-మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.
ఆస్టియో ఆర్థరెైటిస్(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.
చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.
-ఫిజియో థెరపిస్ట్ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్ పరికరం (ఐ.ఎఫ్.టి , అల్ట్రాసౌండ్ , ఐ.ఆర్.ఆర్. , ఎస్.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.
గుండె బాగా కొట్టుకుంటుంది.
శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
ఇన్సులిన్ సూక్ష్మత పెరగడంతో షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.
రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.
- షుగర్, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.
నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
బ్రిస్క్ వాకింగ్ .
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
వెస్టెర్న్ టైప్ కమోడ్ ఉపయోగించాలి.
వ్యాయామం:
మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
స్థరమైన సైకిల్ తొక్కితే మంచిది.
ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.
ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్ మెటల్ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్) ‘అన్‌లోడర్ వన్’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.
క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
కీళు సులువుగా కదులుతుంది.
ఎముకలు బలపడతాయి.
బ్యాలెన్స్ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.
చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
సాధారణంగా మార్నింగ్ వాక్ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.
మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.
- Courtesy with : డా వై. నందకిషోర్ కుమార్-- బి.పి.టి. (నిమ్స్), యం.యస్.స్పోర్ట్స్ (యు.కె.) ఫిజియోథెరపిస్ట్
- =================================
- Visit my website - > Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.