Saturday, November 19, 2011

ఆయుర్వేదం లో జలగ వైద్యము , Leech Therapy in Ayurvedam


  • photos : Courtesy with Andhrajyothi News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ఆయుర్వేదం లో జలగ వైద్యము , Leech Therapy in Ayurvedam-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శాస్త్రీయ వివరణ లేదుగాని అనుభవముతో కూడుకున్న గతచరిత్ర ఉన్న జలగ వైద్యము - దాని విధివిదానాలు :
మన దేశానికి లీచ్‌థెరపీ (జలగలతో వైద్యం) మరీ కొత్త వైద్యమేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగల వైద్యాన్ని వాడుతున్నారు. అయితే మన దేశంలో కంటే విదేశాల్లోనే దీన్ని ఒక వైద్య పద్ధతిగా ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకోగాని మన దేశంలో ఈ వైద్యానికి తగినంత ప్రచారం లేదు. మనిషికి వచ్చే రకరకాల చర్మవ్యాధులకు, ఇతర జబ్బులకు చెడురక్తం ప్రధాన కారణం. తేలిగ్గా, తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఈ చెడురక్తాన్ని తొలగించే ప్రక్రియకు వైద్య శాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్నామ్నాయం మరొకటి లేదంటారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు గిడ్డ జీవరత్నం.

గత ముప్పైఏళ్లుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారాయన. "ఆయుర్వేద వైద్యంలో లీచ్‌థెరపీ గొప్ప వరం. మనిషి నుంచి చెడురక్తం తీయడానికి ఆయుర్వేదంలో చాలా వైద్యాలున్నాయి. అన్నిటిలోకెల్లా ఉత్తమమైనది, తేలికైనది లీచ్ థెరపీ. ఆయుర్వేద వైద్య భాషలో దీన్ని 'జలవుక వైద్యం' అంటారు. మూడు దశాబ్దాలుగా లీచ్ వైద్యం చేస్తున్నాను. ఎన్నో అద్భుతాల్ని చేశాం. ఒకటీ రెండు కాదు... జలగలు అన్ని రకాల చర్మవ్యాధుల్ని తగ్గించగలవని, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల, చెడురక్తం వల్ల వచ్చే జబ్బులన్నిటికీ కూడా లీచ్‌థెరపీ ఉపశమనం అన్న విషయం మనవారికి చాలామందికి తెలియకపోవడం దురదృష్టం'' అని అంటారాయన.

ఏ ఏ జబ్బులకు...
లీచ్‌థెరపీతో అన్ని రకాల చర్మవ్యాధులు, రక్తసంబంధిత వ్యాధులన్నిటినీ తగ్గించుకోవచ్చు. సొరియాసిస్, మెటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్...ఇలా అన్ని జబ్బులూ మాయమవుతాయి. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాకుండా ప్రముఖ ఆయుర్వేద ఆసుపత్రులలో కూడా లీచ్‌థెరపీ చేస్తున్నారు. ఈ వైద్యం ఎలా చేస్తారో తెలుసుకుందాం.

సొరియాసిస్‌కి...
మూడేళ్ల కిత్రం ఇదే ఆసుపత్రికి సంతోష్ అనే పాతికేళ్ల కుర్రాడు వచ్చా డు. ఒంటినిండా సొరియాసిస్. "నాకు పదేళ్ల వయసుండగా తెల్లటి మచ్చలు రావడం, పొట్టు రాలడం మొదలయింది. ఇప్పుడు ఒళ్లం తా వచ్చేసింది. మా తమ్ముడు, చెల్లి కూడా నన్ను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. నాకు పెళ్లవ్వదని అమ్మ బెంగపెట్టుకుంది. వైద్యం కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టారు. టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్లీ వచ్చేస్తుంది. నాకు బతకాలని లేదు. ఎవరో ఒక పెద్దాయన లీచ్‌థెరపీతో సొరియాసిస్‌ని తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇదే నా చివరి ప్రయత్నం అనుకొని వచ్చాను. ఇంట్లో చెబితే... జలగలతో వైద్యం ఏంటి? వద్దన్నారు. అయినా ప్రయత్నించి చూద్దామని వచ్చాను'' అని డాక్టర్ దగ్గర తన బాధ చెప్పుకున్నాడట.

వైద్యులు ముందు చిన్నపాటి కౌన్సిలింగ్ చేసి వైద్యం మొదలుపెట్టారు. పెద్ద మచ్చలున్న ప్రాంతంపై జలగల్ని వదిలారు. అలా ఎనిమిది సిట్టింగ్‌లు వైద్యం చేశారు. మళ్లీ మచ్చలు రాకుండా ఉండేందుకు మందులు ఇచ్చి పంపించారు. దాంతోపాటు కొన్ని ఆహారనియమాలు కూడా చెప్పారు. మూడు నెలల్లో సంతోష్‌కి సొరియాసిస్ మచ్చలు పూర్తిగా పోయాయి. చాలా సంతోషపడ్డాడు. తన ఇంట్లోవాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఇతనికి వైద్యం చేసిన జీవరత్నం ఏమంటారంటే..."సొరియాసిస్‌తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారికి లీచ్‌థెరపీకి మించిన వైద్యం లేదు. సొరియాసిస్ అనేది చర్మవ్యాధి. శరీరంలో రోగనిరోధక శక్తి లోపించడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇదొకటి. ఈ వ్యాధిని తగ్గించడం ఒకెత్తు, మచ్చలు పోగొట్టడం ఒకెత్తు. లీచ్ థెరపీ వల్ల ఒంటిపైనున్న మచ్చలన్నీ పోతాయి. అలాగే చెడు రక్తం పోతుంది కాబట్టి కొన్ని ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉండదు''.

మొటిమలకు...
ముఖంపై పెద్ద పెద్ద మొటిమలతో చాలామంది అమ్మాయిలు బోలెడు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటమ్మాయే గీత. ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ముఖం నిండా మొటిమలు. చర్మవ్యాధుల నిపుణులు ఇచ్చిన మందులన్నీ మింగింది. రకరకాల క్రీములన్నీ రాసింది. తాత్కాలిక ఉపశమనాలే కాని...పట్టుమని పదిరోజులు ముఖంపై మొటిమలు లేకుండా లేదు. లీచ్‌థెరపీ గురించి ఇంటర్నెట్‌లో చదివి మరీ వచ్చింది. డాక్టర్ టేబుల్‌పైన జలగలున్న సీసా చూసి 'అమ్మో...' అంది. 'నాకు జలగలంటే చాలా భయం. మొటిమలు పూర్తిగా పోతాయంటే మాత్రం వైద్యం చేయించుకుంటాను డాక్టర్‌గారు..'

అంటూ భయం భయంగా అడిగింది. నువ్వే..చూస్తావుగా అంటూ వైద్యం మొదలుపెట్టారు. మొటిమలు ఎక్కువగా ఉండటంతో ఒకేసారి నాలుగు జలగల్ని మొటిమల దగ్గర వదిలారు. అలా నాలుగు వారాలు....నాలుగు సిట్టింగ్‌లు పెట్టారు. అంతే మొటిమలు మాయం. "మనవాళ్లకి జలగలపట్ల మంచి అభిప్రాయం లేదు కాబట్టి ...వైద్యానికి ముందు బోలెడు సందేహాలు వస్తాయి. అదే యూరప్ దేశాల్లో అయితే ఫేషియల్ చేయించుకున్నంత తేలిగ్గా మొటిమలకు లీచ్ థెరపీ చేయించుకుంటారు'' అని చెప్పారు జీవరత్నం.

బోదకాలు...
బోదకాలుతో బాధపడేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా ముదిరిపోతే కష్టం కాని మొదటి దశలో లీచ్‌థెరపీ చేయించుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. "బోదకాలు వచ్చిన ఆరునెలలలోపు లీచ్‌థెరపీ చేయించుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాగా ముదిరిపోయాక ఎనభైశాతం మాత్రమే అవకాశం ఉంటుంది. ముందు నాలుగైదు సిట్టింగ్‌లలో జలగల ద్వారా కాలులో పేరుకుపోయిన చెడురక్తాన్ని తీసేస్తాం. కాలు లావు తగ్గి మామూలుగా అయిపోతుంది. తరువాత మళ్లీ రాకుండా కొన్ని మందులు ఇస్తాం. వైద్యం సింపులే కాని దీనికి ఒకటీ రెండు జలగలు సరిపోవు. నాలుగైదు ఉండాలి..'' అంటున్నారు వైద్యులు.

పైల్స్ నివారణ...
మల ద్వార ప్రాంతంలో రక్తం గడ్డకట్టుకుపోయి లేదా పుండుగా ఏర్పడి బాధపెట్టే పైల్స్ నివారణకు కూడా లీచ్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. గడ్డలు కరగడానికి, పుండు తగ్గడానికి, నొప్పి పోవడానికి... రకరకాల మందులు వాడుతూ ఉంటారు. లీచ్‌థెరపీ వల్ల అన్ని సమస్యలూ ఒకేసారి పోతాయి. చెడురక్తం, గడ్డకట్టిన రక్తం అన్నీ తొలగిపోతాయి. మూడు సిట్టింగ్‌లు పెట్టించుకుని, కొన్ని రకాల ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఆ సమస్య మీ జోలికి రాదంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రకాశ్.

గడ్డలు మాయం...
ఉన్నట్టుండి ఒంటిమీద గడ్డలు ఏర్పడుతుంటాయి కొందరికి. చెడురక్తం, కొవ్వుపదార్థాల వల్ల ఏర్పడ్డ ఈ గడ్డల్ని మందులతో కన్నా...లీచ్‌లతో చాలా తొందరగా కరిగించవచ్చంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాగసుధ. "చాలామంది ఒంటిపైన గడ్డలు కనిపిస్తాయి. ఎక్కువగా నుదుటిభాగంలో వస్తుంటాయి. మందులకు లొంగని గడ్డల్ని సర్జరీ చేసి తొలగిస్తారు. ఆపరేషన్ లేకుండా లీచ్«థెరపీ ద్వారా వీటిని చాలా తేలిగ్గా తొలగించవచ్చు'' అంటారావిడ.

కంటికి, పంటికి...
లీచ్‌థెరపీని విదేశాల్లో కంటి జబ్బులకు, పంటి జబ్బులకు కూడా వాడుతున్నారు. దీని గురించి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ...'కంటిలో నీటికాసులు(గ్లకోమా) ఏర్పడుతుంటాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దీన్నే...కంటికి నీరు పట్టిందని చెబుతుంటారు. రక్త నాళాల్లో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో చూపు మందగిస్తుంది. కంటి చివరి భాగంలో లీచ్‌థెరపీ చేయడం వల్ల రక్తనాణాలలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది.

చెడు పదార్థాలు, నీరు, గడ్డకట్టిన రక్తం అంతా జలగ తీసేసుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కొత్త రక్త ప్రసరణ జరుగుతుంది. ఎలాంటి ఆపరేషన్లు, అద్దాలతో పనిలేకుండా జబ్బుని నయం చేసుకునే అవకాశం ఉంది. పంటికి కూడా లీచ్‌థెరపీ వాడుతున్నారు. ఒక్కొక్కసారి పళ్ల చిగుళ్లలో చెడురక్తం చేరి బాగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని కూడా జలగల సాయంతో తొలగిస్తారు. కంటికి, పంటికి లీచ్‌థెరపీ మన దేశంలో చాలా తక్కువ కాని యూరప్ దేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు'' అని చెప్పారాయన.

మధుమేహం...
మన దేశంలో లీచ్‌థెరపీ ఎక్కువగా వాడేది మధుమేహం వల్ల వచ్చే పుండ్లకు. షుగర్ ఎక్కువగా ఉన్నవారికి శరీరంలోని కొన్ని భాగాల్లో ముఖ్యంగా కాళ్లకు, చేతులకు చెడు రక్తం పేరుకుపోయి రంగు మారిపోతుంది. దురదగా మొదలైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండ్లు లీచ్‌థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. "నా అనుభవంలో ఎక్కువగా లీచ్‌థెరపీ వాడింది షుగర్ పేషంట్లకే. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ పుండ్లు తగ్గవు. పుండు తగ్గడానికి ఒకోసారి సర్జరీలు కూడా అవసరమవుతాయి. ప్రతిరోజు డ్రసింగ్ చేయించుకోలేక, పుండు పెట్టే బాధ పడలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. పుండు సైజును బట్టి ఎన్ని లీచ్‌లు వాడాలి, ఎన్ని సిట్టింగ్‌లు పెట్టాలో నిర్ణయిస్తాం.

చెడురక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. పుండు మొత్తం మానేవరకూ సిట్టింగ్స్ ఉంటాయి. చాలా తొందరగా ఉపశమనం వస్తుంది.'' అని చెప్పారాయన. లీచ్‌థెరపీతో షుగర్ పుండు తగ్గించుకున్న రాజేశ్వరరావు తన అనుభవాన్ని ఇలా చెబుతారు. " నా వయసు అరవై సంవత్సరాలు. పదేళ్లనుంచి షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా... షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు. నాలుగు నెలల కిత్రం కుడికాలుకి వాపు వచ్చింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో శరీరం రంగు మారడం మొదలయింది. దురద కూడా రావడంతో చిన్నగా పుండు పడింది. వెంటనే ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చారు. అవి వాడుతూ ప్రతిరోజూ డ్రసింగ్ చేయించుకునేవాన్ని.

కొద్దిగా తగ్గిన్నట్టు తగ్గి మళ్లీ ఎక్కువయింది. మరో పెద్ద ఆసుపత్రికి వెళితే... చిన్నపాటి సర్జరీ చేయాలన్నారు. ఆ సమయంలో ఎవరో ఈ జలగ వైద్యం గురించి చెప్పారు. ఇక్కడి వచ్చాక డాక్టర్లు వైద్యానికి సంబంధించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు. ఆరు సిట్టింగ్‌లు అవసరమవుతాయని చెప్పారు. నాకు మూడు సిట్టింగ్‌లతోనే దురద, నొప్పి, వాపు పోయి బోలెడు ఉపశమనం కలిగింది. ఇంత తక్కువ ఖర్చుతో, నొప్పిలేకుండా హాయిగా చేసే వైద్యం అందుబాటులో ఉందని చాలామందికి తెలియదు. నేను ప్రస్తుతం లీచ్‌థెరపీని ప్రచారం చేసే పనిలోనే ఉన్నాను'' అని తన అనుభవాన్ని, అభిప్రాయాన్ని చెప్పాడాయన.

అన్నీ పనికిరావు...
నీటిలో దొరికే జలగలన్నీ వైద్యానికి పనికిరావు. 'కపిలి' అనే జాతి జలగల్ని ఎక్కువగా వాడుతున్నారు మన రాష్ట్ర డాక్టర్లు. ఇతర రాష్ట్రాల్లో 'పుండరిక' అనే జాతి జలగల్ని వాడుతున్నారు. " చెరువుల్లో...కుంటల్లో దొరికే జలగలన్నీ వైద్యానికి వాడము. జలగల్లో రెండు రకాలుంటాయి. పాయిజన్, నాన్ పాయిజన్. పాయిజన్ జలగలకు వెంట్రుకలుంటాయి. ఇవి వైద్యానికి పనికిరావు. వైద్యం కోసం ఎంపిక చేసుకున్న జలగల్ని ముందు శుద్ధిచేస్తాం. ఎందుకంటే అప్పటివరకూ అది రకరకాల జంతువుల రక్తాల్ని పీల్చుకుని ఉంటుంది. దాని పొట్టనిండా బోలెడన్ని విషపదార్థాలు ఉండే అవకాశం ఉంది. మొదట దాని పొట్టని శుభ్రం చేయాలి. అందుకే ఒక వారం రోజులపాటు దాన్ని పసుపు నీళ్లలో ఉంచుతాం.

ఆ నీళ్లు తాగడం వల్ల జలగ పొట్ట పూర్తిగా శుద్ధి అయిపోతుంది. తరువాత దానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వైద్యానికి అన్ని అర్హతలు పొందిన తర్వాతే దాన్ని థెరపీకి ఎంచుకుంటాం. ఒకరి వైద్యానికి ఉపయోగించిన జలగని మరొకరికి వాడం. లీచ్‌థెరపీ పూర్తవగానే జలగకు ఒక మందు ఇస్తాం. వెంటనే తాగిన రక్తాన్ని వాంతి చేసేసుకుంటుంది. తరువాత మళ్లీ పసుపు నీళ్లలో వేస్తాం. తరువాత సిట్టింగ్‌నాటికి దాని కడుపులో, శరీరంలో ఎలాంటి చెడుపదార్థాలు లేకుండా శుద్ది చేసి మళ్లీ వైద్యానికి ఉపయోగిస్తాం. పేషెంటు రాగానే నీళ్లలో ఉన్న జలగని తెచ్చి అతనిపై వదిలేస్తాం అనుకుంటే పొరపాటు...ఈ వైద్యానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది'' అని చెప్పారు రాగసుధ.

అందరినీ పట్టుకోవు...
వైద్యం చేయడానికి జలగకు ఎలాంటి అర్హతలున్నాయో... మనుషులు కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలంటారు డాక్టర్ జీవరత్నం. "పేషెంట్‌కి ముందుగా కొన్ని రక్తపరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవి - పాజిటివ్, టీబి ఉన్నవారికి లీచ్‌థెరపీ చేయరు. వైద్యం చేయించుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలి. లీచ్‌థెరపీ చేయించుకునే రోజు స్నానానికి సబ్బుకు బదులు సున్నిపిండిని వాడాలి. కాస్మోటిక్స్ వాడకూడదు. మద్యం సేవించకూడదు, పొగతాగకూడదు. ఇందులో ఏ వాసన తగిలినా...జలగ ఆ మనిషి జోలికి రాదు.

సాధారణంగా జలగ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకూ రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు...అనుకుంటే పసుపు కాని ఉప్పు గాని దానిపై వేస్తే వెంటనే వదిలేస్తుంది. తరువాత అది పట్టుకున్న చోట వేడినీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేసేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావు. నొప్పి కూడా పెద్దగా ఉండదు.
జలగ రక్తం పీల్చుకుంటున్నప్పుడు ఒకలాంటి మత్తుగా ఉంటుందంటారు పేషెంట్లు. మనవాళ్లు ఈ వైద్యం ప్రయోజనాలు తెలియక ముందుకు రావడం లేదు కాని మా దగ్గరికి వచ్చిన ఏ పేషెంటు కూడా జలగని చూసి భయపడి వెనక్కివెళ్లలేద''ని చెబుతారామె.

జలగల మార్కెట్

మన రాష్ట్రంలోని ప్రముఖ ఆయుర్వేద ఆసుపత్రులన్నిటిలో లీచ్ థెరపీ చేస్తున్నారు. మరి ఈ వైద్యులకు జలగలు ఎవరు ఇస్తారు? అంటే "పదేళ్ల క్రితం పది రూపాయలకు ఒక జలగ అమ్మేవారు. ఇప్పుడు అదే జలగని వంద నుంచి ఐదు వందల రూపాయలు పెట్టి కొంటున్నారు. చెరువుల్లో, కుంటల్లో, పొలాల్లో దొరికే జలగలకు ఇంత ధర ఎందుకు? అంటే బ్లూక్రాస్ వారి ప్రభావం. 2005 వరకూ మా ఆసుపత్రి లీచ్‌ట్యాంకులో ఎప్పుడూ 500 జలగలు ఉండేవి. 'జంతువుల్ని హింసించడం నేరం' అంటూ ప్రచారాలు మొదలయ్యాక మా ఆసుపత్రికి జలగల కొరత ఏర్పడింది. ఒక మనిషికి వాడిన జలగని మరొకరికి వాడం.

వైద్యం పూర్తవ్వగానే దాన్ని బయట పడేస్తాం. వైద్యం పేరుతో జంతువుల్ని అలా చంపడం నేరం అంటూ బ్లూక్రాస్‌వారు జాలర్లను బెదిరించడంతో వాళ్లు జలగల్ని పట్టి అమ్మడానికి వెనకాడుతున్నారు. దాంతో ఎప్పుడూ వందల సంఖ్యలో జలగలుండే మా లీచ్‌ట్యాంక్ ప్రస్తుతం ఎండిపోయింది. మరి వైద్యం ఎలా చేస్తున్నారంటే? ఆ బాధ్యత పేషంట్లపైనే పెడుతున్నాం. లేదంటే ఒకటీ అరా మా దగ్గర ఉన్నవాటితో వైద్యం చేస్తున్నాం. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు జలగల సేకరణ లేదు. దాంతో ఉన్నవాటికే బోలెడు డిమాండ్. వైద్యం ఎలాగూ ఉచితం కాబట్టి జలగల్ని వందల రూపాయలు పెట్టి కొనుకుంటున్నారు'' అని చెప్పారు జీవరత్నం.

ఇంటర్నెట్‌లో అమ్మకాలు
మన దేశంలో జలగలు కావాలంటే చెరువుల దగ్గరకి వెళ్లాలి. లేదంటే జాలర్లని బతిమలాడాలి. కాని ఆస్ట్రేలియా దేశంలో అలాకాదు. ఇంటర్నెట్ ద్వారా కూడా జలగల్ని అమ్ముతున్నారు. 'లీచ్ ఫర్ సేల్' అనే వెబ్‌సైట్‌లు అక్కడ బోలెడన్ని ఉన్నాయి. చేపల మార్కెట్‌లో జలగలకు ప్రత్యేక విభాగం ఉంటుంది. వైద్యులైనా, పేషెంట్లయినా అక్కడికి వచ్చి వారికి కావాల్సినన్ని జలగల్ని కొనుక్కొని వెళతారు. మన దగ్గర చేపలు, రొయ్యలు పెంచినట్టు యూరప్‌లో జలగల్ని పెంచుతారు. అయితే వాటికి ఆహారం ఏంటని అనుకుంటున్నారా....మనం చేపలకు ఏ ఆహారం వేస్తామో అదే వేస్తారు. దాంతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న మాంసం ముద్దలు కూడా వేయాలి. వీటికి పెద్దగా జబ్బులు రావు కాబట్టి పెంపకం సులువే. రోజురోజుకీ పెరుగుతున్న లీచ్‌థెరపీ వల్ల వీటి అవసరం కూడా ఎక్కువవుతోంది కాబట్టి జలగలు కూడా అదేస్థాయిలో ధర పలుకుతున్నాయి.

అల్లోపతికి జలగ సాయం
జలగల వైద్యం ఇంత గొప్పదైనపుడు అల్లోపతి వైద్యంలో కూడా వీటిని వాడుకోవచ్చు కదా! అని జీవరత్నం గారిని ప్రశ్నిస్తే..."తప్పకుండా...విదేశాల్లో ఎప్పటినుండో వాడుతున్నారు. యూరప్ దేశాల్లో ఆపరేషన్ తర్వాత కుట్లు విప్పడానికి జలగల్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లావాటి వాళ్లకు కుట్లు విప్పే ముందు రెండు వైపులా రెండేసి జలగల్ని పట్టిస్తే నిమిషాల్లో అక్కడి చర్మం వదులుగా అవుతుంది. అలాగే వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి పోతాయి కూడా. దీని వల్ల కుట్లు తేలిగ్గా విప్పడానికి వీలవుతుంది.

మన దేశంలో అయితే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్శిటీ ఆఫ్ ఆయుర్వేద కళాశాలలో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బులకు కూడా లీచ్‌థెరపీ చేశారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రివారు ప్లాస్టిక్ సర్జరీ అనంతరం స్కిన్ డ్రాఫ్టింగ్‌కి లీచ్ థెరపీ చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చి జలగల్ని తీసుకెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం ఆ భాగంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తే తొందరగా చర్మం అతుక్కుంటుంది. ఇలా పలు సందర్భాల్లో లీచ్‌థెరపీని అల్లోపతివారు కూడా వాడుతున్నారు. అయితే అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో కూడా లీచ్‌థెరపీ గురించి అవగాహన చాలా పెరగాల్సిన అవసరం ఉంది'' అని అన్నారాయన.

*-- భువనేశ్వరి (source Andhrajyothi Sunday magazine)

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, November 16, 2011

గోరుచుట్టు ,Whitlow,Paronychia



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గోరుచుట్టు ,Whitlow,Paronychia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గోరుచుట్టు (Whitlow) చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.
గోళ్ళను కత్తిరించేటప్పుడు బలవంతంగా గోరును పీకినట్లయితే గోరుకు అతుక్కున్న చర్మం గోరు నుంచి విడిపోయి, చర్మానికి వాపురావటమే కాకుండా అమిత బాధ కలుగుతుంది. పాదం క్రింద పెట్టి నడవటం బాధాకరంగా మారుతుంది.దీనినే గోరుచుట్టు అంటారు .
గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. ఎక్కువగా నీటితో, ఆహార పరిశ్రమలో పనిచేసేవారిలో, గోరు మూలల్లో మురికి పట్టియున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ. గ్రహణం సమయంలో వేలుతో చూపిస్తే గోరుచుట్టు వస్తుందని మూఢ నమ్మకం ఉంది.

కారణాలు : వైరస్ , బాక్టీరియా , ఫంగల్ ఇన్ఫెక్షన్‌ వలన చీము పట్టి పుండుగా గోరుచుట్టూ తయారగును .

ఆయుర్వేదిక్ చిట్కాలు :
కొంతమంది గోరుచుట్టు లేచి బాధపడుతుంటారు. అలాంటి వారు కాస్త ఓపిక చేసుకొని కొండపిండి చెట్టుఆకు వెల్లుల్లి లవంగాలు కలిపి నూరి ఆ ముద్దను వేలికి తొడిగితే గోరుచుట్టుకు మనం టోపీ పెట్టినట్టే.(కొండపిండి చెట్టు, అమరాంధేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం యనామం ఇవ్వాలేనేట.)
కృష్ణ తులసి మొక్క మరియు ఆకుల రసాన్ని , వాటి లేపనాన్ని గోరుచుట్టు ఇంకా ఇతర అంటువ్యాధులకు, మందుగా వాడతారు.
గోరుచుట్టు లేవగానే , మునగ బంకను గోరుచుట్టుకు పట్టించి పట్టీ కడితే గోరుచుట్టు సులువుగా తగ్గిపోతుందని అంటారు కాని స్సుద్దిచేసి వాడాలి . .
గోరుచుట్టు లేచినపుడు నిమ్మపండును ఒకవైపు రంధ్రము చేసి వ్రేలును అందులో దూర్చి పెట్టుకున్నా సలపడం తగ్గును.

చికిత్స :
చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని చీమును తొలగించగా భాధ తగ్గుతుంది .
నొప్పితగ్గడానికి : tab Dolomed 1మాత్ర రెండు సార్లు గా 3-4 రోజులు వాడాలి .
Antibiotic : tab ciprofloxin 500 mg రోజుకి 2 చొ.. 3-4 రోజులు వాడాలి .
గోరుచుట్తు బిటాడిన్‌ లోషన్‌ తో కడిగి ... Clindamycin Ointment (Erytop) పూతగా రాసి కట్టు కట్టాలి .





  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

చిన్న మశూచి ,చికెన్ పాక్స్,ఆటలమ్మ,చిన్న అమ్మవారు,Chickenpox


  • image : courtesy with Wikipedia.org/

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --చిన్న మశూచి ,చికెన్ పాక్స్,ఆటలమ్మ,చిన్న అమ్మవారు,Chickenpox-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఆటలమ్మ అంటువ్యాధి. ఇది 'వారిసెల్లా జోష్టర్‌' అనే వైరస్‌ క్రిముల ద్వారా సంక్రమిస్తుంది. ఈ క్రిములే తర్వాతి కాలంలో పెద్దల్లో 'సర్పి' వ్యాధికీ కారణమవుతాయన్నది గమనార్హం! సాధారణంగా 10 సంవత్సరాల వయసులోపు పిల్లలే ఎక్కువగా ఆటలమ్మకు గురవుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి మించిన అంటువ్యాధి లేదు. ఆటలమ్మ బారినపడిన రోగి మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుండి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా ఈ వ్యాధికారక క్రిములు ఎదుటి వారికి సంక్రమిస్తాయి.

వాస్తవానికి ఆటలమ్మ లక్షణాలు కనిపించటానికి 24 గంటల ముందు నుంచే ఈ వ్యాధికారక క్రిములు ఆ రోగి నుండి ఎదుటివారికి సంక్రమించే అవకాశాలుంటాయి. ఒంటి మీద ఆటలమ్మ పొక్కులు కనిపించి, అవి చెక్కులు కట్టడానికి 6, 7 రోజులు పడుతుంది. అప్పటి వరకూ కూడా ఆ రోగి నుండి ఈ వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశముంటుంది. ఆ చెక్కుల ద్వారా మాత్రం ఈ వ్యాధి ఇతరులకు రాదు.

ఆటలమ్మను పోలిన వ్యాధి సర్పి. ఇది పెద్ద వయసు వారిలోనే వస్తుంది. కనిపించే తీరును బట్టి దీన్ని 'జంధ్యాల సర్పి' అనీ అంటారు. సర్పితో బాధపడే రోగుల వద్దకు వెళ్ళిన పిల్లలకు ఆటలమ్మ రావచ్చు. కానీ ఆటలమ్మతో బాధపడే పిల్లల వద్దకు వచ్చిన పెద్దలకు మాత్రం ఆటలమ్మ రాదు. ఇది గమనార్హమే. బడి పిల్లల్లో ఆటలమ్మ వ్యాధి ప్రబలినప్పుడు దానికి మూలం బడిలోని ఓ ఉపాధ్యాయుని సర్పి కావచ్చు. ఇంట్లో పెద్దవారికి సర్పి ఉంటే వారి దగ్గరకు పిల్లలను పోనీయకూడదు.

ఆటలమ్మ 2-3 సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధిలా ప్రబలుతుంది. స్కూలు పిల్లలలో ఎక్కువగా కన్పిస్తుంది. 6 మాసాలలోపు శిశువులకు ఈ వ్యాధి సోకితే చాలా ప్రమాదకరమని గుర్తించాలి. చిన్న వయసులో ఈ క్రిములు ఒంట్లో చేరినా.. ఎటువంటి లక్షణాలూ లేకుండా గుప్తంగా ఉండిపోయి, పెద్ద వయస్సు వచ్చాక సర్పి వ్యాధి కనిపించవచ్చు. కొందరిలో ఈ క్రిములు శరీరంలో ప్రవేశించినా అవి వ్యాధిని కలగించలేకపోవచ్చు. వారిలోని రోగ నిరోధక శక్తి అధిక ప్రాధాన్యత సంతరించుకొంటుంది.

క్రిములు శరీరంలో ప్రవేశించిన తర్వాత 2 వారాలకు గానీ వ్యాధి లక్షణాలు బయటపడవు. దీన్నే 'ఇన్‌క్యుబేషన్‌ పీరియడ్‌' అంటారు. జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, నడుము నొప్పి, నీరసం తదితరాలు ఈ వ్యాధి లక్షణాలు. ఛాతీ మీద మచ్చలు కన్పిస్తాయి. మచ్చలు క్రమంగా బొబ్బలుగా మారతాయి. బొబ్బల చుట్టూ చర్మం కంది ఉంటుంది. వీటిలో చీము చేరి.. క్రమేపీ ఈ చీము బొబ్బలు మాడిపోయి చెక్కులు గట్టి, వూడిపోతాయి. ఇదంతా మూడు వారాల్లో జరిగిపోతుంది. బొబ్బలు కన్పించగానే విపరీతమైన దురద ఉంటుంది. గోకితే గోకిన చోట చీముగుంటలేర్పడతాయి. నిద్రలో గోకే ప్రమాదముంది గనుక వీరికి గోళ్ళు కత్తిరించాలి. పిల్లలకైతే చేతులకు గుడ్డలు కట్టటం మంచిది. పక్క దుప్పట్లు తరచూ మారుస్తుండాలి. ఇంట్లో పిల్లలుంటే రోగి వద్దకు పోనీయరాదు. పెద్దవాళ్ళు కూడా ఆటలమ్మ రోగికి మరీ సన్నిహితంగా మెలగకూడదు. వీరికి ఆటలమ్మ రాకపోయినా సర్పి రావచ్చు. ఆటలమ్మ రోగి మగతగా ఉన్నా, తలనొప్పి, వాంతులు తోడయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

''చికెన్ పాక్స్'' (Varicella-minor) వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి. చికెన్ పాక్స్ ను ఆటలమ్మ, చిన్న అమ్మవారు అంటాం. ఆటలమ్మ అనే మాట వినగానే మనకు ఒళ్ళు జలదరిస్తుంది. దీనినే ఆంగ్లంలో చికెన్ పాక్స్ అంటారు. అటలమ్మ వచ్చిందంటే ఒళ్ళంత పుండ్లు గిల్లితే మరింత ఎక్కువ. జ్వరంతో ఆరంభమయ్యే ఈ వ్యాధికి రెండు రోజుల తరువాత మెల్లగా ఒళ్ళంతా గుల్లలు మొదలవుతాయి. కొన్ని తగ్గతూ ఉంటే మరికొన్ని కొత్తవి పుడతా ఉంటాయి. ఈ వ్యాధి దాదాపుగా 10 నుంచి 15 రోజుల వరకూ ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంటుంది.

పొక్కులు శరీరము పై అనగా covered parts లో(చాతి , వీపుపైన ) ఎక్కువగాను ... ముఖము పైన , కాళ్ళు ,చేతులపైనా తక్కువగాను ఉండుట దీని ప్రత్యేక లక్షణము .


లక్షణాలు:-

1. ముఖం, వీపు, ఛాతి భాగములో దురదతో కూడిన ఎఱ్ఱగ వచ్చు చర్మవ్యాధి.
2. నీటితో కూడిన బొబ్బలు వస్తాయి.
3. ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎలావ్యాపిస్తుంది:-
చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారుతుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది. ఇది ఒకరినుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి.

చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజులనుండి - దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారైనంతవరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం వుంది.
చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-
1. దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు.
2. వీలైనంతవరకు పిల్లలకుగోళ్ళు లేకుండా చేయాలి, రాత్రులలో- తెలియకుండా
గీచుకోకుండునట్లు - చేతులకు శుభ్రమైనగుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి.
పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించాలి, చెప్పాలి.
3. వీలైనంతవరకు చల్లనినీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు
కాస్తతగ్గుతాయి.
4. కాలమిన్ లోషన్ తో చర్మముపై పూత దురదను కాస్త తగ్గిస్తుంది.
5. జ్వరము, దగ్గు అధికంగా వున్నా, డాక్టరును సంప్రదించి వైద్యం చేయించడం అవసరం.
6. ఆస్పిరిక్ , ఇబూప్రొఫెన్‌(బ్రుఫెన్‌)లాంటి మందు వాడరాదు.
7. సులభంగా జీర్ణమగు అహార పధార్దాలు, ద్రవపదార్దాలు తీసుకోవాలి.
8. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
9. చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. వాడినబట్టలను - వేడినీళ్ళతో శుభ్రపరచాలి.
10. ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి.
11. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
12. జ్వరానికి పారాసెటమాల్ వాడవచ్చును .

నివారణ:-
చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయించుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి.
చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

చికిత్స :
  • జ్వరానికి : పరసెటమా మాత్రలు వేసుకోవాలి .. చిన్నపిల్లకు 250 మి.గ్రా. చొప్పున , పెద్దవాళ్ళకు 500 మి.గ్రా . రోజుకు మూడు సార్లు .5-7 రోజులు .
  • దురదకు : Cetrazine Or Levocetrazine రోజుకి ఒకటి 5-7 రోజులు వాడాలి.
  • పుల్లు అవకుండా : Azithromycin 250 mg . (adults ) 125 mg (children) రోజుకు 2 చొ. 7 రోజులు . చర్మము పైన Aloderm skin ointment రాయవచ్చును ... మచ్చలు కొంతవరకు పోవును .
  • నీరసము తగ్గడానికి : బి.కాంప్లెక్ష్ మాత్రలు గాని సిరప్ గాని వాడాలి.

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 15, 2011

మశూచి , Smallpox




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మశూచి , Smallpox - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మశూచి (Smallpox) ఒక భయంకరమయిన అంటువ్యాధి. మశూచి పేరు వింటేనే ఒకప్పుడు అందరూ ఉలిక్కిపడేవారు. కారణం అది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించేవారు. అలా 1700 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య 6 కోట్లకు పైమాటే! అలాంటి మశూచి (స్మాల్‌పాక్స్‌) ఈనాడు ఎక్కడా కనబడడం లేదంటే దానికి కారణం ఓ శాస్త్రవేత్త పరిశోధనే. అతడే ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 'ప్రపంచంలో అత్యధికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తి' గుర్తింపును పొందిన వ్యక్తి. ఈ వ్యాధికి " వేరియోలా మేజర్(Variola major) " అనే వైరస్ క్రిమి కారణము .

ఇంగ్లండ్‌లోని బెర్కిలీలో 1749 మే 17న ఓ క్రైస్తవ మతాధికారికి పుట్టినఎడ్వర్డ్‌ జెన్నెర్‌, వైద్య విద్యపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్‌ కావాలంటే, మరో పెద్ద వైద్యుడి దగ్గర శిక్షణ పొందే అవకాశం ఉండేది. అలా 14 ఏళ్లకే ఓ శస్త్ర చికిత్సకారుడు (సర్జన్‌) వద్ద ఎనిమిదేళ్ల పాటు అభ్యాసం చేశాడు. ఆపై లండన్‌ సెయింట్‌ జార్జి ఆసుపత్రిలో జాన్‌ హంటర్‌ వద్ద వైద్యాన్ని అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో డిగ్రీ పొందిన తర్వాత సామాన్యుల కోసం స్వగ్రామంలో వైద్యవృత్తిని ప్రారంభించాడు.

ఆ సమయంలోనే జెన్నర్‌ దృష్టి మశూచిపై పడింది. ఆవులకు కూడా మశూచి లాంటి వ్యాధి సంక్రమిస్తుంది. దానిని 'గోమశూచి' (cowpox)అంటారు. ఇది ఆవుల నుంచి పశువుల కాపరులకు సోకేది. ఇది ప్రమాదకరం కాకపోవడమే కాకుండా, ఒకసారి వచ్చి తగ్గిన వారికి స్మాల్‌పాక్స్‌ రాకపోవడాన్ని జెన్నర్‌ గమనించాడు. దాంతో కౌపాక్స్‌కి కారకమయ్యే వైరస్‌ను కొందరి ఆరోగ్యవంతులకు వారి అనుమతితోనే సూక్ష్మమైన మోతాదులో ఎక్కించేవాడు. వారికి కౌపాక్స్‌ వచ్చి తగ్గిన తర్వాత స్మాల్‌పాక్స్‌ వైరస్‌ను సూక్ష్మ స్థాయిలో ఎక్కించి పరీక్షించేవాడు. చిత్రంగా వారికి మశూచి సోకలేదు. ఇలా చేసిన పరిశోధన ఫలితాలను ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ పరిశోధన ఫలితంగానే ఈనాటికీ కౌపాక్స్‌ మోతాదును టీకాల ద్వారా ఎక్కించడం ద్వారా మశూచి రాకుండా ఉండే రోగనిరోధక శక్తిని కల్పిస్తున్నారు. మశూచిని మట్టికరిపించాడు!

జెన్నర్‌ను బ్రిటిష్‌ పార్లమెంట్‌ 'నైట్‌' బిరుదుతో సన్మానించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ఇస్తే, రష్యా చక్రవర్తి ఉంగరాన్ని బహూకరించాడు. ఫ్రాన్స్‌ అధినేత నెపోలియన్‌ దేశంలో అందరూ మశూచి టీకాలు వేయించుకోవాలని శాసనం చేశాడు. అమెరికన్‌ ప్రభుత్వం అనేక బహుమతులు అందించింది.

''మశూచికాన్ని చూపించండి. వెయ్యి రూపాయలు గెలుచుకోండి'' అనే నినాదంతో పట్టణాలలో, పల్లెటూళ్ళలో దేశమంతా 25, 30సంవత్సరాల క్రితం ప్రభుత్వం గోడలపై వ్రాసి ప్రచారం చేసింది. కాని 10వేలు ఖర్చుపెట్టినా ఏ వ్యక్తికీ మశూచికం వచ్చిందని ప్రజలు నిరూపించలేకపోయారు. ఎందుకంటే మశూచికం మనదేశంలో తగ్గిపో యిందని ప్రభుత్వానికి రూఢిగా తెలుసు. కాని వేలాది సంవత్సరాలు లక్షలాది మంది మశూచికం వల్ల జబ్బుపడి వేలాది మంది మరణించారు. దాదాపు 2వేల సంవత్సరాలు నుంచి మశూచికం ఒక ప్రాణాంతకమైన జబ్బు అని గుర్తించి దాని నివారణకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ జబ్బు ఎలా వస్తుందో ప్రజలకు అవగాహన లేదు. పర్షియాలో వైద్యులు రాజన్‌ క్రీ.శ.100 సంవత్సరంలో మశూచికం గురించి పేర్కొన్నాడు. క్రీ.శ.570 యూరప్‌లో మశూచికం వునికి గుర్తించారు.17వ శతాబ్దంలో యూరప్‌లో ఇది తీవ్రతరం అయింది. సిఫిలిస్‌ జబ్బుకు, మశూచికి తేడాను చాలాకాలం గుర్తించలేకపోయారు. అందుకే సిఫిలిస్‌ను గ్రేట్‌ఫాక్స్‌ అని, మశూచికాన్ని స్మాల్‌ ఫాక్స్‌అని అనేవారు.అట్లమ్మ(పొంగు)కి, మశూచికి తేడాను 18వ శతాబ్దంలో గుర్తించారు. మనదేశంలో మశూచికం వల్ల లక్షలాదిమంది మరణించారు. 1944లో మనదేశంలో 74.178 మశూచికం కేసులు వస్తే, వారిలో 17,743మంది చనిపోయారు. మశూచికం మచ్చలు జీవితాంతం ఆ వ్యాధి సోకినవారి మొహాలపై ఉండిపోయేవి. స్వాతంత్య్రానంతరమే మనదేశంలో ఈ మశూచి వ్యాధిని వ్యాక్సినేషన్‌ ద్వారా పూర్తిగా అరికట్టడం సాధ్యమైంది. అయితే మనదేశంలో మూఢన మ్మకాలు అధికంగా ఉండడంతో వ్యాక్సినేషన్‌ చేయించుకోవడానికి చాలా వ్యతిరేకత ఉండేది. పెద్ద అమ్మవారు, చిన్న అమ్మవారు అంటూ వ్యాక్సినేషన్‌ చేయించుకోకుండా భీష్మించుకుని కూర్చునేవారు. ఆరోగ్య విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతా లలో కొన్ని మూఢ నమ్మకాలు తగ్గడానికి మార్గం సుగమం అయింది. విద్యా, విజ్ఞా నం పెరిగిన తరు వాతనే మశూ చికం వచ్చినప్పుడు జాత రలు, కొలువులు అని కూర్చోకుండా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో ప్రజలు స్వచ్ఛందంగా మశూ చికం టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడం ప్రారంభించారు.

మౌఢ్యంపై సైన్స్‌ విజయానికి, మశూచిని అంతమొందించడానికి మార్గం సుగమం చేసిన మహనీయుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 1749లో ఇంగ్లండులోని గ్లౌచెస్టర్‌లో జన్మించాడు. వైద్య విద్యనభ్యసించి మశూచి నిరోధక టీకాల మీద పరిశోధన చేసి, తన కుమారుని మీదే ప్రయోగించి విజయం సాధించిన ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. జెన్నర్‌ సాధించిన విజయం వైద్యశాస్త్ర చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది. మహారాజుల నుండి సామాన్యుల వరకు జన్నర్‌ కనుగొన్న శాస్త్రీయమైన పద్ధతిని అంగీకరించి, మశూచి వ్యాధి నుండి విముక్తి చెందారు. ఈ విధంగా జెన్నర్‌ శాస్త్రీయమైన వైద్య విజ్ఞానంతో మానవజాతికి మహోపకారం చేశాడు. చిన్న విషయాలలోనే పెద్ద అర్థాలు ఉంటాయి. ఇంగ్లండులో మశూచికం వచ్చినపుడు జెన్నర్‌ కుటుంబానికి పాలు పోసే అమ్మాయి తనకు మశూచి రాదని జెన్న ర్‌తో గర్వంగా చెప్పింది.''నా ఆవు లకు మశూచికం వచ్చింది. నేను పాలు పితుకుతూవుంటే నా చేతికి ఉన్న గాయా నికి ఆవుపుండ్ల రసి తగిలింది. అందుచేత నాకు మశూచికం రాదు'' అని ఆమ్మాయి చెప్పిన మాట జెన్నర్‌ తీవ్రంగా మశూ చికంపై పరిశోధన చేయడానికి దారి చూపింది. ఎన్నో దేశాల నుంచి వివ రాలు సేకరించి మశూచికి వ్యాక్సిన్‌ కనుగొన్నాడు..

తన పరిశోధన ఫలితంగా ఆవుదూడలకు మశూచికం వస్తే, వాటి నుండి మశూచి వ్యాధి క్రిములను తీసి, కొద్ది మోతాదులో టీకాగా మనుషులకు వేస్తే మనిషిలో మశూచిక నిరోధన శక్తి పెరుగుతుందని జన్నర్‌ కనుగొన్నాడు. తాను కనుగొన్న విషయాలను జెన్నర్‌ సవివరంగా ఒక పరిశోధనా వ్యాసంగా వ్రాసి, ఇంగ్లండులో రాయల్‌ సొసైటీకి పంపిస్తే, దానిని రాయల్‌ సొసైటీ పెద్దలు అసలు పట్టించుకోలేదు. వైద్యులు అతనిని ఎగతాళి చేశారు. అయినా జెన్నర్‌ నిరాశ చెందలేదు. అంతకు ముందు టర్కీ రాయబారి భార్య మశూచికంపై చెప్పిన విషయాలను కూడా 18వ శతాబ్దం ప్రారంభంలో రాయల్‌ సొసైటీ పట్టించుకోలేదు. అతి చిన్న సూక్ష్మక్రిమి ఏవిధంగా మశూచికి కారణం అవుతుందో, వాక్సినేషన్‌ ద్వారా మశూచిని ఎలా నివారించవచ్చో జెన్నర్‌ చారిత్రక, శాస్త్రీయ ఆధారాలతో తన పరిశోధనా ఫలితాలు పట్టుదలతో, దీక్షతో శాస్త్రజ్ఞుల ముందు ఉంచాడు. 1798లో ఎంతోమంది జెన్నర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా 1800సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది అతని మాటవిని మశూచికం టీకాలు వేయించుకొని రక్షింపబడ్డారు. అమెరికా హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు, థామస్‌, జఫర్‌సన్‌ జెన్నర్‌కు అండగా నిలిచారు. మనిషికి ఆవులోని మశూచికపు క్రిములు ఎక్కిస్తే మనిషి పశువైపోతాడని, ఆవులాగా అరుస్తాడని, ఎద్దులాగా మనిషికి కొమ్ములు వస్తాయని కట్టు కథలు ప్రచారం చేశారు. క్రైస్తవ మత గురువులు కూడా జెన్నర్‌ను దుమ్మెత్తిపోశారు.''పాపం చేసిన మనిషిని శిక్షించడానికి దేవుడు మశూచికం వ్యాధిని పంపుతాడు. దేవుడు విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జెన్నర్‌ది దైవధిక్కారం అని మతగురువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా జెన్నర్‌ చెప్పింది, చేసింది దాచేస్తే దాగని సత్యం. మత మౌఢ్యాన్ని వదిలి దేశదేశాలలో ప్రజలు మశూచి వ్యాక్సిన్‌ను చేయించుకోవడం ప్రారంభించారు. దానితో వైద్యశాస్త్రంపై మతగురువులో పెత్తనం మంచులాగా కరిగిపో యింది. మతంకాదు. సైన్స్‌ కావాలి అని, సైన్సే ప్రాణాల్ని రక్షిస్తుందని ప్రజలు స్పష్టంగా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో గుర్తించారు.

source : Visalandha News paper Sun, 30 Oct 2011
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

అందం రహస్యము(బ్యూటీ సీక్రెట్), Beauty Secret


  • image : courtesy with -www.teluguone.com

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --అందం రహస్యము(బ్యూటీ సీక్రెట్), Beauty Secret- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నేడు మహిళలు చాలామంది తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునేందుకు బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. మనచుట్టూ ఎందరో ఉంటారు. కానీ వాళ్ళలో కొందరే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వాళ్ళ బ్యూటీ సీక్రెట్ ఏమిటి? ఒకసారి ఆలోచించండి.

కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి పర్సనాలిటీ ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది నాచురల్ బ్యూటీ. ఫిజికల్ గా బాగుండటం సరే. దానికి తప్పకుండా కొన్ని మార్కులు పడతాయి.

ఇంకొందరు వేసుకున్న దుస్తుల వల్ల అందం వచ్చిందని, హెయిర్ స్టైల్ వల్ల అందం పెరిగిందని, మేకప్ తో బ్యూటీ వచ్చిందని, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. వీటినీ కాదనలేం. నాచురల్ బ్యూటీ కి అలంకరణ తోడైతే అదనపు ఆకర్షణ, లేదా ఎట్రాక్షన్ వస్తుంది. దీనికి ఇంకొన్ని మార్కులు పడతాయి.

కానీ గమ్మత్తు ఏమిటంటే, ఫీచర్స్ బాగుండటం, చక్కగా తయారవడం కంటే కూడా మరో రెండు కారణాలతో అందం వస్తుంది. అందులో ఒకటి మన ప్రవర్తన. మంచితనం, నిజాయితీలతో ముఖంలో బ్యూటీ వస్తుంది. ఇక రెండోది తెలివితేటలు. కాస్త వైజ్ గా, మెచ్యూరిటీతో నడచుకోవడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. బ్యూటీ పెరుగుతుంది. ముఖం ఛార్మింగ్ గా ఉంటుంది.

బిహేవియర్, బ్రెయిన్ మెచ్యూరిటీలతో అందమా అని ఆశ్చర్యపోకండి. ఇదేదో అతిశయోక్తి అని నిట్టూర్చకండి. మీకు అందంగా కనిపిస్తున్న లేదా బాగా అనిపిస్తున్న వాళ్ళని ఒకసారి గుర్తుచేసుకోండి. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కంటే మెచ్యూరిటీ లెవెల్స్ వల్లే బాగున్నారని స్పష్టం అవుతుంది. అదన్నమాట బ్యూటీ సీక్రెట్. ఇకనేం, బ్యూటీ సీక్రెట్ తెలిసింది కనుక బ్యూటిఫుల్ గా, ఛార్మింగ్ గా కనిపించడం మన చేతిలోనే ఉంది. అంతే కదా మరి, పుట్టుకతో వచ్చిన రూపాన్ని మార్చలేం కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ ను తప్పకుండా పెంచుగోగలం.

SUPERMODEL
* మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.
* నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.
* బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.
* పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.
* శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.
* ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.
* స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
* గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.
* బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.
నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.
* బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.
* నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 14, 2011

Exercises to brain , మెదడు కి వ్యాయామము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మెదడు కి వ్యాయామము-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మానవునిలో మెదడు (Brain) తలభాగంలో కపాళంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది. సెరిబ్రల్‌ కార్టెక్స్‌ ప్రాంతంలో నాడీకణాలు గాయాలకు తగినట్లుగా తమ ఆకృతిని సైతం మార్చుకుని పునరుత్తేజం పొందుతున్నట్లు గుర్తించారు.
భాగాలు

* మస్తిష్కము (Cerebrum)
* అనుమస్తిష్కము (Cerebellum)

ఈ సృష్టిలో మానవ మెదడు అద్భుతమైన నిర్మాణం. దీని పనితీరుపై ఇప్పటికీ శాస్తవ్రేత్తలకు పూర్తి అవగాహన కలగలేదు. ఎందుకంటే ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన ఏ సూపర్ కంప్యూటర్ లేదా మరే ఇతర వ్యవస్థలు కూడా ఇంతటి సామర్ధ్యంతోపనిచేయలేవు. నిజానికి మెదడుపై సమగ్ర అవగాహనే శాస్తవ్రేత్తలకు కలిగి వున్నట్లయితే ఈపాటికి మరో కృత్రిమ మెదడు సృష్టి జరిగి వుండేది. లోకానికి వెలుగులు పంచే దీపం తన రూపాన్ని తాను చూడలేని విధంగా అనేక నూతన ఆవిష్కరణలకు కారణమైన మేధస్సుకు కేంద్రంగా వున్న మెదడు తన నిర్మాణ రహస్యాన్ని తానే ఇప్పటికీ గ్రహించలేకపోయింది!

శరీరము లో అన్ని భాగాలకు వ్యాయామము తప్పనిసరి . అదేమాదిరిగా మెదడుకి కూడా వ్యాయామము అవసరము . మానసిక స్థితిగతుల్ని ఆరోగ్యము గా ఉంచుకునేందుకు , మెదడు చేసే పనుల్లో చురుకుదనము కోసము , సామర్ధ్యాన్నీ మెరుగుపరచుకునేందుకు సరియిన వ్యాయామము అవసరము .

కుడి ఎడమలు : కొత్త న్యూరాన్లు అభివృద్ధి పరిచేందుకు , వాటి నెట్ వర్క్ ను మెరుగుపరిచేందుకు ఆసక్తి దాయకమైన పనులతో మెదడుకు మేత పెట్టాలి . ఎడమచేతిని కుడిచేతికి బదులుగా అనేక పనులు చేయడానికి ఉపయోగించాలి . రాయడము , కంప్యూటరు మౌస్ వాడడము , ఎడమచేతితో బ్రెస్సింగ్ వంటి పనులు చేయడము చేస్తూఉండాలి . ఒకవేళ ఎడమచేతివాటము గలవారైతే కుడిచేత్తో ఆపనులు చేయడము మొదలు పెట్టాలి . మొదట్లో కొత్తగా ఉంటుంది , ఇబ్బందిగా ఉంటుంది ... ప్రాక్టీస్ చేస్తూపోతే రెండుచేతులూ ఒకే సామర్ధ్యము తో పనులు చేయగలుగుతాయి.

మెదడుకి సవాల్ : కొత్త పనులు నేర్చుకోండి , కొత్తదనాన్ని అభ్యసించండి ... ముఖ్యముగా ఇంతకుముందు ఎప్పుడూ చేయనివాటిని ఎంచుకోండి . చెస్ , తాయ్-చి , యోగా మున్నగునవి కార్యక్రమాల్లో భాగము చేసుకోండి. క్రాస్ వర్డ్ పజిల్స్ పూరించడం , నంబర్ గేమ్‌స్ , సుడోకు ఆటలు , రూబిక్స్ క్యూబ్ వంటివి మెదడుకు పదును పెడతాయి .

ఈ పనులన్ని కూడా మానసిక సామర్ధ్యాన్ని , చెయ్యి, కంటి కదలికలని మెరుగుపరుస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని వివరాల్ని మెదడు నిక్షిప్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది . కొత్త ప్రదేశాల వీక్షణము , కొత్తవ్యక్తుల్ని కలవడము , సరికొత్త సంస్కృతుల్ని అనుభవించడము మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. . . తాజా భావనలు కలుగుతాయి. కాబట్టి సమయం చిక్కినప్పుడు కొత్త కొత్త ప్రదేశాల్ని సందర్శిస్తుండాలి . ఇవన్నీ మెదడు శక్తిని పెంచేవే . మెదడు పాదరసములా పనిచేస్తున్నప్పుడు ఇక మనము సాధించలేనిదంటూ ఏమీఉండదు .

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, November 13, 2011

ఆరోగ్యానికి పౌష్టికాహారం-అవగాహన , Nutritional food for health-Awareness


  • Image : courtesy with Eenadu Newspaper


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- ఆరోగ్యానికి పౌష్టికాహారం-అవగాహన , Nutritional food for health-Awareness-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఏం తినాలి? ఎంత తినాలి? ఏం తినకూడదు? ఎందుకు తినకూడదు? వూబకాయులంటే ఎవరు? ఆ జాబితాలో చేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?...అనేకానేక సందేహాలకు జాతీయ పోషకాహార సంస్థ (NIN) తాజా నియమావళి జవాబు చెబుతోంది. భారతీయుల ఆరోగ్యానికి సంబంధించి ఇది రాజ్యాంగం లాంటిదే.

పౌష్టికాహారం ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ యువకులకు ఇన్ని కేలరీలు అవసరం అవుతాయనో, వృద్ధులకు ఇన్ని కేలరీలు తప్పనిసరి అనో నిపుణులు బల్లగుద్ది చెబుతుంటారు. తీరా చూస్తే అవి అంతర్జాతీయ అధ్యయనాలు. ఏ అమెరికన్‌ హెల్త్‌ జర్నల్స్‌ నుంచో తీసుకుని ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? దేశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి. పోషక అవసరాలూ మారతాయి. అమెరికన్లు అమెరికన్లే. భారతీయులు భారతీయులే. ఎవరి కోసవో తయారు చేసిన పోషక విలువల జాబితా మనకెలా సరిపోతుంది? మనకంటూ ఓ నియమావళి అవసరం. దాన్ని తయారుచేసే బాధ్యత జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తీసుకుంది. తాజా పరిశోధనల వివరాలు జోడిస్తూ, సమకాలీన జీవనశైలి ప్రభావాల్ని ఉటంకిస్తూ దశాబ్దానికి ఒకసారి సరికొత్త నియమావళిని రూపొందిస్తుంది ఆ సంస్థ. అలా, పన్నెండేళ్ల తర్వాత వెలువడిందే ఇది. ఇంకో పదేళ్లదాకా, ఈ అంకెలే భారత పోషకాహార వ్యవస్థకు మార్గదర్శనం చేస్తాయి. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఆధారం అవుతాయి. తాజా నియమావళిలో సలహాలున్నాయి, హెచ్చరికలున్నాయి, ముందుజాగ్రత్తలున్నాయి. నవజాత శిశువుల నుంచి వయోధికుల దాకా...అన్ని వయసులవారినీ దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలు చేసింది ఎన్‌ఐఎన్‌.

'బరువు' :
భారతీయుల్లో 30 నుంచి 50 శాతం అధిక బరువుతో బాధపడుతున్నారు. వూబకాయం రోగాల పుట్ట. దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, గుండె జబ్బులు తదితర సమస్యలకు దారితీస్తుంది. కొన్నిరకాల మానసిక రుగ్మతలకూ కారణం అవుతుంది. నానాటికీ పెరుగుతున్న వూబకాయ సమస్యపై జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలా అని, కృత్రిమ పద్ధతుల్లో బరువు దించుకోవాలన్న తొందరపాటూ మంచిదికాదని సలహా ఇస్తోంది. దానివల్ల నష్టాలే ఎక్కువని హెచ్చరిస్తోంది. వూబకాయాన్ని నియంత్రించడానికి కొన్ని సూచనలు కూడా చేస్తోంది.

ముందుగా, ప్రతి చిన్నపనికీ యాంత్రికశక్తిపై ఆధారపడటం మానేయాలి. బట్టలు ఉతుక్కోవడం, పుస్తకాలు సర్దుకోవడం, బూజు దులపడం, మెట్లు ఎక్కడం, రివోట్‌ వాడకుండా ఛానళ్లు మార్చడం...వంటి పనులు కొంతమేర అదనపు కేలరీలను కరిగిస్తాయి. రోజూ ఓ గంటసేపు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి. ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిరుదుల చుట్టూ పేరుకుపోయే కొవ్వు (సాధారణంగా మహిళల్లో) కంటే పొట్ట చుట్టూ తిష్టవేసే కొవ్వే (సాధారణంగా పురుషుల్లో) ఎక్కువ ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతీయ బీఎమ్‌ఐ
ఒక వ్యక్తి ఎంత బరువు ఉంటే వూబకాయుల జాబితాలో ఉన్నట్టు? ఈ విషయాన్ని లెక్కగట్టడానికి బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఓ సూచిక... బీఎమ్‌ఐ 18.5 కంటే తక్కువ ఉంటే పోషక విలువల లోపంతో ఇబ్బంది పడుతున్నట్టు. 25 నుంచి 30 మధ్య ఉంటే అవసరానికి మించి బరువు ఉన్నట్టు. 30 దాటితే వూబకాయుల జాబితాలో చేరినట్టు. 21-22 ఆదర్శవంతమైన బీఎమ్‌ఐ. ఇవన్నీ పాశ్చాత్యుల లెక్కలే. మరీ పొట్టి, మరీ పొడుగూ కాని భారతీయుల శరీరాకృతి ప్రకారం... బీఎమ్‌ఐ 23 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధిక బరువుకూ 27 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వూబకాయానికీ సూచికగా తీసుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది.

సేంద్రియ సందేహాలు
సేంద్రియ పంటలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అసలే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితులు. సేంద్రియ దుకాణాల్లో అయితే, ఆ ధరలు రెట్టింపు! అంత ధర పెట్టి సేంద్రియ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉందా? 'సేంద్రియమైనా కాకపోయినా ఆహారపదార్థాల పోషక విలువల్లో ఎక్కువ తేడా ఉండదు. వండే ముందు శుభ్రంగా ఉప్పు నీళ్లతో కడిగితే, క్రిమిసంహారకాల అవశేషాలు ఎనభైశాతం దాకా పోతాయి. ఉడికించినప్పుడూ, వేయించినప్పుడూ ఇంకొన్ని నాశనమైపోతాయి' అని భరోసా ఇస్తోంది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి. మనం కొన్నది నిజంగానే సేంద్రియ పద్ధతుల్లో పండిన పదార్థాలే అయితే (నిజానికి, భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను నిర్ధారించే అధికారిక సంస్థల్లేవు) ఆ కొద్దిశాతం కూడా రసాయనాల ప్రభావం ఉండదు.

ఒవెన్లు ఓకేనా...
మైక్రోవేవ్‌ ఒవెన్ల విషయంలో పోషకాహార సంస్థ కొన్ని సూచనలు చేస్తోంది. 'వాటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే, తిరిగి వేడిచేసుకుని తింటున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి భారీపరిమాణంలో వేడిచేయడం అస్సలు మంచిది కాదు. అలాంటప్పుడు, ఎక్కడో ఓ చోట ఎంతోకొంత ఆహారం చల్లగానే ఉండిపోతుంది. హానికరమైన బాక్టీరియా అందులో పోగైపోయి, శరీరంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్య రాకూడదంటే, మధ్యమధ్యలో బాగా కలపాలి. పాక్షికంగా వేడిచేసిన ఆహారాన్ని తిననే తినకూడదు. ఫ్రీజర్‌ లోంచి తీసిన వెంటనే మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టేయడమూ మంచిది కాదు' అని హెచ్చరిస్తోంది.

కాఫీ, టీ లేదా..
కాఫీ తాగాలా, టీ తాగాలా?-ఎప్పుడూ సందేహమే. నిజానికి రెండూ అనారోగ్యకరమే. భోజనానికి గంట ముందు, భోజనం తర్వాత ఓ గంట అస్సలు పుచ్చుకోకూడదు. ఎందుకంటే, అవి ఆహారంలోని ఐరన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కార్బొనేటెడ్‌ పానీయాలూ మంచిది కాదు. జీర్ణవ్యవస్థను దారితప్పిస్తాయి. వాటి బదులుగా పళ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. పచ్చిపాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. అందులో శాస్త్రీయత లేదు. పాలను ఓ స్థాయి వరకు మరిగించడం వల్లే, వాటిలోని హానికర సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. వేడిచేసుకోకుండా తాగడం అంటే, అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.

పళ్లెంలో పోషకాలు
అన్నిరకాల కూరగాయలూ వండుకోవాలి. అన్నిరకాల ఆకుకూరలూ తినాలి. అన్నిరకాల ఫలాలూ ఆరగించాలి. ప్రతి వ్యక్తీ రోజుకు మూడువందల గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో ఆకుకూరలు 50 గ్రాములు, కూరగాయలు 200 గ్రాములు, దుంపకూరలు 50 గ్రాములు. వీటికితోడు వందగ్రాముల తాజా పళ్లు తినాలి. గర్భిణులైతే, ఇనుమూ ఫోలిక్‌ యాసిడ్‌ చాలా అవసరం కాబట్టి ఇంకో యాభైగ్రాముల ఆకుకూరల్ని అదనంగా తీసుకోవాలి. ఆయా రుతువుల్లో దొరికే ఏ ఫలాలైనా ఆరోగ్యానికి మంచిదే. వాటిలో సూక్ష్మపోషకాలు అపారంగా ఉంటాయి. ఒకే పండులో అన్నిరకాల పోషక విలువలూ దొరకవు. అందుకే, రకరకాల రుచులు ఆస్వాదించాలని ఎన్‌ఐఎన్‌ సలహా ఇస్తోంది.

మరిన్ని పిండిపదార్థాలు...
జాతీయ పోషకాహార సంస్థ, పన్నెండేళ్లనాటి నివేదికలో మనిషికి నూటయాభైగ్రాముల కూరగాయలు సరిపోతాయని చెప్పింది. ఇన్నేళ్లలో పోషక అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకేనేవో ఆ పరిమాణాన్ని రెట్టించింది. ప్రస్తుత పరిస్థితుల్లో, మూడువందల గ్రాముల కూరగాయలు తినాల్సిందే. పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్లు) విషయంలోనూ పోషకాహార సంస్థ సిఫార్సులో తేడాలొచ్చాయి. ఇడ్లీ, ఉప్మా, దోసె, అన్నం, పప్పు తదితరాల్లో పిండిపదార్థాలు దొరుకుతాయి. మనం తీసుకున్న కేలరీల్లో 50 నుంచి 60 శాతం కార్బొహైడ్రేట్లు ఉండవచ్చన్నది తాజా సూచన. గత నివేదికలో అరవై నుంచి డెబ్భైశాతం ఉండాలని సిఫార్సు చేసింది. పిండిపదార్థాలు శరీరం రోజువారీ పనులు చేసుకోడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. గతంతో పోలిస్తే మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా కార్బొహైడ్రేట్ల అవసరమూ తగ్గినట్టు భావించాల్సి ఉంటుంది.

ఇంకాస్త ప్రొటీన్‌...
మన ఆహారంలో మాంసకృత్తుల (ప్రొటీన్లు) పరిమాణం పన్నెండు నుంచి పదిహేను శాతం ఉండాలన్నది (పాత నివేదికతో పోలిస్తే మూడుశాతం ఎక్కువ) తాజా సూచన. 'ప్రొటియోస్‌' అన్న గ్రీకుపదం నుంచి ప్రొటీన్‌ పుట్టింది. 'ప్రధానమైంది' అని ఆమాటకు అర్థం. ప్రొటీన్‌ సార్థకనామధేయురాలు. ఇది శరీరాన్ని రక్షించే పదార్థాన్ని తయారు చేస్తుంది. కండరాల కదలికకు సహకరిస్తుంది. జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కణాల్నీ కణజాలాల్నీ నిర్మిస్తుంది. మాంసంలో, చేపల్లో, గుడ్లలో, పప్పుధాన్యాల్లో, పాలలో, పాల ఉత్పత్తుల్లో, సోయాలో మాంసకృత్తులు పుష్కలంగా దొరుకుతాయి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనే విషయంలోనూ ఎన్‌ఐఎన్‌ పాత సూచనను సవరించింది. రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు (గతంలో అయితే ఒకటిన్నర లీటర్లే) ఒంట్లోకి వెళ్లితీరాలని చెప్పింది.

ఉప్పు...ముప్పు!
పన్నెండేళ్ల క్రితమే పోషకాహార సంస్థ ఉప్పు విషయంలో బోలెడు షరతులు పెట్టింది. రోజుకు ఎనిమిది గ్రాములకు మించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తాజా నియమావళిలో ఆ కోత ఇంకాస్త పెరిగింది. ఆరుగ్రాముల కంటే ఒక్క రవ్వ ఎక్కువైనా కష్టమేనని హెచ్చరిక జారీచేసింది. నిజానికి, ఉప్పు వాడకం 2.4 నుంచి 4 గ్రాములకు మించకూడదన్నది అంతర్జాతీయ సంస్థల హెచ్చరిక. సాధారణంగా భారతీయ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రోజుకు పది గ్రాముల ఉప్పు వాడతారని అంచనా. శరీరంలో ఉప్పు వోతాదు ఓ స్థాయిని దాటితే అధిక రక్తపోటు, ఉదర క్యాన్సర్‌ వంటి సమస్యలు రావచ్చు.

  • image : courtesy with Eenadu Newspaper.

అమ్మపాలు...
తల్లిపాలు అమృతంతో సమానమని మరోసారి గుర్తుచేస్తోంది పోషకాహార సంస్థ. కనీసం నాలుగు నెలలవరకూ తల్లిపాలు అవసరమని పన్నెండేళ్లనాటి నివేదిక సలహా ఇచ్చింది. ఆ వ్యవధిని ఇప్పుడు ఆరు నెలలకు పొడిగించింది. గరిష్ఠంగా రెండేళ్ల వరకూ ఇవ్వవచ్చంది. తల్లిపాలలోని కొలెస్ట్రమ్‌లో అపారమైన పోషక విలువలు ఉన్నాయి. ఆ మురిపాలతో తల్లీబిడ్డల అనుబంధాలూ బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుష్కలంగా తల్లిపాలు తాగిన బిడ్డల్లో పెద్దయ్యాక కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వూబకాయం, కొన్నిరకాల క్యాన్సర్లూ దరిచేరే ప్రమాదమూ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

పెరిగే పిల్లలకు...
పెరిగి పెద్దవుతున్న కొద్దీ, చిన్నారులకు మరింత శక్తిమంతమైన ఆహారం కావాలి. అప్పుడే పుట్టిన పసికందు బరువు ఐదునెలలు తిరిగేసరికి రెట్టింపు అవుతుంది. ఏడాది నిండేసరికి మూడురెట్లు ఎక్కువవుతుంది. బిడ్డలు రెండో ఏడాదికంతా, 7-8 సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమార దశకు ముందు బాలబాలికలు...ఏటా 6-7 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 నుంచి 3 కిలోల బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక కౌమారం వెుదలైందంటే ఎన్నో శారీరకమైన, మానసికమైన మార్పులు! అమాంతంగా ఎత్తూ (10 నుంచి 12 సెంటీమీటర్లు) బరువూ (8 నుంచి 10 కిలోలు) మారిపోతాయి. ఆ మార్పులకు సరిపడా ఆహారం అందాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఇవ్వాలి. ప్రతి మనిషికీ రోజుకు 600 నుంచి 800 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఎదిగే వయసులో ఆ అవసరం ఇంకా ఎక్కువ. పాల ద్వారా ఆ కొరత కొంత తీరుతుంది. నెయ్యి, వంటనూనెలు తగినంతగా (రోజుకు 25 నుంచి 50 గ్రా.) ఇవ్వాలి. ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పొద్దస్తమానూ టీవీకి అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. పిజ్జాలూ బర్గర్లూ వంటి చిరుతిళ్ల విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉండాలి. బాల్యం నుంచే ఆరోగ్యం మీదా పోషక విలువల మీదా అవగాహన కల్పించాలి. పిల్లల్లో పెరుగుతున్న వూబకాయ సమస్య పట్ల జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వూబకాయం బూచి చూపించి కడుపు మాడ్చడం కంటే, వ్యాయామాన్నీ ఆటపాటల్నీ ప్రోత్సహించడమే మంచి మార్గమని కన్నవారికి సలహా ఇస్తోంది.

పెద్దల ఆరోగ్యం జాగ్రత్త!
దేశ జనాభాలో దాదాపు పదిశాతం ఉన్న వయోధికులకు ఎన్‌ఐఎన్‌ చాలా జాగ్రత్తలే చెప్పింది. వయసు మీదపడేకొద్దీ సమస్యలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఉండదు కాబట్టి, కేలరీల అవసరమూ తగ్గుతుంది. సాధారణ వ్యక్తులకు రెండువేల కేలరీలు సరిపోతే, వయోధికులకు పద్ధెనిమిది వందలు చాలు. నూనె, నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం తగ్గించుకోవాలి. పాలు, పప్పుధాన్యాలు, తెల్లసొన... పెద్దలకు మంచి చేస్తాయి. రోజూ 200 నుంచి 300 మిల్లీ లీటర్ల పాలూ పాల ఉత్పత్తులూ తీసుకోవాలి. కనీసం నాలుగువందల గ్రాముల కూరగాయలూ పళ్లూ తినాలి. ఉప్పు, మసాలాలూ బాగా తగ్గించాలి. కాల్షియం, జింక్‌, ఇనుము, విటమిన్‌-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు... వృద్ధాప్య సమస్యల్ని అధిగమించడంలో సాయపడతాయి. వ్యాయామం చాలా అవసరం. నిపుణుల సహకారంతో సరైన వ్యాయామ పద్ధతుల్ని ఎంచుకోవాలి. ఆశావాదం, చురుకైన సామాజిక జీవితం కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.

మాయదారి తిండి!
చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, చిప్స్‌, ఫ్రెంచిఫ్రైస్‌... వగైరాలు కమ్మకమ్మగా కడుపులో దూరిపోయి, మెల్లమెల్లగా మనల్ని కష్టపెడతాయి. వాటిలో పోషక విలువలు ఉండవు. ఉన్నా నామమాత్రమే. ఉప్పు, చక్కెర, కొవ్వుపదార్థాలు అధికం. కొన్నింట్లో అయితే ప్రమాదకర రసాయనాలూ ఉంటాయి. సంప్రదాయమైన చిరుతిళ్లే ఉత్తమం. ఇంట్లో వండుకుతినే ఆహారమే ఆరోగ్యకరం. 'రెడీ టు ఈట్‌' రుచులు కృతకమైనవి. పిల్లలైనా పెద్దలైనా వాటికి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది.

వంటింటి ముచ్చట్లు..
అన్నపూర్ణకు నుద్దియౌ అతని ఇల్లాలు! ప్రవరాఖ్యుడి అర్ధాంగే కాదు, ప్రతి భారతీయ మహిళా వండి వడ్డించడంలో దిట్ట. ఆ తపనను అభినందించి తీరాల్సిందే. దానికి శాస్త్రీయత తోడైతే...ఆ ఇల్లు ఆరోగ్యనిలయం అవుతుంది. మధుమేహాలూ అధిక రక్తపోట్లూ వూబకాయాలూ మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

ఇల్లాలికి ఎన్‌ఐఎన్‌ సలహాలివి...
* నిల్వపచ్చళ్లూ అప్పడాలూ వేపుళ్లూ బాగా తగ్గించాలి.
* కూరగాయల్నీ ఆకుకూరల్నీ ఉప్పు కలిపిన నీళ్లలో శుభ్రంగా కడిగాకే తరగాలి. తరిగాక కడగడం మంచి పద్ధతి కాదు.
* కూరగాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోయడంవల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నానబెట్టడం వల్ల, కొన్నిరకాల విటమిన్లూ ఖనిజాలూ నీటిలో కరిగిపోతాయి.
* సరుకులు కొంటున్నప్పుడు నాణ్యత విషయంలో రాజీపడకూడదు. అగ్‌మార్క్‌, ఐఎస్‌ఐ వంటి నాణ్యతాముద్రలు ఉన్నవాటినే కొనాలి. కల్తీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* వంటల్లో నూనెలు తక్కువగా వాడాలి. నెయ్యి, వెన్నలను సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి.
* పాల ఉత్పత్తులు, మాంసం, వండిన పదార్థాలు నిల్వచేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవి విషతుల్యంగా మారతాయి. రంగులో రుచిలో తేడా కనిపిస్తే చెత్తబుట్టలో పడేయడం మంచిది.
* మాంసాహారులు చికెన్‌, మటన్‌లను తగ్గించుకుని, వారానికి 100 నుంచి 200 గ్రాముల చేపలు తీసుకోవాలి. జంతువుల కాలేయం, మూత్రపిండాలు, మెదడు అసలే వద్దు.

* * *
ఆనందంగా ఉండాలన్నా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, సాధించింది నిలబెట్టుకోవాలన్నా...ఆరోగ్యంగా ఉండాల్సిందే. ప్రతి ఆరోగ్యవంతుడి కళ్లలో ఓ మెరుపు ఉంటుంది. అది రోగులకు మాత్రమే కనబడుతుంది.

జాతీయ పోషకాహార సంస్థ నియమావళి ఆరోగ్య యాత్రలో రహదారి సూచిక లాంటిది. ఏ సూచికా మనల్ని గమ్యానికి తీసుకెళ్లదు. ఏ దార్లో వెళ్తే, తేలిగ్గా గమ్యాన్ని చేరుకోగలమన్నది మాత్రమే చెబుతుంది. మనవంతు ప్రయత్నం తోడైతేనే... ఆరోగ్య భాగ్యం!
పౌష్టిక పాకశాల!
పోషకాహార పరిశోధనలో దేశంలోనే అత్యున్నత సంస్థ...నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌). ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆవరణలో ఎంతోమంది పోషకాహార పరిశోధకులు, వైద్యులు, గణకశాస్త్ర నిపుణులు పనిచేస్తున్నారు. భారతీయుల ఆహారంలో పోషక విలువల్ని పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ పోషకాహారానికి సంబంధించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ సూచనలూ అందిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఈ నివేదికలే ఆధారం. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన పౌష్టికాహారాలపై ఇక్కడ అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి.

'సుదీర్ఘ పరిశోధనలూ అధ్యయనాల ఫలితంగా భారతీయుల కోసం ఈ ఆరోగ్య నియమావళిని రూపొందించాం' అంటారు ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. శశికిరణ్‌.

Source : Eenadu sunday magazine

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, November 12, 2011

ముసలితనము(వృద్దులు)లో మధుమేహము అవగాహన , Awareness of Diabetes in Old age



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --ముసలితనము(వృద్దులు)లో మధుమేహము అవగాహన-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


* పట్టణ జనాభాలో 25 ఏళ్లు దాటినవారిలో 16% మంది మధుమేహులే! ఇక 65 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహుల సంఖ్య 50% వరకూ ఉంది.
* 45-65 ఏళ్ల మధ్య తొలిసారిగా మధుమేహం బయటపడ్డవారిలో 50% మందికి అప్పటికే దాని మూలంగా ఏదో ఒక దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంది.
* 65 ఏళ్లు దాటిన తర్వాత మధుమేహం బయటపడిన దాదాపు అందరిలోనూ కూడా ఏదో దుష్ప్రభావం కచ్చితంగా ఉండి ఉంటుందన్నది ప్రస్తుత వైద్య అవగాహన.

65 ఏళ్లు పైబడిన వారిని మధుమేహ విషయము లో ముసలివారుగా పరిగణిస్తారు . ముసలితనం.. మరో బాల్యం లాంటిది! పండుటాకులకూ.. పసిబిడ్డలకూ పెద్దగా తేడా ఉండదు.

అందుకే వృద్ధులతో వ్యవహరించేటప్పుడు కాస్త 'సున్నితంగా' ఉండటం చాలా అవసరం. మధుమేహ నియంత్రణలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సగటు ఆయుర్దాయం పెరగటంతో మన దేశంలో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వృద్ధుల సంఖ్యతో పాటే.. మలివయసులో మధుమేహం బారినపడేవారి సంఖ్యా పెరుగుతోంది. అందుకే 'వృద్ధుల్లో మధుమేహం' అన్నది దానికదేగా ఓ ప్రత్యేకాంశంగా మారుతోంది. మధుమేహాన్ని ఎంత కచ్చితంగా అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఎంత కఠినంగా నియంత్రిస్తే అంత మేలు జరుగుతుంది. ఇది సాధారణ సూత్రం. కానీ సున్నితమైన వృద్ధుల విషయంలో దీన్ని అంత కచ్చితంగా... అంత కఠినంగా.. అంత ఉద్ధృతంగా.. అమలు చేయటానికి లేదు! కావటానికి మలివయసేగానీ ఈ స్థితికి వచ్చేసరికి వృద్ధులంతా ఒకే తీరుగా ఉండరు. కొందరు నిశ్చింతగా తమ పని తాము చేసుకుంటుంటే మరికొందరు ఇతరుల మీద ఆధారపడే దశకు చేరుకుంటారు. కొందరికి కుటుంబంలో అన్నీ చూసుకునే సంరక్షకులు ఉంటే ఉమ్మడి కుటుంబాలు అంతరిస్తున్న ఈ రోజుల్లో కొందరు పూర్తి ఒంటరిగానే బండి లాగాల్సి ఉంటుంది. ఈ వయసుకు వచ్చేసరికి ఇతరత్రా మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉండే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- వృద్ధులందరికీ మధుమేహాన్ని ఒకే తీరులో నియంత్రించటం సాధ్యం కాదని, అది సరైన పద్ధతి కూడా కాదని వైద్యరంగం గుర్తించింది.

మధుమేహం కారణంగా తలెత్తే దుష్ప్రభావాల ముప్పు నడివయసులో కంటే వృద్ధుల్లో చాలా ఎక్కువ. అలాగే కేవలం వృద్ధుల్లోనే కనబడే దుష్ప్రభావాలూ కొన్ని ఉన్నాయి. మన సమాజంలోని మొత్తం మధుమేహుల్లో 40% మంది 65 ఏళ్లు పైబడినవారే. ఇది ఇప్పటికే మధుమేహం నిర్ధారణ అయిన వారి లెక్క. పెద్ద వయసులో మధుమేహం ఉండి కూడా ఆ విషయం ఇంకా గుర్తించని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద వయసులో రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అంటే ఇప్పటికే మధుమేహం వచ్చినప్పటికీ.. దానికి సంబంధించిన లక్షణాలేవీ కూడా ప్రస్ఫుటంగా కనబడవు. దీంతో వీరిలో మధుమేహాన్ని అనుమానించటం, గుర్తించటం కష్టతరంగా మారుతుంది. అలాగని వదిలేస్తే సంభవించే నష్టం అపారంగా ఉంటుంది. 65 ఏళ్ల తర్వాత మధుమేహం తొలిసారిగా గుర్తించిన వారిలో (అప్పటి వరకూ దాన్ని మనం గుర్తించలేకపోయినా, లేక అది అప్పుడే వచ్చినా సరే) అప్పటికే శరీరంలో మధుమేహానికి సంబంధించిన తీవ్ర దుష్ప్రభావం, అనర్థం (ఇర్రివర్సిబుల్‌ కాంప్లికేషన్‌) ఏదో ఒకటి వచ్చి ఉండే అవకాశం ఉంది. మధుమేహం దుష్ప్రభావాల్లో- రక్తనాళాలు దెబ్బతినటం కారణంగా వచ్చే గుండె, మెదడు, కాళ్లు, కిడ్నీలు, కళ్ల జబ్బులు.. వీటికి తోడు నాడులు దెబ్బతిని వచ్చే 'న్యూరోపతి' కీలకమైనవి. 40-65 ఏళ్ల మధ్య మధుమేహం బయటపడిన వారికి ఈ సమస్యల్లో ఏదో ఒకటైనా వచ్చి ఉండే అవకాశం 50% వరకూ ఉంటుంది. అదే 65 ఏళ్ల తర్వాత బయటపడితే ఈ వ్యాధుల ముప్పు 100% ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో మధుమేహం వచ్చిందని గుర్తించగానే వీరికి మధుమేహం చికిత్సతో పాటు తప్పనిసరిగా ఇతరత్రా ఏయే సమస్యలున్నాయో గుర్తించి వాటికీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది!

కనబడని లక్షణాలు
* అతి మూత్రం ఉండదు: సాధారణంగా అతిమూత్రం, అతిదాహం, అతిఆకలి.. ఈ మూడింటినీ మధుమేహం లక్షణాలుగా చెబుతుంటారు. కానీ మధుమేహం ఉన్న వారందరిలో ఇవి తప్పకుండా కనబడాల్సిన పనేం లేదు. రక్తంలో గ్లూకోజు 250 కంటే ఎక్కువుంటే ఎవరైనా రాత్రిపూట కనీసం 4 సార్త్లెనా మూత్రానికి వెళ్తుంటారు. అయితే వృద్ధుల్లో మాత్రం సాధారణంగా ఈ లక్షణం కనబడదు. (ప్రోస్టేట్‌ సమస్యలుండి, దాని కారణంగా ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంటే అది వేరే విషయం) ఎందుకంటే మధుమేహం ఉన్న వృద్ధుల్లో నాడులు దెబ్బతినే 'అటనమిక్‌ న్యూరోపతి' సమస్య ఉంటుంది. మామూలుగా 400 మిల్లీలీటర్ల మూత్రం చేరితేనే విసర్జనకు వెళ్లాలన్న భావన కలిగించే మూత్రాశయం.. ఈ పెద్ద వయసు మధుమేహుల్లో 'అటనమిక్‌ న్యూరోపతి' కారణంగా 600 నుంచి 700 మి.లీ. వరకూ నిండిపోయినా ఆ విషయం మెదడుకు చేర్చలేదు. రెండోది- వీరిలో దాహం కూడా కొంత తగ్గుతుంది. దీనివల్ల నీళ్లు తగినంతగా తాగరు. ఇది కూడా రాత్రి మూత్రం తగ్గిపోవటానికి కారణమవుతుంటుంది. వీటివల్ల వీరిలో మధుమేహం ఎక్కువున్నా 'అతి మూత్రం' లక్షణం కనబడదు.

* కండర క్షీణత: మధుమేహం నియంత్రణలో లేకపోవటం వల్ల కండర క్షీణత జరుగుతుంది. అలాగే సాధారణంగా పెద్దవయసులో ఎంతోకొంత కండరాలు శుష్కిస్తుంటాయి. కాబట్టి పెద్దవయసు వారిలో మధుమేహం వచ్చి దాని కారణంగా కండరాలు క్షీణిస్తున్నా కూడా.. 'ఏదో వయసుతో పాటు బరువు తగ్గుతున్నాం, మామూలే' అని తోసేసుకు తిరుగుతుంటారు. పెద్దవయసులో మధుమేహాన్ని గుర్తించటంలో జాప్యానికి ఇది కూడా కారణమవుతోంది.

పరగడుపున పెరగదు
సాధారణంగా రక్తంలో గ్లూకోజు పరగడుపున 125, అంతకన్నా ఎక్కువగానీ.. ఆహారం తిన్న రెండు గంటలకు 200 కన్నా ఎక్కువుంటే మధుమేహంగా నిర్ధరిస్తారు. అయితే చాలామంది వృద్ధుల్లో- ఆహారం తినక ముందు రక్తంలో గ్లూకోజు శాతం మామూలుగానే ఉంటుంది. తిన్నాక రెండు గంటలకు మాత్రం పెరుగుతుంటుంది. దీంతో పరగడుపున రక్తపరీక్ష చేసి మామూలుగానే ఉందని, మధుమేహం లేదని పొరపడే అవకాశం ఉంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత పరీక్షించి.. అది 200 కన్నా ఎక్కువుంటే మధుమేహంగా గుర్తించాలి. ఒకవేళ 140-200 మధ్య ఉంటే మరోసారి రక్తపరీక్ష చేసి, అప్పుడూ అలాగే ఉంటే వీరిలో గ్లూకోజు నియంత్రణ తప్పుతోందని (ఇంపెయిర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌) గుర్తించి, నెలనెలా పరీక్షించాలి. వీరికి మందులు ఇవ్వకపోయినా జాగ్రత్తగా గమనించటం అవసరం.

ఆహారం.. పరి'మితంగా' స్వేచ్ఛ!
గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులు- వీరు మధుమేహం ఉన్నా ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటించాల్సిన పని లేదు. ఇది ముఖ్య సూత్రం. వృద్ధులు- చాలాకాలంగా తాము తింటున్న ఆహారం.. తమ నోటికి నచ్చిన ఆహారం.. తమకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం.. అందుబాటులో ఉండే ఆహారాన్నే తీసుకోవటం మంచిది. మధుమేహం కారణంగా వృద్ధాప్యంలో ప్రత్యేకంగా తమ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు! ఉదాహరణకు- అప్పటి వరకూ వరి అన్నం తింటున్న వాళ్లు ఉన్నట్టుండి చపాతీలు, రాగులు, జొన్నల వంటివాటికి మారనవసరం లేదు. తమకు అలవాటైన ఆహారాన్నే మితంగా తీసుకోవటం మంచిది.

* మామూలుగా మధుమేహులంతా తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలను తగ్గించి తీసుకోవాలి. అయితే వృద్ధుల విషయానికి వచ్చేసరికి కొంత మినహాయింపు అవసరం. ఈ వయసుకు వచ్చేసరికి ఆహారం జీర్ణం కావటం, తిన్నది పేగులు గ్రహించటం, ఒంటికి పట్టి అది కణాల్లోకి వెళ్లటం వంటి ప్రక్రియలన్నీ మందగిస్తాయి. వీరికి మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను అరిగించుకునే శక్తి తగ్గుతుంది. కాబట్టి వృద్ధులు తమ ఆహారంలో 60% వరకూ పిండి పదార్థాలు తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యేవి, జంక్‌ ఫుడ్‌ కాకుండా ఇంట్లో వండుకున్నవి తింటే మంచిది.

* వృద్ధులు పూర్తిగా ఉప్పు, కారం వంటివేమీ లేని చప్పిడి ఆహారం తినాల్సిన పని లేదు. దీనివల్ల ఆహారం మీద ఆసక్తి తగ్గి తిండి తగ్గిపోయి పోషకాహార లోపంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తమ నోటికి నచ్చిన ఆహారమే 'మితంగా' తినాలి.

చికిత్సలోనూ తేడాలు
వృద్ధుల విషయంలో.. మధుమేహం ఉందని గుర్తించిన తర్వాత దాన్ని నియంత్రించే తీరులోనూ, చికిత్స చేసే విధానంలో కూడా కొంత తేడా ఉంటుంది. మధుమేహ చికిత్స విషయంలో- వృద్ధులు తమ పని తాము చేసుకోగలుగుతున్నారా? లేక ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతున్నారా? అన్నది కీలకాంశం. అన్ని పనులకూ ఇతరులపై ఆధారపడే వారిని 'ఎల్డర్లీ- ఫ్రెయిల్‌' అంటారు. ఇలాంటి వారికి ఉద్ధృత చికిత్స ఇస్తూ మిగతా వారిలా రక్తంలో గ్లూకోజును పరగడుపున 125కి, ఆహారం తిన్న తర్వాత 200కి తగ్గించాలని ప్రయత్నించకూడదు. ఇలా తగ్గించటం వల్ల కలిగే అదనపు ప్రయోజనమేం ఉండదు, పైగా నష్టం కూడా ఉండొచ్చు. వీరిలో పరగడుపున 150, ఆహారం తిన్నాక 200 వరకూ ఉన్నా ఇబ్బంది లేదు. ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటున్న వృద్ధులకు (ఎల్డర్లీ- ఫిట్‌) మాత్రం- ఈ అంకెలు 125, 200 ఉండేలా చూడటం, అందుకు తగ్గట్టుగా చికిత్స చెయ్యటం తప్పనిసరి.

* సాధారణంగా మధుమేహులకు గ్త్లెకే టెడ్‌ హిమోగ్లోబిన్‌ (ఏ1సీ) పరీక్షాఫలితం 7 కన్నా తక్కువుండాలి. కానీ 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఇది 8 ఉన్నా ఫర్వాలేదు. అంతకన్నా తక్కువకు తగ్గించాలని ప్రయత్నించకూడదు. ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడిన వృద్ధుల్లో దీన్ని తప్పకుండా పాటించాలి.

* ఇతరుల మీద ఆధారపడిన వృద్ధులకు రక్తపోటు విషయంలోనూ కొంత మినహాయింపు (140/90 వరకూ) ఉంది. అయితే ఈ రక్తపోటు, గ్లూకోజుల స్థాయులను ఉన్నట్టుండి ఒకే రోజులోనే తగ్గించటానికి ప్రయత్నించరాదు. క్రమేపీ తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది.

* బరువు: మామూలుగా ఎవరికైనా ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా ఎక్కువుంటే స్థూలకాయుల కిందే లెక్క. కానీ వృద్ధుల్లో దీనికన్నా 20% ఎక్కువున్నా స్థూలకాయంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అలాగే వృద్ధులెవరూ నెలకు 2 కేజీల కన్నా ఎక్కువగా బరువు తగ్గటం మంచిది కాదు. ఒకవేళ 65 ఏళ్లు పైబడిన వాళ్లు అలా నెలకు 2 కేజీల కంటే ఎక్కువ తగ్గిపోతుంటే- ఇతరత్రా ముప్పులేమైనా ఉన్నాయేమో పరీక్షించటం చాలా అవసరం. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో క్యాన్సర్‌ వంటి ముప్పులు ఎక్కువగా పొంచిఉంటాయి. బరువు తగ్గిపోవటం వాటికి సంకేతం కావచ్చు.

కఠిన వ్యాయామం వద్దు
వృద్ధులు పెద్ద పెద్ద కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. సాధారణ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. వ్యాయామ సమయంలో గుండె కొట్టుకునే రేటు పెరగకుండా చూసుకోవాలి. ఇది 120 కన్నా పెరగకుండా జాగ్రత్తపడాలి.

ఈ సమస్యలు.. వీరికే ప్రత్యేకం!
* స్పందన సమస్యలు: మధుమేహ వృద్ధుల్లో స్వయంచాలిత (అటనామిక్‌) నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా తీవ్రమైన గుండె జబ్బు ఉన్నా వీరికి నొప్పి తెలియదు. సాధారణంగా మన ఉఛ్వాస, నిశ్వాసాలను బట్టి గుండె కొట్టుకునే వేగం మారుతుంటుంది, కానీ వృద్ధుల్లో ఈ విధానం దెబ్బతిని గుండె ఎప్పుడూ ఒకే వేగంతో (ఫిక్స్‌డ్‌ హార్ట్‌రేట్‌) పని చేస్తుంటుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హృదయ స్పందన సమస్యలకు (బ్రాడీకార్డియా, అరిత్మియా వంటివి) దారితీస్తుంది. అలాగే ఎలాంటి లక్షణాలు లేకుండానే మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. పిత్తాశయం వ్యాధులు, ప్రోస్టేట్‌ వాపు, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్లు, క్షయ వంటివి వస్తే.. ఈ అటనామిక్‌ న్యూరోపతి కారణంగానే వీరిలో జ్వరం వంటి లక్షణాలు కనబడవు. కడుపులో నొప్పి ఉండదు. దీంతో వ్యాధి త్వరగా బయటపడదు. వీరిలో నీరసం, ఇతరుల మీద ఆధారపడటం ఎక్కువవుతుంది. మంచం మీది నుంచి లేవలేకపోవటం, ఆకలి తగ్గిపోవటం వంటివి కనిపిస్తాయి తప్ప ఫలానా చోట నొప్పి అనిగానీ, జ్వరం రావటం గానీ జరగదు. ఇది కూడా అటనామిక్‌ న్యూరోపతీ లక్షణమే.

* మధుమేహ వృద్ధుల్లోనే ప్రత్యేకంగా కనిపించే మరో సమస్య- డయాబెటిక్‌ న్యూరోపతిక్‌ కకెక్సియా. దీనిలో కాళ్ల మంటలు, నొప్పులు, తిమ్మిర్ల వంటి న్యూరోపతి లక్షణాలతో పాటు మనిషి

వేగంగా బరువు తగ్గిపోతుంటారు. మానసికంగా కుంగుబాటు వంటివీ ఒక్కసారే బయల్దేరతాయి. దీనికి ఇన్సులిన్‌తో చికిత్స మంచి ప్రయోజనకారి.

* లేవటం కష్టం: కండరాలకు అనుసంధానంగా ఉన్న నాడీ చివళ్లు దెబ్బతింటాయి. తొడల్లోని కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల కుర్చీలోంచి త్వరగా లేవలేకపోవటం, కారులోంచి

వెంటనే బయటకు రాలేకపోవటం, మెట్లు ఎక్కటం కష్టం కావటం వంటివన్నీ కనిపిస్తాయి. మధుమేహ వృద్ధుల్లో న్యూరోపతీ ఇలా 'డయాబెటిక్‌ ఎమయోట్రోఫీ' రూపంలో

బయటపడుతుంది.

* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: ప్రోస్టేట్‌ సమస్యలు, మూత్రాశయంలో మూత్రం అధికంగా నిల్వ ఉండటం, వీటికి మధుమేహం తోడవటం వల్ల వీరిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతాయి.

ఈ బెడద మరింత తీవ్రమైతే ఇది మూత్రపిండాలకూ వ్యాపించి 'పాపిలరీ నెక్రోసిస్‌' అనే సమస్యకూ దారితీస్తుంది. దీంతో కిడ్నీల వైఫల్యం కూడా రావొచ్చు. కొందరు మధుమేహ వృద్ధుల్లో

మూత్రం ఆపుకోలేని సమస్యా వస్తుంది.

* ఎముకలు బోలుబోలు: మధుమేహ వృద్ధుల్లో ఎముకలు గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌) ఎక్కువ. ఇది విటమిన్‌-డి లోపం వల్లనే కాదు. మధుమేహ వృద్ధుల్లో ఎముకల

పునర్నిర్మాణం కంటే కూడా ఎముక క్షీణతపాళ్లు ఎక్కువ. ఇది ఆస్టియోపొరోసిస్‌కు దోహదం చేస్తుంది. నాడులు దెబ్బతిన్న కారణంగా పట్టు తప్పి పడిపోయే అవకాశాలు ఎక్కువ,

ఆస్టియోపొరోసిస్‌ కారణంగా పడినప్పుడు ఎముకలు విరిగే అవకాశాలూ పెరుగుతాయి.

* మందగించే విషయ గ్రహణ సామర్థ్యం: మధుమేహ వృద్ధులకు విషయాలను గ్రహించే శక్తి సన్నగిల్లుతుంది. గడియారం చూసి వెంటనే సమయం చెప్పలేకపోవటం, ట్రాఫిక్‌లో లైట్లను

సరిగా పోల్చుకోలేకపోవటం, ఫోన్‌ చేసి ఎవరికి చేశామో మరచిపోవటం, ఫోన్‌ ఎత్తినా కొంత సేపటి వరకూ సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోవటం.. ఇలాంటి మందగమన లక్షణాలు

కనిపిస్తాయి. మధుమేహ వృద్ధుల్లో మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌) కూడా ఎక్కువగా కనబడుతుంది.

* మందగించే జీర్ణవ్యవస్థ: అటనామిక్‌ న్యూరోపతీ కారణంగా వృద్ధ మధుమేహుల్లో పేగుల్లో కదలికలు తగ్గి.. జీర్ణశక్తి మందగించటంతో పాటు మలబద్ధకం కూడా కనిపిస్తుంది.

* మధుమేహ వృద్ధుల్లో వినికిడి లోపమూ ఎక్కువే. వినికిడి చెవిలోని సూక్ష్మ రక్తనాళాలు, శ్రవణ నాడులు కీలకం. మధుమేహం వీటినీ దెబ్బతీస్తుంది. దీంతో వీరిలో వినికిడి లోపం పెరుగుతుంది.

మందులు.. అన్నీ పనికిరావు
* వృద్ధుల్లో ఉద్ధృతంగా చికిత్స చేస్తూ మధుమేహాన్ని మరీ కఠినంగా నియంత్రించటానికి ప్రయత్నించటం మంచిది కాదు. డయానిల్‌, గ్త్లెనేజ్‌ వంటి సల్ఫనైల్‌ యూరియా మందులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి వృద్ధులకు వీటిని ఇవ్వకపోవటమే మేలు. డయానిల్‌ అనే మందు శరీరంలో 18 గంటల పాటు పనిచేస్తుంది. ఈ మాత్రను ఉదయం వేసుకుంటే సాయంత్రం దాటిన తర్వాత కూడా పనిచేస్తుంది. సాయంత్రం మరోటి వేసుకుంటే ఉదయం ప్రభావానికి ఇది తోడై (క్యుమిలేటివ్‌) రక్తంలో గ్లూకోజును మరింతగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ రకం మందులను 65 ఏళ్లు దాటిన వారికి ఇవ్వకూడదు. కేవలం 3, 4 గంటలు మాత్రమే పనిచేసే నాటిగ్లినైడ్‌, రెపాగ్లినైడ్‌ మందులు వృద్ధులకు బాగా అనువైనవి, కాకపోతే ఇవి కొంచెం ఖరీదైనవి.

* మన దేశంలో వృద్ధులకు అకార్బోజ్‌, ఓగ్లిబోజ్‌, మిగ్లిటాల్‌ వంటి'ఆల్ఫా గ్లూకోసిడేజ్‌ ఇన్‌హిబిటార్‌' రకం మందులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి పిండిపదార్థాలను జీర్ణం కాకుండా, జీర్ణమైనదాన్ని రక్తము లోకి వెళ్లకుండా నిరోధిస్తాయి. వీటితో మల విసర్జన కూడా సాఫీగా అవుతుంది. ఇవి మంచివేగానీ వీటితో ఆహారం జీర్ణం కావటం ఆలస్యమవుతుంది కాబట్టి ఆకలి తక్కువగా ఉన్నవారికి, బరువు తగ్గుతున్న వృద్ధులకు ఇవి పనికిరావు.

* మెట్‌ఫార్మిన్‌: మధుమేహుల్లో 90% మంది వాడే మందు ఇది. మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉంటే మాత్రం దీన్ని వేసుకోకూడదు. సాధారణంగా వృద్ధాప్యంలో మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి. మూత్రపిండాల పనితీరును తెలిపే సీరమ్‌ క్రియాటినైన్‌ 1.5 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మెట్‌ఫార్మిన్‌ మందు వాడొద్దని చెబుతుంటారు. అయితే వృద్ధుల్లో మూత్రపిండాల పనితీరును తెలుసుకోవటానికి సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్ష కంటే వడపోత సామర్థ్యాన్ని చెప్పే 'గ్లోమర్యులార్‌ ఫిల్టరేషన్‌ రేటు (జీఎఫ్‌ఆర్‌)' పరీక్ష మీద ఆధారపడటం మంచిది. ఇది 50 శాతం కన్నా తక్కువుంటే మెట్‌ఫార్మిన్‌ మందు తీసుకోకూడదు.

* గ్లిప్టిన్లు: ప్రస్తుతం సాక్సా గ్లిప్టిన్‌, సిటా గ్లిప్టిన్‌, విల్డాగ్లిప్టిన్‌ అనే మూడు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచివే గానీ జీర్ణశక్తిని తగ్గించే అవకాశం ఉంది. వృద్ధుల విషయంలో వీటిని అన్నీ పరిశీలించాకే వాడాలి.

* ఇన్సులిన్‌: మాత్రలు వేసుకుంటున్నా మధుమేహం నియంత్రణలో లేకపోతే ఇన్స్‌లిన్‌ తీసుకోవాలి. 65 ఏళ్లు దాటిన వృద్ధులు రోజుకి రెండుసార్లు ఇన్సులిన్‌ తీసుకుంటే సరిపోతుంది.

నాలుగుసార్లు తీసుకోవాల్సి వస్తే వైద్యుల సమక్షంలోనో, ఆసుపత్రిలోనో తీసుకోవాలి. గ్లూకోజు పరగడుపున 250 కన్నా ఎక్కువ, భోజనం తర్వాత 500 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు..

ట్రైగ్లిజరైడ్లు 600 మించితే ఇన్సులిన్‌ వాడాలి. మూత్రంలో అల్బుమిన్‌ పోతున్నా, ఈసీజీ, ఎక్స్‌రే, కంటి పరీక్షల్లో తేడాలున్నా ఇన్సులిన్‌ తీసుకోవటానికి ఏమాత్రం సందేహించకూడదు.

పరీక్ష ముఖ్యం
* మధుమేహ వృద్ధులు తరచుగా గ్లూకోజు పరీక్ష చేయించుకోవటం చాలా చాలా అవసరం. ఒక్కరిమే ఉంటున్నామని, బయటకు పోలేమని.. ఇలా సాకులతో పరీక్ష చేయించుకోకుండా ఉండటం సరికాదు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే మాత్రలు వేసుకోకపోవటం కన్నా పరీక్షలు చేయించుకోకుండా వేసుకుంటే వచ్చే ప్రమాదమే ఎక్కువ. వృద్ధుల్లో రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోయి 'హైపోగ్త్లెసీమియా' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవటం ముఖ్యం.

* రాకపోయినా పరీక్షలు: 55 ఏళ్ల వరకు మధుమేహం రానివారికి 60 ఏళ్ల వయసులో వచ్చే అవకాశం లేదని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ హఠాత్తుగా గుండెపోటో, పక్షవాతం వచ్చినపుడు వీరిలో మధుమేహాన్ని గుర్తిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన స్థితి. మన సమాజంలో 25 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ ఏటా ఓసారి మధుమేహ పరీక్ష చేయించుకోవటం అవసరం.

  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, November 11, 2011

గర్భవతులు తినకూడని పండ్లు , Some Fruits not good for pregnent women



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --గర్భవతులు తినకూడని పండ్లు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాధారణంగా పళ్లు తింటే ఆరోగ్యం ఆనందం రెండూ కలుగుతాయని చెప్తారు పెద్దలు అయితే కొన్ని రకాల ఫలాలు సమయానుకూలంఆ తీసుకోకుంటే కొత్త సమస్యలు తెచ్చి పెతాయని, అందునా గర్భవతు లు కొన్ని పళ్లు తీసుకుస్త్రంటే అనేక దుష్పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా సమస్యలు తెచ్చి పెట్టే ఫలాలపై ఓ సారి దృష్టి పెడితే..

పైనాపిల్‌ :

గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్య కారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైన్‌ అనే పదార్ధం గర్భాశయాన్ని శుభ్ర పరిచే గుణం కలది. దీంతో గర్భ విఛ్చినం కావటమో... నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు.

బొప్పాయి:

గర్భవతులు బొప్పాయి పండు తీసుకుంటే అందులోని సి విటమిన్‌ మేలు చేస్తుందని, వారిలో వచ్చే గుండె మంట, మలబద్దకం తగ్గేందు కుఉపయోగపడు తుందని పెద్ద లు చెప్పి నా.. బొప్పాయిలో గర్భ విఛ్చిన్న గుణాలుండటంతో సురక్షిత ప్రసవం కోరుకునే గర్భిణీలు దాన్ని తినవద్దనే చెప్తారు.

అయితే ప్రసవానంతరం బొప్పాయికి కాసింత తేనె కలిపి తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు పడతాయి. పైగా ప్రసవంలో కోల్పోయిన సత్తువని బొప్పాయందించే విటమిన్‌ సి తో సరి చేసుకోవచ్చు.

నల్ల ద్రాక్ష :

చాలా మంది గర్భిణీలుగా ఉన్నవారికి రక్తం ఎక్కువగా ఇచ్చే గుణ ముందని నమ్మి, తెలిసో తెలియకో మార్కెట్‌లో కనిపించే నల్ల ద్రాక్షని కొని ఇస్తుంటారు. అయితే నల్ల ద్రాక్షకు శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉండటం వల్ల అది గర్భస్ధ శిశువులకు మంచిది కాక పోవటం, దాన్ని తట్టుకోలేని బిడ్డల ఆరోగ్య స్ధితి మారిపోయే ప్రమాదం కూడా ఉందని అందుకే ఈపళ్లని గర్భిణీలకు ఇవ్వవద్దని వైద్య నిపుణులు సూచిస్తారు.

గర్భిణీలే కాదు మీరు తీసుకునే ఏ ఇతర పళ్లనైనా నేరు గా కాకుండా ఖచ్చితం గా ఒకటికి రెండు సార్లు శుభ్రమైన నీటితో కడిగి, వాటికి ఎలాంటి రసాయనా లు, పురుగులు లేనట్లు నిర్ణరించుకుని తినండి.లేదంటే రసాయనాలు మీ ఆరోగ్యా న్ని చెడగొట్టి మరిన్ని సమస్యలకు కారణమయ్యే అవకాశాలను మీరే ఇచ్చిన వారవుతారు.

- శ్రీవల్లి తన్మయ్‌
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, November 9, 2011

నిమ్ము , న్యుమోనియా, Pneumonia


  • Image Courtesy with Vaartha News paper

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --నిమ్ము , న్యుమోనియా, Pneumonia-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్ని వైద్యపరిభాషలో న్యుమో నియా అంటారు. న్యుమోనియా శ్వాసకోశాలకు వచ్చే ఒక ఇన్‌ ఫెక్షన్‌. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధి .

కారణాలు
న్యుమోనియా వ్యాధి వైరస్‌, బాక్టీరియా, ఫంగస్‌, ప్రోటోజోవాల వలన కలుగుతుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా ఈ సూక్ష్మజీవులు మన శరీరాల్లోకి చేరుతాయి. అయితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటిబాడీస్‌, తెల్ల రక్త కణాలు వీటిని నిర్వీర్యం చేసి శరీరానికి రక్షణ కలిగి స్తుంటాయి. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కొనలేకపోవచ్చు. కొంతమందిలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, లేదా కొన్ని రకాల వ్యాధుల వలన ఈ శక్తి సన్నగిల్లడం జరుగుతుంది.

ధూమపానం చేసే వారిలో, మద్యం తీసు కునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, హెచ్‌ఐవి, కేన్సర్‌, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.వీరందరిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. సాధారణంగా రెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో న్యుమోనియా రావడానికి పైన పేర్కొన్న అంశాలే కారణమవుతాయి. వీరంద రిలో న్యుమోనియా తరచుగా వచ్చే అవకాశాలు న్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి రావచ్చు.

జలుబు చేసిన తరువాత కొందరిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. న్యుమోనియా సోకిన తరువాత ఒకటి రెండు వారాలు బాధిస్తుంది. ఆ సమయంలో తీవ్రంగా ఉన్న సూక్ష్మజీవులతోపాటు, తీవ్రత తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు కూడా తమ ప్రతాపాన్ని కనబరుస్తాయి.చిన్న పిల్లలలో రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వలన వచ్చే జలుబు, దగ్గు తరువాత న్యుమోనియా తరచుగా వస్తుంటుంది.సహజంగా ప్రతివారికి ముక్కులోనూ, గొంతు, నోటిలో ఉండే సూక్ష్మజీవులు ఎలాంటి వ్యాధి కలుగజేయవు. అయినా కొన్ని సందర్భాలలో మాత్రం న్యుమోనియాను కలుగజేస్తాయి.

-యాస్పిరేషన్‌ వలన గొంతులో క్రిమి శ్వాసకోశాల లోకి ప్రవేశిస్తే అది న్యుమోనియాను కలుగ జేస్తుంది. మత్తు పదార్థాలు, ఆల్కహాల్‌ సేవనం వంటి అలవాట్లుఉన్న వారిలో, మెదడుకు సంబంధించిన వ్యాధి లేదా దెబ్బలు తగిలిన వారిలో స్పృహ తప్పడం వలన గొంతులో ఉండే పదార్థాలు శ్వాసకోశాల్లోకి చేరుతాయి. పలితంగా యాస్పిరేషన్‌ న్యుమోనియా సోకుతుంది.న్యుమోనియాను కలిగించే కారణాలనుబట్టి దీనిని వైరల్‌ న్యుమోనియా, బాక్టీరియల్‌ న్యుమోనియా, ఫంగల్‌ న్యుమోనియా అని వ్యవహరిస్తారు. వీటిలో సాధారణంగా కనిపించేది, ప్రమాదకరమైనది బాక్టీరియల్‌ న్యుమోనియా.

లక్షణాలు
చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి సాధారణంగా ఉంటాయి.కొందరిలో దగ్గుతోపాటు రక్తం కూడా పడవచ్చు. కొంతమందిలో కఫం చిక్కగా, కొందరిలో పలుచగా పడవచ్చు. కొంతమందిలో కొద్దిగానే కఫం పడితే, ఇంకొంతమందిలో అరగ్లాసు, గ్లాసు వరకూ కూడా పడవచ్చు. కఫం రంగు ఎరుపుగా కానీ, పసుపుగా కానీ, ఆకు పచ్చగా కానీ ఉండవచ్చు.కొంతమందిలో కఫం దుర్వాసనతో కూడి ఉండవచ్చు. వీటినిబట్టి కొంత వరకూ వ్యాధి కారక కారణాలు కనుగొనవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు పాకే అవకాశం ఉంది. దీనిని బాక్టీరీమియా, సెప్టిసీమియా అంటారు. వీటి వలన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర అవయవాల్లోకి ఇన్‌ఫెక్షన్‌ పాకే అవకాశం ఉంది.

వ్యాధి నిర్ధారణ
రక్త పరీక్షలో తెల్ల రక్త కణాల సంఖ్య, ఇఎస్‌ఆర్‌ వంటి వాటి వలన వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. అలాగే వ్యాధి తీవ్రతను కూడా తెలుసు కోవచ్చు. కొన్ని సందర్భాలలో వరుసగా చేసే ఈ పరీక్షల్లో వ్యాధి తగ్గుముఖం పట్టిందా? లేదా? అనే విషయం కూడా తెలుస్తుంది.బ్లడ్‌కల్చర్‌, కళ్లె పరీక్ష, ఛాతి ఎక్స్‌రే, ఛాతికి సిటి స్కాన్‌, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షలలో వ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను గుర్తించడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయగలుగుతాము. కఫంలో కనిపించే క్రిములను గుర్తించి, వాటికి తగిన మందు లను ఇవ్వడం అవ సరం. దీనికి కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ అనే పరీక్ష తప్పనిసరి. కొన్ని సందర్భాలలో వ్యాధి కారకాలను సరిగ్గా గుర్తించలేకపో యినప్పటికీ, వైద్యుని అనుభవంపైనే సరైన మందులు ఇవ్వవలసి ఉంటుంది.

చికిత్స
ఆరోగ్యవంతుల్లో వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్‌ న్యుమోని యాకు, ఆసుపత్రుల్లో వచ్చే హెల్త్‌ కేర్‌ అసోసియేటెడ్‌ న్యుమోనియాకు, హాస్పిటల్‌ అక్వైర్డ్‌ న్యుమోనియాకు వాటిని కలిగించే కారకా లకనుగుణంగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే, ఇంజెక్షన్ల రూపంలో యాంటిబయాటిక్స్‌ను ఇవ్వవలసి ఉంటుంది. కనీసం 7 - 10 రోజులపాటు మందులను వ్యాధిని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐవి ఫ్లూయిడ్స్‌, ఆక్సిజన్‌ కూడా అవసరమవుతాయి.సరైన సమయంలో వైద్య సహాయం అందక పోతే, పలు దుష్ప్రభావాలు చోటు చేసుకుం టాయి. శ్వాసకోశాల్లోని న్యుమోనియా చీముగా మారడం, ఛాతీలో చీము చేరడం, మెదడు తదితర అవయవాల్లోకి చేరడం జరుగవచ్చు. సెప్సిస్‌ వలన వివిధ అవయవాలు దెబ్బ తినవచ్చు. కొంతమందిలో అక్యూట్‌ లంగ్‌ ఇంజ్యూరీ (ఎఎల్‌ఐ) కూడా వచ్చే ప్రమాదం ఉంది.తొలిదశలోనే వ్యాధిని సరిగ్గా గుర్తించి సరైన వైద్య సలహాను పాటిస్తే, తరువాత జరిగే దుష్పరిణామాలను నివారించవచ్చు.

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, November 2, 2011

వృత్తి తో ఆరోగ్యము ,ఆక్యుపేషనల్‌ హెల్త్‌ , Occupational Health




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- ఆక్యుపేషనల్‌ హెల్త్‌ , Occupational Health-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఒకరు భారీ యంత్రాల కోరలు తోముతుంటారు. మరొకరు హలం పట్టుకుని పొలం దున్నుతుంటారు. ఇంకొకరు కణ కణ మండే కొలుముల ముందే... రాళ్లు పగిలే రోళ్ల మధ్యే ఉపాధి వెతుక్కుంటారు. వేరొకరు రేయనకా పగలనకా గస్తీలు కాస్తుంటారు. మరొకరు కఠోర సాధనతో కంఠంలోనే సంగీతాన్ని మథిస్తుంటారు.. సహస్ర వృత్తుల విభిన్న ప్రపంచమది! కూటి కోసం.. తృప్తి కోసం.. కోటి వృత్తులు! ఏ వృత్తి విశిష్టత దానిది! దేని ప్రత్యేకత దానిదే.. స్వభావంలోనే కాదు... వెన్నంటి ఉండే వ్యాధుల విషయంలో కూడా...!

ప్రతి వృత్తినీ.. ప్రతి పనినీ వెన్నంటి ఏదో ఒక వ్యాధీ ఉంటుంది! వైద్య పితామహులు ఈ విషయాన్ని 17వ శతాబ్దంలోనే గుర్తించారు. అందుకే అప్పటి నుంచీ దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరుపుతున్నారు. పారిశ్రామికీకరణ తర్వాత కార్మిక ప్రపంచం విస్తృతంగా విస్తరించిన తర్వాత ఈ వృత్తి వైద్యానికి ప్రాశస్త్యం మరింత పెరిగింది. గనిలో, పనిలో, కార్ఖానాలో కార్మికులు ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు.. వ్యాధుల రూపంలో పలకరిస్తుండవచ్చు. అయితే కేవలం కార్మికులకు, కర్మాగారాలకే కాదు.. ఈ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అత్యాధునిక ఉద్యోగాలకూ, వృత్తులకూ కూడా ఈ వ్యాధుల బెడద అనివార్యం. కంప్యూటర్‌ నిపుణుల నుంచి క్యాంటీన్‌ పనివారి వరకూ ప్రతి ఒక్కరికీ వృత్తిపరంగా ఏదో రూపంలో వ్యాధుల ముప్పు ఉంటూనే ఉంది.

మన వృత్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపినట్టే.. మన ఆరోగ్యం కూడా మనం చేసే పని మీద, పని సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వృత్తి వైద్యానికి.. ఆక్యుపేషనల్‌ మెడిసిన్‌కు ప్రాముఖ్యత పెరుగుతోంది. వృత్తిపరంగా వచ్చే వ్యాధులను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏ వృత్తిలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో గుర్తించటం, అవగాహన పెంచుకోవటం ద్వారా వాటిని మనం చాలా వరకూ నివారించుకోవచ్చు. నిత్యం రకరకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యాధుల బారినపడినా వెంటనే గుర్తించి, తదునుగుణంగా తక్షణం చికిత్స తీసుకోవచ్చు. అది మళ్లీ రాకుండా.. వృత్తిపరంగా రక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఇది డాక్టర్లు, చిరు ఉద్యోగుల నుంచి కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తుంది.

సమాజంలో తరచుగా కనబడే వ్యాధులు బయటపడటానికి తక్కువ సమయం పడుతుంది. కానీ వృత్తిసంబంధమైన వ్యాధులు పూర్తిగా బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పైగా ఇవి చూడటానికి సాధారణ వ్యాధుల్లాగే ఉంటాయి కాబట్టి వీటికి మూలాలను పట్టుకోవటం కూడా కష్టం కావచ్చు. పైపై చికిత్సలతో తగ్గినట్టే తగ్గినా.. పని పరిస్థితుల్లో మార్పు రానంత వరకూ ఇవి మళ్లీ మళ్లీ వేధిస్తుండవచ్చు. ఉదాహరణకు ఒక కార్మికుడు 'మాంగనీస్‌' రసాయన ప్రభావానికి లోనైతే అచ్చం పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాలే కనబడతాయి. సీసం ప్రభావానికి లోనైతే కడుపు నొప్పి వేధిస్తుంది. రోగి పూర్వాపరాలు తెలియకపోతే వీటిని పట్టుకోవటం కష్టం. ఆధునిక ఉద్యోగాలు వీటికి మినహాయింపేం కాదు. 'పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి' అన్నట్టు ఏసీ రూముల్లో రోజంతా కూర్చుని పనిచేసే వారికీ వ్యాధుల ముప్పు తక్కువేం కాదు. ఇలా ఎన్నో వృత్తులు. మారుతున్న ప్రవృత్తులు. మారుతున్న జీవనసరళి..ఇవన్నీ వృత్తుల పట్ల, వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని మరింత పెంచుతున్నాయి. అందుకే వృత్తివైద్యం ఇప్పుడు మరింత అవసరంగా మారింది!.

వృత్తివృత్తికో వ్యాధి!
వెల్డింగ్‌ పనివారు: వెల్డింగ్‌ చేసే సమయంలో వెలువడే పొగలతో ఒక సమస్య. పని చేస్తున్న లోహాన్ని బట్టి కూడా సమస్యలుంటాయి. ఇనుము మీద పనిచేసినప్పుడు ఆ ఇనుప రజను, మాంగనీస్‌ వంటివి; అలాగే మిశ్రమ లోహాలపై పనిచేసినప్పుడు నికిల్‌, క్రోమియం వంటి రేణువులు లోపలికి వెళ్లి పలురకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వెల్డింగ్‌ సమయంలో పుట్టే వేడి మరో సమస్య. ఇక మిరుమిట్లు గొల్పే వెల్డింగ్‌ కాంతి నుంచి కళ్లకు సరైన రక్షణ అద్దాలు ధరించకపోతే- ఆ కాంతిలోని పరారుణ (ఇన్‌ఫ్రారెడ్‌) కిరణాలు కంటికి సోకుతాయి. ఇలా కొన్నేళ్ల పాటు జరిగే సరికి వీరికి చాలా త్వరగా కంట్లో శుక్లాలు (ఆక్యుపేషనల్‌ క్యాటరాక్ట్‌) వస్తాయి. అలాగే ఆ కాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయొలెట్‌) కిరణాలు సోకితే ఉన్నట్టుండి కళ్లు ఎర్రబడటం, నీరు కారటం వంటి సమస్యలు వస్తాయి. ఇలా రెండు మూడు రోజులైనా వేధిస్తాయి. దీన్నే 'వెల్డర్స్‌ ఐ' అంటారు. రక్షణ అద్దాలు పెట్టుకోకుండా ఒక్కసారి చూసినా కూడా ఈ సమస్య రావచ్చు. ఇది వెల్డింగ్‌ పని వల్ల వస్తుందని తెలియకపోతే ఏదోనని పొరబడే ప్రమాదం ఉంది. ఇక చేతి గాజుల తయారీ కార్మికుల్లో, గాజు పనివారిలోనూ శుక్లాలు రావొచ్చు. వాళ్లూ కళ్లకు రక్షణగా గాగుల్స్‌ పెట్టుకోవాలి. వీరంతా క్రమం తప్పకుండా కంటిపరీక్ష చేయించుకోవాలి.

* ఉప్పు కార్మికులు: రోజంతా సముద్రం ఒడ్డున ఉప్పు పంటలో.. తెల్లటి వెలుతురులో గడిపే ఉప్పు పనివారిలో చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. వీటికి తోడు వీరిలో అధిక రక్తపోటు, మూత్రంలో సోడియం పోవటం, సీరమ్‌ పీహెచ్‌ పెరగటం వంటివీ ఎక్కువని అధ్యయనాల్లో గుర్తించారు. తెల్లటి ఉప్పు మళ్ల మధ్య ఎండ కాంతి ఎక్కువగా ఉండటం కారణంగా వీరిలో కంటి సమస్యలూ వస్తున్నాయని గుర్తించారు.
.
కంప్యూటర్‌ ఉద్యోగులు: టెలీ కమ్యూనికేషన్స్‌, కాల్‌సెంటర్లు, బ్యాంకు ఉద్యోగుల వంటివారు కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చునే పని చేస్తుంటారు. దీనివల్ల వీరిలో మెడ, నడుము నొప్పుల వంటి శారీరక సమస్యల నుంచి మధుమేహం, వూబకాయం వంటి రుగ్మతల వరకూ ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరాకృతికి సహకరించే కుర్చీలు టేబుళ్లు (ఎర్గానమిక్స్‌) లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి తదితరాల వల్ల ఒళ్లు, మెడ, నడుము నొప్పుల బాధలు ఎక్కువ. నిద్రలేమి కారణంగా షిఫ్టు ఉద్యోగులను జీర్ణ వ్యాధుల నుంచి మానసిక కుంగుబాటు వరకూ ఎన్నో బాధలు వేధిస్తున్నాయి. వృత్తిపరమైన ఈ సమస్యలపై అవగాహన పెంచుకుని, సమర్థంగా ఎదుర్కొనటం ఒక్కటే దీనికి పరిష్కారం.
.
పోలీసులు, గార్డులు: ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఎండలో ఎక్కువసేపు నిలబడటం, వాహనాల రణగొణధ్వనుల మధ్య గడపటం వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. గాలిలో సీసం, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ వంటివి ఎక్కువుండటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వీరిలో మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువ. నిరంతరం నిలబడే ఉండాల్సి రావటం వల్ల కాళ్లలో రక్తనాళాల సమస్యలు, ముఖ్యంగా 'వెరికోస్‌ వెయిన్స్‌' వంటివి వేధిస్తుంటాయి. ఈ కాళ్ల రక్తనాళాల సమస్య పోలీసులు, గార్డులు, రిక్షా కార్మికుల్లో, దర్జీల్లో కూడా ఎక్కువ.
.
క్వారీ ఉద్యోగులు: రాళ్లు పగలగొట్టేవారు, పలక రాయి తీసేవారు, బలపాల తయారీ ఉద్యోగులు.. వీరంతా ఇసుక, రాళ్లలో ఉండే సిలికాన్‌ డైఆక్సైడ్‌ వంటివి దీర్ఘకాలం పీల్చటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు (సిలికోసిస్‌), ధూళి సంబంధ వ్యాధుల బారినపడుతుంటారు.
.
పెట్రోలు బంకు ఉద్యోగులు: రోజంతా పెట్రోలు వాతావరణంలో, ఆ గాలిలో గడిపే వారిలో బెంజీన్‌, టొలీన్‌ వంటి రసాయనాల ప్రభావంతో ఎప్పుడూ మగతగా ఉండటం తరచూ ఎదురయ్యే సమస్య. కండరాల బలహీనత, మొద్దుబారినట్టుండటం వంటివీ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా నిదానంగా తలెత్తే సమస్యలు. వీరిలో కళ్ల మంట, కళ్ల నుంచి నీరు, దగ్గు, తలనొప్పి, డస్సిపోవటం, గొంతులో నస, దురద వంటి ఇబ్బందులు తరచుగా కనిపిస్తాయి. చర్మం పాలిపోవటం, రక్తహీనత కూడా బాధిస్తున్నాయి. అందుకే ఇటువంటి సమస్యలు కనబడినప్పుడు బంకులో పనిచేస్తున్న విషయాన్ని కూడా వైద్యుల దృష్టికి తీసకువెళ్లటం అవసరం.
.
క్రోమియం, ప్లేటింగ్‌ కార్మికులు:తోళ్లను శుద్ధి చేయటానికి ఉపయోగించే క్రోమియం ప్రభావం వల్ల ఆ పరిశ్రమ ఉద్యోగులకు ముక్కు దూలానికి రంధ్రాలు పడుతుంటాయి. ఈ క్రోమ్‌ పడని వారికి చర్మం మీద అలర్జీ వస్తుంది. క్రోమియం, క్యాడ్మియం వంటి వాటివల్ల మూత్రనాళాలు దెబ్బతినటం, శరీరంలోని కణజాలం తీవ్రమైన ఒత్తిడికి గురికావటం (ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌) వంటివీ ఎక్కువ.
.
హమాలీ కూలీలు: ఆహార ధాన్యాలను నిల్వచేసే ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, హమాలీలకు కీళ్లనొప్పులు, వెన్నునొప్పి రావొచ్చు. అలాగే ధాన్యం బస్తాల్లోని ధూళి వల్ల ఉబ్బసం తరహా (ఆక్యుపేషనల్‌ ఆస్థమా) సమస్యలకు దారి తీయొచ్చు.
.
డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది: రోగుల మధ్య గడుపుతూ నిరంతరం సూదులు, కత్తెరల వంటివి వాడుతుండటం వల్ల డాక్టర్లు, నర్సులు, దంతవైద్యులు, ల్యాబొరేటరీ సిబ్బంది వంటివారికి తరచూ గాయాలు కావటంతో పాటు వాటి ద్వారా హెపటైటిస్‌-బి, సి, హెచ్‌ఐవీ వంటివి సోకే ప్రమాదం ఎక్కువ. ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తుమందు వాయువుల ప్రభావం, శరీర భంగిమలతో వచ్చే నడుం నొప్పి కూడా బాధిస్తాయి. ముఖ్యంగా దంతవైద్యులకు అమాల్గమ్‌ల వల్ల శరీరంలోకి పాదరసం చేరటం, ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.

* గాయకులు, టీచర్లు: నిరంతరం గొంతును ఎక్కువగా ఒత్తిడికి గురిచేయటం వల్ల స్వర సమస్యలు, ముఖ్యంగా స్వర పేటిక మీద బుడిపెలు (సింగర్స్‌ నాడ్యూల్స్‌) వంటివి తలెత్తుతుంటాయి. ఇవి మతబోధకుల్లోనూ కనిపిస్తాయి.

* స్వర్ణకారులు: వెండి, ఫిలిగ్రా వంటివాటితో ఆభరణాలు చేసే వారికి లెడ్‌, క్యాడ్మియం వంటివి శరీరంలోకి పోయి రకరకాల వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.

* వ్యవసాయ కూలీలు: క్రిమిసంహారకాల అవశేషాల ప్రభావం, పేగుల్లో కొంకి పురుగులు చేరటం, రకరకాల గాయాల వంటివి ఎక్కువ. పొగాకు పొలంలో పనిచేసేవారిలో- వాన, మంచుల కారణంగా తడిగా ఉన్న పొగాకు నుంచి నికోటిన్‌ చర్మం ద్వారా ఎక్కువగా శరీరంలో ప్రవేశించి.. 'గ్రీన్‌ టొబాకో సిక్‌నెస్‌' అనే సమస్య బారినపడతారు. దీనివల్ల వికారం, తలనొప్పి, తీవ్రమైన బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి.

* ఇళ్లలో పనివారు: ఇళ్లలో పనివారు నిరంతరం తడిలో తిరగటం, పనులు చెయ్యటం వల్ల చేతులు, కాళ్లకు ముఖ్యంగా వేళ్ల మధ్య ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.

* బ్యూటీషియన్లు: అందాన్ని పెంపొందించే బ్యూటీషియన్లు, రోజంతా సెలూన్లలో పనిచేసే వారికి అలర్జీల బెడద ఎక్కువ.
.
రసాయనముల వలన --
*సీసం: మోటారు కారు బ్యాటరీల తయారీ, మన పింగాణీ వస్తువులపై ఉపరితలం మీద పాలిషింగ్‌కు 'లెడ్‌ గ్లేజింగ్‌' పని చేసేవారిలో, సీసం గనుల్లో పని చేసే వారిలో- సీసం సూక్ష్మమైన ధూళి రూపంలో శరీరంలోకి వెళ్తుంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఉండే సీసం చర్మం ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. సీసం దుష్ప్రభావాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కడుపు నొప్పి (లెడ్‌ కాలిక్‌). చాలామంది దీన్ని గుర్తించక అదేదో కడుపు నొప్పి అనుకుని బాధలు పడుతుంటారు. వైద్యులు కూడా దీనిపై దృష్టిపెట్టే అవకాశాలు తక్కువ. వీరిలో రక్తహీనత కూడా ఉండొచ్చు. వీరికి- రక్తంలో సీసం ఏ స్థాయిలో ఉందన్నది చూడటం, జింక్‌ ప్రోటోపార్ఫరిన్‌, మూత్రంలో సీసం, డెల్టా అమినోలెవలియానిక్‌ యాసిడ్‌ వంటి పరీక్షలు చేసి దాని మోతాదును గుర్తిస్తారు. సమస్యకు మూలం సీసమని గుర్తిస్తే- దీనికి చక్కటి చికిత్స ఉంది. అందుకే వీరు వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని చెప్పటం అవసరం.
*బ్యాటరీ తయారీ పరిశ్రమల్లో పనిచేసేవారు, పింగాణీ పనివారు, రసాయన ఫ్యాక్టరీల్లో పనిచేసేవారిలో ఈ సమస్యలు ఎక్కువ.
* దుమ్మూ ధూళి: ఉపరితల గనులు, భూగర్భ గనులు, తాపీ పనివారు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక రాళ్ల పనివారు, కంపెనీల్లో భారీ ఫర్నేస్‌ల కోసం రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ తయారుచేసేవారు.. వీరందరికీ దుమ్మూధూళి సంబంధ సమస్యలు ఎక్కువ. ధూళిలో కూడా రెండు రకాలున్నాయి. మామూలు పొడి ధూళి వల్ల బ్రాంకైటిస్‌, ముక్కు కారటం వంటి సమస్యలు వస్తాయి. వీరిలో చాలామందికి ఆస్థమా లక్షణాలు (ఆక్యుపేషనల్‌ ఆస్థమా) తలెత్తచ్చు. ఇక 7 మైక్రాన్ల కన్నా సూక్ష్మపరిమాణంలో ఉండే ధూళి రేణువులైతే వూపిరితిత్తుల్లోనే ఉండిపోతాయి.. వీటినే న్యూమోకోనియోసిస్‌ అంటారు. ధూళి పదార్థాలను బట్టి సిలికోసిస్‌, యాంత్రొకోసిస్‌, సెడరోసిస్‌ వంటి రకరకాల వూపిరితిత్తుల సమస్యలు వేధిస్తాయి. వీటితో వూపిరితిత్తుల క్షయ (సిలికో- ట్యూబర్‌క్యులోసిస్‌) కూడా రావచ్చు. కాబట్టి వూపిరితిత్తుల సమస్యలు వస్తే ఇటువంటి వృత్తి నేపథ్యమేదైనా ఉందా? అన్నదీ చూడాల్సి ఉంటుంది. ఈ
వృత్తుల్లో వారికి తరచుగా వూపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు చేయటం ద్వారా సమస్యలను ముందే గుర్తించవచ్చు.
* గని కార్మికులు, క్వారీ పనివాళ్లు, తాపీ పనివారు, ఇటుక తయారీదారులు.. వీరందరికీ ఈ సమస్యలు ఎక్కువ.
* రేడియేషన్‌: ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం ఎక్స్‌రేలను ఉపయోగించటం తెలిసిందే. అలాగే పెద్ద పరిశ్రమల్లో లోహాల నాణ్యత నిర్ధారణ కోసం కూడా ఎక్స్‌రేలను వాడతారు. ఈ టెక్నీషియన్లంతా రేడియో ధార్మికత ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది. వీరందరికీ 'బాబా అటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌' వారు బ్యాడ్జీలు ఇస్తారు. రోజూ పనిలో వాటిని ధరిస్తుండాలి. కొద్దికాలం తర్వాత ఆ బ్యాడ్జిలను పరీక్షకు పంపితే- ఒకవేళ ఎక్కువ మోతాదు 'గామా రేడియేషన్‌' ప్రభావానికి గురవుతుంటే దానిలో బయటపడుతుంది. అప్పుడు వారిని కొన్నాళ్ల పాటు పనికి దూరంగా ఉంచుతారు. రేడియేషన్‌కు గురైతే రక్తనాళాలు, ఎముక మూలుగ ప్రభావితమై రకరకాల తీవ్రమైన సమస్యలు చుట్టుముడతాయి.
*ఆసుపత్రుల్లోని ఎక్స్‌-రే టెక్నీషియన్లలో, భారీ పరిశ్రమల్లో లోహాల నాణ్యత నిర్ధారణ కోసం ఎక్స్‌-రేలు వాడే వారిలో ఈ సమస్యలు ఎక్కువ.
* విపరీతమైన వేడి: ఇందులో పొడి వేడి, ఆవిరితో కూడిన తడి వేడి అని రెండు రకాలు. బట్టల మిల్లుల్లో తడివేడి చాలా ఎక్కువ. వేడి పెరిగినపుడు చెమట ఎక్కువ పడుతుంది. కాబట్టి వేడితో పాటు గాలి వేగం, గాలిలో తేమ ఎలా ఉన్నాయన్నదీ కీలకమే. దీని కారణంగానే బట్టల మిల్లు పనివారిలో- కాలి పిక్కల నొప్పి (క్రాంప్స్‌), కాలి కండరాల బలహీనత వంటివి ఎక్కువ. తలనొప్పి, వికారం, వడదెబ్బలాంటి సమస్యలూ ఎక్కువ. అందుకే వేడి ప్రాంతాల్లో పనిచేసేవారికి మధ్యమధ్యలో ఎక్కువ విరామం ఇస్తుంటారు. వీరి ఒంట్లో నీరు తగ్గకుండా (డీహైడ్రేషన్‌ రాకుండా) ఉప్పు-పంచదార వంటివి కలిపిన నీరు ఎక్కువగా ఇస్తుంటారు. చుట్టుపక్కల నీటి నిల్వలూ ఉంచుతారు.
*భారీ కొలిమిలు ఉండే ఇనుము తయారీ, టెక్స్‌టైల్‌, గాజు తయారీ వంటి పరిశ్రమల్లో పనివారికి ఈ సమస్యలు ఎక్కువ.
* శబ్దాలు: శబ్దాలను ఎక్కువగా వినాల్సి రావటం వల్ల చాలా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులకు వినికిడి లోపాలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీరిలో పౌనఃపున్యం అధికంగా ఉన్న ధ్వనులు (హైఫ్రీక్వెన్సీ) వినపడటం మందగిస్తుంది. కాబట్టి వీరంతా తప్పనిసరిగా తరచుగా వినికిడి పరీక్ష (ఆడియోమెట్రీ) చేయించుకుంటూ ఉండాలి. చెవిలో ప్లగ్స్‌, ఇయర్‌ మఫ్స్‌ వంటివి తప్పనిసరిగా ధరించాలి.
*కంప్రెషన్‌ హౌజ్‌లు, జనరేటర్‌ హౌజ్‌లు, విద్యుత్తు ప్లాంట్లు, భారీ పరిశ్రమల ఉద్యోగులకు ఈ శబ్దాల, వినికిడి సమస్య ఎక్కువ.
.
వృత్తి వెంటే వ్యాధి
* ఆస్థమా: ఈ రకం ఉబ్బసం చాలా రకాల వృత్తుల్లో వారికి రావచ్చు. ముఖ్యంగా రబ్బరు ఫోమ్‌ బెడ్‌ల తయారీలో ఉపయోగించే ఐసోసైనైడ్‌ రకం రసాయనాల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది.

కార్బరండం గ్రైండింగ్‌ వీల్స్‌ మీద పని చేసే వారికి కూడా ఆ ధూళి వల్ల ఈ రకం ఉబ్బసం రావొచ్చు. ధాన్యం బస్తాలు మోసే వారిలో కూడా ఇది ఎక్కువ. అలర్జీలూ ఎక్కువే.
* క్యాన్సర్‌: పెయింట్ల తదితరాల్లో ఉపయోగించే బెంజీన్‌ డెరివేటివ్స్‌ వంటివి వాడే పరిశ్రమల్లో వారిలో మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. రసాయన పరిశ్రమల్లో క్యాన్సర్లు అధికంగా వస్తుంటాయి.
.
మీరేం చేస్తుంటారు?
ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు బాధల గురించీ, వంశంలో వ్యాధుల చరిత్ర గురించీ.. వైద్యులు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటారు. కానీ వీటితో పాటు 'మీ వృత్తి ఏమిటి? రోజూ ఏం చేస్తుంటారు?' అన్న ప్రశ్న వెయ్యటం కూడా చాలా అవసరమని.. చేసే వృత్తుల వల్ల కూడా కొన్నికొన్ని రకాల వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని బలంగా నొక్కి చెప్పిన మహానుభావుడు ఇటలీకి చెందిన బెర్నార్డినో రమజ్జిని. 17వ శతాబ్దానికి చెందిన ఆయనే 'ఆక్యుపేషనల్‌ మెడిసిన్‌' అనే ప్రత్యేక విభాగానికి పునాది వేశాడు. అందుకే వైద్యరంగం నేటికీ ఆయనను 'వృత్తి వైద్య పితామహుడి'గా గుండెల్లో పెట్టుకుంది.

డా. ఎ.ప్రభాకరరావు--ఆక్యుపేషనల్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌, విశాఖపట్టణం.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/