Wednesday, October 19, 2011

Milk teeth and protection, పాలపళ్ళు మరియు వాటి సంరక్షణ .


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పాల పళ్లు రక్షణ -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాము . గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలి .దంతాలు ఆరోగ్యంగా ఉండడాఇకి నిరోధక చర్యలు తీసుకోవడం చిగుళ్ళలో కాల్షియం చేరే సమయం నుంచే ఆరంభం కావాలి. పాల పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు గర్భంలో ఉన్నప్పుడే ఆరంభం అవుతుంది. శాశ్వతమైన పళ్ళలో ఎనామిల్ చేరడం శిశువు జన్మించిన క్షణం నుంచి మొదలవుతుంది. అందుచేత పుట్టబోయే శిశువు దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లికి గర్భిణీ దశలో ఎక్కువ మాంసకృత్తులు, కాల్షియం, భాస్వరం, విటమిన్‌లు సరఫరా అయ్యేట్టు చూడాలి. అప్పుడే గర్భంలోని శిశువుకు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన పోషక పదార్ధాలన్నీ సక్రమంగా లభించగలవు.

సాధారణంగా గర్భంలోని శిశువు తల్లి రక్తం నుంచి పోషక పదార్ధాలను గ్రహించే కాలంలోనే పాలపళ్ళు ఏర్పడుతాయి. తల్లికి పోషణ సరిగా జరగకపోతే, లేదా గర్భవతిగా ఉండగా ఆమెకు తీవ్రమైన సుస్తీ చేస్తే శిశువులో ఎనామిల్ లోపం ఏర్పడుతుంది. శరీరారోగ్యం సక్రమంగా లేకపోతే పళ్ళ నిర్మాణమూ దెబ్బతింటుంది. శిశువు ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే తల్లిపాలు ఇస్తూ ఉండడం చాలా అవసరం. తలి రొమ్ము చీకేటప్పుడు దౌడలకు లభించే వ్యాయామం దౌడలు సక్రమంగా రూపొందేందుకు తోడ్పడుతుంది. దౌడలు, పేలేట్ అడ్డంగా విస్తరించడానికి ఆ విధమైన వ్యాయామం చాలా అవసరం. ముఖ కవళికలు అందంగా రూపొందడానికి కూడా తల్లి రొమ్ము చీకడం తోడ్పడుతుంది. అంతే కాక ఊపిరితిత్తులు బలపడడానికీ దోహడపడుతుంది. శిశుప్రాయంలో వచ్చే చాలా జబ్బులను నిరోధించే రక్షక జీవ కణాలు తల్లి పాల ద్వారానే శిశువుకు లభిస్తాయి.

  • దంత రక్షణే దేహ రక్షణ పాలపళ్ళలో
పిల్లలకు సుమారు ఆరు నెలల వయసులో దంతాలు రావడం ప్రారంభమవుతాయి . అలా మెల్లగా దంతాలు రావడం ప్రారంభమై ఒకటిన్నర సంవత్సరం వయసొచ్చేసరికి మొత్తం ఇరవై పళ్ళు వస్తాయి. వీటిని 'పాలపళ్ళు' అంటారు. ఈ పాలపళ్ళు 6 నుండి 12 సంవత్సరాల వరకూ ఉంటాయి. ఆరేళ్ళ వయసులో ప్రారంభమైన పాలపళ్ళు పన్నెండు ఏండ్లు వచ్చేసరికి అన్నీ ఊడిపోతూ వాటి స్థానంలో శాశ్వత దంతాలు రావడం మొదలు పెడతాయి.
  • మొదటి రెండు పళ్ళూ సాధారణంగా శిశువుకి 6 నెలల ప్రాయంలో వస్తాయి.
  • 15 నెలల ప్రాయంలో పాల దంతాలూ,
  • ఆ తరువాత కోరపళ్ళూ కనిపిస్తాయి.
  • పాల పళ్ళు ఊడిపోవడం ఆరున్నర ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు వచ్చే లోగా ఆరంభం అవుతుంది.
  • శాశ్వతమైన పళ్ళు మొలిచే ప్రక్రియ 6వ ఏడు మొదలై 18వ ఏడు వచ్చేదాకా కొనసాగుతుంది.
  • చిన్నతనం నుంచే శిశువు పోషణ లరిగా జరగకపోతే మొట్టమొదట వచ్చే ఆ శాశ్వత దంతాలలోనే దంత క్షయం చోటు చేసుకుంటుంది. . 18వ ఏడు తరువాతనే విజ్ఞాన దంతాలు వస్తాయి. అప్పటికిగానీ 32 పళ్ళూ పూర్తిగా ఏర్పడడం జరగదు.

దంత వ్యాధులలో తరచుగా కనిపించేవి దంత క్షయ వ్యాధులూ, చిగుళ్ళ వ్యాధులు. వ్యాధి కలిగించే సూక్ష్మ క్రిములు చేరడంవలన దంత క్షయం వస్తుంది. చిగుళ్ళ వ్యాధుల వలన దంతాలకు ఆధారభూతాలైన భాగాలు దెబ్బతింటాయి. పళ్ళలో ఏర్పడిన పగుళ్ళలోనూ,గుంటలలోనూ, పళ్ళ సందుల్లోనూ లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరుతాయి. ఆ సూక్ష్మ క్రిములను ప్లేక్స్ అంటారు. ప్రధానంగా సూక్ష్మ క్రిములు, ఆ క్రిములు ఉత్పత్తి చేస్దే పదార్ధాలూ, పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్ధాల అవశేషాలు, లాలాజలంలోని నత్రజనితో కూడిన జిగురు పదార్ధం కలసి ఈ ప్లేక్స్ ఏర్పడుతాయి. సూక్షం క్రిములు పళ్ళలో ఇరుక్కున్న పిండిపదార్ధాలలో ప్రవేశించి వాటిని కుళ్ళబెట్టి పళ్ళ మీద ఎనామిల్‌ను హరించడానికి తగినంత లాక్టిక్ యాసిడ్‌ను తయారుచేస్తాయి. జరిగిన ప్రయోగాలన్నిటి వల్లా డెంటల్ ప్లేక్‌ళే దంత క్షయ వ్యాధికి ప్రధాన హేతువని స్పష్టంగా నిరూపించబడింది.

దంత రక్షణే దేహ రక్షణఆహారంలో తీసుకునే పిండిపదార్ధాల తాలూకు పరిమాణం కాక, వాటి స్వభావమే ఈ వ్యాధిని కలిగించడంలో ప్రాముఖ్యం వహిస్తుంది. భోజనానికీ, భోజనానికీ మధ్య సూక్రోజ్ ఉన్న చూయింగ్ గం చప్పరించే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఒక్కటే ఉంటే చాలదు. మ్రింగే ముందు బాగా నమలవలసిన అవసరాన్ని కలిగించే పీచు పదార్ధం కూడా ఆహారంలో ఎక్కువగా ఉండాలి. పచ్చి కేరట్ దుంపలను నమిలే అలవాటు వల్ల దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.రోజూ రెండుసార్లు పళ్ళను విధిగా శుభ్రపరుచుకునే అలవాటు చేసుకోవాలి. అందుకు ఫ్లోరైడ్ కలసిన టూత్ పేస్ట్ వాడవచ్చు. పిల్లలకు రోజుకు కనీసం రెండు కప్పుల పాలు ఇవ్వాలి. పాల నుంచి వచ్చే పెరుగు, జున్ను కూడా మంచివే. 10 లక్షల భాగాలకు 2 భాగాల చొప్పున ఫ్లోరైడ్ చేర్చిన మంచి నీరు త్రాగడం దంత క్షయ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. చిన్న పిల్లలను అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించడం మంచిది. పెద్దలూ జాగ్రత్త పడడం అవసరం. లేదంటే పిప్పిపళ్ళ రూపంలో దంత క్షయం జరిగి అది ప్రాణాంతకం కూడా కావచ్చును. పాల పళ్ళ వయసు నుంచి పండు వయసు వరకు అత్యంత జాగ్రత్తగా చూసుకోవలసిన దంతాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం తగదు.

  • దంత సంరక్షణకు కొన్ని సూత్రాలు :

* పళ్ళ మీద పాచి బాగా గారకట్టుకుపోవడం, చిగుళ్ళు వాచి ఎర్రబడడం, చిగుళ్ళ వెంబడి రక్తం కారటం మొదలైనవన్నీ చిగుళ్ళ రోగ లక్షణం. దంతాల మీద పాచి తీయించుకుంటుండాలి.
* తమలపాకులు నమలడం, నోటిలో పొగాకు పెట్టుకోవడం, పొగత్రాగడం మొదలైన వాటివల్ల చిగుళ్ళ రోగాలను తీవ్రతరం చేస్తాయి. అవి కాన్సర్‌కు కూడా దారితీస్తాయి.
* పచ్చికాయలు, పళ్ళు తింటే దంతాలకు ఆరోగ్యం.
* అప్పుడప్పుడు వేపపుల్లతో బ్రష్ చేసుకోవడం ఉత్తమం.
పళ్ళు వచ్చిన నాటినుంచే బ్రష్‌ చేయించడం మొదలు పెట్టడం వల్ల వారికి అలాగే అలవాటవుతుంది. ఉదయం, రాత్రి పడుకునే ముందు రెండు మూడు నిముషాలు దంతాల పైనుంచి కిందకు, పైకి కదుపుతూ బ్రషింగ్‌ చేయించాలి. చిగుళ్ళు దెబ్బతినకుండా ఎలా బ్రష్‌ చేసుకోవాలో వారికి నేర్పాలి.

పిల్లలు సాధారణంగా పేస్ట్‌ను తినేస్తుంటారు. పేస్ట్‌ రుచి వారికి నచ్చడం వల్లే చాలామంది చిన్న పిల్లలు పేస్ట్‌ను తమ తల్లిదండ్రులకు తెలియకుండా బ్రష్‌ వేస్తున్నపðడు మింగేయడం సాధారణంగా మీరు గమనించే ఉంటారు. అందుకే పిల్లలు పేస్ట్‌ తినకుండా, బ్రష్‌ నమలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా పిల్లల బ్రష్‌ను ప్రతి రెండు నెలలకు ఓసారి మార్చాలి.

పిల్లలకు బ్రష్‌ బాగావేయించాలన్న తపనతో కొంతమంది తల్లిదండ్రులు అదే పనిగా వారిచే బ్రష్‌ వేయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పళ్ళల్లోని ఎనామిల్‌ అరిగిపోయే ప్రమాదముంది. అందుకే పిల్లలు కానీ, పెద్దలు కానీ మరీ ఎక్కువసేపు బ్రష్‌ వేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్‌ కోటింగ్‌ త్వరగా అరిగిపోతుందంటారు దంతవైద్యులు.

పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకొకసారి డెంటల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్ళి చెక చేయించడం చాలా మంచిది.

సాధారణంగా పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు , స్వీట్లు తింటుంటారు. వీటిని తిన్నాక పిల్లలు తమ తమ దంతాలను శుభ్రపర్చుకోకపోవడం వల్లే వాళ్ళ దంతాలు చిన్నవయసులోనే పుచ్చిపోతుంటాయి. అలా వాళ్ళ దంతాలు పుచ్చిపోకుండా తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిల్లలు చాక్లెట్లో, స్వీట్లో తింటే వెంటనే వారిని దంతాలను నీళ్ళతో కడిగి శుభ్రపర్చుకోమని ఆదేశించాలి. ఇలా చేయకుంటే పళ్ళు పుచ్చిపోతాయని వారికి వివరించి చెప్పాలి. ఆహారపదార్థాలు తిన్న తర్వాత నీళ్ళు నోట్లో పోసుకుని ఉమ్మి పారేయడవెూ, బ్రష్‌ వేసుకోవ డవెూ తప్పనిసరిగా చేయాలని వాళ్ళకు చెప్పాలి.

పిల్లల దంతాలపై నల్లటి డాట్స్‌లాంటివేమైనా ఉన్నాయే వెూనని తల్లిదండ్రులు అపðడపðడూ గమనిస్తూండాలి. ఒక వేళ అలాంటి నల్లటి డాట్స్‌ ఏమైనా ఉంటే, వెంటనే వారిని దంతవైద్యశాలకు తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. ఇలా చేయకుంటే ఆ తర్వాత ఆ నల్లటి మచ్చ రంధ్రంగా మారడం, నొప్పి పుట్టడం, చిగుళ్ళు వాయడం, ఆఖ రుకు పన్నే తీసేయాల్సి రావచ్చు.

అలాగే పంటిపై గార పేరుకుపోతే గమనించి వెంటనే తీసే యించాలి. ఇలా తీసేయడం వల్ల నోటి నుంచి దుర్వాసన రాదు. పళ్ళకు సంబంధించిన నొపðలకు సొంత వైద్యం చేయకుండా దంతవైద్యుని సంప్రదించి, వారి సలహాలను పాటించడం శ్రేయ స్కరం.
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.