Saturday, October 8, 2011

ఫుడ్‌ అలెర్జీ , Food Allergy



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫుడ్‌ అలెర్జీ , Food Allergy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
(Thu, 6 Oct 2011)


ఫుడ్‌ అలెర్జీకి కారణం కనుక్కోపోతే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఫుడ్‌ అలెర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు లాంటి చిన్న ఇబ్బందులే కాక శ్వాససంబంధిత సమస్యల వంటి పెద్ద కష్టాలు కూడా వస్తాయి. పల్లీలు తినడం వల్ల కూడా కొందరికి అలర్జీ వస్తుంది. కొన్ని రకాల ఫుడ్‌ అలెర్జీలు కుటుంబ వారసత్వంగా వస్తాయి. అందుకే వీటి గురించి కొంచెమైనా తెలుసుకుని ఉండటం మంచిది. తొంభైశాతం ఫుడ్‌ అలర్జీలు ఎనిమిదిరకాల ఆహారపదార్ధాలు వల్ల వస్తాయి. అవేమిటంటే పాలు, గుడ్డు (గుడ్డులోని తెల్లసొన), పల్లీలు, వాల్‌నట్స్‌, జీడిపప్పు, ఆల్మండ్‌, చేపల్లో ... షెల్‌ ఫిష్‌ అంటే అంటే పీతలు, రొయ్యలు, ఆహారధాన్యాల్లో గోధుమలు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాలు వల్ల కూడా ఒక్కొసారి అలర్జీలు వస్తాయి. ఫుడ్‌ అలర్జీల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడా వుంటుంది.మనషి మనషి కీ తేడా ఉంటుంది .

ఫుడ్‌ అలర్జీ లక్షణాలు

1. దురద, ఎక్జిమా, చర్మం పగిలిపోవడం 2. కనుర్పెలు, పెదవులు, ముఖం, నాలుక, గొంతులో వాపు లేదా ఇతర శరీర భాగాల్లో వాపు.

3. శ్వాసలో ఇబ్బంది, పొట్టలో నెప్పి, డయేరియా, నీరసం, వాంతులు 4. తలబరువు, అపస్మారక స్థితి, మత్తుగా వుంటం మొదలైనవి ఆహారం వలన కలిగే అలర్జీలను

'ఎనాఫైలాక్సిస్‌' అంటారు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణానికే హాని కలిగే ప్రమాదం వుంది. అంటే శ్వాస నాళాలు కుంచించుకుపోవడం, గొంతువాపు, రక్త

పీడనంలో తగ్గుదల, పల్స్‌ రేటు బాగా పెరగడం వంటవి జరుగుతాయి.

అలర్జీకి దూరంగా.... ఫుడ్‌ అలర్జీల విషయంలో జాగ్రత్త వహించాలంటే - మొదట మీకు అలెర్జీని కలిగించే ఆహారం ఏదో కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఆహార పదార్ధాలన్నింటినీ తినడం మానేయాలి. అంటే ఉదాహరణకి రొయ్యలు వల్ల అలర్జీ వుంటే పీతలు తిన్నా అలర్జీ వస్తుంది. ఇదే నియమం వెజిటేరియన్‌ రకాలకు కూడా వర్తిస్తుంది. మార్కెట్‌లో లభించే రెడీమేడ్‌ ఆహరపదార్ధాలపై వున్న లేబిల్స్‌ను జాగ్రత్తగా చదవండి. వాటిమీద వున్న సాంకేతిక, శాస్త్రీయ పదాలను సరిగ్గా అర్థం చేసుకోండి.

మీకు పాల వల్ల అలర్జీ వుంటే, సోడియం కాసినేట్‌ అని రాసి వున్న వేవీ తీసుకోకండి. గోధుమలు వల్ల అలర్జీ వుంటే .... గోధుమలతో తయారుచేసిన వస్తువులు ప్యాక్‌ పైన గ్లుటేన్‌ అని రాసి వున్న వాటికి దూరంగా వుండాలి. గుడ్డు వల్ల అలర్జీ వేంటే బేకరీ బిస్కట్లు, బ్రెడ్‌లను , మయొనైజ్‌తో డ్రసింగ్‌ చేసిన సలాడ్‌లను, బేకింగ్‌ మిక్స్‌లను వాడొద్దు.బయట హోటళ్ళలో తినేటప్పుడు మెను ఎంపికలో చాలా జాగ్రత్తగా వుండాలి.వీలుంటే ముందుగానే వెయిటర్లకు, చెఫ్‌ లేదా మేనేజర్లకు మీ ఫుడ్‌ అలర్జీ గురించి చెప్పండి బయట ఆర్డర్‌ చేసేటప్పుడు సింపుల్‌గా వుండే మెనునే ఎంపిక చేసుకోండి.ఫుడ్‌ అలర్జీ, ఇంకా ఇతర రకాలైన అలర్జీలున్నవారు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎనాఫైలాక్టిక్‌ రియాక్షన్‌ ఉంటే, 'ఎపినెఫ్రైన్‌' ఇంజెక్షన్‌ మీ దగ్గర వుంచుకోవాలి. ఒకవేళ ఆహారపదార్ధాలు వికటించి రియాక్షన్‌ వస్తే ఈ ఇంజెక్షన్‌ వెంటే
వేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దాన్ని ఎలా వాడాలో చెప్పాలి. మీకు అలర్జీ కలిగించే పదార్ధాలు వేటి వేటిలో వున్నాయో ముందుగానే తెలుసుకోండి.

గోధుమల వల్ల అలర్జీ వుంటే మాల్టెడ్‌ బెవరేజ్‌లను తీసుకోవద్దు. కోకో డ్రింక్‌, బీర్‌, విస్కీల వంటి వాటికి దూరంగా వుండాలి. హోటళ్ళలో సాస్‌లు, కూరలు చిక్కగా వుండటానికి గోధుమ పిండి కలుపుతారు. అందువల్ల బయట తినేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. పాల వల్ల అలర్జీ వుంటే బ్రెడ్‌, కేకులు, వెన్న, మీగడ వున్న ఉత్పత్తులన్నింటినీ వాడకపోవడం మంచిది. అలాగే ఐస్‌క్రీం, మిల్క్‌ చాకొలెట్‌, క్రీమ్‌ సాస్‌లను పూర్తిగా మానివేస్త్తే మంచిది.

చికిత్స :
వెంటనే ఉపశయనము కోసము :
ఎవిల్ ఇంజక్షన్‌ , బెట్నెసాల్ ఇంజక్షన్‌ , అడ్రినాలిన్‌ ఇంజక్షన్‌ వాడుతారు . తదుపరి అవే మాత్రల రూపములో 2-3 రోజులు వాడాలి.
దీర్ఘకాలిక ఎలర్గీ ఉన్నవారు :
ప్రతిరోజూ ఒక లీవో సిట్రజైన్‌ మాత్ర వేసుకుంటే ... ముందుజాగ్రత్తగా ఎలర్జీ తీవ్రత నుండి బయట పడవచ్చును.

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.