Wednesday, January 9, 2013

Liver Transplantation - కాలేయ మార్పిడి


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Liver Transplantation - కాలేయ మార్పిడి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



జీర్ణ వ్యవస్థ లో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడి వైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయటంలో కీలక పాత్ర పోషించటంతో పాటు.. ప్రోటీన్‌ సంశ్లేషణ, ఔషధ వినియోగం, మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగ పడుతుంది . అందుచేత దీన్ని శరీరంలోని ఒక క్రియా అశ్వంగా చమత్కరిస్తారు. నిరంతరాయంగా పనిచేసే క్రమంలో ఇది వ్యాధి గ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కార ణాల్ని గుర్తించారు. వైరల్‌ఇన్‌ఫెక్షన్‌, మద్యపానం, డ్రగ్సు తీసుకోవటం, క్యాన్సర్‌, పుట్టుకతో వచ్చే లోపాలు వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. సాధారణమైన వ్యాధుల్ని మందులతో నయం చేయవచ్చు. కొన్ని సార్లు మైనర్‌ ఆపరేషన్‌ అవసరం అవుతుంది.
కానీ రోగం ముదిరితే మాత్రం కాలేయం పూర్తిగా పనికి రాని స్థితికి చేరిపోవచ్చు. అటువంటప్పుడే అసలు సమస్య ఏర్పడుతుంది. కనీసం పది శాతం పని చేసినప్పటికీ ఫర్వాలేదు. 30 శాతం పనిచేయగలిగితే కాస్తంత కుదుట పడవచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా మార్చటం ఒక్కటే పరిష్కారం. దీన్నే కాలేయ మార్పిడిగా చెప్పవచ్చు. తుది దశకు చేరిన కాలేయ వ్యాధుల్లో (ఈఎస్‌ఎల్‌డి) ఇది ఒక్కటే అంతిమ పరిష్కారం గా చెప్పవచ్చు. కానీ, ఈ కొత్త కాలేయాన్ని క్రత్రిమంగా తయారుచేయటం సాధ్యం కాదు. రక్తం మాదిరిగానే కాలేయాన్ని కూడా వేరే ఒక వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. అందుచేత కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకొనే వ్యక్తిని గ్రహీత గా వ్యవహరిస్తారు.

కాలేయ మార్పిడిలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి.
మ్రత దాత కాలేయ మార్పిడి (డీసీజెడ్‌ డోనార్‌ లివర్‌ ట్రాన్సు ప్లాంటేషను)
-ఈ విధానాన్ని కాడెవెరిక్‌ కాలేయ మార్పిడి అని కూడా అంటారు . మెదడు పనిచేయటం ఆగిపోయిన వ్యక్తుల్లో కొన్ని సార్లు ఊపిరితిత్తులు, గుండె వంటి అవ యవాలు పనిచేయవచ్చు. సాధారణంగా ఊపిరి ఆగిపోయి, గుండె కొట్టుకోవటం నిలిచిపోతేనే ఒక వ్యక్తి చనిపోయి నట్లుగా చెబుతారు. కొన్ని సందర్భాల్లో అంటే స్ట్రోకు, కపాలంలో తీవ్ర స్రావం, ట్రామా వంటి కారణాల చేత మెదడు నిర్జీవం అయిపోతుంది. దీన్నే బ్రెయిన్‌ డెడ్‌ అని అంటారు. తర్వాత 48 లేక 72 గంటల్లో మిగిలిన అవయవాలు కూడా స్తంభించి పోతాయన్న మాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోమా లోకి వెళ్లిపోవటం అంటే అది వేరే సంగతి. స్ప్రహ కోల్పోయినప్పటికీ, వారి మెదడు చక్కగా పనిచేస్తుందన్న మాట.

ఈ రెండు విషయాల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించేందుకు క్లినికల్‌, డయాగ్నస్టిక్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చట్టాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంది. బ్రెయిన్‌ డెడు జరిగినట్లుగా కనీసం ఇద్దరు స్వతంత్ర న్యూరాలజిస్టులు సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటుంది . ఆ తర్వాత సదరు వ్యక్తి కుటుంబానికి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తి.. కాలేయ దానానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేహానికి నిర్ధారిత పరీక్షల్ని అత్యవసర సేవల వార్డులో జరిపించాల్సి ఉంటుంది. ఇతర దే శాల్లో అవయవాల మార్పిడికి సంబంధించిన ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. భారత దేశంలో మాత్రం ఈ విషయంలో లోటు ఉందనే చెప్పుకోవాలి.

హైదరాబాద్‌ లోని మోహను ఫౌండేషను వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చొరవ తీసుకొంటు న్నాయి. తప్పితే పూర్తి స్థాయిలో నిర్దిష్ట విధానం కనిపించటం లేదు. రక్తం, కాలేయ ఉప అంగాలు సక్రమంగా లేని పరిస్థితుల్లో అంటే కాన్సరు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న పరిస్థితులు కాలేయ మార్పిడికి అనుకూలం కాదనే గుర్తుంచుకోవాలి.

సన్నిహితుల నుంచి సేకరించటం (లివింగ్‌ రిలేటడ్‌ లివర్‌ ట్రాన్సుప్లాంటేషన్‌)
ఇటువంటి కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా దగ్గర సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరిస్తారు. తూర్పు దేశాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా గమనించవచ్చు. ఈ ప్రాంతాల్లో సన్నిహితులు చనిపోతే వారి అవయవాల దానానికి కుటుంబసభ్యులు సాధారణంగా అంగీకరించరు. అదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం ప్రధాన మైన అవయవాన్ని దానం చేయటాన్ని గొప్ప గా భావిస్తారు. దీన్ని అంతా ఆదర్శనీయమైన విషయంగా చెబుతారు. కాల క్రమేణా.. ఇటువంటి శస్త్ర చికిత్సలు బాగా మెరుగ్గా జరుగుతున్నాయి.దాతలకు ఎటువంటి అపాయం లేకుండా శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. చాలా తక్కువ సంక్లిష్టత తోనే ఈ శస్త్ర చికిత్సలు ప్రస్తుతం చేయగలుగుతున్నారు. కాలేయాన్ని దానం చేసిన దాతలో కొన్ని నెలల వ్యవధిలోనే.. కాలేయం సాధారణస్థితికి చేరుకోగలుగుతుంది.

కొన్ని వారాల వ్యవధిలోనే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చట్ట ప్రకారం కుటుంబంలోని సన్ని హితుల దగ్గర నుంచి మాత్రమే అంటే రక్త సంబంధీకుల నుంచి మాత్రమే సేకరించాల్సి ఉంటుంది.కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక..అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే .. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో సప్రెస్సివ్‌ మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ ఇమ్యూనోజెనిక్‌ సామర్థ్యం గల అవయవంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువకాలం ఈ మందుల్ని వాడుతున్నా...

-చౌకగానే సాధ్యం అని గుర్తు ఎరగాలి. ఇటువంటి శస్త్ర చికిత్సల్లో తరచుగా వచ్చే సైడ్‌ ఎఫెక్ట గా ఇన్‌ ఫెక్షన్‌ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడి కి ముందే వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆపరేషన్‌ ల విజయవంతం అవుతున్నట్లుగా అర్థం అవుతోంది. అయితే ఇటువంటి రోగులు మాత్రం జీవితాంతం అవసరం అయినప్పుడల్లా వైద్య సాయం తీసుకొంటుండాలి. మొత్తం మీద కాలేయ మార్పిడికి సంబంధించిన అవగాహన సమాజం లో బాగా పెరగాల్సి ఉంది. కాలేయ వ్యాధుల చికిత్సలో అనేక మెడికల్‌, సర్జికల్‌ విధానాలు ఉన్నాయని గుర్తించాలి. వీటిలో కాలేయ మార్పిడి కీలకమైందని తెలుసు కోవాలి.

దీనిపట్ల ఉన్న అపోహలు తొలగించాల్సి ఉంది. మరణం తర్వాత అవయవాలు దానం చేసే కల్చర్‌పెరగాలి. ఇందుకు స్వచ్చం దంగా ముందుకు రావాలి. అదే సమ యంలో సరైన చట్టాలు చేయటం ద్వారా ప్రభుత్వాలు కూడా ఇందుకు అనుమతించాలి. సుదీర్ఘ రోగాల్ని నయం చేసే క్రమంలో అవయవ మార్పిడి అనేది ఒక సమర్థమైన విధానంగా ప్రభుత్వాలు ప్రాచుర్యం లోకి తీసుకొని రావాలి.

హృదయ స్పందన లేని దాతలు
( నాన్‌ హార్టు బీటింగ్‌ డోనార్సు)
పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి (అంటే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలన్నీ నిర్జీవం అయిపోయిన స్థితి) కాలేయాన్ని సేకరించ టం అన్నమాట. ఇటువంటప్పుడు చనిపోయన వెంట నే అంటే దాదాపు 20 నిముషాల్లోపే అవయవాన్ని సేకరించాలి. వెంటనే ఆ అవయవాన్ని భద్రపరచగలగాలి. స్పెయిన్‌వంటి దేశాల్లో మనిషి చనిపోతే, సదరు వ్యక్తి అవయవాలన్నీ జాతీయ సంపద గా మారిపోతాయి. మరణాన్ని వైద్యులు ధ్రవీకరించని వెంటనే ఆపరేషన్‌ థియోటర్‌ కు తరలించి సదరు అవయవాలన్నీ సేకరించటం చక చకా జరిగిపోతాయి. ఇతర దేశాల్లో మాత్రం చట్ట బద్దమైన విధానాల ద్వారా అంటే సాధికారిక వ్యక్తుల సమ్మతి తో మాత్రమే అవయవాల్ని సేకరించే వీలుంటుంది.

--Courtesy with - డా ఆర్‌ వి రాఘవేంద్ర రావు,--M.S., M.Ch., (sgpgi)F.H.P.B., F.L.T.,(snuh)
సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ మరియు లివర్‌ట్రాన్సుప్లాంటు సర్జన్‌--హైదరాబాద్‌ @Surya Telugu daily news paper.

  • ====================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.