Saturday, August 18, 2012

Unwanted Hair, Hypertricosis,అవాంఛిత రోమాలు,హైపర్‌ట్రైకోసిస్

    •  



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Unwanted Hair, Hypertricosis,అవాంఛిత రోమాలు,హైపర్‌ట్రైకోసిస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    • అవాంఛిత రోమాలు ఉంటే వాటిని తొలగించడం... శ్రమ అవుతుంది. తెల్లగా, నునుపుగా, పట్టుకుంటే జారిపోయేలా చర్మం ఉండాలనుకుంటారు అమ్మాయిలు. తలపై తప్ప శరీరంపై ఎక్కడ రోమం కనిపించినా బాధే. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్... అంటూ రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకునే పనిలో పడుతున్నారు. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎందుకు వస్తాయి? వాటిని తొలగించడానికి అతివలు పడరాని పాట్లు ఎందుకు పడతారు. ఆ రోమాలను కొండంత శ్రమతో కాకుండా... తేలిగ్గా వదిలించుకోడం ఎలా...?


    •         అవాంఛిత రోమాలు పెరగడం.. అందానికి సంబంధించిన సమస్యే... కానీ దానికి కారణాలు మాత్రం ఆరోగ్యపరంగా ఉంటాయి. హార్మోన్ల అసమతూకం మొదలు.. మరికొన్ని సమస్యలు అవాంఛిత రోమాలకు దారితీస్తాయి. అందుకే ముందు అసలైన కారణం గుర్తించి, చికిత్స తీసుకోవాలి.
      అన్నివయసుల వారినీ ఇబ్బందిపెట్టే సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి. కాళ్లూ, చేతులపైనే కాదు, పైపెదవిపైనా, చెంపల దగ్గరా.. ఇలా ఉండకూడని చోట రోమాలు వస్తాయి. దాన్నే హిర్సుటిజం అంటారు. కొందరిలో ఈ సమస్య తక్కువగా ఉంటే, మరికొందరిలో మగవాళ్లకు పెరిగినట్లుగా గడ్డాలూ, మీసాలూ కూడా వస్తాయి.

       కారణాలు..
      * స్త్రీలల్లో సాధారణంగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు ఎక్కువగా, యాండ్రోజెన్లు తక్కువగా స్రవిస్తాయి. ఈ యాండ్రోజన్లు ఎడ్రినల్‌ గ్రంథి, అండాశయాల నుంచీ తయారైతే, వాటిని పిట్యూటరీ గ్రంథి అదుపు చేస్తుంటుంది. ఆ యాండ్రోజన్ హార్మోను రక్తప్రసరణ ద్వారా కణజాలానికి చేరినప్పుడు శక్తిమంతమైన టెస్టోస్టెరాన్‌గా మారుతుంది. దాంతో రోమాలూ, సెబేషియస్‌ గ్రంథులూ ప్రభావితమవుతాయి. కొందరిలో అవాంఛిత రోమాలు పెరగడానికి యాండ్రోజెన్లు ఎక్కువగా తయారు కావడమే ముఖ్య కారణం. అలాగే మరికొన్ని కారణాలూ ఉన్నాయి..

      * శరీరతత్వం కూడా ఈ సమస్యను పెంచుతుంది. ఏ జబ్బూ లేకుండానే అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి కొందరికి. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.

      * మరో సర్వసాధారణమైన కారణం పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌). అండాశయాల్లో సిస్టులు ఉండటం, హార్మోన్ల అసమతూకం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌తో అవాంఛిత రోమాలు వస్తాయి. దాంతోపాటూ మొటిమలూ, నెలసరి సక్రమంగా రాకపోవడం, విపరీతంగా బరువు పెరగడం, సంతాన సాఫల్యసామర్థ్యం తగ్గడం లాంటివీ ఉంటాయి.

      * అండాశయాల్లో కొన్నిరకాల ట్యూమర్లు ఉన్నప్పుడూ పురుష హార్మోను ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడూ అవాంఛితాల సమస్య ఉంటుంది.

      * ఎడ్రినల్‌ గ్రంథి నుంచి సహజంగా వచ్చే యాండ్రోజెన్లు అవసరానికి మించి కొన్నిసార్లు ఎక్కువగా తయారవుతుంటాయి అలాంటప్పుడు అవాంఛిత రోమాలతోపాటూ విపరీతంగా బరువు పెరగడం, ముఖం ఉబ్బినట్లు కనిపించడం, మెడ వెనుక కొవ్వు పేరుకుని మూపురంలా కనిపించడం (బుల్‌నెక్‌).. లాంటి లక్షణాలూ ఉంటాయి.

      * కొందరికి పుట్టుకతోనే ఎడ్రినల్‌ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటుంది. యాండ్రోజెన్లు ఎక్కువగా తయారవుతాయి. ఆ ప్రభావం వల్ల శిశువు పుట్టే సమయానికి బాహ్య జననేంద్రియాలు సరైన విధంగా ఏర్పడకపోవచ్చు. దాంతో ఆ బిడ్డ అమ్మాయా, అబ్బాయా అని స్పష్టంగా తెలియదు.

      * కొన్నిరకాల మందులతోనూ అవాంఛిత రోమాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్‌ ఉన్నప్పుడూ, వక్షోజాల్లో ఫైబ్రోఎడినోసిస్‌ అనే సమస్య ఉన్నప్పుడూ డానజాల్‌ అనే మందును వాడతారు. దీన్ని దీర్ఘకాలికంగా వాడినప్పుడు పురుషుల్లో ఉన్నట్లుగా రోమాలూ పెరుగుతాయి. మూర్ఛకు వాడే కొన్ని రకాల మందులూ, యాంటాసిడ్ల వల్ల కూడా అవాంఛిత రోమాలు వస్తాయని అధ్యయనకర్తలు గుర్తించారు. అలాగే థైరాయిడ్‌, క్రోమోజోమ్‌ల లోపాలున్నా, పిట్యూటరీ గ్రంథిలో ట్యూమర్‌ ఉన్నవారికి కూడా ఈ పరిస్థితి రావచ్చు.

      * కొన్ని కారణాలకు ప్రొజెస్టరాన్‌ హార్మోను వాడటం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

      * మెనోపాజ్‌ తరవాత గడ్డం, పైపెదవిమీద రోమాలు పెరుగుతున్నాయని, అదే సమయంలో తలమీద జుట్టు వూడిపోతోందని బాధపడుతుంటారు చాలామంది స్త్రీలు. ఆ దశలో అండాశయాల పనితీరు తగ్గుతుంది. దాంతో ఈస్ట్రోజెన్‌, యాండ్రోజెన్‌ సమతూకం లోపించి పురుష లక్షణాలు మొదలవుతాయి.

      * గర్బిణుల్లో కూడా కొన్నిసార్లు ఈ సమస్య కనిపిస్తుంది. ఆ సమయంలో అండాశయాలు పెద్దవై, వాటిలో పురుష హార్మోను కణాలు పెరగడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయితే ప్రసవం తరవాత ఆ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.

      సమస్య మూడు దశల్లో..
      అవాంఛిత రోమాల సమస్య రెండురకాల్లో కనిపిస్తుంది. రోమాలు మరీ సన్నగా, కనిపించీ కనిపించకుండా ఉంటాయి (వెల్లస్‌ హెయిర్‌). హార్మోన్లలో జరిగే మార్పుల ప్రభావం వీటిపై ఉండదు. రెండో రకం చాలా మందంగా, నల్లగా ఉంటాయి (టెర్మినల్‌ హెయిర్‌). హార్మోన్లలో మార్పులు జరిగేకొద్దీ ఇవీ పెరుగుతాయి.. ఏ రకమైనా.. సమస్య మూడు దశల్లో బాధిస్తుంది.

      *1 చుబుకం, పైపెదవి మీదా రోమాలు కొద్దిగా కనిపిస్తాయి.
      *2 చెంపలూ,వక్షోజాల మధ్యలో, చనుమొనల చుట్టూ, పొట్టమీదా, వీపూ, పిరుదుల మధ్యలో, తొడల లోపలివైపు కూడా అవాంఛిత రోమాలుంటాయి.
      *3 అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడంతోపాటూ, పురుష లక్షణాలు కూడా మొదలవుతాయి. గొంతు బొంగురుగా మారడం, వక్షోజాలు క్షీణించిపోవడం, నెలసరి ఆగిపోవడం, బాహ్యజననేంద్రియాల్లోనూ మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే స్త్రీ పురుషుడిగా మారిపోతోందనడానికి సంకేతం.

      గుర్తించే పరీక్షలుంటాయి..
      సమస్య ఏ దశలో ఉన్నా.. అవాంఛిత రోమాలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు ముందు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. తద్వారా అండాశయాలోని ఎడ్రినల్‌ గ్రంథిని పనితీరును తెలుసుకుంటారు. అండాశయాల్లో పీసీఓఏస్‌ ఉన్నా, కణుతులున్నా ఈ స్కాన్‌లో తెలుస్తుంది. ఒకవేళ ఎడ్రినల్‌, పిట్యూటరీ గ్రంథుల్లో ట్యూమర్లు ఉన్నట్లు సందేహం కలిగితే అదనంగా సీటీస్కాన్‌, ఎం.ఆర్‌.ఐ. పరీక్షలతో నిర్థరిస్తారు. అవాంఛిత రోమాలనేది హార్మోన్లకు సంబంధించిన సమస్య కనుక పిట్యూటరీ, ఎడ్రినల్‌, అండాశయాల నుంచి వచ్చే హార్మోన్లను పరీక్ష చేస్తారు. ఈ పరీక్షల్లో టెస్టోస్ట్టెరాన్‌, డీహెచ్‌ఈఏఎస్‌, 17 ఓహెచ్‌పీ, ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌ లాంటివి ఉంటాయి.

      ఆలస్యంగా ఫలితం..
      ఇలాంటి సమస్య ఉన్నప్పుడు స్త్రీలు ఎంతగా కుంగిపోతారంటే.. ఏ చికిత్స తీసుకున్నా వెంటనే ఫలితం కనిపించాలనుకుంటారు. అయితే అవాంఛిత రోమాల విషయంలో వెంటనే చికిత్స తీసుకున్నా ఫలితం ఆలస్యంగా కనిపిస్తుంది. పైగా ఒక వెంట్రుక పెరిగి, వూడి, కొత్తది రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఏ మందు వాడినా దాదాపు సంవత్సరం లోపు ఫలితాలు కనిపించవు. ఒకవేళ పీసీఓఎస్‌ ఉంటే గనుక గర్భనిరోధక మాత్రలు, ప్రొజెస్టరాన్‌ లాంటివి ఇస్తారు. అండాశయాల పనిని మందగించేలా చేస్తారు. అదే ఎడ్రినల్‌ గ్రంథిపని తీరులో లోపం ఉంటే స్టెరాయిడ్లు సూచిస్తారు. వాటిల్లో ముఖ్యంగా పురుష హార్మోను యాండ్రోజెన్‌కి వ్యతిరేకంగా పనిచేసే యాంటీయాండ్రోజెన్లు వాడమంటారు. వైద్యులు సూచించే మందులతోపాటూ అందుబాటులో ఉన్న సౌందర్య చికిత్సలు కూడా చేయించుకోవచ్చు. బ్లీచింగ్‌, వ్యాక్సింగ్‌, హెయిర్‌ రిమూవింగ్‌ క్రీంలు వాడటం లాంటివి ఆ కోవలోకే వస్తాయి. అలా కాకుండా కొందరు సొంతంగా ప్లకింగ్‌, షేవింగ్‌ లాంటివి చేసుకుంటారు. కానీ వాటివల్ల రోమాలు ఇంకా బలంగా పెరుగుతాయి. మరింత నల్లగానూ కనిపిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే సమస్య ఇంకా పెరుగుతుంది. ఒకవేళ శాశ్వత చికిత్సను కోరుకునేవారు ఎలక్ట్రాలిసిస్‌, లేజర్‌ లాంటివి ఎంచుకోవచ్చు. వీటిని కూడా దశలవారీగా చేయాల్సి ఉంటుంది. చికిత్స పూర్తికావడానికి ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుందని మరవకూడదు.

    కారణాలు :
    • హార్మోన్ల అసమతుల్యం - స్ర్తీలలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ముఖం మీద నూనూగు వెంట్రుకలలా కనిపిస్తుంటాయి. మెనోపాజ్ దశలో శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ నిల్వలు తగ్గిపోవడంతో శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్లోన్ల అసమతుల్యం ఏర్పడి రోమాలు దట్టంగా రావడం మొదలవుతుంది. వీరిలో పురుష హార్మోన్లు వృద్ధి చెందడం ఈ సమస్యకు ప్రధాన కారణం.

    జీవనశైలి
    • క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు పాటించకపోవడం వల్ల చాలామంది ఆరోగ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. అంతర్గతంగా కనిపించకుండా వచ్చే మార్పులు కొన్నైతే, బహిరంగంగా ఇబ్బందిపెట్టే సమస్యలు మరికొన్ని. సవ్యంగా లేని జీవనశైలి, ఊబకాయం... ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. ఈ విషయాలేవీ తెలియకపోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. కొందరు జీవితంపై ఆశ వదులుకుంటున్నారు.

    హిర్సుటిజం, హెపర్‌ట్రైకోసిస్... కారణాలు :
    • మహిళల శరీరంపై సాధారణంగా ఉండాల్సిన వెంట్రుకలకు బదులు అవాంఛితమైన రోమాలు విపరీతంగా, పురుషుల్లాగా ఉండటాన్ని హిర్సుటిజం అంటారు. హైపర్‌ట్రైకోసిస్ ఉన్న సందర్భాల్లో కూడా మహిళల్లో రోమాలు ఇలాగే ఉంటాయి. అయితే హిర్సుటిజానికీ, హైపర్ ట్రైకోసిస్‌కు తేడా ఉంది. హిర్సుటిజం ఉన్న కేసుల్లో పురుషుల్లో లాగా వెంట్రుకలు ఉంటే... హైపర్ ట్రైకోసిస్ కేసుల్లో అవాంఛిత రోమాలు ఉన్నా అవి పురుషుల్లో మాదిరిగా ఉండవు. హిర్సుటిజంలో హార్మోన్ల లోపాల వల్ల వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి. హైపర్ ట్రైకోసిస్ మాత్రం జన్యుపరమైన కారణాలతో వస్తుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరికైనా ఉంటే హైపర్ ట్రైకోసిస్ రావడం చాలా సాధారణం.
    • పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ :
    హిర్సుటిజానికి ఒక ప్రధాన కారణం పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్). అంటే... ఓవరీ (అండాశయం)లో నీటితిత్తులు ఉండటం అన్నమాట. హిర్సుటిజంతో బాధపడే మహిళలను పరిశీలించినప్పుడు వాళ్లలో దాదాపు 70 శాతం మందికి పీసీవోఎస్ ఉన్నట్లు తేలింది. పీసీఓఎస్ ఉన్న మహిళల్లోని అండాశయాల్లో పురుషుల్లో ఉండే హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా స్రవిస్తుంది. దాంతో మహిళలకు వెంట్రుకలు విపరీతంగా పెరగడంతో పాటు, మొటిమలు రావడం కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ముఖం మీద ఎక్కువగా వస్తాయి. సాధారణంగా యువతుల్లో యుక్తవయసులో మొటిమలు రావడం సహజమే. అయితే ఇవి మామూలుగా మొటిమలకు తీసుకునే చికిత్సతో తగ్గనప్పుడు వారిలో పీసీఓఎస్ ఉందేమో అని అనుమానించాలి. స్థూలకాయం ఉన్న చాలామంది మహిళల్లో మెడ దగ్గర, బాహుమూలల్లో చర్మం బాగా నల్లబడి, కాస్త ముడతలు పడి, దళసరిగా మారుతుంది. ఈ కండిషన్‌ను ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. మహిళల్లో రక్తంలోని చక్కెర పాళ్లను అదుపులో ఉంచడానికి అవసరమైన దాని కంటే మరింత ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతోందని భావించడానికి దీన్ని ఒక సూచనగా భావించాలి. అలాంటివారిని ఇన్సులిన్ రెసిస్టెంట్‌గా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినవారికి భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం (రిస్క్) ఉందని అనుమానించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    • నివారణ పద్దతులు :
    అవాంఛిత రోమాలను పూర్తిగా తొలగించి, మళ్లీ రాకుండా చేయడానికి లేజర్ చికిత్స, పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా హార్మోన్లు సవ్యంగా పనిచేయడానికి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, జీవనశైలిని మార్చుకుంటే సమస్య పూర్తిగా తీరిపోతుంది.

    • శాశ్వత పద్ధతులు
    అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించడానికి ముఖ్యమైన రెండు పద్ధతులున్నాయి. అవి ఎలక్ట్రాలిసిస్, లేజర్.

    ఎలక్ట్రాలిసిస్: ఈ చికిత్స నిపుణుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పిగ్మెంటేషన్ ఉన్నా ఈ పద్ధతి ద్వారా రోమాలను తొలగించవచ్చు. ముఖ్యంగా తెల్లని రోమాలను తొలగించడంలో ఈ పద్ధతి మేలైనది. అయితే ఈ పద్ధతిలో కూడా ముఖంపై మచ్చలు, గుంటలు పడే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సలో ఉపయోగించే నీడిల్స్ సురక్షితం కానివైతే ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది. కనుక ఈ పద్ధతులను ఉపయోగించే నిపుణులు కచ్చితమైన ప్రమాణాలను పాటించాలి.

    లేజర్: అవాంఛిత రోమాలకు ఈ పద్ధతి శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తుంది. కాంతి కిరణాల ఆధారంగా మల్టిపుల్ లేజర్స్‌తో హెయిర్‌ను తొలగిస్తారు.

    • తాత్కాలిక పద్ధతులు...
    అవాంఛిత రోమాలను తీసేయడానికి షేవింగ్, త్రెడింగ్, ప్లకింగ్, వ్యాక్సింగ్, బ్లీచింగ్... లాంటివి చేస్తుంటారు. ఈ పద్ధతులలో రోమాలను తొలగించిన చోట నొప్పి, దురద రావడం, స్వేదరంధ్రాలలో పస్ ఏర్పడం వంటివి ఎక్కువగా గమనిస్తుంటాం. కొందరిలో స్కిన్ పిగ్మెంటేషన్ కూడా రావచ్చు. ఇలాంటప్పుడు త్రెడ్డింగ్ చేస్తే పిగ్మెంటేషన్ ఇతరచోట్లకు కూడా వ్యాపించవచ్చు. అందుకని ఎలాంటి చర్మ సమస్యలు లేనప్పుడు మాత్రమే ఈ పద్ధతులను ఫాలో అవడం మంచిది.

    • హెయిర్ రిమూవల్ క్రీములు
    అవాంఛిత రోమాలు ఉన్న వారికి హెయిర్ రిమూవల్ క్రీములు సురక్షితమైనవి. అయితే ఈ క్రీములను వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా క్రీమ్‌ని అరచేయి వెనకభాగంలో రాసుకొని ఎలాంటి అలర్జీ లేదనిపిస్తే అప్పుడు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

    • షేవింగ్ - అపోహ...
    షేవింగ్ చేస్తే కేవలం చర్మంపై ఉన్న రోమం మాత్రమే కట్ అవుతుందని, ఆ రోమం మందం అవుతుందనే అపోహ ఉంది. అందుకే అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ మంచి ప్రక్రియ కాదని స్ర్తీలందరూ భావిస్తారు. షేవింగ్ ద్వారా కట్ అయిన హెయిర్ త్వరగా పెరగడం, మందంగా రావడం అనేది నిజం కాదు. షేవింగ్ చేసిన రెండు రోజుల తర్వాత కనిపించే హెయిర్ స్పాటికల్స్ చూసి ఇంకా ఎక్కువ రోమాలు
    వస్తున్నాయని భయపడతారు. షేవింగ్ సరైన విధంగా చేయకపోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. ఈ ఫాలికల్‌లో నుంచి బయటకు వచ్చిన వెంట్రుకను తీసేయడానికి మళ్లీ షేవ్ చేయడంతో అప్పటికే దెబ్బతిన్న చర్మం వద్ద రోమం మొదలయ్యే భాగం (హెయిర్ బంప్) దురద పెట్టడం, రంగు మారడం జరుగుతుంది.

    • ===================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Mustaches in women,Hirsutism,ఆడవారికి మీసాలు,హిర్సుటిజం



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Mustaches in women,Hirsutism,ఆడవారికి మీసాలు,హిర్సుటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    ఎక్కడైనా సిగ్గు పడొచ్చుగానీ వైద్యం దగ్గరా, వైద్యుల ముందరా సిగ్గుకు తావులేదు. జబ్బును ఒప్పుకోవటానికీ, బాధలు చెప్పుకోవటానికీ బిడియపడుతూ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చెయ్యటం.. చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే అవుతుంది. అది నోటి దుర్వాసన కావచ్చు.. జననాంగ దురద కావచ్చు.. వీటి గురించి బిడియపడకుండా వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా ప్రమాదకరమైనవి కాగా మరికొన్ని మనిషిని సామాజికంగా కూడా అందరికీ దూరం చేసేస్తాయి. అందుకే మనలో చాలామంది అసలు వైద్యులను కలిసేందుకే సిగ్గుపడుతుండే అతి సాధారణమైన, కీలకమైన సమస్యలు కొన్నింటి్లో ... ఆడవారికి మీసాలు :


    అవాంఛిత రోమాలు ఉంటే వాటిని తొలగించడం... శ్రమ అవుతుంది. తెల్లగా, నునుపుగా, పట్టుకుంటే జారిపోయేలా చర్మం ఉండాలనుకుంటారు అమ్మాయిలు. తలపై తప్ప శరీరంపై ఎక్కడ రోమం కనిపించినా బాధే. హెయిర్ రిమూవల్ క్రీములు, త్రెడింగ్, వ్యాక్సింగ్, ప్లకింగ్, లేజర్... అంటూ రకరకాల పద్ధతుల ద్వారా వాటిని తొలగించుకునే పనిలో పడుతున్నారు. అసలు అమ్మాయిల్లో అవాంఛిత రోమాల సమస్య ఎందుకు వస్తాయి? వాటిని తొలగించడానికి అతివలు పడరాని పాట్లు ఎందుకు పడతారు. ఆ రోమాలను కొండంత శ్రమతో కాకుండా... తేలిగ్గా వదిలించుకోడం ఎలా...?


    కొందరు స్త్రీలకు ఉన్నట్టుండి పురుషుల మాదిరిగా ముఖం మీద, పైపెదవి మీద, ఒంటి మీద రోమాలు పెరగటం ఆరంభమవుతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలన్నా, అద్దంలో చూసుకోవాలన్నా బిడియపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారేగానీ వైద్యులను సంప్రదించేందుకు మాత్రం వెనకాడుతుంటారు. కొందరైతే షేవింగ్‌ వంటి వాటిని ఆశ్రయిస్తూ, పైకి కనబడకుండా ఉండేందుకు క్రీములు రాస్కుంటుంటారు. కానీ ఇలా వెంట్రుకలు పెరుగుతున్నాయని గమనించిన వెంటనే, సిగ్గు పక్కనబెట్టి వెంటనే వైద్యులను కలవటం అవసరం. ఎందుకంటే స్త్రీలలో మీసాలు, గడ్డాలు పెరగటాన్ని 'హిర్సుటిజం' అంటారు, ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక సంకేతంలాంటిది. చాలామంది ఆడపిల్లల్లో అండాశయాల మీద నీటి తిత్తులు వచ్చి (పీసీఓఎస్‌), హార్మోన్లు అస్తవ్యస్తమై, దాని కారణంగా ఇలా వెంట్రుకల పెరుగుదల మొదలవ్వచ్చు. ఈ సమస్య ఊబకాయుల్లో మరీ ఎక్కువ. అలాగే శరీరంలో కీలక హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్‌, పిట్యూటరీ, థైరాయిడ్‌ వంటి గ్రంథుల మీద కణుతులు, గడ్డలు పెరిగి.. హార్మోన్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు, ముఖ్యంగా పురుష హార్మోన్ల స్థాయులు పెరిగినప్పుడు ఈ బెడద మొదలవ్వచ్చు. ఇదే కాకుండా ఫిట్స్‌ వంటి కొన్ని రుగ్మతలకు వాడే మందుల వల్ల, స్టిరాయిడ్స్‌ వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి బిడియం వీడి వైద్యులను కలిస్తే మూల కారణమేమిటో అన్వేషించి, తగిన చికిత్స అందిస్తారు.
    • ====================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Post-delivery infections,ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Post-delivery infections,ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    -చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

    మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటారు. ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నె న్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్‌ డిశ్చార్జ్‌ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.

    • ఇన్‌ఫెక్షన్‌ల నివారణ, చికిత్సలు...
    మహిళల్లో కాన్పు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ల నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గర్బం ధరించినప్పుడు రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్లు రక్తం తక్కువగా ఉన్నవారికి, బిపి ఉన్న వారికి అవసరమైన చికిత్సలు చేస్తారు. ప్రసవానికి ముందు పళ్లలో, చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, ట్రాన్సిల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకో వాలి. బిపి, షుగర్‌, టిబి, మలేరియా, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. డెలివరీ సమయంలో వాటర్‌ లీక్‌ అవుతుందని తెలిస్తే డాక్టర్లు ముందే ట్రీట్‌మెంట్‌చేస్తారు.

    -గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్‌, పల్స్‌ చెకప్‌, బిపి, లీవర్‌, లంగ్స్‌ చెకప్‌ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్‌, సర్విక్స్‌ నుంచి యూరిన్‌, బ్లడ్‌ టోటల్‌ కౌంట్‌, డిఫరెన్షియల్‌ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్‌ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.

    ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్‌ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్‌ మందులను వాడాలి. స్టెరైల్‌ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.

    • యూరినరీ సమస్యలు...
    -కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవాలి. ఈ మహిళలు మంచినీటిని బాగా తాగాలి. ఇటువంటి వారు మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వీరికి మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావచ్చు. యూరిన్‌ బ్లాడర్‌లో వాపు కూడా రావచ్చు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి ఓవర్‌ ఫ్లో, వెజినల్‌ డ్యామేజీ కారణం కావచ్చు. దగ్గినప్పుడు నొప్పి రావచ్చు. కొన్నిసార్లు యూరిన్‌ ఔట్‌పుట్‌ తక్కువగా ఉండవచ్చు.

    • బ్రెస్ట్‌ సమస్యలు...
    ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి. బ్రెస్ట్‌ సమస్యల్లో అక్యూర్డ్‌ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్‌ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే రిట్రాచ్‌ నిప్పల్‌, క్రాక్‌ నిప్పల్‌ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. కొందరు మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది. ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్‌ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్‌ ఉంటుంది. బిపి ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్‌ సమస్యలు ఏర్పడతాయి.

    పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్‌ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.

    • సబ్‌ ఇన్‌వల్యూషన్‌...
    డెలివరీ తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవ డాన్ని సబ్‌ ఇన్‌వల్యూషన్‌ అంటారు. ఇటువంటి వారికి బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్‌ రంగు మారి వాసనరావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్‌ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి ఏర్పడుతుంది. యుటెరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది.

    • రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...
    కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

    - డాక్టర్‌ . పద్మావతి ,గైనకాలజిస్ట్‌,గాయత్రి నర్సింగ్‌ హోం ,రాజీవ్‌ నగర్‌ క్రాస్‌రోడ్‌ ,హైదరాబాద్‌.

    • ====================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Friday, August 17, 2012

    Puerperal mastitis ,బాలింత రొమ్ములో సలపరింత,పర్పురల్‌ మాస్త్టెటిస్



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Puerperal mastitis ,బాలింత రొమ్ములో సలపరింత,పర్పురల్‌ మాస్త్టెటిస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    ఆడపిల్ల యవ్వన దశకు చేరుకునేసరికి స్తనాలు పెరగడం జరుగుతుంది. బహిష్టులు ఆరంభమైన 2, 3 సంవత్సరాలు ఇది జరుగుతుంది. చనుమొనల నుంచి క్షీర వాహికలు శాఖోపశాఖలుగా విస్తరించి, కొవ్వులో నిక్షిప్తమై వుంటాయి. ప్రసవానికి 2, 3 నెలల ముందు స్తనాలలో పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోను స్థాయులు తగ్గిపోతాయి. దానితో మెదడులోని హైపోథాలమస్‌, తన అడుగు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథిని 'ప్రోలాక్టిన్‌' హార్మోను ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను స్తనాలలో పాల ఉత్పత్తికి దోహదపడుతుంది. కాన్పు అయిన తరవాత మొదటి రోజులలో లభించే తల్లిపాలలో ఆరోగ్య రక్షకమైన 'యాంటీబాడీస్‌' బిడ్డకు లభిస్తాయి.

    కాన్పయిన తరవాత శిశువు పాలు చీకడం మొదలు పెట్టిన కొన్ని సెకండ్లలోనే పాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ సంఘటనలో హైపోధెలామస్‌ పాత్ర అనల్పం!

    పాలిచ్చే తల్లులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య స్తనాలలో క్షీరవాహికలు ఇన్ఫెక్షన్‌కు గురికావడం. దీనినే 'మాస్త్టెటిస్‌' అని వ్యవహరిస్తారు. పాలు తాగేసమయంలో బిడ్డ నోటిలోని సూక్ష్మ జీవుల ద్వారా తల్లికి సంక్రమించే అతి సామాన్యమైన వ్యాధి ఇది. బాధాకరమైన వ్యాధి. స్తనాలు వాచి ఎర్రబారి వుంటాయి. గట్టి బడతాయి. చలితో జ్వరం కూడా రావచ్చు.

    బాధగా వున్నది గదా అని పాలివ్వడం మానడం మాత్రం మంచిది గాదు. ముందుగా ఇన్ఫెక్షన్‌లేని స్థనంలోని పాలివ్వటం ఉత్తమం. ఆకలి మూలకంగా బిడ్డ

    ఆ స్తనంలోని పాలు గట్టిగా ప్రయత్నించి తాగడం జరుగుతుంది. వాపు వున్న స్తనంలోని పాలు బిడ్డ తాగాల్సి వస్తే పంపుతో పాలు తీయడం మంచిదే.

    ఇన్ఫెక్షన్‌ తగ్గనట్లయితే గడ్డ ఏర్పడుతుంది. గడ్డలో చీము చేరి, అది మందుల ద్వారా తగ్గనట్లయితే ఆ ప్రాంతంలో గంటు పెట్టి చీము బయటకు

    వచ్చెయ్యటానికి వీలు కల్పించవలసి వుంటుంది.ం

    మరికొన్ని బ్రెస్ట్‌ సమస్యలు...
    ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను

    సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు

    ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి

    నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.

    బ్రెస్ట్‌ సమస్యల్లో అక్యూర్డ్‌ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్‌ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా

    ఏర్పడే రిట్రాచ్‌ నిప్పల్‌, క్రాక్‌ నిప్పల్‌ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. కొందరు

    మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది.

    -ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్‌ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్‌ ఉంటుంది. బిపి

    ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్‌ సమస్యలు ఏర్పడతాయి. పాలు

    రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్‌ చేయాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య

    ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం

    తెలుసుకోవాలి. కొందరు డాక్టర్లు ఆక్షిటోసిన్‌ ఇంజక్షను ఇవ్వడము వలన పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుందంటారు. ఆయుర్వేదములో Satavari preparations i.e.. tab. GALACAL , cap,LACTARE వంటివి వాడవచ్చును.

    • ===================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Wednesday, August 15, 2012

    కోపము అవగాహం , Angry and awareness



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కోపము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    షడ్గుణాలలో ఒకటైన క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం... మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, మరియు చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. కోపం అన్నది ఒక మానసిక ఉద్రేక స్థితి . అసలు మనము కోపం గా ఉన్నామని మనకి మొదట్లో తెలియదు . ఎదుటవారికి ... అంటే ఆ కోపాన్ని , దానివల్ల వచ్చే స్థితిని చూసి అనుభవించేవారికి మొదట తెలుస్తుంది . తను అన్నది కాదంటే బాబుకి కోపం , ఇలా ఉండకూడదు .. జాగ్రత్త అంటే పాపకి కోపం , భావాలు వ్యతిరిక్తమైనపుడు భార్యా భర్త ల మధ్య కోపం , చిన్నవాళ్ళు తమ మాట వినలేదని పెద్దవాళ్ళలో కోపము .తనని పట్టించుకోలేదని పెద్దవాళ్ళలో కోపము , తన నిస్సహాయితని చెప్పుకోలేక బలహీనుని కోపం ... ఇలా అందరి లోనూ కోపం కనబడుతూ ఉంటుంది .

    • తన కోపమె తన శత్రువు

    కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు కెరోటిడ్‌ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. తనకు అందరూ శతృవులవుతారు . కోపం ప్రకృతి పరమయిన సహజ ఉద్వేగం. ఇది జీవుల శరీర భౌతిక ధర్మం. నేలమీద మనుగడ సాగించే ప్రతిజీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చుకొనే పుడుతుంది. ఏ ఉద్వేగం కలిగినా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శరీరాన్ని సమాయత్త పరచే అడ్రినలిను, నారడ్రినలిను హార్మోనులు విడుదల అవుతాయి. దీనివల్ల బీపీ పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, కాళ్ళూ చేతులకు రక్త ప్రసరణ ఎక్కువ కావటం, ఊపిరి ఎక్కువగా తీసుకోవటం లాంటి లక్షణాలు కనపడతాయి. అలా కోపం వచ్చినా, భయం వచ్చినా శరీరంలో జరిగే మార్పులు, కనపడే లక్షణాలు ఒకేలా ఉంటాయి.

    మెదడులో భయం, కోపానికి సంబంధించిన కేంద్రాలు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నిరంతరం రావణ కాష్టంలా మండుతూనే(Fire)ఉంటాయి. అయితే వాటిని బయటకు పొక్కనీయకుండా బలవంతంగా ‘అణచి’(Inhibit)ఉంచే కేంద్రం కూడా ‘లింబిక్ లోబు’లోనే ఉంటుంది. ఈ కేంద్రాన్ని సడలిస్తే కోపం బయటకు వస్తుంది. ఎంత సడలింపు జరిగితే ఆ మేరకు కోపం వస్తుంది. అయితే ఈ సడలింపును అణచివేత కేంద్రం తనకు తానుగా ఇవ్వదు. మానవులలో సామాజిక ఆంశాలను పర్యవేక్షించే ‘ప్రీ ప్రాంటల్ కార్టెక్సు’ ఆదేశాలను అందుకొని దాని ప్రకారం సడలిస్తుంది. నిత్యం మనముందు జరిగే సామాజిక సంఘటనల ఆధారంగా ‘ప్రాంటల్ కార్టెక్సు’ (వ్యవహార సౌలభ్యం కోసం దీనే్న మనసు అనుకుందాం) స్పందిస్తుంది. కోపాన్ని తెప్పించే సంఘటన జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి సడలింపు ఆదేశాలను ఇస్తుంది. మనం ‘అదిపని’గా పట్టించుకోనంత వరకూ ఈ చర్య యథాలాపంగా జరిగిపోతుంది. కానీ మనం పట్టించుకుంటే మాత్రం సడలింపు ఆదేశాలు ఇవ్వటమా, వద్దా అనేది నూటికి నూరు పాళ్ళు‘మన’(Will power)అదుపులోకి తీసుకోవచ్చు.

    • కోపం అనచివేయడం :
    మనం సామాజిక జీవులం కాబట్టి పుట్టుకతో వచ్చే సహజ ఉద్వేగాలను అలాగే వదిలేస్తే కుదరదు. వాటిని సమాజ పరిస్థితులకు తగ్గట్టు అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపు పుట్టుకతో రాదు. ఎదిగే కొద్ది ఎవరికి వారు నేర్చుకోవాలి. దీనినే 'సామాజకీకరణ'(Socialization)అంటాము. అందులో భాగంగా సహజ ఉద్వేగం అయిన కోపాన్ని మన అదుపులో ఉంచే ‘ఓర్పు నేర్చుకోవాలి. వ్యక్తి పెరిగే వాతావరణం, పరిసరాలు, కుటుంబ కట్టుబాట్లు, చుట్టూ ఉన్న సమాజం దన్నుగా ఓర్పు రూపొందుతుంది. ఇది ఎంత బలంగా ఏర్పడితే కోపాన్ని అణచే కేంద్రానికి అంత బలం చేకూరుతుంది. కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికో కారణం కావాలి. మన చుట్టు ఉండే వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు కోపం రావటానికి కారణాలుగా ఉంటాయి. కారణ తీవ్రతను బట్టి విడుదల అయ్యే కోపం ఏ రూపంలో, ఎంత త్వరగా, ఎంత తీవ్రతతో ప్రదర్శించాలనే తేడాలు ఉంటాయి. సంఘటన పట్ల అవగాహన, దాన్ని అర్థం చేసుకునే తీరు, అలవర్చుకున్న ‘ఓర్పు’ తదితర అంశాలు దీన్ని నిర్ణయిస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే నిరంతరం రగులుతూ ఉండే కోపాన్ని బయటకు రానివ్వటమా, వద్దా అనేది మన మనసులో ఉన్న ‘అణచివేత-విడుదల’ బలా బలాలపై ఆధారపడి ఉంటుంది. కోపం రావటం అంటూ జరిగితే అటు పూర్తిగా జంతు ప్రవర్తన అయిన కొట్లాట నుండి ఇటు అత్యంత నాగరికమయిన సహాయ నిరాకరణ వరకూ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు.

    మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల (ప్రాణాపాయం, మనుగడ) కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, తదితర అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపంపై ఉన్న అణచివేత వైదొలుగుతుంది. వచ్చే కోపాన్ని వ్యక్తీకరించటంలో కూడా ఇదే వైవిధ్యం కనపడుతుంది. మిగతా జీవులు పోరాటం, పలాయనం అనే ఆదిమ పద్ధతుల్లో మాత్రమే కోపాన్ని వ్యక్తీకరిస్తాయి. మనుషులు అరవటం, తిట్టటం, అవమాన పర్చటం, చెయ్యి చేసుకోవడం, దాడి చేయడం, వస్తువులు పగలగొట్టటం లాంటి ‘చురుకు కోపపు’(Active Aggression)రూఫాలతో పాటు, మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగటం, సహాయ నిరాకరణ లాంటి ‘మెతక కోపపు’(Passive Aggression)రూఫాలలో కూడా చూపుతారు.


    • కోపాన్ని తగ్గించుకోగలమా?

    ప్రతి వ్యక్తికీ ఏదో ఒకసందర్భంలో కోపం, ఉద్రేకం, ఆవేశం రాకుండా ఉండవు. కోపం వస్తే మనం దానిని ఏవిధంగా వ్యక్తం చేస్తామనే విష యంలో మనుష్యుల మధ్య తేడాలుంటాయి. కొంతమంది తాము కోపిష్టులమనీ, తమకు టెంపర్‌ ఎక్కువనీ చెప్పుకుంటారు. సాధారణంగా ఈ రకం మనుష్యులు తమ కోపాన్ని ఇంట్లో భార్య మీద, పిల్లల మీద చూపుతుంటారు. కానీ, తమ పైఅధికారిపై చూపించరు. అంటే అధికారి వద్ద కోపాన్ని అణచుకుంటారు. దీని అర్థం మనకు కోపాన్ని నిగ్రహించుకోవాలనే ఆలోచన ఉంటే కొంతవరకైనా తప్పనిసరిగా నివారించుకో గలుగుతాము. కోపం వలన చాలా సందర్భాలలో నష్టాలు ఎదురైనప్పటికీ, కొంత మేరకు లాభాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కంఠస్వరం స్థాయి పెంచి, గట్టిగా గద్దిస్తూ చెబితే తప్ప పనులు కావు. అయితే ఇలా గద్దించడంపై నిగ్రహం లేకుండా ప్రవర్తిస్తే, పనులు జరుగవు సరికదా, నలుగురిలో మనం కోపిష్టులమనే చెడ్డపేరు కూడా వస్తుంది.

    కోపం రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని వ్యాధులకు గురైన వారు కూడా అకారణంగా కోపాన్ని ప్రదర్శిస్తుంటుం టారు.
    ఉదాహరణకు తలకు గాయమైన వారు, మూర్ఛవ్యాధి, కొన్ని రకాల మానసిక వ్యాధులకు గురైన వారు అకారణంగా ఇతరులపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
    ప్రస్తుతం వ్యాధుల వలన కాకుండా, వ్యక్తిత్వంలో భాగంగా అతిగా కోపాన్ని ప్రదర్శించే వారి గురించి చర్చిద్దాం.
    మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి కోపం రావడం ఆధారపడి ఉంటుంది. కొంతమంది అతి త్వరగా కోపం ప్రదర్శించడం మనం చూస్తూ ఉంటాం.
    పెద్దవాళ్లు ప్రతి చిన్న విషయానికీ అరవడం, పిల్లలను కొట్టడం వంటిపనులు చేస్తుంటే, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పరిస్థితుల ప్రభావం వలన మనకు కోపం వచ్చిన ప్పుడు పక్కవారిపై అరుస్తాము. అంతే త్వరగా మర్చిపోతాం కూడా.
    కొంతమంది మాత్రం కోపం వస్తే బైటకు చెప్పలేక, లోలోపలే గంటల కొద్దీ ఆలోచించి, బాధపడి తమ ఆరోగ్యం పాడు చేసుకుంటారు.
    అంటే కోపాన్ని బైటకు వ్యక్తం చేసినప్పుడు పక్కవాళ్లకు, వ్యక్తం చేయకపోతే కోపం వచ్చిన వాళ్లకు బాధ కలుగుతుంది.
    కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మునులు, సాధువులు, రుషులకే సాధ్యమని అంటారు. మనం కోపాన్ని నిగ్రహించులేకపోయినప్పటికీ, దానిని వీలైనంత తక్కువస్థాయికి తగ్గించుకో వచ్చు. అప్పుడే కోపాన్ని సరైన పద్ధతిలో వ్యక్తం చేయడం సాధ్యమవుతుంది.
    ఈ విషయంలో మనం మారాలని అనుకున్నప్పుడు ముందుగా మనకు ఈ సమస్య ఉందని తెలుసుకోవాలి. తరువాత మారాలనే నిర్ణయం తీసుకోవాలి. కోపం కలుగడానికి పని వత్తిడి ఒక కారణమైతే, మన మాటకు ఎదుటివారు విలువ ఇవ్వడం లేదనే అంశం మరొక కారణం.
    కోపాన్ని నిగ్రహించుకోవాలనుకునే వారు ముందుగా రెండువారాల పాటు తమ ప్రవర్తనను తామే అధ్యయనం చేసుకోవాలి.
    ఏఏ సందర్భాలలో కోపం వస్తున్నదో సమీ క్షించుకోవాలి.
    మన ప్రవర్తన ఎలా ఉంటున్నది? దీని వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? అనే విషయాలను పరిశీలించాలి. వీటి ఆధారంగా మనలో మార్పు కోసం ఎటు వంటి ప్రయత్నాలు చేయాలో ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
    పని భారం ఎక్కువై తన పైఅధికారిపై కోపం వచ్చినప్పుడు దానిని వ్యక్తీకరించలేక, ఇంట్లో భార్యాపిల్లల మీద చూపుతూ, తనలో తాను తిట్టుకోవడమే తప్ప మరేమీ చేయలేని స్థితిలో పడటం కొంత మందిలో గమనిస్తుంటాము.
    వీరికి కోపం తెప్పించేవారిపై కాకుండా, దానిని భరించే వారిపై కోపాన్ని చూపడం అలవాటుగా మారుతుంది.
    ఇంకొంత మందిలో తనలో తాను మాట్లా డుకోవడం అలవాటు ఉంటుంది. వీరు కోపాన్ని వ్యక్తం చేయకుండా, కోపానికి కారణ మైన వారిని తమ మనస్సుల్లోనే తిట్టుకుంటూ ఉంటారు. తమతో ఏకీభ వించే వారితో చర్చిస్తుంటారు. దీని వలన కోపం స్థాయి పెరగడమే తప్ప దానిని తగ్గించుకోవడం సాధ్యం కాదు.
    ఇలా కోపంస్థాయి పెరుగుతున్నప్పుడే దానిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. తనలో తాను మాట్లాడుకోవడం (సెల్ఫ్‌ టాక్‌) ద్వారా ఒక దశ వరకూ మనం కోపాన్ని ఆపుకోగలం.

    • కోపాన్ని తగ్గించుకునే మార్గాలు :
    ప్రతి ఒక్కడూ ఇతర్లని సంస్కరించే పనిలో వుంటాడు. ఇతర్లకు నీతులు బోధిస్తూ వుంటాడు. మనిషి నిజానికి సంస్కరించాల్సింది సమాజాన్ని కాదు. వ్యక్తుల్ని కాదు. తనను తాను సంస్కరించుకోవాలి. తనను తాను అనుక్షణం పరిశీలించుకోవాలి. చిన్నప్పటినుంచీ మనకు తెలీకుండా సమాజం ద్వారా, కుటుంబం ద్వారా మనకు ఎన్నో లక్షణాలు అలవడి వుంటాయి. వాటిని బట్టే మనం నడుచుకుంటూ వుంటాం. మన ఆనందం, దుఃఖం వాటిని బట్టే వుంటాయి.
    అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మనల్ని మనం పరిశీలించుకుంటే ఏవి మంచివో ఏవి చెడ్డవో తెలిసి వస్తాయి. అపుడు ఏ లక్షణాల్ని మనం నిలుపుకోవాలో వేటిని మనం వదిలిపెట్టాలో తెలిసివస్తుంది. ఆ చైతన్యం కలిగితే మనం ఎదిగే అవకాశం వుంది. అప్పుడు మనం యింకొరిలాకాక మనం మనంగా వుండే వీలుంటుంది. ఉదాహరణ :
    ఆర్మీనియా దేశంలోగూర్జియేఫ్ అన్న తాత్వికుడు జన్మించాడు. గత శతాబ్దం ఏడో దశకంలో పుట్టి ఈ శతాబ్దం ఐదో దశకం దాకా జీవించాడు. పుస్తకాల ద్వారా కాక అనుభవాల నుండి జీవితాన్ని మలచుకోవడం గురించి ఆయన చెప్పాడు.
    జీవితంతో ఆయన ప్రయోగాలు చేశాడు. ఆయన పద్ధతులు మోటుగా వుండేవి. ఆయన స్వతంత్ర చింతనగలవాడు. స్వేచ్ఛగా పెరిగాడు. తండ్రి ఎంతో ప్రేమగా పెంచాడు. ఎన్నో విషయాలు నేర్పించాడు.
    గూర్జియేఫ్ తండ్రి మరణశయ్యపై వున్నపుడు కొడుకును దగ్గరకు పిలిచాడు. కొడుక్కి గొప్ప సలహాయిచ్చాడు. యిప్పటిదాకా ఏ తండ్రీ ఏ కొడుక్కీ అంత గొప్ప సలహా ఇచ్చి వుండడు. అప్పటికి గూర్జియేఫ్ వయసు తొమ్మిదేళ్ళు.
    తండ్రి ‘బాబూ! నిజానికి యిప్పుడు నేను చెప్పే మాటల్ని నువ్వు అర్థం చేసుకుంటావో లేదో నాకు తెలీదు. నీది చిన్నివయసు.
    ఐనా యిప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే యివి నా చివరిమాటలు. వీటిని జీవితాంతం గుర్తుపెట్టుకో. నువ్వు పెద్దవాడయ్యాకా వాటి గురించి ఆలోచిస్తావన్నాడు. కొడుకు తప్పకుండా గుర్తు పెట్టుకుంటానన్నాడు.
    తండ్రి ‘నీ కోసం నేను ఎట్లాంటి ఆస్తిపాస్తులూ కూడబెట్టలేదు. నీకు యివ్వడానికి నాదగ్గర ఈ మాటలు మాత్రమేవున్నాయి. అవి ఏమిటంటే ఏదయినా సందర్భంలో ఎవరయినా నిన్ను తిట్టినా, రెచ్చగొట్టినా ఆవేశపడకుండా ‘నాకు ఇరవై నాలుగు గంటల సమయమివ్వండి. నేను యింటికి వెళ్ళి మీరు చెప్పిన విషయాలగురించి ఆలోచించుకుని వస్తాను. వాటిలోని తప్పొప్పుల గురించి విచారిస్తాను. అపుడు నాకు ఏది సయింది? ఏది కాదు? అని తెలిసివస్తుంది. అపుడు మీకు సమాధానమిస్తాను’ అని చెప్పు అన్నాడు.
    గూర్జియేఫ్ తండ్రి మాటల్ని జీవితాంతం ఆచరించాడు.
    గూర్జియేఫ్ ఒకవూరి గుండా వెళుతూ వుంటే ఎవరో ఆయన్ని ఆపి వాదనకు దిగారు. తిట్టారు.. ఆయనవాళ్ళ మాటలన్నీ ఓపిగ్గా విని ‘నాకు ఒక రోజు సమయమివ్వండి. మీ మాటలకు రేపు బదులిస్తాను’ అన్నాడు.
    వాళ్ళు ఆశ్చర్యంగా ‘చిత్రంగా వుందే. యిట్లా సమాధానమిచ్చిన మనిషిని యిప్పటిదాకా మేము చూడలేదు. మేము కోపంగా తిట్టాం. వాటిని నువ్వు శాంతంగా విన్నావు. తిరిగి తిట్టలేదు. పైగా రేపు వచ్చి చెబుతానంటున్నావు. నువ్వుపిచ్చివాడిలా వున్నావ్’ అన్నారు.
    గూర్జియేఫ్ ‘నేను యింటికి వెళ్ళి మీరు చెప్పిన మాటల్ని పునరాలోచించుకుంటాను. నా గురించి నేను తప్పు చేసినట్లు, నాది పొరపాటని నిందించారు. ఆ విషయం నిజమో కాదో ఆలోచించుకుంటే తప్ప నాకు అంతుబట్టదు, అందుకని సమయం కోరుతున్నా’ అన్నాడు. వాళ్ళు చిత్రంగా చూసి వెళ్ళిపోయారు.
    గూర్జియేఫ్ యింటికి వెళ్ళి ఆ విషయాల గురించి మనసులో చర్చించుకుని మరుసటి రోజు తనని తిట్టిన వాళ్ళదగ్గరికి వెళ్ళి ‘మీరు చెప్పింది సరైందే. నాలో తప్పులున్నాయి నన్ను మన్నించండి’ అని క్షమాపణ కోరాడు.

    • =======================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Saturday, June 23, 2012

    Iron deficiency Anaemia,ఇనుము లోపము వల్ల కలిగే రక్తహీనత


    • రక్తకణాలు మరియు రక్తహీనతతో ఉన్న మాతృమూర్తి .

    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఇనుము లోపము వల్ల కలిగే రక్తహీనత- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    Link
    ఐరన్ లోపం చాలా సాధారణ పోషక లోపం మరియు ప్రపంచంలో రక్తహీనత యొక్క ప్రధాన కారణం. పెరుగుదల మరియు అభివృద్ధి యొక్క క్లిష్టమైన కాలము వద్ద ఐరన్ లోపం అకాల జననాలు, తక్కువ పుట్టిన బరువు పిల్లలు, ఆలస్యమైన పెరుగుదల మరియు అభివృద్ధి, ఆలస్యమైన సాధారణ శిశువు చర్య మరియు కదలిక ఏర్పడతాయి.

    ఐరన్ లోపం తక్కువ మెమరీ లేదా తక్కువ జ్ఞాన నైపుణ్యాలను ఉంటుంది మరియు పాఠశాల, పని, మరియు లో సైనిక లేదా వినోద కార్యకలాపాలు లో నిరాశ ఉంటుంది.
    • ఇనుము : 
    మన శరీరంలో 3 నుండి 4 గ్రాముల ఇనుము ఉంటుంది. అందులో 60 నుండి 70 శాతం రక్తంలో ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారీలో ఇనుము ముఖ్య పాత్ర వహిస్తుంది. మెదడు పెరుగుదలకు, కండరాల పనితీరుకు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఇనుము ఎంతో అవసరం. ఇనుము శరీరంలో తక్కువ అయితే రక్తహీనత ఉంటుంది. పిండి పదార్థాల నుండి, ఆకు కూరలు, చిక్కుళ్లు, బెల్లం, మాంసం, చేపల నుండి లభిస్తుంది. మన దేశంలో మహిళల్లో ఇనుము లోపంతో రక్తహీనత జబ్బు చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో 100 ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ప్రతీ గర్భిణీ రోజుకు ఒకటి చొప్పున 100 రోజులు మింగాలి.
    • ఐరన్ లోప-రక్తహీనత లక్షణాలు.

    1. మీ వేలుగోళ్లు సులభంగా విరిగిపోవడము .

    2. మీరు ఆకలి లేకపోవడం ఉండవచ్చు.

    3. మీరు తలనొప్పి ని చాలా కలిగి ఉండవచ్చు.

    4. మీరు నీరసమైనట్లు మరియు బలహీనమైనట్లు భావించవచ్చును.

    5. ఊపిరి తీసుకోవడము లో కష్టము గా ఉండవచ్చు.

    6. మీరు డిప్రెస్ గాను యాజిటేటెడ్ ఫీలింగ్ ను కలిగి ఉండవచ్చు.

    7. కొన్నిసార్లు ఒక గొంతు నాలుక పూత కలిగి ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి.

    8. మీ చర్మం రంగు చాలా లేత కావచ్చు.

    • చికిత్సలు

    కారణం మూత్రపిండాల వ్యాధి తప్ప మిగతా వాటిలో ఇచ్చిన చికిత్సలు సాధారణంగా ఇనుము మందులు ఉంటాయి.

    ఇనుము లోపం చాలా తీవ్రమైన ఉంటే కొన్నిసార్లు, రక్తం మార్పిడి అవసరం కావచ్చు.

    ఆహార లో మార్పులు కూడా ఇవ్వబడుతుంది. అటువంటివి raisins, ఎండిన బీన్స్, (ఇతర పదాలు పప్పుదినుసుల్లో), చేపలు, మరియు కొన్ని మాంసాలు వంటి ఇనుము ను శరీరానికి అందించే ఆహారం తినటం. ఇందులో కాలేయం ఉత్తమమైన ఇనుము నిచ్చే అహారము .
    • =====================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Saturday, June 16, 2012

    సంతాన రాహిత్యం-అవగాహన , Infertility-Awareness


    •  

    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతాన రాహిత్యం-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    సంతానం సహజం! ప్రతి జంటా పండంటి బిడ్డల గురించి కలలు కనటం సహజం!! కానీ పిల్లలు పుట్టటమన్నది అందరికీ అంతే సహజంగా, అంత తేలికగా జరగకపోవచ్చు. స్త్రీపురుషులలో ఎన్నో హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తేనేగానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఆచితూచి లెక్కించినట్లు ప్రతి రుతుచక్రంలో.. కాలక్రమం ప్రకారం నడిచిపోతుండే ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే సంతానం ఎంత సహజమో... మన సమాజంలో సంతాన రాహిత్యం కూడా అంతే సర్వసాధారణంగా కనబడుతుంటుంది. కానీ ఒకప్పటి కంటే సంతాన రాహిత్యం విషయంలో మన అవగాహన నేడు ఎంతో పెరిగింది. పండంటి బిడ్డల కల నెరవేర్చేందుకు ఆధునిక వైద్యరంగం ఇప్పుడు అద్భుతాలను తలపించే ఎన్నో సమర్థమైన చికిత్సలను ఆవిష్కరిస్తోంది. ఎంతోమందికి పిల్లలను అందిస్తోంది. అందుకే సంతాన రాహిత్యం, దాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల వివరాలు

    ప్రపంచంలో 'ఐవీఎఫ్‌' వంటి అద్భుతమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాల ద్వారా తొలి బిడ్డ పుట్టి దాదాపు 35 సంవత్సరాలు కావొస్తోంది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ఈ విధానాల ద్వారా ఎంతలేదన్నా 50 లక్షలకు పైగానే బిడ్డలు పుట్టి ఉంటారని అంచనా. సంతాన రాహిత్యాన్ని అధిగమించి పండంటి బిడ్డలను పొందేందుకు లక్షలాది జంటలకు ఈ చికిత్సలు అక్కరకొస్తున్నాయి. మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సలకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. అయినా ఇప్పటికీ మన సమాజంలో సంతాన రాహిత్యం గురించీ, సంతాన సాఫల్య చికిత్సల గురించీ పూర్తి బహిరంగంగా, అరమరికలు లేకుండా చర్చించే వాతావరణం లేదనే చెప్పాలి. నిజానికి సంతాన రాహిత్యమన్నది బయటికి కనబడకుండానే దంపతుల జీవితాలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఓ అతి ముఖ్యమైన సమస్య. కొంగుముడి వేసుకున్న నాటి నుంచి పసిపిల్లల గురించి కలలుగనే జంటలకు సంతాన రాహిత్యం మిగిల్చే అసంతృప్తీ, ఆవేదనా అనంతం. సామాజికంగా నగుబాటుకు గురవుతూ, క్రమేపీ ఒంటరితనం, కుంగుబాటుల్లోకి జారిపోతూ వారు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తుంటారు. ఒక రకంగా ఇతరత్రా చాలా రకాల ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువగా కలతకు గురి చేసే సమస్య- ఈ సంతానలేమి! అయితే ఈ సంతానం లేకపోవటమన్నది కూడా ఇతరత్రా ఆరోగ్య సమస్యల్లాంటిదేననీ, నేటి ఆధునిక వైద్య రంగం దీనికీ ఎన్నో సమర్థమైన చికిత్సా విధానాలను అందిస్తోందని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం.

    అరుదేం కాదు.. పైగా పెరుగుతోంది!
    చాలామంది సంతానం కలగటం చాలా సహజమనీ, పిల్లలు కలగకపోవటమన్నది ఎక్కడో నూటికో కోటికో ఒకరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారుగానీ ఇది పూర్తి నిజం కాదు. సంతాన రాహిత్యం కూడా ఎంతోమందిలో కనబడుతున్న సమస్యే. ప్రతి ఆరు జంటల్లో ఒకరికైనా ఇటువంటి సమస్య ఎదురవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. పైగా ఈ సమస్య రానురాను ఇంకా పెరుగుతోంది. పాశ్యాత్య దేశాల్లో మాదిరిగానే మన పట్టణాల్లో కూడా ప్రధానంగా జీవనశైలి మారిపోతుండటం, లేటు వయసులో వివాహాలు-గర్భధారణలు.. ఇవన్నీ సంతాన రాహిత్యాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం కూడా దీనికి మరో కారణం. ఊబకాయం వల్ల ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తమై, అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. దీంతో సంతానావకాశాలు సన్నగిల్లుతాయి.

    ఏడాది దాటితే.. అనుమానించాలి
    భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవీ పాటించకుండా.. ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా? అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇలా ప్రయత్నిస్తే మొదటి ఏడాదిలోపే 85% మందిలో గర్భం వస్తుంది. మరో 5-7% మందిలో రెండో సంవత్సరంలోనూ జరగొచ్చు. కాబట్టి ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవటం మంచిది. అయితే స్త్రీ వయసు మరీ ఎక్కువగా ఉన్నా, లేక నెలసరి సక్రమంగా రాకపోవటం వంటి ఇతరత్రా రుతుక్రమ సమస్యలేమైనా ఉన్నా మరికాస్త ముందుగానే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.

    ఏమిటి మార్గం?
    సంతానం కలగటంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులు ఇరువురికీ కొన్ని పరీక్షలు చేయటం అవసరం. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. దీనిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని గుర్తిస్తే- మరికొన్ని హార్మోన్‌ పరీక్షలు, జన్యుపరీక్షలు అవసరమవ్వచ్చు. స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్‌ (రక్త) పరీక్షలు, అండాలు సజావుగా విడుదల అవుతున్నాయా? లేదా? తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్‌-రే లేదా ల్యాప్రోస్కోపీ చేయిస్తారు. ఫలితాలను బట్టి మరికొన్ని పరీక్షలూ అవసరమవ్వచ్చు, వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరమన్నది నిర్ధారిస్తారు.
    పిల్లలు పుట్టకపోవటానికి ప్రధాన కారణాలేమిటి?
    గర్భధారణ అన్నది అతి సహజంగా జరిగిపోయేదే అయినా తరచి చూస్తే ఇది ఒక రకంగా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి నెలా స్త్రీ అండాశయాల్లో విడుదలయ్యే అండం- ఫలోపియన్‌ ట్యూబుల ద్వారా గర్భాశయం వైపు ప్రయాణిస్తుంటుంది. ఇదే సమయంలో పురుషుడి వీర్యంలోని శుక్రకణాలు వచ్చి దాన్ని చేరుకుని.. వాటిలో ఒకటి అండాన్ని ఫలదీకరణం చెందిస్తే.. అది సూక్ష్మపిండంగా ఏర్పడి.. గర్భాశయంలోకి ప్రవేశించి.. గర్భాశయం గోడలకు అతుక్కుని అక్కడ పిండంగా పెరగటం ఆరంభిస్తుంది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇదీ గర్భధారణ ప్రక్రియ! ఈ ప్రక్రియ మొత్తాన్ని రుతుక్రమంలో సమయానుకూలంగా రకరకాల హార్మోన్ల నుంచి శరీర భాగాల వరకూ ఎన్నో అంశాలు నియంత్రిస్తుంటాయి. అందుకే వీటిలో ఎక్కడ, ఏ దశలో లోపం తలెత్తినా గర్భధారణ క్లిష్టతరంగా మారుతుంది.
    స్త్రీలలో:
    * అండాల సమస్యలు: సంతానం కలగని చాలామంది స్త్రీలలో ఎక్కువగా కనబడేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల అస్తవ్యస్తం వల్ల నెలసరి సక్రమంగా రాక, అండాలు విడుదల కాక.. పరిస్థితి సంతాన రాహిత్యానికి దారి తీస్తుంది. ఇలాంటి వారిలో అండాల విడుదలను ప్రభావితం చేస్తున్న అతి ముఖ్యమైన సమస్య- అండాశయాల్లో నీటి తిత్తులుండటం. దీన్నే 'పాలి సిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌)' అంటారు.

    *ట్యూబుల సమస్యలు: అండాశయం నుంచి విడుదలైన అండాన్ని ఫలోపియన్‌ ట్యూబులు పట్టుకుంటాయి. పురుషుడి వీర్యం నుంచి వచ్చే శుక్రకణం ఈ అండాన్ని చేరుకుని, ఫలదీకరణం జరగటమన్నది ఈ ట్యూబుల చివర్లో జరుగుతుంది. అందుకే ఒకవేళ ఈ ట్యూబులు మూసుకుపోయినా, దెబ్బతిన్నా గర్భధారణ కష్టంగా మారుతుంది. ఈ ట్యూబులు మూసుకుపోవటానికి లైంగికంగా సంక్రమించే గనేరియా, క్లమీడియా వంటి సుఖవ్యాధులు, అబార్షన్ల తర్వాత ఇన్ఫెక్షన్లు సోకటం వంటివి ముఖ్యకారణాలు. ప్రత్యేకించి మన దేశంలో పునరుత్పత్తి అవయవాలకు 'క్షయ' (టీబీ) సోకటం కూడా మరో కీలకాంశంగా నిలుస్తోంది. మొత్తానికి సంతాన రాహిత్యానికి 15% వరకూ ఈ ట్యూబుల సమస్యలే కారణమవుతున్నాయి.

    *ఎండోమెట్రియోసిస్‌: స్త్రీలలో గర్భాశయం లోపలివైపు గోడలకు ఉండే మృదువైన పొరభాగం (ఎండోమెట్రియం) ప్రతి నెలా హార్మోన్ల ప్రభావంతో మందంగా తయారవుతుంటుంది. ఒకవేళ గర్భధారణ జరిగితే పిండం కుదురుకునేందుకు ఉపయోగపడే ఈ మెత్తటి పొర.. గర్భధారణ జరగకపోతే.. విడివడిపోయి.. రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. (ఇదే బహిష్టు స్రావం). కొద్దిమంది స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర- గర్భాశయం లోపలే ఉండకుండా దాని వెలుపలకు కూడా వచ్చి ఫలోపియన్‌ ట్యూబుల్లో, అండాశయాల మీద.. ఇలా రకరకాల ప్రదేశాల్లో స్థిరపడి.. నెలానెలా హార్మోన్లకు అక్కడే స్పందిస్తూ.. వాపు, స్రావాల వంటివి తెచ్చిపెడుతూ సమస్యాత్మకంగా తయారవుతుంది. దీన్నే 'ఎండోమెట్రియోసిస్‌' అంటారు. స్త్రీలలో సంతాన రాహిత్యానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం.

    *చెప్పలేని పరిస్థితి: కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదల అవుతూనే ఉంటాయి. పరీక్షించి చూస్తే ట్యూబులూ బాగానే ఉన్నట్టు కనబడతాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలూ అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం మాత్రం రాదు. దీనర్థం గర్భధారణ ప్రక్రియకు సంబంధించి పరీక్షల్లో కూడా గుర్తించలేనంతటి సూక్ష్మస్థాయిలోనో, లేక పిండం గర్భాశయంలో కుదురుకోవటంలోనో.. ఎక్కడో తేడా ఉందని! ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌' వంటి సంతానసాఫల్య చికిత్సా విధానాలే ఉత్తమ మార్గం.
    పురుషుల్లో
    పురుషుడి వీర్యంలో- ప్రధానంగా శుక్రకణాల సంఖ్య తగినంతగా ఉండాలి, అవి చురుకుగా తిరుగుతుండాలి, వాటి ఆకృతి (మార్ఫాలజీ) కూడా బాగుండాలి. ప్రతి మిల్లీలీటరుకూ కనీసంగా 1.5 కోట్లకు పైగా శుక్రకణాలుండటం సహజం. వీటిలో కనీసం 50% శుక్రకణాలు చురుకుగా తిరుగుతుండాలి. వీర్య పరీక్షలో ఇవన్నీ సజావుగా ఉన్నాయా? లేదా? అన్నది పరీక్షిస్తారు. సంతాన రాహిత్యం ఉన్న వారిలో- కొందరిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. మరికొందరిలో అస్సలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. తగినన్ని శుక్రకణాలు చురుకుగా లేకపోవటం, వాటి ఆకృతులు సరిగా లేకపోవటం వంటివీ సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. పొగ, మద్యం, తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం వంటి వంటివాటి వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోవచ్చు. వీటిని సరిదిద్దుకుంటే కొన్నిసార్లు సంతానావకాశాలు మెరుగవుతాయి. ఇక హార్మోన్‌ల సమస్యలు, సుఖవ్యాధులు/క్షయ వల్ల వీర్యనాళాలు మూసుకుపోవటం, జన్యుపరమైన కారణాల వల్ల క్రోమోజోముల్లో తేడాలుండటం.. తదితరాలు కూడా పురుషుల్లో సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. 40% మందిలో ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే వీర్యంలో తేడాలుండొచ్చు. ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌' వంటి పద్ధతులు ఆశ్రయించాల్సి వస్తుంది. అసలు వీర్యంలో శుక్రకణాలే లేని వారికి కూడా నేరుగా వృషణాల నుంచే శుక్రకణాలు తీసి(టీసా), వాటితో భాగస్వామి అండాన్ని ఫలదీకరణం చెందించే అత్యాధునిక విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి
    చికిత్స ఏమిటి?
    స్త్రీలలో సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇవ్వటం, ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలున్నా, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యలున్నా వాటిని ల్యాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచెయ్యటం అవసరం. కొందరికి వీటితోనే గర్భధారణ సాధ్యమవుతుంది. మరికొందరికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్‌', 'ఐసీఎస్‌ఐ-ఇక్సి' వంటి సంతాన సాఫల్య చికిత్సా విధానాలు (వీటి గురించి కింద వివరంగా) అనివార్యమవుతాయి. పురుషుల్లో సమస్యలుంటే చాలా వరకూ వీటితోనే అధిగమించాల్సి వస్తుంది.

    సంతాన రాహిత్యానికి ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన స్పెషలిస్ట్‌ల వద్ద చికిత్స తీసుకోవటం అత్యుత్తమం. దీనివల్ల సంతానావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఒక జంటకు పిల్లలు పుట్టటం లేదంటే దానర్థం వారికి ఇంకెప్పటికీ పుట్టరని కాదు. చాలామందిలో సంతానావకాశాలను పెంచేందుకు- ఆధునిక వైద్యవిధానాలు సహాయకారిగా గర్భధారణకు ఎంతో దోహదం చేస్తాయి. ఈ చికిత్సలతో గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. మొత్తమ్మీద ప్రస్తుతం సంతానం కోసం స్పెషలిస్టు చికిత్సలను ఆశ్రయిస్తున్న వారిలో- కనీసం 75% జంటలు చికిత్సా క్రమంలో విజయం సాధిస్తున్నట్టు గుర్తించారు.

    సహజంగా సంతానం కలగకపోవటమన్నది దంపతులను రకరకాలుగా ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తుంది. దీనివల్ల వీరిలో నిస్సహాయత, ఆగ్రహం, సిగ్గు, నలుగురిలో కలవలేకపోవటం, ఆవేదన వంటి రకరకాల మనోభావాలు పెల్లుబుకుతుంటాయి. చాలామంది కుంగుబాటుకు (డిప్రెషన్‌) కూడా లోనవుతుంటారు. వీటిని అధిగమించేందుకు నిపుణుల కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సంతాన సాఫల్య చికిత్సల్లో కౌన్సిలింగ్‌ది కీలక పాత్ర.
    ఐయూఐ
    'ఐయూఐ' అంటే 'ఇంట్రా యూటరీన్‌ ఇన్‌సెమినేషన్‌'. సంతాన సాఫల్య చికిత్సల్లో దీన్ని ప్రాథమికమైనదిగా చెప్పుకోవచ్చు. దీనిలో- భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో పరీక్షించి, దానిలోని అసహజమైన కణాల వంటివాటన్నింటినీ తొలగించి, కేవలం ఆరోగ్యకరంగా, చురుకుగా ఉన్న వాటినే సిద్ధం చేస్తారు. అలా సిద్ధం చేసిన వీర్యాన్ని ఒక సన్నటి మెత్తటి గొట్టం ద్వారా నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఎటువంటి నొప్పీ లేని, 5 నిమిషాల్లో పూర్తయిపోయే తేలిక విధానం ఇది. స్త్రీలో అండం విడుదల అయ్యే రోజులేవో గుర్తించి, ఆ రోజుల్లోనే ఈ చికిత్స చేస్తారు. ఇదే సమయంలో స్త్రీలో మరిన్ని అండాలు పక్వమై విడుదలయ్యేందుకు మందులు కూడా ఇస్తారు. అవసరాన్నిబట్టి ఇలా 6 రుతుచక్రాల వరకూ కూడా 'ఐయూఐ' చికిత్స చెయ్యచ్చు. ఇలా ఒక నెలలో చేస్తే సంతానావకాశాలు 15% వరకూ ఉంటాయి. సాధారణంగా 3-4 రుతుచక్రాల్లోనే గర్భం రావొచ్చు. 6 రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకపోతే 'ఐవీఎఫ్‌' వంటి పైస్థాయి చికిత్సలను సూచిస్తారు.
    ఐవీఎఫ్‌
    ఐవీఎఫ్‌ అంటే 'ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌'. దీన్నే 'టెస్ట్‌ట్యూబ్‌ బేబీ' విధానమనీ అంటుంటారుగానీ.. దీనర్థం పిల్లలను టెస్ట్‌ట్యూబుల్లో పెంచుతారనేం కాదు. దీనిలో ముందు స్త్రీ నుంచి- పక్వమైన అండాలను బయటకు తీస్తారు. వాటిని ప్రయోగశాలలో ఒక డిష్‌లో ఉంచి- పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఫలదీకరణం చెందగా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకుని, పిండంగా పెరగటం ఆరంభిస్తాయి. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిబిడ్డ 1978లో పుట్టింది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది బిడ్డలు ఇలా పుట్టారు. అద్భుత ఫలితాలతో సంతాన సాఫల్య చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందీ విధానం. దీనితో ప్రతి దఫా 30-35% విజయావకాశాలుంటాయి.
    ఐసీఎస్‌ఐ-ఇక్సి
    ఐసీఎస్‌ఐ అంటే 'ఇంట్రా సైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజక్షన్‌'. ఇది ఐవీఎఫ్‌ చికిత్సకే మరికాస్త మెరుగులు దిద్దిన విధానం. దీనిలోనూ ముందు స్త్రీ నుంచి అండాలను సేకరిస్తారు. ప్రయోగశాలలో ఆ అండాల్లోకి- పురుషుడి ఒక శుక్రకణాన్ని ప్రత్యేకమైన 'మైక్రోమ్యానిప్యులేటర్‌' పరికరం సహాయంతో ఆ అండంలోకి ప్రవేశపెట్టి, ఫలదీకరణం చెందిస్తారు. అలా ఫలదీకరణం చెందిన వాటిని తిరిగి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ విధానంతో ప్రతి దఫా విజయావకాశాలు 40% వరకూ ఉంటాయి.
    శుక్రకణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్న పురుషుల విషయంలో ఈ చికిత్స ఎంతగానో ఉపకరిస్తుంది. అసలు శుక్రకణాలే లేనివారిలో సైతం వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను బయటకు తీసి (టీఈఎస్‌ఏ) ఈ ఇక్సీ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణం చెందించవచ్చు.
    మరెన్నో!
    ఇటీవలి కాలంలో సంతాన సాఫల్య చికిత్సల్లోకి మరెన్నో కొత్తకొత్త విధానాలు వచ్చి చేరుతూ వీటి విస్తృతిని పెంచుతున్నాయి. ముఖ్యంగా అండాలను లేదా శుక్రకణాలను తీసి భవిష్యత్‌ అవసరాల కోసం ప్రయోగశాలలో అతిశీతలంగా భద్రపరచి ఉంచటం; ప్రయోగశాలలో ఫలదీకరణం చెందించిన సూక్ష్మపిండాల్లో స్త్రీగర్భాశయంలో ప్రవేశపెట్టగా మిగిలిన అదనపు పిండాలను అతిశీతలంలో (క్రయోప్రిజర్వేషన్‌) ఉంచి, వాటినే తర్వాత వాడటం; అవసరాన్ని బట్టి అండాలనుగానీ శుక్రకణాలనుగానీ దాతల నుంచి స్వీకరించి చికిత్సల్లో వాడటం; పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే అవకాశం ఉండటం (సరోగసీ)- ఇటువంటి వినూత్న విధానాలెన్నో అందుబాటులోకి వచ్చాయి.
    స్త్రీల సమస్యే కాదు!
    మన సమాజంలో నేటికీ బలంగా పాతుకుపోయిన అపోహ ఏమంటే- స్త్రీలో ఏదో లోపం ఉండటం వల్లనే పిల్లలు పుట్టటం లేదని నమ్ముతుంటారు. ఇది పూర్తి అవాస్తవం. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లోనూ, సమాజంలోనూ కలతలు, కలహాలు కూడా రేగుతున్నాయి. కానీ వాస్తవాలు చూస్తే- సంతాన రాహిత్యంతో సతమతమవుతున్న మొత్తం జంటల్లో కేవలం 35% మందిలోనే స్త్రీలలో లోపాలుంటున్నాయి. మరో 35% కేసుల్లో పురుషుల్లో లోపాలుంటున్నాయి. మిగిలిన 30% జంటల్లో ఇద్దరిలో లోపం ఉండటమో, లేక సరిగా నిర్ధారించలేని ఇతరత్రా సమస్యలేమైనా ఉండటమో జరుగుతోంది. కాబట్టి సంతాన రాహిత్యాన్ని ప్రత్యేకించి స్త్రీల సమస్యగా, స్త్రీ లోపంగా చూడటం సరికాదు.
    అమ్మాయి వయసు
    స్త్రీ వయసు పెరుగుతున్న కొద్దీ సంతానావకాశాలు తగ్గుతుంటాయి. నెలనెలా విడుదలయ్యే అండాలు ఒక వయసు దాటిన తర్వాత అంత నాణ్యంగా ఉండకపోవటం దీనికి ఒక ముఖ్యకారణం. అలాగే వయసు పెరిగే కొద్దీ అబార్షన్లయ్యే అవకాశాలూ ఎక్కువ. వీటికి తోడు చిన్నవయసు స్త్రీలతో పోలిస్తే పెద్దవయసు వారిలో క్రోమోజోముల్లో, జన్యువుల్లో తేడాల వల్ల వీరికి పుట్టే పిల్లలకు రకరకాల లోపాలూ రావచ్చు. 40 ఏళ్లు దాటిన స్త్రీలకు అత్యాధునిక సంతాన చికిత్సలతో కూడా సాఫల్యాల రేటు తక్కువగానే ఉంటుంది. వాస్తవానికి 20-25 ఏళ్ల మధ్య స్త్రీలలో సంతానావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 30లలో క్రమేపీ సన్నగిల్లుతూ, 35 ఏళ్ల తర్వాత మరింతగా తగ్గిపోతాయి. కానీ ఉద్యోగ బాధ్యతలు, లేటు వయసు పెళ్లిళ్ల వంటి వాటి వల్ల నేడు ఎంతో మంది స్త్రీలు వయసు మీరే వరకూ సంతానాన్ని కోరుకోవటం లేదు. దీనివల్ల కూడా సంతాన రాహిత్యం పెరుగుతోంది.


    courtesy with Eenadu Sukhibhava

    • ==========================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Monday, May 21, 2012

    మసాజ్‌ చికిత్సా ప్రక్రియ,మసాజ్‌ థెరపీ,Massage therapy



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మసాజ్‌ థెరపీ- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    సమస్త మాన వాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వ ర ఉపసమనాన్ని ఇ చ్చేదిగా... సమర్ధవంత మైన చికిత్సా ప్రక్రియ గా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం. బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

    అసలు ఇలా బాడీ మసాజ్‌ చేయటం అన్నది ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో కాన్పు జరిపినా... పుట్టిన బిడ్డ్డకి ఎముకల గట్టిదనం కోసం, మరిన్ని రుగ్మతల నుండి రక్షణ కోసం తైలాలతో మర్ధన చేయటం తప్పని సరిగా మారింది. మనిషి పుట్టుకే ఈ ప్రకృతి సహజ సిద్దమైన వైద్యంలో ప్రారంభమవుతోందని చెప్పొచ్చు. ఈ ప్రకృతి ప్రక్రియల్లో అవరాన్ని బట్టి వివిధ రకాల మర్ధ నలు చేయటం తప్పని సరి.

    అనుభవమున్న ఎందరు వైద్యులున్నా... ఎన్ని రకా లుగా వైద్యం అభివృద్ధి చెందినా... పుట్టిన బిడ్డ ఎదిగే కొలదీ కాసేపు శరీరానికి మర్ధన చేయటం అనుభవమున్న మాతృమూర్తులు చేసే పని, ఈ విషయంలో అధిక ప్రాధాన్యత బాలింతలకు, తొలి చూలు మహిళలకు ఇలా మర్ధన చేయటం వారి ఆరోగ్య సమస్యలు తీర్చేదే. ఆరోగ్య పరమైన ప్రతిబంధకాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా పూర్వం నుండి మర్ధన కొనసాగుతోందనే చెప్పక తప్పదు.

    మర్ధనం అంటే...

    స్పర్శ ఇది చాలా సున్నితమైన అంశం. దు:ఖం, బాధ, తదితరాలు కలిగినప్పుడు ఊరడింపుని, అనున యాన్ని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మనిషి నుండి లభించే స్పర్శ ఎంతో ఓదార్పునిస్తుందన్నది వాస్తవం. దీనివల్ల జరుగుతున్న ప్రయోజనాలని ఆధారంగా చేసుకుని పూర్వీకులు స్పర్శపై అనేక పరిశోధనలు చేసి వైజ్ఞానికంగా చేసిన అభివృద్ధి వల్లే మర్ధన ప్రక్రియని రూపొందించారు. దీని కోసం మసాజ్‌ థెరఫీ పేరుతో ఆయుర్వేదంలో ఏకంగా ఓ శాస్త్రమే ఉంది. ప్రకృతి వైద్య విధానానికి అను సంధానించి అన్ని వయసుల్లోని వారి శారీరక శ్రమల కారణంగా కండరాలు అలసిపోవటం వల్ల వచ్చే అనేక రుగ్మతలపై అధ్యయనం చేసి, వాటిని స్పర్శతో సేత తీర్చే లా ఈ ప్ర క్రియ ఉంటుంది. మన దేశంలో సాంప్రదాయ పద్ధతులలో శరీరాన్ని, కండలను పెంచేందుకు పూర్వ కాలం నుండి దండీలు, కుస్తీలు వంటి గ్రామీణ క్రీడలు సైతం ఆయుర్వేద వైద్య విధానంలోని పద్దతులే. వీటి వల్ల కలిగే కండరాల ఉపశమనానికి మర్ధనాన్ని వినియోగించే వారు.

    మర్ధనలో జాగ్రత్తలు పాటించాలి....

    ఓ పద్దతి ప్రకారం జరగాల్సిన మర్ధన ఇష్టాను సారం చేస్తే.... నొప్పి మరింత పెరిగి లేని పోని అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ మర్ధన చికిత్సపై ప్రత్యేకంగా నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్న వారి సహాయం తప్పని సరిగా తీసుకోవాల్సిందే.. శరీర నిర్మాణాన్ని పూర్తి స్ధాయిలో తెలుసుకుని ఎక్కడ ఏతరహాలో మర్ధన చేయాలన్నది ముఖ్యం.

    ఎలాంటి ఆరోగ్య సమస్యలకి మర్ధన అవసరమంటే...

    పక్షవాతం :

    కొన్ని రకాల పక్షవాతాల బారిన పడిన వారిలో చచ్చు బడి పోయిన శరీర భాగాలపై తగిన ఆయుర్వేద తైలా లతో మర్ధన ప్ర క్రియ చేయటం ద్వారా తిరిగి పునర్జీవనం సాగించేలా చేయచ్చు. ధన్వంతరి తైలం, క్షీర బలా తైలాలు ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

    తలనొప్పి :

    మనలో చాలా మంది ఎప్పటికప్పుడు మాడునొప్పితో, విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటాం. ఇలా బాధపడేవారు స్వచ్చ మైన కొబ్బరి నూనెను తలపై మృదువుగా మర్ధన చేయించు కుంటే త్వరగా ఉపశమనం పొందొచ్చు. మరీ విపరీతమైన నొప్పితో బాధపడేవారు రాత్రుళ్లు పడుకునే సమయంలో మర్ధన చేయించుకోవటం మంచిది. ఒక్కోసారి శరీరం అంతా మర్ధన చేయాల్సి రావచ్చు. ఇందుకు ప్రకృతి వైద్యులు, ఆయుర్వేద నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది ..

    కీళ్ల వాతం :

    చికెన్‌ గున్యా, మలేరియా, జ్వరం తదితర వ్యాధుల బారిన పడిన వారిలో కీళ్ల వాపులు, నొప్పులు అధికంగా ఉం టాయి. కీళ్లు బిగుసుకు పోయిన కారణంగా కాళ్లు కదపలేని స్దితి కూడా వస్తు ఉంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా తగిన విధంగా మసాజ్‌ చేయించుకుంటే ఉపశమనం కలుగుతుంది.

    అధిక బరువు :

    ప్రస్తుత ఫాస్టుఫుడ్‌ కల్చర్‌ కారణంగా ఊబకాయానికి లోనవుతున్న వారు కొందరైతే... దులవాట్లు, శారీరక శ్రమ తగ్గటం లాంటి కారణాల వల్ల, జీవనశైలిలో వచ్చిన మార్పులు వల్ల శరీరం భారీగా పెరిగి బాధ పడుతున్న వారు మరి కొందరు. వీరిలో పొట్ట పెరగటం బైటకు కనిపించే సమస్య అయితే, ఎసిడిటి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, పుల్లటి తేన్పులు, మలబద్దకం ఇలా చాలా అంతర్గత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి బాధలతో బాధ పడేవారి కోసం ప్రత్యేక రీతిలో మర్ధన చికిత్స చేస్తే ఊబకాయం తగ్గి శరీరానికి హాయి దక్కు తుంది.

    ఉబ్బసం, ఆయాసం :

    తీవ్రమైన జలుబు, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులు ఉన్న వారు ఆయుర్వేద చికిత్సలో వాడే సైంధవ లవణం కలిపిన నువ్వుల నూనెని గానీ, కార్పూర తైలాన్ని కానీ ఛాతిపైనా, వీపు పైనా మర్ధన చేసినట్లు రుద్ది వేడి నీళ్లతో కాపడం పెడితే తొందరగా ఉపశమనం లభిస్తుంది.

    నరాల నొప్పి:

    సయాటికా లాంటి నొప్పులకు, నొక్కుకు పోయే నరాల బాధల నుండి ఉపశమనం లభించడానికి మహానారాయణ తైలాన్ని రుద్ది తగిన రీతిన మర్ధన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయ టం వల్ల నరం వెళ్లే మార్గం, నరం పూర్తి స్ధాయిలో ఉత్తేజభరితమవుతాయి.

    నిద్రలేమి :

    నిద్ర పట్టక బాధ పడేవారికి మర్ధన చికిత్స బాగా ఉపయోగ పడుతుంది. నిద్ర మాత్రలు వేసుకుని లేని పోని రోగాలు తెచ్చుకునే కన్నా ఆరో గ్యవంతమైన ఈ ప్రకృతి వైద్య విధానంలో నిపుణుల సూచనల మేరకు మర్ధన చేయించుకునే స్లీప్‌ సైకిల్‌ క్రమబధ్ధీకరించబడి నిద్రలేమి పోతుంది.

    మర్ధన వల్ల ప్రయోజనాలూ బోలెడు...

    శరీరాన్ని అన్ని విధాలుగా మర్దించడం వల్ల చమట రూపంలో చర్మంలోని మాలిన్యం బైటకు రావ టం వల్ల కాంతి వంతంగా తయారవ్వటమే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా హాయిని గొలిపే ఈ ప్ర క్రియ వల్ల కండరాలు సేద తీర టమే కాకుండా మనలో రోగ నిరోధక శక్తిని పెంచు తుంది. వృధ్ధాప్యం కారణంగా వచ్చే అనేక సమస్యలకు సత్వర ఉపశమనం మర్ధన వల్లే సాధ్యం.

    వీరికి మర్ధన చేయద్దు :

    గర్భవతులైన మహిళల పొట్టపై ఎట్టి పరిస్ధితిలోనూ మర్ధన చేయకూడదు. అలాగే మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారిపైన మర్ధన ప్రయోగాలు చేస్తే ఉప శమనం మరో విపరీతానికి దారి తీస్తుంది.

    -- సత్య గోపాల్‌ @ అంధ్రప్రభ ఆదివారము అనుబంధం
    • ===================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Saturday, May 19, 2012

    మోకీళు మార్పిడి శస్త్రచికిత్స, Knee replacement Surgery


    • image : courtesy with Eenadu News paper.


    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మోకాలి మార్పిడి శస్త్రచికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    • వయసు పైబడిన వారిని వేధించే సమస్య మోకాలి నొప్పి. దీనివల్ల పది అడుగులు వేయటం కష్టమైపోతుంది. నాలుగు మెట్లు కూడా ఎక్కలేకపోతుంటారు. రోజువారీ సాధారణ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. నొప్పి మూలంగా కింద కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. నేడు మనదేశం లో 15 శాతము మంది మోకాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు . వీరిలో దాదాపు 14 శాతము మందికి మందులతోనే ఉపశమనం కలుగుతుంది . మిగతా ఆ 1% మందికి కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప మరోమార్గము లేదు . ఇటువంటి వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఒక వరంలాంటిదంటున్నారు డాక్టర్ అఖిల్ దాడి. మోకాలి నొప్పితో బాధపడే వారు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవించవచ్చంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…

    మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే కీళ్లవాతానికి గురవడం, ‘హైపోథైరాయిడిజం’ వల్ల మోకాలు త్వరగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మోకాలి నొప్పి మొదలవుతుంది. మోకాలి నొప్పికి మరొక ప్రధానకారణం స్థూలకాయం. అధిక బరువు వల్ల మోకాలు కీళ్లలో అరుగుదల ఎక్కువగా జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ప్రాథమిక దశలో మోకాలి నొప్పిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే మందులతోనే నయం అవుతుంది. ఆలస్యం చేస్తే కీళ్ల మధ్య అరుగుదల ఎక్కువయి సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుతం ఈ నొప్పులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు ''గ్లూకోజమైన్'' అనే మందులు వాడటం ద్వారా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, కీళ్లవాతానికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు.

    • ఎవరికి ఆపరేషన్ అవసరం
    గత కొద్ది సంవస్తరాలుగా మోకీలు నొప్పితో బాధపడుచున్నవారికి ,
    10 నిముషాలకంటే ఎక్కువ సమయము నిలబడలేకపోతున్నవారికి,
    5-6 మెట్లు కూడా ఎక్కలేనివారికి , 
    కనీసం 500 అడుగులు కూడా నడవలేని వారికి,
    రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది.
    నొప్పి నివారణ మాత్రలు వాడినప్పటికీ పనిచేయనపుడు,
    మోకాలు మధ్యలో ఉండే గుజ్జు పూర్తిగా అరిగిపోయి తీవ్రమైన నొప్పలతో బాధపడుతున్నప్పుడు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడమే ఉత్తమం,
    కాళ్లు వంగిపోయిన వారికి కృత్రిమ కీలు అమర్చడం చక్కని పరిష్కారం.

    • ఏది ఉత్తమం
    అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధనల అనంతరం వివిధ రకాల కృత్రిమ మోకాళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోగి సౌలభ్యాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని పరిశీలించి ఏ రకమైనది సరిపోతుందో వైద్యులు నిర్ధారిస్తారు. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 10 నుంచి 15 శాతం మందిలో లోహ సంబంధమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొందరిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అలర్జీలను నివారించే అధునాతమైన కృత్రిమ సిరామిక్ మోకాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది

    • a s knee
    జర్మనీ వారి ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఈ కృత్రిమ సిరామిక్ మోకాలును తయారుచేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మోకాలు ఏడు పొరలుగా వివిధ ఔషధాలతో నిర్మాణం చేయబడి ఉంటుంది. ప్రధానమైన ఐదు పొరలు క్రోమ్ నైట్రేట్-తో తయారు చేయబడి ఉంటాయి. ఇది మోకాలుకు గట్టిదనాన్ని ఇస్తుంది. ఆరవ పొర జిర్కోనియమ్ నైట్రోజన్ - తో తయారుచేయబడి ఉంటుంది. దీని ద్వారా కృత్రిమ మోకాలు కఠినంగా తయారయి సిరామిక్ గుణం వస్తుంది. ఏడవ పొర జిర్కోనియమ్. ఏ ఎస్ నీ తయారీలో ఉపయోగించే జిర్కోనియమ్ లోహం మానవ శరీరంలోని ఎముకలకు చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి శరీరంలో త్వరగా కలిసిపోయే గుణం ఉంటుంది. మోకాలుకు శక్తిని, పటుత్వాన్ని ఇస్తుంది. ఏ ఎస్ నీలోని ఏడు పొరలలోని ఔషధాలు లోహం నుంచి విడుదలయ్యే అయానులు రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. దీనిద్వారా అలర్జీ రాకుండా ఉంటుంది. అరుగుదల కూడా తక్కువ ఉండి ఎక్కువ కాలం మన్నుతుంది. మిగతా సిరామిక్ మోకాళ్లతో పోలిస్తే తొడవైపు ఎముక భాగం మరియు కాలివైపు వెనక భాగానికి అంటే పూర్తి కాలుపై దీనికి పటుత్వం ఉంటుంది.

    వెనుకవైపునకు జరిగే అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది.

    • ఆపరేషన్ సమయంలో…
    తొడ ఎముక కింది భాగం, కాలు పైభాగం అరిగిపోవడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి మొదలవుతుంది. ఎముకల మధ్య ఉండే జిగురు తగ్గిపోవడం, ఎముక, వాషర్ అరిగిపోవడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. ఆపరేషన్‌లో భాగంగా ఎముక ఆరిగిన స్థానంలో మెటల్‌ను అమర్చడం జరుగుతుంది. రెండు వైపులా మెటల్ వేసిన తరువాత అరిగిన వాషర్ స్థానంలో కొత్త వాషర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. A.S.knee చూడటానికి బంగారం లాగా ఉంటుంది. తక్కువ అరుగుదలతో ఎక్కువ కాలం మన్నడం, పటుత్వం కలిగి ఉండటం, అలర్జీలు నివారించడం వల్ల మోకాలు నొప్పితో బాధపడేవారికి బంగారు మోకాలేనని చెప్పొచ్చు. శస్త్రచికిత్స తరువాత నొప్పి పూర్తిగా తగ్గిపోయి మామూలుగా నడవటం, రోజు వారి పనులు చేసుకోవడం సాధ్యపడుతుంది. మోకాలు మార్పిడి తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు పదిపదిహేనేళ్ల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.

    • ఆపరేషన్ తరువాత…
    మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాళ్ల వంకర కూడా తొలగిపోతుంది. కృత్రిమ కాలు ఎంతకాలం మన్నుతుంది అనే విషయం వారి అలవాట్లు, జీవనవిధానం, శస్త్రచికిత్సలో అమర్చే మెకాలుపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శస్త్రచికిత్స తరువాత ఎంత దూరమైన నడవచ్చు. ఎన్ని మెట్లయినా ఎక్కవచ్చు. కానీ కింద కూర్చునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలు మార్పిడి అనంతరం ఇరవై, ముఫ్పై ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చు.



    Courtesy with : డా. అఖిల్ దాడి ,నీ రీప్లేస్‌మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్,సికింద్రాబాద్ @sevalive.com

    • ======================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Friday, May 18, 2012

    Listen to what our body tell,శరీరము చెప్పేది వినాలి




    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శరీరము చెప్పేది వినాలి - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    అందరూ ఆరోగ్యముగా ఉండాలనే కోరుకుంటారు . మన శరీరము ఓ పెద్ద కర్మాగారము . దానిలో అనారోగ్యకరమైన ఏ చిన్న మార్పునైనా కొన్ని సాంకేతికాల ద్వారా మనకు తెలియజేస్తుంది. వాటిని మనము అశ్రద్ధ చేయకూడదు . తరచూ తలనొప్పి వస్తూవుంటే నిద్రలేకపోవడం వల్ల అలా జరిగి వుండవచ్చునని భావిస్తారు . అలాగే ఎక్కువసార్లు నడుము నొప్పి వస్తూవుంటే జిమ్‌లో అధిక సమయము వ్యాయామము చేయడమే కారణమని భావిస్తారు . పెదవులు చిట్లుతూవుంటే చలువల్లో లేదా మరో కారణమనుకుంటారు . ఈ సమస్యలన్నీ చలా తరచుగా వస్తూవుంటే , శరీఏము లో మరేదో తీవ్రమైన సమస్య వుందని భావించవలసి వుంటుంది . సాధారణముగా కనిపించే లక్షణాలు అలా ఎందుకు వచ్చివుండవచ్చునన్న కారణాలను తెలుసుకుందాం .

    • విడవని తలనొప్పి :
    అప్పుడప్పుడు తలనొప్పిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ వుంటారు . నిద్రలేమి , ఆకలి , మానసిక ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు . ఈ తరహా లాంటి వాటిని సాదారణమైన తలనొప్పిగా భావించవచ్చును. ఏ ధైనా నొప్పి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది .. కాని కొన్ని సమయాల్లో కొంతమందిలో భయంకరమైన వ్యాధులు ... మెదదులో ట్యూమర్లు , మైగ్రైన్‌ , మెదడు వాపు జబ్బులు అయివుండవచ్చు . అన్నివేళలా అశ్రద్ద చేయకుండా మంచి డాక్టర్ ని సంప్రదించాలి .

    • పెదవులు చిట్లడము :
    సాధారణము గా పెదవులు చిట్లినట్లు గా తయారయితే మనకు మనమే తేలికగా చికిత్స చేసుకోవచ్చు . పెదవులు పగిలినప్పుడు మెడికల్ షాపు ల్లో లభించే లిప్ బామ్‌ వంటివి రాసి ఊరుకుంటాం . ఇదే సమస్య మల్లీ మల్లీ వస్తూఉంటే అలోచించాలి . విటమిన్లు బి, సి,డి, లు తగ్గినపుడు , ఎర్రరక్తకణాలు లోపించినపుడు , చర్మ ఎలర్జీ వలన పెదవులపై పొట్టు లేచిపోవడము జరిగితే కారణాలు తెలుసుకొని చితిత్సచేసుకోవాలి .

    • వీపు నొప్పి :
    ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం , శక్తికి మించిన బరువులు ఎత్తడం , సక్రమముగా కుర్చోకపోవడము లాంటివాటివల్ల వీపునొప్పి రావచ్చు . కారణాన్ని సరిచేసుకుంటే తగ్గిపోతుంది . ఏదైనా పెయిన్‌ బామ్‌ వాడినా తగ్గిపోతుంది. . . కాని తరచుగా వస్తూ భరించరానిదిగా ఉంటే వెన్నుపాము చుట్టూ ఉండే డిస్క్ వాపు లేదా ముందుకు రావడము జరుగవచ్చు లేదా మెదడుకు , వెన్నుకు మధ్యబాగములో ఇంఫెక్షన్‌ రావడడము వల్ల అయివుండవచ్చును. ఇది చాలా సీయస్ వ్యాది . తగిన వైద్యనిపుణులతో చికిత్స చేయించుకోవాలి.

    • మితిమీరిన చెమట :
    శరీర ఉష్ణోగ్రత సమతుల్యము గా ఉంచడానికి చెమటపోయడం సర్వసాధారణము . అయితే కోపము , భయము , నిస్సత్తువ , తీవ్ర ఆందోలన లాంటి భావోద్వేగమైన ఒత్తిడికి లోనయినప్పుడు శరీరము వేడెక్కుతుంది. అప్పుడు చెమట పోస్తుంది . దీనివలన ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉంది . ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్నపాటి విషయానికీ అందోళన చెందిన వారు సైకియాట్రిక్ డాక్టర్ని సంప్రదించాలి .

    • చర్మముపై కమిలిన గాయాలు :
    చర్మము పై చిన్న చిన్న గాయాలు , గీచుకుపోవడము జరిగినపుడు ఎర్రగా లేదా గోధుమ రంగులో చర్మము కమిలి పోవడము సాధారణమే అయినా ... ఎలర్జీ వలన మాటిమాటికి ఇలా చర్మము పైన కమిలినట్లు , దురద పుట్టె మచ్చలు కనిపిస్తే మంచిది కాదు . కొన్ని ఎలర్జీ వ్యాధులకు సాంకేతికము అవవచ్చు. ముందుగానే వైద్యుని సంప్రదించి చితిత్స చేయించుకుంటే చాలా మంచిది.

    • కడుపులో తేడా:
    Hurry , worry , curry .. మూలానా నేటి బిజీ జీవితంలో కడుపులో ఎన్నో తేడాలు , నొప్పి, అజీర్ణ బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాంటాసిడ్స్ , జీర్ణం టానిక్ లూ వాడితె సరిపోతుంది . జీవన విధానము మార్పుచేసుకుంటూ బాధలు లేని జీవనాన్ని గడపాలి. కాని కొన్ని సమయాల్లో పేగుల్లో అల్సర్లు , క్యాన్సర్ లు ఇదే రకమైన లక్షణాలు తో కనిపిస్తాయి. బాగా ముదిరిపోతే వైద్యానికి కూడా అందవు . కావున చినపాటి కడుపులో తేడాలకు వైద్యుని సంప్రదించి మంచి సలహా తీసుకోవాలి .


    • ==================
    Visit my website - > Dr.Seshagirirao.com/

    Tuesday, May 15, 2012

    Ejaculation problems,స్ఖలన సమస్యలు



    ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -స్ఖలన సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    శీఘ్ర స్ఖలనాన్ని- ప్రపంచవ్యాప్తంగా పురుషులను ఆవేదనకు గురి చేస్తున్న అతి పెద్ద లైంగిక సమస్యగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన అసంతృప్తికి తోడు.. తన కారణంగా భాగస్వామి కూడా అసంతృప్తికి లోనవ్వాల్సి వస్తోందన్న భావన మనసులో పీడిస్తుండటం దీని తీవ్రతను మరింత పెంచుతోంది.

    స్ఖలనమన్నది మనసూ-శరీరం.. మెదడూ-కండరాలూ సమన్వయంతో సాధించే సంక్లిష్టమైన ప్రక్రియ, గాఢానుభూతి. లైంగిక సంతృప్తికి ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ అనూహ్యంగా, వేగంగా ముగిసిపోతే ఎంత వేదనకు లోనవుతారో సకాలంలో ఆ భావన కలగకపోయినా అంతే సమస్యగా తయారవుతుంది. నిజానికి శీఘ్రం, జాప్యం రెండే కాదు.. స్ఖలన సమయంలో నొప్పి, బాధ; ఒక్కోసారి వీర్యం బయటకు రాకుండా వెనక్కిపోవటం వంటి సమస్యలూ ఎదురవ్వచ్చు. వీటిని అధిగమించటంలో ఆధునిక వైద్యం మంచి పురోగతే సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్యల్లో చాలా సర్వసాధారణంగా, చాలా ఎక్కువగా కనబడే సమస్య- శీఘ్ర స్ఖలనం. ఎంతోమంది దీనితో లోలోపల అసంతృప్తికి లోనవుతూనే ఉన్నా బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. చిన్నతనంగా భావిస్తూ దీనికి చికిత్స తీసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరు. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఒకప్పుడు శీఘ్రస్ఖలనానికి సమర్థ చికిత్సలేవీ ఉండేవి కూడా కావు. వైద్యులు కూడా దీన్ని మానసిక సమస్యల గాటన కట్టేవారు. చాలాసార్లు దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేకపోయినా ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులే వాడేవారు. పరిస్థితి ఏమంత మెరుగవ్వకపోవటం మూలంగా ప్రజల్లో దీనికి సమర్థమైన చికిత్సలే ఉండవన్న భావన బలపడింది. కానీ ఇప్పుడీ విషయంలో వైద్యశాస్త్రం, పరిశోధనా రంగం ఎంతో అభివృద్ధి చెందాయి. నేరుగా స్ఖలనానికి సంబంధించిన మెదడు కేంద్రాల మీదే పని చేసే మందుల వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శీఘ్రస్ఖలనమన్న సమస్యను అర్థం చేసుకునే తీరులోనే ఎంతో మార్పు వస్తోంది.

    • ఆది నుంచీ అపోహలు!
    వీర్యం కూడా ఇతరత్రా సాధారణ శారీరక ద్రవాల వంటిదే అయినా వీర్యంలో ఏదో మహత్తు ఉందని బలంగా విశ్వసించటం దాదాపు అనాదిగా అన్ని సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. వీర్యాన్ని శక్తికి చిహ్నంగా భావిస్తూ, శరీరంలో వీర్యం కొంత మోతాదులో నిల్వ ఉంటుందనీ, స్ఖలనమైనప్పుడల్లా అది కొంచెం కొంచెం తరిగిపోతుందనీ భావిస్తూ అలా వీర్యం పోవటాన్ని 'బలహీనత'కు చిహ్నంగా అపోహపడుతుండేవారు. నిజానికి వీర్యంలో ఏముంటుందో, అది సంతానానికి ఎలా కారణమవుతోందో మనిషికి చాలా శతాబ్దాల పాటు పెద్ద విస్మయంగానే ఉండేది. మొట్టమొదటిసారిగా 1674లో లీవెన్‌హక్‌ అనే శాస్త్రవేత్త వీర్యాన్ని మైక్రోస్కోపు కింద పరీక్షించి శుక్రకణాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ శుక్రకణం స్త్రీ అండాన్ని ఫలదీకరణం చెందించి సంతానికి కారణమవుతోందని 1779లో ''స్పాలెంజని'' నిర్ధారించాడు. అయినా ఇప్పటికీ వీర్యం గురించి మన సమాజంలో అపోహలు ప్రచారంలో ఉండటం విషాదకర వాస్తవం. శాస్త్రీయమైన అవగాహన లేని నాటువైద్యుల విస్తృత ప్రచారం కూడా దీనికి ఒక ముఖ్యకారణం. స్ఖలనం విషయంలో కూడా ఇటువంటి రకరకాల అపోహలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి స్ఖలనం అన్నది గాఢమైన అనుభూతికి కారణమయ్యే సంక్లిష్టమైన చర్య. లైంగికంగా రతిక్రియ ఒక దశకు చేరుకున్న తర్వాత శరీరంలో మెదడు, నాడీ మండలం, కండర వ్యవస్థ వంటివన్నీ కలిసి ఎంతో సమన్వయంతో దీన్ని సాధిస్తాయి. దీన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే దీనికి సంబంధించి రకరకాల సమస్యలూ తలెత్తుతుంటాయి.

    • పరిణామ ఫలం!
    త్వరగా స్ఖలనమవటమన్నది పురుషులకు ప్రకృతి సహజంగానే.. పరిణామక్రమంలోనే వచ్చింది. ఆదిమకాలంలో స్త్రీపురుషులకు ఇప్పటిలా సురక్షితమైన ఇళ్లు, విశ్రాంతి సమయం ఉండేవికావు. వారు చాలావరకూ ప్రమాదరకర పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొనేవారు. పులులు, సింహాల వంటి క్రూర జంతువులు, ప్రకృతి వైపరీత్యాల భయం నిరంతరం వెన్నాడేది. ఇలా లైంగిక చర్య చాలావరకూ మానవ జాతి మనుగడకు ఆధారమైన పునరుత్పత్తి ప్రక్రియగానే కొనసాగింది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వీర్యం స్ఖలనమవటమనేది ప్రకృతి సిద్ధంగానే పురుషుడికి అలవడింది.. ఇదే ఆధునిక మానవుడికీ సంక్రమించింది. అయితే సురక్షితమైన ఇళ్లు, సదుపాయాలు, భయం కలిగించే వాతావరణం లేకపోవటం, ఆటంకం లేకుండా చూసుకోవటం వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనటం ఆరంభించారు. ఇది చాలాసేపు లైంగిక ఆనందాన్ని, అనుభూతులను పొందటానికి వీలు కలిగించింది.

    ఒకప్పుడు సంతానార్థమే అయిన శృంగారం.. ఆనందకరమైన, మానసికోల్లాసానిచ్చే ప్రక్రియగా మారింది. ఇక్కడే అనాదిగా, పరంపరాగతంగా వస్తున్న శీఘ్రస్ఖలన పద్ధతికీ, ఆధునిక మానవుడి గాఢానుభూతి కాంక్షకూ మధ్య సంఘర్షణ మొదలైంది. అందువల్ల ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు తోడ్పడేలా శీఘ్రస్ఖలనానికి చికిత్సలు, మందుల వంటివి చర్చకు రావటం ఆరంభమైంది.

    • శీఘ్ర స్ఖలనం
    శీఘ్రస్ఖలనమన్నది ఎంత సర్వసాధారణ సమస్య అంటే 75% మంది పురుషులు ఎప్పుడోకపుడు దీనికి గురయ్యేవారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతో పాటు వచ్చే 'స్తంభన, పటుత్వ లోపం (ఎరక్త్టెల్‌ డిస్‌ఫంక్షన్‌)' కన్నా దీనితో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ. సంభోగంలో పొల్గొన్నప్పుడు త్వరగా.. అంటే మరికాస్త సమయం లైంగిక చర్యలో పాల్గొనాలని అనిపిస్తున్నప్పటికీ కాస్త ముందుగానే స్ఖలనం అయిపోవటాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవచ్చు. ఇది ఏ వయసువారికైనా రావొచ్చుగానీ యువకులు, మధ్యవయసు వారిలో అధికం. వయసు పెరుగుతున్న కొద్దీ పరిస్థితి మెరుగుపడే అవకాశముంది కూడా. చాలామందికి చాలా సందర్భాల్లో స్ఖలనం మామూలుగానే అవుతుంటుందిగానీ కొన్నిసార్లు మాత్రం త్వరగా అయిపోతుండొచ్చు. దీనికి ఆయా పరిస్థితులు కారణమై ఉండొచ్చు. కొత్త ప్రదేశాల్లోనో, హడావుడిగానో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆత్రుత, భయం, ఆందోళన, ఆదుర్దా మూలంగా శీఘ్రస్ఖలనం జరగొచ్చు. దీనికి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు.
    • ఏది శీఘ్రం..?
    నిజం చెప్పాలంటే శీఘ్రస్ఖలనాన్ని నిర్వచించటం కష్టం. కొందరికి అసలు లైంగిక భావనలు జ్ఞప్తికొస్తేనే స్ఖలనమైపోతుంది. మరికొందరి విషయంలో తమకు తృప్తి దక్కుతున్నా, భాగస్వామిని సంతృప్తిపరిచేంత సమయం ఉండకపోవచ్చు. అందుకే మొత్తమ్మీద సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భాగస్వామి ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ఏ వయసులోనైనా.. అంగప్రవేశానికి ముందు లేదా ప్రవేశమైన వెంటనే చాలా కొద్దిపాటి ప్రేరణలతోనే, తాను ఆశించిన దానికంటే చాలా ముందే స్ఖలనమైపోతుండటాన్ని శీఘ్ర సమస్యగా భావించొచ్చు. ఇతరత్రా శారీరక సమస్యలతో దీని బారినపడే అవకాశం లేకపోలేదుగానీ వారితో పోల్చుకుంటే ఎటువంటి సమస్యాలేకపోయినా శీఘ్రస్ఖలనంతో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ.

    సమస్య చిరకాలమైనదైనప్పటికీ, దీనిపై విస్తృతంగా చర్చలు జరిగినప్పటికీ దీనికి చికిత్స మాత్రం అంత తేలికేం కాదన్నది వాస్తవం. కొన్ని దశాబ్దాల క్రితం దీన్ని ఎదుర్కొనటానికి మానసికమైన 'సైకోసెక్సువల్‌' చికిత్సలు కొన్ని ప్రయత్నించారు. ముఖ్యంగా హెలెన్‌ సింజెర్‌ కప్లాన్‌ వంటి వారు కొంతసేపు ప్రేరేపించి ఒక దశకు రాగానే ఆపటం, కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి ప్రేరేపణ ప్రారంభించటం వంటి 'స్టార్ట్‌-స్టాప్‌' టెక్నిక్‌లను, మాస్టర్స్‌-జాన్సన్‌ వంటివారు 'స్క్వీజ్‌' టెక్నిక్‌లను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చాలా శతాబ్దాలు చికిత్సారంగం వీటి చుట్టూతానే తిరిగిందిగానీ క్రమేపీ వీటి సమర్థతపై రకరకాల అంశాలు వెలుగులోకి రావటం ఆరంభమైంది. చాలా నింపాదిగా, ఓపికగా పాటించాల్సిన ఈ విధానాలు ప్రస్తుత హడావుడి, ఆధునిక కాలంలో ఎంతవరకూ సత్ఫలితాలనిస్తాయన్నదీ అనుమానంగా తయారైంది. అందుకే నేటి ఆధునిక వైద్య పరిశోధనా రంగం చాలావరకూ స్ఖలన ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే మెదడు, నాడుల నియంత్రణల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

    ఇటీవలి వరకూ కూడా శీఘ్రస్ఖలనాన్ని మానసిక సమస్యగా భావిస్తూ శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఔషధ ప్రయోగాల్లో నిరూపణ కాకపోయినా ఆందోళన, చురుకుదనాన్ని తగ్గించే మందులు వాడేవారు. ఆత్మవిశ్వాసం పెంపొందేలా కౌన్సెలింగ్‌ కూడా ఇస్తుండేవారు. కానీ సమస్య పరిష్కారానికి ఇవేవీ సమర్థమంతమైన విధానాలు కావని రాన్రాను బయటపడుతూ వస్తోంది. అయితే ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల మూలంగానే శీఘ్రస్ఖలనం అవుతున్నట్టు గుర్తించిన వారిలో కౌన్సెలింగ్‌ కొంతమేరకు పనిచెయ్యచ్చు. సంభోగం సమయంలో ఆదుర్దా, ఆత్రుత, పనికిరాదని.. సంభోగానికి ముందు ముద్దు ముచ్చట్ల (ఫోర్‌ప్లే) వల్ల భావప్రాప్తి, తీవ్రత (ఇంటెన్సిటీ) మీద నియంత్రణ వస్తుందని.. అవగాహన పెంచటం వల్ల ఉపయోగం ఉండొచ్చు. కానీ ఈ పద్ధతి అందరికీ పనికిరాదు. ఫలితాలు అంతంత మాత్రమే. పైగా సంభోగానికి ముందు ప్రతిసారీ ఈ సూచనలు పాటించటం కుదరకపోవచ్చు. తమను తాము నియంత్రించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పద్ధతులకు భాగస్వామి సహకరించకపోవటం, అసంతృప్తికి లోనుకావటం వంటివీ జరగొచ్చు. అందువల్ల మందులతో ఫలితం కనబడనివారికి మాత్రమే ఇలాంటి సైకో సెక్సువల్‌ కౌన్సెలింగ్‌ సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుతం శీఘ్రస్ఖలన చికిత్సలో కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ''డెపాక్సటీన్‌ (ప్రిలిజీ)'' అనే మందు బాగా పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లోనూ, అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీన్ని ఇటీవలే చాలా ఐరోపా దేశాల్లో అధికారికంగా విడుదల చేశారు. త్వరలో దీనికి అమెరికా 'ఎఫ్‌డీఏ' అనుమతీ రావొచ్చు. ఇది మానసిక సమస్యల్లో వాడే మందుల్లా కాకుండా శీఘ్రస్ఖలన ప్రక్రియకు దోహదం చేసే మెదడులోని భాగాల మీద నేరుగా పనిచేస్తుంది. మున్ముందు ఈ తరహా మందలు మరిన్ని వచ్చే అవాకాశం కనబడుతోంది.
    • స్ఖలనం కాకపోవటం
    కొద్దిమందికి అసలే స్ఖలనం కాదు. దీన్ని 'అనెజాక్యులేషన్‌' అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి నిజంగానే స్ఖలనం కాకపోవటం. దీనికి వీర్యం ఉత్పత్తి చేసే, దాన్ని నిల్వచేసే భాగాలు సరిగా అభివృద్ధి చెందకపోవటమో.. వీర్యం బయటకు వచ్చే మార్గంలో అడ్డంకులు ఏర్పడటమో కారణం కావొచ్చు. రెండోది నాడీ సంబంధ సమస్యలు. స్ఖలనాన్ని ప్రేరేపించేందుకు అవసరమైన నాడులు పని చేయకపోయినా అసలే స్ఖలనం కాకపోవచ్చు. ఇవి కాకుండా మానసిక సమస్యల కారణంగా భావప్రాప్తి లేక, స్ఖలనం కాకపోవటం కూడా జరగొచ్చు. కొందరికి ఒక భాగస్వామితో స్ఖలనం సాధ్యమైనా మరొకరి వద్ద స్ఖలనం కాకపోవటం, హస్తప్రయోగ సమయంలో స్ఖలనమవుతూ సంభోగంలో కాకపోవటం, తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్ల స్ఖలనం కాకపోవటం వంటివి జరుగుతాయి.

    తీవ్రమైన మానసిక సమస్యల్లో ఉన్న కొందరు మెలకువగా, పూర్తి స్పృహలో ఉన్నప్పుడు స్ఖలించలేకపోవచ్చుగానీ వీరికి రాత్రి నిద్రాసమయంలో స్ఖలనాలు మామూలుగానే ఉండొచ్చు. వీరికి కారణాన్ని బట్టి కౌన్సెలింగ్‌, మందులతో ఉపయోగం ఉంటుంది. వైబ్రేటర్‌ థెరపీ ఇవ్వటం, విద్యుత్‌ ప్రచోదనాల ద్వారా ప్రేరేపణ ఇచ్చి స్ఖలమమయ్యేలా చెయ్యటం (ఎలక్ట్రోఎజాక్యులేషన్‌) వంటి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్ఖలన మార్గంలో అవరోధాల వంటివి ఉంటే సర్జరీతో సరిచెయ్యాల్సి ఉంటుంది.

    • జాప్య స్ఖలనం!
    శీఘ్రస్ఖలనానికి పూర్తి భిన్నమైన సమస్య- జాప్య స్ఖలనం. చాలామంది దీంతో ఇబ్బందేంటని, సంభోగంలో మరికాస్త సమయం ఆనందంగా ఉండొచ్చు కదా అని ప్రశిస్తుంటారు. కానీ శృంగారంలో గాఢమైన అనుభూతికి, ఆనందానికీ- కేవలం అంగాన్ని ప్రవేశపెట్టటం, తుంటి కదలికలు మాత్రమే కారణం కాదు. పైగా దీర్ఘసమయం ఈ చర్యలతో భాగస్వామికి అసౌకర్యం, నొప్పి కూడా ఎదురవుతాయి. ఒకవేళ స్త్రీ అప్పటికే భావప్రాప్తి పొంది ఉంటే అంతే ఉత్సాహంతో సంభోగానికి సహకరించకపోవచ్చు. ఆమెలో మృదువైన కదలికలకు అవసరమైన స్రావాలూ తగ్గిపోతాయి. ఎంత ప్రయత్నిస్తున్నా స్ఖలనం జరగకపోవటం వల్ల పురుషుడికీ తృప్తికర అనుభూతులుండవు. ఇలా జాప్య స్ఖలనంతో అసౌకర్యమే కాదు, భాగస్వామితో సంబంధాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి చికిత్స తప్పనిసరి. ప్రధానంగా తరచుగా హస్తప్రయోగానికి అలవాటుపడిన వారు అంగంపై ఎక్కువ బిగువుగా, ఒత్తిడి ఇచ్చుకోవటానికి అలవాటుపడతారు. కానీ వాస్తవంగా సంభోగ సమయానికి వచ్చేసరికి భాగస్వామి నుంచి వారికి అదే తీరులో బిగువు లభించదు. దీనివల్ల స్ఖలనంలో జాప్యం
    జరిగే అవకాశం ఉంటుంది. ఒకపక్క భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటూనే.. ఆ అనుభూతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా శృంగారానికి సంబంధించి మనసులో ఏవేవో ఊహించుకుంటూ, గత భావనలను గుర్తుచేసుకుంటూ, వాటి గురించి మధనపడుతుండటం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. లైంగిక భావనలకు, గాఢానుభూతికి శారీరక ప్రేరణల కంటే మానసిక భావోద్వేగాలూ కీలకమే. కాబట్టి సాధ్యమైనంత వరకూ వీరు శృంగార ప్రేరణనిచ్చే లైంగిక భావనల మీద దృష్టిపెట్టటం చాలా అవసరం. తన భాగస్వామిలో తనను ప్రేరేపించే అంశాల వంటివాటి మీద దృష్టి పెట్టటం, భాగస్వామిని కూడా ఇష్టమైన రీతిలో ప్రేరేపించమని కోరటం మంచిది. భాగస్వామిని తృప్తిపరుస్తున్నానా? లేదా? అన్న అంశం గురించి మరీ అతిగా మధనపడుతున్నారేమో చూసుకోవటం కూడా అవసరం. లైంగిక తృప్తి అన్నది కేవలం భాగస్వామికి ఇచ్చేదీ, ఇవ్వాల్సిందే కాదు, ఇందులో తాను పొందాల్సిందీ ఉందన్న భావన అలవరచుకోవాలి. నేరుగా సంభోగ సమయంలో అంగాంగ ప్రేరణకు పూనుకోవటం వల్ల సున్నితమైన భాగాలు మొద్దుబారి, స్పందించకుండా తయారయ్యే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ముందస్తు ముద్దుముచ్చటలకు, ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఎంత సమయం గడిపాం, టైమ్‌ ఎంత గడిచిందన్న భావనలను మనసులో నుంచి తుడిచిపెట్టెయ్యటం అవసరం. భాగస్వామి ఇబ్బందిపడుతూ ఫిర్యాదు చేస్తే తప్పించి లేకుంటే ఆనందించటం మీదే దృష్టిపెట్టటం మంచిది. సంభోగ సమయంలో కసిగా, ఆగ్రహంగా, ఆందోళనగా, భయంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల నాడీమండల స్పందనలు కొన్ని కొరవడి, స్ఖలనం, భావప్రాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండటం, ప్రశాంత చిత్తంతో ఉండటం, భాగస్వామితో కలిసిమెలిసి భావోద్వేగాలను పంచుకుంటూ ఉండటం ముఖ్యం.

    • వీర్యం వెనక్కిపోవటం
    కొందరికి స్ఖలనమైనా వీర్యం బయటకు రాకుండా వెనక్కి మళ్లి... మూత్రాశయంలోకి వెళ్తుంది. దీన్ని 'రెట్రోగ్రేడ్‌ ఎజాక్యులేషన్‌' అంటారు.చూడటానికి ఇందులో పైకి అసలు స్ఖలనమే కానట్టుంటుంది. పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడుతుంది. వీరిలో వీర్యం తయారయ్యే భాగాలు సక్రమంగానే ఉంటాయి. భావప్రాప్తి బాగానే ఉంటుంది, వీర్యం స్ఖలనమైన భావన కూడా కలుగుతుంటుంది గానీ వీర్యం బయటకు రాదు. స్ఖలన సమయంలో మామూలుగా మూత్రాశయం చివ్వరి భాగం, అక్కడి స్ఫింక్టరు మూసుకుపోయి వీర్యం వెనక్కి.. మూత్రాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూంటాయి. కానీ వీరిలో అవి సరిగా పనిచేయకపోవటం మూలంగా వేగంగా బయటకు రావాల్సిన వీర్యం.. దారిమళ్లి మూత్రాశయంలోకి వెళుతుంటుంది. మూత్రాశయం చివరి భాగానికి ఏదైనా దెబ్బతగలటం, నాడీసంబంధ సమస్యల వల్ల ఆ ప్రాంతం పట్టుకోల్పోవటం వంటి కారణాల వల్ల తలెత్తే సమస్య ఇది. సంభోగానంతరం వీరు మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు అతి తెల్లగా, మబ్బుగా అనిపిస్తుంటుంది. మధుమేహం కారణంగా నాడీమండల సమస్యలున్న వారిలో ఇది ఎక్కవగా కనబడుతుంటుంది. అలాగే వెన్నుపాము సమస్యలు, వెన్నుకు సర్జరీలు, మూత్రాశయం ప్రోస్టేటు గ్రంథి సర్జరీలు చేయించుకున్న వారిలో ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. కొన్ని రకాల మందులూ దీనికి కారణం కావచ్చు. ఇమిప్రమైన్‌, ఎఫిడ్రిన్‌, ఫినైల్‌ప్రొపనోలమైన్‌ వంటి మందులతో దీనికి చికిత్స చేస్తారు. వీటితో చాలామందికి సమర్థమైన ఫలితాలు లభిస్తాయి. స్ఖలనం కాకపోవటం, వీర్యం వెనక్కి పోయే సమస్యలు సంతానలేమికి దోహదం చేస్తాయి. అయితే వీర్యం వెనక్కి మళ్లే వారిలో మూత్రాశయం నుంచి వీర్యకణాలు బయటకు తీసి ఐవీఎఫ్‌ వంటివిధానాల ద్వారా స్త్రీయోనిలోకి ప్రవేశపెట్టటం ద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంది.

    • స్ఖలనంలో నొప్పి
    కొందరికి స్ఖలన సమయంలో నొప్పి వస్తుంటుంది. రక్తం కూడా పడుతుంది. కొన్ని రకాల వాపులు, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు దీనికి దోహదం చేయొచ్చు. అవన్నీ వ్యాధి సంబంధమైనవే కానీ శృంగార పరమైన స్ఖలన సమస్యలుగా భావించలేం. వీటిని గురించి వైద్యులతో చర్చించటం చాలా అవసరం.


    Courtesy with : Dr.Sudhakar Krishna murty , sexual medicne Specialist, Andromeda Andrology Center, panjagutta - Hyd.@Eenadu sukhibhava.

    • ========================
    Visit my website - > Dr.Seshagirirao.com/