Saturday, October 1, 2011

Milk allergy , పాల అసహనీయత ,లాక్టోజ్ ఇంటోలరెన్స్ , Lactose intolarence



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Milk allergy , పాల అసహనీయత ,లాక్టోజ్ ఇంటోలరెన్స్ , Lactose intolarence- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పాల అసహనీయత (Milk allergy) అనేది ఫుడ్ ఎలర్జీ లలో ఒక రకము . ఏదైనా ఆహారపదార్ధము పడనిచో వచ్చే ఎలర్గిక్ లక్షణాలన్నీ పాల ఎలర్జీలో ఉంటాయి. కాని ఇక్కడ చిన్నపిల్లలలో వచ్చే లాక్టోజ్ పడకపోవడం (Lactose intolarence) గురించి తెలుసుకుందాం .

కొందరికి చిన్నప్పటినుండీ పాలు , పాల ఉత్పత్తులు పడవు . పాలు త్రాగగానే కడుపులో కిందభాగములో నొప్పి , ఉబ్బినట్లు , విరోచనాలు అవడము జరుగుతుంది . దీనికి కారణము పాలలో ఉండే లాక్టోజ్ అనే చెక్కెర . శరీరములో లాక్టేస్ (Lactase) ఎంజైమ్‌ తయారవకపోవడము , లేదా తక్కువగా తయారవడము (hypolactasia) వలన ఈ లాక్టోజ్ చెక్కెర జీర్ణమవక కడుపు నొప్పి , కడుపుబ్బడము , విరోచనాలు అవడము , వాంతులు అవడము ,వికారముగా ఉండడము జరుగుతుంది . దీనినే పాలు పడకపోవడము(Lactose intolarence syndrome) అంటాము . చిన్న పిల్లలలో ఇది చాలా ఇబ్బంది పెడుతుంది . అటువంటి ఇబ్బందులు కలిగినవారు పాలు , పాల ఉత్పత్తులు ... పెరుగు , మజ్జిక ,వెన్న , పాలబిస్కెట్లు , పాల ఐస్క్రీం వంటి వాటికి దూరముగా ఉండాలి .

పాలు ఎలర్జీ వచ్చిందంటే కనిపించే లక్షణాలు చికాకుపడటం, వాంతులు, వీరోచనాలు, బరువు పెరగకపోవడం వంటివి. పిల్లల్లో వాంతులు, రక్తం లేకపోవడం, రక్తవీరోచనాలు, పొట్టఉబ్బడంవంటివి కనిపిస్తాయి. పాలద్వారా వచ్చే ఎలర్జీ. ఏడాదిలోపల వస్తుంది. గుడ్డు ఎలర్జీ 18 నెలలలోపల రావచ్చు. సాధారణ ఫుడ్‌ ఎలర్జీకి కారణమైన ఆహార పదార్థాలు ఆవుపాలు, గుడ్డు, చేప, వేరుశెనగపప్పులు.

ఎలర్జీ... ఈ పదం దాదాపు అందరికీ పరిచయమే. వాతావరణంలో తేడాలవల్ల కూడా కొందరికి ఎలర్జీ వస్తుంది. అంటే కాలుష్యం, పొగ, దుమ్ము, కొన్ని వాసనలు పడకపోవడంలాంటివి. ఇవికాకుండా ఆహారంవల్ల ఎలర్జీవస్తే దాన్ని 'ఫుడ్‌ ఎలర్జీ' అంటారు. కొందరికి కొన్ని ఆహారపదార్థాలు ఒంటికి సరిపడవు. శరీరంలో ఆ మార్పులు వెంటనే కనిపిస్తాయి. సాధారణంగా ఫుడ్‌ ఎలర్జీ వచ్చిందంటే దద్దుర్లు, వాపు కనిపిస్తాయి. ఇవికాక వారి వారి శరీర మనస్తత్వాన్ని బట్టి మరికొన్ని మార్పులొస్తాయి. కొందరికి గుడ్డు తింటే పడదు. కొందరికి చెట్లల్లో తిరిగితే దురదలు వస్తాయి. ఇంకొందరికి పాలు తాగితే తేడాచేస్తుంది. ఇలా చాలామందికి ఎప్పుడో ఏదో ఒక చిన్న అనుభవం ఉంటూనే వుంటుంది.

పాలుకి ప్రత్యామ్నాయము : సోయాపాలు , కొబ్బరిపాలు , బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

లాక్టోజ్ ఇంటోలరెన్స్ ను మూడు రకాలు గా విభజించారు వైద్యనిపుణులు .
ప్రైమరీ లక్టోజ్ డెఫిసియన్సీ : ఇది (జెనిటికల్) వంశపారంపర్యము గా వస్తుంది . ఇందులో " lactase persistence allele" అనే జీనులు లేకపోవడము వల్ల లాక్టోస్ ఎంజైం తయారవదు . లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారు ఎక్కువగా ఈ కోవకు చెందినవరే .
సెకెండరీ లాక్టోజ డెఫిసియన్సీ : పసికందులలో చినంప్రేగులు వ్యాదిగ్రస్తమయినపుడు ... సాదారణము గా " గాస్ట్రోఎంటరైటిస్ , డయేరియా, కీమొతెరఫీ, పొట్తపురుగులు " మున్నగు వాటివలన లాక్టేస్ ఎంజైం తయారీలో మార్పులు వచ్చి ఈ వ్యాదికి దారితీస్తుంది .
కంజెనిటల్ లాక్టోజ డెఫిసియన్సీ : ఇది చాలా అరుదుగా వస్తుంది . పుట్టుకతో 'ఆటోసోమల్ రెసిసివ్ జెనెటిక్ డిసార్డర్ '... లాక్టోస్ తయారీని నియంత్రించును . ఈ వ్యాది Finland దే్శము లో ఎక్కువగా కనిపిస్తుంది .

నిర్ధారణ పరీక్షలు :


Hydrogen breath test : ఒక రాత్రి ఉపవాసము ఉంది ఉదయాన్నే 25 గ్రాముల లాక్టోజ్ ద్రావకము తాగించి 2-3 గంటలు తర్వాత ఊపిరి వాసన పరీక్ష చేస్తారు . ఇక్కడ లాక్టేస్ ఎంజైం లేదుగనక బాక్టీరియా లాక్టోజ్ ద్రావకాన్నుండి హైడ్రోజన్‌ వాయువును, మీథేన్‌ ను తయారుచేయడం వలన ఆవాసనతో ఊపిరి మిలితమువును .

Blood test : లాక్టోజ్ ద్రావకము తాగించి 15 నిముషాల తర్వాత రక్తములొ చెక్కెర పరీక్ష చేసినచో బ్లడ్ సుగర్ లెవల్ .. ప్లాట్ కర్వ్ వస్తుంది . ఇక్కడ లాక్టోజ్ జీర్ణము అవనందున రక్తములోని చెక్కెర శాతము పెరగదు . దీనిని హైడ్రోజన్‌ బ్రెత్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు .

Stool acidity test : ఈ పరీక్షలో లాక్టోజ్ జీర్ణము అవక పెద్దపేగులలోని బాక్టీరియా వలన లాక్టిక్ ఆమ్లము తయారవడము మూలాన మలము పరీక్షలో ఆమ్లగుణము కనిపించును ,

Intestinal biopsy : ఈ పరీక్ష వలన వ్యాది నిర్ధారణ చేయబడును .

చికిత్స :
ఈ వ్యాదికి సరియైన చికిత్స లేదు . పాలు , పాల ఉత్పత్తులు తినకుండా ఉండాలి . తప్పనిసరి పరిస్థితులలో " లాక్టోస్ ఎంజైమ్‌" ప్రత్యామ్నాయము గా తీసుకోవడమే . లాక్టోస్ ఎంజైం ను 'genus Aspergillus జాతి fungi ' నుండి తయారు చేస్తున్నారు .



  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.