Saturday, April 24, 2010

Electronic Waste Health hezards , ఎలక్ట్రానిక్ వ్యర్ధపదార్ధాలు ఆరోగ్య సమస్యలు





భారత దేశం లొ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం బాగా పెరిగింది . సెల్ ఫొన్ల వినియోగం చాలా ఎక్కువయినది . ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు , కంప్యూటర్లు , ల్యాప్ టాప్లు , డివిడి ప్లేయర్లు , ఎంపీ3 ప్లేయర్లు ... వినియోగము హద్దులు దాటుతుంది . వీటి జీవిత కాలము పూర్తయితే ... అవి ఎలక్ట్రానిక్ వ్యర్ధ పదార్దాలుగా మారుతాయి . ప్రపంచ వ్యాప్తం గా వ్యర్ధాల పెరుగుదల రేటు ఎక్కువవుతూనే ఉన్నది . 4 కోట్ల టన్నుల మేర ఉంటుందని అంచనా . వీటివలన ఆరోగ్యానికి , పర్యావరణానికి హాని కలుగుతుంది . భారతదేశం లొ 2005 లో 1.47 లక్షల టన్నులు కాగా .. ఇది 2012 నాటికి 8 లక్షల టన్నులు కు చేరుతుందని నిపుణుల ఊహా .

ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సరిగా శుద్ధిచేస్తే విలువైన ముడిపదార్హాలను పొందవచ్చును . పర్యావరణానికీ మేళుజరుగుతుంది . అయితే భారత వంటి పలు దేశాలలో ఈ పక్రియ సరిగా జరగదం లేదు . ఎలక్ట్రానిక్ పరికరాలను భాగాలుగా విడదీసి పనికొచ్చే భాగాలను రోడ్ల వెంబడి అమ్మే వస్తువుల కోసం విక్రయిస్తున్నారు . మిగతా భాగాలను తగల బెట్టడమో , పాతిపెట్టడమో చేస్తున్నరు .ఈ రెండు విధానాల వల్ల ఆరోగ్యానికి , పర్యావరణానికి హానిజరుగుతుంది .
  • భూమిలో పాతిపెట్టినప్పుడు విషతుల్యమైన రసాయనాలు భూగర్భజలాల్లో కలుస్తాయి . నీరు కలుషితమై రోగాలను కలుగజేసుంది .
  • ఎలాంటి రక్షణ లేకుండానే మహిళలు , పిల్లలు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు . సుమారు 80 శాతం రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు .
  • ఈ ఎలక్టానిక్ వ్యర్ధాల్లో హానికరమైన పాదరసం , సీసం , పీవీసీ పూతపూసిన రాగి తీగలు ఉంటాయి . వీటివల్ల మొదట ఈ రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారికే హానికరము .
హానికర వ్యర్ధపదా్ర్ధాలు ->
సీసమం : టీవీలు , కంప్యూటర్ మోనిటర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది . అధిక మోతాదులో సీసం ప్రభావానికి గురైతే ... వాంతులు ,విరేచనాలు , మూర్చ రావడం , కోమా లోనికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది .

క్యాడ్మియం : సెమీ కండక్టర్ చిప్ లు , క్యఠోడ్ రే ట్యూబ్ ల్లో దీన్ని వినియోగిస్తారు . క్యాడ్మియం ను పీల్చితే ఊపిరితిత్తులు , మూత్రపిండాలు దెబ్బతింటాయి . కొన్ని కేసుల్లో మరణాలూ సంభవిస్తాయి.

పాదరసం : ప్రపంచవ్యాప్తం గా ఉత్పత్తి అయ్యే పాదరసం లో 22 శాతం ఎలక్ట్రానిక్ పరిశ్రమే వినియోగిస్తోంది . ఇది మెదడు , మూత్రపిండాలు వంటి అవయవాలను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తుంది .

బేరియం : సీ అర్ టీ స్క్రీన్ ప్యానెళ్ళ లో రేడియోధార్మికత నుంచి ప్రజలను రక్షించేందుకు బేరియం ను వాడతారు . గుండె , కాలేయము వంటి అవయవాలను పాడుచేస్తుంది .

బెరీలియం : ఈ లోహం తేలిగా , దృఢం గాను ఉంతుంది .విద్యుత్ ను బాగా గ్రహించే దీన్ని పరిశ్రమలొ వివిగా వాడతారు . ఇది ఊపిరితిత్తుల కేన్సర్ ను కలుగజేస్తుంది .

పాలీ వినైల్ క్లోరైడ్ (పి.వి.సి) : ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే ప్లాస్టిక్ లో పివిసె నే ఎక్కువగా ఉంటుంది . వీటిని మండించడం వల్ల వెలువడే "డైఆక్షిన్లు " రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి .
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, April 23, 2010

Habits and ill-health , అలవాట్లు -అనారోగ్యం




గుట్కా , ఖైనీ . పాం మసాలా తిండం , గంజాయి , సిగరెట్లు కాల్చడం , సరదా అనుకుంటే పొరపాటే .ఇవి అలవాటుకా మారితే ఎంతో ప్రమాదము .అనారోగ్య బారిన పడి చలామంది భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారు . ఈ మధ్య కాలములో ఇలాంటి వాటికి అలవాటు పడిన వారి సంఖ్య గణనీయం గా పెరుగుతు వస్తోంది .తమ బంగారు భవిష్యత్తు కోసం యువత ఇలాంటి వ్యసనాలకు దూరం గా ఉండదం మంచిది .
మా శ్రీకాకుళం జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 8.1 లక్షల మంది యువత ఉండగా వారిలో 3.9 లక్షల మంది ఖైనీ , గుట్కా వంటి వాటికి అలవాటు పడ్డారు . వీరిలో 60 వేల మంది వరకూ వివిధ రోగాల బారిన పడి చికిత్సలు తీసుకుంటున్నారు . జీవితాన్ని నరకక ప్రాయం చేసుకుంటున్నారు . ఒక రోజు సుమారు 20 పాకెట్లు వరుకు తినేవారు ఉన్నారు .
ముఖ్యమయినవి .->
  • ఖైనీ ,
  • పాంపరాగ్ ,,
  • 500 ,
  • గుట్కా ,
వచ్చే అనర్ధాలు : ->
  • నొటిలోని ఎర్రని మ్రుదు కణ జాలము దెబ్బతిని నోటి పుతకు దారితీస్తుంది .
  • నాలుక పొక్కుతుంది , నాలుక కాన్సర్ కి దారితీసుంది ,
  • ఉదర , ఊపిరితిత్తుల కాన్్సర్ వ్యాదులకు అంకురాపణ అవుతుంది .
  • గుండె పొటు , పక్షపాతం వచ్చే ప్రమాధం ఉంటుంది .
  • వీర్య కణాలు తగ్గి సంతానము కలుగక పోవచ్చును ,
  • కాళ్ళ బాగాలలో రక్తప్రసరణ తగ్గి .. నరాలు చచ్చు బడిపోవును . గాంగ్రీన్ వంటి జాబులు వస్తాయి .


  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, March 30, 2010

వీడీఅర్ఎల్ పరీక్ష అంటే ఏమిటి?, VDRL Test - about




సిఫిలిస్ వ్యాధి నిర్థారణ కోసం విడీఆర్ఎల్ పరీక్ష చేస్తుంటారు. ఈ పరీక్షలో నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పడం కష్టమే. సిఫిలిస్ వ్యాధి లేకపోయినా కొన్ని సందర్భాలలో వ్యాధి ఉన్నట్లు విడీఅర్ఎల్ పరీక్షలో తేలుతుంటుంది. న్యుమోనియా, మలేరియా వంటి వ్యాధులు వచ్చినప్పుడు, కొన్ని రకాల టీకాలు వేయించుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర మాత్రలు వాడే వారిలో లెప్రసీ ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఫలితం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విడిఆర్ఎల్ పరీక్ష మీద ఆధారపడడం తగదు. అయితే సిఫిలిస్ తో బాధపడుతున్న తల్లి నుంచి శిశువు గర్భస్థ శిశువుకు సోకడానికీ అవకాశముంది. అందుకని అనుమానం ఉంటే విడిఆర్ఎల్ పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం. ఎందుకంటే శిశువుకు సిఫిలిస్ సోకితే అనేక అనారోగ్య లక్షణాలతో బాధపడుతుంటుంది.
గర్భస్థ శిశువుకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత కొద్దికాలానికే చనిపోవచ్చు. శిశువు సిఫిలిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆ లక్షణాలు పుట్టిన వెంటనే కొందరిలో కనపడవు. క్రమంగా కొద్దికాలానికి సిఫిలిస్ లక్షణాలు బయతపడతాయి.
శిశువు జన్మించిన కొద్దివారాలకి ఈ లక్షణాలు బయటపడవచ్చు. లింఫ్ గ్రంథులు వాయడం, పాలు త్రాగాకపోవడం, నీరసంగా ఉండడం, ఎర్రటి దద్దుర్లు కనపడడం, జననేంద్రియాల వద్ద పుండ్లు రావడం వంటివి జరగవచ్చు. ఇంకా అనేక లక్షణాలు కనపడతాయి. ఇటువంటప్పుడు వైద్యులను సంప్రదించి, సిఫిలిస్ అని అనుమానం ఉంటే ఆ విషయమూ చెప్పడం మంచిది. సిఫిలిస్ లక్షణాలు మొదటిసారి శిశువులో కనిపించినప్పుడే జాగ్రత్త పడాలి. కొంతమందికి మొదటిసారి ఎటువంటి మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. అది పూర్తిగా తగ్గిపోవాడం మాత్రం కాదు. కొద్దికాలానికి వ్యాధి రెండవ దశలోకి అడుగుపెట్టి మరల వ్యాధి లక్షణాలు కనబడతాయి.
తల్లి నుంచి సిఫిలిస్ వ్యాధికారాక క్రిములు సంక్రమించిన శిశువులో అరుదుగా కొందరికి చాలాకాలం వరకు అసలు సిఫిలిస్ లక్షణాలనేవే కనిపించకపోవచ్చు. ఇదేమీ వ్యాధి లేదనడానికి చిహ్నం కాదు. వయసు పెరుగుతున్నప్పుడు ఎప్పుడో మెల్లగా ఆ లక్షణాలు బయటపడతాయి. ఇలాంటి పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే ముందే చికిత్స చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
  • ===============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు , Amniotic Fluid More and less




ఉమ్మనీరు--హెచ్చుతగ్గులు... హెచ్చరికలే

అమ్మకడుపులో తొమ్మిదినెలలు.. ఈ సమయంలో గర్భస్థ శిశువులో ఎన్నెన్నో మార్పులు. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనే తల్లులు కొన్ని సందర్భాల్లో కలవరపడుతుంటారు కూడా.

శిశువు ఎదుగుదలలో.. సౌకర్యాన్నందించడంలో కీలకం ఉమ్మనీరు. బిడ్డకు పలువిధాల మేలుచేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయికన్నా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. సాధారణంగా అయితే.. గర్భం ధరించినప్పటి నుంచీ ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. రెండున్నర నెలలకు ఇది 30 ఎం.ఎల్‌.. ఆ తరవాత అంటే తొమ్మిదో నెలకు ఇది వెయ్యి ఎం.ఎల్‌వరకు చేరవచ్చు. గర్భస్థశిశువు ఇందులో కదలడమే కాదు అప్పుడప్పుడు స్వీకరించడం.. మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం కూడా బిడ్డ ఎదుగుదలలో భాగమే.

ఉమ్మనీరు చేసే మేలు..
బిడ్డ గర్భంలో సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బిడ్డ చుట్టూ సమాన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.. వేడి తగ్గినప్పుడు ఉమ్మనీరు రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. బయటి నుంచి శిశువుకు గాయాలు కాకుండా కాపాడే బాధ్యత కూడా ఉమ్మనీరుదే.

తగ్గినా, పెరిగినా ప్రమాదమే...
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులు ఎలా తలెత్తుతాయో చూద్దాం..

ఓలిగోహైడ్రామ్నియోస్‌: ఉమ్మనీరు ఉండాల్సిందానికన్నా తక్కువగా ఉండటాన్నే ఇలా పరిగణిస్తారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని మూత్రం ద్వారా విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి బాగా తగ్గిపోతుంది. అలాగే శిశువులో మూత్రం తయారు కాకపోయినా, విసర్జించిన మూత్రం ఉమ్మనీరు ఉన్న సంచిలోకి చేరకపోయినా, మూత్రనాళం ఏర్పడకపోయినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మనీటికి కారణమైన పొరలు రాసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవ్వవచ్చు. బిడ్డకు రక్తసరఫరా సరిగా అందకపోయినా, గర్భస్థ శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్నిరకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం.. (వైద్యులు చెప్పిన తేదీ దాటి రెండు వారాలు గడిచినా ప్రసవం కాకపోవడం..) వంటి కారణాల వల్ల కూడా ఉమ్మనీరు స్థాయి బాగా తగ్గిపోతుంది.

పాలీహైడ్రామ్నియోస్‌: గర్భంలో బిడ్డ చుట్టూ ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉండటాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా పరిగణిస్తారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అసలు స్వీకరించకపోయినా.. శిశువు ఉదర సంబంధ పేగు (గ్యాస్ట్రోఇంటస్త్టెనల్‌ ట్రాక్‌) మూసుకుపోవడం వల్లకూడా ఇలా జరుగుతుంది. సహజ ప్రక్రియలో శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలేదంటే.. అందుకు ఉదరం, మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో పాటు.. మరికొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు శిశువులు ఉండటం, తల్లికి జెస్టేషినల్‌ డయాబిటీస్‌.. వంటి కారణాలు ఇందుకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో కారణాలు విశ్లేషణకు అందకపోవచ్చు.

ఉమ్మనీరులో హెచ్చుతగ్గులు, సమస్యలు: నెలలు నిండకుండానే నొప్పులు రావొచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ (ప్లాసెంటా) వేరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ(మాల్‌ప్రెజెంటేషన్‌) స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ.

ఇలా తెలుసుకోవచ్చు...
ఉమ్మనీరు పెరుగుతోందా.. తగ్గుతోందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చక్కటి పరిష్కారం. అలాగే బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డాప్లర్‌ ఫ్లో స్టడీలతో బిడ్డకు రక్తసరఫరా తీరుతెన్నులు పరీక్షించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. కాస్త అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే పండంటి పాపాయిని ఆహ్వానించవచ్చు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, March 27, 2010

పచ్చదనంతో మనోల్లాసం , Mental Piece with Green fields





యాంత్రిక జీవనానికి దూరంగా.. ప్రకృతితో వీలైనంత ఎక్కువ సేపు స్నేహం చేస్తే తీవ్రమైన మానసిక సమస్యల బారిన పడకుండా ఉంటామనేది తాజా అధ్యయనాల్లో తేలిన వాస్తవం. దీని వల్ల ఒత్తిడికి దూరమై.. మనోల్లాసానికి దగ్గరవడం ఖాయం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ రిచర్డ్‌ వైద్యులు. వందల మందిపై జరిపిన పరిశోధన తర్వాత ఈ వాస్తవాన్ని వెల్లడించారు. దినచర్యలో భాగంగా ఎక్కువ సమయం మొక్కల పెంపకం, లాన్‌లో నడవడానికి సమయం కేటాయించగలిగితే మనసు తేలిక పడుతుంది. కొత్త ఆలోచనలు అంకురిస్తాయి. అంతేకాదు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.. ప్రకృతిలో ఉన్న మహత్తే అది అంటారు శాస్త్రవేత్తలు. అందుకే నిపుణులు యోగా, ధ్యానానికి అనువుగా పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తారు. అలానే తోటపని చేయడానికి, మొక్కల పెంపకానికి వీలు కాకపోతే కనీసం పచ్చని చెట్లు ఉన్న చిత్రాలనయినా ఇంటి గదుల్లో అలంకరించుకుంటే హాయిగా ఉంటుంది.


  • =================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, March 22, 2010

కంప్యూటర్ వర్కర్స్ కి యోగ , Yoga for Computer workers

యోగ ఎన్నో విధాలుగా ఆరోగ్య పరిరక్షణలో ఉపయోగపడుతుంది . యోగ అనేది ఒక రకమైన మనసును నిలకడచేసి నిదానము గా చేసే శరీరవ్యామాము .
స్పెసలిస్ట్ వ్రాసిన వ్యాసం చదవండి - > Yoga for Computer workers
  • ====================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Psoriasis, సోరియాసిస్




*పొలుసులు చేపలకు అవసరం, అందం కూడా! కానీ నున్నగా, మృదువుగా ఉండాల్సిన మన చర్మం ఉన్నట్టుండి పొట్టుపొట్టుగా రాలిపోతూ.. పొలుసుల్లా మెరవటం మొదలుపెడితే..? తీవ్రమైన మానసిక వేదన మొదలవుతుంది. ఆ ఇబ్బందేమిటో అర్థం కాక.. నలుగురిలోకి రాలేక.. కంటి మీద కునుకుండదు. శారీరక సమస్య కంటే కూడా మానసిక వేదన మరింతగా అతలాకుతలం చేస్తుంది. అందుకేనేమో పొలుసుల వ్యాధి.. 'సొరియాసిస్‌' పేరు వింటూనే చాలామంది బెంబేలెత్తి పోతుంటారు. చర్మం మీద ఎలాంటి మచ్చ కనబడినా సోరియాసిస్‌ మచ్చేమోనని అనుమానిస్తుంటారు. ఇది దీర్ఘకాలం వేధించే తీవ్రమైన సమస్యే కావొచ్చు. కానీ సరైన చికిత్స తీసుకుంటూ, తగు జాగ్రత్తలు పాటిస్తే చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి దీని గురించి అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
 సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి. అంటువ్యాధి కాదు. ఎక్కువగా వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది.
* ఇది స్వల్పమైన వ్యాధి దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది.
* ఈ సోరియాసిస్ లక్షణాలు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. (క్రానిక్ డిసార్డర్) దీర్ఘకాలపు చర్మ వ్యాధి.
* ఈ వ్యాధి లక్షణాలు జీవితాంతము వస్తుంటాయి పోతుంటాయి.
* ఈ వ్యాధి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది.
* ఇది అన్ని జాతుల వారికి సంక్రమిస్తుంది.

సోరియాసిస్ కి కారణాలేమిటి?
* ఖచ్చితమైన కారణమనేది తెలియదు. ప్రస్తుత సమాచారం మాత్రం సోరియాసిస్ కి సంబంధించి రెండు కారణాలను సూచిస్తుంది.

1. పూర్వీకుల నుండి పొందడం,
2. ఆటోఇమ్యూన్ ప్రతి స్పందన.

* వ్యక్తులలో కొన్ని జన్యు పరమైన ప్రేరేపణ వల్ల తప్పుడు సూచనలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధకు పంపబడతాయి. దీని వల్ల చర్మకణాల పెరుగుదల చక్రం ఎక్కువవుతుంది. ఈ చర్మకణాలు ఒక దానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇవి త్వరగా రాలిపోవు. సోరియాసిస్ సంక్రమించిన కొందరు వ్యక్తులు కుటుంబ చరిత్ర కలిగి ఉండరు. కొన్ని జన్యువులు దీనికి సంబంధితమైనవి.

ఎర్రటి మచ్చలు, పొలుసులు రాలడం ఎందుకు జరుగుతుంది ?

* చర్మం మీది పైన పొరలోవున్న చర్మ కణాల సంఖ్య ఎక్కువ అవడం వలన చర్మం పొలుసులుగా రాలడం ఎర్ర మచ్చలు పడటం జరుగుతుంది.* సాధారణంగా చర్మ కణాలు నాలుగు వారాలలో పరిపక్వత చెంది శరీరం మీది ఉపరితలం నుండి రాలిపోతుంటాయి
* సోరియాసిస్ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ ప్రక్రియ ప్రతి 3 -4 రోజుల లోపు త్వరగా జరుగుతుంది.* అత్యధికంగా చర్మకణాల ఉత్పత్తి జరగడం వలన సోరియాసిస్ లో చర్మం మీద కణాలు ఏర్పడుతాయి

  • సోరియాసిస్ ను ఎలా గుర్తిస్తారు ?
* చర్మం ఎర్ర బారడం, పొలుసులుగా రాలడం, దురద, గట్టిపడటం, పగుళ్ళు, అరిచేయి, అరికాలు మీద బొబ్బలు ఏర్పడటం మొదలగునవి సోరియాసిస్ లక్షణాలు.
* స్వల్పంగా ఉండచ్చు లేకపోతే ఆకృతి కోల్పోవడం, చేతకాని స్ధితికి రావడం లాంటి తీవ్రమైన స్ధాయికి చేరుకోవచ్చు.
  • సోరియాసిస్ లో వివిధ రకాలు ఏమిటి ?
* చర్మ కణాలు తీరు మరియు చర్మంమీది మచ్చలు ప్రకారంగా సోరియాసిస్ పలు విధాలుగా విభజించబడింది.

1. ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్ చర్మంమీద తీవ్రమైన ఎర్రదనం వాపు వస్తుంది.
2. ప్లేక్ సోరియాసిస్ ఇది సోరియాసిస్ లో అతిసాధారణమైనది.
(80% సోరియాసిస్ ఉన్న ప్రజలకు ఇదే ఉంటుంది.)* ఇది చర్మం మీద ఎర్రగా పొంగిన కనాలను కలుగజేస్తుంది. * ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులను వృద్ధి చేస్తుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడినా, మోకాలు, మోచేతులు,తలమీది చర్మం పైన, మొండెము మరియు గోళ్ళమీద ఎక్కువగా ఏర్పడతాయి.

3. ఇన్వర్స్ సోరియాసిస్ ఇది చర్మం ముడతలలో నున్నగా, ఎర్రటి వ్రణాలను
లిగిస్తుంది.
4. గట్టేట్ సోరియాసిస్ ఇది నీటి బొట్లులాంటి చిన్న చర్మ వ్రణాలను కలిగిస్తుంది.
5. పుస్య్టులార్ సోరియాసిస్ ఇది తెల్లటి, చిక్కటి పదార్ధంతో నింపబడిన బొబ్బలను
కలిగిస్తుంది.
6. సోరియాటిక్ ఆర్రైటిక్ ఇది రుమటాయిడ్ ఆర్రైటిక్ లాంటి ఒక రకమైన కీళ్ళకు
సంబందించిన వ్యాధి.
  • సోరియాసిస్ ప్రేరేపించే లేక దుర్భరం చేసే కారణాలు ఏమైనా ఉన్నాయా?
సోరియాసిస్ ఉన్న వ్యక్తులలో కొన్ని కారణాలు గారను వృద్ధి చేస్తాయి. వాటిలో కొన్ని కారణాలు చర్మహాని చేసే రసాయనాలు, ఇన్ఫెక్షన్, గోకటం, రక్కుటం, ఎండకు చర్మం కములుట, మద్యము, హార్మోన్ల (అసమౌతుల్యం), పొగత్రాగడం, కొన్నిమందులు బీటాబ్లాకర్స్,నాన్ స్టీరాయిడల్ ఆంటి-ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్, ఒత్తిడి.

సోరియాసిస్‌ వ్యాధిని ప్రేరేపించే కారకాలు ,Predisposing factors in Psoriasis

చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి, పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్‌ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ, తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. కాబట్టి వాటి గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.

ఒత్తిడి: ఒత్తిడితో సోరియాసిస్‌ మరింత తీవ్రం అవుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఒత్తిడిని దరిజేరకుండా చూసుకోవటం ఎంతో అవసరం. ఇందుకు గట్టిగా శ్వాస పీల్చుకొని 1 నుంచి 10 వరకు అంకెలు లెక్కబెట్టటం, సానుకూల దృక్పథంతో ఆలోచించటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటి పద్ధతులను పాటించాలి.

అలర్జీలు: సోరియాసిస్‌, అలర్జీలు రెండింటిలోనూ రోగనిరోధకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. అలర్జీని ప్రేరేపించే మాస్ట్‌కణాలు సోరియాసిస్‌ బాధితుల్లోనూ అధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వీరు దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు వంటివి పడనివాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది.

మద్యం: అతిగా మద్యం తాగితే వ్యాధి విజృంభించొచ్చు. పైగా కొన్ని సోరియాసిస్‌ మందులకు మద్యం సరిపడదు. అందువల్ల మద్యం జోలికి వెళ్లకపోవటమే మంచిది. రోజుకు 20 నిమిషాల సేపు ఎండ తగిలేలా చూసుకుంటే సోరియాసిస్‌ తీవ్రతను తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేసినా మంచి ఫలితం ఉంటుంది.

చల్లని/పొడి వాతావరణం: చర్మం పొడిగా ఉంటే పొలుసుల బాధ మరింత పెరగొచ్చు. కాబట్టి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. లోషన్లు, సబ్బులను వాసన లేనివి వాడితే మంచిది. దీంతో సున్నితమైన చర్మం దురద పెట్టకుండా చూసుకోవచ్చు.

మందులు: మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్‌ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్‌కు చెప్పాలి.

గాయాలు: సాధ్యమైనంతవరకు చర్మానికి గాయాలు కాకుండా చూసుకోవటం మేలు. ఎందుకంటే గాయాలు అయిన చోట చర్మం మీద ఏర్పడే కంతులు సోరియాసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. ఇంటిపనులు చేస్తున్నప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవటం.. షేవింగ్‌, గోళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పొగ తాగటం: ఈ అలవాటును ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. ఇది సోరియాసిస్‌తో నేరుగా సంబంధం కలిగి ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది. పొగ మానేస్తే హఠాత్తుగా వ్యాధి విజృంభించటమూ తగ్గుతున్నట్టు తేలింది.

హార్మోన్లు: సోరియాసిస్‌ ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 20-30 ఏళ్ల వయసులో.. అలాగే 50-60 ఏళ్ల వయసులో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వనం ఆరంభంలో, మెనోపాజ్‌ దశలు సోరియాసిస్‌ పొడలను ప్రేరేపిస్తాయి. ఇందుకు హార్మోన్లు దోహదం చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
  • సోరియాసిస్ ఎలా నిర్ధారించబడుతుంది ?
* వ్యక్తి యొక్క వైద్య చరిత్ర మరియు బాహ్య పరీక్ష ఆధారంతో వైద్య నిపుణులు సోరియాసిస్ నిర్ధారిస్తారు. * ఈ వ్యాధిలోని ప్రత్యేకమైన వ్రణాలను బట్టి ఆ వ్యక్తికి ఏ రకమైన సోరియాసిస్ ఉందో తెలుసుకోవచ్చు. * నీళ్ళలో ఎక్కువగా ఉండకండి. మీ షవర్ స్నానం, స్నానం సమయం తగ్గించండి. ఈత కొట్టడం తగ్గించుకోండి. * చర్మాన్ని గోకటం, రక్కుటం  మానుకోవాలి. * చర్మాన్ని రుద్దకుండా ఉండే వీలైన దుస్తులను ధరించాలి.
* ఇన్ఫెక్షన్, కానీ మరే ఇతర అస్వస్ధతకు గురియైన మీ వైద్యుణ్ణి సంప్రదించండి.
  • సమతుల ఆహారం ముఖ్యమా?
* ఏ ఆహారమైతే వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచుతుందో అదే సమతుల ఆహారం. ఎందుకంటే సోరియాసిస్ తో ఉన్నవ్యక్తులు మిగతా వారికంటే ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆహారపుటలవాట్ల నుండి లాభం పొందుతారు. * కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరిస్ధితిని దుర్బరం కానీ, చర్మ స్ధితిని మెరుగు పరుస్తాయి అని చాలా మంది అంటుంటారు.
* సోరియాసిస్ కలిగి ఉన్నవ్యక్తులు పాటించవలసిన ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేదు. అయినప్పటికీ కొన్ని ఆహార పద్ధతులు సూచించబడ్డాయి.
  • సోరియాసిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?
సోరియాసిస్ వ్యక్తుల పైన మానసిక మరియు శారీరక ప్రభావం చూపుతుంది.
సోరియాటిక్ కీళ్ళవాపు, ఒక రకమైన కీళ్ళరోగం, ఉన్నకొద్ది మంది వ్యక్తులో వచ్చి వారికి నొప్పిని మరియు చేతకాని స్ధితిని తీసుకువస్తుంది.
  • సోరియాసిస్ అంటు వ్యాధా ?
 కాదు సోరియాసిస్, అంటు వ్యాధి కాదు. ఒకరి నుండి ఇంకొకరు పట్టుకోలేరు. ఈ వ్యాధి అదుపులో ఉంచడానికి ఏది సహకరిస్తుంది ? ఈ క్రింది ప్రతిపాదనలను పాటించండి.

* చర్మానికి హాని కలిగించే దెబ్బల నుండి ,గాయాల నుండి, ఎండ తీవ్రతకు కూడ దూరంగా ఉంచండి. * మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు కమిలేంతగా బయలు పర్చకండి. * మద్యాన్ని మరియు పొగ త్రాగటం మాని వేయండి. * మీ పరిస్ధితిని దుర్బరం చేసే మందులకు దూరంగా ఉండండి. * ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి
  • వ్యాధి నివారణ
సోరియాసిస్ తీవ్రతను బట్టి వ్యాధి చికిత్స -సోరియాసిన్ వ్యాధి ఉధ్రుతమైనది,  దీర్ఘకాలికమైనది. కావున ఒక రోగికి , మరో రోగికి వ్యాధి తీవ్రతలో తేడా ఉంటుంది. జబ్బు తీవ్రతను బట్టి చికిస్త చేయవలసిన అవరముంటుంది. తగినంత శరీరకశ్రమ , విశ్రాంతి, సమతుల్య ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మరక్షణకు సంబంధించిన జాగ్రత్తలూ, ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా సుచి-శుబ్రత పాటించడం, పొడి చర్మానికి తేమకోసం ఆయిల్ పూయడం మంచిది.
  • చికిత్స : 
ఈ కింద ఆయింట్మెంట్లు వాడితే మంచి ఫలితాలు వస్తాయి .
1. CALDOC Oint.
2, PROPYSALIC Oint.రెండుపూటలా రాయాలి .
చర్మము దురదగా ఉంటే " cetrazine 10 mg "రోజుకి ఒకటి -- అవసరమైనంతకాలము వాడాలి .

స్కిన్ స్పెసలిస్ట్ గారి ... వ్యాసాన్ని చదవండి . క్లిక్ చేయండి - > సోరియాసిస్
  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 17, 2010

ముట్లు ఆగిపోవడము , Menopause




మెనోపాజ్‌ సహజం-- మెనోపాజ్ సమయములో దానికి ముందు ఈస్ట్రోజన్‌తో సహా స్త్రీ సెక్ష్ హార్మోనులు స్థాయి తగ్గిపోతుంటుంది. మేల్ హార్మోన్‌ యాండ్రోజన్‌ అలాగే ఉంటుంది.

  • గర్భధారణ వయసు పదిహేనేళ్ల నుంచి నలభై తొమ్మిదేళ్లు వరకు ఉంటుంది. నలభై ఐదేళ్ల నుంచి అండాలు క్రమంగా తగ్గుతాయి. ఒక దశకొచ్చే సరికి అండాలు మాయమవుతాయి. దీంతో మెదడు నుంచి సంకేతాలు పంపినా ప్రయోజనం ఉండదు. అండాలు తగ్గి, పరిపక్వమవడానికి అవకాశం ఎప్పుడు ఉండదో అప్పుడు మెనోపాజ్‌ దశ (రుతుక్రమం నిలిచిపోవడం) వస్తుంది. ఇవన్నీ మహిళల జీవితంలో పెనవేసుకున్న మార్పులు. పుట్టినప్పటి నుంచి రుతుక్రమం మొదలయ్యే దాక ఒక దశ, రుతుక్రమం నుంచి రుతుక్రమం నిలిచేదాక ఒక దశ. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మెనోపాజ్‌ దశ రావడం సహజం.

మెనోపాజ్‌ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్‌' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్‌ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.

45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్‌ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్‌ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్‌ హోర్మోన్స్‌ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.

ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్‌ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్‌ (స్త్రీ సెక్స్‌ హోర్మోన్స్‌) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.

స్థితి మూడు దశల్లో ఉంటుంది.

ప్రీ మెనోపాజ్‌ : ఈ స్థితిలో ఓవరీస్‌ నెమ్మదిగా పని చేస్తాయి. ఋతుక్రమం మామూలుగానే వస్తుంది. కానీ కొన్ని లక్షణాలు బయటపడతాయి.

మెనోపాజ్‌ రెండవదశ : ఈ దశలో ఋతుక్రమం తప్పుతుంది. దీని లక్షణాలు బాధాకరంగా ఉంటాయి.

మూడవ దశ (పోస్ట్‌ మెనోపాజ్‌) : ఒక్కోసారి పీరియడ్స్‌ సంవత్సరం వరకూ పూర్తిగా ఆగిపోతాయి. దీనిని పోస్ట్‌ మెనోపాజ్‌ అంటారు.

మెనోపాజ్‌ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.

  • రాత్రి నిద్ర పట్టకపోవటం,
  • చెమట పట్టటం,
  • ఆకస్మికంగా గుండె,
  • మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,
  • వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.
  • ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
  • యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.

సెక్స్‌ హోర్మోన్స్‌ తక్కువ కావటం వల్ల 'కలయిక' పట్ల ఆసక్తి తగ్గు ముఖం పడుతుంది. అయితే బాధలు తగ్గి, ఋతుక్రమం ఆగిపోయిన తరువాత ఆసక్తి మామూలు స్థితికి చేరుకుంటుంది. నెలనెలా వచ్చే పీరియడ్స్‌ సక్రమంగా రాక క్రమంగా ఆగిపోతాయి. కొంతమందిలో ఎక్కువ సమయం తీసుకుంటాయి.

ఈ లక్షణాలే కాకుండా మెనోపాజ్‌ స్థితిలో స్త్రీ మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. విసుక్కోవటం, చిరాకు పడటం జరుగుతుంది. అదే సమయంలో రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, ఆస్టియోపొరోసిస్‌, మూత్ర విసర్జనలో బాధ లాంటివి కూడా వచ్చే అవకాశం వుంది.

అలా అని సమస్య మరీ తీవ్రంగా వుంటుందని అనుకోవలసిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరంలో మెనోపాజ్‌ దశ ఒక వ్యాధి లక్షణం కాదు. ఇది ఒక సామాన్య స్థితి మాత్రమే.

మెనోపాజ్‌ దశకు చేరుకొన్న వారిలో రాత్రిపూట నిద్రాభంగం సహజం. కనీసం 3--4 సార్లు మెలకువ వస్తుంది. మళ్లీ నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేకపోవడంతో పాటు అలసట, నీరసం కలుగుతాయి. దాంతో మరుసటి రోజు చిరాకు, కోపం, విసుగువస్తాయి.

తల తిరగడం, ఒళ్లు తూలడం, దురదలు, తిమ్మిర్లు, మంటలు కనబడతాయి. కొందరిలో తలనొప్పి విపరీతంగా ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మతి మరుపు ఎక్కువ అవుతుంది. డిప్రెషన్‌ లక్షణాలు కలుగుతాయి.

మెనోపాజ్‌ బాధలు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు చేయించుకోవడం అవసరం. హిస్ట్రక్టమి ఆపరేషను చేయించుకున్న స్త్రీలకి కేవలం ఈస్ట్రోజను హోర్మోను ఇస్తే సరిపోతుంది. హిస్ట్రక్టమి ఆపరేషను అవని వాళ్లకి ఈస్ట్రోజను హోర్మోనుతోపాటు ప్రొజిస్టరోన్‌ హార్మోను కూడా ఇవ్వడం అవసరం.

మెనోపాజ్‌ వచ్చిన స్త్రీలు మానసికంగా కృంగిపోక హోర్మోను రీప్లేస్‌మెంట్‌ థెరఫీ పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తే సంసార సుఖం, మానసిక ఆనందం అలాగే నిలచి ఉంటాయి.

జీవితంలో మలిదశ.. మెనోపాజ్‌... అత్యంత కీలకం. ఇది ఆనందంగా సాగాలంటే.. శారీరకంగా చోటు చేసుకునే ప్రతి మార్పునీ గుర్తించగలగాలి.అవగాహన ఉంటేనే ఆ సమయంలో ఇబ్బంది పడకుండా ఉండగలం. ఇంతకీ మెనోపాజ్‌ అంటే ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా కొనసాగిన రుతుక్రమం ఒక వయసొచ్చాక ఆగిపోవడం. ఈ దశకు ముందు, తరవాతా చోటు చేసుకునే రకరకాల మార్పులు స్త్రీని ఎంతో ప్రభావితం చేస్తాయి.

ఒక వయసు వచ్చాక నెలసరి ఎందుకు నిలిచిపోతుందో తెలియాలంటే.. అసలు రుతుక్రమం విధానం.. దానిని నియంత్రించే అంశాలపై అవగాహన అవసరం.

తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మాయిలో అండాశయాలు లేక ఓవరీల్లోని అండాలు (ఓవ ఎగ్స్‌) తయారవుతాయి. అవి ఇరవై వారాల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు 70 లక్షల అండాల పూర్వదశ ఉండి, క్రమంగా తగ్గి పాప జన్మించేటప్పటికి 20 లక్షలు, రజస్వల సమయానికి మూడు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో పునరుత్పత్తి వయసులో నాలుగైదు వందల అండాలు మాత్రమే విడుదలవుతాయి. మిగిలినవి వాటికవే అట్రీషియా అనే ప్రక్రియతో నశించిపోతాయి.

ఇలా అండాల సంఖ్య క్షీణించడంతో హార్మోన్ల విడుదల స్థాయీ తగ్గుతూ వస్తుంది. చివరకు అండాశయాల్లోని ఊసైట్స్‌ బాగా తగ్గిపోయినప్పుడు పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే గోనాడోట్రోపిన్‌ హార్మోన్లు కూడా ఇతర హార్మోన్ల, అండాల విడుదలకు ప్రేరేపించవు. ఈ మార్పులు మెనోపాజ్‌కి దాదాపు పదేళ్ల ముందే చోటు చేసుకుంటాయి. నెలసరి పూర్తిగా ఆగిపోవడమనేది చివరి మెట్టు. అందువల్లే హార్మోన్ల స్థాయి తగ్గుముఖం పట్టినప్పటి నుంచీ కొందరు స్త్రీలకు మెనోపాజ్‌ సంబంధ సమస్యలు మొదలవుతాయి.

అండాశయాలు పూర్తిగా ముడుచుకుపోయి పని చేయడం ఆగిపోయే దశలో శరీరంలో అనేక మార్పులు తప్పవు. మెదడు నుంచి చర్మం దాకా, గోళ్ల నుంచి శిరోజాల వరకు, జ్ఞాపకశక్తి మొదలుకొని లైంగిక సంపర్కం.. ఇలా స్త్రీ శరీర ధర్మాలన్నింటిపై హార్మోన్ల లేమి ప్రభావం ఉంటుంది.

చెప్పాలంటే.. ఈ దశ 45-55 ఏళ్ల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. విదేశాలలో ఈ సగటు వయసు 51 ఏళ్లయితే, మన దేశంలో 48. ఇది ఎప్పుడు ఆగిపోతుందో గుర్తించలేం కానీ.. తల్లి మెనోపాజ్‌ వయసును తెలుసుకోగలిగితే... కొంతవరకు అంచనా వేయవచ్చు.

కొందరికి అసాధారణంగా నలభయ్యేళ్ల కంటే ముందే ఆగిపోతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌', అరవయ్యేళ్ల దాకా కొనసాగుతుంటే... 'డిలేయిడ్‌ మెనోపాజ్‌'గా పేర్కొంటాం. ఇవి రెండూ అసహజమైనవే. ఇతర సమస్యలు తెచ్చిపెట్టేవే.

సహజమైన మెనోపాజ్‌ అయితే.. వయసు వల్ల అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లు విడుదల ఆగిపోవడమే కారణం. అయితే అండాశయాలను నిర్వీర్యం చేసే ఇతర కారణాలూ మెనోపాజ్‌ సంభవించేలా చేస్తాయి.

సర్జికల్‌ మెనోపాజ్‌: ఏ కారణం వల్లనైనా అండాశయాలను తొలగించడమే సర్జికల్‌ మెనోపాజ్‌. సహజ మెనోపాజ్‌ అయితే.. హార్మోన్లు క్రమేపీ తగ్గుతాయి కాబట్టి శరీరం అలవాటు పడుతుంది. కానీ ముందురోజు వరకూ మామూలుగానే ఉన్న హార్మోన్లు మర్నాటికల్లా మాయం కావడంతో మెనోపాజ్‌ లక్షణాలన్నీ ఒక్కసారి విజృంభించి వేధిస్తాయి.

రేడియేషన్‌, కీమోథెరపీ: జనేంద్రియాల క్యాన్సర్ల చికిత్సలో భాగంగా ఇచ్చే ఈ థెరపీలు అండాశయాలపై ప్రభావం చూపి మెనోపాజ్‌కు దారితీస్తాయి.

ప్రిమెచ్యూర్‌ ఒవేరియన్‌ ఫెయిల్యూర్‌ (పీఓఎఫ్‌): నలభయ్యేళ్లు నిండకుండానే మెనోపాజ్‌ రావడాన్ని పీఓఎఫ్‌ అంటారు. జన్యు సమస్యల వల్ల అండాశయాలు లోపభూయిష్టంగా ఉండటం.. లేదా శరీరంలో వ్యాధినిరోధక వ్యవస్థ గాడితప్పడమే ముఖ్యకారణం.

హిస్టెరెక్టమీ లేదా గర్భాశయాన్ని తొలగించిన తరవాత మామూలుగా కన్నా నాలుగేళ్లు ముందుగానే మెనోపాజ్‌ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పౌష్టికాహారలోపం ఉన్నవారికి ఇది రెండేళ్లు ముందుగానే వస్తుంది.

మెనోపాజ్‌ దశలో వయసు పైబడటం వల్లా మధుమేహం, కీళ్లనొప్పులు వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు కమ్ముకొని పీడిస్తాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే శారీరక, మానసిక దృఢత్వం అవసరం. వృద్ధాప్యం వచ్చాక కాక ముందునుంచీ ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరి.

మహిళల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే దశ (మెనోపాజ్) ఎప్పటినుంచి మొదలవుతుందో ముందుగానే పసిగట్టవచ్చునని అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. మెనోపాజ్ దశను ముందుగా గుర్తించే ఓ వినూత్న పరీక్షా విధానాన్ని వీరు కనుగొన్నారు.

మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం ఈ పరిశోధన గురించి వివరాలందించారు. ఈ పరిశోధన ప్రకారం... రక్తంలోని హార్మోన్ల స్థాయిని బట్టి, ప్రత్యుత్పత్తి దశ ఇంకెంత కాలం ఉంటుందో అంచనా వేయవచ్చు. మెనోపాజ్ దశ వచ్చేందుకు ఇంకా ఎంత కాలం పడుతుందో తెలుసుకోవడం వల్ల గర్భం పొందే ఆలోచన ఉన్న నడివయసు మహిళలు ముందుగా, సంసిద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

పై పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మేరీ ఫ్రాన్ సోవర్స్ "డైలీ మెయిల్" పత్రికకు అందించిన వివరాల ప్రకారం... తమ పరిశోధనలకుగానూ సుదీర్ఘ కాలం పాటు 600 మంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులను అధ్యయనం చేసినట్లు తెలిపారు.

యాంటీ మల్లెరియన్ హార్మోన్, ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పులను పసిగట్టడం వల్ల మెనోపాజ్‌ను ముందుగానే గుర్తించవచ్చని సోవర్స్ వెల్లడించారు. ఈ రకంగా మెనోపాజ్‌ను దశను ముందుగానే గుర్తించటం, దానికి మహిళలు సంసిద్ధంగా ఉండటం వల్ల... వారు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుంటుందని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెనోపాజ్‌ దశలో స్త్రీలు పడే ఇబ్బందులు , Sympotoms of Menopause :

అతి కోపం.. చిరాకు.. విపరీతమైన ఆందోళన..జ్ఞాపకశక్తి క్షీణించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే.. మెనోపాజ్‌ దశలో స్త్రీలు రకరకాల భావోద్వేగాలకు లోనవుతారనే భావన ఎప్పట్నుంచో ఉంది. అలాంటి పరిస్థితులకు దారితీసే అంశాలు, తద్వారా ఎదురయ్యే ఇతర సమస్యలపైన దృష్టి సారిద్దాం.

మలిదశలో స్త్రీలకు ఎదురయ్యే మానసిక సమస్యలకు ఎన్నో కారణాలున్నాముఖ్యమైనవి .... ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపడటం. వేడి, చెమటలతో నిద్ర పట్టకపోవడం. ఆ వయసులో తరచూ ఎదురయ్యే ఒత్తిళ్లు... ప్రధానమైనవి.

నిరాశ : పురుషులతో పోలిస్తే.. మహిళల్లో నిరాశ పాళ్లు ఎక్కువని ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. రుతుక్రమం మొదలైనప్పుడు, ఆగిపోయేప్పుడు.. నెలసరికి ముందు, కాన్పుల తరవాతా డిప్రెషన్‌ ఎక్కువగా ఉంటుందని తేల్చిచెప్పాయి. అయితే ఇది కచ్చితంగా మెనోపాజ్‌ వల్లే వస్తుందనడానికి కచ్చితమైన ఆధారాల్లేవు. ఈ సమయంలో బాధించే డిప్రెషన్‌కు పరిష్కారంగా యాంటీ డిప్రెసెంట్‌ మందుల్నే మొదటి చికిత్సా విధానంగా పరిగణిస్తారు.

ఒత్తిడి : అకారణంగా ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, అర్థంలేని భయాలు దీని లక్షణాలు. ఇవి ఎక్కువైతే 'ప్యానిక్‌ ఎటాక్స్‌' కనిపిస్తాయి. కొందరు స్త్రీలలో మెనోపాజ్‌ దశలో హాట్‌ ఫ్లషెస్‌ వచ్చేముందు ఇవి కనిపించవచ్చు.

జ్ఞాపకశక్తి: ఏకాగ్రత లేదని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇది మెనోపాజ్‌ లేని స్త్రీలలోనూ కనిపిస్తుంది. దీనికి మెనోపాజ్‌ కారణాలకన్నా... వయసుతో పాటూ కలిగే ఒత్తిడి, డిప్రెషన్‌, పని భారం, ఆరోగ్యం క్షీణించడం వంటివి ప్రధానంగా దోహదం చేస్తాయి.

నిద్ర: వయసు మీరినకొద్దీ నిద్ర పట్టడంలేదని, చీమ చిటుక్కుమన్నా మెలకువ వస్తోందనీ వయసు మళ్లిన స్త్రీలు చెబుతుంటారు. శారీరక శ్రమ తగ్గడం, వయసు పెరగడంతోపాటు ఒత్తిడి, హార్మోన్లు తగ్గిపోవడం కూడా దీనికి కారణాలు కావచ్చు.

సాధారణంగా మెనోపాజ్‌ సమయంలో వేధించే హాట్‌ఫ్లషెస్‌, మానసిక సమస్యలతో పాటు శరీరంలోని ఇతర వ్యవస్థలలోనూ కొన్ని మార్పులుకనిపిస్తాయి. చర్మం, జుట్టు, కండరాలు... ఇలా శరీరంలో దాదాపుగా మార్పులుంటాయి. వీటిలో చాలావరకూ వయసుతో వచ్చే మార్పులయితే కొన్ని మాత్రం ప్రత్యేకంగా ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోవడం వల్ల చోటుచేసుకుంటాయి.

చర్మం: దీనిపై ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రభావం చాలానే ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ రిసెప్టార్స్‌తో కలిసి చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. మెనోపాజ్‌ తరవాత ఈస్ట్రోజెన్‌ లభించనప్పుడు చర్మం పొడిబారుతుంది. కొలాజిన్‌ తగ్గిపోవడం వల్ల ముడతలు కనిపిస్తాయి. చర్మం పల్చబడి నరాలు తేలి కనిపిస్తాయి. గోళ్లూ నిగారింపు కోల్పోయి పెళుసుగా మారి.. తరచూ విరిగిపోతూ ఉంటాయి.

అవాంఛిత రోమాలు: మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ తగ్గడంతో ఆండ్రోజెన్‌ లేక పురుష హార్మోను నిష్పత్తి ఎక్కువవుతుంది. దాంతో పురుషుల నుదురులా పెద్దదైపోవడం... పై పెదవి, చుబుకంపై అవాంఛిత రోమాలు పెరిగే ఆస్కారమూ ఉంటుంది.

కీళ్లూ, కండరాలు: నడివయసులో తరచూ ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు బాధిస్తున్నాయంటారు చాలామంది. వయసు కారణంగా కీళ్లు అరిగిపోవడం సహజమే. మెనోపాజ్‌తో ఎముకల్లోని కొలాజిన్‌ తగ్గిపోవడంతో ఆ ఇబ్బందులు మరింత వేధిస్తాయి. మెనోపాజ్‌ మొదటి అయిదేళ్లలోనే ముప్ఫై శాతం కొలాజిన్‌ తగ్గిపోతుందని అంచనా.

కళ్లు: ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కీ, కళ్లకీ దగ్గరి సంబంధం ఉంది. నెలసరి సమయంలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. అంతెందుకు శరీరంలో హార్మోన్లు మార్పు చెందినప్పుడల్లా కంటి తడిలో, చూపులోనూ మార్పులు వస్తాయనేది నిజం. తడి తగ్గిపోయి కళ్ల మంటలు, ఎర్రగా మారడం, నలుసులు.. వంటివి పొడిబారిన కళ్లకు లక్షణాలు. అలాగే ఈ దశలో చత్వారం రావడం కూడా సహజమే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ శుక్లాలు లేక క్యాటరాక్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెనోపాజ్‌ తరవాత కాటరాక్ట్‌ పెరుగుదల ఎక్కువవుతుంది.

బరువు: రుతుక్రమం నెలనెలా అవుతుంటే బరువు పెరగమనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అందుకే మెనోపాజ్‌ రాగానే బరువు పెరిగాం అనుకుంటారు. సాధారణంగా ఈ వయసులో ఎక్కువ మంది రెండు నుంచి రెండున్నర కేజీల బరువు పెరుగుతారు. బరువు పెరగడానికి ముఖ్యకారణం.. ఆహారపుటలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడమే.మెనోపాజ్‌తో కండరాల పరిమాణం, బలం తగ్గుతాయి. పెరిగే బరువులో అధికశాతం నడుము, పిరుదుల చుట్టూనే పెరుగుతుందనేది వాస్తవం. ఆహారం విషయంలో నియమాలు, తగిన వ్యాయామం చేస్తే... మునుపటిలా అందమైన ఆకృతి కొనసాగుతుంది.

  • ===================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 10, 2010

క్రీములతో జాగ్రత్త , Creams Usage and Precautions




చర్మాన్ని తెల్లబరిచే క్రీములు (స్కిన్‌ లైటెనింగ్‌) మితిమీరి వాడితే హైపర్‌టెన్షన్‌ను పెంచుతాయనీ కాలక్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయనీ డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. వైటెనింగ్‌ క్రీముల తయారీలో వాడే కొన్ని రకాల స్టీరాయిడ్‌లు, మెర్క్యురీ వంటివి కాలక్రమంలో నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. హైడ్రోక్వినైన్‌ వంటి రసాయనాలున్న క్రీములను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు వాడితే అనేక రకాల శాశ్వత దుష్ఫలితాలు కలుగుతాయంటున్నారు. శరీరఛాయ తక్కువగా ఉండటం తప్పేమీ కాదనీ మానసికంగా దృఢంగా ఉండి ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తే రంగును ఎవరూ పట్టించుకోరనీ వారు చెబుతున్నారు.
  • =====================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, March 3, 2010

తామర , Ringworm





తామర (Ringworm) అనేది ఒక శిలీంధ్ర సంబంధిత చర్మవ్యాధి. ఎరుపురంగు(Reddish) పొలుసులతో గుండ్రటి (Ring)మచ్చలు ఏర్పడతాయి. వీటికి దురద ఎక్కువగా ఉంటుంది. తామర అనేది దాదాపుగా శుభ్రతకు సంబంధించినది. ఒక చర్మ వ్యాధి. పరిశుభ్రత లేకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదు.

ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా తడిగా ఉన్నచర్మం ముడతలలోని ప్రదేశాలలో నివాసముంటుంది .
ఎన్నో రకాల బుజులు ఉన్నాప్పటికీ తామరను కలుగజేసే ఫంగస్ ను " దేర్మతోఫిట్స్ (Dermatofytes)" అంటారు అందులో ముక్యమైనవి .
Scientific names for the most common of the dermatophyte fungi include
Trichophyton rubrum,
Trichophyton tonsurans,
Trichophyton interdigitale,
Trichophyton mentagrophytes,
Microsporum canis,
Epidermophyton floccosum

రింగ్ వరం ముఖ్యం గా చర్మము , గోళ్ళు , వెంట్రుకలు కేరాటిన్ పొరపై తన ప్రతాపము చూపుతుంది .

రాకుండా జాగ్రత్తలు :
  • ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
  • ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటే డెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగా కడుగుకోవాలి .
  • చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గా నడవకూడదు .
  • బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
  • గజ్జి , తామర ఉన్న పెంపుడు జంతువుఅలను తాకరాదు .

ట్రీట్మెంట్ :
యాంటి ఫంగల్ మందులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి చర్మమ పై రాయాలి . ఆయింట్మెంట్
  • Miconazole,
  • Terbinafine,
  • Clotrimazole,
  • Ketoconazole,
  • Tolnaftate

నోటిద్వారా ...
  • గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250 మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
  • ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజు ఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
  • దురద తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦ మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
  • పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6 రోజులు వాడాలి (penudureLA6WeeklyFor4Weeks )

  • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నోటి దుర్వాస , Bad Breath (Halitosis)









నలుగురిలోకి రావడం మాట అటుంచి నలుగురిలో నోరు విప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనిషిని భయపెట్టే శక్తి ఒకే ఒక్క అంశానికి ఉంది ప్రపంచంలో. అదేంటో కాదు నోటి దుర్వాసనే... దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతగా అది మనిషిని వణికిస్తుంది. దీని దెబ్బతో నలుగురిలో సహజంగా ఉండలేరు. హాయిగా నోరువిప్పి నవ్వలేరు..

ఒకటి మాత్రం ఖాయం... ఇది వస్తే చాలు మనిషి జీవితమే మారిపోతుంది. నోరు విప్పలేని జీవితం. మనసారా నవ్వుకోలేని జీవితం. పగవాడికి కూడా రావద్దు బాబోయ్ అనిపించేంత ఫీలింగ్.. నోటి దుర్వాసనకే సాధ్యం.

మన నోరు మనకే కంపు వేసే పరిస్థితి వస్తే ఇతరులకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి దీన్ని పోగొట్టుకోవడం ఎలా.. మనచేతిలోనే ఉంది పరిష్కారం. మన ఆహార అలవాట్లలో కాస్త మార్పులు చేసుకుంటే చాలు.. దుర్వాసన దెబ్బకు దిగి కిందికి వస్తుంది

మనం తినే పదార్ధాల వాసనల ప్రభావం మనం విడిచే గాలి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన పదార్ధాల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత రక్తప్రసరణ వ్యవస్థలో కలిసిపోతాయి. అయినా ఆయా పదార్ధాల తాలూకూ వాసనలు పూర్తిగా పోవు. అక్కడి నుంచి ఆ రక్తం ఊపిరి తిత్తుల్లోకి వెళ్తుంది. అందుకే మనం శ్వాస విడిచిపెట్టినప్పుడు.. మనం ఎప్పుడో తిన్న పదార్ధాల వాసన బయటకు వస్తుంటుంది. మన శరీరం ఆ ఆహారాన్ని పూర్తిగా బయటకు విసర్జించేంత వరకూ కూడా ఏదో రూపంలో ఆ వాసన వెలువడుతూనే ఉంటుంది.

నోటి దుర్వాసనకారణాలు

అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన కల వాయువులను ఏర్పరుస్తుంది. ఇవి నోటినుండి బయటకు వదలబడుతాయి.
గొంతు నందలి ఇన్ఫెక్షన్ మరియు పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము మరియు రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును.
చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.
మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళలో ఇది సాధారణం గా ఉంటుంది .
సాధారణంగా పళ్ళు, నోరు అపరిశుభ్రంగా వున్నందున నోటి దుర్వాసన వస్తుంది.
నోటిలోని చిగుళ్ళు ఇన్ ఫెక్షను వల్ల కూడ రావచ్చును.
మసాల పదార్ధములతో తయారు చేసిన ఆహార పదార్ధములు తీసుకొన్నపుడు దుర్వాసన వచ్చే అవకాశం వుంది.
సాధారణంగా నోరు తడిలేని వారికి రావచ్చును.
దీర్ఘకాలక, శ్వాసకోశవ్యాదులు, ముక్కుకు సంబంధించిన వ్యాదులు కూడ కారణం కావచ్చును.
పొగాకు నమలడం, బీడీ, సిగరెట్ మొ||నవి వాడడం కారణంకావచ్చును.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-
దీనికి ఇది కేవలం బ్రష్‌ చేసుకోవటం, మౌత్‌వాష్‌ల వంటివి వాడటంతో తగ్గిపోయే సమస్య కాదు.
ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించిన వెంటనే దంతవైద్యులను సంప్రదిస్తే తగిన కారణాలను అన్వేషిస్తారు.
నోటిని శుభ్రంగావుంచాలి.
రోజుకు రెండు సార్లు పళ్ళను శుభ్రము చేయాలి.
ఆహారం తీసుకొన్నతరువాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
మెత్తని ప్లాస్టిక్ నాలుక పుల్లతో నాలుకను శుభ్రపరచాలి.
కట్టుడు పళ్ళువున్న క్రమము తప్పక శుభ్రము చేసుకోవాలి.
వీలైనంత ఎక్కువగా నీరు తీసుకొవాలి.
అన్నివేలల నాలుకను తడిగా వుండే విధంగా చూసుకోవాలి.
నోటిని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అంటే దీనర్థం మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలనే.. మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే షుగర్ ఫ్రీ గమ్ నమలడం. దీనిని నమిలితే నోటిలో లాలాజలం ఊరుతుంటుంది.
చిగుళ్ల సమస్యల్ని తగ్గించుకోవటం,
అవసరమైతే ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవటం వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన

aayurvaedik chitkaalu :

ప్రతి రోజూ లవంగం నోట్లో వేసుకుని చప్పరించండి. దీంతో దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.

** ప్రతి రోజూ గురివింద వేరును తింటేకూడా నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుందని kontamandi వైద్యులు చెబుతున్నారు.

** నిత్యం ఒక గ్లాసు నీటిలో తాజా నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.

** నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతి రోజూ తులసి ఆకులు నమిలి తింటే నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంది.

** రాత్రిపూట పడుకునే ముందు బ్రష్ చేస్తారు కదా. దానికి ముందుగా రెండు మిరియాల గింజలను నోట్లో వేసుకుని నమలండి. ఆ తర్వాత బ్రష్ చేయండి. దీంతో నోటి దుర్వాసననుంచి ఉపశమనం కలుగుతుంద.

** వేంచిన జిలకర నమిలితేకూడా ఉపశమనం కలుగుతుంది.

పుదీనా ఆకులు నమిలి తినాలి. పుదీనా రసం నీటిలో కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకులు పొడుముతో దంతధావన చేయాలి. దంతవ్యాధులకు పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ ఆకులు బాగా, ఎక్కువసేపు నమిలి తింటుంటే దంత సంబంధిత సమస్యలు తలెత్తవు.

ఒక కప్పు రోజ్ వాటర్‌లో అర చెక్క నిమ్మకాయ రసాన్ని అందులో కలపండి. దీనిని ఉదయం-సాయంత్రం రెండుపూటలా పుక్కలించండి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. దంతాలుకూడా గట్టిపడుతాయ.

నిప్పుమీద కాల్చిన మొక్కజొన్నను తింటే దంతాలు దృఢంగా తయారవుతాయి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది


  • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/