్మోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌: స్థూలకాయం, మధుమేహం, ఈస్ట్రోజెన్‌ హార్మోను శరీరంలోనే ఎక్కువగా ఉండటం లేదా మాత్రల రూపంలో తీసుకోవడం, పీసీఓఎస్‌ (పాలీసిస్టీక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), వంశపారంపర్యంగా రావడం, పిల్లలు లేకపోవడం వంటివి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎక్కువకాలం ఈస్ట్రోజెన్‌ వాడకపోవడం, పీసీఓఎస్‌ ఉన్నవాళ్లు ప్రొజెస్టెరాన్‌ని మాత్రలు లేదా మెరీనా లూప్‌లా వాడటం వల్ల ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

అండాశయ క్యాన్సర్‌: అధిక బరువూ, కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. ముందు బరువు తగ్గాలి. అయితే గర్భనిరోధక మాత్రలు వాడేవారికీ, పాలిచ్చే తల్లులకూ, కుటుంబనియంత్రణ కోసం ట్యూబెక్టమీ చేయించుకునేవారికీ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రేడియేషన్‌కు దూరం...
యూరోపియన్‌ క్యాన్సర్‌ సొసైటీ క్యాన్సర్‌ నిరోధానికి కొన్ని జాగ్రత్తలు సూచించింది. వాటిల్లో...

* బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. రోజులో ఒక కప్పు కొలతతో ఐదుసార్ల చొప్పున పండ్లూ, కాయగూరల్ని తీసుకోవాలి. జంతు సంబంధమైన ఆహారపదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి.

* ఉద్యోగినులు క్యాన్సర్‌ కారకాలైన రసాయనాలూ, రేడియేషన్‌, కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రారంభంలోనే కనిపెట్టే పరీక్షలు..
క్యాన్సర్‌ ఏదయినా దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకోవచ్చు. అందుకోసం రకరకాల పరీక్షలుంటాయి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి పదేళ్ల ముందునుంచే ఆ సూచనలు కనిపిస్తాయి. వాటిని పాప్‌స్మియర్‌, హెచ్‌పీవీ పరీక్షలతో గుర్తించవచ్చు. అందుకే దీన్ని అతి ముఖ్యమైన స్క్రీనింగ్‌ పరీక్ష అంటారు. పెళ్లయిన ఏడాది నుంచీ అరవై ఐదేళ్లవరకూ మూడేళ్లకోసారి పాప్‌ స్మియర్‌ని చేయించుకోవాలి. ఇప్పుడు దాంతోపాటూ హెచ్‌పీవీ పరీక్షా అందుబాటులో ఉంది కాబట్టి ఈ రెండూ చేయించుకోవడం మంచిది. ఈ టెస్ట్‌లో ఫలితం నార్మల్‌ అని వస్తే ఐదేళ్ల తరవాత మళ్లీ చేయించుకుంటే సరిపోతుంది.

* రొమ్ము క్యాన్సర్‌ ముప్పును ముందుగానే సూచిస్తుంది మమోగ్రఫీ. ప్రత్యేకమైన ఎక్స్‌రేలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లతో రొమ్ములను పరీక్షిస్తారు. క్యాన్సర్‌ ఉంటే ఆ కణతులు చేతికి తగలడానికి రెండేళ్ల ముందే మామోగ్రఫీలో తేడాలు కనిపిస్తాయి. దీన్ని చేయించుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్‌తో మరణించే స్త్రీల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గుతుందని అంటున్నాయి అధ్యయనాలు.

* ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కోసం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, హిస్టరోస్కోపీ పరీక్షలు కీలకం. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో ఎండోమెట్రియం పొర బాగా మందంగా కనిపించినా, బయాప్సీ చేశాక ఎ టిపికల్‌ కాంప్లెక్స్‌ హైపర్‌ప్లేసియా అన్న రిపోర్టు వచ్చినా క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్లే.

* అండాశయ క్యాన్సర్‌కి ముందుగా గుర్తించే పరీక్షలు లేవు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసినప్పుడు అండాశయాల్లో గడ్డలూ, సిస్టులూ కనిపిస్తే.. క్యాన్సర్‌ని అంచనా వేసే ట్యూమర్‌ మార్కర్స్‌ పరీక్షలు సూచిస్తారు. సిఏ125, సిఇఏ, సీఏ 19-9, సీఏ 15-3 లాంటివి అందులో కొన్ని. అండాశయాల్లో కొన్నిరకాల ట్యూమర్లు ఉన్నప్పుడు హెచ్‌సీజీ అల్ఫా సీటో ప్రొటీన్‌ వంటి హార్మోన్ల పరీక్షలు చేస్తారు.

ఈ జాగ్రత్తలూ అవసరమే..
క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మరికొన్ని జాగ్రత్తలూ తప్పవు.

* రొమ్ముక్యాన్సర్‌, కొన్నిరకాల అండాశయాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చు. కుటుంబ చరిత్రలో అవి ఉన్నప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు త్వరగా మొదలుపెట్టి, తరచూ చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌ కోసం రక్తపరీక్ష (బీఆర్‌సీఏ 1 అండ్‌ 2 యాంటిజెన్ల పరీక్ష) తప్పనిసరి. తద్వారా క్యాన్సర్‌ కారకమైన జన్యువును ముందే గుర్తించవచ్చు.

* పాప్‌స్మియర్‌ తేడాలూ, హెచ్‌పీవీ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినప్పుడు సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ముప్ఫై ఐదేళ్ల నుంచే తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.

* క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందని తేలినప్పుడు ఆ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా ముందుగానే తొలగించడం కూడా ఒక మార్గం. (ఉదాహరణకు వక్షోజాలూ, గర్భాశయం, అండాశయాల తొలగింపు).

* అకస్మాత్తుగా శరీరతత్వాల్లో తేడాలు, దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్ఛార్జి, నెలసరితో సంబంధం లేకుండా, కలయిక తరవాత రక్తస్రావం కావడం, చనుమొనల నుంచి రక్తంతో కూడిన డిశ్ఛార్జి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే గొంతు బొంగురుపోవడం, మలబద్ధకం, తరచూ విరేచనాలు కావడం, మలంలో రక్తం వచ్చినా.. వైద్యుల్ని సంప్రదించాలి. అయితే ఇన్‌ఫెక్షన్ల ద్వారా వచ్చే కాలేయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు టీకాలు ఉంటాయి. హెపటైటిస్‌ బి అందులో ఒకటి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని నివారిస్తుంది హెచ్‌పీవీ టీకా. ఇది మన దేశంలో అందుబాటులో ఉంది. ఈ టీకా క్యాన్సర్‌కి దారితీసే హెచ్‌పీవీ 16, 18 వైరస్‌లను నిరోధిస్తుంది. హెచ్‌పీవీ వైరస్‌ల వల్ల మలద్వారం, పేగులూ, గొంతు క్యాన్సర్లు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ. వాటినీ నివారించాలంటే టీకా తప్పనిసరి. దీన్ని పది నుంచి పన్నెండు ఏళ్లలోపు అమ్మాయిలకు మూడు విడతల్లో ఇస్తారు. చిన్నతనంలో తీసుకోని వారు నలభై ఐదేళ్ల వరకూ కూడా వేయించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చర్మక్యాన్సర్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎండ ముఖ్యంగా అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా చూసుకోవాలి. పుట్టుమచ్చలు పెరగడం, కొత్త మచ్చలు కనిపించడం.. రంగు మారడం లాంటి సంకేతాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అది చర్మక్యాన్సర్‌ కావచ్చు.

Courtesy with : Dr.Savithadevi @ eenadu vasundhara.(02-06-2014).
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Hay fever- హే ఫీవర్‌

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Hay fever- హే ఫీవర్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రోగ నిరోధక శక్తి అంతంతమాత్రంగా ఉన్న బాధితుడు పోలెన్‌, లేదా దుమ్ము వంటి అలెర్జెన్‌ను లోనికి పీల్చుకున్నప్పుడు అలెర్జిక్‌ రినైటిస్‌, లేదా హే ఫీవర్‌ వస్తుంది. ఇది ఒంట్లో యాంటీబాడీల ఉత్పత్తిని పెంచేస్తుంది. ఈ యాంటీబాడీలు చాలావరకు హిస్టమైన్లుండే మాస్ట్‌ కణాలతో బంధం ఏర్పరచుకుంటాయి. పొలెన్‌, దుమ్ము, హిస్టమైన్‌ (ఇతర రసాయనాల) ద్వారా ప్రభావిమైనప్పుడు ఈ మాస్ట్‌ కణాలు విడుదలవుతాయి. ఇది దురద, వాపు, శ్లేష్మం ఉత్పత్తి వంటివాటికి దారితీస్తుంది. ఈ లక్షణాల తీవ్రత వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. బాగా సున్నితంగా ఉండే వ్యక్తుల్లో హైవ్స్‌, దురద వంటివి కన్పించవచ్చు. కలుషిత గాలిలో ఉండే క్లోరిన్‌, డిటర్జెంట్ల వంటి రసాయనాలు సాధారణ పరిస్థితుల్లోనైతే ఏమీ చేయవు. కానీ ఇలాంటప్పుడు మాత్రం పరిస్థితిని అవే చాలా తీవ్రతరం చేస్తాయి.

లక్షణాలు :

కంటి పై పొర ఉబ్బడం, చర్మం కందడం, ఎర్రబారడం, కనురెప్పలు ఉబ్బడం, దిగువ కనురెప్పలోని రకతనాళాలు నిశ్చలమవడం, ముక్కు దిగువ భాగంలో ముడతలు, ముక్కు టర్బినేట్స్‌లో వాపు, చెవుల్లో నిశ్చలత వంటివి అలెర్జిక్‌ రినైటిస్‌ ఉండే వ్యక్తుల్లో సాధారణంగా కన్పించే శారీరక లక్షణాల్లో కొన్ని.హాచ్‌! తుమ్ములు, కళ్ళలోను౦డి నీరుకారడ౦, కళ్ళు దురదపెట్టడ౦, ముక్కు చీదర, ముక్కు కారడ౦ వ౦టివి కోట్లాదిమ౦దికి వస౦త రుతువు ఆర౦భాన్ని సూచిస్తాయి. వారికి ఆ ఎలర్జీ సాధారణ౦గా పుప్పొడి ని౦డిన వాతావరణ౦ కారణ౦గా కలుగుతు౦ది. పారిశ్రామిక ప్రప౦చ౦లోని ప్రతి ఆరుగురిలో ఒకరు ఆయా రుతువుల్లో కలిగే పుప్పొడి ఎలర్జీలతో (ఈ ఎలర్జీలు హే ఫీవర్‌ అని కూడా పిలువబడతాయి) బాధపడుతున్నారని బిఎమ్‌జి (పూర్వ౦ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌) అ౦చనా వేసి౦ది.
  • Treatment : 
ఇక్కడ ముఖ్యముగా ముందుగా బాధనివారణ కోసము మందులు వాడాలి .
జ్వరానికి : పరాసెటమాల్ 500 మి.గ్రా . రోజుకు 2 లేదా 3 సార్లు 4-5 రోజులు .
జలుబుకు : పారాసెతమాల్ తో కలిసిఉన్న సెట్రిజన్‌ + ప్రినెలెఫ్రిన్‌ హైడ్రోక్లోరైడ్ (ముక్కు దిబ్బడ పోవడానికి) మాత్రలు వాడాలి.
ఎలెర్జీకి : లీవో సిట్రజన్‌ 5 మి,గ్రా. రోజుకు 2 సార్లు 3-4 రోజూలు వాడాలి ,

పోలెన్‌ కళ్ళకు చేరకుండా సన్‌గ్లాసెస్ వాడాలి . పోలెన్‌ కు జుట్టు , బట్టలు మ్యాగ్నెట్ లాంటివి. . . బయటనుండి ఇంటికి వచ్చేటప్పుడు వీటిని బాగా విదలించుకొని రావాలి. దుస్తులు మార్చుకోవడము , స్నానము చేయడము వలన హే ఫీవర్ లక్షణాల తీవ్రత తగ్గిపోతుంది. ఒత్తిడికి , హేఫీవర్ కు లింక్ ఉంది. ఒత్తిడి స్థాయిలు పెరిగే కొద్దీ లక్షణాలు పెరుగుతాయి. యాంటీ హిస్టమిన్‌  నాజల్ డ్రాప్స్ , స్ప్రే లు , అవసరమైతే యాంటి హిస్టమిన్‌ ఐ డ్రాప్స్ వాడాలి. 
  • ======================
isit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 27, 2014

Brest cancer myths and truths-రొమ్ము క్యాన్సర్‌...కొన్ని వాస్తవాలు-అపోహలు

  •  


  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --రొమ్ము క్యాన్సర్‌...కొన్ని వాస్తవాలు-అపోహలు  -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

Breast Cancer - Myth and Reality: రొమ్ము కాన్సర్ ఎందుకు వస్తుంది? వస్తే ఏం జరుగుతుంది? దాన్ని తగ్గించుకోవడం ఎలా? ఇలాంటి పూర్తి వివరాల్ని హైదరాబాద్... ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ చెబుతున్నారు. డాక్టర్ దత్తాత్రేయ ప్రకారం... రొమ్ములోని కణాలు కంట్రోల్ లేకుండా పెరిగి కణితిని ఏర్పరచుకున్నప్పుడు రొమ్ము కాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ప్రాణాంతక కణితులు చుట్టుపక్కల కణజాలంలోకి లేదా శరీరంలోని సుదూర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతాయి. అయినప్పటికీ, ప్రమాద కారకాలను గుర్తించడం ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్సలో దీనిని నివారించడంలో సహాయపడుతుంది. రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదానికి సంబంధించిన అనేక అంశాలలో వయస్సు ఒకటి. ఒక వ్యక్తి వయసు పెరిగేకొద్దీ రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కణాల యొక్క పునరావృత సామర్థ్యంతో పాటు కణాలలో అసాధారణ మార్పులు సంభవించే అవకాశం ఉంది.

50 ఏళ్లు దాటిన ఆడవారిలో రొమ్ము కాన్సర్ సర్వసాధారణం. నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం, డాక్టర్లు 55-64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో రొమ్ము కాన్సర్‌ను ఎక్కువగా నిర్ధారిస్తారు. 40 ఏళ్లలోపు మహిళల్లో 4% ఇన్వాసివ్ రొమ్ము క్యాన్సర్లను నిర్ధారిస్తారు. అయితే వారి 50 ఏళ్ళలో 23% మంది మహిళల్లో రోగ నిర్ధారణ జరిగింది. 60 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలలో 27%. చిన్న వయస్సులో ఉన్న మహిళల్లో కొద్ది శాతం మాత్రమే బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, అన్ని వయసుల మహిళలు, ముఖ్యంగా రొమ్ము కాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర కలిగిన వారి రొమ్ములపై శ్రద్ధ వహించడం, స్వీయ పరీక్షలు చేయడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం తప్పనిసరి.

50 ఏళ్లు దాటిన ఆడవారిలో రొమ్ము కాన్సర్ సర్వసాధారణం. నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ (NCI) ప్రకారం, డాక్టర్లు 55-64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో రొమ్ము కాన్సర్‌ను ఎక్కువగా నిర్ధారిస్తారు. 40 ఏళ్లలోపు మహిళల్లో 4% ఇన్వాసివ్ రొమ్ము క్యాన్సర్లను నిర్ధారిస్తారు. అయితే వారి 50 ఏళ్ళలో 23% మంది మహిళల్లో రోగ నిర్ధారణ జరిగింది. 60 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలలో 27%. చిన్న వయస్సులో ఉన్న మహిళల్లో కొద్ది శాతం మాత్రమే బ్రెస్ట్ కాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, అన్ని వయసుల మహిళలు, ముఖ్యంగా రొమ్ము కాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర కలిగిన వారి రొమ్ములపై శ్రద్ధ వహించడం, స్వీయ పరీక్షలు చేయడం, ఏదైనా సమస్య ఉంటే చెప్పడం తప్పనిసరి.

భారతదేశంలో బ్రెస్ట్ కాన్సర్ ఎందుకు పెరుగుతోంది? ఎలా తగ్గించాలి? : భారతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో రొమ్ము కాన్సర్ 25% నుంచి 32% వరకు ఉంటుంది. ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము కాన్సర్తో బాధపడుతుండగా, భారతదేశంలో ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది.

భారతదేశంలో బ్రెస్ట్ కాన్సర్ ఎందుకు పెరుగుతోంది? ఎలా తగ్గించాలి? : భారతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. భారతదేశంలోని అన్ని నగరాల్లో రొమ్ము కాన్సర్ 25% నుంచి 32% వరకు ఉంటుంది. ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము కాన్సర్తో బాధపడుతుండగా, భారతదేశంలో ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తోంది.

భారతదేశం అంతటా రొమ్ము కాన్సర్ బాగా పెరగడం ప్రధానంగా వేగంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, ముసలితనం ప్రభావితం కావడం వల్ల పెరుగుతున్న ధోరణులను చూపిస్తోంది. వైవాహిక స్థితి, స్థానం (పట్టణ / గ్రామీణ), BMI, తల్లి పాలివ్వడం, తక్కువ సమానత్వం, అధిక బరువు, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, సరికాని ఆహారం, అధిక కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు భారతదేశంలో ప్రధాన ప్రమాద కారకాలు. నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆర్థిక పరిమితులు కారణంగా వ్యాధిని త్వరగా గుర్తించే పరిస్థితి లేదు. దీనివల్ల మరణాల రేటు పెరుగుతోంది. వ్యవస్థీకృత రొమ్ము కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం, డయాగ్నోస్టిక్ పరికరాల కొరత కూడా రొమ్ము కాన్సర్ పెరగడానికి కారణమవుతున్నాయి. అందువల్ల కాన్సర్ ఇప్పటికే ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది రోగులు అధునాతన చికిత్స పొందుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఒక మంచిపరిమామం. ఎందుకంటే రొమ్ము కాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. రోగి కోలుకున్న తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది.

భారతదేశం అంతటా రొమ్ము కాన్సర్ బాగా పెరగడం ప్రధానంగా వేగంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల, ముసలితనం ప్రభావితం కావడం వల్ల పెరుగుతున్న ధోరణులను చూపిస్తోంది. వైవాహిక స్థితి, స్థానం (పట్టణ / గ్రామీణ), BMI, తల్లి పాలివ్వడం, తక్కువ సమానత్వం, అధిక బరువు, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, సరికాని ఆహారం, అధిక కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు భారతదేశంలో ప్రధాన ప్రమాద కారకాలు. నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆర్థిక పరిమితులు కారణంగా వ్యాధిని త్వరగా గుర్తించే పరిస్థితి లేదు. దీనివల్ల మరణాల రేటు పెరుగుతోంది. వ్యవస్థీకృత రొమ్ము కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం, డయాగ్నోస్టిక్ పరికరాల కొరత కూడా రొమ్ము కాన్సర్ పెరగడానికి కారణమవుతున్నాయి. అందువల్ల కాన్సర్ ఇప్పటికే ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది రోగులు అధునాతన చికిత్స పొందుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఒక మంచిపరిమామం. ఎందుకంటే రొమ్ము కాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. రోగి కోలుకున్న తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది.

రొమ్ము కాన్సర్ ను ముందుగా గుర్తించడానికి కొన్ని దశలు: 1. రొమ్ము కాన్సర్ నిర్ధారణ, లక్షణాలు, రొమ్ము కాన్సర్ పునరావృత పరీక్షలు, సరైన చికిత్స గురించి తెలుసుకోండి. 2. స్వీయ పరీక్షల గురించి తెలుసుకోండి. మీ రొమ్ములను మీ స్వంతంగా క్రమం తప్పకుండా పరిశీలించండి 3. మీ రొమ్ములలో ఏదైనా అసాధారణ అంశాలు ఉన్నట్లు అనిపిస్తే ఆంకాలజిస్టును కలవండి. 4. రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ముందు తరాల వారికి ఉంటే... అలాంటి వారసత్వ మహిళలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 5. వ్యాయామం, మద్యపాన పరిమితి వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

రొమ్ము కాన్సర్ ను ముందుగా గుర్తించడానికి కొన్ని దశలు: 1. రొమ్ము కాన్సర్ నిర్ధారణ, లక్షణాలు, రొమ్ము కాన్సర్ పునరావృత పరీక్షలు, సరైన చికిత్స గురించి తెలుసుకోండి. 2. స్వీయ పరీక్షల గురించి తెలుసుకోండి. మీ రొమ్ములను మీ స్వంతంగా క్రమం తప్పకుండా పరిశీలించండి 3. మీ రొమ్ములలో ఏదైనా అసాధారణ అంశాలు ఉన్నట్లు అనిపిస్తే ఆంకాలజిస్టును కలవండి. 4. రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ముందు తరాల వారికి ఉంటే... అలాంటి వారసత్వ మహిళలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. 5. వ్యాయామం, మద్యపాన పరిమితి వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

రొమ్ము కాన్సర్‌కు సంబంధించిన మల్టీడిసిప్లినరీ విధానం, అవగాహన కార్యక్రమాలు, నివారణ కొలత, ముందస్తుగా గుర్తించడానికి స్క్రీనింగ్ కార్యక్రమాలు, చికిత్స సౌకర్యాల లభ్యత వంటివి... రొమ్ము కాన్సర్‌కు సంబంధించిన పెరుగుదల, మరణం రెండింటినీ తగ్గించడానికి చాలా ముఖ్యమైనవి. (Article by Dr. Palanki Satya Dattatreya, Medical oncologist, Omega Hospitals, Hyderabad)


  • ======================= 
Courtesy with eenadu vasundhara @Eenadu news paper
  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, August 26, 2014

Vaginal discharge-వెజినల్ డిశ్చార్జ్

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Vaginal discharge-వెజినల్ డిశ్చార్జ్ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మహిళల్లో వచ్చే కొన్ని ప్రత్యేక సమస్యల గురించి చెప్పుకోవడము కష్తముగాను , ఇబ్బందిగాను ఉంటుంది. ఒక్కోసారి వైద్యుల వద్దకు వెళ్ళడానికి సైతం సందేహ పడుతుంటారు. వాటిలో ఒకటి వెజినల్ డిశ్చార్జి . ఇది చాలా స్త్రీలలో సర్వసాధారణము . దుర్వాసన , లోదుస్తులపై మరకలు , దురద  లేదా మంట  వంటి ఇతర ప్రభావాలతో సతమతం అవుతూ ఉంటారు. వెజినల్ పరిశుభ్రత , వాష్ లు , మొదలైన వాటిగురించి అపోహలు , సంశయాలు ఉంటుంటాయి. అసలు వాస్తవాలు తెలుసుకుంటే సంశయాలు వేధించవు .

వెజీనా మహిళ శరీరము లోపల ఉండే మజిల్ ట్యూబ్ .ఇది సర్విక్స్ నుండి వెజైనల్ ఓపెనింగ్ వరకూ సాగుతుంది. బయటి భాగాన్ని " వల్వా" గా పిలుస్తారు. భాహ్య సెక్స్ అవయవాలు వెజైనల్ ఓపెనింగ్ చుట్తూ ఉంటాయి. సహజ సెక్రిషన్ల ద్వారా దానికదే క్లీన్‌ చేసుకునే మాదిరిగా వెజైనా డిజైన్‌ చేయబడి ఉంటుంది. సహజ ఋతుక్రమము తో పాటు... క్లియర్ లేదా తెల్లని ద్రవాల ఉత్పత్తి సహజముగా సాగుత్తూ ఉంటాయి.వెజైనల్ దిశ్చార్జి ప్రతిసారీ చెడ్డ లక్షణము కాదు . ఇన్‌ఫెక్షన్‌ లేదా మరే ఇతర సమస్యలతోనో ఇబ్బంది పడుతున్నట్లు కాదు. వైట్ డిశ్చార్జి సెక్సువల్ గా ట్రాన్స్ మిట్ అయ్యే ఇన్‌ఫెక్షన్‌ అనుసంధానము అయివుంటుందని చాలా మంది అపోహ . డిశ్చార్జి మోతాదులో మార్పులు 100 శాతము హార్మోనల్ ... ఇంకా చెప్పాలంటే ఇది ఋతుక్రమం సైకిల్ కు లింకై ఉంటుంది. ఋతుక్రమ సైకిల్ లో వెజైనల్ డిశ్చార్జి లక్షణం , మోతాదు మారుతూ ఉంటాయి. అండం విడుదల సమయములో చిక్కగా సాగినట్లు ఉంటుంది. ఆరోగ్యవంతమైన డిశ్చార్జి  గాఢమైన వాసన , రంగు ఉండదు. . . కాకుంటే అసౌకర్యవంతమైన తడి ఉంటుంది. అంతే.

ప్రేగులు తర్వాత స్త్రీల శరీరములోకెల్లా అత్యధిక బ్యాక్టీరియా ఉండే శరీరభాగము వెజైనా. అత్యంత సాధారణ వెజైనల్ బ్యాక్టీరియా ల్యాక్టోబాసిల్లస్ . ఇది లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడము ద్వారా వెజైనా ఎసిడిటీ ని కాపాడుతూ ఉంటుంది. దీనివలన ఏర్పడే యాంటీ-బ్యాక్టీరియల్ యాక్టివిటీ వెజైనా ను విభిన్న ఇన్‌ఫెక్షన్‌ ల నుండి పరిరక్షిస్తుంది.  దురదలు , డిశ్చార్జి , ఇన్‌ఫ్లమేషన్‌  మొదలైన వాటికి ప్రధాన కారణము సహజ బ్యాక్టీరియల్ సమతుల్యత ఉల్లంఘన , ఎసిడితీ స్థాయిలలో మార్పులు . వెజైనా పి.హెచ్ . అంటే తక్కువ ఎసిడిటీకి లేదా ఎక్కువ ఆల్కలైన్‌ ఉన్నట్లైతే ల్యాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా మోతాదు పడిపోతుంది. . . ఇతర బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల  " బ్యాక్టీరియల్ వెజినోసిస్  లేదా థ్రష్  వంటి ఇన్‌ఫెక్షన్‌  వచ్చి దురద , ఇర్రిటేషన్‌ , అసాధారణ డిశ్చార్జి  వంటి సమస్యలు వస్తాయి.

ప్రవేటు భాగాల్లో ---పరిశుభ్రత సరిగా పాటించక పోవడము , ఎక్కువ సోప్ నీరు వాడడము , బిగుతు దుస్తులు ధరించడము , సింథటిక్ లోదుస్తులు వాడడము , సురక్షితం కాని సెక్స్ , సెంటెడ్ ట్యాయ్లెట్ పేపర్లు , సెంటెడ్ టాంపన్లు లేదా స్ప్రేలు వంటి పరిమళాల ఉత్పత్తులు అతిగా వాడడము , ఎక్కువ సార్లు వాష్ చేయడము  మున్నగు వాటివలన మంచి బ్యాక్టీరియా ఫ్లుష్-అవుట్ కావడము ముఖ్యకారణము ,.

ప్యూబిక్ హెయిర్ --- సాధారణ సబ్బుతో శుభ్రము చేసుకోవాలి . పేలు , గజ్జి , తామరల వంటి ఇన్‌ఫెక్షన్‌లు రాకుండా జాగ్రత్తపడాలి. యానస్ , వెజైనా నడుమ ఉండే ప్రదేశాన్ని నీట్ గా స్క్రబ్ చేయాలి . ముందుగా వెజైనా వాష్ చేసి యానస్ ను వాష్ చెయ్యాలిగాని ... యానస్ వాష్ తరువాత వెజైనాను టచ్ చెయ్యకూడదు ... ఇక్కడ ఉండే క్రిములు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌ కి కారణమవుతాయి. ప్యూబిక్ హెయిర్ ను ఎప్పటికప్పుడు  సేవ్ చెయ్యాలి . సెక్స్ తరువాత తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఋతుస్రావ సమ్యములో పరిశుభ్రత మరింత ఎక్కువగా పాటించాలి. ప్యాడ్స్ తరచు మారుస్తూ ఉండాలి. కాటన్‌ అండర్ వేర్ లను ధరిస్తుండాలి. లోదుస్తులు బాగా గాలి ఆడే విధంగా ఉండాలి.

వెజైనా ఆరోగ్యానికి .--- . వెజైనల్ డిశ్చార్జీలు ఎప్పుడూ మహళల్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఈ రోజుల్లో సరియైన పరిశుభ్రతకోసము అనేక ఫార్ములేషన్లు లేదా వెజైనల్ వాష్ లు అందుబాటులో ఉంటున్నాయి. .సబ్బుల ష్తానే ఈ వాష్ లను క్రమము తప్పకుండా వాడుకోవచ్చు . ఇవి వెజైనా ఆరోగ్యాన్ని , పరిశుభ్రతను మెయింటైన్‌ చెయ్యడము లో సహకరిస్తాయి. కొన్ని పార్ములేషన్లు ఎలర్జిక్ అవునా కాదా చూసుకోవాలి. వెజైనల్ డిశ్చార్జీలు సాధారణంగా ఉన్నట్లైతే ఎవరికీ ప్రత్యేకమైన వాష్ లతో పని ఉండదు. డిశ్చార్జి ఇబ్బందిగా  , అసాధారణముగా ఉన్నప్పుడు గైనొకాలొజిస్ట్ ను సంప్రదించి మంది సలహా ను తీసుకోవాలి.



  • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 25, 2014

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఉపాయాలు పాటించాలి?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఉపాయాలు పాటించాలి?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రస్తుతం వేసవి కాలం వస్తోందంటే చాలు ఎక్కువగా దోమల బెడద ఉండనే ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల పెట్టే దురద, మంట చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల మనం గోకడం తో మచ్చలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి వాటి నుండి మనం బయట పడాలంటే సులువైన మార్గాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

1).దోమలు కుట్టిన తర్వాత కలబందను పూస్తే కలబంద లో ఉండే కొన్ని యాంటీ సెప్టిక్ లక్షణాలు వల్ల చర్మానికి హాని కలగకుండా చేస్తాయి.

2). దోమలు కుట్టినట్లుయితే ఆ ప్రదేశంలో కాస్త తేనె రాస్తే కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో వాటిని శుభ్రం చేయడం వల్ల తేనెలో వుండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం వల్ల.. దురద,వాపు లో నుంచి ఉపశమనం కలుగుతుందట.

3). దోమ కుట్టిన చోట కొబ్బరి నూనెను రాయడం వల్ల అందులో ఉండే కొన్ని మైక్రో బిల్స్ వల్ల దోమకాటు కుట్టినచోట.. ఈ కొబ్బరి నూనెను రాయడం వల్ల దోమ కుట్టిన మచ్చలు వాపులు ఉండవు.

4). ఇక మరొక టిప్స్ ఎమిటంటే.. పసుపు దోమ కుట్టిన చోట రాయడంవల్ల పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ వల్ల దోమ కాటు నుండి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా దోమలు ఇంటి లోపలికి రాకుండా ఉండాలి అంటే.. ఎక్కువగా కిటికీలను, మెయిన్ డోర్ తెరవకుండా ఉండాలి. ఒకవేళ అలా ఓపెన్ చేసుకోవాలంటే వాటి చుట్టూ ఒక మెసేజ్ లు లాంటివి ఏర్పాటు చేసుకోవడం అవసరం.

ఇక మరొకటి ఏమిటంటే కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే దోమలు బయటికి వెళ్లిపోతాయి.

రోజు మిల్స్ చెట్టు కాండాలు మొక్కలను కాల్చడం వల్ల.. ఆ పొగ కు దోమలు పరార్ అవుతాయి.

దోమలు ఇంట్లో ఎక్కువగా ఉన్నట్లయితే కాఫీ పొడిని ఒక పాత్రలో కానీ, ఒక పేపర్లో కానీ పోసి పొగ పెడితే దోమలు ఉండవు.

  • ========================
Courtesy with Eenadu vasundhara
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 23, 2014

Diabetes less with good sleep-చక్కని నిద్రతో మధుమేహం దూరం




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Diabetes less with good sleep-చక్కని నిద్రతో మధుమేహం దూరం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గాఢనిద్ర లేకుండా, తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహానికి నిద్ర నాణ్యతకూ మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యుక్తవయస్కుల్లో గాఢనిద్ర తగ్గితే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే శక్తి తగ్గటం వల్ల టైప్‌-2 మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం మూడు రోజులపాటు ఇలా గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఇన్సులిన్‌ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించటానికి ఎక్కువ మోతాదుల్లో ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతంగా భావించవచ్చు.

నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది. గాఢనిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతుంటుందనీ, ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందనీ పరిశోధకులు అంటున్నారు.
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Seven events to prevent paralysis-పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడే 7 అంశాలు.

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Seven events to prevent paralysis-పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడే 7 అంశాలు.-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పక్షవాతం చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స అందకపోతే దీర్ఘకాలం వైకల్యం బారినపడే ప్రమాదముంది. కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పు ముంచుకు రావొచ్చు. అయితే మంచి విషయం ఏంటంటే.. జీవనశైలి మార్పులతో అసలు పక్షవాతం రాకుండా చూసుకునే వీలుండటం. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం, పొగ తాగకపోవటం.. ఈ ఏడు అంశాలు పక్షవాతం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సూత్రీకరించింది. ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు తాజా అధ్యయనం కూడా బలపరుస్తోంది. పరిశోధకులు ఇటీవల 23వేల మందిపై ఐదేళ్ల పాటు అధ్యయనం చేసి, పక్షవాతం ముప్పుల ప్రభావాలను అంచనా వేశారు. వీటిల్లో అధిక రక్తపోటు అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటున్నట్టు బయటపడింది. ''రక్తపోటు అదుపులో లేనివారితో పోలిస్తే రక్తపోటు బాగా అదుపులో ఉన్నవారికి పక్షవాతం ముప్పు 60% తక్కువగా ఉంటోంది'' అని వెర్మాంట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మేరీ కష్‌మన్‌ చెబుతున్నారు. అలాగే పొగ తాగనివారికి, పొగ అలవాటు మానేసిన వారికి కూడా పక్షవాతం ముప్పు 40% తగ్గినట్టు వెల్లడైంది. అందువల్ల తేలికైన జీవనశైలి మార్పులతో పక్షవాతాన్ని దూరంగా ఉంచుకునే అవకాశముందని గుర్తించాలని సూచిస్తున్నారు.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Necesity of fresh air and light for health-ఆరోగ్యానికి స్వచ్చమైన గాలి వెలుతురు అవశ్యకము
--
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    గాలి దూరే దారి లేకుండా తలుపులన్నీ ముయ్యగట్టుకుని గదిగదికీ ఏసీలు పెట్టుకోవటం.. వెలుతురు చొరబడే సందు లేకుండా చేసుకుని పట్టపగలు కూడా కృత్రిమ లైట్ల కింద గడపటం.. ఇదో ఘనతగా, ఇదే ఆధునికతగా భావిస్తున్న ఈ రోజుల్లో మనమేం కోల్పోతున్నామో.. దేనికి చేరువ అవుతున్నామో.. చదవండి!
    మంచి మాటలు.. ఎప్పుడూ చప్పగానే అనిపించొచ్చు. ఏవో సుద్దులు చెబుతున్నారని విసుక్కోవచ్చు. ఉదాహరణకు ఇంట్లోకి 'గాలీ-వెలుతురూ' ధారాళంగా రావాలని ఎవరైనా చెప్పారనుకోండి.. ఏదో పాత పాటేలెమ్మని మనం తలకంతగా ఎక్కించుకోకపోవచ్చు.
    కానీ మీకో విషయం తెలుసా?
    ఆరుబయటి గాలికీ, చక్కటి వెలుతురుకూ... ఔషధాలను తలదన్నే గొప్ప ప్రభావం ఉంది. ఎంత గొప్ప అంటే... ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకుంటున్న శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ను మించిన సత్ఫలితాలు వీటితో కనబడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిశోధనా రంగంలో అనూహ్యంగా కొన్నికొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. అప్పటికి అవేమంత పెద్ద విషయాల్లా అనిపించకపోవచ్చుగానీ.. వాటి ప్రాముఖ్యం తర్వాతెప్పుడో తెలిసొస్తుంది. అలాంటిదే ఈ సంఘటన!
1968. వేడి గాలి చెవులను తాకుతున్న ఓ వేసవి రాత్రి.
మైక్రోబయాలజిస్టులు హెన్రీ డ్రూట్‌, కేఆర్‌ మే ఇద్దరూ బ్రిటన్‌ రక్షణ పరిశోధనా భవనం మేడ మీద నిలబడి తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. బయట ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులు ఏ సమయంలోనైనా జీవాయుధాలను ప్రయోగిస్తే ఏం చెయ్యాలి? బాంబుల్లో వ్యాధికారక సూక్ష్మక్రిములను దట్టించి.. ఏ లండన్‌ మీదో జారవిడిస్తే మన పనేమిటి? ఆ సూక్ష్మక్రిములు వాతావరణంలో ఎంతకాలం బలీయంగా ఉంటాయి? వాటిని ఎదుర్కొనేదెలా? సమాధానం కోసం చిన్న ప్రయోగం మొదలుపెట్టారు. ఒక దువ్వెన చుట్టూ సాలెగూడు దారాలు చుట్టి.. దాని మీద మనకు సర్వసాధారణంగా జబ్బులు తెచ్చిపెడుతుండే 'ఈ.కోలీ' బ్యాక్టీరియా ఎక్కించి.. మేడ మీద గాలిలో ఉంచారు. ధారాళంగా గాలి వీస్తున్న ఆ ఆరుబయలు వాతావరణంలో.. 2 గంటలు కూడా తిరక్కముందే ఆ బ్యాక్టీరియా పూర్తిగా చచ్చిపోయింది. ఇక అదే రకం దువ్వెనను తీసుకువెళ్లి.. అంతే వెచ్చదనం, అంతే తేమ ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టిచూశారు.. 2 గంటల తర్వాత కూడా బ్యాక్టీరియా బ్రహ్మాండంగా బతికే ఉంది. బ్యాక్టీరియా లోపల బతికి ఉండటానికీ, ఆరుబయటి గాలిలో అట్టే సమయం బతకలేకపోవటానికీ కారణం ఏమిటి? దీనర్థం.. ధారాళమైన గాలిలో బ్యాక్టీరియాను చంపేదేదో ఉంది! లోపల వాతావరణంలోకి వచ్చేసరికి అది కరవు అవుతోంది! విషయం అర్థమైంది. ఇక అదేమిటో కనిబెట్టాలని లోతుగా పరిశోధనలు మొదలుపెట్టారు ఇద్దరూ. తాత్కాలికంగా దానికి 'ఓపెన్‌ ఎయిర్‌ ఫ్యాక్టర్‌' అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతలోనే జీవయుధాల భయాలు వీడిపోయాయి, వీళ్ల పరిశోధనలూ నిలిచిపోయాయి!

కానీ ఇన్నేళ్ల తర్వాత.. ఇప్పుడీ పరిశోధనా పత్రాల దుమ్ముదులిపి.. వీటి ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం కనబడుతోంది. కారణం.. అద్భుత అస్త్రాలనుకుని రంగం మీదికి తెచ్చిన యాంటీబయాటిక్స్‌.. వ్యాధికారక బ్యాక్టీరియా ముందర పూచికపుల్లల్లా ఎందుకూ కొరగాకుండాపోతున్నాయి! ఈ యాంటీబయాటిక్స్‌కు అలవాటుపడిపోతున్న సూక్ష్మక్రిములు మహా మొండిగా.. దేనికీ లొంగకుండా తయారై.. మన ఉనికికే పెనుసవాల్‌ విసురుతున్నాయి. దీంతో క్షయ, న్యుమోనియా, గనోరియా వంటి సమస్యలను ఎదుర్కొనటం ఇప్పుడు మహా కష్టంగా తయారవుతోంది. మరి ఈ మొండి బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు వాళ్ల పరిశోధనల్లో వెల్లడైన కిటుకులేమైనా ఉపయోగపడతాయేమో..?
నైటింగేల్‌ చెప్పిందిదే!
ధారాళమైన, స్వచ్ఛమైన గాలిలో ఏదో మహత్తు ఉందన్న విషయం కొత్తగా కనిబెట్టిందేం కాదు. క్రిమియన్‌ యుద్ధ సమయంలోనే ఇది బయటపడింది. ఆ యుద్ధ సమయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇరుకిరుకు ఆసుపత్రుల్లో కంటే.. యుద్ధక్షేత్రంలోనే ఉండిపోయిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవటాన్ని గమనించారు పరిశోధకులు. ఈ కిటుకు తెలుసుకున్న విఖ్యాత నర్సు ఫ్లారెన్స్‌ నైటింగేల్‌.. ఆసుపత్రి గదులకు ఉన్న కిటికీలూ, దర్వాజాలూ బార్లా తెరిచి ఉంచటం వంటి జాగ్రత్తలతో ఆసుపత్రుల్లో మరణాల రేటును గణనీయంగా తగ్గించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఇదే సూత్రాన్ని ఆమె బ్రిటన్‌ ఆసుపత్రుల్లో కూడా ప్రవేశపెట్టారు. ''రోగి చుట్టూ ఎప్పటికప్పుడు కొత్తగాలి వస్తుండటం, తాజా గాలి ఆవరిస్తుండటం చాలా అవసరం. అప్పుడుగానీ రోగి వూపిరితిత్తుల్లోనూ, చర్మం మీదా ఉండే రుజాగ్రస్త కశ్మలాలు కొట్టుకుపోవు'' అని ఆమె తన నోట్సులో ప్రత్యేకంగా రాసుకున్నారు. ఈ జాగ్రత్తల వల్ల రోగులు త్వరగా కోలుకోవటం చూసిన ఆసుపత్రులు ఇదే నమూనాలను పాటిస్తూ రోగులను ఉంచే గదులకు- కింది నుంచి పైవరకూ పెద్దపెద్ద కిటికీలు అమర్చి.. లోపలికి గాలి ధారాళంగా ప్రసరించేలా చర్యలు చేపట్టారు. ఇలాంటి గదులను ప్రత్యేకంగా 'ఫ్లారెన్స్‌ వార్డులని' పిలవటం కూడా ఆరంభించారు. గాలి ధారాళంగా లోపలికి రావటం వల్ల- గాలి ద్వారా వ్యాపించే రోగకారక సూక్ష్మక్రిముల సంఖ్య పల్చబడి, వాటి ప్రభావం తగ్గటమే కాదు.. అవి చాలా వరకూ నశించిపోతున్నాయని కూడా పోర్టన్‌ డౌన్‌ పరిశోధనల్లో వెల్లడైంది.

నైటింగేల్‌ వార్డులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ పెద్దపెద్ద కిటికీలన్నీ దక్షిణం వైపు గోడలకు ఉంటాయి. దీనివల్ల గదుల్లోకి చక్కగా ఎండ కూడా పడుతుంటుంది. దీంతో సూర్యరశ్మికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ప్రజలను విపరీతంగా కబళిస్తున్న క్షయ వ్యాధి పీడితులకు ఈ వార్డులు ఎంతో మేలు చేశాయి. సూర్యరశ్మి కేవలం గాలిలోనూ, చర్మం మీద ఉన్న క్రిములను నిర్మూలించటమే కాదు.. ఒంట్లో విటమిన్‌-డి ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక వ్యవస్థలో కొత్త ఉత్తేజాన్ని తేవటం ద్వారా క్షయ క్రిములను కూడా నిర్మూలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో క్షయ వ్యాధి పీడితుల కోసం ప్రపంచవ్యాప్తంగా గాలీవెలుతురూ ధారాళంగా వచ్చే 'సోలార్‌ క్లినిక్స్‌' పుట్టుకొచ్చాయి. మన దేశంలో కూడా ఇదే పద్ధతిలో 'టీబీ శానిటోరియాలు' నిర్మించారు. మెల్లగా శాస్త్రవేత్తలు పరిశోధించి.. సూర్యకాంతిలోని యూవీ కాంతి (అల్ట్రా వయొలెట్‌-అతినీల లోహిత కిరణాలు) సూక్ష్మక్రిములను అంతం చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే ఆసుపత్రులన్నీ యూవీ కాంతిని ప్రసరింపజేసే ప్రత్యేక లైట్లను వినియోగించటం మొదలుపెట్టాయిగానీ వాటివల్ల చర్మం క్యాన్సర్లు, కంటి శుక్లాల వంటి దుష్ప్రభావాలు పెరుగుతుండటంతో వాటి వినియోగం తగ్గిపోయింది. (ఇప్పటికీ ఆపరేషన్ల కోసం వాడే పరికరాల మీద సూక్ష్మక్రిములేవీ లేకుండా శుభ్రం (స్టెరిలైజ్‌) చెయ్యటానికి యూవీ లైట్‌ను వాడుతూనే ఉన్నారు) మొత్తానికి వ్యాధికారక సూక్ష్మక్రిములను ఎదుర్కొనేందుకు 'గాలీ-వెలుతురు'.. ఈ రెంటికీ కీలక పాత్ర ఉందని ప్రపంచవ్యాప్తంగా అంతా గుర్తించారు.
ప్రపంచం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉంది. ఇది తీవ్రవాదాన్ని మించిన, చమురును మించిన, ఇంకా చెప్పాలంటే నీటిని కూడా మించిన సంక్షోభం. 'యాంటీబయాటిక్స్‌' సంక్షోభం! మానవాళి ఉనికికే పెను సవాల్‌లా తయారవుతున్న ఈ సమస్యకు.. ఎంతోకొంత పరిష్కారం మన చుట్టూ ఉన్న గాలీ-వెలుతురులోనే ఉందంటూ విఖ్యాత శాస్త్రపత్రిక 'న్యూసైంటిస్ట్‌' అందించిన కథనం కొత్త ఆలోచనలకూ.. సరికొత్త పరిష్కారాలకూ తలుపులు తెరుస్తోంది.

కొత్త అస్త్రాలు దొరికాయి!
అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ అత్యంత శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ మందు 'పెన్సిలిన్‌'ను ఆవిష్కరించటం ఆధునిక వైద్యరంగ చరిత్రలో పెను విప్లవం! ఎంత అంటే ఇక వ్యాధికారక సూక్ష్మక్రిములపై మనిషి విజయం సాధించేశాడనీ.. ఇన్ఫెక్షన్లన్నవి ఇక కనుమరుగైపోవటం తథ్యమని అంతా ఒక విపరీత విశ్వాసంలోకి వెళ్లిపోయారు కూడా. ఇక మీదట సూక్ష్మక్రిముల కారణంగా ఏ ఇన్ఫెక్షన్‌ వచ్చినా రామబాణంలా యాంటీబయాటిక్‌ మాత్రను ప్రయోగిస్తే చాలు, ఠకీమని అది తగ్గిపోవటం ఆరంభమైంది. కొత్తకొత్త యాంటీబయాటిక్స్‌ పుట్టుకురావటం కూడా మొదలైంది. ఈ కొత్త ఉత్సాహంలో 1960ల నుంచీ కూడా ఇటు వైద్యరంగం, అటు పరిశోధనా రంగం దాదాపుగా గాలీ, వెలుతురు గురించి పూర్తిగా పట్టించుకోవటం మానేశాయి. హాస్పిటళ్లలో నైటింగేల్‌ వార్డులూ కనుమరుగయ్యాయి. తలుపులు మూసేసి ఏసీలు పెట్టటం, అవసరమైతే లోపలి గాలి మార్పు కోసం యంత్రాలు, మెకానికల్‌ వెంటిలేషన్‌ మీద ఆధారపడటం పెరిగింది. కొత్త కొత్త యాంటీబయాటిక్స్‌ కుప్పలుతెప్పలుగా మార్కెట్‌ను ముంచెత్తాయి. గత 30 ఏళ్లుగా ఏడాదికి సగటున ఒక కొత్త యాంటీబయాటిక్‌ అయినా మార్కెట్లోకి వస్తూనే ఉంది. కానీ గత పదేళ్లుగా ఈ అస్త్రాల మీదా, వీటి శక్తిసామర్థ్యాల మీదా అనుమానాలు బయల్దేరాయి. ఎందుకంటే..
మనం ఎంత అత్యాధునికమైన, ఎంత ఖరీదైన యాంటీబయాటిక్‌ వాడటం మొదలుపెట్టినా సూక్ష్మక్రిములు లొంగటం లేదు. పైగా వాటికి త్వరగా అలవాటుపడిపోయి.. మహా మొండిగా తయారవుతున్నాయి. దీంతో 1970లలో, 80లలో యాంటీబయాటిక్స్‌తో చాలా తేలికగా తగ్గిపోయిన క్షయ, న్యుమోనియా, గనోరియా లాంటి వ్యాధులు కూడా ఇప్పుడు దేనికీ లొంగకుండా తిరిగి పెను సమస్యలుగా తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మొండి ఇన్ఫెక్షన్లు వ్యాపించటమన్న సమస్య మరింతగా పెరుగుతోంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో అయితే కనీసం 9 శాతం మందికి ఆసుపత్రుల్లోనే కొత్తగా ఇన్ఫెక్షన్లు అంటుకుంటున్నాయి. వీటన్నింటికీ తోడు.. కొత్తగా అందుబాటులోకి వచ్చే యాంటీబయాటిక్స్‌ సంఖ్య కూడా ఏటికేడాది తగ్గిపోతోంది. 1990ల తర్వాత ఇటువంటి కొత్తతరం యాంటీబయాటిక్స్‌ కోసం ప్రయత్నిస్తున్న సంస్థల సంఖ్య 18 నుంచి 4కు పడిపోయింది. దీనర్థం ఏమిటి??? మన తూణీరంలో అస్త్రాలు తగ్గిపోతున్నాయి. ఉన్నవి పదును కోల్పోయాయి.. కొత్తవి పుట్టటం లేదు. మరోవైపు శత్రువులు.. అంటే రోగ కారక క్రిములు మహా మొండిగా విజృంభిస్తున్నాయి! క్షయలాంటి వ్యాధులైతే ఎన్ని మందులు వాడినా లొంగని 'మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌' రకాలుగా ప్రబలుతున్నాయి. ఇదీ ఇప్పుడు మనం ఉన్న విపత్కర స్థితి!

ఏమిటి మార్గం???
సూక్ష్మ శత్రువులను ఎదుర్కొనటం కోసం పరిశోధనా రంగం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. వాటిని చంపటం కాకుండా కేవలం వాటి ఉద్ధృతిని అడ్డుకోవటం కోసం 'కోరం బ్లాకింగ్‌' మందుల కోసం ప్రయత్నిస్తున్నారు.. దీనివల్ల సూక్ష్మక్రిముల్లో నిరోధకత అంతగా రాదని భావిస్తున్నారు. అలాగే వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేందుకు జన్యుమార్పిడి వైరస్‌లను ప్రయోగించే 'ఫేజ్‌ థెరపీ' విధానాలూ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ విజయానికి చాలా దూరంలో ఉన్నాయి. మరి మనం ఇప్పుడేం చెయ్యాలి? దీనికి చాలామంది శాస్త్రవేత్తల సమాధానం.. మూలాల్లోకి వెళ్లటమే మంచిదని! వైద్యాన్ని ఎక్కడ వదిలేశామో అక్కడికి వెళ్లి వెతుక్కుందామంటున్నారు. యాంటీబయాటిక్స్‌ రాక మునుపు మనం ఎక్కడున్నామో.. ఏయే విధానాలను అనుసరించామో.. మళ్లీ ఆ పాఠాలను ఒక్కసారి చదువుకుందామంటున్నారు.
కేవలం ఒంటి మీద ఎండ పడితేనో.. లేకపోతే గాలి తగిలితేనో.. జబ్బులన్నీ తగ్గిపోతాయని అనుకోవటం అత్యాశే అవుతుంది. అంతమాత్రాన ఆ రెంటికీ ఉన్న.. అమూల్యమైన శక్తిని మనం తక్కువచేసి చూడటానికి లేదు. పాతవిధానాల్లో ప్రయోజనకరమైనవి లేవనుకోవటం తప్పు. ఎందుకంటే తరచుగా చేతులు కడుక్కోవటం వల్లనే చాలా జబ్బులు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చనీ, చాలా జబ్బులు తగ్గిపోతాయని గుర్తించినప్పుడు చాలామంది దాని విలువను గుర్తించలేదు. కానీ ఇప్పుడు అదే విధానం.. అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఆసుపత్రుల్లో నర్సులు తరచుగా చేతులు కడుక్కోవాలన్న నిబంధన పెట్టిన తర్వాత బ్రిటన్లో ఎంఆర్‌ఎస్‌ఏ, క్లోస్ట్రీడియం వంటి మొండి బ్యాక్టీరియాల వ్యాప్తి బాగా తగ్గినట్లు గుర్తించారు. ఇళ్లలో కూడా మనం తరచుగా చేతులు కడుక్కోవటం వల్ల జబ్బుల బారినపడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఇదే తీరులో మనం గాలీ, వెలుతురు ప్రయోజనాలను కూడా గుర్తించాల్సిన అవసరం వచ్చిందంటున్నారు పరిశోధకులు. ఈ దిశగా లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు లిమా, పెరూ వంటి దేశాల్లోని ఆసుపత్రుల్లో అధ్యయనాలు కూడా చేశారు. యాంత్రికంగా పని చేసే మెకానికల్‌ వెంటిలేషన్‌ సదుపాయాల మీద ఆధారపడుతున్న ఆసుపత్రుల్లో కంటే కిటికీలూ, తలుపులూ తెరవటానికి వీలున్న పాత కాలపు ఆసుపత్రుల్లోనే గాలి ప్రసారం బాగుందని గుర్తించారు. దీంతో లిమాలోని కొన్ని ఆసుపత్రులకు కొత్తగా కిటికీలు అమర్చటం, వెలుతురు వచ్చేలా పైకప్పును సరిచెయ్యటం వంటి చర్యలూ చేపట్టారు. ఈ మార్పులు సాధ్యం కాని భవనాల్లో ఏం చెయ్యాలన్న దాని మీదా బోలెడంత కుస్తీలు పట్టి చివరికి.. క్షయ వార్డుల్లో యూవీ కిరణాలు ప్రసరించేలా ఆ లైట్లను పైకప్పు వైపు తిప్పి అమర్చారు. దీనివల్ల ఆ కిరణాలు నేరుగా రోగుల మీద పడవు.. గది పైభాగంలో ఉండే సూక్ష్మక్రిములను నిర్మూలిస్తాయి. ఇలా చేసిన తర్వాత వార్డుల్లో క్షయ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కూడా గుర్తించారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరూ, బ్రెజిల్‌, రష్యా వంటి దేశాలన్నింటిలోనూ ఆసుపత్రుల్లో ఈ ఏర్పాటు మీద ఆసక్తి పెరుగుతోంది, ముఖ్యంగా మహామొండి సమస్యగా భావించే 'హెచ్‌ఐవీ-క్షయ' రెండూ కలగలిసి ఉన్న వారి వార్డుల్లో ఈ ఏర్పాటు చాలా అవసరమని భావిస్తున్నారు. లండన్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాస్సిటల్‌ కూడా ఛాతీ సమస్యలతో వచ్చే రోగులు వేచి ఉండే గదిలో ఈ రకం యూవీ లైట్లను ఏర్పాటు చేసింది. మన శరీరంలో జీవకణాల పరిమాణం పెద్దగా ఉంటుంది కాబట్టి యూవీ కిరణాలు కేవలం ఉపరితలం వరకే చేరుకుంటాయి. కానీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కణాలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా యూవీ ప్రభావానికి లోనై సమూలంగా నాశనమైపోతాయి. అందుకే మనకే ఇబ్బందీ కలిగించకుండా, సూక్ష్మక్రిములను అంతం చేసే యూవీ లైట్ల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా గాలిలో ఏముందని ఈ లాభం???
సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాలు సూక్ష్మజీవులను నిర్మూలిస్తున్నాయి కాబట్టి ఎండతో లాభం ఉందని గ్రహించాం. బాగానే ఉందిగానీ.. మరి తాజా గాలి వల్ల జరిగేదేమిటి? పోర్టన్‌ డౌన్‌ పరిశోధకుల బృందం దీని మీదా విస్తృతంగా కృషి చేసి చివరికి- తాజా గాలిలో ఉండే 'హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌' అనేవి సూక్ష్మక్రిములను చంపుతున్నాయని గుర్తించింది. వాతావరణంలోని నీరు, ఓజోన్ల మధ్య నిరంతరం జరుగుతుండే ప్రతిచర్యల నుంచి ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ పుట్టుకొస్తున్నాయని, ఈ చర్యలకు గాలిలో మొక్కల నుంచి వెలువడే జీవ రసాయనాలు ఉత్ప్రేరకాలుగా దోహదం చేస్తున్నాయని వీరు గుర్తించారు. చిత్రమేమంటే ఈ హైడ్రాక్సిల్‌ మాలిక్యూల్స్‌ అట్టే కాలం ఉండవు, అందుకే ఎప్పటికప్పుడు తాజా గాలి వీస్తుండటం ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించటంతో బ్రిటన్‌కు చెందిన కొన్ని సంస్థలు ఈ హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌ను కృత్రిమంగా తయారుచేసే చిన్నచిన్న యంత్రాలను తయారుచేసి కూడా.
ఇదంతా చూసిన తర్వాత...
మన ఆసుపత్రుల్లోకి, మన ఇళ్లలోకి స్వచ్ఛమైన గాలీ వెలుతురు రావటం ఎంత అవసరమో ప్రత్యేకంగా గుర్తించటం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సాధ్యమైనంత వరకూ ఇళ్లలో, ఆసుపత్రుల్లో సహజ సిద్ధమైన, ధారాళమైన గాలీవెలుతురు ఉండేలా చూడాలని సిఫార్సు చేస్తోంది. ఈ విషయంలో ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ కృషిని మరువద్దని కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. కాబట్టి గాలీ వెలుతురూ.. ఇళ్లలోకి బాగా రావాలని ఎవరైనా చెబితే.. ఏదో పాతకాలం మాట అని కొట్టిపారెయ్యకండి! సాధ్యమైనంత సహజ సిద్ధమైన జీవితాన్ని గడపండి! ఈ ప్రకృతిలో మనల్ని కాపాడే సహజసిద్ధమైన ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. వాటిని గౌరవించటం ఒక్కటే.. మనం మనకు చేసుకోగలిగిన గొప్ప మేలు!
  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 21, 2014

Excretion of toxins,De-Toxification,విష విసర్జనం

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Excretion of toxins,De-Toxification,విష విసర్జనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



శరీరములో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ  వ్యవస్థ మనశరీరములో వుంది . అయితే అత్యుత్సాహముతో తినే అనవసర పదార్ధాలవల్ల అనేక విషపూరిత పదార్ధాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసము వల్ల పరిమిత, సులువుగా జీర్ణమయ్యే అహార పదార్ధాలలో లభిస్తుంది.

విషపదార్ధాలతో ఇబ్బంది .

విషపదార్ధాలను శరీరము నుండి విసర్జించడాన్నీ డి-టాక్సిఫికేషన్‌ అంటారు. ఆల్కహాల్ , రసాయనిక పదార్ధాలు , ఫాస్ట్ ఫుడ్స్ , స్ప్రైసెస్ లతో ఉన్న తిళ్ళు , ఆహారము ద్వారా ఏర్పడే ఇతర విషపూరిత వాయువులు , విషపదార్ధాలు ఏవైనా కావచ్చు. ఇవి శరీరములో పేరుకుపోతే సహజ శరీర విసర్జక వ్యవస్థ పని చాలా కస్టమవుతుంది. అందువల్ల జీవన చర్యలు మందగిస్తాయి. ఫలితం గా జీర్ణవ్యవస్థ , హార్మోన్‌ వ్యవస్థ , విసర్జక అవయవముల పనితీరు అస్తవ్యస్తం అవుతుంది.
విషపదార్ధాలు - pre radicals : ఇవి స్వతంత్రముగా ఉండగలిగే మోలిక్యులా స్పీసెస్ -unpaired electron in an atomic orbital. ఇవి ఒక ఎలక్ట్రాన్‌ తీసుకోవడము గాని ఇవ్వడము గాని చేయుచూ oxidants గా లేదా reductants గా పనిచేయును .important oxygen-containing free radicals in many disease states are hydroxyl radical, superoxide anion radical, hydrogen peroxide, oxygen singlet, hypochlorite, nitric oxide radical, and peroxynitrite radical.కణజాలము డామేజ్ చేయును. ముఖ్యము గా కొవ్వుకణాలు , న్యూక్లియక్ యాసిడ్స్ , ప్రోటీన్లు లపై దాడిచేయును.

O2-,superoxide anion,
H2O2, hydrogen peroxide,
OH :hydroxy radical,
RooH : organic hydrogenperoxide,
RO : alkoxy and ROO:peroxy radicals,
HOCI : hypochlorous acid,
ONOO : peroxynitrite,

అలసట ఏ అవయాలకి :

చర్మము మీద పొక్కులు , తట్టు , కీళ్ళనొప్పులు , అజీర్ణము వంటివి అలసటను కలుగ జేస్తాయి. విసర్జక అవయవాలైన కాలేయం , మూత్రపిండాలు , పేగుల పని భారము ఎక్కువై దెబ్బతింటాయి. ఇతర ముఖ్య అవయవాలైన గుండె , ఊపిరితిత్తులు , మెదడు కూడా దీని ప్రభావానికి లోనై ఇబ్బంది పెట్టే అనేక వ్యాధులు కలుగుతాయి.

ఎలా తప్పించుకోవాలి :

ఈ అవస్థకు మూల కారణమైన పదార్ధాలను తినకూడదు . సహజసిద్ధమైన సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని మితముగా తీసుకోవాలి. అర్హులు ఉపవాసము చేసి పండ్లు , తాజా పండల రసాలు త్రాగగము వలన 1-2 రోజులలో విషపదార్ధాలను బయ్టకు పంపేయవచ్చును.

తినకూడని పదార్ధములు :
మాంసము , పాల ఉత్పత్తులు , ఆల్కహాల్ , ప్రోసెస్ చేసిన తీపిపదార్ధాములు , వేపుళ్ళు , ఊరగాయలు .అనవసరము గా చీటికి మాటికి మందులు వాడరాదు .

తినవససిన పదార్ధములు :

తాజా పండ్లు , కూరలు , ఆకుకూరలు ,
వనమూలికలతో చేసిన టీ , పానీయాలు ,
బాదం , వాల్ నట్ , జీడిపప్పు , పొద్దుతిరుగుడు , గుమ్మడి విత్తనాలు ,
బ్రౌన్‌ రైస్ , గోధుమ , జొన్న లతో చేసినవి .
ఎక్కువగా మంచినీరు త్రాగాలి ,
యాంటీ ఆక్షిడెంట్స్ -- విటమిన్‌ A,విటమిన్‌ C, విటమిన్‌ E, సెలీనియం ,వంటి విటములు తీసుకుంటుండాలి.

ఉపవాసము చేయకూడని వారు :

గర్భిణీలు , పాలిచ్చే తల్లులు , డయాబెటీస్ ఉన్నవారూ , తక్కువ రక్తపోటు ఉన్నవారు , ఫుడ్ ఎలర్జీ ఉన్నవారూ ,టీనేజర్స్ ఉపవాసము చెయ్యకూడదు. లంకణం పరమ ఔషము అనంటారు. ఇది అందిరికీ పనికిరాదు . ఉపవాసము ఉంటే జీర్ణాసయానికి విశ్రాంతి అభించి ఆరోగ్యము గా ఉంటుంది.

  • =====================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, August 12, 2014

ebola virus- ఎబోలా వైరస్




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ebola virus- ఎబోలా వైరస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా.. ఈ వైరస్ సోకితే మృత్యువాతే -- అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. అనేక ప్రపంచ దేశాలను ఎబోలా అనే వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసిన సమయంలోనూ ఇంతగా భయపడని అమెరికా వంటి సంపన్న దేశాలు ఎబోలా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒక్కసారి సోకిందంటే ప్రాణాలను హరించేదాకా విశ్రమించని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 932 మంది మృత్యువాత పడగా, ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 61 మందిని పొట్టనపెట్టుకుంది.

అసలు ఎబోలా సోకిన తన పౌరులను కాపాడుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన యత్నం, ఆ దేశ పౌరులను ఆగ్రహావేశాలకు గురి చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. చికిత్సే లేని ఎబోలా వ్యాధి నుంచి దూరంగా పారిపోవడం మినహా, సోకిన తర్వాత చేయగలిగిందేమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతేనా, ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే, ఎబోలా సోకిన రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో ఓ వైద్యుడితో పాటు సదరు క్లినిక్‌లో పనిచేసిన ముగ్గురు నర్సులు కూడా ఈ వ్యాధి బారినపడి చనిపోవడమే ఇందుకు కారణం.

భారత్ నుంచి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. అయితే ఎబోలా వ్యాప్తి కనిపించిన దేశాల్లో మాత్రం 45 వేల మందికి పైగా ప్రవాస భారతీయులున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదేదో ప్రైవేట్ సంస్థలు వెల్లడిస్తున్న విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ కు చెప్పిన లెక్కలు.

ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిలో 300 మంది భారత్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లున్నారు. వీరితో పాటు 2,700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్‌లో 1,200 మంది, గినియాలో 500 మంది భారతీయులు ఉన్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఎబోలా వ్యాప్తితో సతమతమవుతున్న దేశాలే. ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తే, పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నేపథ్యంలో కేంద్రం, ఈ గణాంకాలను సేకరించింది. అయితే, మన పౌరులు ఎబోలా బారిన పడకుండా దేశానికి తిరిగివస్తే, ఎలాంటి సమస్యా లేదు. అయితే పొరపాటున వ్యాధి సోకిన తర్వాత వస్తేనే అసలు సమస్య. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అన్ని విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు నిర్బంధ వైద్య పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఎబోలా అనుమానిత కేసును గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుల్లో ఎబోలా అలర్ట్‌ను ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాలుగు ఎబోలా స్క్రీనింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎబోలా నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను ఎబోలా వైరస్‌పై చైతన్య పరచడం వల్లే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని అధికారులు అబిప్రాయపడుతున్నారు.

  • ప్రయోగాత్మక చికిత్సలు :
సాధారణంగా ఏదైనా వ్యాధికి ఔషధాలను అందుబాటులోకి తేవడానికి ముందు వివిధ దశల్లో పరీక్షిస్తారు. అంతా సంతృప్తికరంగా ఉందనుకున్నాక.. ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధ్రువీకరించుకున్నాక.. చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ, ఎబోలా వైరస్‌ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్‌ పాలబడ్డ ఇద్దరు అమెరికన్‌ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశల్లో ఉన్న జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితీ ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే.. వారి శరీరాల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేక ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా.. లైబీరియాలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న స్పానిష్‌ మతప్రచారకుడొకరికి(75) కూడా ఈ వైరస్‌ సోకింది. దీంతో, ఆయనను స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి, ఆయనకు కూడా జడ్‌మాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే.. ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, జడ్‌మాప్‌ ఔషధాన్ని తమ దేశంలోని బాధితులకూ ఇవ్వాలని నైజీరియా ఆరోగ్య మంత్రి అమెరికాను కోరగా.. అందుకు ఆ కంపెనీ అంగీకరించాలని అక్కడి అధికారులు సమాధానమిచ్చారు. ఇదే రీతిలో దీంతో బాధపడుతున్న మిగతా దేశాలూ జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో.. ఈ తరహా ఔషధాల వినియోగంలోని నైతికతపై అంతర్జాతీయస్థాయి వైద్యులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఒక సమావేశం నిర్వహించాలని నిశ్చయించింది. ఎబోలా లాంటి ప్రాణాంతక వైరస్‌లు వ్యాపించినప్పుడు.. ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలను సైతం వినియోగించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యం.

  • ఏమిటీ ఎబోలా?
ఎబోలా అలియాస్‌ జైరీ ఎబోలా.. ‘జీనస్‌ ఎబోలై వైరై’లోని ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్‌ సోకినవారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్‌ డిసీజ్‌ గా వ్యవహరిస్తారు. గతంలో దీన్ని ఎబోలా హేమరేజిక్‌ ఫీవర్‌గా పిలిచేవారు.

  • మొదటిసారి.. ఎక్కడ? ఎప్పుడు?
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (జైరీ)లో తొలిసారి దీన్ని కనుగొన్నారు. అక్కడి ఒక నది పేరు ఎబోలా. ఆ పేరే ఈ వైరస్‌కు పెట్టారు. 1976లో పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల గ్రామాల్లో ఈ వైరస్‌ ప్రబలింది. అప్పుడే ప్రపంచానికి పరిచయమైంది.

  • ఈ వైరస్‌కు మూలమేంటి?
ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు శాస్త్రజ్ఞులు 1976 నుంచి ప్రయత్నించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ ప్రబలిన ప్రాంతాల్లో 30 వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో.. ‘ఫ్రూట్‌ బ్యాట్స్‌’గా వ్యవహరించే మూడు గబ్బిలం జాతుల ఆర్‌ఎన్‌ఏల్లో ఈ వైరస్‌ ఉన్నట్టు కనుగొన్నారు. ఈ గబ్బిలాల్లో ఆ వైరస్‌ దాగి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో.. ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు.

  • మనుషులకు ఎలా సోకింది?
ఎబోలా వైరస్‌కు సహజ ఆశ్రయాలుగా ఉన్న గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు ... ఇతర జీవాలు తినడంతో వాటికి వైరస్‌ సోకింది. ఆయా జీవాలను చంపి తిన్న మనుషుల్లోకీ పాకింది. అలాగే గినియా, తోమా, కిస్సి, గుయెర్జ్‌ వంటి ప్రాంతాల్లో గబ్బిలాల సూప్‌ తాగే, గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటుంది. అది కూడా ఈ వైరస్‌ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. అందుకనే.. ఈ ఏడాది మార్చి 26న గినియా ప్రభుత్వం తమ దేశంలో గబ్బిలాల సూప్‌ తయారీని, వినియోగాన్ని నిషేధించింది.

చితిత్స :  జడ్‌మాప్‌ ఔషధం--
ఎబోలా వైరస్‌కు ఇప్పటికైతే పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ.. ప్రపంచం మొత్తం ఒక ఔషధం వైపు ఆసక్తిగా చూస్తోంది. అదే జడ్‌మాప్‌. ఈ ఔషధాన్ని శాన్‌డియోగోకు చెందిన బయోఫార్మాస్యూటికల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ తయారుచేసింది. దీంట్లో మూడు యాంటీబాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్‌ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండి.. ఆయా కణాలను సమర్థంగా నిర్మూలించేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.

ఎలా వ్యాప్తిచెందుతుంది ? :
ఎబోలా వైరస్‌ ఎంత ప్రమాదకరమైనదైనా మనం భయపడాల్సిన పని లేదు. దీనికి ప్రధాన కారణాలు రెండు.
1. ఈ వైరస్‌ జలుబు, దగ్గులను కలిగించే వైరస్‌లలాగా గాలిలో వ్యాపించదు. వైరస్‌ బారిన పడినవారి శారీరక స్రావాలను నేరుగా తాకితే మాత్రమే సోకుతుంది. మనదేశంలో ఎబోలా బాధితులు లేనందున ఈ పద్ధతిలో ఆ వైరస్‌ ప్రబలే ప్రమాదం దాదాపు మృగ్యం.
2. ‘‘ప్రస్తుతానికైతే, మన దేశంలో ఆ వైరస్‌ లేదు. కానీ, మనవాళ్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంటారు. అలా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా వ్యాపిస్తే?’’ అనే సందేహం కలగొచ్చు. ఆ ప్రమాదం లేకుండా.. భారత ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో హై-అలర్ట్‌ ప్రకటించింది. ఆయా దేశాల నుంచి వచ్చినవారిని పరీక్షిస్తోంది. ఆస్పత్రుల్లో వారిని ప్రత్యేకమైన ఏర్పాట్లుగల వార్డుల్లో విడిగా ఉంచి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఎబోలా గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు.
3.జలుబు, దగ్గు వైరస్‌లలా ఇది గాలిలో వ్యాపించదు. ఈ వ్యాధి వచ్చినవారి శరీర స్రావాలు.. లాలాజలం, కళ్లె, రక్తం, మలం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో అక్కడి సంప్రదాయాల ప్రకారం మరణించినవారికి అంతిమ సంస్కారాల్లో చేసే కొన్ని క్రియల వల్ల ఎక్కువగా వ్యాపిస్తోంది.

 లక్షణాలు..
ఎబోలా వైరస్‌ సోకినవారిలో వెంటనే ఆ లక్షణాలు కనపడవు. ఇందుకు కనిష్ఠంగా రెండు రోజులు.. గరిష్ఠంగా 21 రోజులు పడుతుంది. ఎక్కువ మందిలో 5-10 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో ప్రధానంగా కనపడే తొలి లక్షణం.. కనీసం 101 డిగ్రీల జ్వరం. విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి. పొత్తికడుపులో నొప్పి వస్తుంది. నీరసంగా బలహీనంగా అనిపిస్తుంది.

గొంతు వాస్తుంది. తలతిరగడం, వాంతి వచ్చేటట్లు ఉండటం వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. ఆ తర్వాతి దశలో.. అంతర్గత రక్తస్రావం, రక్తపువాంతులు, రక్తవిరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటిలక్షణాలు కనపడతాయి. ఈ వైరస్‌ సోకక ముందే ఏవైనా గాయాలు అయి అవి ఇంకా పూర్తిగా తగ్గకపోతే.. వాటి నుంచి కూడా ధారగా రక్తం కారిపోతుంటుంది. మొదటి దశ లక్షణాలను బట్టి చాలామంది దీన్ని మలేరియ జ్వరంగానో డయేరియాగానో పొరబడతారు. అసలు విషయం తెలుసుకునే సరికి చెయ్యిదాటిపోతుంది.

  • ఎబోలా చికిత్సకు ప్రయోగాత్మక ఔషధాలు
డబ్లూహెచ్‌ఓ అనుమతి--ఫలితాలు రుజువు కాకున్నా ఫర్వాలేదని స్పష్టీకరణ--
జెనీవా, మ్యాడ్రిడ్‌, న్యూఢిల్లీ: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక ఔషధాల వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అనుమతించింది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా మరణించినట్లు తేలడంతో పాటు, స్పెయిన్‌కు చెందిన క్రైస్తవ మత గురువు కూడా మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ''ఔషధం సామర్థ్యం, దాని దుష్ఫలితాల గురించి తెలియకున్నా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఉపయోగించడం నైతికమే.'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాకు చెందిన మ్యాప్‌ బయోఫార్మాస్యూటికల్‌ అనే ప్రైవేటు సంస్థ ఎబోలా వైరస్‌ చికిత్సకు జడ్‌మ్యాప్‌ పేరుతో ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ఇంకా ప్రాథమిక ప్రయోగాల దశలోనే ఉంది. ఇప్పటి వరకు కోతులపై మాత్రమే ప్రయోగించారు. లైబీరియాలో ఎబోలా వైరస్‌ సోకిన రోగులకు సేవలందిస్తున్న క్రమంలో స్పెయిన్‌కు చెందిన మిగ్యూల్‌ పాజరెస్‌ (75) అనే మతగురువుకు ఆ వైరస్‌ సోకింది. ఆయన్ను అక్కడి నుంచి స్పెయిన్‌కు తరలించి జడ్‌మ్యాప్‌తో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మంగళవారం మరణించారు. ఈ వైరస్‌ నియంత్రణకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ కానీ, చికిత్సకు ఔషధం కానీ లేదు. దీంతో నిబంధనలను సడలించి జడ్‌మ్యాప్‌ను దిగుమతి చేసుకోవడానికి స్పెయిన్‌ అనుమతిచ్చింది.

మేము వచ్చేస్తాం: భారతీయ వైద్యులు: మరోవైపు ఎబోలా వ్యాపిస్తున్న నైజీరియాలో పనిచేస్తున్న భారతీయ వైద్యులు నలుగురు స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా ఎబోలా రోగులకు వైద్యసేవలందించాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపిస్తున్నారు. భారత్‌కే చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారు పని చేస్తున్నారు. తమ పాస్‌పోర్టులను ఆస్పత్రి స్వాధీనం చేసుకుందని ఆ నలుగురు వైద్యులు ఆరోపించారు. ఈ విధంగా విధులకు దూరం అవడం వైద్య విలువలకు విరుద్ధమని, భారత్‌కు చెడ్డపేరు తేవడమేనని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ఆస్పత్రి ఉన్న పట్టణంలో అసలు ఎబోలా కేసులే లేవని స్పష్టం చేసింది. భారత హైకమిషన్‌ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.  

  • ఎబోలా గుర్తింపునకు చౌకైన నానో సెన్సర్‌
మెల్‌బోర్న్‌: ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌తోపాటు ఇతర వ్యాధులను వేగంగా నిర్ధరించేందుకు అత్యంత సున్నితమైన ఒక బయోసెన్సర్‌ను ఆస్ట్రేలియా విద్యార్థుల బృందం రూపొందించింది. ఇందులో భారత సంతతికి చెందిన అనిరుధ్‌ బాలాచందర్‌ కూడా ఉన్నారు. డీఎన్‌ఏ ఆధారిత ఈ నానోయంత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఏదో ఒకరోజు ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా పోర్టబుల్‌ యంత్రంలో రక్తం నమూనా ఉంచడం ద్వారా వ్యాధి నిర్ధరణకు సైతం ఇది వీలు కల్పిస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్‌కు సంబంధించిన నిర్దిష్ట డీఎన్‌ఏ పోగును తాకగానే అది లైట్‌లా వెలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది.. వ్యాధి ఉనికి గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులను వేగంగా అప్రమత్తం చేసే చౌకైన విధానమని చెప్పారు.

  • సేకరణ / డా.వందనా శేషగిరిరావు (శ్రీకాకుళం).--7 ఆగస్టు 2014

దేశంలో తొలి ఎబోలా కేసు గుర్తింపు--ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న అధికారులు.

దిల్లీ: దేశంలో తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి ఇక్కడికి వచ్చిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 'నవంబరు పదో తేదీన లైబీరియా నుంచి ఇక్కడికి చేరుకున్న ఓ 26 ఏళ్ల వ్యక్తి వీర్య నమూనాలు పరీక్షించగా ఎబోలా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నాం' అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధికి సంబంధించి బాధితుడు గతంలో లైబీరియాలో చికిత్స కూడా తీసుకున్నాడని వివరించింది. వ్యాధి లక్షణాలు లేవని నిర్థరించిన తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చాడని...అయితే ఇక్కడ జరిపిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు బపటపడ్డాయని తెలిపింది. పరిస్థితి అదుపులోనే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాజస్థాన్‌లో మరో అనుమానిత కేసు
జయపుర: ఓ 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి ఇక్కడి సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. అనుమానిత రోగిని జయపుర నగరంలోని విద్యాధర్‌నగర్‌కు చెందిన మొహమ్మద్‌ రెహన్‌ ఖాన్‌గా గుర్తించారు.జ్వరం, బొబ్బలతో ఇబ్బందిపడుతున్న ఖాన్‌ను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఖాన్‌ బంధువులతో కలిసి దిల్లీకి బయలుదేరి వెళ్లిపోయాడని మాన్‌సింగ్‌ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎల్‌.నేవల్‌ తెలిపారు.

courtesy with : eenadu news paper -6:48 PM 2014-11-19.
  • ===================
 Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, August 2, 2014

ఆరోగ్య సమస్యలు రాకుండా మీ కోసం మీరు..తీసుకోవలసిన జాగ్రత్తలు




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ఆరోగ్య సమస్యలు రాకుండా మీ కోసం మీరు..తీసుకోవలసిన జాగ్రత్తలు
- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే దాకా విరామం లేకుండా పనిచేయడం వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* పనిలో పడి నీళ్లు తాగడం కూడా మర్చిపోతున్నారా? దానివల్ల తలనొప్పులూ, అలసటా, శరీరంలో శక్తిలేకపోవడం లాంటి సమస్యలు తప్పవు. అందుకే కాస్త దాహంగా అనిపించినా పనులన్నీ పక్కనపెట్టి మంచి నీళ్లు తాగండి.

* రోజంతా చురుగ్గా పని చేయాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదు. అందుకే రోజూ కాసేపు వ్యాయామం చేసేలా చూసుకోండి. కాసేపు నడవండి. ఇంటిపనుల్లో భాగంగానే మెట్లెక్కి దిగండి.

* ఎంత హడావిడిగా ఉన్నా, రోజూ పొద్దున్నే టిఫిన్‌ని మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఓ చక్కని పరిష్కారం. అలాగే వేళకు భోంచేయడమూ పాటించాల్సిన జాగ్రత్తే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

నమిలి తింటున్నారా?
   * జీవనశైలి మారిపోయింది. చాలామందికి కనీసం తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. కంగారులో ఏదో నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకోవడమే కానీ నమిలి తినడం గురించి శ్రద్ధ పెట్టట్లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

* హడావుడిగా తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు. మరో వైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. కొద్ది సేపటికే ఆకలి వేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది. అప్పుడు ఎంత తినాలో అంతే తింటాం. ఆకలి కూడా త్వరగా వేయదు. అంతేకాదు... లాలాజల గ్రంథులు కూడా చురుగ్గా మారతాయి.

* బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా అయి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది.

* ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వల్ల కడుపులో గ్యాస్‌, ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటాయి. మరి ఆ బ్యాక్టీరియాను నాశనం చేయాలంటే బాగా నమలాలి. నములుతున్నప్పుడు నోట్లో లాలాజలం స్రవిస్తుంది. ఇందులో మేలు చేసే బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడతాయి.

* బాగా నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుంది. తక్కువ ఆహారమైనా సరే నమిలి తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలిగా అనిపించదు. మాటిమాటికీ తినాలనే కోరిక కూడా కలగదు. దాంతో లావయ్యే సమస్య ఉండదు.

* నమలడం వల్ల దంతాల మధ్యలో ఆహార పదార్థాలకు సంబంధించి ఏమీ ఇరుక్కోకుండా ఉంటాయి. దంతాలు కూడా గట్టి పడతాయి. ముఖ కండరాల దగ్గర కొవ్వు కూడా చేరుకోకుండా ఉంటుంది.

courtesy with : Eenadu vasundara news paper 02-08-2014

  • ===================================
 Visit my website - > Dr.Seshagirirao.com/