Congenital hear diseases,పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు--- గర్భంలో శిశువు గుండె నిర్మాణం సరిగా కాకపోయినా, రక్తనాళాలు తేడాగా ఉన్నా కలిగే గుండె జబ్బుల్ని కంజనెైటల్ హార్ట్ డిసిజెస్ అంటారు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులన్న మాట. ఈ జబ్బుల వల్ల గుండె రక్తనాళాల్లో రక్తప్రసరణ జరగాల్సిన విధంగా జరగదు. గుండె కొట్టుకునే పద్ధతిలో కూడా మార్పులు వస్తాయి.
-పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ప్రధానంగా రెండు రకాలు. అవి ఎసైనోటిక్ లోపాలు, సైనోటిక్ లోపాలు. ఎసైనోటిక్ లోపాల వల్ల పిల్లలు ఎరగ్రా కనిపిస్తారు, సైనోటిక్ లోపాల వల్ల నీలంగా ఉన్న పిల్లలు పుడతారు.జన్మించిన పిల్లల్లో ఒక శాతం మంది గుండెలోపంతో పుడుతున్నారు. వీటిలో 80 శాతం ఇంతవరకు ముందు చెప్పుకున్న జబ్బులుంటే, 20 శాతం కొత్తవి కనిపించవచ్చు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులతో మూడవ వంతు వెంట్రిక్యులార్ సెప్టల్ ఢిఫెక్ట్‌కి సంబంధించినవి అవుతాయి.తల్లిదండ్రుల్లోగాని, అన్న-అక్కలలో గానీ గుండె జబ్బులు పుట్టుకతో వస్తే, వాళ్ళకి పుట్టుకతో గుండెజబ్బులు 4 నుంచి 5 శాతం వరకు రావచ్చు. నెలలు నిండకుండా పుట్టేవాళ్ళలో రెండు శాతం మందికి గుండెజబ్బులు పుట్టుకతో రావచ్చు. కొన్ని రకాల గుండెజబ్బుల గురించి తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. సాధ్యమైనంత త్వరలో వాటిని సరిదిద్ది, సరెైన ఆరోగ్యకర జీవితాన్ని గడిపేటట్టు చేయవచ్చు.పుట్టుకతో ఈ గుండెజబ్బులతో పుట్టేవాళ్ళ సంఖ్య పెరగడం బట్టి గుండెజబ్బులతో బాధపడే పెద్దవాళ్ళ సంఖ్య ఉంటుంది.
పుట్టుకతో ఈ గుండె జబ్బులెందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి పూర్తిగా కారణాలు తెలీవు.
జన్యుపరమైన కారణాలు, పరిసరాల ప్రభావం కొంత వరకు ఉంటుందని భావిస్తున్నారు. 21, 13, 18 క్రోమోజోమ్స్ లోపాల వల్ల ముటేషన్స్ రావచ్చు. క్యాచ్ 22, వంశపారపర్యంగా వచ్చే ఎట్రియల్ సెప్టల్ డిసీజ్, అలగిల్లె సిండ్రోమ్, నూనాన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన అబ్నార్మాలటీస్.
తల్లి గర్భంలో ఇన్‌ఫెక్షన్స్ (రుబెల్లా), మందులు (ఆల్కాహాల్ హైడాన్‌టాయిన్, లిధియం, ధాలిడొమైడ్), మధుమేహం, ఫెైనెైల్ కిటోనూరియా, సిస్టమిక్‌ల్యేపస్, ఎరిథిమోటోసిస్‌లాంటి జబ్బుల వల్ల పుట్టుకతోనే గుండెజబ్బులు రావచ్చు.
పేటెంట్ డక్టస్ ఆర్టిరియోసిస్...
గర్భస్థ శిశివులో గుండె పల్మోనరి అర్టెరీ (ఊపిరితిత్తులకు చెడు రక్తం తీసుకువెళ్లే నాళం), అయోర్టాలా (శరీరానికి మంచి రక్తం తెచ్చే నాళం) మధ్య తాత్కాలిక దారి ఉంటుంది. పుట్టే వరకు శిశివు శ్వాశించదు కాబట్టి, అంతవరకు ఈ దారి ద్వారా ప్లసెంటా నుండి వచ్చే మంచి రక్తం అయోర్టాకు సరఫరా అవుతుంది. సాధారణంగా ఈ దారి శిశివు జన్మించిన కొన్ని గంటలు లేక రోజుల్లో మూసుకుపోతుంది. అలా మూసుకుపోకపోతే శిశివు డక్టస్ ఆర్టిరియోసిస్‌తో బాధపడుతుంది. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నెలలు నిండి పుట్టిన వాళ్ళలో తక్కువ. దీనివల్ల షంటు ద్వారా ఊపిరితిత్తులకు ఎక్కువ రక్తం పోతుంది. దీని ట్రీట్‌మెంట్ సులభం. చిన్న ఆపరేషన్‌తో మూసివేయవచ్చు. ఒక్కోసారి ఆపరేషన్ లేకుండా కూడా మూసివేయవచ్చు. ఆలస్యం చేస్తే ప్రమాదం అవ్వొచ్చు.
హైపోప్లేసియా...
హైపోప్లేసియా వల్ల కుడి లేక ఎడమ వెంట్రికల్ ఫేయిల్ అవుతుంది. గుండె ఒక భాగమే పనిచేస్తూ రక్తాన్ని శరీరంలోని భాగాలకి, ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఇది చాలా అరుదు. ఇది సీరియస్ గుండె అనారోగ్యం. దీని హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అంటారు, ఎడమ వెైపు గుండె దెబ్బతింటే, కుడివెైపు గుండె గదులు దెబ్బతింటే హైపోప్లాస్టిక్ రెైట్ సిండ్రోమ్ అంటారు. ఈ రెడు అనారోగ్యాలలోనూ గుండెకి శస్తచ్రికిత్స చేసి సరి చేయకపోతే ప్రాణాలు పోవచ్చు. గుండె నుంచి రక్తం తీసుకువెళ్లే, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో లోపాలుంటే వాటిని సరిచేయకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. హైపోప్లేసియా గుండె జబ్బు సయనోటిక్ హార్ట్ డిఫెక్ట్.
అడ్డంకులు...
గుండె కవాటాలు, రక్తనాళాల్లో లోపముంటే రక్తం ప్రవాహాల్లో లోపాలు కలుగుతాయి. ఇవి ప్రధానంగా వాల్వ్ స్టినోసిస్, ‘కో ఆర్కేషన్ ఆఫ్ ది అయోర్టా బెైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్ స్టినోసిస్, సబ్ అయోర్టిక్ స్టినోసిస్ - చాలా అరుదుగా వస్తుంటాయి. రక్తనాళాలు సన్నపడడం, అడ్డంకులేర్పడటం వల్ల గుండె పెద్దది కావచ్చు. అధిక రక్తపోటు కలగవచ్చు.
గుండెలోపల గోడల లోపాలు...
Heartకణాలు గోడగా ఏర్పడి ఎడమ గుండెను, కుడి గుండెను వేరుచేసేది ‘స్టెప్టమ్’ పెై గదులు ఆరికల్ప్ మధ్య ఉండే గోడ, కింద నుండే గదులు వెంట్రికల్స్ మధ్య ఉండే గోడల్లో లోపాలు ఉండవచ్చు. అంటే సన్నటి రంద్రాలుండవచ్చు. వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్‌స సాధారణంగా కనిపించే లోపం.సి.హెచ్.డి. ఉన్న వాళ్ళలో 30 శాతం మంది అరికల్స్ మధ్య గోడలోపాలుంటాయి. దీనిని ‘ఫోరమెన్ ఒవెల్’ అంటారు. సెఫెక్ట్ డిఫెక్ట్ తీవ్రతను బట్టి ఇబ్బంది (మంచి చెడు రక్తాలు కలవడం) కలుగజేస్తాయి.
సయనోటిక్ డిఫెక్ట్...
రక్తంలో ఆక్సీజన్ తగ్గడం వల్ల శిశువులు నీలంగా ఉంటారుజ అందుకే బ్లూబేబి లేక సయనోటిక్ బేబి అంటారు. ట్రంకస్ ఆర్టిరియోసిస్, టోటల్ అనోమలస్ పల్మోనరి వీనస్ కనెక్షన్, టెట్రాలజీ అప్ ఫాలట్, గ్రేట్ వెజల్ ట్రాన్స్‌పొజిషన్, ట్రైకల్సిడ్ ఎట్రిషియాల వల్ల శిశువులు ఇలా కనిపించవచ్చు.
లక్షణాలు గుండెజబ్బు తీవ్రతను బట్టి ఉంటాయి. కొంతమంది పిల్లల్లో లక్షణాలుండవు. కొంతమంది పిల్లలు శ్వాశించడానికి ఇబ్బంది పడుతుంటారు. నీలంగా కనిపిస్తుంటారు. బాగా చెమట పడుతుంది. ఛాతినొప్పితో బాధపడుతుంటారు. గుండెలో గురగుర, శ్వాసకోసలో ఇన్‌ఫెక్షన్స్ లాంటి వాటితో బాధపడుతుంటారు.సి.హెచ్.డి. చాలా వాటికి సరిదిద్దడానికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. మందుల్ని వాడాల్సి వస్తుంది. డయూరిటిక్స్ డిజాక్సన్ వాడడం వల్ల గుండెలోని నీరు, సాల్ట్‌స తొలగించబడతాయి. గుండె చిన్నదెై బలంగా తయారవుతుంది. గుండె కొట్టుకోవడం తగ్గి కణాలలోంచి కొన్ని ద్రావకాలు బయటకు నెట్టబడతాయి.
కొన్ని లోపాల్ని సరిదిద్దడానికి శస్తచ్రికిత్స తప్పనిసరి, తల్లి కడుపులో శిశువు రూపొందుతుండంలో దోషాల వల్ల, గుండెకు రక్తం సరఫరా చేసే కరొనరి ఆర్టెరీలో ఆటంకాలు కలిగినా వచ్చే గుండెజబ్బులకు శస్తచ్రికిత్సలతో చాలా వరకు నయం చేయవచ్చు. సరెైన వయసులో చేయకపోతే జీవితం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఒకసారి అనుమానం వచ్చినప్పుడు స్పెషలిస్టును సంప్రదించండి.
- Courtesy with డా రవికుమార్ ఆలూరి--కార్డియాలజిస్ట్--గ్లోబల్ హాస్పిటల్, లక్డీకాపూల్,
- ==========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.