Wednesday, January 9, 2013

piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -piles problem in pregnant - గర్భిణుల్ని బాధించే పైల్స్‌-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పైల్స్‌ సమస్య స్త్రీలల్లో గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భం దాల్చాక ముందు లేని సమస్యలు గర్భం దాల్చిన తరువాత రావటానికి గల కారణం హార్మోనుల ప్రభావం పెరుగుట, గర్భాశయం పరిమాణం పెరగడమే. గర్భిణీల్లో సాధారణంగా ప్రొజెస్టోజెన్‌ హార్మోన్‌ ఎక్కు వగా ఉండి శరీరంలోని రక్తనాళాలు కొద్దిగా వ్యాకో చం చెంది ఉంటాయి. ఇలాగే మల ద్వారం వద్ద ఉన్న రక్త నాళాల పరిమాణం పెరిగి అవి ఉబ్బినట్లు అయి పైల్‌ (మొలలు)కు దారి తీస్తుంది. గర్భిణిల్లో గర్భాశయం పరి మాణం పెరుగుటవలన అంతర్గత వత్తిడి మూలాన మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మల విసర్జనకు బలవంతగా ప్రయత్నం చేయట వలన కూడ పైల్స్‌ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇంతగా బాధించే పైల్స్‌ సమస్యను బయటకు చెప్పకోలేక చాలా మంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఫైల్స్ (హీమరామడ్స్‌)లను సాధారణంగా అర్షమొలలు అంటారు. పైల్‌ అంటె గడ్డ అని హీమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్ధం. మొలలు చూడటానికి పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలం ద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చి నట్లుగా కనిపిస్తాయి.

లక్షణాలు : మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రకతం పడుతూ ఉంటుంది. మలవిసర్జన అనంతరంకూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జ సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

జాగ్రత్తలు:
 పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు)
రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లు చూసుకోవాలి.
ఫాస్ట్‌ ఫైడ్స్‌ వేపుల్లు, మాంసాహరం, చిరుతిళ్ళు  తినటం మానుకోవాలి.
సాత్విక ఆహారం తీసుకోవాలి.

ట్రీట్మెంట్ :

    pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
    Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
    Duolaxin or  Smulax or  gutfree  ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
    Hedensa or pilex  ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి

ఈ సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :

    నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .

    పొడిగా ఉండే ఆహారమే తీసుకుని  పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.

    గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .

ఆహార నియమాలు :

    మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం అన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
 
 కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
    వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.