ఒకవేళ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారానికే పరిమితం కాకుండా ఇతర భాగాలకు పాకిందేమో అన్న అనుమానం క లిగితే శరీరం మొత్తాన్ని పరిశీలించడానికి పెట్ సీటీ -స్కాన్ చేయించవలసి ఉంటుంది. ఒకవేళ స్టేజ్ 3బిలో గుర్తించినా కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా 25 శాతం మందికి పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడినా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను ఆలస్యంగా అంటే 3బి స్టేజ్ దాటిన తరువాతే గుర్తించినా ఆధునికమైన కొన్ని చికిత్సల ద్వారా వారి జీవిత కాలాన్ని బాగా పొడిగించే అవకాశాలు ఉంటాయి.
క్యాన్సర్ చికిత్సలు రోగి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. జీవితం మీద ఆశలు హరింపజేస్తాయి. క్యాన్సర్ వ్యాధి ఎంత వేగంగా విస్తరిస్తున్నదో ఆ వ్యాధి నివారణకు అంతే వేగంగా ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న చాలా రకాల క్యాన్సర్ సమస్యలకు ఇప్పుడు కొంత వరకు పరిష్కారమార్గం లభించింది. ముఖ్యంగా ఆధునిక చికిత్సా విధానాల ద్వారా రోగికి ఎంతో ఊరట కలుగుతున్నది. క్యాన్సర్ చికిత్సా విధానంలో వచ్చిన ఆధునిక పద్ధతుల్ని వివరిస్తున్నారు యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఆంకాలజిస్టులు.
టార్గెట్ థెరపీతో ట్యూమర్ ్సకు చెక్
మన దేశంలో ఎక్కువగా పురుషులు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. పొగతాగటంతోపాటు పొగాకుతో చేసిన ఉత్పత్తులను నమలటం, మారిన ఆహారపు అలవాట్లు, వైరస్‌ల వల్ల పురుషులకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వస్తుంది. కారణాలేవైనా నోటిలో అల్సర్ రావటం, రక్తం స్రవించటం, గొంతు వద్ద గడ్డ ఏర్పడటం, గొంతు ధ్వని మారటం, నోటిలో నొప్పి అనిపించటం ఈ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో గుర్తించ వచ్చు.
ఈ వ్యాధిన ప్రాథమిక దశలో గుర్తిస్త్తే దీన్ని నిర్మూలించడం చాలా సులభం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కు ఓరల్‌కెవిట్ ఓరో ఫారినెక్స్, హైపోఫారినెక్స్‌ల విధానాల ద్వారా కీమోథెరపీ, రేడియో థెరపీ చికిత్సల ద్వారా నయం చేయవచ్చు. ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్స్‌ను నిర్మూలించవచ్చు.
వైరస్ ఇన్‌ఫెక్షన్, ధూమపానం వల్ల మహిళలు సెర్వైకల్ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. పట్టణ మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గ్రామీణ మహిళలకు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జననాంగం నుంచి రక్తం స్రవించటం, వైట్ డిశ్చార్జి, నీళ్లు రావటం, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌లకు గురికావటం సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ క్యాన్సర్‌ను ప్యాప్సీమేర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య గల మహిళలు రెండు,మూడేళ్లకు ఓ సారి ప్యాప్సీమేర్ పరీక్షలు చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్‌ను కీమోథెరపీ, రేడియో థెరపీల ద్వారా నివారించవచ్చు. ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో కొత్త విధానంలో సాధారణ కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్ ట్యూమర్స్‌ను మాత్రమే తొలగించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవటం ఉత్తమం. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది.
అన్ని రకాల క్యాన్సర్‌ల చికిత్సలలో రేడియో థెరపీ నేడు కీలకంగా మారింది. కొన్ని శరీర భాగాల్లో కీమోథెరపీ, శస్త్రచికిత్సలు చేయలేము. అలాంటి ప్రాంతాల్లో కూడా రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించవచ్చు. స్వరపేటిక, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు గతంలో వాటిని సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఆధునిక వైద్యంతో రేడియేషన్ ద్వారా స్వరపేటిక, బ్రెస్ట్‌ను పూర్తిగా తొలగించకుండానే కేవలం క్యాన్సర్ ట్యూమర్లను మాత్రమే రేడియోథెరపీ ద్వారా నిర్మూలించవచ్చు. 80శాతం క్యాన్సర్‌లకు చికిత్సలో రేడియోథెరపీ అవసరమవుతుంది. తొందరగా క్యాన్సర్‌ను గుర్తించటంతోపాటు ఆధునిక వైద్య విధానాలతో సాధారణ కణాలు దెబ్బతినకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే తొలగించేందుకు రేడియోథెరపీ విశేషంగా ఉపయోగపడుతుంది. ఇంటెన్సివ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (ఐఎంఆర్‌టి) రేడియోథెరపీలో హై ఎనర్జీ ఎక్స్‌రే కిరణాల సాయంతో ఎక్కువ డోసు మందును ఇచ్చి క్యాన్సర్ గడ్డలను సులభంగా తొలగిస్తారు. ఈ చికిత్స వినిమల్ ఎక్స్‌లరేటర్ సాయంతో చేస్తారు.
ఇమేజ్ గ్రెడెడ్ రేడియోథెరపీ (ఐజిఆర్‌టి) : ర్యాపిడ్ఆర్క్ యంత్రం సాయంతో చికిత్స చేసే ముందు క్యాన్సర్ ట్యూమర్‌ను చూస్తారు. క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉందో, అక్కడకు మాత్రమే రేడియోథెరపీ ద్వారా ఆయా క్యాన్సర్‌కారక కణాలను చంపేస్తారు. వాల్యూహెట్రిక్ ఆర్క్ థెరపీ : ఈ విధానంలో ర్యాపిడ్ ఆర్క్ మిషన్ సాయంతో వేగంగా క్యాన్సర్ ట్యూమర్‌ను ఒకే సారి నివారిస్తారు. ఈ రేడియోథెరపీ కేవలం రెండు,మూడు నిమిషాల్లోనే పూర్తి అవుతుంది.
సైబర్‌నైఫ్ రేడియో సర్జరీ : రోబోటిక్ చేతికి వినిమల్ ఎక్స్‌లరేటర్‌ను తొడిగిస్తారు. రోబో సాయంతో క్యాన్సర్ ట్యూమర్‌ను గుర్తించి దాన్ని తొలగిస్తారు.
టోమోథెరపీ : ఈ విధానంలో సీటీ స్కాన్ తరహాలో స్లైస్ స్లైస్‌లుగా క్యాన్సర్ ట్యూమర్‌ను తొలగిస్తారు.
శస్త్రచికిత్సతో 90 శాతం క్యాన్సర్‌లను పూర్తిగా నయం చేయవచ్చు. మూడు దశల్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి సర్జరీయే మేలు. బ్రెస్ట్, నోటి, కొలొరెక్టల్, సెర్వైకల్ క్యాన్సర్‌లను శస్త్రచికిత్సతో సులభంగా నయం చేయవచ్చు. గతంలో క్యాన్సర్ వచ్చిన శరీర భాగాన్ని పూర్తిగా తొలగించేవారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్యంతో ఆర్గాన్ ప్రిజర్వేటివ్ సర్జరీలు చేయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినపుడు దాన్ని మొత్తం తొలగించకుండా బ్రెస్ట్ కంజర్వేటివ్ సర్జరీ చేయవచ్చు. క్యాన్సర్ గడ్డను మాత్రమే యాక్సిలరీ డిసెక్షన్ ద్వారా తొలగించి, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొడలోని కండతో బ్రెస్ట్ రీ కన్‌స్ట్రక్షన్ చేయవచ్చు. దీనివల్ల రొమ్ము ఆపరేషన్ తర్వాత కూడా సాధారణంగానే ఉంటుంది. బ్రెస్ట్‌లో ఏర్పడిన చిన్న క్యాన్సర్ గడ్డలను రోల్ టెక్నిక్ ద్వారా తొలగించవచ్చు. మెమోగ్రఫీ ద్వారా జే వైర్ సాయంతో ట్యూమర్‌ను గుర్తించి తొలగిస్తారు.
అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ : ఈ విధానంలో కొలోరెక్టర్ క్యాన్సర్స్ అయిన లివర్, ఉదరభాగాల్లో ఏర్పడిన క్యాన్సర్‌లను చిన్న రంధ్రం ద్వారా హార్మోని స్కాల్‌వెల్‌ను పంపించి క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగిస్తారు.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అండ్ రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీ : ఈ విధానంలో నోటి, స్వరపేటిక, గొంతు క్యాన్సర్‌లకు చికిత్స చేయటంతోపాటు క్యాన్సర్ ట్యూమర్‌లు తొలగించిన భాగాల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కాలి ఎముక, చేతి చర్మాన్ని అతికిస్తారు. ఆర్గాన్ లేజర్ కార్బన్‌డయాక్సైడ్ శస్త్రచికిత్స : స్వరపేటిక, నోటిక్యాన్సర్‌ల నివారణకు లేజర్ ట్రీట్‌మెంట్ చేస్తారు. కార్బన్‌డయాక్సైడ్ ఆర్గాన్ లేజర్ కిరణాల సాయంతో క్యాన్సర్ టిస్యూను కాల్చి తొలగిస్తారు.
రేడియో ప్రీక్వెన్సీ అబ్‌లేటర్ చికిత్స: లివర్ క్యాన్సర్‌కు రేడియో ప్రీక్వెన్సీ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి దాని సాయంతో లివర్‌ను పూర్తిగా తొలగించకుండానే అందులో ఉన్న క్యాన్సర్ టిస్యూలను కాల్చివేస్తారు.
ప్రొస్టేట్ క్యాన్సర్‌కు రోబోటిక్ సర్జరీ : ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించేందుకు రోబో సాయంతో చేసే ఆపరేషన్‌ను రోబోటిక్ సర్జరీ అంటారు.
Courtesy with Dr.Ch.Mohana Vamsy,Oncologist, Omega hos.Hyd.
- ===================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.