Saturday, October 29, 2011

సెర్వికల్ స్పాండిలైటిస్,Cervical Spondylytisఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెర్వికల్ స్పాండిలైటిస్,Cervical Spondylytis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?.---స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే  విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశము రాగల , వెన్నుపూసను ప్రబావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . ఇది మెడభాగము లో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

ఈమధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
తలవంచితే మెడనొప్పులే...ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువును మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి.
టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.. డిస్క్‌ల్లో తేడా రావడం, కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవడం దీని ప్రధాన లక్షణం. మెదడు, వెన్నుపూస నుంచి శరీరానికి సరఫరా అయ్యే ముఖ్యమైన నరాలు మెడ ఎముక ద్వారా సరఫరా అవుతుంటాయి. ఏదైనా కారణం వల్ల ఈ మెడ నరాలపైన ఒత్తిడి పెరిగినపుడు మెడ నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కండరాలు, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎవరిలో ఎక్కువ
గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేసే వారిలో ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్ సెంటర్లలో పనిచేసే వారిలో, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. ద్విచక్రవాహనం ఎక్కువగా నడిపే వారిలోనూ ఈ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు మోసే వారిలోనూ ఈ వ్యాధి అరుదుగా కనిపిస్తుంది.

కారణాలు
వయసు పెరుగుతున్న కొద్దీ బయటపడే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇటీవలి కాలంలో మధ్యవయస్కుల్లోనూ కనిపిస్తోంది. ఏఔఅఆ జన్యువులలో వచ్చిన మార్పుల ప్రభావం వల్ల ఈ సమస్య వస్తోందని ఒక అధ్యయనంలో వెల్లడయింది. కొంతమందిలో మెడ ఎముకల్లో అసాధారణ పెరుగుదల చోటుచేసుకోవడం వల్ల, గాయాల వల్ల స్పాండిలైటిస్ మొదలవుతుంది.

లక్షణాలు
తల, మెడ నొప్పితో కండరాలు బిగుసుకొనిపోతాయి. మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు వ్యాపిస్తాయి. చేతి కండరాలు బలహీనపడటం, కళ్లు తిరగడం, భుజాలు, చేతి వేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, అరుదుగా మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉంటుంది. మెడ బిగుసుకుపోయినట్లుగా కావడంతో నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి క్రమంగా భుజాలకు పాకుతుంది. తలను కదల్చలేకపోతారు. తీవ్రమైన ఒత్తిడిపడుతున్నట్లుగా ఉంటుంది. చెవుల్లో శబ్దాలు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. నొప్పి క్రమంగా చేతులకు విస్తరిస్తుంది.

నిరక్ష్యం చేస్తే...
సర్వైకల్ స్పాండిలైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశంఉంది. దీర్ఘకాలిక మెడ నొప్పి, మల, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

పరీక్షలు(గుర్తించడము ) :
ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ స్కాన్, సిటి స్కాన్ వంటి పరీక్షల ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్‌ను గుర్తించవచ్చు. కండరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు , మైలోగ్రామ్ మరియు ఇ.ఎమ్.జి వంటి పరీక్షల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. నిపుణులైన వైద్యులు రోగిని పరీక్షించడం ద్వారా వ్యాధిని సులభంగా గుర్తిస్తారు.

నివారణ(చికిత్స ) :
చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సరియైన భంగిమలో కూర్చోవాలి. ఎక్కువ సమయం చదువుతుండే పిల్లలను గంటకొకసారి నిలబడమనడం, కాసేపు పచార్లు చేయించడం వల్ల స్పాండిలైటిస్ రాకుండా చూసుకోవచ్చు. పిల్లలు గంటలతరబడి కంప్యూటర్ గేమ్స్ ఆడకుండా నియంత్రించాలి. నిద్రపోయే సమయంలో తల కింద అనువైన దిండు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపాలి.

పర్సనల్‌ కేర్‌: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.

మందులు (Medicines):
Tab . IBUDOL PLUS (Tramadol+paracetamol) 1 tab 3 times /day 5-10 days,
Tab . DOLOMED MR(Ibuprofen+paracetamol+chrorzoxazone) 1 tab 3 times /day 5 -10 days.
Cervical neck collar bandage to restrict movements.


  • ================================

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.