Sunday, January 20, 2013

If bad happence to pancreas...awareness-క్లోమం చెడిపోతే...అవగాహన




  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -If bad happence to pancreas...awareness-క్లోమం చెడిపోతే...అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు .. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విష పదార్థాలు క్లోమ కణజాలంపెై ప్రభావం చూపును దీని వల్ల సజీవ కణజాల శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిలమైన పదార్థాలు రాళ్ల మాదిరిగా ఏర్పడవచ్చును. ఈ రాళ్లు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చును. హెప్టైటిస్‌ బీ, సైటోమెగాలో వెైర్స్‌, హెర్పస్‌ సింప్లెక్స్‌ వంటి వెైర్స్‌ లు.., లెజియోనెల్లా, లెప్టోస్పైరా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు..., ఆస్కారిస్‌, క్రిప్టో స్పోరిడియ్మ్‌ వంటి పరాన్న జీవులు కూడా తోడినప్పుడు ఈ చెడు ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. అంతిమంగా ఈ అనర్థం మరింతగా పెరిగిపోతుంది.

మద్యం తాగే అలవాటు గతం లో అంత ఎక్కువగా ఉండేది కాదు. రాను రాను పరిస్థితి బాగా మారుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా మద్యం తాగేందుకు అలవాటు పడుతున్నారు. మద్యం తాగడం మోడర్న్‌ సొసైటీ లక్షణమని కొందరిలో అపోహ ఉంది. ఒకసారి తాగుడు అలవాటు మొదలెైతే దాన్ని వదులుకోవటం చాలా కష్టం. శరీరంలోని అన్ని భాగాలను మద్యం నాశనం చేస్తుంది. లిక్కర్‌ తాగితే ఆరోగ్యాన్ని పణంగాపెటా ్టల్సిందే. మానవ దేహంలోని ప్రధాన గ్రంధుల్లో ఒకటైన క్లోమం- మద్యంతో చెడిపోయే ప్రమాదం ఉంది. శరీరంలో నాళ గ్రంథిగా, వినాళ గ్రంధిగా సేవలు అందించే క్లోమాన్ని ఆల్కహాల్‌ తీవ్రంగా నాశన చేస్తుంది. క్లోమంలో ఏర్పడే సమస్యల్ని ఎక్యుట్‌ ప్యాంక్రియాటిటిస్‌గా, క్రానిక్‌ ప్యాంక్రియాటిటిస్‌ గా, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ గా చెబుతారు.

శ్రీరంలో క్లోమ గ్రంధికి చాలా ప్రాధాన్యం ఉంది. జీర్ణ వ్యవస్థలో ముఖ్య మైన గ్రంథిగా చెబుతారు. శరీరంలోని జీర్ణాశయం దిగువ భాగంలో దీన్ని గమనించవచ్చు. నాళ గ్రంథి హోదాలో ఇది క్లోమరసాన్ని స్రవి స్తుంది. ఈ క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతా రు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదలయ్యే బెైకార్బనేట్‌ పదార్థాలు... పాక్షికంగా జీర్ణ మైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా క్లోమరసంలోని ఎంజెైమ్‌ ల చెైతన్యానికి దోహద పడతాయి. ఇక క్లోమరసంలోని ఎంజెైమ్‌ లు వాటి పని తీరును పరిశీలి ద్దాం. ఇందులో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజెైమ్‌ చెైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసకృత్తుల పెైన పనిచేసి అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చెైతన్యవంతం అయినప్పుడు మాంసకృత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉప కరిస్తుంది. ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌ ..

పిండి ప్దార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక, కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లెైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజెైమ్‌ గా చెప్పవచ్చు. అంతేగాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని రకాల ప్రధాన పదార్థాల్ని క్లోమరసం సంశ్లేషణ చేస్తుంది. వినాళ గ్రంధి హోదాలో క్లోమం అనేక హార్మోన్‌లను స్రవించును. ఇవి నేరుగా రక్తంలో చేరిపోయి, ఆయా భాగాల మీద ప్రభావం చూపుతుం ది. క్లోమంలోని ద్వీప కణాలు హార్మోన్‌ ల స్రావకానికి మూలంగా నిలుస్తాయి. ఇందులో నాలుగు రకాల హార్మోన్‌ లను గుర్తిస్తారు. ఆల్ఫా కణాలు గ్లూకాన్‌ అనే హార్మోన్‌ ను స్రవిస్తాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని పెంచుతుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ ను స్రవించును. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించును. ఇక డెల్టా కణాలు స్రవించే సొమాటో స్టాటిన్‌ అనే హార్మోన్‌.. పెైన చెప్పిన ఆల్ఫా, బీటా కణాల పనితీరును ప్రభావితం చేయును. గామా కాక ణాలు క్లోమ పెప్టైడ్‌ అనే హార్మోన్‌ ను స్రవించును. క్లోమానికి తలెత్తే సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. వీటిని ప్రధానంగా నాళ గ్రంథి హోదాలో కొన్ని సమస్యల్ని గుర్తించవచ్చు. పాన్‌క్రియాటిటిస్‌ (క్లోమంలో గాయాలు చోటుచేసుకోవటంతో పాటు,

ఎంజెైమ్‌ లు ఆహార పదార్థాలకు బదులుగా క్లోమ కణాల్ని శిథిలం చేస్తాయి), క్లోమ క్యాన్సర్‌ (క్లోమంలో అవాంఛనీయ కణజాలం పేరుకొని పోయి, మిగి లిన సజీవ కణజాలాన్ని పాడు చేస్తుంది), సిస్టిక్‌ ఫెైబ్రోసిస్‌ ( అనవసరపు మ్యూకస్‌నిలిచిపోయి క్లోమరసం స్రావానికి అడ్డు తలుగును) అనే ప్రధాన సమస్యలుగా గుర్తిస్తారు. వినాళ గ్రంథి హోదాల్లో తలెత్తే ప్రధాన సమస్య అయిన మధుమేహ వ్యాధి కి మూలం క్లోమ గ్రంథియే. దీని వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ నిల్వల్లో తేడాలు తలెత్తి అనేక శరీర భాగాలకు అందాల్సిన శక్తి అందకుండా పోతుంది. ఫలితంగా దీర్ఘకాలికంగా నిస్సత్తువతో బతకాల్సి ఉంటుంది.
ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్నప్పుడు .. ఆల్కహాల్‌ నుంచి తయారయ్యే విషపదార్థాలు క్లోమ కణజాలంపెై ప్రభావం చూపును దీని వల్ల సజీవ కణజాల శిథిలం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ శిథిలమైన పదార్థాలు రాళ్ల మాదిరిగా ఏర్పడవచ్చును. ఈ రాళ్లు క్లోమంలో కానీ, క్లోమ నాళంలో కానీ ఏర్పడవచ్చును. హెప్టైటిస్‌ బీ, సైటోమెగాలో వెైర్స్‌, హెర్పస్‌ సింప్లెక్స్‌ వంటి వెైర్స్‌ లు.., లెజియోనెల్లా, లెప్టోస్పైరా, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు..., ఆస్కారిస్‌, క్రిప్టో స్పోరిడియ్మ్‌ వంటి పరాన్న జీవులు కూడా తోడినప్పుడు ఈ చెడు ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. అంతిమంగా ఈ అనర్థం మరింతగా పెరిగిపోతుంది.

పాన్‌ క్రియాటిటిస్‌ లక్షణాల్ని తీవ్ర మైన కడుపునొప్పితో గుర్తించవచ్చు ను. వాంతులు కూడా ఉంటాయి. అంతర్గతంగా స్రావం ఉండటం మరో లక్షణం. రక్తపోటును కూడా గుర్తించవచ్చు. కడుపు నొప్పి ఒక ప్రాంతంనుంచి వేరొక ప్రాంతానికి వ్యాపిస్తూ ఉంటుంది. జ్వరంతో కూడిన వాంతులు ముఖ్య సూచిక. కామెర్లు కూడా గమనించదగిన లక్షణం. శ్వాసలో ఇబ్బందుల్ని గుర్తించవచ్చు. విరోచనంలో నూనె చుక్కలు కనిపిస్తాయి. ఇది ప్రధాన మైన సంకేతం. ఎందుకంటే ఆహారంలో నూనెల్ని సంశ్లేష్ణ చేసే లెైపేజ్‌ ఎంజెైమ్‌ ప్రధానంగా క్లోమం నుంచే స్రావితం అవుతుంది. క్లోమం చెడిపోయినప్పుడు ఈ ఎంజెైమ్‌ పనితీరు దెబ్బతింటుంది. దీంతో నూనెలు జీర్ణ క్రియకు నోచుకోకుండా నేరుగా ఆమ్లం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుచేత విరోచనం లో నూనె వంటి జిగురు కనిపిస్తుంది. దీన్ని బట్ట్టి తేలిగ్గా పాన్‌క్రియా టిటిస్‌ను గుర్తు పట్ట వచ్చు.

ఈ సమస్యతో తలెత్తే అనర్థాల్ని రెండు రకాలుగా గర్తించవచ్చు. క్లోమ రసం సరిగా స్రవించకపోవటంతో ఎంజెైమ్‌ ల వినియోగం తగ్గిపోతుం ది. అమైలేజ్‌, ట్రిప్సిన్‌, లెైపేజ్‌ వంటి ఎంజెైమ్‌ లు తగినంతగా అందు బాటులో లేకపోవటంతో జీర్ణక్రియ మందగించిపోతుంది. సరిగ్గా జీర్ణం జరగక పోవటంతో ప్రధాన పదార్థాల సంశ్లేష్ణ నిలిచిపోతుంది. అటు, హార్మోన్‌ ల స్రావం కూడా తగ్గిపోతుంది. ఇన్సులిన్‌, గ్లూకాగాన్‌ వంటి హార్మోన్‌ ల స్రావం లేకపోవటంతో రక్తంలో గ్లూకోజ్‌ మట్టం సక్రమంగా ఉండదు. ఇన్ని అనర్థాలకు మూలం క్లోమంలో సమస్య ఏర్పడటమే.పాన్‌క్రియాటిటిస్‌ను సాధారణ కడుపునొప్పి, విరోచనంలో నూనె జిగు రుతో గుర్తించవచ్చు. కడుపునొప్పి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాం తానికి మారుతుండటాన్ని గుర్తించవచ్చు. ఎమైలేజ్‌, లెైపేజ్‌ శాతం 4-5 రెట్లు పెరిగిపోతుంది. అల్ట్రా సౌండ్‌ పరీక్షలతో సాధారణంగా గుర్తిస్తా రు. గ్యాల్‌ స్టోన్‌, ఫాటీ లివ్‌ లను పరిశీలించవచ్చు. వీటితో పాన్‌ క్రియాటిటిస్‌ ఆచూకీ బటయపడుతుంది. సీటీ స్కాన్‌, ఎమ్‌ ఆర్‌ ఐ పరీక్షలతో సరెైన నిర్ధారణ లభించును.

ఎక్యుట్‌ పాన్‌క్రియాటిటిస్‌ దశలోనే వ్యాధిని గుర్తించటం మంచిది. సరెైన మందులు వాడితే అక్కడితో పరిష్కారాన్ని సాధించవచ్చు. రోగం ముదిరితే మాత్రం చికిత్స కష్టం అవుతుంది. రాళ్లు ఏర్పడినప్పుడు వాటిని మందులతో కరిగించేందుకు ప్రయత్నిస్తారు. లేనిపక్షంలో వాటిని తొలగించడమే ఉత్తమ మార్గం అనుకోవచ్చు. ఈ ఆర్‌ సీ పీ వంటి విధానాల్ని అవలంభించటం చూస్తుంటాం. ఎండోస్కోపీ విధానాలు పని చేయక పోతే సంక్లిష్టమైన చికిత్స అవసరం అవుతుంది.క్లోమ క్యాన్సర్‌ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ సాయంతో ఈ క్యాన్సర్‌ కు చికిత్స చేయవచ్చును. వ్యాధిని ప్రారంభ దశలో గర్తించటం చాలా ముఖ్యం. కీమో థెరపీ, రేడియో థెరపీ, శస్తచ్రికిత్స లతో సమన్వయంగా చికిత్స చేస్తేనే ఫలితాలు కనిపిస్తాయి. అన్ని పరిస్థితుల్లోనూ మద్యం తాగడం మానివేస్తేనే చికిత్స ఫలితాలు ఇవ్వవచ్చును. నిపుణులెైన వెైద్యుల్ని సంప్రదిస్తే సమర్థమైన చికిత్స అందించటం సాధ్యం అవుతుంది. లేని పక్షంలో పాన్‌ క్రియాటిటిస్‌ ముదిరిపోయి డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తవచ్చును. రోగం తీవ్రం అయిపోతే రోగి మరణానికి కూడా దారి తీయవచ్చు. ఏది ఏమైనా చికిత్స కన్నా నివారణ ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.

courtesy with : Surya Telugu daily news paper(Nov 26, 2012)

  • -=========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.