Monday, July 14, 2014

Summer sweat-వేసవికాలం చమట

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Summer sweat-వేసవికాలం చమట- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...అసలే వేసవికాలం అందులోనూ గతంతో పోల్చితే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం బయపడిపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఎంత ఎండ ఉన్నా తమ విధులకు హాజరు కాక తప్పనిపరిస్థితి.ఎండలో శరీరం నిండా చమట నిండి పనిచేసే చోట కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటాము. చికాకు వస్తుంది. ఇంటికి రాగానే హాయిగా చల్లని నీళ్లతో స్నానం చేస్తాము. కానీ తిగిరి ఉక్కపోతకు ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా?

మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉన్నపుడు శారీరక పనితీరు సక్ర మంగానే ఉంటుంది. దీనికంటే అధికవేడి ఉత్పన్నమయినప్పుడు మనలో చికాకు మొదలవుతుంది. అం దులో భాగంగానే కాస్త వేడి ఎక్కువవ్వగానే మనం చల్లని ప్రదే శాన్ని వెతుక్కుంటాం.

శరీరమంతా స్వేదరంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం తాగిన నీరు చెమట రూపంలో విడుదలవుతూనే ఉంటుంది. పెదవులు, జననాంగాల్లో తప్పించి మిగతా భాగమంతా శ్వేదరంధ్రాలుంటాయి. సాధా రణంగా చెమట పట్టడం అంటే శరీరం తనని తాను చల్లబరుచు కోవడమే. కాని అధిక మొత్తంలో చెమట విడుదలవుతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరుతగ్గిపోయినప్పుడే మనలో చికాకు మొదవలవుతుంది. కాబట్టి ప్రతి గంటకి తప్పనిసరిగా నీరు తీసుకోవడం మరవకూడదు. అప్పుడు శరీరమే కాదు మనసూ చల్లబడు తుంది. నీరు కేవలం చల్లదనాన్నే కాదు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

ఆరోగ్యరీత్యా...
కొన్నిసార్లు ఆరోగ్యం సరిగ్గా లేకపో యినా చెమటతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. థైరాయిడ్‌ గ్లాండ్‌ అతి చురుకుదనం మరోకారణం. థైరాయిడ్‌ హార్మోన్‌ శారీరక మెటబాలిజాన్ని, వేడి ఉత్పత్తిని విపరీతంగా పెంచుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, మందులు కూడా దీనికి కారణమవుతాయి. ఈ పరిస్థితుల్నీ వైద్య చికిత్సల ద్వారా అధిగమించే అవకాశం ఉంది. ప్యూబర్టీ దశలో అయితే ప్రత్యేక హార్మోన్లు ముంజేతుల్లోని గ్రంధుల్ని ప్రభా వితం చేస్తాయి. ఈ గ్రంధులు విడుదల చేసే చెమట దుర్వాసనతో కూడా ఉంటుంది. స్పష్ట మైన కారణం ఏదీ లేకుండా రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడుతున్నా, శారీరక వాసనలో తేడా కనిపించినా వైద్య సలహా తీసుకోవాలి.

ఇల్లే వైద్యశాల
స్వేదాన్ని దాని వాసనను తగ్గించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
పాదాలు: స్నానం తరువాత పాదాల్ని శుభ్రంగా తుడుచుకోవా లి. సూక్ష్మక్రిములు వేళ్ల సందుల నడుమ జీవిస్తుంటాయి. స్వేదాన్ని పీల్చగలిగిన ఫుడ్‌ పౌడర్స్‌ని ఉపయోగిస్తే ఫలిత ముంటుంది.
షూస్‌: లెదర్‌వంటి సహజ సిద్ధ మైన మెటీరియల్స్‌తో తయారు చేసే షూస్‌ని, ఇతర పాదరక్షలు ధరించడం వల్ల పాదాల్లో చెమ ట తగ్గుతుంది. షూస్‌లోని చెమట రాత్రికి రాత్రి ఆరిపోయే అవకాశం ఉండదు. మళ్లీ తెల్లారగానే వాటిని ధరిస్తే దుర్వాసన ఎక్కువవుతుంది. కాటన్‌, ఊల్‌ సాక్స్‌ పాదాల్ని పొడిగా ఉంచు తాయి. ఇవి తేమ ను పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. వ్యా యా‚మం చేసే సమయంలో ఎధ్లెటిక్స్‌ సాక్స్‌ బాగా పనిచే స్తాయి. వీటిని ఏ రోజు ధరించినవి ఆరోజు శుభ్రంచేసుకుని మళ్లీ వాడాలి.
దుస్తులు: వీలైనంతవరుకు కాటన్‌ వస్త్రాలనే ధరించాలి. స్వేదా న్ని పీల్చని, ఎక్కువ చెమటకు కారణమయ్యే సిల్కు దుస్తులకు దూరంగా ఉండాలి.
సుగంధాలు: పడుకునే ముందు స్వేదం ఎక్కువగా అలుము కునే అరచేతులు, పాదాల్లో యాంటీ పరిస్పిరెంట్స్‌ రాసుకుం టూ ఉండాలి.
విశ్రాంతి: యోగా, ధ్యానం వంటి విశ్రాం తి ఇచ్చే విధానాలను పాటించాలి. వీటివల్ల ఒత్తిడిని నియంత్రించుకునే అవకాశం కలు గుతుంది. ఒత్తిడివల్ల చెమట అధికంగా పడుతుంది.
ఆహారం: సాధారణ స్వేదం కంటే ఎక్కు వగా ఉన్నా, దుర్వాసన ఆహారపదార్థాలు క నుక కారణం అవుతుంటే అంటువంటి వా టికి దూరంగా ఉండటం మంచిది. కెఫైన్‌ ఉండే పదార్థాల్ని, ఘాటైన వాసన ఉండే వె ల్లుల్లి, ఉల్లిని తినడం తగ్గించాలి.
ఒత్తిడి: మానసిక ఆందోళన వల్ల చెమట మరింత అధికమవు తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నా చెమట అధికంగా పడుతుంది.
ముఖ్యంగా నూనెపదార్థాలు అధికంగా ఉండే వాటిని, సై్పసీగా ఉండే పదార్థాలని తగ్గిస్తే చెమట దాని తాలూకు సమస్యలు చాలా భాగం తగ్గిపోతాయి. వేసవికాలంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా చమట తగ్గుముఖం పట్టడంతో పాటు మససుకు ఆహ్లాదాన్నిస్తాయి వీటిన క్రమం తప్పక పాటించడం అలవాటు చేసుకోవాలి

తాజాదనానికి...
కాఫీ, టీలను తాగడం తగ్గించాలి. సాధారణంగా చెమట దుర్గందాన్ని వెద జల్లుతుందనుకుంటారు. కానీ శరీరం మీద ఉన్న బ్యాక్టీరియాతో స్వేదం చేరినప్పుడు వాసన వస్తుంది. కాబట్టి శరీరం మడతల్లో పౌడర్లు, డియోడ్రెంట్లు ఉపయోగిస్తుండాలి. స్నానం చేసే ముందు నీటిలో ఒక నిమ్మ కాయ పిండుకుని స్నానం చేస్తే ఆ రోజంతా తాజాగా ఉంటుం ది. వీటిని పాటించడంతో పాటు ఆకుకూరలు, సలాడ్స్‌ అధికంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతీరోజూ రెండుసార్లు స్నానం చేయడంతో పాటు వీలనైన్ని సార్లు ముఖాన్ని చేతులు, మెడని చల్లని నీటితో కడుక్కుంటూ ఉండాలి.

ఒత్తిడీకారణమే
ఆడవాళ్లలో ఎక్కువగా ఒత్తిడి వల్ల చెమట పడుతుంది. అరచేతులు, నుదురు, అరికా ళ్లలో చెమట ఎక్కువగా పడితే అది ఒత్తిడికి సంకేతమే. కాబట్టి ముందుగా ఒత్తిడిని త గ్గి ంచు కునే ప్రయత్నాలు చేయాలి. బాగా టెన్ష న్‌లో ఉంటే మీ దృష్టిని వేరొక అంశం మీదకి మరల్చండి. హార్మోన్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వల్ల కూడా ఒత్తిడి పెరిగే అవకాశం లేకపో లేదు. తగిన విశ్రాంతి తీసు కుంటున్నా స మస్య తగ్గు ముఖం పట్టకపోతే డాక్టర్‌ని సం ప్రదించడంలో ఆలస్యం చేయకూడదు.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.