ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Rhinoplasti Awareness- రైనోప్లాస్టి అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ముక్కు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. వాసన చూడ్డానికే కాకుండా ముఖానికి అందాన్నివ్వడంలో కూడా ముక్కుకి చాలా ప్రాధాన్యత ఉంది.కావ్య నాయికలకి ముక్కు కోటేరేసినట్లు ఉంటుంది. ముక్కు షేపు బాగా లేకపోతే దేవుడ్ని తిడుతూ కూర్చోనే రోజులు కావు ఇప్పుడు. కాస్మెటిక్ సర్జన్ దగ్గరకు వెళితే కావలసిన సైజుకి, షేపుకి మన ముక్కుని మార్చి పారేస్తాడు. రైనోప్లాస్టి అని పిలిచె ఈ ఆపరేషన్‌ని క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే మనదేశంలో సుశ్రుతుడు చేశాడు. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ని ఇంచుమించు అదే పద్దతిలో చేస్తున్నారు.
సినీ తారలు ఎక్కువగా ఈ ఆపరేషన్‌ని చేయించుకుంటారు. శ్రీదేవితో మొదలుపెట్టి కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, కంగన రనౌత్, మినిషా లంబా, కరీనా కపూర్ లాంటి తారలందరూ తమ ముక్కుని కాస్మెటిక్ సర్జన్ తో రైనోప్లాస్టి చేసుకున్నవారే .
తీరైన ముక్కుకు రైనోప్లాస్టి---తీరైన ముక్కుతోనే ముఖారవిందం రెట్టింపవుతుంది. అందంతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి చట్టి ముక్కు ఉన్న వారి మాటేమిటి? ముక్కుఅందాన్ని మెరుగు పరుచుకునే అవకాశమే లేదా? అంటే రైనోప్లాస్టితో ముక్కు సమస్యలను సరిచేసుకోవచ్చని అంటున్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా. వై. వెంకటరమణ.
అందానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఆ మాటకొస్తే అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఉన్నతోద్యాగాలు సాధించడంలోనూ కీలకంగా మారుతోంది.అందుకే కాస్మెటిక్ సర్జరీలకు ప్రాధాన్యం పెరిగింది. ముక్కు ఆకారం సరిగా లేని వారికి, ముక్కు అందం మరింత మెరుగుపడాలని కోరుకునే వారికి రైనోప్లాస్టి సర్జరీ ఒక వరమని చెప్పవచ్చు.
- ముక్కు ఎత్తు తక్కువగా ఉంటే(చట్టిముక్కు)
- కొనభాగం మందంగా ఉంటే..
- వంకరగా పెరుగుతుంటే...
- పెద్దదిగా ఉంటే...
- చర్మం పెరిగితే(రైనోఫైమా)
- ఏ వయసులో సర్జరీ బెటర్
- ఆపరేషన్‌కు తరువాత
- ఆపరేషన్‌కు ముందు కొన్ని రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి ముక్కు ఎక్స్‌రే చేయించుకోవాల్సి ఉంటుంది.
- పూర్తి మత్తులో లేదా ముక్కు వరకే మత్తు ఇచ్చి చేసే ఆపరేషన్ ఇది. సర్జరీ, సమస్యను బట్టి ఒక గంట నుంచి రెండున్నర గంటలు సమయం పడుతుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్జికల్ సెంటర్‌లో ఉంటే సరిపోతుంది.
- సర్జరీ తరువాత పూర్తి విశ్రాంతి అవసరంలేదు. మరుసటి రోజు నుంచే సాధారణ పనులు చేసుకోవచ్చు. కేవలం ముక్కుమీద ఒత్తిడి పడకుండా చూసుకుంటేసరిపోతుంది.
- ముక్కు వాపు 48 నుంచి 72 గంటలలో తగ్గిపోతుంది. వారం తరువాత విధులకు హాజరుకావచ్చు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో, అత్యాధునికసదుపాయాలున్న ఆసుపత్రిలో చేయించుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
- రైనోప్లాస్టిపై అపోహలు
శ్వాస, వాసన గుర్తించడంలో తేడా : ఇది కూడా అపోహే. రైనోప్లాస్టి ద్వారా శ్వాస, వాసన గుర్తించడంలో ఎలాంటి తేడా ఉండదు.
ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలి : ఆ అవసరమే ఉండదు. ఇది ఒక్కసారే చేసే సర్జరీ. ఒకవేళ ఏదైనా కారణం చేత మళ్లీ చేయాల్సి వచ్చినా చేయడం సాధ్యమవుతుంది.
- డా. వై. వెంకటరమణ-ప్లాస్టిక్ సర్జన్,కాంటూర్స్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్,ఎస్‌బీహెచ్ పైన, శ్రీనగర్‌కాలనీరోడ్.--హైదరాబాద్, @ swathi
- ======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.