Wednesday, October 12, 2011

నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌),Oral Cancer


  • soruce : Andhraprabha News paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌),Oral Cancer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

శరీరంలో వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో మూడింటొక వంతు నోటి క్యాన్సర్‌ (ఓరల్‌ క్యాన్సర్‌) వస్తుంది. నోటిలో వచ్చే క్యాన్సరు వ్యాధి 50% వరకు 'నాలుక' 'పెదవుల'లో వస్తుంది. మిగతా శాతం నోటిలోపలి బుగ్గ లు (బక్కల్‌ మ్యూకోజా) మృదు అంగుటి భాగం (సాఫ్ట్‌పేలెట్‌) టాన్సిల్స్‌, నాలుక, క్రిం దనోటి భాగం, చిగుళ్ళు (గమ్స్‌) మొదలలైన నోటి భాగాలలో వస్తుంది.

కాలుతున్న చుట్ట భాగాన్ని (అడ్డచుట్ట) నోటిలో పెట్టుకొని పొగ త్రాగేవారిలోను, సిఫిలిస్‌ వ్యాధి గ్రస్తుల్లోను, అంగుటి భాగా నికి క్యాన్సరు వస్తుంది. అదే పనిగా కిళ్ళీలు జర్ధాకిళ్ళీలు బుగ్గన నిల్వ ఉంచుకొని ఉండే వారిలో బుగ్గ క్యాన్సరు వస్తుంది. పాన్‌ పరాగ్‌, పాన్‌మసాలా, గుట్కావంటి పొగాకు సంంబంధమయిన పొడులు చప్పరించే వారిలో చిగుళ్ళ క్యాన్సరు, గొంతుక్యాన్సరు, బుగ్గ క్యాన్సరు వచ్చే అవకాశం ఉంది. వీటి వాడకం వల్ల శరీరంలో యితరభాగాలు కూడా క్యాన్సరు వ్యాధికి గురికావచ్చు.

దవుడలోని పళ్ళు విరిగిపోయినా, అరిగి పోయినా అవి తరచుగా బుగ్గకు, నాలుకకు, పెదవులకు గుచ్చుకొని పుండుగా మారి ఆ పైన క్యాన్సరు వ్యాధిగా మారవచ్చు.

పళ్ళు లేనివారు ఉపయోగించే కట్టుడు పళ్ళు సరిగా కుదరక నోటిలోని సున్నిత భా గాల పై వత్తిడి తెచ్చే పరోస్థితిలోను, వంకర పళ్ళు సరిచేసే విషయంలో నోటిలోని సున్ని త భాగాలు పుండ్లుగా మారి ఆ తర్వాత క్యాన్సరుగా మారే అవకాశం ఉంది.

నోటిలో వచ్చే 'సబ్‌- మ్యూకస్‌ఫైబ్రోసిస్‌', 'ల్యూకోప్లేకియా', 'లైకన్‌ ప్లాసస్‌', 'సిలిఫిలిస్‌' పంటి వ్యాధులను నిర్ల క్ష్యం చేసినా అవి క్యాన్సరుగా మారు తాయి.

త్వరగా తగ్గని నోటిలోని పుండ్లు, విపరీత మయిన నొప్పి, వాచిన లింపు గ్రంధులు, లాలాజలం అధికంగా ఊరడం, నోటి దుర్వాసన, నోరు తెరవలేని పరిస్థితిలో మూసుకు పోవడం వంటి లక్షణాల ద్వా రా క్యా న్సరు వ్యాధిని గుర్తించ వచ్చు.

వ్యాధి నిర్ధారణ ఆలస్యంగా జరగడం - వ్యాధి నిర్ధారణ లోపం వల్ల క్యాన్సరు వ్యాధి మురిదిపోతుంది. కనీసం ఆరు నెలల కొకసారి దంత వైద్య పరీ క్షలు చేయించుకొంటే యిలాంటి వాటిని యిట్టే పసిగట్టవచ్చు.

నోట్లో క్యాన్సర్‌

ఆయా వ్యక్తుల హౌదాలను బట్టి, సమా జంలో కొందరు సిగరెట్లు త్రాగితే, మరి కొందరు బీడీలు చుట్టలు త్రాగుతు న్నారు. వీటిల్లో ఏది త్రాగినా జరిగే నష్టం అతి ప్రమాదమయిందే.

పొగ పీల్చడంవల్ల, సిగరెట్లలో వాడే పొగాకులో వుండే 'నికోటిన్‌ పదార్థం' సరాసరి ఊపిరితిత్తులలోనికి పోయి, క్షయ వ్యాధిని కలుగజేస్తుంది. విపరీతంగా దగ్గడం, ఉమ్మ డం, బరువును కోల్పోవడం, బక్కచిక్కి పోవడం, జ్వర పీడితులు కావడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఇలాంటివారి వల్ల యింట్లో వారికే కాక వీరి ఉమ్మి తుంపరలు తాకిన ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమి స్తుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో- నది, సముద్ర తీరాలలో నివసించే ప్రజలు, శ్రామికులు చుట్టలు కాలుస్తారు. నిప్పు ఉన్న భాగాన్ని నోట్లో పెట్టుకొని 'గుప్పు'తారు ఈ అలవాటు వల్ల చుట్ట యొక్క నిప్పు వేడికి నోట్లోని సున్ని తమైన అంగుటి భాగం కమిలి పుండుగా మారి ఆ తర్వాత 'క్యాన్సర్‌'గా మారుతుంది. ప్రపంచ దేశాలలో 'చుట్టక్యాన్సర్‌'గా దీనికి పేరుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విధంగా ఆయా దేశాలలో అందరి నోళ్ళలోను నాను తున్నది. పొగత్రాగడం వల్ల వచ్చే నోటి క్యా న్సర్‌ వ్యాధి మన దేశంలో అధికంగా ఉంది. అలవాట్లలో ఏమాత్రం మార్పు రానుందున రాను-రాను యి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కేవలం 'పొగాకు' వల్ల వచ్చే జబ్బులతోనే దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా, మన దేశంలోని క్యాన్సర్‌ పీడితుల్లో మూడింట ఒక వంతు మంది నోటి క్యాన్స ర్‌తో బాధపడ్తున్నావారే!

అయితే, ఈ మధ్య పొగత్రాగడానికి ప్రత్యా మ్నాయంగా, నమలడానికి, ముక్కుతో పీల్చ డానికి అనువుగా ఎన్నో రకాల పొగాకు ఉత్పత్తులు విపణిలో లభ్యమవుతున్నాయి. 'స్మోకలెస్‌(smokeless) టొబాకొ'గా వీటికిపేరుంది. అంటే పొగతో పనిలేని తంబాకు అన్న మాట! దీనికి కూడా అన్ని రకాల ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అయితే పొగాకు పీల్చడం కంటే, నమలడం వల్ల మరెన్నో అనర్ధాలు ఉన్నట్లు పరిశోధకుల అంచనా, పొగాకును నమలడం ద్వారాను, ముక్కుపొడి రూపంలో పీల్చడం ద్వారాను, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కో మనిషికి సంవత్సరానికి 1.8 కిలోల పొగాకు ఖర్చవుతున్నట్లు తేలింది.

'స్మోకలెస్‌ టుబాకొ' లో 'బెంజో'పైరిన్‌', పోటోనియం-210, కొన్ని రకాల 'నైట్రోజమైన్‌' అనే క్యాన్సర్‌ను కలిగించే రసాయనిక పదార్థాలు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటివల్ల గొంతుక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదముంది. దీనితో పాటు 25 సంవత్సరాలు పరుసగా ఈ పొగాకు ఉత్పత్తులను వాడితే, పదమూడు వంతులు అధికంగా 'చిగుళ్ళ క్యాన్సర్‌', 'బుగ్గ క్యాన్సర్‌' వస్తుందని ధృవీకరించబడింది. మన దేశంలో పుగాకును కిళ్ళీలలో - తమలపాకుతో, వక్కలు సున్నం కలిపి వాడతారు. ఇవన్నీ నోటి క్యాన్సర్‌ను కలిగించడానికి తోడ్పడతాయి. పొగాకు నమిలేవారిలో క్యాన్సరుగా మారే 'లూకాప్లేకియా (తెల్లమచ్చ) అనే వ్యాధి నోటిలోని అతి సున్నిత భాగమైన బుగ్గకు వస్తుంది. పొగాకులో అధికంగా ఉండే 'నికోటిన్‌' నోటిలోని లాలాజలంతో కలిసి, నోటి మ్యూకస్‌ పొర- దారా గ్రహింపబడి సరిసరి రక్త ప్రవాహంతో కలియడం వల్ల దీని ప్రభావానికి రక్తపోటు కూడా వస్తున్నట్లు తేలింది. అందుచేత పొగత్రాగడానికి ప్రత్యామ్నాయంగా, స్మోకలెస్‌ టుబాకోను వాడడం వల్ల మరిన్ని అనర్ధాలు సంభవిస్తున్నాయన్నది నగ్నసత్యం. పొగత్రాగే అలవాటును మానుకోవాలే తప్ప దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేనే లేదు.
  • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.