Sunday, November 2, 2014

Hints to Heart patients, హృద్రోగులకు జాగ్రత్తలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- హృద్రోగులకు జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  
 గుండె జబ్బు నివారణకు ముందస్తు జాగ్రత్తలు


చిన్న వయసులోనే గుండెపోటుకు గురైన వారసత్వ చరిత్ర ఉన్న వారు ఎప్పటి కప్పుడు కొలెస్ట్రాల్‌(cholesterol)  పరీక్షలు చేయించు కుంటూ కొలెస్ట్రాల్‌(cholesterol) ను నియం త్రించే చర్యలు చేపట్టాలి. కొలెస్ట్రాల్‌(cholesterol)  పెరగడం అన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. లావుగా ఉన్న వారిలో కొలె స్ట్రాల్‌(cholesterol)  నార్మల్‌గానే ఉండవచ్చు. సన్నగా ఉన్న వారి లో చాలా ఎక్కువగానూ ఉండవచ్చు. ఇవన్నీ రక్తపరీక్షల్లో తేలవలసిందే తప్ప శరీరం బరువు ఆధారంగా మాత్రం కాదు.

-కాకపోతే లావుగా ఉన్న వారిలో కాస్త ఎక్కువ మందిలో ఈ సమస్య ఉండవచ్చు. కుటుంబ చరిత్ర ఉన్న వారు చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్‌(cholesterol) పరీక్షలు చేయించు కుంటూ ఉండడం చాలా ముఖ్యం. తీవ్ర తను అనుసరించి ఆహార నియ మాలు పాటించడం కానీ, కొన్ని మందులు వేసుకోవడం ద్వారా గానీ కొలెస్ట్రాల్‌(cholesterol) ను నియంత్రణలో ఉంచవచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్న వారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ మందులు క్రమం తప్పకుండా వాడుతూ కనీసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

నిజానికి పురుషులతో పోలిస్తే స్ర్తీలలో గుండెపోటు తక్కువే. అయితే మధ్య వయసు వచ్చాక పురుషులతో సమానంగానే వీరూ గుండెపోట్లకు గురవుతారు. సహజంగా స్ర్తీలలో ఉండే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ నిలిచిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే మెనోపాజ్‌ తరువాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికి తోడు గర్భాశయాన్నీ, అండాశయాన్ని కూడా తొలగించిన వారిలో పురుషు లకు సమానంగానే గుండెపోటు వస్తుంది. అలా అని ఆ హార్మోన్‌ సప్లిమెంట్‌లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకు పోవడం వల్ల రక్తనాళం మూసుకుపోయి గుండె కండరానికి అవసరమైన రక్తం అందదు. ఈ పేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఆ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనబడతాయి.

-అలా కాకుండా ఏ కారణంగానైనా ఒక్కో సారి ఈ కొలెస్ట్రాల్‌ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డ కట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. అప్పటిదాకా ఏ 70 శాత మో ఉన్న అటంకం క్షణాల్లో నూరు శాతంగా మారిపోతుంది. ఆ వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది. గుండె వేగం విపరీ తంగా పెరిగిపోయి ఆ తరువాత చాలా మందిలో గుండె కొట్టుకో వడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడిన వారిలో సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పో వచ్చు. కొలెస్ట్రాల్‌ చితకడానికి కారణం పూర్తిగా తెలియక పోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందుకే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించడం, పొగతాగడం కానీ, పొగాకు సంబంధిత వస్తువులు వాడటం గానీ పూర్తిగా మానుకోవడం ముఖ్యం.(డా శ్రీధర్‌ కస్తూరి-కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌-అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ )

  • హృదయ స్పందన వేగం తగ్గితే...
 1) రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు.2) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
3) నాడీ చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది.
వేగం పెరిగితే...
1) గుండె దడ వస్తుంది
2) సృహ తప్పడం జరుగుతుంది
3) తల తిరిగినట్లుగా అనిపిస్తుంది.
చికిత్స విధానం:
గుండె వేగం తగ్గినప్పుడు చాతి పెైభాగంలో చర్మం కింద ‘పేస్‌ మేకర్‌’ అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పరిగినప్పుడు బీటా బ్లాకర్స్‌ గుండె లయను క్రమబద్దీకరించే మందులు ఇస్తారు.
గుండె లయ తప్పకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
2) క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3) బరువు పెరగకుండా చూసుకోవాలి.
4) రక్త పోటును అదుపులో పెట్టుకోవాలి.
5) కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి.
6) సమతూ ఆహారం తీసుకోవాలి.
7) పొగ తాగటం మానివేయాలి.
8) జీవనశెైలిని, ఆదనపు అలవాట్లు మార్చుకోవాలి.

  • - డా శ్రీధర్‌ కస్తూరి--అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.