Friday, November 1, 2013

Post delivery rest and care, బాలింతరాల విశ్రాంతి-జాగ్రత్తలు ,ప్రసవం తరువాత జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బాలింతరాలు పాటించవలసిన జాగ్రత్తలు -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

ప్రసవం తర్వాత...
దీనిని బాలెంత కాలము లేదా సూతికా కాలము (పోస్టు పార్టం పీరియడ్ ) అంటారు . .
  నార్మల్ డెలివరి తర్వాత రెండు, మూడు గంటల తర్వాత ఆహారాన్ని ఇవ్వాలి. సిజేరియన్ అయితే తల్లి కండిషన్ ను బట్టి లేచి కూర్చోవాలని డాక్టర్లు సూచిస్తారు. వారికి ఒక రోజు తర్వాత ఆహారాన్ని అందిస్తారు. ప్రసవం అయిన తర్వాత మూడు నెలల్లో సుమారు ఒక లీటరు పాలు పడతాయి. ఈ క్రమంలో బిడ్డకు పాలందించాలంటే ఐరన్, కాల్షియం, బి- కాంప్లెక్స్ మాత్రలు అదనంగా తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.దానివల్ల బిడ్డకు పోషకాలు అందుతాయి.
సిజేరియన్ అయిన తర్వాత ఇన్ ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిపి, బ్లీడింగ్ సమస్యలు ఉంటే.. రక్తం గడ్డకట్టకుండా ఉండకుండా సిజేరియన్ (ఆర్టీ అంబ్యులేషన్) అయిన తర్వాత నడిపిస్తారు.

ఆపోహలు....
 ప్రసవం తర్వాత.... మంచినీరు ఇవ్వొద్దు.. ఒక్కపూటే భోజనం.. అన్ని రకాల భోజనం ఇవ్వొద్దు, సరియైన భోజనం ఇవ్వకుండా పత్యం పాటించడం... వీటన్నింటినీ వదిలేసి వైద్యుల పర్యవేక్షణలో సలహాలను తీసుకుంటే ఆరోగ్యం మన చెంతనే ఉంటుంది.

స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21రోజుల నుంచి 42 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింత లేదా బాలెంతగా వ్యవహరిస్తారు. ప్రసవం (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ (Infection) మూలంగా వస్తుంది.


ప్రసవం తర్వాత తల్లి పోషకాహారం తీసుకోవ డం మంచిది. ప్రసవానంతరం తల్లి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తగినన్ని న్యూట్రీషియన్స్‌ ఉం డేటట్లుగా చూసుకోవాలి. ఇవ్వాలి. ఉదా హరణకు నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. అటువంటి అలవాటు జీర్ణక్రియను సులభ తరం చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచు తుంది. శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. దాంతో మలబద్ధక సమస్య కొంత మేరకు పరిష్కార మతుంది. ఏదిఏమై నా వైద్యనిపుణుల సహాయం పొందడం చాలా సమయాల్లో మేలు చేస్తుంది.

ఆహారం-ప్రాధాన్యత :సాదారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచి పోషక విలు వలున్న ఆహారం తీసుకోవాలి.తీసుకునే ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండేలా చూసు కోవాలి. ఎందుకంటే పుట్టే సమయంలో ఎక్కు వ రక్తాన్ని కోల్పోతారు. కాబట్టి ఐరన్‌ పుడ్స్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కావ ల్సిన కాల్షియాన్ని మన శరీరం పొంద గలుతుంది.

విటమిన్స్‌:
1. విటమిన్‌ బి9: పోస్ట్‌ నేటల్‌ విటమిన్‌ను ఫోలిక్‌ ఆసిడ్‌ అనికూడా పిలుస్తారు. ఈ పోల్లెట్‌ (టాబ్లెట్‌) ను గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకూ కూడా తీసుకుంటారు. ఎందుకంటే శిశువు నాడీవ్యవస్థ క్రమంగా ఉండటానికి ఇది చాలా అవసరం. కాబట్టి ఈ విటమిన్‌ సప్లిమెంట్‌ను ప్రసవం అయిత తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగించడం తల్లీ బిడ్డకు ప్రయేజనం.
2.విటమిన్‌ ఎ: ప్రసవం తర్వాత జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. అలాగే పోస్ట్‌ నేటల్‌ సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురిఅవుతుండం వల్ల కూడా జుట్టు అధికం గా రాలిపోతుంటుంది. కాబట్టి ఆరోగ్యకర మైన జుట్టు మరియు చర్మ సంరక్షణకు విటమిన్‌ ఎ ఎంతగానో ఉపయోగపడు తుంది.
3. విటమిన్‌ సి: ప్రసవించిన మహి ళలకు తాజా పండ్లు చాలా ఉపయోగకరం. ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి మరియు ఎసెన్సియల్స్‌ పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
4. విటమిన్‌ డి: ప్రసవానంతరం మహిళలు తిరిగి శక్తిని పొందడానికి, నరాలు, ఎము కలు బలపడటానికి క్యాల్షియం చాలా అవ సరం. ప్రసవం తర్వత మహిళల్లో చాలా వరకూ క్యాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి శరీరానికి కావల్సిన క్యాల్షియం పొందడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. 5. విటమిన్‌ ఇ: విటమిన్‌ ఇ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌ బాలింతలకు చాలా బాగా సహాయపడుతాయి. సెల్‌ డ్యామేజ్‌ను తిరిగి పునరుత్పత్తి చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఎవరెవరు ఎంతవరకు వాడాలన్నది వైద్యులు నిర్ధారించవలసి ఉంటుంది.

వ్యాయమం తప్పనిసరి:

ప్రసవానంతరం శారీరక ఆరోగ్యం కాపాడుకునేందుకు బాలిం తలు వ్యాయమం చెయాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. ఆ జాగ్రత్తలు ఎందుకంటే-

బరువు తగ్గుట:

కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే వ్యాయమం తప్పని సరి. పాలు ఉత్పత్తి:

ఆమెలో పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే తగిన జాగ్రత్తలు అవసరం. వైద్య నిపుణుల సలమా పాటించి, తగిన మందులు, వ్యాయమం పొందడం వల్ల పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

కండరాలు బిగువు:

కాన్పు సమయంలో అమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే వ్యాయమాలు కండరాలు మరోమారు ఫిట్‌నెస్‌ సంతరించుకుంటాయి.


శస్త్రచికిత్స తరువాత నొప్పి ఉంటుందా?----Carserian opetation pain

కొంతవరకు ఉంటుందనే చెప్పాలి. శస్త్రచికిత్స సమయంలో పొట్టపై గాటు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటిలాగా చురుగ్గా ఉండలేరు. పుట్టిన శిశువు పట్ల సరైన శ్రద్ధ వహించడం కష్టమవుతుంది. అందుకే ఆపరేషన్ తరువాత వచ్చే నొప్పిని అదుపులో ఉంచాలి.

నొప్పిని అదుపులో ఉంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నొప్పిని తగ్గించడానికి నోటి ద్వారా లేదా సిరల ద్వారా మందును ఇస్తారు. కడుపునొప్పిని ఎక్కువసేపు భరించే శక్తి లేకుంటే నోటి ద్వారా మందును అందివ్వడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి రీజనల్ మత్తుమందుతో పాటుగా ఆపరేషన్ కి ముందే నొప్పి తగ్గించే మందును కూడా ఇవ్వవచ్చు.
సర్జరీ తరువాత కూడా అనస్తీషియాలజిస్టు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. సిజేరియన్ డెలివరీ కోసం మీరు తీసుకున్న మత్తుమందు రకాన్ని బట్టి కూడా నొప్పి తగ్గించే మందు ఇచ్చే పద్ధతి ఆధారపడి ఉంటుంది. రీజనల్ గా ఇచ్చే మత్తుమందు తీసుకుంటే నొప్పిమందును వెన్నుముక బాహ్యపొర నుంచి ఎపిడ్యురల్ పద్ధతి ద్వారా అందిస్తారు. ఇది సర్జరీ తరువాత కూడా 18 గంటల వరకూ పనిచేస్తుంది. తల తిరగడం, మగతగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపించవు. ఒకవేళ జనరల్ అనస్తెటిక్ తీసుకుంటే సాధారణంగా నొప్పి మందును సిరల ద్వారా ఇస్తారు. ఆపరేషన్ తరువాత మొదటిరోజు మాత్రం నోటి మత్రల ద్వారా నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తారు.

నొప్పి తగ్గించే మందు వల్ల దుష్ప్రభావాలుంటాయా?
సాధారణంగా నొప్పి తగ్గించే మందులు చైతన్యాన్ని హరించే నార్కోటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటివల్ల దురద, వికారంగా ఉండడం, శ్వాస పడిపోవడం, మలబద్దకం లాంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి. కాకపోతే వీటి తీవ్రత చాలా తక్కువ. చాలావరకు వాటికవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోయినా వాటికి తగిన మామూలు మందులు వాడితే సరిపోతుంది. తల్లిపాలలోకి ఈ మందులు చేరుతాయని భయపడాల్సిన అవసరం లేదు. వీటికి బానిసలవుతామన్న భయం అక్కరలేదు. సర్జరీ తరువాత లేచి ఇతర పనులు చేసుకోగలమో లేదోనన్న బెంగ కూడా వద్దు.

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.