సాధారణంగా ఋతువులు మారుతున్నప్పుడు అంటే ఒక సీజన్ నుండి మరో సీజన్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణం గా సర్దుబాటుకాక, తేలికగా ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశముంటుంది. ఇలా సీజన్ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలా మంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.
-వెైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్‌ఫెక్షన్ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాసమా ర్గాల లోపల ఉండే ‘మ్యూకోసా’ పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.
జాగ్రత్తలు:
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి, చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్, స్వీట్స్ తీసుకోకూడదు. చల్లటి గాలికి వెళ్లే ముందు మాస్క్ ధరించాలి.
ఆల్కహాలు, పొగతాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి.
బ్రీతింగ్, ఎక్సర్‌సైజ్, ప్రాణాయామం, యోగ నిత్యం చేయాలి.
చికిత్స:
వ్యాధి లక్షణాలను, ఉద్రేక, ఉపశమనాలనీ, వ్యక్తి శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, చికిత్స చేసిన పొడిదగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
Antibiotics : Azithromycin 250 mg 6 th hourly for 3-4 days
Decongestents : Tab. cetrazine + paracetamol + phenephrine hel ( sucet plus or Nozee) 1 tab three times / day for 3-4 days ,
cough syrups : sy. codistar Dx or zeet or zedex ... 5 ml three times /day for 3-4 days.
- =========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.