Wednesday, November 20, 2013

How far x-ray is needed?,ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎక్ష్-రే ఏమేరకు అవసరము ?

వ్యక్తి ఆరోగ్యము నిర్ధారించడానికి , లేదా వ్యాధిని గుర్తించడానికి  వైద్యులు సంప్రదించే వైద్యుడు రేడియాలజిస్ట్ . ఆధునిక వైద్యము అందించే ప్రతి హాస్పిటల్ నందు రేడియాలజీవైద్యులు కీలక భూమిక నిర్వహిస్తారు . అత్యవసర కేసులలో స్కానింగ్ పరీక్షలు చేయకుండా  వ్యాధి చికిత్సాపద్దతులను అనుసరించడము కత్తిమీద సాములాంటిదే . అవససరమైన స్కానింగ్ పరీక్షలు చేయకుండా , రోగనిర్ధారణ లేకుండా ట్రయల్ -ఎర్రర్ పద్దతిలో వైద్యము చేయడాన్ని న్యాయాస్థానాలు మెడికల్ నెగ్లిజెన్స్ గా పరిగణిస్తాయి. వైద్య శాస్త్రం   అభివృద్ధిచెందిన క్రమాన్ని పరిశీలిస్తే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనల సముదాయం ద్వారానే మనము పురోగమించాము అని గ్రహించవచ్చు . అలాంటి ఒక సంఘంటం 08 నవంబర్  1895 లో జర్మనీలోని వొర్జ్-బర్గ్ అనే నగరములో జరిగింది .

విళెమ్‌ కొనరాడ్ రాంట్జన్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త క్రూక్స్ ట్యాబ్ లో జనియించిన కంటికి కనబడని కాంతిని గుర్తించాడు . ఆల్ జీబ్రా సాంప్రదాయం ప్రకారము అర్ధము గాని ఆ శక్తిని x-ray అని నామకరము చేశారు . అంకితభావము కలిగిన ఆ శాస్త్రవేత్త ఆ కిరణాలను క్షుణ్ణము గా పరిశోధించి , డిశంబరు 28 - 1895 నాడు ప్రపంచానికి వెల్లడి చేశారు. ఈ ఆవిష్కరణ పెనుసంచలనము సృష్టించినది . మొదటి నోబెల్ బహుమతి రాంట్ జెన్‌ ను వరించినది. ఆయన ఎక్ష్-రే కు పేటెంట్ తిరస్కరించి వాటిపై అనేక పరిశోధనలు జరిగేందుకు అవకాశము కల్పించాడు . అట్టి నిశ్వార్ధ శాస్త్రవేత్తకి గుర్తుగా అన్ని రేడియాలజీ సంస్థలు నవంబర్ 08 ను అంతర్జాతీయ రేడియోలజీ దినోత్సవముగా జరుపుకుంటారు.  ఎక్ష్-రే ఆవిష్కరణకు పూర్వము వైద్యుని హస్తం మాత్రమే వ్యాధి నిర్ధారణ పరికరము . ఎక్ష్-రే వైద్యులకు దృష్టిని అందించినది అంటే అతిశయోక్తి కాదు . వ్యాధిగ్రస్తుడి పొట్టకోసి వ్యాధి నిర్ధారణ చేయుట ఎక్ష్-రే ముందు సధారణమైన  వైద్యనిర్ధారణ పద్ధతి.ఎక్ష్-రే కనిపెట్టిన వంద ఏళ్ళ తరువాత , ఇప్పుడు ఆ విధమైన సర్జరీలు అరుదైపోయాయి.

రేడియోలజీ విభాగములో ఎక్ష్-రే , ఫ్లోరోస్కోప్ , ఆల్ట్రాసౌండ్ , డాప్లర్ , మమ్మోగ్రఫీ, సిటి , ఎం.ఆర్.ఐ, PETCT , Cathlab , మొదలైన పరికరాలు వాడుతూ ఉన్నారు. స్థూలముగా ఆవలోకిస్తే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడాన్ని " డయాగ్నోస్టిక్ " రేడియోలజీ అనీ , ఇవే పరికరాలు వాడి చికిత్సచేసే పద్దతిని " ఇంటర్ వెన్సనల్ " రేడియోలజీ అంటారు. ఎక్ష్-రే చాతి, వ్యాధులకు , ఎముకలు , కీళ్ళవ్యాధులకు వినియోగిస్తారు. అత్యంత చవకైన ఈ పరీక్ష ద్వారా అత్యంత విలువైన సమాచారము లభిస్తుంది. అంతేకాక విరిగిన ఎకుకలు అతికించడానికి వాడే "C-arm "  పరికరము కూడా ఎక్ష్-రే కిరణాల ఆధారము గానే పనిచేస్తుంది. ఫ్లోరోస్కోపి అనే పద్దతి ద్వారా అన్నవాహిక , ప్రేగు, గర్భాశయం , మూత్రశయం వ్యాధులను తెలుసుకోవచ్చు. ఆల్ట్రాసౌండ్ ద్వారా పిండము గర్భాశయములోనే వుంది అన్న ప్రాధమిక అంశము , కడుపునొప్పి ,బహిష్టు సమస్యలు , ఆగని విరేచనాలు గురించి , కొన్ని రకాల క్యాన్సర్లు గుర్తించవచ్చును .గుండె వ్యాధులు అర్ధముచేసుకోవడానికి ఎకోడాప్లర్  పరీక్ష నిర్వహిస్తారు .

ప్రతి చిన్న అవయవాన్నీ , రక్తనాళమును , సిటి స్కానింగ్ ద్వారా , ఎం.ఆర్.ఐ. స్కానింగ్ ద్వారా ఏ విధమైన రేడియేషన్‌ ఎఫెక్ట్ లేకుండా అత్యంత సంక్లిష్టమైం మెదడు పనితీరును అంచనావేయవచ్చును. ఎక్ష్-రే లో సైతము కనపడని ఫ్రాక్చర్ లను , ఎం.ఆర్.ఐ. పరికరము ద్వారా గుర్తించవచ్చును . సున్నితమైన , కీళ్ళ లోపల వుండే లిగమెంట్ల గురించి అంచనా వేయవచ్చును . MRS PECTVOSCOPY  పద్దతి ద్వారా మెదడులో ఉండే కెమికల్స్ నిష్పత్తిని విశదీకరించవచ్చును . మెదడులో క్లిప్పులు ఉన్నవారు , పేస్ మేకర్ ఉన్నవారు ఎం.ఆర్.ఐ స్కానింగ్ కు దూరంగా ఉండడము మేలు.

అవయవాల స్థాయినుంచి కణాల స్థాయికి ఇమేజింగ్ ప్రక్రియను (molecular imaging) సాధించిన అత్యంత న్యూతన పరికరము " PECT స్కానర్ . . . అతి చిన్న కణుతులు గుర్తించడానికి , క్యాన్సర్ స్టేజింగ్ లోనూ ఈ పరికరము ప్రముఖ స్థానము ఆక్రమించి ఉన్నది. మమ్మోగ్రఫీ స్కానింగ్ ద్వారా  చేతికి అందని అత్యంత చిన్న కణుతులను గుర్తించవచ్చు. ప్రాధమిక దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే పూర్తి చికిత్స సాధ్యమవుతుంది. 40 ఏళ్ళ పైబడిన స్త్రీలందరు ప్రతి సం. ఈ పరీక్ష చేయించుకోవడము ద్వారా రొమ్ము క్యాన్సర్ గుర్తించి మంచి చికిత్స పొందవచ్చు . కోతలేకుండా చిన్న చిన్న సూదులద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులను నయము చేయవచ్చు. రక్తనాళం ద్వారా సూదిని పంపీంచి చేసే పద్దతిని vascular intervention రేడియోలజీ అంటారు. చర్మము ద్వారాచేసే విధానాన్ని Non - vascular intervention రేడియోలజీ అంటారు . జనబాహుళ్యము లో వున్న యాంజియోప్లాస్టి , స్టెంటింగ్  మొదలైనవి ఈ విభాగము నకు చెందినవే.

స్కానింగ్ సహాయము తో చేసే బయాప్సీలు , వెన్నుపూస ఇంజక్షన్లు , పైత్యరసనాళాలు & మూత్రపిండాల అడ్డంకులను తొలగించవచ్చు . చర్మము ద్వారా సూదుని పంపి కణుతుల్ని నాశనముచేసే పద్దతులు అందుబాటులోకి వచ్చనవి . రేదియేషన్‌ ప్రమాదకరమైనదని ... ఆ తీవ్రతను అతిగా అంచనా వేస్తున్నారు. రేడియేషన్‌ మన జీవితం లో అంతర్భాగమైపోయింది. భూమిలో నుండి , అంతరిక్షములో నుండి రేడియేషన్‌ సదా మనపై ప్రసరిస్తూనే ఉంది. తర్ఫీదు పొందిన రేడియోలజిస్ట్ లు అత్యంత నైపుణ్యము తోనే ఈ పరీక్షలన్ని తక్కువ రేడియేషన్‌ ఉండేటట్లు వాడుతున్నారు.

రేడియోలజీ పరీక్షల వలన ఆడశిశువులను గర్భములో విచ్చిన్నము చేస్తూ ఉన్నారు . ప్రతి మంచి పనికీ కొన్ని చెడు ప్రబావాలు , నష్టాలు ఉంటాయి. మానవులు కొత్త ప్రయోగ పరికాల మంచినే వాడుకోవాలి. చెడు కి దూరముగానే ఉండాలి. 100 సం.లు పైబడే రేడియోలజీ వైద్యశాస్త్రములో ఒక చిన్న భాగము .

 Courtesy with : Dr.varaprasad vemuri and Dr.Srinivas Dandamudi@swati weekly magazine 15-11-2013.

  • =========================

 Visit my website - > Dr.Seshagirirao.com/ 

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.