Wednesday, February 26, 2014

Hints in running exercise, పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు,

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు,- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
  •  

  •  
    నడవటం.. పరుగెట్టటం.. చాలా తేలికైన వ్యాయామాలు. వీటికి ఎలాంటి సాధనాలతోనూ పనిలేదు. కాళ్లకు షూ, పరుగెట్టాలనే కోరిక ఉంటే చాలు. ఎవరైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. అయితే పరుగెత్తటంలోనూ కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. దీంతో త్వరగా అలసిపోకుండా, ఎక్కువసేపు పరుగెత్తే అవకాశముంది. గాయాల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు. ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగొచ్చు. కాబట్టి పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటో చూద్దాం.
* పరుగెత్తేటప్పుడు తలను నిటారుగా ఉంచాలి. సుమారు 30-40 మీటర్ల దూరం మేరకు ముందుకు చూడాలి. పాదాలవైపు, కిందికి చూస్తూ పరుగెడితే మెడ, భుజాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే దవడ, మెడ గట్టిగా బిగపట్టకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి.

* భుజాలు కాస్త వెనకగా, కిందికి ఉండేలా చూసుకోవాలి. పైకి లాక్కుని, బిగపట్టి ఉంచితే భుజాలపై బాగా ఒత్తిడి పడుతుంది. శ్వాస సరిగా ఆడదు. దీంతో కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు.

* చేతులను మోచేతి వద్ద 90 డిగ్రీల కోణంలో వంచాలి. ముందుకూ వెననకూ కదిలిస్తూ సాగాలి. శరీరానికి అడ్డంగా కదిలించకూడదు. చేతుల కదలికలు శరీరం ముందుకు దూసుకుపోవటానికి తోడ్పడతాయని గుర్తుంచుకోవాలి.

* శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచకుండా కాస్త ముందుకు వంగేలా చూసుకోవాలి. దీంతో గట్టి నేలపై పరుగెడుతున్నప్పుడు ఆ ప్రభావం శరీరం మీద అంతగా పడకుండా చూసుకోవచ్చు.

* మోకాళ్లను మరీ పైకి లేపటం మంచిది కాదు. అలాగే పైకీ కిందికీ గెంతినట్టు పరుగెత్తటమూ చేయొద్దు. మోకాళ్లను కాస్త ముందుకు వంచుతూ, అడుగులు వేయాలి. దీంతో పాదాలపై భారం తగ్గుతుంది.

* అడుగు వేస్తున్నప్పుడు నేలకు ముందుగా కాలి వేళ్లను గానీ మడమను గానీ తాకించొద్దు. ముందుగా మధ్యపాదం నేలకు ఆనించటం సురక్షితమైన పద్ధతి.

* ఎట్టిపరిస్థితుల్లోనూ పాదాలను నేలకు గట్టిగా చప్పుడు వచ్చేలా తాకించొద్దు. ఇలా చేస్తే పాదాలపై, మోకాళ్లపై చాలా భారం పడుతుంది.

* నోటితో పీల్చుకుంటున్నా, ముక్కుతో పీల్చుకుంటున్నా శ్వాసను మాత్రం దీర్ఘంగా.. లయబద్ధంగా తీసుకోవాలి. ప్రతి రెండు అంగలకు ఒకసారి శ్వాస తీసుకునేలా ప్రయత్నించాలి.


  • ==================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.