Friday, February 21, 2014

HPV టీకా , HPV vaccine(వాక్సిన్)

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -HPV టీకా , HPV vaccine(వాక్సిన్) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  HPV infection (human papillomavirus) is very common. Near 20 million people in the U.S. are affected. Near 30 two 100 HPV types are transmitted sexually. This transmission of HPV can cause genital warts or abnormal cell changes in the cervix and other genital areas that can lead to cancer.

టీకా (vaccine) అనగా వ్యాధి నిరోధకత (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ (Edward Jenner) మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్దికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.

HPV వైరస్  ఒకరినుంచి ఇంకొకరికి  అరక్షిత అంటే అన్-సేఫ్  రతిక్రియ వల్లనే  పాకుతుంది. అంటే స్ప్రెడ్  అవుతుంది.   అందువల్ల రతిక్రియ  లో పాల్గొనాలని అనుకునే యువతీ యువకులు, కామ లేక రతి ద్వారా కలిగే లేక పాకే ఇన్ఫెక్షన్ లు అన్నిటికీ ముందే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.  ఇది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ ,  ఇరువురికీ ఎంతో శ్రేయస్కరం.

వైరస్ ప్రత్యేకత
సాధారణంగా బాల్యంలో చికెన్‌పాక్స్ గానీ, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ వ్యాధులు సోకినప్పుడు శరీరంలో వాటిని ఎదిరించే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఆ సమస్య మరోసారి రాదు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను కలిగించే ప్యాపిలోమెటస్ వైరస్ మాత్రం ఎంతో తెలివైౖనది. ఇది గర్భాశయ ముఖద్వారంలోని కణాల్లోకి వెళుతుంది. కణాల్లోని న్యూక్లియస్‌లోకి ప్రవేశిస్తుంది. న్యూక్లియస్‌తో పాటు విభజనకు గురవుతుంది. కానీ, కణాలను చంపదు. సహజంగా కణాలను చంపినప్పుడే వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం మొదలెడుతుంది. ఈ వైరస్ కణాల్లోనే ఉంటున్నా, వాటిని చంపదు కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థకు ఇది దొరకదు. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెరగదు. అందుకే టీకాల ద్వారానే ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచవలసి ఉంటుంధి.

HPV టీకా  లేక HPV వాక్సిన్ :  ఇప్పటి వరకూ రెండు మందుల కంపెనీలు  ఈ HPV టీకా ను తయారు చేస్తున్నాయి.  HPV వైరస్ లు  వంద కు పైగా ఉన్నాయి. అందు లో ముఖ్యమైన 6,11,16,18 రకాలు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ లకు కారణం. అందు వల్ల ఈ టీకాలు వేయించుకుంటే చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ HPV టీకా,  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా  సంపూర్ణ రక్షణ ఇవ్వదు. ప్రతి యువతీ, ఈ టీకాను వారు రతి క్రియ లో  ప్ర ప్రధమం గా పాల్గొన బోయే సమయానికి ముందే  వేయించుకోవాలి. ఒకసారి రతి క్రియా జీవితం మొదలు పెడితే, ఇన్ఫెక్షన్ కనుక సంభవిస్తే  ఈ టీకా పూర్తి రక్షణ ఇవ్వదు. 12 నుంచి 13 ఏళ్ళ వయసు మధ్య ఉన్న అమ్మాయిలకు , మూడు టీకాలు, ఆరు నెలల వ్యవధి లో ఇస్తారు.

HPV టీకా తీసుకుంటే  స్మియర్ టెస్ట్  అవసరం లేదా ? :

వైరస్ లకు దయా, దాక్షిణ్యాలు ఏవీ ఉండవు. అతి క్రూరమైనవి. విచక్షణా రహితంగా  ముట్టడి చేస్తాయి, మానవులని. నిజ జీవితం లో  సర్వైకల్ క్యాన్సర్  ను అత్యంత తోలి దశలలో గుర్తించడానికి  ఒక ప్రత్యెక మైన పరీక్ష చేస్తారు. ఆ పరీక్షను   ప్యాప్ స్మియర్ టెస్ట్ లేక సింపుల్ గా స్మియర్ టెస్ట్ అంటారు.
ప్యాప్ స్మియర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే,  జార్జ్  పాపనికలో  అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు  మానవ  కణాలను, ఆ కణాలలోని మార్పులను స్పష్టం గా  గుర్తించడానికి అవసరమైన రసాయనాలను కనిపెట్టాడు. అందువలన. ఈ ప్యాప్ స్మియర్ పధ్ధతి వలన, సర్వైకల్  ఎపితీలియల్ అంటే ఉపరితలం మీద ఉన్న కణాలలో మొట్టమొదటి గా జరిగే మార్పులు, స్పష్టం గా గుర్తించవచ్చు. ఇలా గుర్తించి నట్లయితే, చికిత్స కూడా  సులభం అవుతుంది. ఎందుకంటే, వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా  ఆ  ( మార్పు చెందిన క్యాన్సర్ ) కణాలను నిర్మూలించ వచ్చు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు అత్యంత వేగం గా మల్తిప్లై  అవుతాయి. అంటే రెండు, నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు ………..ఇలా చాలా వేగంగా సంఖ్యా పెరిగి పెద్ద వ్రణం లేక రాచ పుండు లా తయారవుతుంది.
ఇంకో ముఖ్య విషయం : ఈ పెరిగిన కణాలు అక్కడే ఉండక రక్తం ద్వారా, లేక లింఫు గ్రంధుల ద్వారా శరీరం లో మిగతా భాగాలకూ పాకుతాయి. దానినే స్ప్రెడ్ అవటం అంటారు. ఈ కారణం వల్లనే ,  అత్యంత తొలిదశ లో ఉన్నప్పుడు కనుక్కొని, ఆ కణాల ను నిర్మూలించడం మంచి పధ్ధతి.

ప్యాప్ స్మియర్ ద్వారా చూసే కణాలను కొన్ని రకాలు గా విభ జించుతారు. CIN 1:  ఈ దశలో  సర్వైకల్ కణాలలో మార్పులు మొదటి దశలో ఉంటాయి. CIN2: ఈ దశలో కణాలలో మార్పులు మోడరేట్ గా ఉంటాయి అంటే మధ్యస్తం గా, CIN 3: ఈ దశలో కణాలు ఎక్కువ మార్పులతో క్యాన్సర్ కణాలుగా ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.

ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్  లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్  క్రమంగా అంటే  ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.

  • హెచ్పీవీ వ్యాక్సిన్లు
‌గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మూడు విడతలుగా ఇవ్వాలి..గార్డాసిల్, సర్వారిక్స్ అన్న పేర్లతో లభిస్తున్న ఈ టీకాలను ఆరు మాసాల కాలంలో మూడు సార్లు, మూడు డోసులుగా ఇవ్వవలసి ఉంటుంది.

12-16 ఏళ్లలోపు అమ్మాయిలకు (సెక్సులో పాల్గొనడం మొదలుపెట్టని) ఇవ్వడం మంచిది. ఈ వ్యాక్సిన్లలో ఒకటి (బైవాలెండ్‌) 10-45 ఏళ్లలోపువారికి, రెండోది (క్వాడ్రివాలెండ్‌) 9-26 సంవత్సరాలలోపు యువతలకూ ఇవ్వొచ్చు. వ్యాక్సిన్‌ తీసుకునేముందు హెచ్‌పీవీ పరీక్ష అవసరంలేదు. లైంగిక జీవితం ఆరంభించిన స్త్రీలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే ఒకరకం హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఇప్పటికే ఉన్నా మిగిలినవి రాకుండా చూడవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడేందుకు ఇచ్చేవి మాత్రమే. అప్పటికే ఉన్న వాటిని నయం చేయడానికి పనికి రావు. వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదాని.. పాప్‌ స్మియర్‌ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉండాలి.

 Courtesy with : Wikipedia.org

  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.