సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అయితే రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయులను పెంచుకోవటం ద్వారా ఈ ముప్పులను బాగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. రక్తంలో హెచ్‌డీఎల్ స్థాయి ఓ 5 ఎంజీ/డీఎల్ పెరిగినా గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఆసుపత్రి పాలు కావటమనేది 4% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మరోవైపు ఈ హెచ్‌డీఎల్- 6.5 ఎంజీ/డీఎల్ తగ్గితే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే ముప్పు 11% పెరుగుతోందని వెల్లడైంది. అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుకోవటం అత్యుత్తమం, కనీసం అది తగ్గకుండా చూసుకోవటం అత్యవసరం. సాధారణంగా హెచ్‌డీఎల్ స్థాయి 40 ఎంజీ/డీఎల్ కన్నా ఎంత ఎక్కువుంటే అంత మంచిది. (ఈ విలువ ప్రయోగశాల, పరీక్షా విధానాలను బట్టి కాస్త అటూఇటూగా మారచ్చు) అయితే మధుమేహుల్లో చాలామందికి ఇది మామూలు స్థాయి కన్నా తక్కువగానే ఉంటోంది. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నా వాటి సమర్థత ఏపాటిదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదం చేస్తాయి. ఇవే జాగ్రత్తలు.. గుండె జబ్బులు దరిజేరకుండానూ చూస్తాయి. కాబట్టి హెచ్‌డీఎల్ స్థాయులను పెంచుకోవటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరమని పరిశోధకులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.
కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?
టోటల్ కొలెస్టిరాల్ :
* 200 మి.గా% వరకు -- మంచిది .
* 200 - 239 %--కొంతవరకు రిష్క్ ,
* 240 - కంటే ఎక్కువ % -- హై రిష్క్ ,
LDL :
* 100 లోపు -- మంచిది ,
* 100-129 --- ఉండవచ్చును ,
* 130-159---కొంతవరకు రిష్క్ ,
* 160-- అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,
HDL :
* 50 మి.గ్రా% -- మంచిది ,
* 50- 35 -------కొద్దిక రిష్క్ ,
* 35 -- తక్కువ - హై రిష్క్ .... ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .
- =============================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.