చాలా మంది పురుషులు , మహిళల్లో కొవ్వు శాతం పెరగడంతో చర్మం ముడతలు పడడం కనిపిస్తుంది. వయసు మీద పడే సరికి మహిళల్లో ఏర్పడే ప్రధాన సమస్య ఇదే. అందుచేత శరీరంలో అవసరానికి మించిన కొవ్వు ఎందుకు పేరుకుంటుందో తెలుసుకొంటే దానిని నివారించుకొని చక్కని ఆరోగ్యాన్ని, తీరైన ఆకౄఎతిని సొంతం చేసుకోవచ్చు.
కొవ్వు సమస్య ఎక్కువుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చర్మం మధ్య పొరలో కొవ్వు కణాలు ఒక్కచోట చేరుతాయి. దాంతో చర్మంలో సొట్టలు పడినట్లు కనిపిస్తుంది. ఇలాంటి సమస్య సాధారణంగా పొట్ట, నడుం కింది భాగం, పిరుదులు వంటి భాగాల్లో ఎక్కువుగా బాధిస్తుంది. పురుషులలో పొట్టభాగములో బెల్లీ గా కొవ్వు పేరుకుపోతుంది. శారీకంగా చోటు చేసుకునే మార్పులే కాదు. ఇతర కారణాలు దీనికి దారితీస్తాయి.
ప్రాధమికంగా తినుబండారాలు మూడు రకాల (కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వు) పదార్ధాలతో ముడిపడివుంటాయి. జంక్‌ఫుడ్ తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరిగి, హృద్రోగ సమస్యలకు దారితీయవచ్చు. జంక్‌ఫుడ్‌లోని షుగర్, కొవ్వు కారణంగా అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తక్కువ స్థాయిలో లభిస్తాయి. ఊబకాయంతో పాటు మధుమేహ సమస్యలకు జంక్‌ఫుడ్ కారణమవుతోంది. ముఖ్యంగా జంక్‌ఫుడ్ తినే చిన్నారులకు- రోగ నిరోధక శక్తి తగ్గడం, ఊబకాయం, నీరసం, వత్తిడులు వంటివి తప్పవు. ముఖ్యంగా పీచుశాతం తక్కువగా, కొవ్వు, పిండి పదార్థాలు ఎక్కువుగా ఉన్న ఆహారం అదే పనిగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు విపరీతంగా పేరుకుంటాయి. ముఖ్యంగా వేపుళ్ళు శుద్ధి చేసిన ఆహారం, హానికర కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
దీనికోసం ముందుగా జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు అంటే తృణధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి. ఏదో ఒక వ్యాయామం రోజూ అరగంటైనా చేయడం మీ జీవనవిధానంలో భాగం కావాలి. వారంలో ఐదు రోజులు రోజూ అరగంటకి తగ్గకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
వీటిని పాటించండి
హెల్తీ డైట్: కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్ కొవ్వు తగ్గిస్తాయి.
నడకతో ఫిట్: వ్యాయామం లేకుండా ఒకే చోట కూర్చుని గంటల కొద్దీ పని చే సేవారిలో కొవ్వుపెరిగే అవకాశం ఎక్కువ. అందుకే రోజు అరగంటపాటు తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
స్మోకింగ్‌కు స్వస్తి: పొగతాగని వారితో పోల్చితే పొగతాగే వారిలో కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు ఉంటుంది. పాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలవాటు లేకపోతే అట్రాక్ట్ కాకండి.
కొలెస్ట్రాల్: టోటల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ పరిమితిని దాటకుండా చూసుకోండి. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులు వాడండి.
హెల్తీ వెయిట్: అధిక బరువు మూలంగా కొ్వ్వు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ అధిక బరువు మూలంగానే వస్తాయి. కాబట్టి లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
కోపాన్ని తగ్గించుకోండి: ఒత్తిడి, కోపం హార్ట్ఎటాక్, స్ట్రోక్‌కు కారణమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతమైన జీవనం గడిపితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు ఉపయోగపడతాయి. జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, మందులు వాడటం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
- =========================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.