ఉపయోగాలు
* మన శరీరంలో చాలా రోగాలు ఎక్స్‌రేల ద్వారా కనిపెట్టవచ్చు. మనం ఎక్కువగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, ఎముకలు, జీర్ణకోశ వ్యాధులలో ఎక్స్‌రేలను వాడుతున్నాం.
* దాదాపు 20-25 సంవత్సరాల క్రిందట నుండి ఎక్స్‌రేల సహాయంతో స్కానింగ్ అనే చర్యను జరుపుతున్నాము. స్కానింగ్‌వల్ల శరీరంలోని ఏ భాగాన్నయినా చూడవచ్చు.
* వైద్యరంగంలోనేగాక స్ఫటికాల పరిశోధనలలో కూడా ఎక్స్‌రేలను ఉపయోగించవచ్చు.
*విమానాశ్రయాలలో, నావికా కేంద్రాలలో కస్టమ్స్ అధికారులు యాత్రికుల సామానులలో ఉండే వస్తువులను ఎక్స్‌రేల సహాయంతో కనిపెట్టుతున్నారు.
*ఎక్స్‌రేల ద్వారా వేలిముద్రలు గుర్తించి, నేరస్థుల ఆచూకి తెలుసుకొంటారు.
* కేన్సరు వ్యాధి తొలిదశలో గుర్తించుటకు, కేన్సరు వ్యాధికి వైద్యం చేయుటలో ఎక్స్‌రేల ఉపయోగం ఉంది.
ఎక్స్‌రేలు - ప్రమాదాలు
* కేన్సరును గుర్తించే ఎక్స్‌రేలు, కేన్సరుకు వైద్యం చేసే ఎక్స్‌రేలు కేన్సరు వ్యాధే కలిగించవచ్చు.
* ఎక్స్‌రేలవల్ల కంటి శుక్లం, పిల్లలు కలగకపోవుట, పుట్టకతో అంగవైకల్యం రావచ్చు.
* ఎక్స్‌రే విభాగాలలో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు, శాస్తవ్రేత్తలకు ఎక్స్‌రేల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు.
రోగులపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు
* ఏ రోగికైనా ఎక్స్‌రేలు ఉపయోగించకుండా రోగాన్ని నిర్ణయించగలిగినపుడు ఎక్స్‌రేలు తీయరాదు.
* గర్భవతులకు ఎక్స్‌రే తీయుట చాలావరకు మానాలి.
* మర్మాంగాలపై ఎక్స్‌రేలు పడకుండా వీలున్నంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. క్రీ.శ.1895 ప్రాంతంలో ఎక్స్‌రేలు కనిపెట్టినపుడు ప్రమాదాల గురించి తెలియక ఎక్స్‌రేలను బాగా వాడారట! ఈమధ్యకాలంలో వైద్యరంగంలో వచ్చిన వ్యాపార దృష్టి రోగులలో ఎక్కువగా ఎక్స్‌రేల పిచ్చి, ఎక్స్‌రేల అనవసరపు వాడకానికి కారణమట!
- ===============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.