Monday, October 24, 2011

కొవ్వు పదార్థాలు కొన్ని ప్రాథమిక విషయాలు,Fatty food and basic awareness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కొవ్వు పదార్థాలు కొన్ని ప్రాథమిక విషయాలు,Fatty food and basic awareness-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మనం తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు స్థూలంగా కార్బొహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, ఫాట్స్‌ అన్న విషయం తెలిసిందే. మధుమేహ రోగులకు ఆహారం గురించి సూచించినప్పుడు మొత్తం కేలరీలు ఎంత తీసుకోవాలో చెప్పి, అందులో కార్బొహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, ఫాట్స్‌ నిర్దిష్ట పాళ్లలో ఉండేలాచూసుకోవాలని చెబుతారు. లిపిడ్స్‌ లేదా ఫాట్స్‌ అంటే కొవ్వు పదార్థాలను 30 శాతం మించకుండా తీసుకోవాలని సూచిస్తారు. అందులోకూడా శాచురేటెడ్‌ ఫాట్స్‌ 10 శాతం, అన్‌శాచురేటెండ్‌ ఫాట్స్‌ 20 శాతం ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా శరీరంలో శక్తి కార్బొహైడ్రేట్స్‌ రూపంలో కంటే ఫాట్స్‌ రూపంలో ఎక్కువ శక్తి నిల్వ ఉంటుంది. ఒక స్త్రీ శరీరం కార్బొహైడ్రేట్స్‌ రూపంలో 1000 కేలరీలశక్తిని నిల్వ ఉంచుకోగల్గితే, కొవ్వు రూపంలో 1,25,000 కేలరీలను నిల్వ ఉంచుకోగలదు. అదే స్థూలకాయం కల్గిన స్త్రీ శరీరం దాదాపు 5,00,000 కేలరీల శక్తిని నిల్వ ఉంచగల్గుతుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 కేలరీల శక్తిని విడుదల చేయగలదు . సుమారు ప్రతి 7200 కేలరీల శక్తి శరీరంలో ఒక్క కిలోగ్రాము బరువుగా మారుతుంది . అందుకే కొవ్వు పదార్థాల వినిమయంలో కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రత్యేకించి మధుమేహరోగులకు ఎంతగానో ఉంది.

మెదడుకు కొవ్వు కావాలి :
శరీరము లో కొవ్వును పెంచుకోవడానికి ఎవ్వరూ ఏమాత్రము ఇస్టపడరు . వైద్యులు కూడా శరీరములో కొవ్వు పేరుకుపోకూడదంటారు . అయితే మెదడుకి మాత్రము కొవ్వు కావాల్సిందేనని అంటున్నారు . .. . శాస్త్రవేత్తలు . మెదడు ఎంత పాదరసం లా పనిచేస్తే మనం మన కార్యకలాపాల్ని అంత చురుగ్గా నివహిస్తాము . మెదడు లో 60% ప్ర్యాట్ ఉంటుంది . ఈ ప్యాటీ / లీడ్స్ మెదడు ఫిట్ గా , ఫైన్‌ గా ఉండేందుకు సహకరిస్తుంది . మెదడులో ఎక్కువ ఫ్యాట్ తగ్గితే సులువు గా అలసిపోయి జ్ఞాపకశక్తి లోపించడానికి , డిప్రెషన్‌ కు, అందో్ళనకు లోనవడము జరుగుతుందంటారు . ఒమేగా 3 ప్యాటీయాసిడ్ ఉన్న పదార్ధాలు తినడము వల్ల బ్రెయిన్‌ కు మంచి పోషకాలు లబిస్తాయి. ఒక పదార్ధము ఒక అవయవానికి మంచిదైతే మరొక అవయవానికి చెడ్డదిగా ఈ ప్రకృతి ఆదిపత్యము చేస్తూ ఉన్నది .

కొవ్వు పదార్థాలు
అన్ని రకాల పదార్థాల్లోనూ కొవ్వులు ఎంతో కొంత శాతం ఉంటాయి. కానీ ఎక్కువగా కొవ్వు కల్గిన పదార్థాలు ఏమిటో చూద్దాం... వృక్షసంబంధమైన కొవ్వులు ఎక్కువగా నూనెల రూపంలో ఉంటాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌), కుసుమ (సాఫ్లవర్‌), వేరుశనగ, ఆవనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, సోయాచిక్కుడు నూనె, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వంటివి ఉదాహరణలు. అలాగే జంతుసంబంధమైన కొవ్వులకు పాలు, పాలుఉత్పత్తులైన వెన్న, నెయ్యి, జున్ను వంటివి, గడ్లు, మాంసం వంటివి ఉదాహరణలు.

ఒమేగా ఫాటి ఆమ్లాలు
ఫాటి ఆమ్లాలలో లినోలిక్‌, ఆల్ఫా-లినోలెనిక్‌ ఆమ్లాలు శరీరానికి అత్యవసరం. వీటిని శరీరం లోపల తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారా బయటి నుండి తీసుకోవాల్సిందే. అందుకే వీటిని ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అంటాం. పాలిఅన్‌శాచురేటెడ్‌ ఫాటి ఆమ్లాల గ్రూపునకు చెందిన ఒమేగా-3 ఫాటి ఆమ్లాలు శరీరంలో ఆల్ఫాలినోలెనిక్‌ ఆమ్లం ద్వారా తయారవుతాయి. ఇపిఎ, డిహెచ్‌ఎ వంటి వాటిని ఆల్పాలినోలెనిక్‌ ఆమ్లం ద్వారా శరీరం తయారు చేసుకోగలదు. ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ట్రైగ్లిసరైడ్స్‌ను, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తాయి. క్యాన్సర్‌ నివారణకో దోహదం చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అల్జిమర్స్‌ వంటి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.

ఫాస్ట్‌ ఫుడ్స్‌
దాదాపు అన్ని రకాల ఫ్యాక్డ్‌ ఫుడ్స్‌, పిజ్జాలు, బర్గర్స్‌, చిప్స్‌, పేస్త్రీలు వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌లో మార్గరిస్‌, డాల్డా (వనస్పతి) వంటి హైడ్రోజెనేటెడ్‌ చేయబడిన కొవ్వుపదార్థాలు, చవకగా లభించే పామాయిల్‌ వంటివి వాడతారు. ఎందుకంటే ఈ రకంగా హైడ్రోజనేట్‌ చేసిన కొవ్వులు ఎక్కువకాలం చెడకుండా ఉంటాయి. సువాసన కూడా చెడకుండా ఉంటుంది. వ్యాపార ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా చూస్తే, ట్రాన్స్‌ఫాట్స్‌, శాచురేటెడ్‌ ఫాట్స్‌ వాడకం వల్ల రక్తంలో టోటల్‌, చెడు కొలెస్టరాల్‌ శాతం పెరిగి, ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డుపడతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, పెరిఫెరల్‌ వాస్కులర్‌ డిసీజ్‌ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ ఫాస్ట్‌ఫుడ్స్‌ మార్కెట్‌ ప్రపంచ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలకు లాభాల వర్షం కురిపిస్తోంది. ఒక్క 2006లోనే ప్రపంచ ఫాస్ట్‌ఫుడ్‌ మార్కెట్‌ విలువ 10,240 కోట్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. ఒక్క మెక్‌డోనాల్డ్స్‌ బహుళజాతి కంపెనీ 6 ఖండాల్లో 126 దేశాల్లో 31,000 ఫాస్ట్‌ఫుడ్‌రెస్టారెంట్స్‌ నడుపుతుందంటే దీని విస్తృతి మనకు అర్థమవుతోంది. ఇలాంటి ట్రాన్స్‌ఫాట్స్‌, శాచురేటెడ్‌ ఫాట్స్‌ బారిన పడి బహుళజాతి కంపెనీలకు లాభాలను కూర్చిపెట్టి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్న ఈ దుస్థితికి పరిష్కారం ప్రజల్లో ఆరోగ్యం పట్ల విస్తృతమైన అవగాహన పెంపొందించడం మాత్రమే కాగలదు.

ఆదర్శ నూనె-లక్షణాలు
* శాచురేటెడ్‌ ఫాటి ఆమ్లాలు (శా.ఫా. ఆ.) తక్కువగా (6 నుంచి 8 శాతం) ఉండాలి.

* మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు (ముఫా) ఎక్కువగా (65 నుంచి 70 శాతం) ఉండాలి.

* పాలిఅన్‌శాచురేటెడ్‌ ఆమ్లాలైన (పూఫా) లినోలిక్‌ (ఓమెగా-3), ఆల్ఫాలినోలెనిక్‌ (ఓమెగా-6) ఫాటీ ఆమ్లాలు సరైన నిష్పత్తిలో ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ఓమేగా-3, ఓమేగా-6 పాలిఅన్‌శాచురేటెడ్‌ ఆమ్లాల నిష్పత్తి 4:5 ఉండాలి.

* ట్రాన్స్‌ఫాటి ఆమ్లాలు రెండు శాతం కంటే తక్కువుండాలి.

ఏ ఒక్క వంట నూనెలో కూడా ఆదర్శనూనెకు చెప్పబడిన పరిమాణాల్లో, పాళ్లలో అన్ని ఫాటీ ఆమ్లాలు ఉండవు. ఉన్నతంతో మూఫాస్‌ ఎక్కువుండే నూనె ఒకరోజు, పూఫాస్‌లో ఓమేగా3/ఓమెగా-6 ఫాటీ ఆమ్లాల నిష్పత్తి ఆదర్శవిలువలకు దగ్గరగా ఉండే నూనె మరోరోజు వాడుకోవడం మంచిది. అంటే రెండు రకాల నూనెలు వాడుకోవడం ఉత్తమం. ఉదాహరణకు మూఫా ఎక్కుండే ఆవనూనె,వేరుశనగనూనె, రైస్‌బ్రాన్‌ నూనెల్లో ఏదైనా ఒకరోజు వాడుకోవాలి. మరుసటి రోజూ పూఫాస్‌ ఎక్కువుండే సన్‌ఫ్లవర్‌ నూనె, సోయాచిక్కుడు నూనెల్లో ఏదైనా వాడుకోవడం ఉత్తమం.

నూనె శా.ఫా. ఆ.శాతం ముఫా శాతం పూఫా ఓమేగా-3 శాతం పూఫా ఓమేగా-6 శాతం ఓమేగా 3/ ఓమేగా-6 నిష్పత్తి ప్రధాన ఫాటీ ఆమ్లాలు

ఆవనూనె 8 70 12 10 6:5 మూఫా

సోయానూనె 15 27 53 5 10.6:1 పూఫా

పామాయిల్‌ 45 44 10 0.5 20:1 శాచురేటెడ్‌+మూఫా

వేరుశనగ 24 50 25 0.5 50:1 మూఫా

సన్‌ఫ్లవర్‌ 13 27 60 0.5 120:1 పూఫా

రైస్‌బ్రాన్‌ 22 41 35 1.5 23:1 మూఫా+పూఫా

జాగ్రత్తలు

*వంటనూనెల వ్యాపారతయారీ ప్యాక్‌పై లేబుల్‌ను క్షుణ్ణంగా పరివీలించండి. శాచురేటెడ్‌ ఫాట్స్‌ శాతం 6 నుంచి 8 శాతం ఉండేలా చూసుకోండి. అలాగే ట్రాన్స్‌ఫాట్స్‌ శాతం 2 శాతం మించకుండా గమనించండి. దేశంలో లభ్యమయ్యే ఎక్కువశాతం బ్రాండ్స్‌ వంటనూనెల్లో ట్రాన్స్‌ఫాట్స్‌ శాతం 2 శాతం మించకూడాదన్న నిబంధన అతిక్రమించి 12 శాతంపైగా ఉంటోంది.

* కల్తీ నూనె అని అనుమానం వచ్చినప్పుడు ఫుడ్‌ అడల్టరేషన్‌ కంట్రోల్‌ అధికారులకు ఫిర్యాదుచేసి, చెక్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి.

* నెలకు మనిషికి అరకిలో మించకుండా అంటే రోజుకు సగటున ఒక టేబుల్‌స్పూన్‌ మించకుండా వంటనూనె వాడకాన్ని పరిమితం చేయాలి.

* డీప్‌ఫ్రై ( మరిగేదాకా వేపుడు చేయడం) పద్దతులు అనారోగ్యకరం. డీప్‌ ఫ్రై పద్దతులు బదులు స్టిర్‌ ఫ్రై, గ్రిల్లింగ్‌, బేకింగ్‌ వంటి పద్ధతుల్లో వండడానికి ప్రాధాన్యతనివ్వాలి.

* నాన్‌స్టిక్‌ పాన్‌ వాడండి. తక్కువ నూనె పట్టేలా చేస్తుంది. అలాగే సాధ్యమైతే మార్కెట్‌లో లభ్యమయ్యే కనోలా లేదా ఆలివ్‌ ఆయిల్‌ స్రై వాడితే కూడా నూనె తక్కువ పట్టేలా వండుకోవచ్చు.

* చవక కదా అని పామాయిల్‌, డాల్డా వంటి వాడాకాన్ని ప్రోత్సాహించకూడదు.

* ఏదైనా నూనెను వేడిచేసినప్పుడు, బాగా మరిగి ఒక దశలో పొగ వస్తుంది. ఈ దశనే ఆనూనె స్మోక్‌ పాయింట్‌ అంటాం. ఈ దశలో నూనె మాడి, అనారోగ్యకరమైన రసాయన మార్పులు సంభవిస్తాయి. స్మోక్‌పాయింట్‌ దాటి వేడిచేసినప్పుడు జరిగే మార్పుల వల్ల క్యాన్సర్‌ కారకాలు ఏర్పడతాయని కూడా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. గారెలు, పూరీలు, సమోసా, బజ్జీ, పకోడి, అప్పడాలు, వడియాలు, ఫ్రైడ్‌ చికెన్‌ వంటి వంటకాలకు ఇలా నూనె ఎక్కువగా మరగపెడుతుంటాం. వీలైనంత మటుకు మరగకాచిన నూనెను మరలా వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. సాధారణంగా చూస్తూ చూస్తూ ప్రతీసారీ నూనెని పారబొయ్యలేం కనుక మళ్లీ వాడేస్తుంటాం. కనీసం మరగకాచిన నూనెని వేరే పాత్రలో ఉంచి అదేరోజు తక్కువ కాచే అవసరం ఉండే కూరల్లో తాళింపు వంటి వాటిలో వాడండి.

* ఒకసారి వాడిన నూనెను తిరగి వాడే ముందు పాత్రలోని అడుగు భాగాన్ని వడగట్టండి.

ఫాటి ఆమ్లాలు

ఫాటి ఆమ్లాలు స్థూలంగా శాచురేటెడ్‌ ఫాటీఆమ్లాలు, అన్‌శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు అని తెలుసుకున్నాం. అన్‌శాచురేటెడ్‌ ఫాటీఆమ్లాలను మళ్లీ మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు, పాలిఅన్‌శాచురేటెడ్‌ అనే రెండు రకాల ఫాటీ ఆమ్లాలుగా విభజించొచ్చు. ఇవిగాక వ్యాపారోత్పత్తిలో భాగంగా వెజిటబుల్‌ నూనెలను హైడ్రోజనేషన్‌ ప్రక్రియకు గురిచేయడం ద్వారా ఉత్పత్తి చేసే కొవ్వుపదార్థాల్లో ట్రాన్స్‌ఫాట్స్‌ అనేవి ఎక్కువగా ఉంటాయి.

* కొబ్బరినూనె, పామాయిల్‌ నూనెల్లో శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

* వేరుశనగ, ఆలివ్‌నూనె, ఆవ నూనె, నువ్వులనూనె, రేప్‌సీడ్‌ (కనోలా) నూనె, రైస్‌బ్రాన్‌ నూనెల్లో మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.

* సన్‌ఫ్లవర్‌, కుసుమనూనె, సోయాచిక్కుడు నూనె, పత్తిగింజలు నూనె, మొక్కజొన్న గింజలనూనెల్లో పాలిఅన్‌శాచురేటెడ్‌ ఆమ్లాలుంటాయి.

* మార్గరిస్‌, డాల్డా (వనస్పతి)లో ట్రాన్స్‌ఫాట్స్‌ ఎక్కువుంటాయి.

శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు రక్తంలో టోటల్‌ కొలెస్టరాల్‌, చెడు కొలెస్టరాల్‌ పరిమాణాన్ని పెంచి, ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డుపడి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

* మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫాటీ ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించడం ద్వారా గుండెకు మేలుచేస్తాయి. మంచి కొలెస్టిరాల్‌పై ప్రభావం చూపవు.

*పాలిఅన్‌శాచురేటెడ్‌ ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించడంతోపాటు మంచి కొటెస్టిరాల్‌ను కూడా తగ్గిస్తాయి.

* ట్రాన్స్‌ఫాట్స్‌ రక్తంలో చెడు కొలెస్టిరాల్‌, ట్రైగ్లిసరైడ్స్‌ పరిమాణాన్ని పెంచుతాయి. మంచి కొలెస్టరాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. స్థూలంగా ఇవికూడా గుండెకు, ఇతర రక్తప్రసరణ వ్యవస్థకు హానికరం.

డిస్‌లిపిడిమియా చికిత్స

అమెరికన్‌ డయాబెటిస్‌ ఆసోసియేషన్‌ సిఫార్సు ప్రకారం డయాబెటిక్‌ డిస్‌లిపిడిమియా చికిత్సలో ప్రథమ ప్రాధాన్యత. ఎల్‌డిఎల్‌ కొలస్టరాల్‌ స్థాయిని తగ్గించడంగానూ, తర్వాత ప్రాధాన్యత హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ స్థాయిని పెంచడం గానూ, ఆ తర్వాత ప్రాధాన్యత ట్రైగ్లిసరైడ్స్‌ స్థాయిని తగ్గించ డంగానూ సూచించబ డుతుంది.

ఆహార నియమాలు : మధుమేహంలో ఉండే డిస్‌లిపిడిమియా చికిత్సలో మొదటి ప్రాధాన్యత ఆహారని యమాలతో నియంత్రించడానికి ప్రయత్నించడం. కేవలం మధుమేహ నియంత్రణకోసమే కాక, డిస్‌లిపిడిమియా నియంత్రణకు కూడా ఆహారనియమాలు ఉపయో గపడతాయి. శాచురేటెడ్‌ ఫాట్స్‌ మొత్తం కేలరీలో 7 శాతానికి తగ్గించాలి. ట్రాన్స్‌ఫాట్స్‌ను పూర్తిగా మినహాయించాలి. ఆహారంలో కొలెస్టరాల్‌ తక్కువగా తీసుకోవడం, పీచును ఎక్కువగాతీసుకోవడం వంటి చర్యలు పరిస్థితిని నియంత్రించడానికి దోహదం చేస్తాయి.

వ్యాయాయమం : క్రమం తప్పని, తగినంత వ్యాయామం, డిస్‌లిపిడిమియా నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రత్యేకించి వ్యాయామం వల్ల ట్రైగ్లిసరైడ్స్‌ పరిమాణం తగ్గడం, మేలుచేసే హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ పెరగడం వంటి ఫలితాలు సాధించొచ్చు. అలాగే వ్యాయామం కొంతమేరకు ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుందని నిరూపించబడింది.

మందులు : ఆహార నియమాలతోపాటు సుమారు 90 శాతం రోగులలో డిస్‌లిపిడిమియా నియంత్రణకు మందుల వాడడం తప్పనిసరి. డాక్టర్‌ పర్యవేక్షణలోనే మందులు వాడాలి.

డిస్‌లిపిడిమియా

మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్‌ నిరోధకత ఫలితంగా, రక్తంలో అధిక పరిమాణంలో ఉండే గ్లూకోజ్‌ నిల్వల వలన ఫాటి ఆమ్లాల మెటబాలిజం ప్రభావితమై పలురకాల కొవ్వుపదార్థాల పరిమాణల్లో, పాళ్లలో సాధారణంగా ఉండాల్సిన సమతుల్యత లోపిస్తుంది. దీన్నే డయాబెటిక్‌ డిస్‌లిపిడిమియా అంటారు. ప్రధానంగా డయాబెటిస్‌ రోగుల్లో ట్రైగ్లిజరైడ్స్‌ అధికంగా ఉండడం, మంచి కొలెస్టరాల్‌ తక్కువ ఉండడం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. మొత్తం మధుమేహరోగుల్లో 50 శాతం మందిలో రక్తంలో వివిధ కొవ్వుపదార్థాల పాళ్లలో సమతుల్యత లోపిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. అయితే మధుమేహరోగుల్లోనే కాకుండా ఇటువంటి కొవ్వుపదార్థాల పరిమాణాల్లో సమతుల్యత లోపించడం ఇతర కొన్ని వ్యాధిస్థితుల్లో కూడా సంభవిస్తుంది. మూత్రపిండాల వ్యాధి, హైపోథైరాయిడిజం, జన్యుసంబంధ లైపోప్రోటీన్‌ వ్యాధుల్లో కూడా డిస్‌లిపిడిమియా గమనించొచ్చు.

కొలెస్టరాల్‌

కొలెస్టరాల్‌ మనం తీసుకునే ఆహారంలోనూ లభ్యమవుతుంది. శరీరంలో కాలేయం, ఇతర అవయవాల్లోనూ తయారవుతుంది. కొలెస్టరాల్‌ రక్తంలో కరగదు కాబట్టి ఎల్‌డిఎల్‌, హెచ్‌డిఎల్‌ అనే లైపోప్రోటీన్స్‌తో కలిసి రవాణా అవుతుంది. ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ ధమనుల్లో పేరుకుని రక్తప్రసరణకుఅడ్డుపడి గుండెపోటు, పక్షవాతం, పెరిఫరల్‌ వాస్కులర్‌ డిసిజెస్‌ వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని చెడు కొలెస్టరాల్‌ అంటాం. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ రక్తంలోని,పరిధీయ కణాల్లోని కొలెస్టరాల్‌ను కాలేయానికి రివర్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చేయడం ద్వారా గుండెకుమంచి చేస్తుంది కాబట్టి దీన్ని మంచి కొలెస్టరాల్‌ అంటాం. ట్రెగ్లిసరైడ్స్‌ అనే కొవ్వు పదార్థం మనం తీసుకునే ఆహారంలోనూఉంటుంది. అలాగే ఆహారంలో లభించే అదనపు శక్తి శరీరంలో ట్రైగ్లిజరాయిడ్స్‌గా మార్చుతుంది. ట్రెగ్లిసరైడ్స్‌ రక్తంలోని కైలోమైక్రాన్స్‌, విఎల్‌డిఎల్‌ (వెరీ లో డెన్సిటి లైపోప్రోటీన్స్‌) అనే లైపోప్రోటీన్స్‌తో కలిసి రవాణా అవుతుంది. ట్రెగ్లిసరైడ్స్‌ కూడా రక్తంలో అధికపరిమాణంలో ఉన్నప్పుడు రక్తప్రసరణకు అడ్డుపడడం ద్వారా హానీ చేస్తాయి. ఒక్కోసారి పాన్‌క్రియాటైటిస్‌ వ్యాధికి దారితీయవచ్చు.

హాని చేస్తాయా ?
నిర్దిష్టమైన పరిమాణం కంటే అధిక పరిమాణాల్లో కొవ్వు పదార్థాలు శరీరంలో చేరినప్పుడు పలు దుష్ఫలితాలు కలుగుతాయి.

* చెడు కొలెస్టరాల్‌గా పిలిచే ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలపై చేరి పెంకులా ఏర్పడుతుంది. ఇది ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండె కండరానికి రక్తసరఫరా చేసే కొరొనరీ ధమనులు మూసుకుపోయి గుండెపోటు, మెదడులోని భాగాలకు రక్తసరఫరా చేసే ధమనులు మూసుకుపోయి పక్షవాతం వస్తుంది. కాళ్లకు రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోయి ఫెరిఫరల్‌ వాస్కులర్‌ డిసీజ్‌ వంటి ప్రాణాంతక వ్యాధులొస్తాయి.

* ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా చేరినప్పుడు ఆక్యూట్‌ పాన్‌క్రియాటైటిస్‌ అనే వ్యాధికి దారితీయొచ్చు.

* వెజిటబుల్‌ ఆయిల్స్‌ను కృత్రిమంగా హైడ్రోజనేట్‌ చేయడం ద్వారా తయారయ్యే ట్రాన్స్‌ఫాట్స్‌ కూడా గుండెకు హానిచేస్తాయి.

*కొవ్వుకు సంబంధించిన వ్యాధులైన లైపోమా, లైపోసార్కోమా అనే గడ్డలుగా ఏర్పడొచ్చు.

వంట నూనె

వంట చేయడానికి ఏ వంటనూనె వాడాలి? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ప్రపంచంలో పలు దేశాల్లో, పలు ప్రాంతాల్లో పలు రకాల వంటనూనెలు సాంప్రదాయబద్దంగా వాడకంలో ఉన్నాయి. వీటి వాడకం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఉదాహరణకు మెడిటెరేనియన్‌ ప్రాంతంలో ఆలివ్‌నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ ప్రజల్లో గుండెపోటు వంటి వ్యాధులు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే బంగ్లాదేశ్‌, మన దేశంలోని పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లో ఆవనూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల కూడా సాపేక్షంగా గుండెపోటు వంటి వ్యాధులు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే మనదేశంలోని కేరళ ప్రాంతంలో వంటనూనెగా వాడే కొబ్బరినూనె వల్ల గుండెపోటు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండటమే గాక, ఇన్సులిన్‌ నిరోధకపై కూడా దుష్ప్రభావం చూపుతుందని కొట్టాయంలోని ఎంజి విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.కనుక ఎలాంటి వంటనూనె వాడాలనే దానికి సమాధానం శాస్త్రీయంగా చెప్పాలంటే అసలు మనం వాడే వివిధ వంటనూనెల్లో ఏయే రకాల ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకోవాలి.

లిపిడ్‌ ప్రొఫైల్‌

ఒక వ్యక్తి రక్తంలో వివిధ రూపాల్లో ఉండే కొలెస్టరాల్‌, ఇతర కొవ్వు పదార్థాల పరిమణాన్ని లెక్కించడానికి చేసే పరీక్షలను లిపిడ్‌ ప్రొఫైల్‌ అంటాం. ప్రత్యేకించి మధుమేహ రోగుల్లో 6 నెలలకు ఒకసారి లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షించుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తారు. లిపిడ్‌ ప్రొఫైల్‌లో టోటల్‌ కొలెస్టిరాల్‌, ఎల్‌డిఎల్‌ కొలెస్టిరాల్‌, హెచ్‌డిఎల్‌ కొలెస్టారాల్‌, ఎల్‌డిఎల్‌, హెచ్‌డిఎల్‌ నిష్పత్తి, కైలోమైన్స్‌, విఎల్‌డిఎల్‌, ట్రైగ్లిసరైడ్స్‌ పరీక్షిస్తారు.

--డాక్టర్‌ కె.శివబాబు-రాష్ట్ర హెల్త్‌ సబ్‌ కమిటీ సభ్యులు-జనవిజ్ఞానవేదిక, జహీరాబాద్‌.


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, October 22, 2011

పిల్లల నిద్ర-అవగాహన,Sleeping of children-awareness




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పిల్లల నిద్ర-అవగాహన- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిద్రపోతుంటే ముద్దుగానే ఉంటారుగానీ.. ఆ నిద్రకు ముందు పెద్ద యుద్ధాలే చేస్తుంటారు! పగలంతా కమ్మగా నిద్రలాగిస్తారు.. రాత్రి అవుతూనే పిల్లసైనికుల్లా ఎక్కళ్లేని చురుకుదనంతో ఎవర్నీ పడుకోనివ్వకుండా ఆటలు మొదలెడతారు. ఒకపక్క నిద్ర ముంచుకొస్తుంటుంది.. మనసు ఆటల వైపు లాగుతుంటుంది. ఏడుపు, నానా రభస. అతి కష్టమ్మీద నిద్ర పుచ్చుతాం.. వెనక్కితిరిగే లోపే లేచి కెవ్వున ఏడుపు. ఈ 'పిల్ల నియంతృత్వం'తో ఇల్లంతా కల్లోలం. అమ్మా నాన్నలకు తలప్రాణం తోకలోకి వస్తుంటుంది. నిజానికి పిల్లల నిద్ర విషయంలో సరైన అవగాహన పెంచుకుంటే.. ఇవన్నీ సమస్యలే కాదు.

నిద్ర ఎవరికైనా అవసరం, పిల్లలకు మరీ అవసరం.శిశువులు మూడునెలలు వచ్చేవరకు రోజులో కనీసం 18-20 గంటలైనా విడతలవారిగా నిద్రపోతారు. మధ్యమధ్యలో పాలు తాగటానికి లేవటం, మళ్లీ పడుకోవటం.. ఇలా ఉంటుంది వాళ్ల నిద్రశైలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంటుంది. మూడు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు రోజులో 14-15 గంటలు నిద్రపోతారు. 2-4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో సుమారు 12 గంటలు నిద్రపోతారు. స్కూలుకెళ్లే వయసు (5-9 ఏళ్లు) పిల్లలు కనీసం 10-12 గంటలైనా నిద్రపోవాలి. యుక్తవయసు వచ్చేసరికి పిల్లల్లో నిద్ర అవసరం తగ్గినా, వీళ్లుకూడా కనీసం 9 గంటలైనా పడుకోవాలి. ఇక యుక్తవయసు దాటిన పెద్దవాళ్లు రోజులో 6-8 గంటలు పడుకున్నా సరిపోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో పగటినిద్ర తగ్గినా ఏడాది వయసు పిల్లలు పగటివేళ కనీసం మూడు గంటలైనా నిద్రపోతారు. మిగతా పదీ పదకొండు గంటలు రాత్రివేళలో పడుకుంటారు.

కమ్మని నిద్రే ముఖ్యం:
పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలు మధ్యలో నిద్రలేస్తున్నారా?లేస్తే మళ్లీ పడుకోబెట్టటానికి కష్టమవుతోందా? పొద్దున్నే వేళకు లేవటం లేదా? అనేవి ముఖ్యం. సరిగా నిద్రపోని పిల్లల్లో చికాకు కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ నాణ్యమైన నిద్ర లేకపోతే, పొద్దున లేవటానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. పదిపన్నెండేళ్ల వయసు పిల్లలు త్వరగా పడుకోరు. రాత్రి పన్నెండు గంటలదాకా కంప్యూటర్‌ గేమ్స్‌, టీవీలు, సినిమాలు చూడటం వంటివాటిలో గడిపేస్తారు. ఇవన్నీ నిద్ర నాణ్యతను దెబ్బతీసేవే. కొంతమంది నిద్ర మధ్యలో తరచూ లేచి ఏడుస్తుంటారు.ఇలాంటివారిలో నాణ్యమైన నిద్ర లేకపోవటం వల్ల పగలు నిద్రపోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఫలితంగా తరగతి గదిలో కునికిపాట్లు, పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవటం, నేర్చుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి, విషయగ్రాహ్య శక్తీ తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్లో కోపం, పిచ్చిపిచ్చిగా, అతిగా ప్రవర్తించటం వంటివి ఎక్కువవుతాయి. ఇవన్నీ ప్రవర్తన సంబంధ సమస్యలు. వీటన్నింటి ఫలితంగా మార్కులూ తగ్గుతాయి. ఇలాంటి లక్షణాలన్నింటినీ ప్రదర్శించే పిల్లలు రాత్రివేళల్లో సక్రమంగా నిద్రపోతున్నారా? అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.

నిద్ర - సమస్యలు
మామూలుగా 25 శాతం మంది చిన్నారుల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ కొద్దికాలంపాటు ఉండి, తగ్గిపోయేవే.
* కొంతమంది చిన్నపిల్లలు రాత్రి నిద్రలో లేచి ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఈ సమస్య 50 శాతం మందిలో కనిపిస్తుంది.
* నిద్రలో అదేపనిగా కాళ్లు కదిలిస్తూ, తన్నుతూ అటూఇటూ పొర్లే 'రెస్ట్‌లెస్‌ లెగ్‌'తో బాధపడే పిల్లలు 25 శాతం ఉంటారు.
* నిద్రలో లేచి నడిచివెళ్లి (స్లీప్‌వాకింగ్‌) వేరేచోట పడుకునే అలవాటు ఉండే పిల్లలూ ఉంటారు. ఇలాంటివారు 15 శాతం మంది.
* కొంతమంది పిల్లల్లో పళ్లు నూరటం (బ్రక్సిజం) వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే దీనిని చాలామంది కడుపులో పురుగులు ఉంటే ఇలా పళ్లు కొరుకుతారని భావిస్తారు. కానీ.. అది వాస్తవం కాదు. 25 శాతం మంది పిల్లలు ఎప్పుడో ఒకసారి పళ్లు నూరేవారే. దీనికి అంతగా ఆందోళన చెందాల్సిందేమీ లేదు.
* కొంతమంది పిల్లల్లో రాత్రివేళ భయంకరంగా అరవటం వంటి సమస్యలు కనిపిస్తాయి. రాత్రివేళ లేచి కేకలు పెడుతూ అరవటం, భయపడుతూ చెమటలు పట్టటం జరుగుతుంటాయి.
...ఇవన్నీ ఒకరకమైన ఉపశమనం పొందటంలో కనిపించే లక్షణాలు. అంటే.. తమలో దాచుకున్న అనుభూతుల్ని బయట పెట్టుకునే మార్గాలు. ఆందోళన స్థాయులు ఎక్కువగా ఉండే పిల్లలకు ఇవి ఎక్కువగా ఉంటాయి. కొద్దిరోజులపాటు ఇలాంటి లక్షణాలు కనిపించి పోతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమేం ఉండదు. చాలారోజులపాటు ఇలా ప్రవర్తిస్తుంటే వైద్యుల్ని సంప్రదించాలి.

వ్యాధులూ కారణమే:
నిద్రకు భంగం కలిగించే సమస్యల్లో కొన్నిసార్లు వ్యాధులూ కారణమవుతుంటాయి. వాటిని పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.

* స్లీప్‌ అప్నియా: నిద్రలో గురకపెట్టటం వంటి సమస్య ఉన్నట్లయితే శ్వాసనాళంలో అడ్డంకులేవైనా ఉన్నాయేమో పరీక్షించాలి. అడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ వాచటం వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుని నోటితో గాలిపీల్చే సమస్య తలెత్తుతుంది. అదేకాకుండా రాత్రి పడుకున్నప్పుడు గొంతు కండరాలు వదులుగా మారతాయి. దీనివల్ల నోటి ద్వారం కూడా మూసుకుపోయి పూర్తిగా శ్వాస ఆడని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఒక్కసారి భయంగా లేచి కూర్చుంటారు. దీనినే 'అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా సిండ్రోమ్‌' అంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే గుండె-ఊపిరితిత్తుల సమస్యలూ, మెదడుకూ ఆక్సిజన్‌ సరిగా అందక బుద్ధి, తెలివితేటలు మందగించే అవకాశం ఉంటుంది.
* తీసుకున్న ఆహారం వెనక్కి తన్నటం వల్ల ఊపిరి అందక అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచి కూర్చుంటారు. ఇలాంటి రీఫ్లక్స్‌ సమస్య ఉందా అనేదీ గమనించాలి.
* ఆస్థమా, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ వంటి సమస్యల్లో కూడా సరిగా నిద్రపట్టదు.
* ఒక్కోసారి నిద్ర సరిగా పట్టకపోవటానికి మందులు కూడా కారణమవుతుంటాయి. ఆస్థమాకు ఇచ్చే కొన్నిరకాల మందులతో.. గుండె దడ, చేతులు వణకటం, నిద్ర పట్టకపోవటం వంటి దుష్ఫలితాలు తలెత్తుతుంటాయి.
* డిప్రెషన్‌లో వాడే కొన్నిరకాల మందులు కూడా నిద్ర రానివ్వకుండా మెలకువగా ఉంచుతాయి.
* పిల్లలకు ఫిట్స్‌ కోసం ఇచ్చే మందుల వల్ల మగతగా ఉండి, పగటి వేళల్లో నిద్రపోతుంటారు. ఫలితంగా రాత్రివేళ నిద్ర తగ్గుతుంది.
* పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రులు విడిచి వెళతారనే భయం, ఇంట్లో, స్కూల్లో వాతావరణం సరిగా లేకపోవటం వంటి సమస్యలుండే పిల్లల్లో ఎప్పుడూ భయం, ఆందోళన వ్యక్తమవుతుంటాయి. ఇవి కూడా నిద్రలేమికి దారితీస్తాయి.
* మెదడు ఎదుగుదల సరిగాలేని పిల్లలకు కూడా నిద్ర సరిగా రాదు. ఇలాంటి పిల్లలు హైపరాక్టివిటీ, అటెన్షన్‌ డెఫిసిట్‌ వంటి సమస్యలతో రాత్రివేళల్లో నిద్రపోరు.
* చాక్లెట్లు తినే అలవాటు ఎక్కువగా ఉండేవారిలో సైతం కెఫీన్‌ కారణంగా నిద్రపట్టని సమస్యలు కనిపిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు పడుకునేముందు పాలల్లో చాక్లెట్‌ ఫ్లేవర్లు ఉండే డ్రింకుల్ని ఇస్తుంటారు. ఈ అలవాటు శ్రేయస్కరం కాదు.
* నిద్రలో మూత్రపోసుకోవటం కూడా నిద్రలేమికి ఒక కారణం. కాకపోతే.. ఇలాంటి అలవాటు వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోతుంది.

చికిత్స ఎలా?
తమ పిల్లలు నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నారంటూ తల్లిదండ్రులు వైద్యుల్ని సంప్రదించినప్పుడు.. పిల్లల నిద్ర అలవాట్లకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటారు. రాత్రివేళ మధ్యలో నిద్ర లేస్తున్నారా? స్కూల్లో మార్కులెలా వస్తున్నాయి? పగటి వేళల్లో నిద్రపోతున్నారా? అలర్జీలేమైనా ఉన్నాయా? ఏవైనా దీర్ఘకాలిక జబ్బులున్నాయా? మెదడు ఎదుగుదల ఎలా ఉంది? వంటివన్నీ పరిశీలిస్తారు. రాత్రివేళ నోరు తెరిచి పడుకుంటున్నారా? గురక శబ్దాలు వస్తున్నాయా? వంటివీ గమనించాలి. ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయనుకుంటే.. ఇవన్నీ కొద్దిరోజులు ఉండి తగ్గేవేనా, దీర్ఘకాలం వేధిస్తాయా? అనేది విశ్లేషిస్తారు. ఆయా కారణాలను బట్టి కౌన్సెలింగ్‌, జీవనశైలిలో చిన్నచిన్న మార్పుల ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా జబ్బులు ఉంటే వాటికి చికిత్స చేస్తే, చాలా వరకు నిద్ర సమస్యలు సర్దుకుంటాయి.
.
అమ్మకడుపు.. ఉయ్యాల
గర్భంతో ఉన్నప్పుడు తల్లి పగలంతా పనులు చేసుకుంటూ.. అటూఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో పొట్టలోని బిడ్డకు ఉమ్మనీరు అటూఇటూ ఊగుతూ.. హాయిగా ఉయ్యాల్లో ఊగుతున్నట్టుండి.. కమ్మగా నిద్రపోతారు. అదే.. రాత్రివేళ తల్లి పడుకుని ఉంటుది కాబట్టి ఏ కదలికలూ లేకపోవటంతో రాత్రంతా మేల్కొని ఉంటారు. ఇలా తొమ్మిది నెలల పాటు తల్లిగర్భంలో గడుపుతారు కాబట్టి.. ఈ పద్ధతి అలవాటై పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు ఇదే పద్ధతి కొనసాగిస్తుంటారు. బిడ్డకు 3, 4 నెలలు వచ్చేసరికి పగలు, రాత్రి తేడాలను గుర్తించటం ఆరంభమై.. రాత్రి పడుకోవటం, పగలు ఆడుకోవటం మొదలుపెడతారు. కాబట్టి మొదటి 3, 4 నెలలూ రాత్రీపగలూ తేడా తెలీక శిశువులు ఇష్టం వచ్చినప్పుడు లేస్తూ.. పడుకుంటూ ఉంటారని గుర్తించాలి. ఇది ప్రకృతి సహజం! ఈ సమయంలో శిశువుల 'సర్కాడియన్‌ రిథమ్‌' వేరేగా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేస్కోవాలి. 4 నెలల తర్వాత ఈ పద్ధతిలో మార్పు వస్తుంది. ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. అంతేగానీ పిల్లల నిద్రను పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్పటికీ ఏదైనా అనుమానం ఉంటే వైద్యుల్ని సంప్రదించి.. బిడ్డలు సహజసిద్ధంగా హాయిగా నిద్రపోయేలా.. చక్కగా ఎదిగేలా చూడటమెలాగో తెలుసుకోవటం ఉత్తమం!

అమ్మానాన్న.. కొన్ని సూచనలు
* పిల్లలకు నిద్రవేళల్ని నిర్దేశించాలి. నిర్దిష్ట సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేయాలి. ఇలాంటివి ముందుగా ఆచరించాల్సింది తల్లిదండ్రులే. పిల్లల కోసమైనా పెద్దవాళ్లు వేళకు పడుకోవాలి, వేళకు లేవాలి. పెద్దలను చూసే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు.
* పిల్లల్ని స్కూలున్న రోజుల్లో ఎలాగైతే పొద్దునే లేపుతారో, సెలవు రోజుల్లో కూడా పొద్దున్నే లేపాలి.
* రాత్రి పడుకోవటానికి గంటముందు నుంచే వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు ఆడుకోవటం, ఉత్సాహంగా ఎగరటం వంటివేమీ చేయకుండా చూడాలి. పడుకునే గంటముందు నుంచీ టీవీలూ, కంప్యూటర్‌ గేమ్‌లూ బంద్‌ చేయాలి. పడుకునేముందు తల్లిదండ్రులు పిల్లలతో ఆహ్లాదంగా గడపాలి. అలాచేస్తే నిద్ర సమస్యలు తలెత్తవు. భయంగొలిపే, థ్రిల్లర్‌ సినిమాలు చూసి పడుకుంటే అంతశ్చేతనలో అవే దృశ్యాలు మెదులుతూ ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదు.
* పిల్లల్ని ఖాళీ కడుపుతో పడుకోబెట్టొద్దు. భోజనం చేయగానే పడుకోనివ్వకుండా, గంటవ్యవధైనా ఉండాలి. ఒకవేళ పడుకునే ముందు ఆకలి వేస్తోందంటే తేలికైన చిరుతిళ్లు, పాలు ఇవ్వచ్చు. రాత్రిపూట కెఫీన్‌ ఉండే పదార్థాలేమీ ఇవ్వద్దు.
* పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తోటిపిల్లలతో ఆడుకునే అవకాశం కల్పించాలి. దీనివల్ల తోటివారితో అనుభూతుల్ని పంచుకునే, అనుబంధం పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఇదంతా మానసిక వ్యాయామం వంటిది, రాత్రికి హాయిగా నిద్ర పడుతుంది.

డా||పి.సుదర్శన్‌రెడ్డి-ప్రొఫెసర్‌, పీడియాట్రిక్స్‌, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్.
  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, October 20, 2011

హైబీపీ విస్మరిస్తే విపత్తే,Dangers of neglecting Hypertension





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -హైబీపీ విస్మరిస్తే విపత్తే,Dangers of neglecting Hypertension- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మనం సరిగా పట్టించుకోవటం లేదుగానీ... అధిక రక్తపోటు..( హైబీపీ).. అతి పెద్ద ఆరోగ్య సమస్య! రక్తపోటును కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే.. మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం.. మెదడు నుంచి కాళ్ల వరకూ.. ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలాభాగం ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. అయినా చాలామందికి అసలు హైబీపీ ఉన్న విషయమే తెలియకపోవటం.. లోలోపల అది కీలక అవయవాలను కబళించేస్తుండటం.. ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న పెను సమస్య. హైబీపీ ఉన్నట్టు తెలిసినవాళ్లు కూడా.. 'ఆ.. ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్‌ బీపీ ఉంది..' అనుకుంటూ బీపీని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ బీపీ... ఉండాల్సిన దానికంటే కాస్త పెరిగినా ముప్పు ముప్పే. పైగా అగ్నికి ఆజ్యంలా దీనికి మధుమేహం, హైకొలెస్ట్రాల్‌ వంటివి తోడైతే ఇక జరిగే నష్టం అపారం!

నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు (హైబీపీ). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి హైబీపీ ఉందని.. 2025 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు మంది (150 కోట్లు) దీని బారినపడొచ్చని అంచనా వేస్తున్నారంటే ఇదెంత పెద్ద సమస్యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి దీన్ని 'సైలంట్‌ కిల్లర్‌'.. అంటే 'కానరాని ముప్పు' అనుకోవచ్చు. ఎందుకంటే హైబీపీ వచ్చినా చాలాకాలం పాటు పైకేమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్లు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది.. నీరసంగా ఉంటుందని రకరకాలుగా భావిస్తుంటారుగానీ అవన్నీ వట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్లు తిరగటం వంటి కొన్ని లక్షణాలు కనబడొచ్చుగానీ.. బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం 'సైలెంట్‌'గా జరిగిపోతుంటుంది. పైగా- హైబీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీన్ని నిర్లక్ష్యం చేసేకొద్దీ క్రమేపీ అది గుండె పోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు.


హైబీపీని దీర్ఘకాలం గుర్తించకపోవటం, నిర్లక్ష్యం చేయటం వల్ల తలెత్తే సమస్యలన్నీ తీవ్రమైనవే.
* మన దేశంలో నానాటికీ మూత్రపిండాల సమస్యలు పెరిగిపోతుండటానికి మధుమేహం, హైబీపీలే ప్రధాన కారణాలు.
* పక్షవాతం కేసుల్లో సుమారు 50%, గుండెపోటు, రక్తనాళాల సమస్యల్లో సుమారు 50 శాతం హైబీపీ వల్ల సంభవిస్తున్నవే.
* ఇవే కాదు.. హైబీపీ కారణంగా గుండె నుంచి బృహద్ధమని ఉబ్బిపోవటం, అది చిట్లిపోవటం వంటి అత్యవసర, ప్రాణాంతక సమస్యలూ పొంచి ఉంటాయి.

వీటన్నింటికీ హైబీపీనే మూలం. అయితే ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చేవి కావు. హైబీపీ కొన్నేళ్లపాటు నియంత్రణలో లేకపోతే క్రమేపీ కొన్ని సంవత్సరాల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇన్ని రకాల ముప్పులు పొంచి ఉంటున్నా దీని గురించి సమాజంలో అవగాహన తక్కువగా ఉండటం పెను సమస్యగా పరిణమిస్తోంది.

హైబీపీ, మధుమేహం రెండూ తోడుదొంగల్లాంటివి. మధుమేహుల్లో దాదాపు నాలుగింట మూడొంతుల మందికి హైబీపీ ఉంటుంటే.. హైబీపీ ఉన్నవారిలో నాలుగో వంతు మందికి మధుమేహం ఉంటోంది. ఈ రెండూ ఉన్నవారికి దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది.

జీవనశైలి మార్పులు: అందరికీ తప్పవు
* ఉప్పు: ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం కచ్చితంగా బీపీని పెంచుతుంది. ఉప్పు తక్కువ తినే సమాజాల్లో హైబీపీ సమస్య తక్కువగా ఉండటమే దీనికి తార్కాణం. ఆహారంలో ఉప్పు తగ్గించటం చాలా అవసరం. సామాజికంగా కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఊరగాయ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, రడీమేడ్‌ ఆహారపదార్థాలు.. ఇలా అన్నింటా ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. ఉప్పు తగ్గించగలిగితే బీపీ దానంతట అదే కొంతకాలానికి, కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.

* పండ్లు: ఆహారంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. పండ్లలో పొటాషియం బీపీ తగ్గేందుకు బాగా దోహదం చేస్తుంది.

* బరువు: అధిక బరువు ఉంటే కచ్చితగా బీపీ పెరుగుతుంది. కాబట్టి తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు కొంత తగ్గించినా దానికారణంగా బీపీ కొంతైనా తగ్గుతుంది.

* వ్యాయామం: రోజూ లేదా కనీసం వారానికి నాలుగైదు సార్లు వేగంగా నడవటం వల్ల కొంతైనా దానంతట అదే బీపీ తగ్గుతుంది. వ్యాయామం తప్పనిసరి అని అందరూ గమనించాలి.

* పొగ: పొగ కచ్చితంగా బీపీ పెంచుతుంది. అంతేకాదు, అనేక విధాలుగా కూడా అనర్థదాయకం. కాబట్టి పొగ పూర్తిగా మానెయ్యాలి.

* మద్యం: ఆల్కహాలు చాలా మితంగా విస్కీ, బ్రాండీ 1.5 ఔన్సులు (50-60 మిల్లీలీటర్లు మించకుండా) తీసుకోగలిగితే మంచిదేగానీ ఆ నియంత్రణలో ఉండలేనివారు దాని జోలికే పోకూడదు. అధికంగా మద్యం తీసుకోవటం హైబీపీకి ఒక ముఖ్యకారణం.

* మందులు: నొప్పినివారిణి మందులు, గర్భనిరోధక మాత్రలు, ముక్కు రంధ్రాలు బిగిసినప్పుడు తగ్గేందుకు వేసుకునే చుక్కల మందులు, స్టిరాయిడ్స్‌.. వీటన్నింటి వల్లా బీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు, పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అలాగే బీపీ చికిత్సకు వెళ్లినప్పుడు వాడుతున్న ఇతర మందుల వివరాలన్నీ వైద్యులకు చెప్పాలి.

ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సినవి. వీటిని జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులుగా చెబుతున్నప్పటికీ అందరూ అసలు వీటినే జీవన శైలిగాఅలవరచుకోవటం ఉత్తమం.

ముందస్తు ముప్పు
మధుమేహుల్లో పూర్తిస్థాయి మధుమేహం రావటానికి ముందస్తు దశ (ప్రీడయాబెటీస్‌) ఉన్నట్టుగానే హైబీపీ బాధితుల్లోనూ 'ప్రీహైపర్‌టెన్షన్‌'.. అంటే 'అధిక రక్తపోటు రావటానికి ముందు దశ' ఉంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దరిదాపు సగం మంది ఈ 'ప్రీహైపర్‌టెన్షన్‌' దశలోనే వీటి బారినపడుతున్నారు. కాబట్టి హైబీపీ వచ్చిన తర్వాతే కాదు.. దానికి కాస్త ముందు దశలో ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

నార్మల్‌ కంటే తక్కువున్నా ముప్పు
* రక్తపోటు 140/90 కన్నా ఎక్కువ ఉన్నవారికి చికిత్స చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలింది. కాబట్టి దాన్ని 'హైపర్‌టెన్షన్‌' ప్రమాణంగా తీసుకున్నారు. కానీ వాస్తవానికి రక్తపోటు 115/75 నుంచి పైకి పెరుగుతున్న కొద్దీ దీర్ఘకాలంలో ముప్పు కూడా పెరుగుతున్నట్టు గుర్తించటం విశేషం. ముఖ్యంగా బీపీ 115/75 నుంచి క్రమేపీ 15/5 చొప్పున పెరుగుతున్న కొద్దీ.. 20-30 ఏళ్లలో వీరిలో గుండె జబ్బులు, పక్షవాతం వంటివి వచ్చే ముప్పు రెట్టింపు అవుతున్నట్టు స్పష్టంగానే గుర్తించారు. కాబట్టి రక్తపోటు 120/80 ఉంటే నార్మల్‌గా ఉన్నట్టే చెప్పుకొంటాంగానీ వాస్తవానికి అంతకన్నా తక్కువగా.. 115/75 దగ్గరే ఉండేలా చూసుకోవటం ఉత్తమం. కాకపోతే దీన్ని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతోనే సాధించాలి. అంటే బీపీ నార్మల్‌గా ఉన్నాసరే జీవనశైలి మార్పులు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఇక నార్మల్‌ దాటుతున్న కొద్దీ జీవనశైలి మార్పులను కచ్చితంగా, తప్పనిసరిగా పాటించాలి.

* ప్రీహైపర్‌టెన్షన్‌ గలవారు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోతే.. కొన్నేళ్ల తర్వాత తప్పకుండా హైబీపీలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.

గుర్తించటం ముఖ్యం
మధ్యవయసు వాళ్లు ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు తప్పకుండా బీపీ పరీక్షించాలి. ఇలా చెయ్యకపోవటం వల్లనే చాలామందికి తెలియకుండా ఉండిపోతోంది, దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు ముంచుకొచ్చేస్తున్నాయి.

* ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఓ ఐదు నిమిషాలు కూచున్న తర్వాత ఒకసారి బీపీ చూడాలి. 5-10 నిమిషాల తేడాతో మరోసారి చూడాలి. నాలుగైదు రోజుల విరామం తర్వాత మరోసారి కూడా.. ఇలాగే మరో రెండు దఫాలు చూడాలి. ఈ నాలుగుసార్లలో సగటున బీపీ 140/90 కంటే ఎక్కువుంటే దాన్ని హైబీపీగా గుర్తించాలి.

* బీపీ ఉదయం లేవంగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవటం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో పరీక్షించుకోవటం ఉత్తమం.
* మధుమేహుల్లో, 60 ఏళ్ల పైబడిన వయసు వారిలో బీపీ అప్పుడప్పుడు నిలబడినప్పుడు కూడా చూడటం మంచిది.

మందులు: ఎవరికి అవసరం?
* ఎవరికైనా 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి.

* కొందరికి మాత్రం 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే.. అంటే 'ప్రీహైపర్‌టెన్షన్‌' దశలోనే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఎవరికంటే: మధుమేహం ఉన్నవారికి, ఇప్పటికే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు గలవారు అంటే.. మూత్రపిండాల్లో రక్తం శుద్ధి రేటు (గ్లోమరూలో ఫిల్టరేషన్‌ రేట్‌) నిమిషానికి 60 కన్నా తగ్గినవారికి.. రక్తపోటు ప్రీహైపర్‌టెన్షన్‌ దశలోనే మందులతో చికిత్స అవసరం. వీరు కేవలం జీవనశైలి మార్పుల మీదే ఆధారపడితే ఉపయోగం ఉండదు.

* 55-60 ఏళ్లు పైబడిన వారిలో పై అంకె (సిస్టాలిక్‌) పెరిగే అవకాశం ఉంది. దీన్నే 'ఐసోలేటెడ్‌ సిస్టాలిక్‌ హైపర్‌టెన్షన్‌' అంటారు. వీరిలో బృహద్ధమనిలో సాగే గుణం తగ్గి, గుండె నుంచి ఉబికివచ్చే రక్త పరిమాణానికి తగ్గట్టు అది సాగలేకపోతుంటుంది. దీంతో పైఅంకె పెరుగుతుంది. అలాగే వీరిలో కింది అంకె క్రమేపీ తగ్గే అవకాశమూ ఉంటుంది. ఇదీ వ్యాధిలో భాగమేనని గుర్తించాలి. వీరికి వైద్యం అవసరం.

* స్థూలంగా.. ఇతరత్రా దుష్ప్రభావాలేమీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నవారికి అది 140/90 మించితేనేగానీ మందులతో చికిత్స అవసరం ఉండదు. వీరు జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. కానీ మధుమేహం, కిడ్నీ జబ్బులు, గుండెపోటు ముప్పులున్న వారిలో 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు వాడి నియంత్రణలోకి తేవటం ముఖ్యం.

మందులేవైనా బీపీ తగ్గించటం ముఖ్యం!
హైబీపీ నియంత్రణ కోసం చాలా రకాల మందులున్నాయి. ఏ మందు వాడినా బీపీ నియంత్రణలోకి తేవటం ముఖ్యం. ప్రధానంగా ప్రయోజనం చేకూరేది బీపీ తగ్గించినందు వల్లనే! కాకపోతే కొన్నికొన్ని సందర్భాల్లో కొన్ని మందులు ప్రత్యేకంగా వాడితే అదనపు లాభాలుంటాయి. ఉదాహరణకు గుండెకు సంబంధించిన ముప్పులున్న హైబీపీ బాధితులకు 'బీటాబ్లాకర్స్‌', మధుమేహం ఉన్న హైబీపీ బాధితులకు 'ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌' 'ఏఆర్‌బీ'లు, 55-60 పైబడిన సిస్టాలిక్‌ బాధితులకు 'క్యాల్షియం ఛానల్‌ బ్లాకర్స్‌', ప్రోస్టేట్‌ సమస్యలున్న వారికి 'ఆల్ఫా బ్లాకర్స్‌'.. ఇలా వ్యక్తిని బట్టి మందును ఎంపిక చేస్తారు. ఒక మందుతో తగ్గకపోతే దాన్నే మరీ డోసు పెంచేకంటే మరో రకం మందును జోడించటమన్నది ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం.

* వీటిలో కొన్ని మందులను మొదలుపెట్టే ముందు వైద్యుల పర్యవేక్షణ అవసరం. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా ఒక్కసారే తగ్గించెయ్యటం కాకుండా.. క్రమేపీ తగ్గుకుంటూ వచ్చేలా చూడటం ముఖ్యం.

* సాధారణంగా ఉదయం లేవగానే బీపీ ఒక్కసారిగా పెరుగుతుంది. కాబట్టి బీపీ కోసం దీర్ఘకాలం మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన మేరకు నిద్ర లేవటానికి ముందు ఏ నాలుగైదు గంటలకో మెలకువ వస్తే అప్పుడు మందు వేసుకున్నా మంచిదే. దీంతో ఉదయం పూట బీపీ హఠాత్తుగా పెరగకుండా చూసుకునే వీలుంటుంది.

హైబీపీతో అధిక ముప్పు ఎవరెవరికి?--ప్రమాద సూచికలు:
1. బీపీ బాగా ఎక్కువగా ఉండటం.
2. బీపీ రెండు అంకెల మధ్యా వ్యత్యాసం అధికంగా ఉండటం (60 పైబడిన వారిలో).
3. పెద్దవయసు: మగవారిలో 55పైన, స్త్రీలలో 65 పైన ఉండటం.
4. పొగ తాగే అలవాటుండటం.
5. కొలెస్ట్రాల్‌: ఎల్‌డీఎల్‌ 115 కంటే ఎక్కువగా ఉండటం.
6. మధుమేహంగానీ, మధుమేహం ముందుదశగానీ ఉండటం.
7. కుటుంబంలో చిన్నవయసులో గుండెజబ్బుల చరిత్ర ఉండటం.
8. వూబకాయం: పొట్టదగ్గర కొవ్వు పేరుకోవటం.

అవయవాలు దెబ్బతింటున్నాయని చెప్పే సంకేతాలు
1. గుండెలో ఎడమ జఠరిక మందం కావటం (ఈసీజీ, ఎకో పరీక్షల్లో తెలుస్తుంది)
2. మెడలోని మెదడు రక్తనాళాలు మందం కావటం (డాప్లర్‌ పరీక్షలో గుర్తించొచ్చు)
3. కిడ్నీల వడపోత సామర్ధ్యం (జీఎఫ్‌ఆర్‌) 60 కంటే తక్కువ కావటం, మూత్రంలో స్వల్పంగా ఆల్బుమిన్‌ పోతుండటం.

అవయవాలు ఇప్పటికే దెబ్బతిన్న సూచనలు
1. పక్షవాతం వచ్చి ఉండటం (మెదడు)
2. గుండెపోటు, గుండె బలహీనం కావటం(గుండె, రక్తనాళాలు)
3. మూత్రపిండాల వ్యాధులు
4. కాళ్లలోని రక్తనాళాల్లో పూడికలు రావటం
5. కంటిలోని రక్తనాళాల్లో మార్పులు (రెటీనోపతి)

పైవాటిలో ఏది కనిపించినా హైబీపీ వల్ల ఆ వ్యక్తికి అత్యంత ప్రమాదం ఉందని గుర్తించాలి. వీటిలో ఎన్ని ఎక్కువ ముప్పులు ఉంటే ప్రమాద తీవ్రత అంతగా పెరుగుతుంది.వీటన్నింటినీ చూసి అప్పుడు హైబీపీని ఉద్ధృత చికిత్సతో తగ్గించాలా? కాస్త నెమ్మదిగా తగ్గించాలా? దానివల్ల ప్రమాదం ఎంత ఉందన్నది నిర్ధారిస్తారు.

బీపీ ఎంత వరకూ తగ్గించాలి?
ప్రస్తుత సూచనల ప్రకారం: ఇతరత్రా ముప్పులు లేని వారికి 140/90కి గానీ, అంతకంటే కొద్దిగా తక్కువకుగానీ తేవాలి. డయాస్టాలిక్‌ 80, 85కు తేగలిగితే మరీ మంచిది. అంతకంటే బీపీని మందులతో నియంత్రించటం వల్ల ప్రయోజనం ఉంటుందని ఇదమిత్థంగా తేలలేదు.

* 55-60 పైబడిన వారిలో సిస్టాలిక్‌ రక్తపోటు సుమారు 150 వరకూ తీసుకురాగలిగితే సరిపోతుంది. వీరిలో కింది అంకె 60, 65 కంటే తక్కువుంటే మందుల వాడకంలో కొంత జాగ్రత్త వహించాలి.

* మధుమేహం, కిడ్నీజబ్బులు, గతంలో గుండెపోటు వ్యాధుల బారిన పడినవారికి మాత్రం బీపీ 120/80కి గానీ, అంతకంటే తక్కువకుగానీ తేవాలి.

* మందులతో బీపీ మరీ తగ్గుతుంటే మందుల డోసు తగ్గించే అవకాశం ఉంటుంది.

* బీపీతో పాటు ఉదాహరణకు మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి ఇతరత్రా ముప్పులుంటే వాటిని కూడా కచ్చితంగా నియంత్రించుకోవటం తప్పనిసరి. మధుమేహంగానీ, హైబీపీగానీ ఉన్నప్పుడు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ పరిమితిని సాధారణ ఆరోగ్యవంతుల్లో కంటే కూడా తక్కువగా ఉంచాలి.

-- Dr.D.N.Kumar -Senior Cardiologist , Medical director , Care hospital , Nampally ,Hyderabad.
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, October 19, 2011

Milk teeth and protection, పాలపళ్ళు మరియు వాటి సంరక్షణ .


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పాల పళ్లు రక్షణ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాము . గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలి .



దంతాలు ఆరోగ్యంగా ఉండడాఇకి నిరోధక చర్యలు తీసుకోవడం చిగుళ్ళలో కాల్షియం చేరే సమయం నుంచే ఆరంభం కావాలి. పాల పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు గర్భంలో ఉన్నప్పుడే ఆరంభం అవుతుంది. శాశ్వతమైన పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు జన్మించిన క్షణం నుంచి మొదలవుతుంది. అందుచేత పుట్టబోయే శిశువు దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి గర్భిణీ దశలో ఎక్కువ మాంసకృత్తులు, కాల్షియం, భాస్వరం, విటమిన్‌లు సరఫరా అయ్యేట్టు చూడాలి. అప్పుడే గర్భంలోని శిశువుకు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన పోషక పదార్ధాలన్నీ సక్రమంగా లభించగలవు.

సాధారణంగా గర్భంలోని శిశువు తల్లి రక్తం నుంచి పోషక పదార్ధాలను గ్రహించే కాలంలోనే పాలపళ్ళు ఏర్పడుతాయి. తల్లికి పోషణ సరిగా జరగకపోతే, లేదా గర్భవతిగా ఉండగా ఆమెకు తీవ్రమైన సుస్తీ చేస్తే శిశువులో ఎనామిల్ లోపం ఏర్పడుతుంది. శరీరారోగ్యం సక్రమంగా లేకపోతే పళ్ళ నిర్మాణమూ దెబ్బతింటుంది. శిశువు ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే తల్లిపాలు ఇస్తూ ఉండడం చాలా అవసరం. తలి రొమ్ము చీకేటప్పుడు దౌడలకు లభించే వ్యాయామం దౌడలు సక్రమంగా రూపొందేందుకు తోడ్పడుతుంది. దౌడలు, పేలేట్ అడ్డంగా విస్తరించడానికి ఆ విధమైన వ్యాయామం చాలా అవసరం. ముఖ కవళికలు అందంగా రూపొందడానికి కూడా తల్లి రొమ్ము చీకడం తోడ్పడుతుంది. అంతే కాక ఊపిరితిత్తులు బలపడడానికీ దోహడపడుతుంది. శిశుప్రాయంలో వచ్చే చాలా జబ్బులను నిరోధించే రక్షక జీవ కణాలు తల్లి పాల ద్వారానే శిశువుకు లభిస్తాయి.

  • దంత రక్షణే దేహ రక్షణ పాలపళ్ళలో
పిల్లలకు సుమారు ఆరు నెలల వయసులో దంతాలు రావడం ప్రారంభమవుతాయి . అలా మెల్లగా దంతాలు రావడం ప్రారంభమై ఒకటిన్నర సంవత్సరం వయసొచ్చేసరికి మొత్తం ఇరవై పళ్ళు వస్తాయి. వీటిని 'పాలపళ్ళు' అంటారు. ఈ పాలపళ్ళు 6 నుండి 12 సంవత్సరాల వరకూ ఉంటాయి. ఆరేళ్ళ వయసులో ప్రారంభమైన పాలపళ్ళు పన్నెండు ఏండ్లు వచ్చేసరికి అన్నీ ఊడిపోతూ వాటి స్థానంలో శాశ్వత దంతాలు రావడం మొదలు పెడతాయి.
  • మొదటి రెండు పళ్ళూ సాధారణంగా శిశువుకి 6 నెలల ప్రాయంలో వస్తాయి.
  • 15 నెలల ప్రాయంలో పాల దంతాలూ,
  • ఆ తరువాత కోరపళ్ళూ కనిపిస్తాయి.
  • పాల పళ్ళు ఊడిపోవడం ఆరున్నర ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు వచ్చే లోగా ఆరంభం అవుతుంది.
  • శాశ్వతమైన పళ్ళు మొలిచే ప్రక్రియ 6వ ఏడు మొదలై 18వ ఏడు వచ్చేదాకా కొనసాగుతుంది.
  • చిన్నతనం నుంచే శిశువు పోషణ లరిగా జరగకపోతే మొట్టమొదట వచ్చే ఆ శాశ్వత దంతాలలోనే దంత క్షయం చోటు చేసుకుంటుంది. . 18వ ఏడు తరువాతనే విజ్ఞాన దంతాలు వస్తాయి. అప్పటికిగానీ 32 పళ్ళూ పూర్తిగా ఏర్పడడం జరగదు.

దంత వ్యాధులలో తరచుగా కనిపించేవి దంత క్షయ వ్యాధులూ, చిగుళ్ళ వ్యాధులు. వ్యాధి కలిగించే సూక్ష్మ క్రిములు చేరడంవలన దంత క్షయం వస్తుంది. చిగుళ్ళ వ్యాధుల వలన దంతాలకు ఆధారభూతాలైన భాగాలు దెబ్బతింటాయి. పళ్ళలో ఏర్పడిన పగుళ్ళలోనూ,గుంటలలోనూ, పళ్ళ సందుల్లోనూ లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరుతాయి. ఆ సూక్ష్మ క్రిములను ప్లేక్స్ అంటారు. ప్రధానంగా సూక్ష్మ క్రిములు, ఆ క్రిములు ఉత్పత్తి చేస్దే పదార్ధాలూ, పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాల అవశేషాలు, లాలాజలంలోని నత్రజనితో కూడిన జిగురు పదార్ధం కలసి ఈ ప్లేక్స్ ఏర్పడుతాయి. సూక్షం క్రిములు పళ్ళలో ఇరుక్కున్న పిండిపదార్ధాలలో ప్రవేశించి వాటిని కుళ్ళబెట్టి పళ్ళ మీద ఎనామిల్‌ను హరించడానికి తగినంత లాక్టిక్ యాసిడ్‌ను తయారుచేస్తాయి. జరిగిన ప్రయోగాలన్నిటి వల్లా డెంటల్ ప్లేక్‌ళే దంత క్షయ వ్యాధికి ప్రధాన హేతువని స్పష్టంగా నిరూపించబడింది.

దంత రక్షణే దేహ రక్షణఆహారంలో తీసుకునే పిండిపదార్ధాల తాలూకు పరిమాణం కాక, వాటి స్వభావమే ఈ వ్యాధిని కలిగించడంలో ప్రాముఖ్యం వహిస్తుంది. భోజనానికీ, భోజనానికీ మధ్య సూక్రోజ్ ఉన్న చూయింగ్ గం చప్పరించే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఒక్కటే ఉంటే చాలదు. మ్రింగే ముందు బాగా నమలవలసిన అవసరాన్ని కలిగించే పీచు పదార్ధం కూడా ఆహారంలో ఎక్కువగా ఉండాలి. పచ్చి కేరట్ దుంపలను నమిలే అలవాటు వల్ల దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.రోజూ రెండుసార్లు పళ్ళను విధిగా శుభ్రపరుచుకునే అలవాటు చేసుకోవాలి. అందుకు ఫ్లోరైడ్ కలసిన టూత్ పేస్ట్ వాడవచ్చు. పిల్లలకు రోజుకు కనీసం రెండు కప్పుల పాలు ఇవ్వాలి. పాల నుంచి వచ్చే పెరుగు, జున్ను కూడా మంచివే. 10 లక్షల భాగాలకు 2 భాగాల చొప్పున ఫ్లోరైడ్ చేర్చిన మంచి నీరు త్రాగడం దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. చిన్న పిల్లలను అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించడం మంచిది. పెద్దలూ జాగ్రత్త పడడం అవసరం. లేదంటే పిప్పిపళ్ళ రూపంలో దంత క్షయం జరిగి అది ప్రాణాంతకం కూడా కావచ్చును. పాల పళ్ళ వయసు నుంచి పండు వయసు వరకు అత్యంత జాగ్రత్తగా చూసుకోవలసిన దంతాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం తగదు.

  • దంత సంరక్షణకు కొన్ని సూత్రాలు :

* పళ్ళ మీద పాచి బాగా గారకట్టుకుపోవడం, చిగుళ్ళు వాచి ఎర్రబడడం, చిగుళ్ళ వెంబడి రక్తం కారటం మొదలైనవన్నీ చిగుళ్ళ రోగ లక్షణం. దంతాల మీద పాచి తీయించుకుంటుండాలి.
* తమలపాకులు నమలడం, నోటిలో పొగాకు పెట్టుకోవడం, పొగత్రాగడం మొదలైన వాటివల్ల చిగుళ్ళ రోగాలను తీవ్రతరం చేస్తాయి. అవి కాన్సర్‌కు కూడా దారితీస్తాయి.
* పచ్చికాయలు, పళ్ళు తింటే దంతాలకు ఆరోగ్యం.
* అప్పుడప్పుడు వేపపుల్లతో బ్రష్ చేసుకోవడం ఉత్తమం.
పళ్ళు వచ్చిన నాటినుంచే బ్రష్‌ చేయించడం మొదలు పెట్టడం వల్ల వారికి అలాగే అలవాటవుతుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండు మూడు నిముషాలు దంతాల పైనుంచి కిందకు, పైకి కదుపుతూ బ్రషింగ్‌ చేయించాలి. చిగుళ్ళు దెబ్బతినకుండా ఎలా బ్రష్‌ చేసుకోవాలో వారికి నేర్పాలి.

పిల్లలు సాధారణంగా పేస్ట్‌ను తినేస్తుంటారు. పేస్ట్‌ రుచి వారికి నచ్చడం వల్లే చాలామంది చిన్న పిల్లలు పేస్ట్‌ను తమ తల్లిదండ్రులకు తెలియకుండా బ్రష్‌ వేస్తున్నపðడు మింగేయడం సాధారణంగా మీరు గమనించే ఉంటారు. అందుకే పిల్లలు పేస్ట్‌ తినకుండా, బ్రష్‌ నమలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా పిల్లల బ్రష్‌ను ప్రతి రెండు నెలలకు ఓసారి మార్చాలి.

పిల్లలకు బ్రష్‌ బాగావేయించాలన్న తపనతో కొంతమంది తల్లిదండ్రులు అదే పనిగా వారిచే బ్రష్‌ వేయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పళ్ళల్లోని ఎనామిల్‌ అరిగిపోయే ప్రమాదముంది. అందుకే పిల్లలు కానీ, పెద్దలు కానీ మరీ ఎక్కువసేపు బ్రష్‌ వేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్‌ కోటింగ్‌ త్వరగా అరిగిపోతుందంటారు దంతవైద్యులు.

పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకొకసారి డెంటల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్ళి చెక చేయించడం చాలా మంచిది.

సాధారణంగా పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు , స్వీట్లు తింటుంటారు. వీటిని తిన్నాక పిల్లలు తమ తమ దంతాలను శుభ్రపర్చుకోకపోవడం వల్లే వాళ్ళ దంతాలు చిన్నవయసులోనే పుచ్చిపోతుంటాయి. అలా వాళ్ళ దంతాలు పుచ్చిపోకుండా తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిల్లలు చాక్లెట్లో, స్వీట్లో తింటే వెంటనే వారిని దంతాలను నీళ్ళతో కడిగి శుభ్రపర్చుకోమని ఆదేశించాలి. ఇలా చేయకుంటే పళ్ళు పుచ్చిపోతాయని వారికి వివరించి చెప్పాలి. ఆహారపదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు నోట్లో పోసుకుని ఉమ్మి పారేయడవెూ, బ్రష్‌ వేసుకోవ డవెూ తప్పనిసరిగా చేయాలని వాళ్ళకు చెప్పాలి.

పిల్లల దంతాలపై నల్లటి డాట్స్‌లాంటివేమైనా ఉన్నాయే వెూనని తల్లిదండ్రులు అపðడపðడూ గమనిస్తూండాలి. ఒక వేళ అలాంటి నల్లటి డాట్స్‌ ఏమైనా ఉంటే, వెంటనే వారిని దంతవైద్యశాలకు తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. ఇలా చేయకుంటే ఆ తర్వాత ఆ నల్లటి మచ్చ రంధ్రంగా మారడం, నొప్పి పుట్టడం, చిగుళ్ళు వాయడం, ఆఖ రుకు పన్నే తీసేయాల్సి రావచ్చు.

అలాగే పంటిపై గార పేరుకుపోతే గమనించి వెంటనే తీసే యించాలి. ఇలా తీసేయడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాదు. పళ్ళకు సంబంధించిన నొపðలకు సొంత వైద్యం చేయకుండా దంతవైద్యుని సంప్రదించి, వారి సలహాలను పాటించడం శ్రేయ స్కరం.
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, October 18, 2011

Our Nails and health ,మన గోళ్ళు మరియు ఆరోగ్యము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Our Nails and health ,మన గోళ్ళు మరియు ఆరోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గోరు లేదా నఖం (Nails) కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.మాతృగర్భంలో ఆకృతి దాల్చుకున్న పిండం 9వ వారంలోనే గోళ్లకు అంకురాలు పడతాయి. 15వ వారానికల్లా గోళ్ల పెరుగుదల ఆరంభమవుతుంది. ఇక అక్కడి నుంచీ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెరుగుదల పసిబిడ్డల్లో నెమ్మదిగా మొదలై వయసుతో పాటు క్రమేపీ వేగం పుంజుకుంటుంది. ఈ వేగం 20- 30 ఏల్లో అత్యధికంగా ఉంటుంది, 50ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా నెమ్మదిస్తుంది.

మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు.మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలం లో కన్నా ఎండాకాలం లో వేగంగా పెరుగుతాయి. అంతేకాదు మన రెండు చేతి గోళ్ళు ఒకేరకంగా పెరగవు. ఏ చేత్తో ఎక్కువ పని చేస్తామో, ఆచేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయి. అంటే మనం కుడి చేతి వాటం వాళ్ళమయితే కుడిచేతి గోళ్ళు ఎడంచేతి వాటం వాళ్ళయితే ఎడం చేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయన్నమాట.

ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించనప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఇలా చెప్తున్నారు.కాలి గోళ్ళ కన్నా చేతిగోళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి వాటికి సాపేక్షికంగా ఎక్కువ ఆక్సిజన్ లభించటం వల్ల వేగంగా పెరుగుతాయట.అదే్విధంగా చలికాలంలో మన శరీరంలో జరిగే వివిధ కార్యకలాపాలు అంతం చురుకుగా జరగకపోవటం వల్ల ఆరుతువులో గోళ్ళ పెరుగుదల వేగం మందగిస్తుంది.వేసవిలో దీనికి భిన్నంగా జరగటం వలన వేగం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మనం ఏచెత్తో ఎక్కువ పని చేస్తామో ఆ చేతి గోళ్ళు వేగంగా పెరగతానికి కూడా ఇదే కారణం అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా అందుబాటులో లేకపోవటం కూడ గోళ్ళు పెరుగుదల మందగించటానికి ఒక కారణం కావచ్చని ఊహిస్తున్నారు.ఏదేమైనా గోళ్ళ పెరుగుదలలో ఇలా తేడాలు రావటానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని ఉండవచ్చని వాటిని త్వరలోనే కనిపెట్టగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నరు.

గోళ్ళు కొరక కూడదు అంటారు. ఎందుకు?

సైంటిఫిక్ గా గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి (negative energy) బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన లోపలకి ప్రవేశిస్తుంది. అదేకాక మనం ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. ఇవ్వి లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా ఇవ్వి పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు.

గోళ్ళు ప్రాణం ఉన్నంత వరకూ పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరుగుదలలో మనిషికి మనిషికీ కొంత వ్యత్యాసం ఉంటుంది.చేతిగోళ్ళు రోజుకు సుమారు 0.1 మి.మీ. పెరుగుతాయి. కాలిగోళ్ళు ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే పెరుగు తాయి. పగటివేళ, వేసవికాలం, మగ వాళ్ళలో, గర్భవతులలో చేతివేళ్ళు, ముఖ్యంగా మధ్యలోని మూడువేళ్ళ గోళ్ళు వేగంగా పెరుగుతాయి. రాత్రుళ్ళు, ముసలితనం, శీతాకాలం, గోళ్ళ వేగం తగ్గుతుంది. జ్వరం, కొన్ని మందులు, థైరాయిడ్‌ సమస్యలు, పోషకాహార లోపం మొ|| పెరుగుదల తగ్గిస్తాయి.

గోళ్ళ ఫంక్షన్స్‌: వ్రేళ్ళకొనలను కాపాడటం, స్పర్శ కనుగొనటం, మనిషి అందం పెంచడం, దురద ఉన్నప్పుడు గోకడం.

జబ్బులు : పుట్టుకతోనే కొన్ని జబ్బులు గోళ్ళు కలిగిఉంటాయి. వంశపారం పర్యంగా కొన్ని గోళ్ళ జబ్బులు వస్తాయి గోళ్ళు లేకుండా జన్మించడాన్ని ''అనోనైభియా'' అంటారు. కొందరిలో ఒకే వేలికి రెండు, మూడుగోళ్ళు ఉంటాయి. కొందరిలో గోళ్లు వేలి చివర వరకు పెరగవు. కొందరిలో గోళ్లు కేవలం పలుచని పొరలాగా ఉండి, తరచూ ఊడిపోతూ ఉంటాయి. గోరుకు, వేలి కొనకు మధ్య ఉన్న భాగం ఆకృతి మారి ఉబ్బినట్లు ఉండటాన్ని ''క్లబ్బింగ్‌'' అంటారు. ఇది ఉన్నట్లయితే అంతర్గతం గా ఉన్న అనేక రుగ్మతలకు సూచిక. సోరియాసిస్‌, లైఖన్‌ప్లానస్‌ వంటి చర్మవ్యాధులు గోళ్ళకు సోకుతాయి.

అనేక ఫంగస్‌ వ్యాధులు గోళ్ళకి సోకి, గోళ్ళను నాశనం చేస్తాయి.

అనేక గీతలు, గుంటలు గోళ్ళపై కన్పిస్తాయి. సిఫిలిస్‌ అనే లైంగిక వ్యాధి కూడా గోళ్ళకి వ్యాపించవచ్చు.

కొన్ని బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ - గోళ్ళ రంగును మార్చుతాయి. కొన్ని మందులు కూడా గోళ్ళ రంగును మార్చి, అంద విహీనంగా చేస్తాయి.

గోళ్ళమీద ఉన్న తెల్లని అడ్డగీతలు గతంలోని రుగ్మతలకు సూచిక.

పులిపిరులు,హెర్పిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా గోళ్ళకు సోకుతాయి. కొన్ని జబ్బుల వలన రక్తపు చుక్కలు గోళ్ళ క్రింద ఉంటాయి.

కొందరిలో గోళ్లకింద అనారోగ్య కండరం పెరిగి ఇబ్బంది కలిగిస్తే, మరి కొందరిలో గోళ్ళకింద పూర్తి ఖాళీభాగం కలిగి ఉంటుంది. విటమిన్లలోపము వలన కూడా గోళ్ళ ఆకృతి మారుతుంది. రక్తహీనత వలన గోళ్ళుస్పూను ఆకారంలోకి మార తాయి. కొన్ని గుండెజబ్బులు, కిడ్నీల జబ్బులు కూడా గోళ్ళమీద గీతలు సృష్టి స్తాయి. కొందరిలో ముఖ్యంగా కాలిబొటన వేలి గోరు లోతుగా పెరిగి, తరచూ విపరీత నొప్పిని, వాపును కలిగి వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గోరు తీసి వేయటమే మార్గము. మానసిక ఆందోళన కల్గిన వాళ్లు ముఖ్యంగా పిల్లలు గోళ్ళను కొరుకుతూ అలవాటుగా మారిపోతుంది. కొందరిలో గోళ్ళు విపరీతంగా లావుగా పెరిగి కొమ్ములు లాగా ఉంటాయి.
గోరుచుట్టు (Whitlow) చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. ఎక్కువగా నీటితో, ఆహార పరిశ్రమలో పనిచేసేవారిలో, గోరు మూలల్లో మురికి పట్టియున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.

గ్రహణం సమయంలో వేలుతో చూపిస్తే గోరుచుట్టు వస్తుందని మూఢ నమ్మకం ఉంది.

గోళ్ళ జబ్బులకు చికిత్సలు: గోళ్ళకు వచ్చిన జబ్బుకు కారణం నిర్థారించి తగురీతిలో, చర్మవ్యాధుల నిపుణుల వద్ద చికిత్స పొందితే చాలా గోళ్ళు పునరాకృతిని పొంది అందంగా కనిపిస్తాయి.

గోళ్ళ జబ్బులకు పూతమందులే కాకుండా, మాత్రలు కూడా ఉంటాయి. అవసరమైతే గోళ్ళలోకే ఇంజక్షన్‌ చేసే విధానం కూడా అమలు పరుస్తారు. ఏ రకమైన ట్రీట్‌మెంట్‌ అయినా చేతిగోళ్ళకైతే కనీసం మూడు, నాలుగు మాసాలు వాడాలి. అదే కాలిగోళ్ళకైతే ఆరుమాసాలు వాడితేనే మంచిఫలితం ఉంటుంది.

గోళ్ళ అందం: గోళ్ళ అందం మెరుగు పరచే విధానాన్ని ''మానిక్యూర్‌'' అంటారు. ఈ విధానాన్ని తమకు తామే చేసుకో వచ్చు. కానీ విధానాన్ని చేసేందుకు 'ప్రొఫెషనల్స్‌' కూడా ఉన్నారు. ఈ విధా నాన్ని క్రమపద్ధతిలో అమలు చేసుకో వచ్చు.

1.పాత నెయిల్‌ పాలిష్‌ను,రిమూవర్‌ ద్వారా తొలగించాలి.

2. గోరును తగు విధమైన పొడవులో, ఆకృతిలో కట్‌చేసుకోవాలి.

3. క్యూటికల్‌ రిమూవర్‌ వాడి గోరుకు ప్రక్కనగల సన్నని చర్మపు పొర తొలగించాలి.

4. తర్వాత నెయిల్‌ఎనామిల్‌ గోరుమీద రాసుకుని ఆరబెట్టాలి.

5.చివరగా ఎక్రైలిక్‌ కవర్‌ కోట్‌ రాస్తే మానిక్యూర్‌ పద్ధతిని బలపరచినట్లు అవుతుంది.

మానిక్యూర్‌ వలన ఇబ్బందులు: మానిక్యూర్‌కు వాడే కెమికల్స్‌ వలన గోరుచుట్టూ కానీ, కనురెప్పలపై కానీ, ముఖం క్రింది భాగంలో కానీ అలర్జీ రియాక్షన్‌ రావచ్చు. అలా అలర్జీ వస్తే ఈ కెమికల్స్‌ వాడటం ఆపేయాలి.

గోళ్ళ విషయము లో తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. గోళ్ళు కొరుకుట చేయకూడదు.

2. గోళ్ళమీద ఏ చిన్న మార్పు గమనిం చినా వెంటనే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించి తొలిదశలోనే చికిత్స పొందాలి.

3. నెయిల్‌ పాలిష్‌ మొ|| కెమికల్స్‌ వలన అలర్జీ వస్తే తప్పకుండా తదుపరి అవి వాడటం ఆపివేయాలి.

4. గోళ్ళు ఎక్కువగా పెంచుకోకుండా, తరచూ కత్తిరించుకోవాలి.

5.గోళ్ళ క్రింద మలిన పదార్థాలు చేరి నిల్వలేకుండా శుభ్రపరచుకోవాలి.


అందమైన గోళ్ళు కోసం :
శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.

* గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని వదిలేయండి.

* సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి.

* గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సోప్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే హానికారక బ్యాక్టీరియా గోళ్లలో చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

* గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీళ్లలో కొంత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాసుకోవాలి.

* గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే. కానీ ఎల్పప్పుడూ గోళ్లను రంగులతో కప్పివేయకూడదు.

* వారానికి రెండు సార్లు మ్యానిక్యూర్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం.

* గోళ్లరంగును తొలగించడం కోసం అసిటోన్ కలసిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను వాడకండి. అసిటోన్ కలవని సాధారణ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడడమే మేలు.

మొత్తటి ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 చుక్కలు
వీట్‌జెర్మ్ ఆయిల్ - 2 చుక్కలు
వీటిని ఒక కప్పు నీటిలో కలిపి పది నిమిషాలపాటు వేలి గోళ్లను మునిగేలా ఉంచాలి. తర్వాత టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తక్కువ కాలంలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి

* విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.

* గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* హానికారకరమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్‌గ్లోవ్స్ ధరించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.




  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, October 17, 2011

మంచి కొలెస్ట్రాల్‌ ,హెచ్‌డీఎల్‌,good cholesterol,HDL


  • image : courtesy with Eenadu news paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మంచి కొలెస్ట్రాల్‌ ,హెచ్‌డీఎల్‌,good cholesterol,HDL- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అయితే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయులను పెంచుకోవటం ద్వారా ఈ ముప్పులను బాగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. రక్తంలో హెచ్‌డీఎల్‌ స్థాయి ఓ 5 ఎంజీ/డీఎల్‌ పెరిగినా గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఆసుపత్రి పాలు కావటమనేది 4% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మరోవైపు ఈ హెచ్‌డీఎల్‌- 6.5 ఎంజీ/డీఎల్‌ తగ్గితే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే ముప్పు 11% పెరుగుతోందని వెల్లడైంది. అంటే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుకోవటం అత్యుత్తమం, కనీసం అది తగ్గకుండా చూసుకోవటం అత్యవసరం. సాధారణంగా హెచ్‌డీఎల్‌ స్థాయి 40 ఎంజీ/డీఎల్‌ కన్నా ఎంత ఎక్కువుంటే అంత మంచిది. (ఈ విలువ ప్రయోగశాల, పరీక్షా విధానాలను బట్టి కాస్త అటూఇటూగా మారచ్చు) అయితే మధుమేహుల్లో చాలామందికి ఇది మామూలు స్థాయి కన్నా తక్కువగానే ఉంటోంది. హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నా వాటి సమర్థత ఏపాటిదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్‌ పెరగటానికి దోహదం చేస్తాయి. ఇవే జాగ్రత్తలు.. గుండె జబ్బులు దరిజేరకుండానూ చూస్తాయి. కాబట్టి హెచ్‌డీఎల్‌ స్థాయులను పెంచుకోవటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.

కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?

టోటల్ కొలెస్టిరాల్ :

* 200 మి.గా% వరకు -- మంచిది .
* 200 - 239 %--కొంతవరకు రిష్క్ ,
* 240 - కంటే ఎక్కువ % -- హై రిష్క్ ,

LDL :

* 100 లోపు -- మంచిది ,
* 100-129 --- ఉండవచ్చును ,
* 130-159---కొంతవరకు రిష్క్ ,
* 160-- అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,

HDL :

* 50 మి.గ్రా% -- మంచిది ,
* 50- 35 -------కొద్దిక రిష్క్ ,
* 35 -- తక్కువ - హై రిష్క్ .... ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .

  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

సెరిబ్రల్‌ పాల్సీ,Cerebral palsy



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెరిబ్రల్‌ పాల్సీ,Cerebral palsy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



పోలియోని దాదాపు జయించాం! బాల్యాన్ని కబళిస్తూ జీవితాలను కకా'వికలం' చేసే ఆ దురవస్థను చాలావరకూ తరిమికొట్టాం. కానీ ఇదే తీరులో నిండు జీవితాలను నిట్టనిలువునా నిర్వీర్యం చేస్తున్న మరో సమస్య 'సెరిబ్రల్‌ పాల్సీ' మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టటం లేదు. మనం గుర్తించటంలేదు గానీ ఇది పెద్ద సమస్య. చేతికి అందిరావాల్సిన బిడ్డలను వికలాంగులుగా మార్చివేసి.. భవిష్యత్తును అంధకారం చేస్తున్న సమస్య. పుడుతున్న ప్రతి వెయ్యి మంది పిల్లల్లో దాదాపు ఇద్దరు ముగ్గురు దీనితోనే కుంగిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది, రాష్ట్రంలో కనీసం 1.5 లక్షల మంది పిల్లలు ఈ నరకం అనుభవిస్తున్నారని అంచనా.

సెరిబ్రల్‌ పాల్సీని మనం పూర్తిగా నయం చేసి.. బిడ్డలను మిగతా పిల్లలందరిలా మార్చలేకపోవచ్చు. కానీ వైకల్యాన్ని చాలా వరకూ ఎదుర్కొనొచ్చు. బిడ్డ 'తన కాళ్ల మీద తాను నిలబడేలా' చెయ్యచ్చు. ముఖ్యంగా వీరు ప్రతి చిన్నదానికీ మరొకరి మీద ఆధారడాల్సిన దుర్భర స్థితి దాపురించకుండా చూడొచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఆ పనే చేస్తున్నాయి. దీనికి భారీ నిధులేం అక్కర్లేదు. బడా ఆసుపత్రులూ, హైటెక్‌ చికిత్సల అవసరమూ లేదు. కావాల్సిందల్లా ప్రభుత్వం వైపు నుంచి బలమైన నైతిక సంకల్పం. తల్లిదండ్రుల్లో అవగాహన, స్ఫూర్తి!

దుర్భరం : సెరిబ్రల్‌ పాల్సీ పిల్లల్లో కాళ్లు చేతులు సహకరించక పోవటం, వయసుకు తగిన పెరుగుదల లేకపోవటంతో వాళ్లు దైనందిన అవసరాల కోసం కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుంది. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఐదారేళ్ల వరకూ బాగానే చూడొచ్చుగానీ ఆ తర్వాత సమస్యలు మొదలవుతుంటాయి. బిడ్డ పెరిగి పెద్దవుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతుండటం, బరువు పెరుగుతుండటం వల్ల ఎత్తుకోవటం కష్టం కావటం.. ఇవన్నీ సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఫలితంగా బిడ్డ అన్ని రకాలుగానూ కుంగిపోతుంటే, మరోవైపు కుటుంబాలు అతలాకుతలమైపోతుంటాయి. పైగా ఈ సమస్య పేద కుటుంబాల్లో ఎక్కువ. ఆసుపత్రి ప్రసవాల్లో అయితే.. కాన్పు సమయంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనా వైద్యులు బిడ్డ గుండె కొట్టుకునే తీరు వంటివన్నీ జాగ్రత్తగా గమనిస్తూ బిడ్డకు నష్టం జరగకుండా చూస్తారు. అదే మంత్రసానులు కాన్పు చేస్తుంటే ఇది సాధ్యం కాదు. దీనివల్ల పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది. రెండోది- ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బిడ్డ తన పని తాను చేసుకునేలా చూడటం అత్యవసరం. కొన్ని తేలికపాటి చికిత్సలతో ఈ బిడ్డల పరిస్థితి మెరుగై.. ఎంతోకొంత స్వతంత్రంగా జీవించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల మీద పెట్టే ఖర్చుకు.. దీర్ఘకాలంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతిఫలం గొప్పగా ఉంటుంది.

* తెలివితేటలు - సెరిబ్రల్‌పాల్సీ బాధితుల్లో శారీరక కదలికలు కష్టం తప్పించి చాలామందిలో తెలివితేటలు బాగానే ఉంటాయి. చూడటానికి కొందరు మానసిక ఎదుగుదల లేనివారిలా కనిపించవచ్చు. ముఖంలోని కండరాల మధ్య సమన్వయం దెబ్బతినటం వల్ల వీళ్ల ముఖ కవళికలూ కొంత భిన్నంగా ఉండొచ్చుగానీ సాధారణంగా వీరిలో చాలామందికి మానసిక సమస్యలు తక్కువనే చెప్పాలి.
సురక్షిత కాన్పు సదుపాయాలు, ఆసుపత్రి ప్రసవాలు లేక .....పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది.

* ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.
* వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది.
పింఛను కోసం చూసుకోవద్దు!
సెరిబ్రల్‌ పాల్సీకి చికిత్స చేయిస్తే.. వికలాంగుల పింఛను వంటి సదుపాయాలు ఇవ్వరేమోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు సర్జరీల వంటివాటికి ముందుకు రావటం లేదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవటం అవసరమే. అయితే అక్కడితోనే చేతులు దులిపేసుకోకుండా చికిత్స చేయించటం మీద కూడా దృష్టిపెడితే.. బిడ్డ ఏదో రోజు పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత తన కాళ్ల మీద నిలబడటం, తన పని తాను చేసుకోగలగటం వంటివి సాధ్యమవుతాయి. వ్యక్తిగా ఆత్మాభిమానం, గౌరవం పెరుగుతాయి. ఎంతైనా తల్లిదండ్రులు ఒక వయసు దాటిన తర్వాత సేవలు చేయలేరు, వాళ్లూ వృద్ధులవుతుంటారు. కాబట్టి ఏదో పింఛను రూపంలో తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు రూకల కోసం చూసుకుని.. బిడ్డలకు చికిత్స చేయించకపోవటం, చేయించినా చికిత్సలతో పెద్దగా ప్రయోజనం ఉండదని నిరాశలో కూరుకుపోవటం సరికాదు. అందరూ ప్రధానంగా తెలుసుకోవాల్సింది- సెరిబ్రల్‌ పాల్సీ వంటి సమస్యలను మనం పూర్తిగా నయం చెయ్యలేకపోవచ్చుగానీ.. బిడ్డ తన జీవితం తాను జీవించేలా చేసే అవకాశాలున్నాయి. బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఈ అవకాశాలను ఉపయోగించుకోవటం ముఖ్యం.ఈ సమస్య కారణంగా ఎన్నో పేద కుటుంబాలు ఘోరంగా కుంగిపోతున్నాయి. వీరికి చేసే చికిత్సలు, సర్జరీలు కూడా ఖరీదైనవేం కాదు. చాలా తేలికగా, ఎటువంటి ప్రభుత్వాసుపత్రిలోనైనా చెయ్యటానికి వీలైనవే. మనకు కావాల్సిందల్లా వీరి జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పం!

పోలియో.. సెరిబ్రల్‌ పాల్సీ: తేడాలేంటి?
* పోలియో వైరస్‌ కారణంగా వచ్చే వ్యాధి. సెరిబ్రల్‌ పాల్సీ అన్నది మెదడులో కీలక కేంద్రాలు దెబ్బతినటం వల్ల వచ్చే సమస్య.

* పోలియోలో మెదడు బాగానే ఉంటుంది, వెన్ను దగ్గర నాడులు దెబ్బతిని, తత్ఫలితంగా కండరాలు కాళ్లు చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కీలక మెదడు భాగాలు దెబ్బతింటాయి, వెన్ను దగ్గర సమస్యేం ఉండదు.

* పోలియోలో సాధారణంగా కాళ్లకు శక్తి ఉండదు, అవి చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కాళ్లు చచ్చుబడిపోవటమన్నది ఉండదు, పైగా కాళ్ల కండరాలు అతిగా స్పందిస్తూ బలంగా బిగుసుకుపోతుంటాయి.

* పోలియో మనలాంటి బడుగు దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. సెరిబ్రల్‌ పాల్సీ పాశ్చాత్య దేశాల్లోనూ ఎక్కువే. కాకపోతే మనదేశంలో జనాభా సంఖ్య, శిశుజననాల సంఖ్య ఎక్కువ కాబట్టి మన దగ్గర బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.

* పోలియో, సెరిబ్రల్‌పాల్సీ.. వీటివల్ల జరిగే నష్టమేదో చిన్నతనంలోనే జరిగిపోతుంది. వ్యాధి క్రమేపీ ముదరుతూ పోవటమన్నది ఉండదు. కాకపోతే అప్పటికే జరిగిన నష్టం తాలూకూ దుష్ప్రభావాలు వైకల్యం రూపంలో జీవితాంతం వేధిస్తాయి, బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆ లోపాలు మరింతగా పెరుగుతుంటాయి. కాబట్టి వాటిని సరిచేయటం కోసం, ఆ నష్టాన్ని సాధ్యమైనంత వరకూ పూడ్చటం కోసం చికిత్స తప్పనిసరి.



చచ్చుబడిపోయిన కాళ్లు చూస్తూనే మనకు 'పోలియో' గుర్తుకొస్తుంది. టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతంగా అమలు చేయటం ద్వారా ఇప్పుడు దాన్ని మనం చాలా వరకూ అధిగమించగలిగాం. కానీ దాదాపు ఇదే తీరులో పిల్లలను వైకల్యం పాలు చేసే 'సెరిబ్రల్‌ పాల్సీ' మాత్రం ఇప్పటికీ మనకు పెద్ద సవాల్‌గానే నిలుస్తోంది. పోలియో అనేది వైరస్‌ ద్వారా వ్యాపించే వ్యాధి. కానీ 'సెరిబ్రల్‌ పాల్సీ' అంటువ్యాధి కాదు. ఇదేమీ వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కారణంగా వచ్చేదీ కాదు. ప్రధానంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడో.. కాన్పు సమయంలోనో.. పుట్టిన తర్వాతో.. బిడ్డ మెదడులోని కీలక కేంద్రాలు.. అందులోనూ కండరాల కదలికలను నియంత్రించే మెదడు భాగాలు దెబ్బతినటం దీనికి మూలం. ఫలితంగా కాళ్లు వంకర్లు తిరిగిపోయి.. చేతులు, వేళ్లు స్వాధీనంలో లేక.. కదలికలు కష్టమై ఎంతోమంది పిల్లలు అంగవైకల్యానికి గురవుతున్నారు. ఒకసారి మెదడు కణాలు దెబ్బతింటే తిరిగి అవి కోలుకోవటం కష్టం. అందుకే ఈ వ్యాధిని మనం పూర్తిగా నయం చెయ్యలేంగానీ.. మెదడులో జరిగిన నష్టం కారణంగా కండరాల్లో తలెత్తే సమస్యలను మాత్రం రకరకాల చికిత్సల ద్వారా చక్కదిద్దే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి 'సెరిబ్రల్‌ పాల్సీ' అనగానే ఇక మనమేం చెయ్యలేమని వదిలేయకుండా.. పసివయసులోనే సమస్యల్ని గుర్తించి వీలైనంత మేర సరిచేయటం అవసరం.

సెరిబ్రల్‌ పాల్సీ: ఏమిటీ సమస్య?
చిన్న ఉదాహరణ చూద్దాం. టేబుల్‌ మీద ఉన్న పెన్నును పైకి తీసుకోవాలనుకున్నాం. అదెలా సాధ్యం? ముందు చేతి, వేళ్ల కండరాలు సమన్వయంతో కదులుతూ... మన వేళ్లు కాస్త వదులుగా పెన్ను వరకూ వెళ్లాలి. అవి కచ్చితంగా పెన్నును పట్టుకోవాలి. వెంటనే బిగువుగా మారి, ఆ పెన్నును పైకి లేపాలి, వెనక్కిరావాలి. ఇలా ప్రతి కదలికా.. ప్రతి పనీ.. కండరాల సమన్వయంతో సున్నితంగా జరగాల్సిందే. లేకపోతే శారీరక కదలికలు అసంభవం. ఇందుకోసం మెదడులోని కీలక కేంద్రాలు.. ఎప్పుడు బిగువుగా మారాలి, ఎప్పుడు వదులవ్వాలి.. ఎలా కదలాలన్నది నిరంతరం ఆయా కండరాలకు ఆదేశాలు పంపిస్తూనే ఉంటాయి. కానీ సెరిబ్రల్‌ పాల్సీ బాధితుల్లో... ఇలా కండరాలను నియంత్రించాల్సిన మెదడు భాగాలు దెబ్బతింటాయి. ఫలితంగా కండరాల కదలికలన్నీ అసహజంగా, అస్తవ్యస్తంగా తయారవుతాయి. క్రమేపీ కండరాలు బిగుసుకుపోవటం.. మోకాళ్లు ముడుచుకుపోతుండటం, కాళ్లు కత్తెరలా వంకరైపోతుండటం, పాదాలు తిరిగిపోతుండటం, చేతుల వేళ్లు ముడుచుకుపోతుండటం.. ఇలా ఎన్నో వైకల్య లక్షణాలు మొదలవుతాయి.

చెప్పలేని కారణాలు అనేకం
మన మెదడు ఎదుగుదల తల్లిగర్భంలోనే ఆరంభమై.. పుట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్ల వరకూ కూడా కొనసాగుతుంది. ఇలా గర్భంలో పెరుగుతున్నప్పుడుగానీ, కాన్పు సమయంలో గానీ, చిన్న వయసులోగానీ పసి మెదడు దెబ్బతింటే పరిస్థితి 'సెరిబ్రల్‌ పాల్సీ'కి దారి తియ్యచ్చు. గర్భిణికి రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు రావటం, హైబీపీ, పోషకాహార లోపం, తల్లీబిడ్డల రక్తం గ్రూపులు సరిపడకపోవటం వంటివి గర్భంలోనే పిండం మెదడును దెబ్బతియ్యచ్చు. ఇక కాన్పు కష్టమై, బిడ్డ మధ్యలోనే ఎక్కువసేపు ఉండిపోయినా, ఆ సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చు. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే మెదడు నిర్మాణంలో లోపాలు తలెత్తచ్చు. ఇక పసివయసులో మెదడు, మెదడు పొరల వాపు (ఎన్‌సెఫలైటిస్‌, మినింజైటిస్‌), తలకు దెబ్బలు తగలటం వంటివీ మెదడును దెబ్బతియ్యచ్చు. బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు సెరిబ్రల్‌ పాల్సీ ముప్పు 20 రెట్లు ఎక్కువ. కవలల్లోనూ ఎక్కువగా కనిపించొచ్చు. ఇలా మెదడుకు ఏ రూపంలో నష్టం జరిగినా సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చుగానీ వీటిలో దేనివల్ల వచ్చిందన్నది కచ్చితంగా నిర్ధారించటం మాత్రం కష్టం.

గుర్తించేదెలా?
సమస్య తీవ్రంగా ఉండి, బిడ్డ కదలికలు మరీ అసహజంగా ఉంటే తల్లిదండ్రులు 3 నెలల్లోపే తేడా గుర్తిస్తారు. మెదడుకు జరిగిన నష్టం మధ్యస్తంగా ఉంటే మాత్రం- రెండు మూడేళ్ల వరకూ వ్యాధి అంతగా బయటపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు చూడటానికి బాగానే ఉంటారుగానీ మెడ నిలబెట్టటం, పాకటం, కూచోవటం, నిలబడటం, నడవటం వంటివి ఆలస్యం అవుతుంటాయి. దాన్నిబట్టి తల్లిదండ్రులు అనుమానించే అవకాశం ఉంటుంది. పుట్టగానే బిడ్డ ఏడ్వకపోవటం కీలక సమస్యలకు సంకేతం. కొందరు పిల్లల్లో పాలుతాగటం, మింగటం, మాటల వంటివీ కష్టంగా ఉండొచ్చు. మెదడులోని ఏ భాగం దెబ్బతిందన్న దాన్నిబట్టి- కండరాలు బలంగా ముడుచుకుపోతుండటం నుంచి ఉన్నట్టుండి జర్క్‌లు వచ్చినట్టు అసహజమైన కదలికల వరకూ సెరిబ్రల్‌ పాల్సీలో చాలా రకాలున్నాయి.

చికిత్స: స్వతంత్రులను చేయటమే లక్ష్యం!
మనం సెరిబ్రల్‌పాల్సీ వ్యాధిని పూర్తిగా నయం చేసి.. వారిని చక్కటి ఆరోగ్యవంతులుగా మార్చలేకపోవచ్చు. కానీ సమస్యను గుర్తించి.. చిన్నతనం నుంచీ చిన్నచిన్న సంరక్షణ చర్యలు ఆరంభిస్తే ఈ పిల్లలను చాలా వరకూ స్వతంత్రులను చేసే అవకాశం ఉంటుంది. కనీసం పూర్తి అంగ వైకల్యంలోకి జారిపోకుండానైనా చూడొచ్చు. వైద్యులు బిడ్డ పరిస్థితిని పరిశీలించి.. బిడ్డ సాధ్యమైనంత చక్కగా ఎదిగేందుకు సహాయపడతారు. పూర్తిగా మంచానికి అతుక్కున్న బిడ్డను కొంత లేచి కూర్చునేలా చూడటం.. నడవ లేకపోతున్న బిడ్డను క్యాలిపర్స్‌ వంటివాటి సహాయంతోనైనా.. కుంటుకుంటూ అయినా నడిచేలా చూడటం.. ఇలా ప్రతి దశలోనూ పరిస్థితి మెరుగయ్యేలా చూడటం సాధ్యమే. దీనిలో- ఫిజియోథెరపీ, సర్జరీ రెండింటికీ ప్రాధాన్యం ఉంది.

* ఫిజియోథెరపీ: సెరిబ్రల్‌ పాల్సీ వల్ల బిగుసుకుపోతున్న కండరాలను దారిలోకి తేవటం, కదలికలను మెరుగుపరచటం వంటివాటికి ఫిజియోథెరపీలో ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. వీటిని తల్లిదండ్రులు నేర్చుకుని నిత్యం బిడ్డతో చేయించటం ద్వారా దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కొందరికి కండరాల సమస్యలు తీవ్రంగా ఉంటే ఆపరేషన్‌తో సరిచేసి.. ఆ తర్వాత మళ్లీ ఫిజియోథెరపీ చెయ్యాల్సి ఉంటుంది.

* సర్జరీ: బిగుసుకుపోతున్న కండరాలు, టెండన్లను వదులు చేయటం, మరీ బలంగా ముడుచుకుంటున్న వాటిని కాస్త సాగదీసి, సమన్వయ పరచటం, వంకర్లు సరిచెయ్యటం వంటివన్నీ సర్జరీలో కీలకాంశాలు. మోకాళ్లు వంగిపోతుంటే ముడుచుకుంటున్న టెండన్లను 'జడ్‌ప్లాస్టీ' వంటి విధానాల ద్వారా సాగదీసి, సాఫీగా నిలబడి.. క్రమేపీ నడిచేలా చెయ్యచ్చు. కొన్నిసార్లు వీటికి 'బొటాక్స్‌' ఇంజక్షన్ల వంటివీ ఉపయోగపడతాయి.

* కొందరిలో బొటనవేలు ముడుచుకుపోతూ ఏ పని చెయ్యాలన్నా అరిచేతిలో పెద్ద అడ్డుగా తయారవుతుంది. కండరాన్ని సరిచేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

* కొందరికి కాళ్లు రెండూ దగ్గరగా బిగుసుకుపోయి.. ఏం చేసినా వెడంగా, దూరంగా వెళ్లవు. గజ్జల దగ్గరి కండరాలను వదులు చేయటం, కట్‌ చేయటం వంటి సర్జరీలతో కొంత సరిచెయ్యచ్చు. గూని వంటివి ఉన్నా సర్జరీలో సరిచేయచ్చు.

* కొన్నిసార్లు కాళ్లు సాఫీగా సాగటానికి- ఒకవైపు కండరం సరిగా పనిచేయకుండా రెండోది బాగుంటే.. ఒకవైపు కండరాన్నీ, టెండన్లనూ ఇంకోవైపునకు మార్చటం కూడా సర్జరీల్లో ముఖ్యమైన భాగం.

* కండర బిగుతుదనానికి కారణమవుతున్న నాడులను కట్‌ చేయటం గురించి తరచూ మాట్లాడుతుంటారుగానీ అది చాలాచాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకూ నాడులనుకట్‌ చేయకుండా కండరాలను సరి చేయటమే ఉత్తమ విధానంగా నిలుస్తుంది.

* అతిగా పనిచేస్తున్న కండరాలను గాడిలో పెట్టటానికి 'యాంకిల్‌ ఫ్లోర్‌ ఆర్థ్రోసిస్‌ (ఏఎఫ్‌ఓ)' రకం క్యాలిపర్స్‌ వంటివి ఇస్తారు.

* సర్జరీ తర్వాత నడకలో తర్ఫీదు ఇస్తారు. ముందు అటూఇటూ కర్రదండాలు పట్టుకుని నడవటం, తర్వాత స్ట్రెచర్‌తో నడవటం, తర్వాత వదిలేసి నడవటం.. ఇలా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నతనంలో సరిచేయకపోతే క్రమేపీ ఎముకలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

* మొత్తమ్మీద ఫిజియోథెరపీ చేయించటం, కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటే సర్జరీతో సరిచేయటం, క్యాలిపర్స్‌తో నడిచేలా తర్ఫీదునివ్వటం.. ఇవి చికిత్సలో కీలకాంశాలు. వీటికి పెద్ద ఖర్చేం కాదు. కష్టమేం లేదు. కాకపోతే చికిత్సా విధానాలు ఉన్నాయని.. పరిస్థితిని పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత సరిచేయవచ్చని అందరూ అవగాహన పెంచుకోవటం ముఖ్యం.

* పునర్వికాసం: చికిత్సల తర్వాత వీరు స్కూలుకు వెళ్లి చదువుకునేలా చూడటం, ఏ రకం పని బాగా చేయగలుగుతారో గుర్తించి దానికి సంబంధించిన వృత్తుల్లో కుదురుకునేలా చూడటం కూడా అవసరం.

డా|| కె.కృష్ణయ్య--ఆర్థోపెడిక్‌ సర్జన్‌--మెడిసిటీ హాస్పిటల్‌--హైదరాబాద్‌(ఈనాడు సుఖీభవ).
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, October 14, 2011

బొటాక్స్ థెరపీ , Botox therapy


  • image -- courtesy with Wikipedia.org

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బొటాక్స్ థెరపీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వయసు కనిపించకుండా అందంగా ఉండాలనే కోరికతో ఎన్నోచికిత్సలకు ఆకర్షితులు అవుతున్నారు. ఆ చికిత్సలలో ఒకటి బొటిక్స్ థెరపీ. చూసే కళ్లను బట్టి అందం ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేసి ఓ రేషియో ను శాస్త్రవేత్తలు రూపొందించారు. విశ్వవ్యాప్తంగా పర్ఫెక్ట్ ఫేస్ కు ఉండే రేషియో ఇదేనని అందరూ అంగీకరించారు. ఈ రేషియోను పెదాల నుంచి ముక్కు వెడల్పు వరకు లెక్కిస్తారు. బొటాక్ష్ (Botox) అనేది బొటిలినమ్‌ టాక్షిన్‌ ఎ (Botilinum Toxin A) కి ట్రేడ్ నేమ్‌ . 1990 లో ఎఫ్.డి.ఎ. ద్వారా కంటి కండరాల బిగువును (eye muscle spasm) తగ్గించడానికి వినియోగములోనికి వచ్చినది . తక్కువ మోతాదులో ముఖము కండాలలో ఇంజక్ట్ చేయడము వలన ఆయా కండరాలు రిలాక్ష్ అయ్యి ముఖము లోని ముడతలు , గుంటలు , లైన్స్ /గ్రూవ్స్ సరిచేయబడి అందముగా యవ్వనములో ఉన్నట్లు కనిపించును . ఈ విధానము అనుభవము ఉన్న కాజ్మెటిక్స్ స్పెసలిస్ట్స్ చే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సుమారు 7 -8 నెలలు దీని ప్రభావము ఉంటుంది . మళ్ళీ కావాలనుకుంటే ఎన్ని సార్లైనా తీసుకోవచ్చును .

బొటాక్ష్ వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి .
  • మైగ్రైన్‌ తలనొప్పులకు పనిచేయును. నొప్పి తగ్గించుటలో సహకరించును,
  • ముఖము పై ఎక్కు వగా చెమట పట్టకుండా నివారించుటలో సహకరించును .
  • దీర్ఘ్కాలిక దవడ నొప్పి , నడుమ నొఫ్ఫి చికిత్సలో మంచి ఫలితాలు ఉన్న్నాయి .
  • కండరాల వణుకు (muscle twitchings) తగ్గించుటలో ఉపయోగపడును .
ఎవరు అర్హులు :
మంచి ఆరోగ్యము ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చును .
గర్భిణి స్త్రీలు , బాలింతరాళ్లు తీసుకోకూడదు ,
నరాల జబ్బులు ఉన్న వారూ తీసుకోకూడదు (Neuro muscular disorders).

బొటాక్ష్ ఇంజక్షన్‌ చేసే విధానము :
ఈ ఇంజక్షన్‌ చాలా సులువుగా చాలా సన్నని సూది ఉన్న సిరంజ్ తో ఇస్తారు . ఏయే కండరాలకు అవసరమో అంతవరకే తక్కువ మోతాదులో ఇస్తారు . ఇది తీసుకోవాలనుకునే వారు సుమారు 10 రోజులు ముందుగా ఏవిధమైన విటమిన్లు, విటమిన్‌ ఇ(vit.E) , నొప్పినివారణ మందులు (anti inflamatary drugs) వాడకూదదు .


  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, October 12, 2011

నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌),Oral Cancer


  • soruce : Andhraprabha News paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌),Oral Cancer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

శరీరంలో వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో మూడింటొక వంతు నోటి క్యాన్సర్‌ (ఓరల్‌ క్యాన్సర్‌) వస్తుంది. నోటిలో వచ్చే క్యాన్సరు వ్యాధి 50% వరకు 'నాలుక' 'పెదవుల'లో వస్తుంది. మిగతా శాతం నోటిలోపలి బుగ్గ లు (బక్కల్‌ మ్యూకోజా) మృదు అంగుటి భాగం (సాఫ్ట్‌పేలెట్‌) టాన్సిల్స్‌, నాలుక, క్రిం దనోటి భాగం, చిగుళ్ళు (గమ్స్‌) మొదలలైన నోటి భాగాలలో వస్తుంది.

కాలుతున్న చుట్ట భాగాన్ని (అడ్డచుట్ట) నోటిలో పెట్టుకొని పొగ త్రాగేవారిలోను, సిఫిలిస్‌ వ్యాధి గ్రస్తుల్లోను, అంగుటి భాగా నికి క్యాన్సరు వస్తుంది. అదే పనిగా కిళ్ళీలు జర్ధాకిళ్ళీలు బుగ్గన నిల్వ ఉంచుకొని ఉండే వారిలో బుగ్గ క్యాన్సరు వస్తుంది. పాన్‌ పరాగ్‌, పాన్‌మసాలా, గుట్కావంటి పొగాకు సంంబంధమయిన పొడులు చప్పరించే వారిలో చిగుళ్ళ క్యాన్సరు, గొంతుక్యాన్సరు, బుగ్గ క్యాన్సరు వచ్చే అవకాశం ఉంది. వీటి వాడకం వల్ల శరీరంలో యితరభాగాలు కూడా క్యాన్సరు వ్యాధికి గురికావచ్చు.

దవుడలోని పళ్ళు విరిగిపోయినా, అరిగి పోయినా అవి తరచుగా బుగ్గకు, నాలుకకు, పెదవులకు గుచ్చుకొని పుండుగా మారి ఆ పైన క్యాన్సరు వ్యాధిగా మారవచ్చు.

పళ్ళు లేనివారు ఉపయోగించే కట్టుడు పళ్ళు సరిగా కుదరక నోటిలోని సున్నిత భా గాల పై వత్తిడి తెచ్చే పరోస్థితిలోను, వంకర పళ్ళు సరిచేసే విషయంలో నోటిలోని సున్ని త భాగాలు పుండ్లుగా మారి ఆ తర్వాత క్యాన్సరుగా మారే అవకాశం ఉంది.

నోటిలో వచ్చే 'సబ్‌- మ్యూకస్‌ఫైబ్రోసిస్‌', 'ల్యూకోప్లేకియా', 'లైకన్‌ ప్లాసస్‌', 'సిలిఫిలిస్‌' పంటి వ్యాధులను నిర్ల క్ష్యం చేసినా అవి క్యాన్సరుగా మారు తాయి.

త్వరగా తగ్గని నోటిలోని పుండ్లు, విపరీత మయిన నొప్పి, వాచిన లింపు గ్రంధులు, లాలాజలం అధికంగా ఊరడం, నోటి దుర్వాసన, నోరు తెరవలేని పరిస్థితిలో మూసుకు పోవడం వంటి లక్షణాల ద్వా రా క్యా న్సరు వ్యాధిని గుర్తించ వచ్చు.

వ్యాధి నిర్ధారణ ఆలస్యంగా జరగడం - వ్యాధి నిర్ధారణ లోపం వల్ల క్యాన్సరు వ్యాధి మురిదిపోతుంది. కనీసం ఆరు నెలల కొకసారి దంత వైద్య పరీ క్షలు చేయించుకొంటే యిలాంటి వాటిని యిట్టే పసిగట్టవచ్చు.

నోట్లో క్యాన్సర్‌

ఆయా వ్యక్తుల హౌదాలను బట్టి, సమా జంలో కొందరు సిగరెట్లు త్రాగితే, మరి కొందరు బీడీలు చుట్టలు త్రాగుతు న్నారు. వీటిల్లో ఏది త్రాగినా జరిగే నష్టం అతి ప్రమాదమయిందే.

పొగ పీల్చడంవల్ల, సిగరెట్లలో వాడే పొగాకులో వుండే 'నికోటిన్‌ పదార్థం' సరాసరి ఊపిరితిత్తులలోనికి పోయి, క్షయ వ్యాధిని కలుగజేస్తుంది. విపరీతంగా దగ్గడం, ఉమ్మ డం, బరువును కోల్పోవడం, బక్కచిక్కి పోవడం, జ్వర పీడితులు కావడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఇలాంటివారి వల్ల యింట్లో వారికే కాక వీరి ఉమ్మి తుంపరలు తాకిన ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమి స్తుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో- నది, సముద్ర తీరాలలో నివసించే ప్రజలు, శ్రామికులు చుట్టలు కాలుస్తారు. నిప్పు ఉన్న భాగాన్ని నోట్లో పెట్టుకొని 'గుప్పు'తారు ఈ అలవాటు వల్ల చుట్ట యొక్క నిప్పు వేడికి నోట్లోని సున్ని తమైన అంగుటి భాగం కమిలి పుండుగా మారి ఆ తర్వాత 'క్యాన్సర్‌'గా మారుతుంది. ప్రపంచ దేశాలలో 'చుట్టక్యాన్సర్‌'గా దీనికి పేరుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విధంగా ఆయా దేశాలలో అందరి నోళ్ళలోను నాను తున్నది. పొగత్రాగడం వల్ల వచ్చే నోటి క్యా న్సర్‌ వ్యాధి మన దేశంలో అధికంగా ఉంది. అలవాట్లలో ఏమాత్రం మార్పు రానుందున రాను-రాను యి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కేవలం 'పొగాకు' వల్ల వచ్చే జబ్బులతోనే దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా, మన దేశంలోని క్యాన్సర్‌ పీడితుల్లో మూడింట ఒక వంతు మంది నోటి క్యాన్స ర్‌తో బాధపడ్తున్నావారే!

అయితే, ఈ మధ్య పొగత్రాగడానికి ప్రత్యా మ్నాయంగా, నమలడానికి, ముక్కుతో పీల్చ డానికి అనువుగా ఎన్నో రకాల పొగాకు ఉత్పత్తులు విపణిలో లభ్యమవుతున్నాయి. 'స్మోకలెస్‌(smokeless) టొబాకొ'గా వీటికిపేరుంది. అంటే పొగతో పనిలేని తంబాకు అన్న మాట! దీనికి కూడా అన్ని రకాల ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అయితే పొగాకు పీల్చడం కంటే, నమలడం వల్ల మరెన్నో అనర్ధాలు ఉన్నట్లు పరిశోధకుల అంచనా, పొగాకును నమలడం ద్వారాను, ముక్కుపొడి రూపంలో పీల్చడం ద్వారాను, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కో మనిషికి సంవత్సరానికి 1.8 కిలోల పొగాకు ఖర్చవుతున్నట్లు తేలింది.

'స్మోకలెస్‌ టుబాకొ' లో 'బెంజో'పైరిన్‌', పోటోనియం-210, కొన్ని రకాల 'నైట్రోజమైన్‌' అనే క్యాన్సర్‌ను కలిగించే రసాయనిక పదార్థాలు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటివల్ల గొంతుక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదముంది. దీనితో పాటు 25 సంవత్సరాలు పరుసగా ఈ పొగాకు ఉత్పత్తులను వాడితే, పదమూడు వంతులు అధికంగా 'చిగుళ్ళ క్యాన్సర్‌', 'బుగ్గ క్యాన్సర్‌' వస్తుందని ధృవీకరించబడింది. మన దేశంలో పుగాకును కిళ్ళీలలో - తమలపాకుతో, వక్కలు సున్నం కలిపి వాడతారు. ఇవన్నీ నోటి క్యాన్సర్‌ను కలిగించడానికి తోడ్పడతాయి. పొగాకు నమిలేవారిలో క్యాన్సరుగా మారే 'లూకాప్లేకియా (తెల్లమచ్చ) అనే వ్యాధి నోటిలోని అతి సున్నిత భాగమైన బుగ్గకు వస్తుంది. పొగాకులో అధికంగా ఉండే 'నికోటిన్‌' నోటిలోని లాలాజలంతో కలిసి, నోటి మ్యూకస్‌ పొర- దారా గ్రహింపబడి సరిసరి రక్త ప్రవాహంతో కలియడం వల్ల దీని ప్రభావానికి రక్తపోటు కూడా వస్తున్నట్లు తేలింది. అందుచేత పొగత్రాగడానికి ప్రత్యామ్నాయంగా, స్మోకలెస్‌ టుబాకోను వాడడం వల్ల మరిన్ని అనర్ధాలు సంభవిస్తున్నాయన్నది నగ్నసత్యం. పొగత్రాగే అలవాటును మానుకోవాలే తప్ప దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేనే లేదు.
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, October 11, 2011

సంగీతంతో వైద్యం,Treatment with Music(Musical therapy)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంగీతంతో వైద్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-మ్యూజిక్‌ థెరపీ అనేది క్లినికల్‌ థెరపీ, బయో మ్యూజికాలజీ, మ్యూజికల్‌ అకౌస్టిక్స్‌, మ్యూజిక్‌ థీరీ, సైకో అకౌస్టిక్స్‌, కంపే రిటివ్‌ మ్యూజికాలజీల మధ్య సంబంధా లను అధ్యయనంచేసే శాస్ర్తీయ పరిశోధన. ఈ చికి త్సా క్రమంలో సుశిక్షితుడైన మ్యూజిక్‌ థెర పిస్టు భౌతిక, భావాత్మక, మానసిక, సామా జిక, సౌందర్య, ఆధ్యాత్మిక కోణాల్లో సంగీతా న్ని ఉపయోగించి వ్యక్తులు ఆరోగ్యాన్ని పొంద డానికి సహాయపడతాడు. వివిధ సంగీత రీతు లను ఉపయోగించి వివిధ రంగాల్లో జీవిత నాణ్యతను, పనిచేసేతీరును మెరుగు పరు చుకోవడానికి మ్యూజిక్‌ థెర పిస్టులు ప్రధానంగా సహాయ పడతారు. ఫలితంగా అంచనా వేయదగ్గ చికి త్సా లక్ష్యాలను సాధిస్తారు. డాక్టరుగానీ, సైకా లజిస్టులు, ఫిజికల్‌ థెరపిస్టులు, వృత్తిపర మైన థెరపిస్టులున్న ఇంటర్‌ డిసిప్లినరీ టీమ్‌ మ్యూజిక్‌ థెరపీ సేవలను సిఫార్సు చేయ వచ్చు. సహాయపడే వృత్తుల్లో దాదాపు ప్రతి అంశంలో మ్యూజిక్‌ థెరపిస్టులు వున్నారు. టర్కో-పెర్షియన్‌ సైకాలజిస్టు, మ్యూజిక్‌ సిద్ధాంతవేత్త అయిన అల్‌-ఫరాబీ (872- 950) యూరోప్‌లో ‘అల్‌ఫరాబియస్‌’గా సుప్రసిద్ధుడు.

‘మీనింగ్‌ ఆఫ్‌ ఇంటెలెక్ట్‌’ అన్న తన పుస్తకంలో మ్యూజిక్‌ థెరపీ గురించి చర్చించాడు. ఈ రచనలో సంగీతం ఆత్మపై కలిగించే చికిత్సాపరమైన ప్రభావాలను వివరించాడు. 17 శతాబ్దపు రాబర్ట్‌ బర్టన్‌ తన రచన ‘ది అనాటమీ ఆఫ్‌ మెలాంకొలీ’ లో మానసిక జబ్బును ముఖ్యంగా మెలొంకొలి యా వ్యాధి చికిత్సకు సంగీతం నాట్యం ఎంతో ఉపయోగకరమైనవని అభిప్రాయపడ్డాడు.

మ్యూజిక్‌ థెరపీ - రకాలు...
- మ్యూజిక్‌ థెరపీ ఆధారాల గురించి విభిన్న ఆలోచనా ధోరణులున్నాయి. ఒకటి విద్యపై ఆధారపడినది. రెండు సరాసరి మ్యూజిక్‌ థెర పీ పైనే ఆధారపడినవి. ఇదే కాక సైకాలజీ పై ఆధారపడిన ధోరణులు కూడా వున్నాయి. న్యూరోసైన్స్‌పై ఆధారపడిన చికిత్సా ధోరణి కూడా ఉంది. ప్రవర్తనా పరమైన-భావోద్రేక పరమైన రుగ్మతలకు లోనైన వ్యక్తులకు మ్యూ జిక్‌ థెరపిస్టులు వైద్యం చేయవచ్చు. ఈ తర హా ప్రజానీకం అవసరాలను నెరవేర్చడం కోసం సమకాలీన మనస్తత్వ సిద్ధాంతాలను తీసుకుని మ్యూజిక్‌ థెరపిస్టులు వివిధ తరహా ల మ్యూజిక్‌ థెరపీకి ఆధారంగా వాటిని విని యోగించారు. బిహేవియరల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, సైకోడైనమిక్‌ థెరపీ వీటిలో వివిధ నమూనాలు. న్యూరోసైన్సు పై ఆధారపడిన థెరపీ నమూనాను న్యూరలాజిక ల్‌ మ్యూజిక్‌ థెరపీ (ఎన్‌ఎంటి) అంటారు. సంగీతం లేనప్పుడు మెదడు ఎలా వున్నదీ, సంగీతం వున్నప్పుడు మెదడు ఎలావున్నదీ, తేడాలను అంచనా వేసి మ్యూజిక్‌ ద్వారా మెద డులో మార్పులు తీసుకురావడానికి ఆ తేడాల ను వినియోగిస్తారు. చివరికి సంగీతరహితం గా చికిత్సపొందుతున్న వారిని ఎలా ప్రభావి తం చేస్తుందో పరిశీలిస్తుంది. ‘‘ఈ విధానంలో మెదడును సంగీతంలో లీనం చేసి మార్చుతా రు’’ అని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫె సర్‌, పరిశోధకుడు డా థాట్‌ అంటున్నారు.

పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ...
పిల్లలకు చేసే మ్యూజిక్‌ థెరపీలో రెండు విధానాలున్నాయి. ఒక గ్రూపు సిట్టింగులో చికిత్స చేయయడం ఒకటి కాగా, ప్రత్యేకిం చి ఒకరికి కూడా ఈ చికిత్స ఇవ్వవచ్చు. భావప్రసార (కమ్యూనికేషన్‌) సమస్యలు న్న బాలలకు, ప్రేరణ, ప్రవర్తనాపరమైన సమస్యలున్న పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ సహాయపడగలదు. ఇందులో చికిత్స చేసే గది ఏర్పాటు చాలా ప్రధానమైంది. పిల్లలు సౌకర్యంగా వుంటూ వారు సరైన సంగీతం వినిపించడానికి ఇదెంతో అవసరం. అలాంటి గది పూర్తిగా సంగీతానికే కేటాయించిన గదై వుండాలి. గదిలో దృష్టిని
మళ్ళించే ఇతర వస్తువులుండకూడదు. గదిలో వెలుతురు బాగుండాలి, వాతవరణం సమశీతోష్ణంగా వుండాలి. మరీ వేడిగా లేక మరీ చల్లగా ఉండ కూడదు. గదిలోకి సులువుగా రాకపోకలకు వెసులుబాటు వుండాలి. కుర్చీలు మంచివై వుండాలి. జాగిలపడేలా వుండకూడదు. ఇక వాయిద్యాల విషయానికి వస్తే వివిధ ప్రాంతాల కు చెందిన భిన్న వాయిద్యాలుండడం మంచి ది. వివిధ రంగులు, రకాల వాయిద్యాలుండ డం మంచిది. థెరపిస్టు పియానోగానీ గిటార్‌ గానీ వాయించాలి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మంచి నాణ్యమైన వాయి ద్యాలు వినియోగించాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి.

కొందరు పిల్లలు వాయిద్యాలను వాయించగలరు, కొందరు వాయించలేరన్న విషయం గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కనుక పిల్లలకు వారికి తగిన వాయిద్యం ఇవ్వాలి. ఈ అంశాలన్నీ మ్యూజిక్‌ థెరపీ సఫలమవడానికి సత్ఫలితాలివ్వడానికి దోహ దపడతాయి. నిజానికి పిల్లల మ్యూజిక్‌ థెరపీ మాతృగర్భంలోనే మొదలవుతుందంటారు డానియెల్‌ లెవిటిన్‌. ఏమ్నియోటిక్‌ ఆసిడ్‌లో చుట్టుకొనివున్న గర్భస్థ శిశువు తల్లి గుండె చప్పుడు వింటుంది. అదే కాక సంభాషణలు, పర్యావరణపనమైన శబ్దాలు వింటుంది. పిండం సంగీతం వింటుందని యుకెలోని కీల్‌ విశ్వవిద్యాలయంకు చెందిన అలెగ్టాండ్రా లమోంట్‌ అంటున్నారు. పుట్టిన ఏడాది తర్వాత పిల్లలు సంగీతాన్ని గుర్తిస్తారని, కోరుకుంటారని కూడా అంటున్నారు. ఆకృతి దాల్చిన తర్వాత 20 నెలలు నిండిన గర్భస్థ శిశువు వినికిడి వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయనారంభిస్తుందని వారంటున్నారు.

భారత్‌లో మ్యూజిక్‌ థెరపీ...
మన భారతీయ శాస్ర్తీయ సంగీత రాగాలకు చికిత్సాపరమైన గుణాలున్నాయని వేదాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే సంగీ తాన్ని చికిత్సాపరమైన సాధనంగా మన పూర్వీ కులు ఉపయోగించారు. భారతదేశంలో సంగీ తం ఒక యోగా పద్ధతి. శ్రావ్యతకు ఆధారం రాగం. భారతీయ సంగీతానికి శ్రావ్యతే మౌ లిక స్వరం. కేంద్ర నాడీ మండలానికి సంబం ధించిన ఎన్నో వ్యాధులు మాన్పడంలో వివిధ రాగాలు ఎంతో ప్రభావవంతమైనవని వెల్లడైం ది. సంగీతాన్ని ఒక చికిత్సగా వినియోగించే ముందు ఏ విధమైన సంగీతం వాడాలో నిర్ధా రించుకోవాలి. సంగీతం మౌలిక గుణగణా లను సరిగా వినియోగించడం, స్వరం సవ్యం గా పలకడంపై సంగీత చికిత్స భావన ఆధారప డివుంది. ఒక్కో రాగం వైవిధ్యం అనూహ్యమైం ది. కను క ఒక నిర్ణీత వ్యాధికి ఒక నిర్దిష్టమైన రాగం పనిచేస్తుందని చెబుతారు. మ్యూజిక్‌ థెరపీ అన్న మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతికి వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో భార తీయ శాస్ర్తీయ గాత్ర సంగీతానికి సంబంధిం చిన లిఖిత సాహిత్యం తగినంతగా లేదు.

మూలము : సూర్య న్యూస్ పేపర్ .
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, October 10, 2011

Interstitial Lung Disease(ILD) ,ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ)





ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఐఎల్‌డీ(ILD) లో ఆక్సిజన్
పీల్చే గాలికి అనుగుణంగా సాగి దేహానికి ఆక్సిజన్ అందేలా చేయడం ఊపిరితిత్తుల లక్షణం. సాగడానికి వీలుగా ఉండే ఇవి... ఆ గుణం కోల్పోతే? ఊపిరి అందదు. ఫలితంగా గుండెపై, మెదడుపై దుష్పరిణామాలుంటాయి. ఊపిరితిత్తుల సహజగుణమైన సాగే తత్వాన్ని కోల్పోవడం వల్ల ఇలాంటి పరిణామాలు కలగజేసే జబ్బే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ). దీన్ని మందులతోనే పూర్తిగా తగ్గించలేకపోయినా స్టెరాయిడ్స్ వంటి మందులతో రోగి పరిస్థితిని మెరుగుపరచి, ఆయుః ప్రమాణాన్ని చాలావరకు పెంచవచ్చు. దాంతో పాటు ఇటీవల ప్రాచుర్యం పొందిన ఆక్సిజన్ థెరపీ తీసుకుంటే ఐఎల్‌డీ రోగులు సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు. చికిత్స లేదని భావించే ఈ ఐఎల్‌డీపై అవగాహన, ఆక్సిజన్ థెరపీ వంటి ఆధునిక చికిత్స ప్రక్రియలపై అవగాహన కోసం... ఈ కథనం.

ఊపిరితిత్తులకు సాధారణంగా ఉండే సాగే గుణం కోల్పోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇలా ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే కండిషన్‌ను ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) అంటారు. దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా రెండు రకాలు.

1. పుట్టుకతో వచ్చే ఐఎల్‌డి : దీన్ని ఇడియోపథిక్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి కారణం ఏమీ ఉండదు. వంశపారంపర్యంగా వస్తుందన్న విషయమే రూఢీ అయ్యింది. ఈ జబ్బు ఉన్నప్పుడు యుక్తవయసులోనైనా ఆయాసం, దగ్గు వస్తుంటాయి. సాధారణంగా వచ్చే జబ్బే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువ. దాంతో జబ్బు తీవ్రత పెరిగి గుండె మీద దుష్ర్పభావాలు కలిగితే... అప్పుడు జబ్బు బయటపడే అవకాశాలు ఎక్కువ.

2. సెకండరీ ఐఎల్‌డీ : ఇది ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే... తమ రోగనిరోధక శక్తి తమపైనే దుష్ర్పభావాలు చూపే జబ్బులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్, సోరియాసిస్ వంటి చర్మ సంబంధమైన కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో ఊపిరితిత్తులకు ఉండే సాగే గుణం తగ్గడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్‌లో ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడటం వల్ల సెకండరీ ఐఎల్‌డీ వస్తుంది.

లక్షణాలు : సాధారణంగా మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినా అన్ని వయసుల వారికీ రావచ్చు. లక్షణాలలో మొదట కనిపించేది దగ్గు. సాధారణంగా పొడి దగ్గు ఉంటుంది. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా దగ్గు, ఆయాసం రావడం జరుగుతుంది. రాత్రివేళలో కంటే పగలు పనిచేస్తున్న సమయంలో ఆయాసం ఎక్కువగా ఉండటం ఐఎల్‌డీలో ప్రత్యేకత.

ఈ ప్రధాన లక్షణంతో పాటు కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి ప్రమాదకరమైన కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగి మెదడుపై దుష్ర్పభావాలు పడినప్పుడు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. అంటే... మత్తుగా ఉండటం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, గురక పెరగడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపించినప్పటికీ చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు.

నిర్ధారణ పరీక్షలు :
ఐఎల్‌డీ జబ్బును ఎక్స్-రే పరీక్షతో గుర్తిస్తారు. ఎక్స్-రేలో రెటిక్యులార్ నాడ్యుల్స్ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపిస్తే అప్పుడు హై రెజల్యూషన్ సీటీ ఆఫ్ చెస్ట్ అనే పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్ డిసీజ్, సొరియాసిస్ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఆర్నెల్లకోమారు ఎక్స్-రే పరీక్ష చేస్తే ఈ జబ్బును కనిపెట్టే అవకాశం ఉంది.
జబ్బు నిర్ధారణ అయిన తర్వాత దాని తీవ్రతను తెలుసుకోడానికి టూ-డీ ఎకో, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు చేస్తారు. (ఏబీజీ పరీక్ష వల్ల రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు తెలుసుకోవచ్చు).

అలాగే ఇమ్యూన్ జబ్బుల గురించి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఎల్‌ఈ సెల్స్, ఏఎన్‌ఏ, యాంటీ డీఎస్ డీఎన్‌ఏ, సీఆర్‌పీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

చికిత్స : ఐఎల్‌డీని పూర్తిగా నయం చేసే మందులు లేకపోయినా, ఊపిరితిత్తుల డాక్టర్ పర్యవేక్షణలో సరైన పద్ధతిలో సక్రమంగా చికిత్స తీసుకోవడం వల్ల రోగుల జీవితకాలాన్ని చాలావరకు పెంచవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్ వాడతారు. అయితే స్టెరాయిడ్స్ అనగానే ప్రజల్లో ఉండే అపోహలతో రోగికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. దీనికి స్టెరాయిడ్స్‌తో పాటు ఇమ్యూనో రెస్పాన్స్‌ను తగ్గించే మందులు అంటే... మెథోట్రెక్సేట్, కాల్చిసిన్, సైక్లోఫాస్ఫమైడ్ వంటివి వాడాలి. అయితే జబ్బు తీవ్రతతో పాటు అవి శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు చూపకుండా ఉండేలా వీటి మోతాదును నిపుణులు నిర్ణయిస్తారు. స్టెరాయిడ్స్ తాలూకు దుష్ర్పభావాలను నివారించేందుకు క్యాల్షియమ్ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్ కూడా ఉపయోగిస్తారు. దాంతోపాటు బలవర్థకమైన ఆహారం సూచిస్తారు. గతంలోలా కాకుండా ఇప్పుడు దుష్ర్పభావాలు చాలా తక్కువగా ఉండే స్టెరాయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇలాంటి జబ్బులు ఉన్నవారు అపోహలను తొలగించుకుని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో చికిత్స తీసుకుంటే ఆయుప్రమాణాన్ని సాధారణ జీవితకాలం పొడిగించుకోవచ్చు.

ఆక్సిజన్ థెరపీ
ఈ జబ్బుకు చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ను కూడా ఒక మందులా ఉపయోగిస్తున్నారు. గత పదేళ్లలో ఈ ఆక్సిజన్ చికిత్స మంచి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆక్సిజెన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఐఎల్‌డీ ఉన్నట్లు నిర్ధారణ కాగానే ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తుల మీద శ్రమ తగ్గించడంతో పాటు, మందులకు ఊపిరితిత్తులు సక్రమంగా రెస్పాండ్ అయ్యేలా చేయడం, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెంచడం ఆక్సిజెన్ థెరపీ ప్రధాన ఉద్దేశం.

ఆక్సిజెన్ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు:
1. సిలెండర్స్ ద్వారా : గతంలోలా సిలెండర్స్ ద్వారా ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి పట్టే వ్యవధి వల్ల ఈ ప్రక్రియ క్రమంగా ఆదరణ కోల్పోతోంది.

2. ఆక్సిజన్ కాన్సట్రేటిక్ మెషిన్ ద్వారా: ఈ మెషిన్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం పేషెంట్స్‌కూ సౌలభ్యంగా ఉంటుంది. వాతావరణంలో ఉండే 21 శాతం ఆక్సిజన్‌నే ఉపయోగించుకుని రోగికి అవసరమైన నిర్ణీత మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. ఇందులో మళ్లీ నింపాలనే అసౌకర్యం ఉండదు. పైగా ఆక్సిజన్ తీసుకుంటున్నామనే మానసికమైన ఫీలింగ్ ఉండదు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీని ధర రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుంది.

ఇటీవలి పరిశోధన ఫలితాలను బట్టి ఆక్సిజన్ థెరపీ తీసుకునే పేషెంట్స్ ఆయుప్రమాణం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఆక్సిజన్ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియలో భాగంగా అధిక మోతాదుల్లో దీన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను తీసుకోడాన్ని నియంత్రించే మెదడులోని కేంద్రం ఒక్కోసారి తన సహజగుణాన్ని (స్టిమ్యులేషన్) కోల్పోవచ్చు. ఫలితంగా రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆక్సిజన్ థెరపీని తీసుకునే రోగులు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే దీన్ని తీసుకోవాలి.


Causes

ILD may be classified according to the cause. One method of classification is as follows:

Inhaled substances
Inorganic
Silicosis
Asbestosis
Berylliosis
Organic
Hypersensitivity pneumonitis
Drug induced
Antibiotics
Chemotherapeutic drugs
Antiarrhythmic agents
Statins
Connective tissue disease
Systemic sclerosis
Polymyositis
Dermatomyositis
Systemic lupus erythematosus
Rheumatoid arthritis
Infection
Atypical pneumonia
Pneumocystis pneumonia (PCP)
Tuberculosis
Chlamydia trachomatis
Respiratory Syncytial Virus
Idiopathic
Sarcoidosis
Idiopathic pulmonary fibrosis
Hamman-Rich syndrome
Antisynthetase Syndrome
Malignancy
Lymphangitic carcinomatosis

  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/