Wednesday, July 16, 2014

Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Hints for Flashing white teeth,దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే-చిట్కాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



 సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మరియు కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా వసరం. ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి. పసుపు రంగు దంతాలను నివారించే ఉత్తమ పదార్థాలు, ఏమేమి తింటే మీ దంతాల అలా ప్రభావితం అవుతున్నాయి తెలుసుకోవాలి.  ప్రస్తుతం దంతాలు తెల్లబడటానికి మార్కెట్లో అనేక విధానాలు మరియు ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పనిలేకుండా, సహజపద్దతులో మీ దంతాలు మిళమిళమిరిపంప చేసే  నేచురల్ టిప్స్ ఇక్కడ చూడండి .

*మౌత్ వాష్, కాఫీ మరియు సోడాల వంటి వాటికి దూరంగా ఉండండి: కాఫీ, సోడా మరియు కొన్ని సార్లు మౌత్ వాష్ లు కూడా మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండాలి .

*రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి: 
ఒక రోజుకు కనీసం రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం . అందువల్ల మీ దంతాలలో మరియు నాలు మీద అతుకొన్ని ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా సహాయపడుతుంది . అందువల్ల, ఎల్లో మరకలు నివారించాలంటే, రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయడం తప్పనిసరి .

*పండ్లు తినాలి: కొన్ని సార్లు మీరు ఆతురతతో ఉన్నప్పుడు సరిగా బ్రష్ చేయరు. అటువంటప్పుడు మీరు ఫైవర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మీ దంతాలు నేచులర్ గా శుభ్రపడుతాయి. అలాగే సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. అందుకు అవసరం అయ్యే సలివాను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇది మీ దంతాలు శుభ్రపరచడానికి మరియు దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి. మరియు పండ్లలో విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి మీ దంతాలను బలోపేతం చేస్తాయి. ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరమైనవి, వీటిలో అధికంగా నీరు అధికంగా ఉంటుంది . ఇది లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది.

 *ఫ్లాసింగ్ : ఫ్లాసింగ్ చేయడం వల్ల చిగుళ్ళ నుండి అధిక రక్తస్రావం జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ జాగ్రత్తగా మరియు ఓపికగా చేయడం వల్ల మీ దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మరియు మీ పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది.

*పాల ఉత్పత్తులు: జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి మరియు దంతాల యొక్క స్వచ్ఛత మరియు అభివృద్ధి నిర్వహించడానికి సహాయపడుతుంది . ఎనామిల్ ను రక్షణ కల్పించడంలో మరియు బలోపేతం చేయడంలో హార్డ్ చీజ్ అంటే మృదువైన జున్నులు పళ్ళును శుధ్దిచేసి, అత్యంత సమర్థవంతంగా మరియు తెల్లగా మార్చుతాయి.

*నువ్వు గింజలు : నువ్వులు నాలుక మీద బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు ఇది పళ్లఎనామిల్ నిర్మాణానికి సహాయపడుతుంది. వీటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది, ఇది మీ దంతాల చుట్టూ ఉన్న ఎముకలను రక్షణకు సహాయపడుతుంది . పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఇ వంటివి మంచి మూలంగా ఉన్నది. ఇవి ఇంకా ముఖ్యమైన మినిరల్స్ అంటే మెగ్నీషియన్ ను అందిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు నమలడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు పడకుండా రక్షణ కల్పిస్తుంది.

* స్ట్రాను ఉపయోగించండి: స్ట్రాను ఉపయోగించడం వల్ల మీ దంతాల మీదు మరకలు పండకుండా నిరోధించవచ్చు. ఏదైనా కలర్ డ్రింక్ త్రాగుతున్నప్పుడు , దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలకు తగలకుండా నోట్లోకు పోవడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడటానికి అవకావం ఉండదు.

* వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంది, ఇది పళ్ళు ఎనామెల్ యొక్క నిర్మాణంకు సహాయపడుతుంది. కాబట్టి, ఈ కూరగాయలరు పచ్చిగా తినడం వల్ల పళ్ల మద్య సహజంగానే మాసాజ్ చేస్తాయి దాంతో పళ్ళ మద్య శుభ్రం అవుతుంది. ఇంకా దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*నిమ్మ , ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించండి నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి. మీ దంతాలు తెల్లగా మారాలంటే ఈ రెండింటి మిశ్రమంతో రెగ్యులర్ గా బ్రష్ చేయాలి.

*ప్రతి రెండు నెలల కొకసారి కొత్త బ్రష్ ఉపయోగించండి ఉత్తమ ఫలితాలు పొందడం కసం రెగ్యులర్ ఇంటర్వెల్స్(తరచూ)రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చుతుండాలి. ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి. దాంతో మీ దంతాల యొక్క ఎనామిల్ ను పాడుచేస్తుంది. దాంతో మీ దంతాల మీద మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది.

* మీ కాల్షియం తీసుకోవడం మెయింటైన్ చేయండి తగినంత క్యాల్షియంను మీరు తీసుకోవడం వల్ల మీ దంతాలను బలోపేతం చేస్తుంది మరియు దంతాల అమరిక నిలబెట్టడానికి సహాయపడుతుంది .

*టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా మీ బ్రష్ ఉంచాలి: దంతాలు శుభ్రం చేసుకొనే బ్రష్ లు టాయిలెట్ నుండి కనీసం 6 అడుగుల దూరంగా ఉంచాలి. ఎందుకంటే గాలిలో ప్రయాణించే కణాలు నివారించేందుకు ఇలా ఉంచాలని గట్టిగా సిఫార్సు చేయబడింది. ఇది దంత పరిశుభ్రతను నిలబెట్టడానికి సహాయపడుతుంది మరియు మీ దంతాలకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది.

 *క్రమం తప్పకుండా దంత వైద్యుడు సందర్శించండి మీరు ఉత్తమ ఫలితాలను పొందడానికి క్రమం తప్పకుండా దంత వైద్యుడుని సందర్శించడం తప్పనిసరి. ఎవరైతే సంవత్సరం పొడవునా పరిశుభ్రం చేయకుండా ఉంటారో , వారుకి నిజానికి అప్పుడు పాడైపోయిన లేదా అధ్వాన్నంగా పళ్ళు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళకుండా అక్కడి ముగించేస్తుంది.

* పళ్ళు తెల్లబర్చుకోవడం కోసం చికిత్స టీత్ వైటనింగ్ ట్రీట్మెంట్లు అంత అమోదకరమైనవి కాదు, ఒక వేళ మీ పళ్ళు చాలా చెడ్డగా మరకలు పడినప్పుడు మరియు ఇక వాటిని నయం చేయడం కాదు అన్నప్పుడు హోం రెమడీస్ చాలా బాగా సహాయపడుతాయి. మరియు దంతాలను తెల్లబర్చడంలో గొప్పగా సహాయపడుతాయి.

*ఒక బలమైన మింట్ టూత్ పేస్టును ఉపయోగించండి పుదీనాతోతయారుచేసిన టూత్ పేసట్ చాలా ప్రయోజనకారి, ఇది మీ దంతాలను తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతంది. ఇది తక్షణమే ఫలితాలను చూపించకపోవచ్చు. కానీ కొంత కాలం తర్వాత సానుకూల ఫలితాలను చూపిస్తుంది.

* వంశానుగత కారణాలు అనేక సార్లు ప్రజలు వారి వారసత్వ కారణంగా వారి దంతాలు మరకగాఉంటాయి. అందువల్ల దంతవైద్యుడు సందర్శించండి మరియు మీ పళ్ళు మీద మరకలు ఏర్పడటానికి గల సరైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

*అధిక మోతాదు కలిగిన యాంటీబయాటిక్స్ మానుకోండి అధిక మోతాదు కలిగిన యాంటీ బయోటిక్స్ ను మీ దంతాల యొక్క రంగును మార్చివేస్తుంది. అందువల్ల, అనవసరంగా యాంటీబయోటిక్స్ తీసుకోవడం నివారించడం చాలా ముఖ్యం.

* సోనిక్ టూత్ బ్రష్ ను ఉపయోగించండి: ఒక సోనిక్ టూత్ బ్రష్ మీ పని చాలా తేలికచేస్తుంది. మాన్యువల్ టూత్ బ్రష్ తో, ప్రజలు సాధారణంగా హార్డ్ బ్రష్ ను ఉపయోగిస్తుంటారు. దాంతో దంతాలు మరింత దెబ్బతీస్తాయి. ఈ నిజానికి గమ్ ప్రాంతంలో కోతకు దారితీస్తుంది మరియు టూత్ వేర్ ను పెంచుతుంది. అయితే, సోనిక్ టూత్ బ్రష్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది . మీ దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

*దంతాలు తెల్లబర్చే వస్తు సామగ్రి టీత్ వైటనింగ్ కిట్స్ మీ దంతాలు తెల్లగా నిర్వహించడానికి సహాయపడిందని నిరూపించబడింది. అయితే వాటిని తీసుకొనే ముందు మీ దంత వైద్యున్ని సంప్రదించి ఏ బ్రాండ్ సురక్షితమో కనుక్కోండి మరియు ఎటువంటి దుష్ర్పభాలు లేకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. .

*అక్రమ జీవక్రియ మెరుగుపరచుకోండి అక్రమ జీవక్రియ కూడా మీ దంతాలను రంగు మార్చడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లును సరిచేసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తీవ్రమైన ఒత్తిడిని నివారించడంలో తగి జాగ్రత్తులు తీసుకోవాలి.


  • Written by: Derangula Mallikarjuna -March 20, 2014@http://telugu.boldsky.com
























  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.