Wednesday, January 9, 2013

Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Health awareness in Winter - శీతాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



డిసెంబర్‌నెల చివరిలోనే చలిగాలులు విజృంభిస్తున్నాయి. రాష్టమ్రంతా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అనేక చోట్ల సాయంత్రానికే చలిగాలులు కమ్మేస్తున్నాయి. ఉదయం బారెడు పొద్దెక్కితే తప్ప చలిపులి వదలట్లేదు. ఈ నేపథ్యంలో మహిళలు, ముఖ్యంగా వర్కింగ్‌ ఉమెన్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ‚వర్కింగ్‌ ఉమెన్‌ అంటే తప్పనిసరిగా బయటకు వెళ్లి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందరికీ ఆఫీసు టైమింగ్సు ఒకేలా ఉండవు. ఉదయం 10 గంటలకు వె ళ్లి సాయంత్రానికి తిరగి వచ్చే వెసులుబాటు ఉంటే పరవాలే దు. ఈ టైమింగ్సు లో కూడా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చలికి గురయ్యే అవకాశం ఉంది. అదే షిప్టు వేళల్లో అయితే తప్పనిసరిగా చలిగాలులు వీచేటప్పుడే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో చలి పంజా బారిన పడక తప్పని పరిస్థితి.

మానసిక ఉద్వేగాలతో జాగ్రత్త..!
-శీతాకాలంలో మానసిక ఉద్వేగాలు కొందరిలో ఎక్కువ ప్రభావం చూపు తాయి. వర్కింగ్‌ఉమెన్‌కు ఇంటా బయట ఒత్తిళ్లు వెంటాడుతాయి. వీటిని ఎదుర్కొంటూ పనులు చక్క బెట్టుకోవాలి. మెదడులో ఉండే మెలటోన్‌ రిసెప్ట ర్లు చురుకుదనానికి మూలంగా నిలుస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవాలి. చలి కాలంలో ఇవి నిస్తేజంగా మారిపోతాయి. అటువం టప్పుడు మనుషులు మూడీగా మారిపోతారు. ఈలోగా చలి కారణంగా పనులు చేసుకొనేందుకు కుటుంబ సభ్యులు ఏమాత్రం సహకరించక పోయి నా వాళ్ల మీద విరుచుకు పడే చాన్సు ఉంటుంది. దీన్నే సీజనల్‌ మూడీ డిజార్డర్‌ అని చెబుతారు. సమస్య మూలాల్ని గుర్తించి, దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఈ సమస్య ఊబిలో మరింత కూరుకొని పోయే ప్రమాదం ఉంది. నలుగురిలో కలిసిపోతూ, ఉత్సాహాన్ని తెచ్చి పెట్టుకోవటం ద్వారా ఈ సమస్య ను అధిగమించవచ్చు.

జ్వరాలతో జర భద్రం..!
సీజన్‌మారే సమయంలో వాతావరణం ఒక్క సారిగా మారుతుంటుంది. ఈ మార్పుని శరీరం ఒక్కసారిగా గుర్తించి సర్దుబాటు చేసుకోవటం కాస్త కష్టం. వాతావరణంలో ఒక్కసారిగా చలిగాలులు విజ్రంభిస్తాయి. కేవలం ఈ సమయంలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌ లు చురుగ్గా మారతాయి. చలిగాలిలో తిరుగుతుంటే ఈ సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశిస్తాయి. సాధారణంగా క్రిములు అందరి శరీరంలోకి చేరతాయి. తగినంత రోగ నిరో ధక శక్తి ఉన్నట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. లేని పక్షంలో ఈ క్రిము లు వ్యాధుల్ని కలగచేస్తాయి. ఈ క్రమంలో సూక్ష్మ క్రిములకు వ్యాధి నిరోధక కారకాలకు శరీరం లోపల ఘర్షణ చెలరేగుతుంది. దీని ఫలితంగా జ్వరం, నొప్పులు బయట పడతాయి.

శ్వాసకోశ సమస్యలు..!
చలికాలం అంటేనే శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి కష్ట కాలం. చలిగాలులు తగిలాయంటే లోపల దాగి ఉన్న అనారోగ్య సమస్యలు బయట పడతాయి. చలిగాలిలో ఉండే తేమ.. ముక్కు ద్వారా శ్వాస కోశాల్లోకి ప్రవేశిస్తుంది. ఆయా నాళాల్లోని లోపలి పొరలు ఈ తేమకు ప్రభావితం అవుతాయి. ఫలి తంగా ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది. కొన్ని సార్లు సమస్య వెంటనే, మరికొన్ని సార్లు అర్ధరాత్రి దాటాక సమస్య బయట పడవచ్చు.

ముఖ సౌందర్యానికి ముప్పు..!
చలికాలంలో చర్మానికి సమస్యలు తలెత్తుతాయి. ముఖం, మెడ, చెవులు, చేతులు వంటి భాగాల్లో చర్మం పొడిగా అవుతుంది. పెదవులు పగలటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను నివారించటానికి కోల్డు లోషను వాడటం తప్పనిసరి. నాణ్యత లేని లోషనులను వాడితే బయట దుమ్ము... ఈ క్రీము వలన చర్మానికి అంటుకొని మరింత చేటు తెస్తాయి. శీతాకాలం లో ఏర్పడే సమస్యలు వచ్చాక బాధ పడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. చాలా సమస్యలకు చలిగాలులే కారణం. సాధ్యమై నంత వరకు చలిగాలులు వీచేటప్పుడు బయటకు వెళ్ల కుండా ఉండటం మేలు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాత్రం స్కార్ఫు, స్వెటరులు ధరించాలి. అరచేతులు, అరికాళ్లకు తొడుగులు వేసుకోవాలి. నడక తేలిక పాటి వ్యాయామం తప్పనిసరి అని ఈ పరిశోధనలు నిర్ధారించాయి. తాజా గాలి, వ్యాయామంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నాయి.

ఒత్తిడి నిరోధించటం ముఖ్యం..!
అనారోగ్యానికి ఒతిడికి సంబంధం ఏమిటని చాలా మంది అనుకొంటారు. శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు టెన్షన్లు చుట్టుముట్టినప్పుడు గ్లూకో కార్టికాయిడ్సు వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి వేస్తాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు విజ్రంభించి రొంప, జ్వరం వంటి వ్యాధులు పేట్రేగుతాయి. ఒత్తిళ్లు లేకుండా ప్రశాం తతను పాటిస్తేనే వ్యాధుల్ని నిరోధించవచ్చు.

నిద్ర పరమౌషధం..!
వినటానికి వింతగా ఉన్నా ఇది చాలా వాస్తవం. తగినంత నిద్ర లేని వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజుకి 7-8 గంటల నిద్ర తప్ప నిసరి అని చెబుతారు. రాత్రిళ్లు తరచు మేలుకొనే వారికి నిద్ర లేమి సమస్య ఉంటుంది. చక్కటి నిద్ర తో జీవన క్రియలు సజావుగా జరిగి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. రొంప, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు నిద్ర చాలా అవసరం. నిద్ర ద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి వ్యాధుల్నఇధిగమించటానికి వీలవుతుంది.

Courtesy with :
- చిట్టా రమాదేవి, M.S.,M.Phil.,-- హైదరాబాద్‌.@surya Telugu daily(Dec31, 2012)
  • =========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.