హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్. ఈ వాక్షిన్ వేయడము వలన పసికందులలో వచ్చే early childhood meningitis ను పూరిగా నివారించవచ్చును.
చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం. ఈ కార్యక్రమ వ్యూహాలు అమలు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిల్లల్లో వచ్చే వ్యాధులను అరికట్టి సత్ఫలితాలు సాధించవచ్చు. అది పిల్లలకు మౌలిక అవసరం కూడా.
హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్... ఇది ఒక కాంజుగేట్ వాక్షిన్. developed for the prevention of invasive disease caused by Haemophilus influenzae type b bacteria. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & ప్రివెన్సన్ (CDC) చిన్నపిల్లకు రొటీన్ టీకాల పట్టీలో సిఫార్స్ చేసినది. అమెరికా లో ఈ వాక్షిన్ వాడడము వలన హిబ్ బాదితులు 40-100 / 100,000 నుండి 1-3 / 100,000 వరకు తగాయని రికార్డ్స్ ద్వారా తెలుస్తూ ఉంది.
హిబ్ వాక్షిన్ వేయవలసిన వయసు వివరాలు :
06 వారాలు -- హిబ్ 1,
10 వారాలు -- హిబ్ 2,
15-18 వారాలు -- హిబ్ బూష్టర్ ,
- హిబ్ చరిత్ర వివరాలు :
దీనిలో అభివృద్ధి దిశగా Multiple combinations of Hib and other vaccines తయారీ వాడుకలోనికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో హిబ్ వాక్షిన్ తో diphtheria-tetanus-pertussis–polio vaccines and Hepatitis B vaccines మిలితం చేసి అమెరికాలో వాడుతూ ఉన్నారు.
హిబ్ -Haemophilus influenzae type b వాక్షిన్ non-type B disease పనిచేయదు (రక్షణ నివ్వ్దు).. ఈ నాన్ బి. ఇన్‌ఫ్లూయంజా చాలా అరుదుగా మానవాళి లో కనబడుతూ ఉంది. . . కావున ప్రమాదమేమీ లేదు .
పసిపిల్లలు పూవులాంటి వారని అంటారు. తేమ కాస్త ఎక్కువైతే పువ్వులు కుళ్లి పోతాయి, కాస్త తగ్గితే వాడిపోతాయి. పసివాళ్లు కూడా అంతే. ఏది ఎంత అవసరమో వారికి అంతే అందించాలి. ఏది ఎక్కువతక్కువలైనా సమస్యే. అందుకే వాళ్లని మల్లెపూవులా పదిలంగా చూసుకోవాలి.
------------------------------------------------
సంక్షిప్త పదాలు:
------------------------------------------------
బి .సి .జి = బేసిలస్ కాల్ మేట్ గ్యారిన్,
ఒ .పి. వి = ఓరల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనగా నోటిలో వేసే పోలియో చుక్కలు,
డి .టి.డబ్ల్యుడి = డిఫ్తిరియా,టెటనెస్, హొల్ సెల్ పెర్టుసిస్,
డి .టి = డిఫ్తిరియా మరియు టెటనెస్ టాక్సాయిడ్,
టి, టి = టెటనెస్ టాక్సాయిడ్,
హెప్ ,బి = హెపటైటీస్ బి వ్యాక్సిన్,
ఎమ్ .ఎమ్ .ఆర్ = మిజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్.
హిబ్ = హెమోఫిలస్ ఇన్ ఫ్లు ఎంజా టైప్ బి వ్యాక్సిన్.
ఐ .పి .వి = ఇన్ యాక్టివేటెడ్ పోలియో వైరస్ వ్యాక్సిన్.
టి .డి = టెటనెస్,డిఫ్తిరియా టాక్సాయడ్ తగ్గించిన మోతాదు.
టి. డి.ఆప్ = టెటనెస్,డిఫ్తిరియా యొక్క తగ్గించిన మోతాదు మరియు యేసెల్యులర్ పెర్టుసిస్.
హెచ్ .పి .వి = హ్యుమన్ పెపిల్లోమా వైరస్ వ్యాక్సిన్.
పి .సి .వి = న్యూమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్.
డిటాప్ = డిఫ్తిరియా, టెటనస్, యేసెల్యూలర్ పెర్టుసిస్ వ్యాక్సిన్.
పి.పి.వి 23 = 23 వేలంట్ న్యూమోకోకల్ పోలీ సేకారైడ్ వ్యాక్సిన్.
కొత్తగా వాడుకలోకి వచ్చిన రోగ నిరోధక మందులు అనగా హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ (నీటి ద్వారా సంక్రమించే పచ్చకామెర్లు), హెమ్ బి వ్యాక్సిన్ మరియు వెరిసెల్లా (ఆటలమ్మ / చికెన్ పాక్స్) రోగ నిరోధక మందులు పిల్లల వైద్యనిపుణులు వాడుటలో ఒక వైద్యునికి మరో వైద్యునికి చాలా వైరుధ్యం వుంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పిల్లల వైద్యనిపుణులు చర్చించి వీటిని వాడాలి. ప్రస్తుతం దేశంలో ఇప్పుడు అమలులో వున్న రోగ నిరోధక మందుల కార్యాచరణ ప్రణాళికలో పైన పేర్కొన్న రోగ నిరోధక మందులను ఇంకా చేర్చలేదు. ఈ రోగ నిరోధక మందుల ఖరీదు, పిల్ల వాని వయస్సు, తల్లి దండ్రుల ఇబ్బందులు, వీటి వాడకంలో పిల్ల వానికి వచ్చే ప్రమాదాలు మరియు వైద్యుడు, పిల్లవాని తల్లిదండ్రుల మధ్య చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మొదలైన అంశాల ఆధారంగా వివేచనతో వీటిని వాడాలి.
- ==================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.